Hitachi
-
జపాన్ కంపెనీల హవా.. చైనా బ్రాండ్లకు దెబ్బ!
కొరియన్, చైనా బ్రాండ్ల దెబ్బకు భారత్‌లో జపాన్ కంపెనీ ఉత్పత్తుల విక్రయాలు కొంతకాలంగా తగ్గిపోయాయి. ఇటీవల కాలంలో జపాన్ కంపెనీలు అనుసరిస్తున్న విధానాల వల్ల తిరిగి ఇండియాలో వాటి ఉత్పత్తుల అమ్మకాలు పుంజుకుంటున్నట్లు కంపెనీలు పేర్కొన్నాయి. సోనీ , పానాసోనిక్, హిటాచీ వంటి జపాన్ ఎలక్ట్రానిక్ బ్రాండ్లకు భారత్‌లో మంచి ఆదరణ ఉంది. కానీ కొరియన్, చైనా బ్రాండ్ల దెబ్బకు వాటి అమ్మకాలు స్థానికంగా తగ్గిపోయాయి. దాంతో జపాన్ కంపెనీలు కొత్త విధానాలను అమలు చేస్తూ తిరిగి వాటి ఉత్పత్తుల అమ్మకాలను పునరుద్ధరిస్తున్నాయి.ఎక్కువ మార్జిన్లు ఉండే ఉత్పత్తులు, బిగ్‌స్క్రీన్ టీవీలను విక్రయించడం, తక్కువ మార్జిన్లు ఉండే వాటిని నిలిపేయడం వంటి విధానాలను పాటిస్తున్నాయి. ప్రధానంగా జపాన్ కంపెనీలు ఇండియాలో టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఇతర గృహోపకరణాలను విక్రయిస్తున్నాయి. పానాసోనిక్ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో పెరిగాయి. దాదాపు ఆరేళ్ల పాటు వృద్ధి, అమ్మకాల విషయంలో తిరోగమన పథంలో ఉన్న కంపెనీ ఉత్పత్తులు ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 30% పైగా పుంజుకున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2,338 కోట్ల వ్యాపారంతో పోలిస్తే వినియోగదారుల విభాగంలో 2025లో రూ.3,000 కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది.అమ్మకాలు జూమ్సోనీ ఇండియా గత ఎనిమిదేళ్లలో ఈసారి అత్యుత్తమ నికర లాభాన్ని నమోదు చేసింది. సోనీ బ్రావియా టెలివిజన్ల అమ్మకాల్లో 20% కంటే ఎక్కువ వృద్ధిని సాధించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో సోనీ ఇండియా అమ్మకాలు రూ.7,663 కోట్లుగా ఉన్నాయి. 2014-15లో గరిష్టంగా కంపెనీకి రూ.11,000 కోట్ల రెవెన్యూ సమకూరింది. తర్వాత ఈసారి వచ్చిన ఆదాయమే అధికంగా ఉంది.చైనా బ్రాండ్లతో పోటీపానాసోనిక్ ఇండియా బిజినెస్ ఛైర్మన్ మనీష్ శర్మ మాట్లాడుతూ..‘జపాన్ బ్రాండ్లు ధరల విషయంలో పోటీ పడటం లేదు. నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటూ, వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాయి. వైఫల్యాల రేటును గణనీయంగా తగ్గించుకోవాలనుకుంటున్నాం. భారత్‌లో క్రమంగా విక్రయాలు పెరుగుతున్నాయి. షావోమీ, హైసెన్స్, హాయర్ వంటి చైనీస్ బ్రాండ్లు, కొడాక్, థామ్సన్ వంటి ఆన్లైన్ కేంద్రీకృత బ్రాండ్ ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ధరలున్నాయి. కొరియన్ కంపెనీలైన ఎల్జీ, సామ్‌సంగ్‌లతో కూడా జపాన్ కంపెనీలు పోటీ పడుతున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటనఎయిర్ కండీషనర్ తయారీ రంగంలో ఉన్న జపాన్ కంపెనీ హిటాచీ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో లాభాలు నమోదు చేసింది. ఏడాది ప్రాతిపదిక 64% అమ్మకాలు పెరగడం ద్వారా రూ.1,392 కోట్ల ఆదాయం సమకూరినట్లు కంపెనీ తెలిపింది. -
ఏటీఎంల్లో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో ఉద్యోగి పరార్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి దానవాయిపేటలో ఘరానా మోసం జరిగింది. హెచ్డీఎఫ్సీ బ్రాంచ్ పరిధిలో ఉన్న ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ ఉద్యోగి వాసంశెట్టి అశోక్ పరారయ్యాడు. 19 ఏటీఎంల్లో ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా డబ్బుతో హుడాయించాడు. అశోక్‌పై 'ఇటాచి ప్రైవేట్ ఏజెన్సీ' అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రాజమండ్రి సౌత్ జోన్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న టోల్ గేట్లు వద్ద తనిఖీలు చేస్తున్నారు. -
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
హిటాచీ పేమెంట్ సర్వీసెస్ భారత్ అప్‌గ్రేడబుల్ ఏటీఎం మెషీన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఏటీఎంలను ఎప్పుడైనా నగదు రీసైక్లింగ్ మెషిన్ (CRM)కి అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఇది దేశంలోనే మొదటి అప్‌గ్రేడబుల్ ఏటీఎం అని హిటాచీ సంస్థ పేర్కొంది.' మేక్ ఇన్ ఇండియా ' చొరవ కింద తయారు చేసిన ఈ ఏటీఎంలు బ్యాంకులకు మెరుగైన సౌలభ్యాన్ని, సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న 2,64,000 ఏటీఎంలు/సీఆర్ఎంలలో, హిటాచీ 76,000కు పైగా నిర్వహిస్తోంది. రాబోయే ఎనిమిదేళ్లలో దాదాపు 1,00,000 అప్‌గ్రేడబుల్ ఏటీఎంల మార్కెట్‌ను కంపెనీ అంచనా వేసింది.ఏంటీ సీఆర్ఎం మెషీన్లు?సీఆర్ఎం మెషీన్లు అంటే క్యాష్ రీసైక్లింగ్ మెషీన్. దీని ద్వారా నగదు డిపాజిట్, విత్‌డ్రా రెండు సేవలనూ పొందవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు ఈ నగదు రీసైక్లింగ్ మెషీన్ల ద్వారా తమ శాఖల వద్ద రౌండ్-ది-క్లాక్ నగదు ఉపసంహరణ, డిపాజిట్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఆఫ్‌సైట్ ప్రదేశాల్లో బ్యాంకులు సాధారణంగా ఏటీఎంల ద్వారా 24 గంటలూ నగదు ఉపసంహరణ సేవలను మాత్రమే అందిస్తాయి. ఇలాంటి చోట్ల అప్‌గ్రేడబుల్ ఏటీఎంలను ఏర్పాటు చేసుకుంటే బ్యాంకులు తమ వారి వ్యాపార అవసరాలు, స్థానిక మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డిపాజిట్, విత్ డ్రా సేవలు విస్తరించడానికి బ్యాంకులకు వీలు కలుగుతుంది. -
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్.. హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్
పెరుగుతున్న ఇంధన డిమాండ్‌కు అనువుగా దేశంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడానికి గ్లోబల్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ హిటాచి భారత్‌లో కార్యకలాపాలు విస్తరించేందుకు గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు కంపెనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ నుగురి వేణు మాట్లాడుతూ..‘భారత్‌లో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచేలా కంపెనీ కార్యకలాపాలు ఉండనున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్, పుణెలో గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. వీటిని రానున్న ఆరు నెలల నుంచి ఏడాదిలోపు పూర్తి చేయాలని నిర్ణయించాం. అయితే అవసరాలకు అనుగుణంగా అందులో మార్పులు చేసే అవకాశం ఉంది’ అన్నారు.ట్రాన్స్ఫార్మర్లు, భారీస్థాయి పవర్ ట్రాన్స్మిటర్లను తయారు చేసే హిటాచీ ఎనర్జీ కంపెనీ దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచేలా పనిచేయనుంది. 2030 వరకు భారత్ 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉండాలనే లక్ష్యం పెట్టుకుంది. దాంతో భారత ప్రభుత్వం గత సంవత్సరం గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం ప్రోత్సాహకాలను విడుదల చేసింది. భారత్ లక్ష్యాన్ని సాధించేలా ఈ కంపెనీ తనవంతు సహకారం అందించనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: భారీ వరదలు.. దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందంటే..2023 ఆర్థిక సంవత్సరంలో దేశ విద్యుత్ వినియోగం 8% పెరిగింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా ప్రకారం.. రాబోయే మూడేళ్లలో దేశ విద్యుత్ అవసరాలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో తయారవుతున్న విద్యుత్ కంటే కనీసం 3-4 రెట్లు ఉత్పత్తి పెరగాల్సి ఉందని కంపెనీ ఎండీ, సీఈఓ వేణు అన్నారు. అందుకు అనుగుణంగా తమ ఆర్డర్‌బుక్ కూడా 2-3 రెట్లు పెరుగుతుందని ఆయన ధీమావ్యక్తం చేశారు. -
సొరంగంలో పని చేస్తుండగా.. హిటాచి వాహన ఆపరేటర్ దుర్మరణం
అవుకు (నంద్యాల): అవుకు సొరంగంలో పని చేస్తుండగా పైనుంచి రాళ్లు పడి హిటాచి వాహన ఆపరేటర్ దుర్మరణం చెందాడు. పనిలో చేరిన రెండో రోజు ఈ ఘటన జరగడంతో బాధిత కుటుంబం విషాదంలో మునిగింది. పోలీసులు, కుటుంబసభ్యుల తెలిపిన వివరాల మేరకు.. బేతంచర్ల మండలం గోర్లగుట్ట గ్రామానికి చెందిన ఆల నారాయణ, ఆల కృష్ణవేణి దంపతులకు ఏకైక కుమారుడు ఆలగిరి మద్దిలేటి(28). రెండున్నర ఏళ్ల క్రితం తండ్రి నారాయణ బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ పోషణ భారం ఈ యువకుడిపై పడింది. అవుకు మూడవ టన్నెల్లో పనిచేసేందుకు హిటాచి వాహనం ఆపరేటర్ కావాలని పిలుపు రావడంతో ఈనెల 5వ తేదీ వెళ్లి విధుల్లో చేరాడు. రెండో రోజు మంగళవారం సొరంగంలోకి వెళ్లి పని చేస్తుండగా పై నుంచి ఉన్నట్టుండి పెద్ద బండరాయి పడింది. ఈ ఘటనలో మద్దిలేటి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని టన్నెల్ నిర్మాణ అధికారులు కుటుంబ సభ్యులకు చేరవేయడంతో వారు అక్కడికి చేరుకుని మృతదేహంపై పడి బోరున విలపించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతితో తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. ఏడాదిన్నర క్రితం డోన్ మండలం వెంగనాయునిపల్లె గ్రామానికి చెందిన మౌనికతో వివాహమైన మద్దిలేటికి ఆరు నెలల కుమారుడు మౌనిత్‌కుమార్ ఉన్నాడు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. చదవండి: (భర్త వివాహేతర సంబంధాలు.. వేడినూనె పోసి చంపేందుకు భార్య...) -
హిటాచీ డ్రైవర్ దారుణహత్య
శింగనమల చెరువు వద్ద కంపచెట్లు తొలగిస్తున్న ఇద్దరు హిటాచీ డ్రైవర్ల మధ్య ఘర్షణ తలెత్తి.. ఒకరి హత్యకు దారి తీసింది. మృతదేహాన్ని అక్కడే గొయ్యి తీసి పూడ్చిపెట్టేశాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూడడంతో హతుడి బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలను రప్పించి శాంతింపజేశారు. అనంతపురం, శింగనమల : హిటాచీ డ్రైవర్ దారుణ హత్య శింగనమలలో కలకలం రేపింది. పోలీసులు, హతుడి బంధువులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శింగనమల చెరువు కింద నాబార్డు నిధులతో నిర్వహించతలపెట్టిన పనులను నార్పల మండలం బొందలవాడకు చెందిన ఆలం వెంకటరమణ టెండర్ ద్వారా దక్కించుకున్నాడు. ఈ మేరకు తన దగ్గరున్న హిటాచీ ద్వారా చెరువు వద్ద కంపచెట్ల తొలగింపు చేపట్టాడు. ఈ హిటాచీకి బొందలవాడకు చెందిన రాజ్‌కుమార్(21), రాప్తాడు మండలం మరూరు బండమీదపల్లికి చెందిన సందీప్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. డిసెంబర్ 26వ తేదీన డ్రైవర్లు ఇద్దరూ తాగి పని వద్దే గొడవపడ్డారు. హిటాచీ నడుపుతున్న సందీప్ ఆగ్రహంతో కిందనున్న రాజ్‌కుమార్‌ను తొండం(ఇనుప బకెట్)తో కొట్టాడు. అంతే అతను కుప్పకూలిపోయాడు. కిందకు దిగివచ్చి చూడగా రాజ్‌కుమార్ చనిపోయినట్లు గుర్తించి, అక్కడే గొయ్యి తీసి పాతిపెట్టాడు. అనంతరం హిటాచీని మరో ప్రదేశానికి తీసుకెళ్లి.. దాన్ని అక్కడే నిలిపి సందీప్ వచ్చేశాడు. మరువకొమ్మ వద్దకు రాజ్‌కుమార్ బంధువులను పిలిపించి.. మీవాడు (రాజ్‌కుమార్) ఇద్దరి మనుషులను వేసుకొచ్చి నన్ను కొట్టి పారిపోయాడని, సెల్ ఇక్కడే పడిపోయిందని చెప్పి సెల్ అప్పగించి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి.. రాజ్‌కుమార్ కనిపించడం లేదని గొడవ జరిగిన రెండు రోజులకు కుటుంబ సభ్యులు శింగనమల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. మరో డ్రైవరు సందీప్ కరీంనగర్ వద్ద ఉన్నట్లు తెలుసుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయడంతో సందీప్ జరిగిందంతా చెప్పినట్లు తెలిసింది. మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశం వద్దకు నిందితుడిని తీసుకుపోవాలని బుధవారం పోలీసులు సిద్ధమవగా.. అప్పటికే రాజ్‌కుమార్ బంధువులు ఆందోళనకు దిగారు. గంటపాటు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో అదనపు బలగాలను రప్పించారు. ఇటుకలపల్లి సీఐ పుల్లయ్య, బుక్కరాయసముద్రం సీఐ శ్రీహరి, ఎస్ఐలు కరీం, శ్రీనివాసులు, వారి సిబ్బంది వచ్చి భాదితులకు నచ్చజెప్పి పంపించివేశారు. నిందితుడిని మరో రోడ్డు ద్వారా ఇటుకలపల్లి సర్కిల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హత్య జరిగిన ప్రదేశంలో గాలింపు హత్య జరిగిన ప్రదేశాన్ని పోలీసులు బుధవారం ఉదయం నిందితుడి ద్వారా గుర్తించినట్లు తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆ ప్రదేశంలో గాలింపు చేపట్టారు. ఎక్కడా బయట పడకపోవడంతో ఆ ప్రదేశంలోనే చెట్ల కింద కూర్చుండిపోయారు. కుటుంబ సభ్యులు ఎక్కువ మంది అక్కడే ఉండడంతో మృతదేహం వెలికితీయలేకపోయారు. -
బైక్‌లు ఢీ.. ఒకరి మృతి
నర్వ: వేగంగా వస్తున్న రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి ఆత్మకూరు మండలం ఖానాపురం గేట్ సమీపంలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం నందిమళ్లకి చెందిన శ్రీను(26) హిటాచి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నర్వ మండలం ఈర్లదిన్నెకు చెందిన దిలీప్‌తో కలిసి శ్రీను ఆత్మకూర్‌లో తమ హిటాచి వాహనానికి చెందిన బ్యాటరీలను మరమ్మతు చేయించుకునేందుకు బైక్‌పై బయల్దేరారు. సాయంత్రం బ్యాటరీలు మరమ్మతులు చేయించుకుని ఈర్లదిన్నెకు తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో అమరచింతకి చెందిన నాగరాజు ఆత్మకూర్‌కు బైక్‌పై వస్తుండగా, ఇరువురి వాహనాలు వేగంగా ఢీకొన్నాయి. దీంతో తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన శ్రీనును ఆత్మకూర్ ప్రభుత్వాసుపత్రికి ఆటోలో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దిలీప్ కాలు విరగడంతో పాటు తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. నాగరాజుకు సైతం తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ఆత్మకూరు ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్ రాజు పేర్కొన్నారు. -
‘రోబో’నందం..
టోక్యో: నడిచే రోబోలే కాదు... ఇప్పుడు న వ్వించే రోబోలు కూడా వచ్చాయి. జపాన్‌కు చెందిన హిటాచీ కంపెనీ ఇంజనీర్ల బృందం హాస్యస్ఫూర్తి కలిగి మనల్ని తన సంభాషణలతో నవ్వులతో ముంచెత్తే రోబోలను అభివృద్ధి చేసింది. ఈ రోబోను ఈము(ఈఎంఐఈడబ్ల్యూ2)గా పిలుస్తున్నారు. ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు స్క్రిప్ట్ ఇవ్వకున్నా ఈము తన మాటలతో మనల్ని నవ్విస్తుంది. అంతేకాదు తాను వేసిన జోక్‌కు మనం నవ్వామా... లేదా అనేది కూడా తెలుసుకొని ప్రతిస్పందిస్తుంది. మనుషుల భావోద్వేగాలను పసిగట్టే విధంగా ఈ రోబోను శాస్త్రవేత్తలు రూపొందించారు. అందుకే ఈముతో ఎవరైనా మాట్లాడినప్పుడు అది జోకులు వెయ్యడమే కాదు.. మనం వాటి మాటలకు ఎలా ప్రతిస్పందిస్తున్నామో కూడా గ్రహిస్తుంది. మంగళవారం ఈమును టోక్యోలో హిటాచీ ఇంజనీర్ల బృందం అందరిముందు పరిక్షించింది కూడా. భవిష్యత్తులో ఈఎంఐఈడబ్ల్యూ-2 (ఎక్సిలెంట్ అల్టిమేట్లీ మోబిలిటీ అండ్ ఇంటరాక్టివ్ ఎగ్జిస్టెన్స్ యాస్ వర్క్‌ప్లేస్)(ఈము)ను ఇంట్లో పెంపుడు జంతువుమాదిరిగా, కంపెనీలో రెసెప్షనిస్టుగా కూడా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.