Karnataka: Thief Gang Steal Passbook Printing Machine Instead Of Atm, Details Inside - Sakshi
Sakshi News home page

Karnataka: ఏటీఎం అనుకుని ఎంత పని చేశారు.. చూసుకోవాలి కదా!

Published Fri, Jun 17 2022 7:11 AM | Last Updated on Fri, Jun 17 2022 10:27 AM

Karnataka: Thief Gang Steal Passbook Printing Machine Instead Of Atm - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మైసూరు: లక్షల్లో డబ్బులు ఉన్న ఏటీఎం యంత్రం అనుకుని దొంగలు పాస్‌బుక్‌ను ప్రింట్‌ చేసే యంత్రాన్ని ఎత్తుకెళ్లారు. ఈ తికమక సంఘటన మైసూరు నగరంలోని లష్కర్‌ మహల్లాలో ఉన్న కెనరా బ్యాంక్‌ ఏటీఎం సెంటర్‌లో చోటు చేసుకుంది. దొంగలు చోరీ చేసే హడావుడిలో ఏటీఎం యంత్రం అనుకుని పాస్‌బుక్‌ ప్రింటింగ్‌ యంత్రాన్ని పెకలించుకుని తీసుకెళ్లారు. సిబ్బంది ఏటీఎంను రెండురోజుల పాటు మూసి ఉంచారు.

గురువారం ఉదయం తెరిచి చూసిన  సెక్యూరిటీ గార్డు ఆ యంత్రం లేకపోవడం చూసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు.  పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. కాగా, మండ్య, మైసూరు ప్రాంతాల్లో తరచూ ఏటీఎంలను దొంగలు ఎత్తుకెళ్లడం గమనార్హం.

చదవండి: Hyderabad: ఎవరికైనా చెబితే చంపేస్తా.!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement