non-veg
-
ఆదివారం ఆ ఊళ్లో మాంసం ముట్టరు
పాణ్యం: ఆదివారం వచ్చిoదంటే చాలా మందికి మాంసాహారం లేనిదే ముద్ద దిగదు. కొందరికైతే గొంతులో మద్యం చుక్క పడాల్సిందే. కానీ నంద్యాల జిల్లా ఎస్.కొత్తూరు (S. Kotturu) గ్రామ ప్రజలు మాత్రం ఎన్నో ఏళ్లుగా ఎంతో నియమనిష్టలతో ఉంటున్నారు. ఆదివారం (Sunday) ఆ గ్రామంలో ఎవ్వరూ మాంసాహారాన్ని తినరు.. మద్యం సేవించరు. గ్రామంలో ఎవరైనా మరణించినా.. ఆదివారం మాత్రం అంత్యక్రియలు నిర్వహించరు. ఆ మరుసటి రోజు గానీ, ఆ తర్వాత గానీ అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ గ్రామంలోని ఆలయ గర్భగుడికి పైకప్పు కూడా ఉండదు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఈ గ్రామానికి, ఆలయానికి ప్రతి ఆదివారం వేలాది మంది ప్రజలు తరలివస్తుంటారు. తెల్లవారేసరికి ఆలయం.. సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి చెందిన బీరం చెన్నారెడ్డి పొలం దున్నతుండగా.. నాగలికి (Nagali) ఏదో రాయి అడ్డుతగిలినట్లు శబ్దం వచ్చిoదట. వెంటనే అతను కంటి చూపు కోల్పోవడంతో చుట్టుపక్కల రైతులు నాగలిని వెలికి తీసి.. భూమిలో ఏముందో చూడగా పన్నెండు శిరస్సులతో నాగేంద్ర స్వామి విగ్రహం బయటపడిందంట. ఆ దారిన పోతున్న ఓ బ్రాహ్మణుడు అది సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహమని.. స్వామికి మూడు అభిషేకాలు చేస్తే రైతుకు చూపు వస్తుందని సూచించారట. దీంతో గ్రామస్తులు స్వామికి అభిషేకాలు చేయగా.. రైతుకు చూపు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఆ తర్వాత గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించగా.. స్వామి కలలో కనిపించి ఆలయ నిర్మాణాన్ని రాత్రి చేపట్టి తెల్లవారుజామున కోడి కూతకు ముందు ముగించాలని ఆజ్ఞాపించారట. దాంతో రాత్రి ఆలయ నిర్మాణాన్ని మొదలు పెట్టగా.. కోడి కూసే సమయానికి గర్భగుడి, దాని చుట్టూ గోడ మాత్రమే పూర్తయ్యిందంట. దీంతో ఇప్పటికీ స్వామి వారి గర్భాలయానికి పైకప్పు ఉండదు. కాలసర్పదోష పూజలకు ప్రసిద్ధి..శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఆదివారం ఎంతో ప్రీతికరమైన రోజుగా గ్రామస్తులు, భక్తులు భావిస్తారు. దీంతో ప్రతి ఆదివారం వారంతా ఎంతో నియమనిష్టలతో ఉంటారు. ప్రస్తుతం గ్రామంలో 200 కుటుంబాలు.. 1,000 మందికి పైగా జనాభా నివసిస్తుండగా.. ఆదివారం మాంసాహారం అస్సలు ముట్టరు. మద్యం సేవించరు. గ్రామంలో ఎవరైనా మరణించినా అంత్యక్రియలు ఆదివారం నిర్వహించరు. అలాగే ప్రతి ఆదివారం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి.. స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. కార్తీక మాసంలో ప్రతి మంగళవారం కాలసర్పదోష పూజలు జరుగుతాయి. చదవండి: ఆయుర్వేదంతో.. ఆరోగ్యమస్తు!ఈ పూజలు జరిపించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆలయం వద్ద బారులు తీరుతారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని సంతానమూర్తిగా కొలుస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను గ్రామ ప్రజలు ఎంతగానో గౌరవిస్తారు. స్వామిని దర్శించుకున్న తర్వాతే.. దినచర్య మొదలు శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో ఎస్.కొత్తూరు గ్రామస్తులంతా ఆ రోజు నియమనిష్టలతో ఉంటారు. ఎన్నో ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది. గ్రామస్తులు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్వామి వారిని దర్శించుకొని దినచర్యలు ప్రారంభిస్తారు. ఆదివారంతో పాటు మంగళవారం ఆలయంలో కాలసర్పదోష పూజలు జరుగుతుంటాయి. వీటి కోసం అనేక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. – కంపమల్ల పుల్లయ్యస్వామి, ఆలయ ప్రధాన అర్చకుడు -
నెలలో ఆరుసార్లు నాన్‌వెజ్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా డైట్ చార్జీలను ప్రస్తుత నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా పెంచుతూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. పెంచిన చార్జీలకు తగినట్లుగా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేలా సరికొత్త మెనూ రూపొందించింది. ప్రతి నెలను నాలుగు వారాలుగా విభజిస్తూ... ఒక్కో వారానికి ఓ విధంగా మెనూను తయారు చేసింది. అదేవిధంగా రోజువారీగా ఇవ్వాల్సిన ఆహారపదార్థాలపైనా మెనూలో స్పష్టత ఇచ్చిoది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, స్వల్పకాల విరామంలో స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందించే విధంగా మెనూ పొందుపర్చింది. నెలలలో ఆరుసార్లు నాన్‌వెజ్ వడ్డిస్తారు. ప్రతి నెలా మొదటి బుధవారం, నాలుగో బుధవారం, ప్రతి ఆదివారం మధ్యాహ్నం మాంసాహారాన్ని వడ్డిస్తారు. ఇక ప్రతి రెండో బుధవారం, నాల్గో బుధవారం మధ్యాహ్న భోజనంలో వెజిటబుల్ బిర్యానీ ఇస్తారు. మాంసాహారం లేని రోజుల్లో నిత్యం ఉడికించిన గుడ్డు లేదా గుడ్డు కూరను అందించనున్నారు. శాకాహారులకు మాత్రం మాంసాహారం ఉన్న రోజుల్లో మెనూలో కాస్త మార్పులు చేసి వారికి మీల్మేకర్ ఫ్రై లేదా కర్రీ అందిస్తారు. నూతన మెనూను వసతిగృహాలు, గురుకులాల్లోని డైనింగ్ హాల్లో ప్రదర్శించాలని ప్రభుత్వం సంక్షేమ శాఖలను ఆదేశించింది. నిర్దేశించిన ప్రకారం భోజనం పెట్టకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొత్త మెనూను సంక్షేమ గురుకుల పాఠశాలలు, వసతిగృహాల్లో శనివారం నుంచే అమలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా కామన్డైట్ను ప్రారంభించడంతోపాటు ఆయా హాస్టళ్లలో విద్యార్థులతో కలిసి భోజనాలు చేశారు. 40 శాతం పెరిగిన డైట్ చార్జీలు సంక్షేమ వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలను, కాస్మెటిక్ చార్జీలను పెంచుతూ అక్టోబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది. చివరిసారిగా డైట్ చార్జీలు 2017లో అప్పటి ప్రభుత్వం పెంచింది. కోవిడ్–19 తర్వాత మారిన పరిస్థితులు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో సంక్షేమ విద్యార్థులకు ఆహారం అందించడంలో నాణ్యత తగ్గుతూ వచ్చిoది. ఈ అంశంపై క్షేత్రస్థాయి నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించారు. కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా డైట్ చార్జీలను 40శాతం పెంచారు. అలాగే, కాస్మెటిక్ చార్జీలనూ పెంచారు. తాజా పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా 7,65,705 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.సంక్షేమ వసతి గృహాల్లో 3 నుంచి 7వ తరగతి వరకున్న విద్యార్థులు : 2,77,877 8 నుంచి 10వ తరగతి వరకున్న విద్యార్థులు: 2,59,328 ఇంటర్ నుంచి పీజీ వరకున్న విద్యార్థులు: 2,28,500 -
అడవిలో పెద్దపులికైనా తప్పని కష్టంరా సామీ అది!
మాంసాహారం తిన్నతరువాత ఒక విచిత్రమైన ఇబ్బంది ఉంటుంది. చికెన్ లేదా మటన్ కర్రీని లొట్టలేసుకుంటూ తిన్నంత సేపు బాగానే ఉంటుంది కానీ మాంసపు తునకలు పళ్ల సందుల్లో ఇరుక్క పోయినపుడు ఇబ్బంది ఉంటుంది కదా నా సామి రంగా. వాటిని తొలగించేందుకు టూత్ పిక్‌లు, పిన్సీసులతో పెద్ద యుద్ధమే చేయాలి. ఏదీ లేకపోతే.. చివరికి నాలుకతో అయినా సరే దాన్ని లాగి పడేసేదాకా మనశ్శాంతి ఉండదు. అడవిలో ఒక పులికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. ఒక పెద్ద మాంసం ముక్క దాని పంటిలో చిక్కుకుంది. దీంతో నానా కష్టాలు పడుతున్న పులిని చూసిన వెటర్నరీ వైద్యులు దాని కోరల్లో ఇరుక్కున్న మాంసం ముక్కను లాగి పడేశారు. కేవలం 16 సెకన్లుఉన్న ఈ వీడియో 30.3 లక్షలకుపైగా వ్యూస్‌ను దక్కించుకుంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ హ్యాండిల్ దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.Vet removing a bone stuck to a tigers tooth pic.twitter.com/WjmqFNw8fZ— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) October 15, 2024 -
ల్యాబ్ తయారీ మాంసం తింటారా?
‘మీరు ల్యాబ్‌లో తయారు చేసిన మాంసం తింటారా?’ కన్జూమర్ ఇన్సైట్స్ సర్వే పేరుతో స్టాటిస్టా అనే సంస్థ ఇటీవల వివిధ దేశాల ప్రజల్ని అడిగిన వెరైటీ ప్రశ్న ఇది. మామూలు మాంసాన్ని లొట్టలేసుకొని ఆరగించే నాన్‌వెజ్ ప్రియులకు ఈ ప్రశ్న పెద్దగా రుచించనట్లుంది!! అందుకే చాలా తక్కువ మంది నుంచే సానుకూల స్పందన వచ్చింది. కానీ ఇందులోనూ భారతీయులే కొంత పాజిటివ్‌గా స్పందించడం విశేషం. భారత్ నుంచి సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురిలో ఒకరు... అంటే అత్యధికంగా 20 శాతం మంది ల్యాబ్ మాంసం తినేందుకు సై అనగా ఫ్రాన్స్‌లో మాత్రం అతితక్కువగా కేవలం 9 శాతం మందే దీన్ని ట్రై చేస్తామన్నారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే.. ల్యాబ్ తయారీ మాంసం విక్రయాలకు అనుమతిచ్చిన రెండు దేశాల్లో ఒకటైన అమెరికాలోనూ (మరో దేశం సింగపూర్) దీన్ని తినడంపై పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదు. సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 16 శాతం మంది అమెరికన్లే ఇందుకు రెడీ అన్నారు. ఈ సర్వేలో ఒక్కో దేశం నుంచి 2 వేల నుంచి 10 వేల మంది మధ్య నెటిజన్లు పాల్గొన్నారు. ఎలా తయారు చేస్తారు? కల్టివేటెడ్ లేదా కల్చర్డ్ మీట్‌గా పేర్కొనే ఈ మాంసం తయారీ కోసం ముందుగా జంతువుల నుంచి కొన్ని స్టెమ్ సెల్స్ (మూల కణాలు)ను బయాప్సీ ద్వారా సేకరిస్తారు. ఆ తర్వాత వాటికి ‘పోషక స్నానం’ చేయిస్తారు. అంటే కణ విభజన జరిగి అవి కొంత మేర రెట్టింపయ్యేందుకు వీలుగా పోషకాలతో కూడిన ద్రవంలో ముంచుతారు. అనంతరం అవి కణజాలం (టిష్యూ)గా వృద్ధి చెందేందుకు బయోరియాక్టర్‌లోకి చేరుస్తారు. జంతు ప్రేమికుల కోసం లేదా జంతు వధ ద్వారా పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు ల్యాబ్ తయారీ మాంసం సూత్రప్రాయంగా ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. -
వెజ్ ప్లేట్ రూ.30.3 .. నాన్ వెజ్ రూ.61.2
హోటల్లో ఫుడ్ ఆరగిస్తే.. వేలకు వేలు బిల్లు కడుతుంటాం. వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా వందల్లోనే మొదలవుతుంది. మరి మన ఇంట్లోనే వండుకుంటే.. ఎంత ఖర్చవుతుంది? నిజానికి బాగా తక్కువే. అందులోనూ సీజన్‌ను బట్టి, కూరగాయలు, చికెన్, మటన్, ఇతర మాంసాహార ధరలను బట్టి ఖర్చు మారిపోతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రఖ్యాత క్రిసిల్ సంస్థ.. వంటల్లో వాడే సరుకుల ధరల ఆధారంగా.. ఇంట్లో వండుకునే ఒక్కో ప్లేట్ ఆహారానికి ఎంత ఖర్చవుతుందనే అంచనాలు వేసింది. దాదాపు ఏడాదిన్నర కాలంలో నెలనెలా సరుకుల ధరలను పరిశీలించి.. సగటు థాలీ (ప్లేట్ భోజనం) ఖర్చు ఎంతెంత అన్న లెక్కలతో తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. టమాటాలు, ఉల్లి ధరలే కీలకం: క్రిసిల్ సంస్థ వివిధ రకాల మాంసంతోపాటు వంటల్లో వాడే పప్పులు, కూరగాయలు, నూనెలు, మసాలాల ఖర్చునూ కలిపి భోజనం తయారీకి అయ్యే ఖర్చును లెక్కించింది. వంట చేసేందుకు అయ్యే గ్యాస్ ఖర్చునూ కలిపింది. అయితే ప్రధానంగా ఇటీవలి కాలంలో టమాటా, ఉల్లి ధరలు బాగా పెరిగిపోవడం, తర్వాత తగ్గడం నేపథ్యంలో సగటు థాలీ ఖర్చులోనూ హెచ్చుతగ్గులు వచ్చాయని ఈ నివేదిక వెల్లడించింది. భారతదేశంలోని నలుమూలలా ఉన్న రాష్ట్రాల నుంచి ధరల వివరాలు తీసుకుని, సగటు ధరలతో ఈ అంచనాలు వేసినట్టు తెలిపింది. ఎలాగైతేనేం హోటల్లో ఫుడ్డు తినేకంటే ఇంట్లో వండుకుంటే బాగా డబ్బులు మిగులుతాయనీ నివేదిక చెప్పినట్టే మరి! -
క్యాన్సర్ డేంజర్ బెల్స్.. బయట ఫుడ్ ఎక్కువగా తినేవారికి అలర్ట్
విజయవాడ భవానీపురానికి చెందిన 42 ఏళ్ల వ్యాపారి శ్రీనివాస్(పేరు మార్చాం) అర్ధరాత్రి వరకూ బిజినెస్ వ్యవహారాలు చూస్తుంటారు. అనంతరం తరచూ స్నేహితులతో కలిసి బయట ఎక్కువగా నాన్‌వెజ్ వంటకాలు తింటుంటారు. ఇటీవల తరచూ కడుపునొప్పి రావడం, అరుగుదల తగ్గడంతో వైద్యుడి వద్దకు వెళ్లారు. వైద్యులు పరీక్షించి జీర్ణాశయ క్యాన్సర్‌గా నిర్ధారించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ ఉద్యోగి వారంలో నాలుగు రోజులు బయట హోటళ్లలో భోజనం చేస్తుంటాడు. నాన్‌వెజ్, బిర్యానీలు ఎక్కువగా తీసుకుంటుంటాడు. ఇటీవల ఆయనకు కడుపు నొప్పితో పాటు విరేచనంలో రక్తం పడటంతో వైద్యుడిని సంప్రదించాడు. పెద్ద పేగు క్యాన్సర్‌గా నిర్ధారణ అయింది. ఇలా వీరిద్దరే కాదు.. కల్తీ ఆహారం కారణంగా ఇటీవల పెద్దపేగు, జీర్ణాశయ, లివర్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆహారంలో కల్తీ, జీవనశైలి మార్పులు క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి. ఇటీవల నమోదవుతున్న క్యాన్సర్ కేసులు వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. మధ్య వయస్సులోనే అన్నవాహిక క్యాన్సర్, జీర్ణాశయ, పెద్దపేగు, గర్భాశయ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. అర్ధరాత్రి దాటాక కూడా రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల్లో బిర్యానీల వంటివి ఎక్కువగా తీసుకోవడంతో పలువురికి జీర్ణాశయ వ్యాధులు మొదలై.. అనంతరం క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయి. సమయ పాలన లేని ఆహారపు అలవాట్లు కొంపముంచుతున్నాయి. ఇటీవల నగరంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. నాలుగు పదుల వయస్సులోనే జీర్ణాశయ, పెద్దపేగు, లివర్ క్యాన్సర్ సోకుతున్నట్టు చెబుతున్నారు. అప్రమత్తం కాకుంటే రానున్న కాలంలో పెను ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొంపముంచుతున్న కల్తీలు నాన్‌వెజ్ వంటకాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు రసాయనాలు కలిసిన కారంపొడులను ఎక్కువగా వాడుతుంటారు. అంతేకాకుండా కొన్ని చోట్ల మృత జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన కల్తీ నూనెలను వినియోగించి వంటలు చేస్తుండటంతో జీర్ణకోశ వ్యాధులు పెరుగుతున్నాయని చెపుతున్నారు. కల్తీ ఆహారం జీర్ణకోశ, పెద్దపేగు, అన్నవాహిక క్యాన్సర్లకు కారణమవుతోందని, బయట ఆహారం తినడం సాధ్యమైనంత తగ్గించడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో ఒకప్పుడు బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. ప్రస్తుతం సర్వైకల్ క్యాన్సర్ కేసులు తగ్గగా.. జీవనశైలి కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అలాగే గర్భాశయ క్యాన్సర్ కేసులూ పెరుగుతున్నాయని చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒబెసిటీ కారణంగా పట్టణవాసులు ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ల బారినపడుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతేనే బయట తినాలి ఇటీవల జీర్ణాశయ, పెద్ద పేగు క్యాన్సర్లు పెరిగాయి. కల్తీ ఆహారం, నాన్‌వెజ్ ఎక్కువుగా తీసుకోవడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. ఆహార పదార్థాలు కల్తీ అవుతున్న నేపథ్యంలో అత్యవసరమైతేనే బయట తినాలి. మాంసాహారంలో కలిపే రసాయనిక రంగులు క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయి. – డాక్టర్ ఏవై రావు, క్యాన్సర్ వైద్య నిపుణులు -
ఎయిర్ షో సందర్భంగా నాన్‌వెజ్ అమ్మకాలు బంద్!
ఏరో ఇండియా షో సందర్భంగా బెంగళూరులో నాన్‌వెజ్ అమ్మకాలను నిషేధించారు. ఈ మేరకు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు మాంసం దుకాణాలు, మాంసాహార హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాలని బెంగళూరు పౌర సంస్థ ఆదేశించింది. అంతేగాదు యలహాంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు సుమారు 10 కిలోమీటర్లు పరిధిలో మాంసాహార వంటకాలు అందించడం, అమ్మడంపై నిషేధం ఉంటుందని బృహత్ మహానగర పాలికే(బీబీఎంపీ) తన పబ్లిక్ నోటీసులో పేర్కొంది. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు ఏరో ఇండియా షో నిర్వహించనున్నారు. దీన్ని ఉల్లంఘిస్తే బీబీఎంపీ చట్టం 2020 తోపాటు ఇండియన్ ఎయిర్ క్రాప్ట్ రూల్ ప్రకరాం శిక్షార్హులని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో నాన్‌వెజ్ ఫుడ్ చాలా స్కావెంజర్ పక్షులను ఆకర్షిస్తోందని, మరీ ముఖ్యంగా గాలి పటాలు ఎయిర్ ప్రమాదాలకు కారణమని తెలిపింది. ఈ ఎయిర్ షో కోసం దాదాపు 731 మంది ఎగ్జిబిటర్లు, 633 మంది భారతీయులు, 98 మంది విదేశీయులు నమోదు చేసుకున్నట్లు ఏరో ఇండియా తన వెబ్సైట్లో పేర్కొంది. ఏరో ఇండియా 1996 నుంచి బెంగళూరులో ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఏరోస్పేస్ ఎగ్జిబిషన్లను విజయవంతంగా 13 సార్లు నిర్వహించి తనకంటూ ఒక ప్రత్యేక సముచిత స్థానాన్నిసంపాదించుకుంది. (చదవండి: ప్యాసింజర్లను ఎక్కించుకోని టేకాఫ్ ఘటన: ఎయిర్‌లైన్‌కు భారీ పెనాల్టీ) -
బీసీ హాస్టళ్లకు సండే స్పెషల్
⇒ ఆదివారాలు, పండుగ రోజుల్లో మాంసాహారం వడ్డన ⇒ ఉత్తర్వులు జారీ చేసిన బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ హైదరాబాద్: బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులకో శుభవార్త. హాస్టళ్లలోని విద్యార్థులందరికీ ఆదివారం, పండుగ వేళల్లో మాంసాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ జి.డి. అరుణ సెప్టెంబర్ 26వ తేదీన అన్ని జిల్లాల డిప్యూటీ డెరైక్టర్లు, సంక్షేమ అధికారులకు మెమో (నెంబర్ డి/2080/2016) జారీ చేశారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య సెప్టెంబర్ 1వ తేదీన మంత్రి జోగు రామన్నను కలిసి విద్యార్థులకు మాంసాహారం వడ్డించే అంశంపై చర్చించారు. ఈ మేరకు వినతిపత్రం అందజేయగా, మంత్రి అందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి రామన్న ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 470 ప్రి మెట్రిక్, 252 పోస్టు మెట్రిక్ హాస్టళ్లు అన్నింటిలో అందుబాటులో ఉన్న బడ్జెట్లో మాంసాహారం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీసీ కమిషనర్ ఆదేశాలు కార్యరూపం దాలిస్తే దసరా సెలవుల తరువాత హాస్టళ్లలోని విద్యార్థులకు ఆదివారాలు, పండుగ రోజుల్లో మాంసాహారంతో చేసిన పదార్థాలు అందుబాటులో ఉంటాయి. -
9 నుంచి మాంసం, చేపల విక్రయాలు నిషేధం
విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ప్రజారోగ్యం దృష్ట్యా ఈనెల 9నుంచి 25వ తేదీ వరకు నగరంలో మాంసాహారం, చేపల అమ్మకాలు, జంతువథను నిషేధిస్తున్నట్లు కమిషనర్ జి.వీరపాండియన్ తెలిపారు. 16 రోజులపాటు కబేళాను కూడా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. మాంసాహార విక్రయదారులు ఈ విషయాన్ని గ్రహించి సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించినట్లైతే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. -
ఆహారమ్
సిటీ రెస్టారెంట్లు సరికొత్త థీమ్‌లను ఫుడ్ లవర్స్‌కు టేస్ట్ చూపిస్తున్నాయి. హాట్డ్రింక్స్కు కాంబినేషన్‌గా ఫుడ్ తీసుకోవడం తెలిసిందే అయితే.. ఫుడ్‌లోనే హాట్‌ని మిక్స్ చేయడం కొత్త ట్రెండ్. దీనినే ఇప్పుడు ‘పబ్ మీల్స్’ పేరుతో సర్వ్ చేస్తున్న పలు స్టార్ హోటళ్లు ఫుడ్ కమ్ డ్రింక్ లవర్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. - శిరీష చల్లపల్లి క్రిస్మస్ సమయంలో జరిగే కేక్ మిక్సింగ్ సందడి అందరికీ తెలిసిందే. ఆ మిక్స్‌లో రమ్ వగైరా లిక్కర్ వెరైటీలను కలుపుతారంటే ఇప్పటి వరకు ఆసక్తిగా చర్చించుకునేవాళ్లం. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కేక్స్ నుంచి వాక్ చేసుకుంటూ కర్రీస్, ఫుడ్ వెరైటీల వరకు వచ్చేసింది. ఆల్కహాల్ వెరైటీలలో వైన్‌ని ఎక్కువగా ఫుడ్‌లో టేస్ట్ కోసం జత చేస్తారు. కేవలం దీని కోసమే ప్రత్యేకంగా తక్కువ ధరలో వైన్ రకాలు సైతం అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని చాలా సిటీ రెస్టారెంట్లు బయటకు వెల్లడించవు. పబ్... డబ్ అయితే ఇప్పుడు సిటీలో ప్రకటించి మరీ ఆల్కహాల్ కలిసిన వంటకాలను వడ్డిస్తున్నారు. వెజ్, నాన్‌వెజ్, సలాడ్స్, సూప్స్.. వంటకాలు ఏవైనా ఆ స్పెషల్ రెసిపీలో కొద్దిగా ఆల్కహాల్‌ని జోడించి తయారు చేయడం కొన్ని పబ్బులు, రెస్టారెంట్లలో కొత్త ట్రెండ్. రమ్, విస్కీ, వైట్ వైన్, రెడ్ వైన్, వోడ్కా.. ఇలా రకరకాల ఆల్కహాల్స్ ఈ వంటకాల్లో భాగమై ఫుడ్ అండ్ డ్రింక్ లవర్స్‌కి సరికొత్త టేస్ట్లు రుచి చూపిస్తున్నాయి. వంటకాలకు తగ్గట్టుగానే ఆ రెసిపీల పేర్లు సైతం ఉంటాయట. అలాంటి వాటికి కొన్ని ఉదాహరణలు.. జాకీ చాన్ డాన్సింగ్ వుక్.. వుక్ అంటే చైనీస్‌లో కిచెన్‌లో వాడే గిన్నె అని అర్థం. ఈ రెసిపీలో రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి ఇది హెల్తీ కలర్‌ఫుల్ సలాడ్. ఇంకోటి ఇది వైట్ వైన్‌తో కలిపి తయారు చేసే వంటకం. ఎల్లో, గ్రీన్, రెడ్ బెల్ పెప్పర్స్, కుకుంబర్, ఓలీవ్స్, బోన్‌లెస్ చికెన్ మాష్, వైట్ వైన్లతో దీన్ని తయారు చేస్తారు. ఈ సలాడ్‌తో వెయిట్ లాస్, బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసే లాభాలు కూడా ఉన్నాయని చెఫ్‌లు అంటున్నారు. ఈ చికెన్ డిష్‌లో ప్రత్యేకత ఐరిష్ విస్కీ. చికెన్‌కు అన్ని మసాలాలు, పెరుగుతో పాటు కాస్త ఐరిష్ విస్కీని కూడా కలిపి వండే రెసిపీనే ‘బాహుబలి సీక్రెట్ చికెన్ బైట్’. అన్ని చికెన్ ముక్కలు ఒకే రుచి ఒకే కిక్ ఉండటం ఈ డిష్ ప్రత్యేకత. ‘ఒబామా’స్ ఫేవరేట్ చికెన్ బ్రెస్ట్.. ఆరోగ్యానికి మంచిదైన ఆలివ్ ఆయిల్, ఇంగ్లిష్ కూరగాయలైన బ్రోక్యులీ, అవకడో, బెల్ పెప్పర్స్, బేబీకార్న్‌లను గ్రిల్ చేసిన చికెన్ బ్రెస్ట్ పీస్తో జోడించి బార్బిక్యూ సాస్‌తో పాటు స్పెషల్ సీక్రెట్ రెడ్ వైన్ జ్యూస్‌ని కలిపి ఫుడ్ లవర్లకు అందిస్తారు. రెడ్ వైన్ కలపడంతో రెసిపీకి దాని ఫ్లేవర్, కొత్త రంగుతో పాటు ఆరోగ్యానికి ఉపయోగపడే న్యూట్రిషనల్ వాల్యూస్, ముఖంలో తేజస్సు సైతం గ్యారెంటీ అంటున్నారు ‘పబ్ మీల్’ చెఫ్‌లు. ఫుల్ డిమాండ్.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆల్కహాల్ తాగకుండానే ఆహారంతో తీసుకునే అవకాశంతో ఈ తరహా పబ్ మీల్స్‌కి ఈ మధ్య డిమాండ్ ఎక్కువగా పెరుగుతోంది. ఈ మీల్స్‌లో ఆల్కహాల్ ఉండటంతో కేవలం నిర్ణీత వయసు దాటిన వారికి మాత్రమే వీటిని సర్వ్ చేస్తున్నామని ఆదిత్యా పార్క్ హోటల్ మేనేజర్ అమితేష్ కుమార్ తెలిపారు. -
వెజ్జా... నాన్‌వెజ్జా?
అధరాలకు అందాలద్దే లిప్‌స్టిక్ వెజ్జా? నాన్‌వెజ్జా? ఇదేం ప్రశ్న... అదేమి తినేది కాదు కదా అనుకుంటున్నారా! అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం లిప్‌స్టిక్ దేనికిందకు వస్తుందో చెప్పితీరాలంటోంది. సౌందర్య సాధానాలతో పాటు సబ్బు, షాంపూ, టూత్‌పేస్ట్ లాంటి వాటిపై కచ్చితంగా అదేంటో చెప్పే సింబల్ ఉండాలట. జంతువుల నుంచి తీసిన పదార్థాలేమైనా (నూనె, కొవ్వు, ఎముకల పొడి తదితరాలు) వాడితే సదరు ఉత్పత్తిపై ఎరుపు లేదా గోధుమ రంగు చుక్క ఉండాలని, పూర్తిగా శాఖాహార సంబంధ పదార్థాలే వాడితే ఆకుపచ్చ రంగు చుక్క ఉండాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూన్ 16, 2014న ఒక నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై రెకిట్ బెన్కిసర్ అనే కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తినే పదార్థాల విషయంలో ఇలా అడిగితే ఓకేగాని, సౌందర్య సాధనాలు, సబ్బుల లాంటి వాటికి ఇలా అడగడంలో అర్థం లేదని వాదిస్తోంది. నోటిఫికేషన్‌ను కొట్టేయాలని కోరింది. మే 18లోగా స్పందించాలని ఢిల్లీ హైకోర్టు సోమవారం కేంద్రానికి నోటీసు జారీ చేసింది.