కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి | Sakshi
Sakshi News home page

కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి

Published Sun, Apr 28 2024 11:53 AM

New upgradable ATMs to be launched soon

హిటాచీ పేమెంట్ సర్వీసెస్ భారత్‌ అప్‌గ్రేడబుల్ ఏటీఎం మెషీన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఏటీఎంలను ఎప్పుడైనా నగదు రీసైక్లింగ్ మెషిన్ (CRM)కి అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఇది దేశంలోనే మొదటి అప్‌గ్రేడబుల్ ఏటీఎం అని హిటాచీ సంస్థ పేర్కొంది.

' మేక్ ఇన్ ఇండియా ' చొరవ కింద తయారు చేసిన ఈ ఏటీఎంలు బ్యాంకులకు మెరుగైన సౌలభ్యాన్ని, సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న 2,64,000 ఏటీఎంలు/సీఆర్‌ఎంలలో, హిటాచీ 76,000కు పైగా నిర్వహిస్తోంది. రాబోయే ఎనిమిదేళ్లలో దాదాపు 1,00,000 అప్‌గ్రేడబుల్ ఏటీఎంల మార్కెట్‌ను కంపెనీ అంచనా వేసింది.

ఏంటీ సీఆర్‌ఎం మెషీన్లు?
సీఆర్‌ఎం మెషీన్లు అంటే క్యాష్‌ రీసైక్లింగ్‌ మెషీన్‌. దీని ద్వారా నగదు డిపాజిట్‌, విత్‌డ్రా రెండు సేవలనూ పొందవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు ఈ నగదు రీసైక్లింగ్ మెషీన్‌ల ద్వారా తమ శాఖల వద్ద రౌండ్-ది-క్లాక్ నగదు ఉపసంహరణ, డిపాజిట్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఆఫ్‌సైట్ ప్రదేశాల్లో బ్యాంకులు సాధారణంగా ఏటీఎంల ద్వారా 24 గంటలూ నగదు ఉపసంహరణ సేవలను మాత్రమే అందిస్తాయి. ఇలాంటి చోట్ల అప్‌గ్రేడబుల్ ఏటీఎంలను ఏర్పాటు చేసుకుంటే బ్యాంకులు తమ వారి వ్యాపార అవసరాలు, స్థానిక మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డిపాజిట్‌, విత్‌ డ్రా సేవలు విస్తరించడానికి బ్యాంకులకు వీలు కలుగుతుంది.

Advertisement
Advertisement