‘రోబో’నందం.. | Japan's Hitachi unveils joking robot | Sakshi
Sakshi News home page

‘రోబో’నందం..

Published Wed, May 21 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM

‘రోబో’నందం..

‘రోబో’నందం..

టోక్యో: నడిచే రోబోలే కాదు... ఇప్పుడు న వ్వించే రోబోలు కూడా వచ్చాయి. జపాన్‌కు చెందిన హిటాచీ కంపెనీ ఇంజనీర్ల బృందం హాస్యస్ఫూర్తి కలిగి మనల్ని తన సంభాషణలతో నవ్వులతో ముంచెత్తే రోబోలను అభివృద్ధి చేసింది. ఈ రోబోను ఈము(ఈఎంఐఈడబ్ల్యూ2)గా పిలుస్తున్నారు. ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు స్క్రిప్ట్ ఇవ్వకున్నా ఈము తన మాటలతో మనల్ని నవ్విస్తుంది. అంతేకాదు తాను వేసిన జోక్‌కు మనం నవ్వామా... లేదా అనేది కూడా తెలుసుకొని ప్రతిస్పందిస్తుంది. మనుషుల భావోద్వేగాలను పసిగట్టే విధంగా ఈ రోబోను శాస్త్రవేత్తలు రూపొందించారు. అందుకే ఈముతో ఎవరైనా మాట్లాడినప్పుడు అది జోకులు వెయ్యడమే కాదు.. మనం వాటి మాటలకు ఎలా ప్రతిస్పందిస్తున్నామో కూడా గ్రహిస్తుంది. మంగళవారం ఈమును టోక్యోలో హిటాచీ ఇంజనీర్ల బృందం అందరిముందు పరిక్షించింది కూడా. భవిష్యత్తులో ఈఎంఐఈడబ్ల్యూ-2 (ఎక్సిలెంట్ అల్టిమేట్లీ మోబిలిటీ అండ్ ఇంటరాక్టివ్ ఎగ్జిస్‌టెన్స్ యాస్ వర్క్‌ప్లేస్)(ఈము)ను  ఇంట్లో పెంపుడు జంతువుమాదిరిగా, కంపెనీలో రెసెప్షనిస్టుగా కూడా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement