
ఆహారమ్
సిటీ రెస్టారెంట్లు సరికొత్త థీమ్‌లను ఫుడ్ లవర్స్‌కు టేస్ట్ చూపిస్తున్నాయి. హాట్‌డ్రింక్స్‌కు కాంబినేషన్‌గా ఫుడ్ తీసుకోవడం తెలిసిందే అయితే.. ఫుడ్‌లోనే హాట్‌ని మిక్స్ చేయడం కొత్త ట్రెండ్. దీనినే ఇప్పుడు ‘పబ్ మీల్స్’ పేరుతో సర్వ్ చేస్తున్న పలు స్టార్ హోటళ్లు ఫుడ్ కమ్ డ్రింక్ లవర్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. - శిరీష చల్లపల్లి
క్రిస్మస్ సమయంలో జరిగే కేక్ మిక్సింగ్ సందడి అందరికీ తెలిసిందే. ఆ మిక్స్‌లో రమ్ వగైరా లిక్కర్ వెరైటీలను కలుపుతారంటే ఇప్పటి వరకు ఆసక్తిగా చర్చించుకునేవాళ్లం. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కేక్స్ నుంచి వాక్ చేసుకుంటూ కర్రీస్, ఫుడ్ వెరైటీల వరకు వచ్చేసింది. ఆల్కహాల్ వెరైటీలలో వైన్‌ని ఎక్కువగా ఫుడ్‌లో టేస్ట్ కోసం జత చేస్తారు. కేవలం దీని కోసమే ప్రత్యేకంగా తక్కువ ధరలో వైన్ రకాలు సైతం అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని చాలా సిటీ రెస్టారెంట్లు బయటకు వెల్లడించవు.
పబ్... డబ్
అయితే ఇప్పుడు సిటీలో ప్రకటించి మరీ ఆల్కహాల్ కలిసిన వంటకాలను వడ్డిస్తున్నారు. వెజ్, నాన్‌వెజ్, సలాడ్స్, సూప్స్.. వంటకాలు ఏవైనా ఆ స్పెషల్ రెసిపీలో కొద్దిగా ఆల్కహాల్‌ని జోడించి తయారు చేయడం కొన్ని పబ్బులు, రెస్టారెంట్లలో కొత్త ట్రెండ్. రమ్, విస్కీ, వైట్ వైన్, రెడ్ వైన్, వోడ్కా.. ఇలా రకరకాల ఆల్కహాల్స్ ఈ వంటకాల్లో భాగమై ఫుడ్ అండ్ డ్రింక్ లవర్స్‌కి సరికొత్త టేస్ట్‌లు రుచి చూపిస్తున్నాయి. వంటకాలకు తగ్గట్టుగానే ఆ రెసిపీల పేర్లు సైతం ఉంటాయట. అలాంటి వాటికి కొన్ని ఉదాహరణలు..
జాకీ చాన్ డాన్సింగ్ వుక్..
వుక్ అంటే చైనీస్‌లో కిచెన్‌లో వాడే గిన్నె అని అర్థం. ఈ రెసిపీలో రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి ఇది హెల్తీ కలర్‌ఫుల్ సలాడ్. ఇంకోటి ఇది వైట్ వైన్‌తో కలిపి తయారు చేసే వంటకం. ఎల్లో, గ్రీన్, రెడ్ బెల్ పెప్పర్స్, కుకుంబర్, ఓలీవ్స్, బోన్‌లెస్ చికెన్ మాష్, వైట్ వైన్‌లతో దీన్ని తయారు చేస్తారు. ఈ సలాడ్‌తో వెయిట్ లాస్, బాడీ టెంపరేచర్‌ని కంట్రోల్ చేసే లాభాలు కూడా ఉన్నాయని చెఫ్‌లు అంటున్నారు.
ఈ చికెన్ డిష్‌లో ప్రత్యేకత ఐరిష్ విస్కీ. చికెన్‌కు అన్ని మసాలాలు, పెరుగుతో పాటు కాస్త ఐరిష్ విస్కీని కూడా కలిపి వండే రెసిపీనే ‘బాహుబలి సీక్రెట్ చికెన్ బైట్’. అన్ని చికెన్ ముక్కలు ఒకే రుచి ఒకే కిక్ ఉండటం ఈ డిష్ ప్రత్యేకత.
‘ఒబామా’స్ ఫేవరేట్ చికెన్ బ్రెస్ట్..
ఆరోగ్యానికి మంచిదైన ఆలివ్ ఆయిల్, ఇంగ్లిష్ కూరగాయలైన బ్రోక్యులీ, అవకడో, బెల్ పెప్పర్స్, బేబీకార్న్‌లను గ్రిల్ చేసిన చికెన్ బ్రెస్ట్ పీస్‌తో జోడించి బార్బిక్యూ సాస్‌తో పాటు స్పెషల్ సీక్రెట్ రెడ్ వైన్ జ్యూస్‌ని కలిపి ఫుడ్ లవర్లకు అందిస్తారు. రెడ్ వైన్ కలపడంతో రెసిపీకి దాని ఫ్లేవర్, కొత్త రంగుతో పాటు ఆరోగ్యానికి ఉపయోగపడే న్యూట్రిషనల్ వాల్యూస్, ముఖంలో తేజస్సు సైతం గ్యారెంటీ అంటున్నారు ‘పబ్ మీల్’ చెఫ్‌లు.
ఫుల్ డిమాండ్..
రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆల్కహాల్ తాగకుండానే ఆహారంతో తీసుకునే అవకాశంతో ఈ తరహా పబ్ మీల్స్‌కి ఈ మధ్య డిమాండ్ ఎక్కువగా పెరుగుతోంది. ఈ మీల్స్‌లో ఆల్కహాల్ ఉండటంతో కేవలం నిర్ణీత వయసు దాటిన వారికి మాత్రమే వీటిని సర్వ్ చేస్తున్నామని ఆదిత్యా పార్క్ హోటల్ మేనేజర్ అమితేష్ కుమార్ తెలిపారు.