మాంసాహారం తిన్నతరువాత ఒక విచిత్రమైన ఇబ్బంది ఉంటుంది. చికెన్ లేదా మటన్ కర్రీని లొట్టలేసుకుంటూ తిన్నంత సేపు బాగానే ఉంటుంది కానీ మాంసపు తునకలు పళ్ల సందుల్లో ఇరుక్క పోయినపుడు ఇబ్బంది ఉంటుంది కదా నా సామి రంగా. వాటిని తొలగించేందుకు టూత్ పిక్‌లు, పిన్సీసులతో పెద్ద యుద్ధమే చేయాలి. ఏదీ లేకపోతే.. చివరికి నాలుకతో అయినా సరే దాన్ని లాగి పడేసేదాకా మనశ్శాంతి ఉండదు.
అడవిలో ఒక పులికి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. ఒక పెద్ద మాంసం ముక్క దాని పంటిలో చిక్కుకుంది. దీంతో నానా కష్టాలు పడుతున్న పులిని చూసిన వెటర్నరీ వైద్యులు దాని కోరల్లో ఇరుక్కున్న మాంసం ముక్కను లాగి పడేశారు. కేవలం 16 సెకన్లుఉన్న ఈ వీడియో 30.3 లక్షలకుపైగా వ్యూస్‌ను దక్కించుకుంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ హ్యాండిల్ దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.
Vet removing a bone stuck to a tigers tooth pic.twitter.com/WjmqFNw8fZ
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) October 15, 2024
Comments
Please login to add a commentAdd a comment