ఏరో ఇండియా షో సందర్భంగా బెంగళూరులో నాన్‌వెజ్ అమ్మకాలను నిషేధించారు. ఈ మేరకు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు మాంసం దుకాణాలు, మాంసాహార హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాలని బెంగళూరు పౌర సంస్థ ఆదేశించింది. అంతేగాదు యలహాంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు సుమారు 10 కిలోమీటర్లు పరిధిలో మాంసాహార వంటకాలు అందించడం, అమ్మడంపై నిషేధం ఉంటుందని బృహత్ మహానగర పాలికే(బీబీఎంపీ) తన పబ్లిక్ నోటీసులో పేర్కొంది.
ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు ఏరో ఇండియా షో నిర్వహించనున్నారు. దీన్ని ఉల్లంఘిస్తే బీబీఎంపీ చట్టం 2020 తోపాటు ఇండియన్ ఎయిర్ క్రాప్ట్ రూల్ ప్రకరాం శిక్షార్హులని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో నాన్‌వెజ్ ఫుడ్ చాలా స్కావెంజర్ పక్షులను ఆకర్షిస్తోందని, మరీ ముఖ్యంగా గాలి పటాలు ఎయిర్ ప్రమాదాలకు కారణమని తెలిపింది.
ఈ ఎయిర్ షో కోసం దాదాపు 731 మంది ఎగ్జిబిటర్లు, 633 మంది భారతీయులు, 98 మంది విదేశీయులు నమోదు చేసుకున్నట్లు ఏరో ఇండియా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఏరో ఇండియా 1996 నుంచి బెంగళూరులో ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఏరోస్పేస్ ఎగ్జిబిషన్‌లను విజయవంతంగా 13 సార్లు నిర్వహించి తనకంటూ ఒక ప్రత్యేక సముచిత స్థానాన్నిసంపాదించుకుంది.
(చదవండి: ప్యాసింజర్లను ఎక్కించుకోని టేకాఫ్ ఘటన: ఎయిర్‌లైన్‌కు భారీ పెనాల్టీ)
Comments
Please login to add a commentAdd a comment