Viral Video: కోపంతో వెంబడించిన పులి.. భయపడి పరుగు! | Pet Tiger Chases Man In Lavish Dubai Home, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Viral Video: కోపంతో వెంబడించిన పులి.. భయపడి పరుగు!

Published Mon, Jan 15 2024 6:10 PM | Last Updated on Mon, Jan 15 2024 6:32 PM

Pet Tiger Chases Man lavish Dubai Home Video Goes Viral - Sakshi

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ (యూఏఈ) దేశానికి చెందినవారి విలాసవంతమైన జీవితాలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడీయాలో చాలానే చూసి ఉంటాం. అక్కడి సంపన్న వర్గానికి చెందిన వారు చాలా వరకు.. పులులు, సింహాలు, చీతాలను పెంచుకోవటం గొప్పగా భావిస్తారన్న విషయం తెలిసిందే.

అటువంటి జంతువుల కలెక్షన్‌ వాటిని బీచ్‌లకు తీసుకువెళ్లడం యూఏఈ సంపన్న కుటుంబాలకు ఓ సరదా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఓ విలాసవంతమైన భవనంలో ఒక పెంపుడు పులి.. ఓ వ్యక్తిని భయంతో పరుగులు తీయించింది. దీనికి సంబంధించిన  వీడియో​ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

బిలియనీర్స్‌ లైఫ్‌ స్టైల్‌ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్‌ ఈ వీడియోను పోస్ట్‌చేసింది. ముందు సరదగా వెంబడిస్తున్నట్లు అనుకున్న ఆ వ్యక్తి.. పులి వేగం పెంచి అదే పనిగా కోపంగా తన వెంటపడటంతో ఆ వ్యక్తి భయపడిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘అందమైన పులి.. ఒక బొమ్మ కాదు’, ‘దాడి చేయడానికి వచ్చిన పులి నుంచి తప్పించుకున్నాడు’, ‘చాలా ఫన్నీగా ఉంది.. ఇది ఖచ్చితంగా బిలియనీర్స్‌ లైఫ్‌ స్టైల్‌!’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి:  వాళ్లను చంపేయండి.. ఇజ్రాయెల్‌కు గాజా ప్రజల విన్నపం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement