United Arab Emirates
-
యూఏఈ వీసా ఆన్ అరైవల్.. షరతులు వర్తిస్తాయి
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. యూఏఈ ప్రభుత్వం భారత జాతీయుల కోసం నూతనంగా వీసా ఆన్ అరైవల్ విధానాన్ని ప్రకటించింది. అయితే, ఇందుకు ఓ షరతు విధించింది. అమెరికా, యూకే, ఇతర ఏదైనా యూరోపియన్ యూనియన్ దేశం శాశ్వత నివాస కార్డు లేదా వీసా ఉన్న వ్యక్తులే వీసా ఆన్ అరైవల్‌కు అర్హులు. ఈ విధానం ద్వారా యూఏఈలో అడుగు పెట్టిన వెంటనే వీరికి 14 రోజుల వీసా లభిస్తుంది. అవసరమైన ఫీజు చెల్లించిన పక్షంలో మరో 60 రోజుల వరకు దీనిని పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకుగాను..అమెరికా వీసా, నివాస కార్డు లేక గ్రీన్ కార్డు ఉన్న వారు.. ఏదేని యూరోపియన్ యూనియన్ దేశం లేక యునైటెడ్ కింగ్డమ్ వీసా లేక నివాస ధ్రువీకరణ కార్డు ఉన్నవారు అర్హులు. కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్టు కూడా వీరు చూపాల్సి ఉంటుంది. భారత్–యూఏఈల బంధం బలపడుతున్న వేళ ఈ నూతన విధానం అమల్లోకి రావడం విశేషం. యూఏఈలో ప్రస్తుతం 35 లక్షల మంది భారతీయులు ఉంటున్నారు. -
T20 WC 2024: పట్టిక తారుమారు.. సెమీస్ బెర్తులు ఖరారు
మహిళల టీ20 ప్రపంచకప్-2024లో సెమీ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టాప్-4కు అర్హత సాధించగా.. గ్రూప్-బి నుంచి ఊహించని జట్టు సెమీస్‌కు దూసుకువచ్చింది. కాగా బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సిన ఈ మెగా టోర్నీ వేదికను ఐసీసీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు మార్చిన విషయం తెలిసిందే.బంగ్లాలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తలెత్తిన అల్లర్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్లో గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక.. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పోటీపడ్డాయి.టీమిండియాకు కలిసి రాలేదుఅయితే, టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న భారత జట్టు పేలవ ప్రదర్శనతో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో గ్రూప్-ఏలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టాప్-4లో సగర్వంగా అడుగుపెట్టాయి. అయితే, గ్రూప్-బి టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్ ఊహించని రీతిలో ఒక్క మ్యాచ్ ఫలితంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.ఒక్క మ్యాచ్‌తో ఫలితం తారుమారువెస్టిండీస్తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హీథర్ నైట్ బృందం.. విండీస్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో గ్రూప్-బి పాయింట్ల పట్టిక తారుమారైంది. మొదటిస్థానంలో ఉన్న ఇంగ్లండ్ మూడో స్థానానికి, మూడో స్థానంలో ఉన్న వెస్టిండీస్ టాప్‌లోకి వచ్చింది. ఇరు జట్లు పాయింట్ల పరంగా(6) సమానంగా ఉన్నా.. నెట్‌రన్‌రేటులో వెస్టిండీస్(1.536).. ఇంగ్లండ్(1.091) కంటే మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం.ఫలితంగా గ్రూప్-బి నుంచి వెస్టిండీస్ సెమీస్‌కు వచ్చింది. మరోవైపు.. ఇదే గ్రూపులో ఉన్న సౌతాఫ్రికా కూడా ఆరు పాయింట్లే కలిగి ఉన్నా.. నెట్‌రన్‌రేటే(1.382) ఆ జట్టుకూ మేలు చేసి టాప్-4లో చేర్చింది. అలా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా మహిళా టీ20 వరల్డ్‌కప్-2024లో తమ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి.షెడ్యూల్, వేదికలు ఇవే👉మొదటి సెమీ ఫైనల్- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా- అక్టోబరు 17, దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్.👉రెండో సెమీ ఫైనల్- వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్, అక్టోబరు 18, షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా.👉రెండు మ్యాచ్‌లూ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు మొదలవుతాయి.ఆస్ట్రేలియా జట్టుఅలిసా హీలీ (కెప్టెన్), డార్సీ బ్రౌన్, యాష్ గార్డనర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలానా కింగ్, ఫోబీ లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), సోఫీ మొలినెక్స్, బెత్ మూనీ, ఎలిస్ పెర్రీ, మెగాన్ స్కట్, అన్నాబెల్ సదర్లాండ్, హీథర్ గ్రాహం, జార్జియా వేర్హామ్.సౌతాఫ్రికా జట్టులారా వోల్వార్డ్ (కెప్టెన్), అన్నేక్ బాష్, టాజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నేరీ డెర్క్సెన్, మికే డి రైడర్, అయాండా హ్లూబీ, సినాలో జాఫ్తా, మారిజానే కాప్, అయబోంగా ఖాకా, సునే లూస్, నోన్కులులెకో మ్లాబా, సెష్నీ నాయుడు, తుమీ సెఖుఖున్, క్లోయ్ ట్రియాన్.వెస్టిండీస్ జట్టుహేలీ మాథ్యూస్ (కెప్టెన్), ఆలియా అల్లేన్, షమీలియా కాన్నెల్, డియోండ్రా డాటిన్, షెమైన్ కాంప్బెల్లె (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), అష్మిని మునిసర్, అఫీ ఫ్లెచర్, స్టెఫానీ టేలర్, చినెల్ హెన్రీ, చెడియన్ నేషన్, కియానా జోసెఫ్, జైదా జేమ్స్, కరిష్మా రాంహారక్, మాండీ మంగ్రూ, నెరిస్సా క్రాఫ్టన్.న్యూజిలాండ్ జట్టుసోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇజ్జీ గాజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్, మెలీ కెర్, జెస్ కెర్, రోజ్మేరీ మైర్, మోలీ పెన్ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవే, లీ తహుహు.చదవండి: W T20 WC: ‘హర్మన్‌పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే’ -
ఇజ్రాయెల్‌కు సాయం చేయకండి: అరబ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఇరాన్-ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాలస్తీనా, లెబనాన్‌లపై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంటే.. ఇరాన్ ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఈనేపథ్యంలో ఇరాన్ పొరుగున ఉన్న అరబ్ దేశాలకు, అమెరికా మిత్ర దేశాలకు తీవ్ర హెచ్చరికలు చేసింది.తమపై(ఇరాన్) దాడులు జరిపేందుకు ఇజ్రాయెల్‌కు సాయం చేయవ ద్దని హెచ్చరించింది. అలా కాదని అరబ్ దేశాలు వారి భూబాగాలు, గగనతలాన్ని ఉపయోగించి దాడులకు పాల్పడితే తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఖతార్ వంటి చమురు సంపన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని రహస్య దౌత్య మార్గాల ద్వారా ఈ హెచ్చరికను పంపింది. అయితే ఇవన్నీ యూఎస్ సైనిక దళాలకు ఆతిథ్యం ఇచ్చే దేశాలు.ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా అధినేత నస్రల్లా మృతి అనంతరం ఇరాన్ 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ పెద్దతప్పు చేసిందని, భారీ మూల్యం చెల్లించుకుంటుందని, ప్రతీకార దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. అయితే ఇరాన్‌లోని అణుస్థావరాలతో పాటు.. చమురు క్షేత్రాలనూ లక్ష్యంగా చేసుకొనే అవకాశం ఉందని ఐడీఎఫ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథయంలోనే ఇస్లామిక్ రిపబ్లిక్‌పై ఎలాంటి దాడులు జరగకూడదని,అలా జరిగితే ప్రతీకార దాడులకు పాల్పడతామని అరబ్ దేశాలను హెచ్చరించింది. -
భారత్–యూఏఈ మధ్య ‘ఫుడ్ కారిడార్’
ముంబై: భారత్–యునైటెడ్ ఆరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) దాదాపు రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఫుడ్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ క్యారిడార్ యూఏఈ ఆహార అవసరాలను తీర్చడంతోపాటు, అంతకుమించి భారతీయ రైతులకు అధిక ఆదాయాన్ని సంపాదించడానికి, దేశంలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతుందని కేంద్ర మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. పెట్టుబడులపై భారత్–యూఏఈ అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ 12వ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో గోయల్ ఈ విషయాలు చెప్పారు. ఈ సమావేశానికి గోయల్‌తో పాటు అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఎండీ షేక్ హమీద్ బిన్ జాయెద్ అల్ నాహ్యాన్ కో–చెయిర్‌గా వ్యవహరించారు. స్థానిక కరెన్సీలో ద్వైపాక్షిక వాణిజ్యంతో పాటు వర్చువల్ ట్రేడ్ కారిడార్ పనులు, అహ్మదాబాద్‌లో ఫుడ్ పార్క్ ఏర్పాటు మొదలైన అంశాలపై ఇందులో చర్చించారు. ఈ సందర్భంగా గోయల్ ఏమి చెప్పారంటే... → రెండు దేశాల మధ్య ఫుడ్ కారిడార్ స్థాపనను ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు– యూఏఈతో కూడిన చిన్న వర్కింగ్ గ్రూప్ కూడా ఇప్పటికే ఏర్పాటయ్యింది. → భారతదేశంలో ఫుడ్ పార్కుల ఏర్పాటు గురించి చర్చించిన అంశాల్లో మరొకటి. ఇప్పటికే ఈ విషయంలో కొంత పురోగతి జరిగింది. రైతులకు అధిక ఆదాయంతోపాటు లక్షలాది మందికి ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఉద్యోగాలు కల్పించడానికి సహాయపడే అంశమిది. అలాగే యూఏఈ ఆహార భద్రతకు కూడా దోహదపడుతుంది. → ఫుడ్ క్యారిడార్ పెట్టుబడి వచ్చే రెండున్నరేళ్ల కాలంలో జరుగుతుందని అంచనా. → యూఏఈకి అనువైన అధిక నాణ్యతా ఉత్పత్తుల లభ్యత కోసం దేశంలో యూఏఈ భారీ పెట్టుబడులతో ఫుడ్ ప్రాసెసింగ్ సదుపాయాలను మెరుగుపరచాలన్నది గత ఎంతోకాలంగా చర్చిస్తున్న అంశం. ఇది ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది. → తాజా పరిణామంతో దేశీయ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమతో ఇతర గల్ప్ మార్కెట్లూ అనుసంధానమయ్యే అవకాశం ఉంది. దుబాయ్‌లో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయంభారత్లో పెట్టుబడులు చేయదల్చుకునే మదుపర్లకు సహాయకరంగా ఉండేలా దుబాయ్‌లో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు పియుష్ గోయల్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌కి (ఐఐఎఫ్‌టీ) సంబంధించి విదేశాల్లో తొలి క్యాంపస్‌ను కూడా దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (యూఏఈ) నివసించే 35 లక్షల మంది భారతీయులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. -
ఎంపాక్స్ క్లేడ్ 1బీ తొలి కేసు
న్యూఢిల్లీ: ప్రపంచంలో ‘ఆరోగ్య అత్యయిక స్థితి’కి దారితీసిన ‘క్లేడ్1’ వేరియంట్ ఎంపాక్స్ వైరస్ భారత్‌లోకి అడుగుపెట్టింది. క్లేడ్ 1బీ పాజిటివ్ కేసు భారత్‌లో నమోదైందని సోమవారం అధికారిక వర్గాలు వెల్లడించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కేరళకు తిరిగొచి్చన 38 ఏళ్ల వ్యక్తిలో క్లేడ్ 1బీ వైరస్‌ను గుర్తించామని అధికారులు ప్రకటించారు. మలప్పురం జిల్లాకు చెందిన ఈ రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. క్లేడ్ 1బీ వేరియంట్ కేసులు విజృంభించడతో ఆగస్ట్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం తెల్సిందే. విదేశాల నుంచి వస్తూ ఎంపాక్స్ రకం వ్యాధి లక్షణాలతో బాధపడేవారు తక్షణం ఆరోగ్య శాఖకు వివరాలు తెలపాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సూచించారు. కోలుకున్న ‘క్లేడ్2’ రోగి క్లేడ్2 వేరియంట్‌తో ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న 26 ఏళ్ల రోగి కోలుకుని శనివారం డిశ్చార్జ్ అయ్యాడని ఆస్పత్రి వర్గాలు సోమవారం వెల్లడించాయి. హరియాణాలోని హిసార్‌కు చెందిన ఈ వ్యక్తి సెపె్టంబర్ ఎనిమిదో తేదీన ఆస్పత్రిలో చేరడం తెల్సిందే. -
యుద్ధ ఖైదీల మార్పిడి
మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్లు శనివారం 103 మంది చొప్పున యుద్ధఖైదీలను పరస్పరం మారి్పడి చేసుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దీనికి మధ్యవర్తిత్వం వహించింది. ‘మావాళ్లు స్వదేశానికి చేరుకున్నారు. రష్యా చెర నుంచి 103 మంది యోధులను విజయవంతంగా ఉక్రెయిన్‌కు తీసుకొచ్చాం’అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. యుద్ధఖైదీల మారి్పడిలో భాగంగా ఉక్రెయిన్‌కు చేరిన వారిలో 82 సాధారణ పౌరులు, 21 మంది సైనిక సిబ్బంది ఉన్నారు. ‘కస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ బందీలుగా పట్టుకున్న 103 సైనిక సిబ్బంది కీవ్ ఆ«దీనంలోని భూభాగం నుంచి విముక్తులయ్యారు. బదులుగా 103 యుద్ధఖైదీలను ఉక్రెయిన్‌కు అప్పగించాం’అని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ చెర వీడిన రష్యా యుద్ధఖైదీలు ప్రస్తుతం బెలారస్లో ఉన్నారు. వారికి అవసరమైన వైద్య, మానసిక సహాయాన్ని అందిస్తున్నట్లు రష్యా తెలిపింది. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తిన తర్వాత యూఏఈ మధ్యవర్తిత్వంలో జరిగిన ఎనిమిదో యుద్ధఖైదీల మారి్పడి ఇది. మొత్తం ఇప్పటిదాకా 1,994 మంది ఖైదీలకు తమ చొరవతో చెరవీడిందని యూఏఈ తెలిపింది. రష్యాలోని సుదూర లక్ష్యాల పైకి దాడికి అనుమతించండి రష్యాలోని సుదూర లక్ష్యాల పైకి దాడి చేయడానికి తమను అనుమతించాలని ఉక్రెయిన్ పునరుద్ఘాటించింది. పశి్చమదేశాలు ఉక్రెయిన్‌కు సుదూరశ్రేణి క్షిపణులను సరఫరా చేసినప్పటికీ.. వాటి వాడకానికి అనుమతివ్వడం లేదు. ‘రష్యా ఉగ్రవాదం వారి ఆయుధాగారాలు, సైనిక విమానాశ్రయాలు, సైనిక స్థావరాల వద్ద మొదలవుతుంది. రష్యా లోపలి ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడులకు అనుమతి లభిస్తే.. పరిష్కారం వేగమంతమవుతుంది’అని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ఆండ్రీ యెర్మాక్ శనివారం వివరించారు. -
ఇంధన రంగంలో సహకరించుకుందాం
న్యూఢిల్లీ: ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్, యూఏఈ మధ్య సంబంధాలతోపాటు ఇరుదేశాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. గాజాలోని తాజా పరిస్థితులతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇంధన రంగంలో సహకారానికి సంబంధించి భారత్, యూఏఈ నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ(అండోక్)– ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్), అండోక్–ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్(ఐఎస్పీఆర్ఎల్) మధ్య దీర్ఘకాలం ఇంధన సరఫరాకు ఒప్పందాలు కుదిరాయి. అలాగే అబుదాబీలోని బరాఖా అణువిద్యుత్ కేంద్రం నిర్వహణ కోసం ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ(ఈఎన్‌ఈసీ)–న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్) మధ్య మరో ఒప్పందం కుదిరింది. అండోక్–ఊర్జా భారత్ మధ్య ప్రొడక్షన్ కన్సెషన్ అగ్రిమెంట్ కుదిరింది. అంతేకాకుండా భారత్‌లో ఫుడ్‌పార్కుల ఏర్పాటు కోసం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, అబుదాబీ డెవలప్మెంట్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్సీ మధ్య ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అబుదాబీ యువరాజు భారత పర్యటన కోసం ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం రాజ్‌ఘాట్‌ను సందర్శించాయి. జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులరి్పంచారు. యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారం ద్వారా భారత్, యూఏఈ మధ్య సంబంధాలు నానాటికీ బలోపేతం అవతుండడం పట్ల రాష్ట్రపతి ఈ సందర్భంగా హర్షం వ్యక్తంచేశారు. -
అక్టోబర్ 6న భారత్, పాక్ పోరు
దుబాయ్: బంగ్లాదేశ్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు తరలి వెళ్లిన మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరిగే ఈ టోర్నీని యూఏఈలోని రెండు వేదికల్లో (షార్జా, దుబాయ్) నిర్వహిస్తారు. రెండు మ్యాచ్‌లు ఉంటే... భారత కాలమానం ప్రకారం తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి... రెండో మ్యాచ్ రాత్రి గం. 7:30 నుంచి జరుగుతాయి. టాప్–10 దేశాలు పోటీపడుతున్న ఈ టోరీ్నలో మొత్తం 23 మ్యాచ్‌లున్నాయి. బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో... అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతుంది. అనంతరం అక్టోబర్ 9న శ్రీలంకతో, అక్టోబర్ 13న ఆ్రస్టేలియాతో భారత్ ఆడుతుంది. భారత్ సెమీఫైనల్ చేరుకుంటే అక్టోబర్ 17న దుబాయ్‌లో జరిగే తొలి సెమీఫైనల్లో ఆడుతుంది. అక్టోబర్ 20న దుబాయ్‌లో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. ఆ్రస్టేలియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. సెమీఫైనల్స్, ఫైనల్‌కు ‘రిజర్వ్ డే’ కేటాయించారు. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక... గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లున్నాయి. సెపె్టంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు 10 ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
పసికూనను చిత్తు చేసిన పాక్... సెమీస్ రేసులో
వుమెన్స్ ఆసియా కప్-2024లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసి సెమీస్ రేసులో ముందడుగు వేసింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ ఆసియా టోర్నీలో పాక్ తొలుత భారత్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన చేతిలో.. నిదా దర్ బృందం ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో తమ రెండో మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం సాధించి గెలుపు బాటపట్టింది. తాజాగా యూఏఈని పది వికెట్లు తేడాతో ఓడించింది. డంబుల్లా వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ పాక్ బౌలర్ల ధాటికి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి కేవలం 103 పరుగులే చేసింది. పాక్ స్పిన్నర్లు నష్రా సంధు, సైదా ఇక్బాల్, తూబా హసన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. నిదా దర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది.ఇక యూఏఈ విధించిన 104 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు గుల్ ఫెరోజా(55 బంతుల్లో 62), మునీబా అలీ (30 బంతుల్లో 37) అద్భుత ఆట తీరుతో జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరు కలిసి 14.1 ఓవర్లలో 107 పరుగులు జోడించి పాక్‌ను గెలిపించారు. ఫలితంగా పాక్ మహిళా జట్టు ఆసియా కప్-2024 సెమీ ఫైనల్ రేసులోకి దూసుకువచ్చింది.కాగా ఆసియా కప్-2024లో ఇండియా, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు గ్రూప్-ఏలో.. శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా గ్రూప్-బిలో ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి రెండూ గెలిచి టాపర్(నెట్ రన్‌రేటు +3.298)గా ఉంది.పాకిస్తాన్ మూడింట రెండు గెలిచి రెండో స్థానం(నెట్ రన్‌రేటు + 1.158)లో కొనసాగుతోంది. ఇక గ్రూప్-బి నుంచి శ్రీలంక, థాయ్‌లాండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక గ్రూప్ దశలో పాక్ తమ మూడు మ్యాచ్‌లు ఆడేయగా.. భారత్ మంగళవారం నేపాల్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ఫలితం తర్వాత సెమీస్ బెర్తులు అధికారికంగా ఖరారవుతాయి.చదవండి: IPL 2025: మెగా వేలం.. రోహిత్ శర్మపై కన్నేసిన ఆ మూడు జట్లు -
యూఏఈతో మ్యాచ్.. భారత జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ
మహిళల ఆసియాకప్-2024లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-యూఏఈ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. యూఏఈ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. భారత జట్టులో మాత్రం ఒక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే వైదొలిగిన స్పిన్నర్ శ్రేయంకా పాటిల్ స్ధానంలో తనుజా కన్వర్ తుది జట్టులోకి వచ్చింది. తనుజా కన్వర్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం. ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ చేతుల మీదగా భారత టీ20 క్యాప్‌ను కన్వర్ అందుకుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. యూఏఈను కూడా మట్టికరిపించాలని పట్టుదలతో ఉంది.తుది జట్లుభారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, దయాళన్ హేమలత, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్ సింగ్, తనూజా కన్వర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: ఈషా రోహిత్ ఓజా(కెప్టెన్), తీర్థ సతీష్(వికెట్ కీపర్), రినిత రజిత్, సమైరా ధరణిధర్క, కవిషా ఎగోదాగే, ఖుషీ శర్మ, హీనా హాట్‌చందానీ, వైష్ణవే మహేష్, రితికా రజిత్, లావణ్య కెనీ, ఇంధుజా నందకుమార్ -
యూఏఈలో అనూహ్య వర్షాలు
దుబాయ్: మాడ పగిలిపోయే ఎండ వేడికి, ఎడారులకు నిలయమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను భారీ వర్షాలు పలకరించాయి. బుధవారం కుండపోత వర్షాలతో యూఏఈ తడిసి ముద్దయింది. భారీ వర్షాలను తట్టుకునే ఏర్పాట్లేవీ పెద్దగా లేకపోవడంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే మొత్తం నీట మునిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్‌పోర్ట్‌గా ఖ్యాతికెక్కిన దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ పార్కింగ్ ప్రాంతంలోని కార్లు మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకటిన్నర సంవత్సరంలో పడాల్సిన వర్షపాతం బుధవారం ఒక్కరోజే నమోదైందని సిటీ వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాల్లో తేలింది. 14.2 సెంటీమీటర్లమేర వర్షపాత నమోదైందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా స్కూళ్లు మూసేశారు. సమీప బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాల్లోనూ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా జరిగిన ఆస్తినష్టాల వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. వర్షాల కారణంగా భారత్ నుంచి దుబాయ్‌కు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మేఘమథనం వల్లే ఈ వర్షాలు కురిశాయని నిపుణుల అంచనా. -
సహనం, సహజీవనం బాటలో...
యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ ఇచ్చిన 27 ఎకరాల స్థలంలో స్వామినారాయణ సంస్థ అక్కడ భారీ హిందూ దేవాలయాన్ని నిర్మించింది. ముస్లిమేతర విశ్వాసాలను బహిరంగంగా పాటించడానికి కూడా ఒకప్పుడు అనుమతి లేని ఆ దేశంలో ఇది చాలా పెద్ద మార్పు. స్పష్టంగా, బిన్ జాయెద్ ఇస్లాం శాంతి మతం మాత్రమే కాదు, అది ఇతర ఆధ్యాత్మిక అన్వేషణలను అంగీకరిస్తుందని చూపించాలనుకుంటున్నారు. దీనిపై సంప్రదాయ ఉలేమానుండి వచ్చివుండిన వ్యతిరేకతను కూడా ఆయన అధిగమించగలిగారు. యూఏఈ పూర్తి స్థాయి సహనం, సహజీవన మంత్రిత్వ శాఖను కలిగివుంది. ముల్లా ఒమర్ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన మూడు దేశాలలో యూఏఈ ఒకటనే వెలుగులో చూస్తే వారి ఈ ప్రయాణం అద్భుతమైనది. ఫిబ్రవరి 13–14 తేదీలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటన సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అబూ ధాబీలో, బోచాసన్ వాసీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ(బాప్స్) సంస్థ నిర్మించిన హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు. యూఏఈ అధ్యక్షుడు, అబూ ధాబీ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నాహ్ యాన్ (ఎంబీజెడ్) ఇచ్చిన 27 ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, స్వామి నారాయణ్ సంస్థ దివంగత అధినేత ప్రముఖ్ స్వామి మహారాజ్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమ సంబంధం ‘తండ్రీ కొడుకుల మాదిరిగానే ఉండేది’ అని చెప్పారు. ‘ప్రముఖ్ స్వామి మహారాజ్ కలను సాకారం చేయడంలో నేను సహాయపడినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను’ అన్నారు. ప్రముఖ్ స్వామి మహా రాజ్ 1997లో యూఏఈని సందర్శించినప్పుడు అబూ ధాబీలో ఒక ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ సహనం, విభిన్న విశ్వాసాల మధ్య అవగాహన, సహజీవనం వంటి ధర్మాలకు కట్టుబడి ఉన్నారు. దుబాయ్‌లోని జెబెల్ అలీ ప్రాంతంలో పెద్ద హిందూ దేవాలయం, గురుద్వారా నిర్మాణానికి అనుమతించిన దేశ ఉపాధ్యక్షుడు, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా బిన్ జాయెద్ అభిప్రాయాలను గణనీయమైన స్థాయిలో పంచుకుంటు న్నారు. యూఏఈ ప్రభుత్వం పూర్తి స్థాయి సహనం, సహజీవన మంత్రిత్వ శాఖను కలిగి ఉంది. దీనికి జ్ఞానవంతుడైన షేక్ నాహ్ యాన్ బిన్ ముబారక్ అల్ నాహ్యాన్ నేతృత్వం వహిస్తున్నారు. తమ సాంప్రదాయిక సమాజంలో అబ్రహామిక్ విశ్వాసాల ప్రార్థనా స్థలాలను మాత్రమే కాకుండా ఇప్పుడు హిందూ, సిక్కు, బౌద్ధమతాల ప్రార్థనాలయాలను స్థాపించడానికి అనుమతించడంలోనూ ఈ నాయకులు మార్గదర్శకులుగా నిలిచారు. నేను 1979–82 ప్రాంతంలో అబూ ధాబీలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేశాను. ఆ సమయంలో, దుబాయ్‌లో హిందువులు, సిక్కుల ఆరాధనకు సంబంధించి ఒక చిన్న స్థలం ఉండేది. అయితే, బయటి నుండి దానిని గుర్తించలేరు. హిందువులు, సిక్కులు బహిరంగంగా గుర్తించే విధంగా తమ ప్రార్థనలను, కీర్తనలను చేయకూడదనే అవ గాహనతో అప్పటి దుబాయ్ పాలకుడు షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ దీనిని అనుమతించారు. ఆ రోజుల్లో, ప్రార్థనా స్థలాల నిర్మా ణానికి కాదు కదా, ముస్లిమేతర విశ్వాసాలను బహిరంగంగా పాటించుకోవడానికి కూడా యూఏఈ అనుమతించడం అనేది ఊహకందని విషయం. నిజానికి, ఇప్పుడు కూడా, యూఏఈ ఉదాహరణను ఇతర అరబ్ దేశాలు పూర్తిగా అనుసరించలేదు. సౌదీ అరేబియా యువ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ మహిళల బహిరంగ కార్యకలాపాలపై ఇచ్చిన సామాజిక సడలింపులు పూర్తి భిన్నమైన కోవలోకి వస్తాయి. యూఏఈ 1971 డిసెంబరులో ఏడు ఎమి రేట్లతో కలిసి ఒక దేశంగా ఆవిర్భవిం చింది. అవి: అబూ ధాబీ, దుబాయ్, షార్జా, రస్ అల్ ఖైమా, ఉమ్ అల్ క్వైన్, అజ్మాన్, ఫుజైరా. అప్పటివరకు బ్రిటిష్ రక్షిత ప్రాంతా లుగా ఉంటూవచ్చిన అవి ఒక సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాయి. 1962లో అబూ ధాబీలో భారీ పరిమాణంలో చమురును కను గొన్నారు. కానీ దుబాయ్‌లో తక్కువ నిల్వలు ఉండేవి. షార్జాలో ఇంకా తక్కువ. మిగతా ఎమి రేట్స్‌లో అవీ లేవు. 1970వ దశకంలో చమురు ధరల పెరుగుదల యూఏఈ రూపు రేఖలను మార్చింది. అబూ ధాబీ తాను అభివృద్ధి చెందడమే కాకుండా, ఇతరులతో తన ఔదార్యాన్ని పంచుకోవడానికి సిద్ధపడింది. దీంతో భారీ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభ మయ్యాయి. ఇది భారతదేశంతో సహా అనేక దేశాల నుండి ప్రజలను తీసుకువచ్చింది. వారు వివిధ విశ్వాసాలకు చెందినవారు. అప్పటి దుబాయ్ పాలకుడైన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ తన ఎమిరేట్‌ను వ్యాపారం, షిప్పింగ్, ఫైనాన్స్ కోసం ఒక గొప్ప వాణిజ్య కేంద్రంగా నిర్మించడం ప్రారంభించారు. దీని కోసం, ఆయన పెద్ద సంఖ్యలో విదేశీయుల రాకను ప్రోత్సహించవలసి వచ్చింది. బిన్ రషీద్ దార్శనికతను దుబాయ్ ప్రస్తుత పాలకుడు ముందుకు తీసు కెళ్లారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడం ప్రారంభించారు. పర్యాటకా నికి మహిళలు, ఆహారం, పానీయాలకు సంబంధించిన పాత, కఠిన మైన సామాజిక ఆచారాల సడలింపులు అవసరమయ్యాయి. అయితే, అధికారులు దుబాయ్‌లో నివసించడానికీ, పని చేయడానికీ వచ్చిన వారి రాజకీయ కార్యకలాపాలను మాత్రం అనుమతించలేదు. అబూ ధాబీ మినహా కొన్ని ఇతర ఎమిరేట్లు దీనిని అనుసరించాయి. ముస్లి మేతర మత కార్యకలాపాలను బహిరంగంగా వ్యక్తీకరించడాన్ని, పర్యవేక్షించడం మరొక అంశం. ఏమైనా విశ్వాసాల విషయంలో వహాబీ, సలాఫీ ఇస్లాం సిద్ధాంతాలు కచ్చితంగా అమలయ్యాయి. ఇక్కడే యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ సహనం, సహజీవనాలను ప్రచారం చేయడంలో చాలా ముందుకు వెళ్లిపోయారు. ఇవి ఇస్లామిక్ విశ్వాసంపై అత్యంత కఠినమైన వ్యాఖ్యానం, అభ్యాసం కోసం పట్టుబట్టే ఇబ్న్ వహాబ్ సాంప్రదాయ బోధనలకు భిన్నమైన పరాయి ఆలోచనలు. సౌదీ రాజకుటుంబం వహాబిజంతో ఒప్పందాన్ని కలిగి ఉంది. అరేబియా ద్వీపకల్పంలోని ఇతర గిరిజన పెద్దలు కూడా దానిని అనుసరించారు. ఇస్లాంకు ఇతర వ్యాఖ్యానాల చెల్లుబాటు తిరస్కరించబడింది. వాస్తవానికి, ఇతర మతాలను, ముఖ్యంగా అబ్రహామిక్ కానివాటిని అంగీకరించే ప్రశ్నే లేదు. ఇక విగ్రహారాధనకు అయితే పెద్ద వ్యతిరేకత ఉంటుంది. స్పష్టంగా, మొహమ్మద్ బిన్ జాయెద్ ఇస్లాం శాంతికి సంబంధించిన మతం మాత్రమే కాదు, అది గౌరవప్రదమైనదనీ, ఇతర ఆధ్యా త్మిక అన్వేషణలను అంగీకరిస్తుందనీ చూపించాలనుకుంటున్నారు. అది ఉదారవాద, జ్ఞానోదయమైన విధానం. తీవ్రవాదం, హింసలను ఇస్లాం ప్రబోధిస్తుందనే అభిప్రాయాన్ని కూడా ఇది తిరస్కరించడానికి ప్రయత్నిస్తుంది. అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్, లష్కర్ ఎ తొయ్యబా, అఫ్గాన్ తాలిబాన్ వంటి గ్రూపులు ఆచరిస్తున్న భావజాలాలు, హింస కారణంగా చాలా ముస్లిమేతర ప్రాంతాలలో ఈ అభిప్రాయం ఏర్పడింది. 1990లలో ముల్లా ఒమర్ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన మూడు దేశాలలో యూఏఈ ఒకటి. మిగిలిన రెండూ సౌదీ అరేబియా. పాకిస్తాన్. ఈ వెలుగులో చూస్తే మొహమ్మద్ బిన్ జాయెద్ పాలనలో సహనం, సహజీవనాలకు చెందిన విధానం, దాని అభ్యాసం అద్భుతమైనవి. అబూ ధాబీలో బోచాసన్వాసీ అక్షర్ పురుషోత్తమ్ స్వామి నారాయణ దేవాలయం వంటి ఇస్లామేతర ప్రార్థనా స్థలాలను అనుమతించడంపై సంప్రదాయ వహాబీ ఉలేమా నుండి కచ్చితంగా వచ్చివుండిన వ్యతిరేకతను బిన్ జాయెద్ అధిగమించగలిగారు. ‘వహాబీ మజబ్’లోనే మార్పు వస్తున్నదని ఇది సూచిస్తున్నదో లేదో అంచనా వేయడం తొందరపాటే అవుతుంది. బిన్ జాయెద్ నిస్సందే హంగా ఇతర దేశాల సంప్రదాయ ఉలేమాల ఆగ్రహాన్ని కూడా ఎదుర్కొంటారు. అయితే సహనం, సహజీవనం పట్ల తన నిబద్ధతను స్పష్టంగా వ్యక్తీకరించడానికి అటువంటి ఒత్తిళ్లను తట్టుకునే సామ ర్థ్యాన్ని ఆయన కలిగివున్నారు. కానీ అది ఎడారి గిరిజనుల స్పృహలోకి ఎంత లోతుగా ప్రవేశించిందో కాలమే చెబుతుంది. - వ్యాసకర్త, విదేశాంగ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) - వివేక్ కాట్జూ -
Viral Video: కోపంతో వెంబడించిన పులి.. భయపడి పరుగు!
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ) దేశానికి చెందినవారి విలాసవంతమైన జీవితాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడీయాలో చాలానే చూసి ఉంటాం. అక్కడి సంపన్న వర్గానికి చెందిన వారు చాలా వరకు.. పులులు, సింహాలు, చీతాలను పెంచుకోవటం గొప్పగా భావిస్తారన్న విషయం తెలిసిందే. అటువంటి జంతువుల కలెక్షన్ వాటిని బీచ్‌లకు తీసుకువెళ్లడం యూఏఈ సంపన్న కుటుంబాలకు ఓ సరదా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఓ విలాసవంతమైన భవనంలో ఒక పెంపుడు పులి.. ఓ వ్యక్తిని భయంతో పరుగులు తీయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Billionaire Life Style (@billionaire_life.styles) బిలియనీర్స్ లైఫ్ స్టైల్ అనే ఓ ఇన్స్టాగ్రామ్ ఈ వీడియోను పోస్ట్చేసింది. ముందు సరదగా వెంబడిస్తున్నట్లు అనుకున్న ఆ వ్యక్తి.. పులి వేగం పెంచి అదే పనిగా కోపంగా తన వెంటపడటంతో ఆ వ్యక్తి భయపడిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘అందమైన పులి.. ఒక బొమ్మ కాదు’, ‘దాడి చేయడానికి వచ్చిన పులి నుంచి తప్పించుకున్నాడు’, ‘చాలా ఫన్నీగా ఉంది.. ఇది ఖచ్చితంగా బిలియనీర్స్ లైఫ్ స్టైల్!’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వాళ్లను చంపేయండి.. ఇజ్రాయెల్‌కు గాజా ప్రజల విన్నపం! -
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్రంలోని వలస కార్మికులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఉపాధి కల్పించడానికి ఏడీఎన్‌హెచ్ కంపాస్ కంపెనీ ఉచిత రిక్రూటింగ్ ప్రక్రియ చేపట్టింది. తెలంగాణ జిల్లాలకు చెందిన 12 వేలమంది వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న కంపెనీ మరి కొంతమంది కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. క్యాటరింగ్ రంగంలో వలస కార్మికులకు ఆరు రకాలైన పనులు కల్పించనున్నారు. ఉచితంగా వీసా, విమాన టికెట్ సౌకర్యాన్ని కంపెనీ కల్పిస్తుంది. క్యాటరింగ్ సూపర్వైజర్(హాస్పిటాలిటీ క్యాటరింగ్ అనుభవం ఉన్నవారికి), టీం లీడర్(హాస్టల్ నిర్వహణ అనుభవం), హెవీ వెహికల్ డ్రైవర్(యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి), కిచెన్ స్టీవార్డ్స్, క్లీనర్స్, వెయిటర్లకు ఉపాధి కల్పించడానికి వీసాలను జారీ చేయనున్నారు. ఈ నెల 9న ముంబైలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఈ నెల 5, 6 తేదీల్లో ఆర్మూర్, జగిత్యాల్లోని జీటీఎం ఇంటర్నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీవారిని కలిసి వివరాలను అందించాలని సంస్థ యజమాని చీటి సతీశ్‌రావు ‘సాక్షి’కి వివరించారు. 22 నుంచి 35 ఏళ్లలోపు వయసు కలవారు ఈసీఎన్ఆర్ పాస్‌పోర్టు కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులకు పచ్చ»ొట్టు ఉండకూడదని చెప్పారు. వేతనంతోపాటు ఉచితవసతి, భోజన సదుపాయం కల్పించి ఉపాధి ఇవ్వనున్నారని వెల్లడించారు. ముంబైలో ఇంటర్వ్యూకు వెళ్లేవారి కోసం తక్కువ ఖర్చుతో బస్సు సౌకర్యం కల్పించామన్నారు. -
పేద దేశాలకు ‘వాతావరణ మార్పుల’ నష్టపరిహారం
దుబాయి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయి నగరంలో కాప్–28 సదస్సు గురువారం ప్రారంభమైంది. 12 రోజులపాటు సదస్సు జరగనుంది. తొలిరోజు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. శిలాజ ఇంధనాల వాడకం మితిమీరుతుండడం, తద్వారా పెరుగుతున్న కాలుష్యం, సంభవిస్తున్న వాతావరణ మార్పుల వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాతావరణ మార్పుల్లో ఆయా దేశాల పాత్ర తక్కువే. అయినప్పటికీ నష్టాన్ని మాత్రం భరించాల్సి వస్తోంది. అందుకే వాటికి పరిహారం చెల్లించాలన్న ప్రతిపాదనకు కాప్–28 సదస్సులో ఆమోద ముద్ర వేశారు. -
Bhavana Reddy: ఓ విశ్వవ్యాప్త భావన
‘మెరుపు మెరిసినట్లు ఉంటుందామె నాట్యం. నాట్యానికి ఆమె చేసే న్యాయం అద్భుతంగా ఉంటుంది. భారతీయ శాస్త్రీయ నాట్యానికి ఆమె ప్రత్యేకమైన ఆకర్షణ’. ...ఇవన్నీ భావనారెడ్డి నాట్య ప్రతిభకు అందిన ప్రశంసలు. జాతీయ, అంతర్జాతీయ పత్రికల అక్షర పురస్కారాలు. ఇప్పుడామె కొత్త నాట్యతరంగాలను సృష్టించే పనిలో ఉన్నారు. కూచిపూడి కళాకారిణి భావనారెడ్డి నాట్యాన్ని అధ్యయనం చేశారు, నాట్యంలో పరిశోధన చేశారు. నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నాట్యాన్ని భావితరాలకు అందించడానికి శిక్షణనిస్తున్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, సింగపూర్, యూరప్‌దేశాలలో మన కూచిపూడి అడుగులు వేయిస్తున్నారు. చిన్నారులకు కూచిపూడి అభినయ ముద్రలు నేర్పిస్తున్నారు. నాట్యకళాకారిణి నుంచి నాట్యగురువుగా మారి గురుశిష్యపరంపరకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 26వ తేదీన(ఆదివారం) ఆమెరికా, కాలిఫోర్నియాలో ఆమె శిష్యబృందం ప్రదర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో తన అభిప్రాయాలను పంచుకున్నారు. కళామతల్లి దక్షిణ ‘‘నాట్యం ఎంతగా సాధన చేసినప్పటికీ ‘ఇకచాలు’ అనే ఆలోచన ఎప్పటికీ రాదు. ఇంకా ఏదో చేయాలనే తపన నేర్చుకున్న అడుగులకు కొత్తదనం అద్దమని పోరుతూనే ఉంటుంది. పౌరాణిక, ఆధ్యాత్మిక, సామాజిక అంశాలను నాట్యం ద్వారా అత్యంత లలితంగా వ్యక్తం చేయగలుగుతాం. అందుకే మన శాస్త్రీయ నాట్యప్రక్రియలు నిత్యనూతనం. తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళారూపాన్ని నేను మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను. దేశవిదేశాల్లో ప్రదర్శనలిచ్చాను. నా వంతు బాధ్యతగా కొత్త తరాలకు శిక్షణనిస్తున్నాను. ఇది నేను నాట్యానికి తిరిగి ఇస్తున్న కళాదక్షిణ. నాట్యానికి డిజిటల్ వేదిక కూచిపూడిని విశ్వవ్యాప్తం చేయడానికి లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చాను. కళాభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాను. కోవిడ్ కారణంగా ప్రపంచం స్తంభించి పోయింది. దాంతో నాట్య ప్రదర్శనలు ప్రశ్నార్థక మయ్యాయి. అప్పటికే నిర్ణయమైన కార్యక్రమాలు రద్దయ్యాయి కూడా. కరోనా వైరస్ ప్రదర్శననైతే నిలువరించగలిగింది కానీ నాట్యసాధనను కాదు. నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను చూసి చాలా మంది నాట్యం నేర్పించమని అడిగారు. మన సంప్రదాయాన్ని గతం నుంచి భవిష్యత్తుకు చేర్చే మాధ్యమాలుగా మా కళాకారుల మీద ఎంతో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మంచి సమయం అనిపించింది. అలా మూడేళ్ల కిందట అమెరికాలో ‘ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కూచిపూడి డాన్స్’ సంస్థను స్థాపించాను. దాదాపు యాభై మందికి కూచిపూడి నాట్యంలో శిక్షణనిచ్చాను. ఈ ప్రదర్శనలో గణనాట్య, పుష్పాంజలి, జతికట్టు, మండూక శబ్దం, దశావతారాల ప్రదర్శనలో మొత్తం 15 మంది చిన్నారులు పాల్గొన్నారు. అమ్మ దిద్దిన వ్యక్తిత్వం నాట్య ప్రక్రియల్లో కాలానుగుణంగా కొద్దిపాటి మార్పులు తోడవుతుంటాయి. కానీ శిక్షణనిచ్చే విధానంలో సంప్రదాయం కొనసాగుతుంది. డాన్స్ క్లాస్‌ను నాట్యమందిరంగా గౌరవించడంలో ఎటువంటి మార్పూ ఉండదు. రాజారెడ్డి, రాధారెడ్డి, కౌసల్యారెడ్డి... ఈ ముగ్గురూ కూచిపూడికి ప్రతీకలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వారి బిడ్డలుగా అక్క యామిని, నేను ఆ పరంపరను కొనసాగిస్తున్నాం. నన్ను శిల్పంలా చెక్కడంలో, విలువలతో కూడిన వ్యక్తిగా తీర్చిదిద్దడంలో అమ్మ కౌసల్య కృషిని మాటల్లో వర్ణించలేం. నా భర్త డెనిస్ నిల్సన్ది స్వీడన్. ఆయన సంగీతకారుడు. ఇద్దరమూ కళాకారులమే కావడం నా కళాసేవకు మరింతగా దోహదం చేస్తోంది. వారి సొంతదేశం స్వీడన్. మేము అమెరికాలో నివసిస్తున్నాం. మా అబ్బాయికి ఐదు నెలలు. నడకతోపాటు నాట్యం నేర్చుకుంటాడో, మాటలతోపాటు పాటలు నేర్చుకుంటాడో చూడాలి’’ అని నవ్విందామె. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ∙ -
యూఏఈ పర్యటనలో మంత్రి అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు యూఏఈ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యూఏఈ లోని వైఎస్సార్సీపీ ఎన్నారై సలహాదారులు ప్రసన్న సోమిరెడ్డి, సమన్వయకర్త అక్రమ్ భాషా ఆధ్వర్యంలో పార్టీశ్రేణులను కలిశారు. రాబోయే ఎన్నికలను సమాయత్తపరిచే విధంగా దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. 'చంద్రబాబు అవినీతి కేసు విషయంలో చట్టం, న్యాయం తమ పని చేసుకొని వెళ్తున్నాయని, అన్నిసార్లు అబద్దాలను తమ పచ్చమీడియా ద్వారా ప్రచారం చేయలేరు. సోషల్ మీడియా ముసుగులో పచ్చమీడియా ఏకపక్ష వార్తలను ప్రజలను నమ్మడం లేదని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్ విఫలం అవడంతోనే నిరూపితం అయింది' అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలొ నివాస చౌదరి, ఫహీం, శ్యామ్ సురేంద్ర రెడ్డి, తరపట్ల మోహన్ రావు, బ్రహ్మానంద రెడ్డి, షేక్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. -
అయ్యయ్యో..దుబాయ్ అతిపెద్ద జెయింట్ వీల్ ఆగిపోయింది
Ain Dubai (Dubai Eye) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాలు, రికార్డ్-బ్రేకింగ్ ల్యాండ్‌మార్క్ నిర్మాణాలకు పుట్టినిల్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ముఖ్యంగా గ్లామ్-హబ్ దుబాయ్పర్యాటకులను ఆకర్షించే అతిపెద్ద ఫెర్రిస్ వీల్ ఐన్ దుబాయ్ (దుబాయ్ఐ) అర్థాంతరంగా నిలిచిపోయింది. దుబాయ్‌లో రెండేళ్ల కిందట (అక్టోబర్ 21, 2021) అట్టహాసంగా ప్రారంభమైన ఈ ప్రపంచంలోనే అతిపెద్ద జెయింట్ వీల్ హఠాత్తుగా ఆగిపోవడం చర్చకు దారితీసింది. (బంగారం,వెండి ధరలు: ఎలా ఉన్నాయంటే..!) దుబాయ్ అంటే ఆకాశహర్మ్యాలు, షాపింగ్ మాల్స్ షాపింగ్, లగ్జరీ హోటల్స్ తోపాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా గుర్తొస్తాయి. వీటన్నింటికి మించి అట్టహాసంగా ప్రారంభమై పర్యాటకులను విశేషంగా ఆకర్షించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫెర్రిస్ వీల్. ఈ అతిపెద్ద జెయింట్ వీల్ మొరాయిస్తోంది. ప్రస్తుతం ఎల్ఈడీ ఫిక్చర్లు మాత్రమే పనిచేస్తున్నాయట. ఈ విషయాన్ని అధికారిక వెబ్సైట్ స్వయంగా ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఐన్ దుబాయ్ తెరుచుకోదని వెల్లడించింది. గత కొద్ది నెలలుగా జరుగుతున్న పనులను పూర్తి చేయడానికి శరవేగంగా పనిచేస్తున్నామని ప్రకటించింది. దుబాయ్ ఐని ఎపుడు తిరిగి ప్రారంభించేదీ అధికారికంగా వెల్లడించలేదు. (లక్ అంటే ఇదే: ఖరీదైన బ్యాగ్‌ను ఎయిర్‌ట్యాగ్ పట్టిచ్చింది!) దుబాయ్ పర్యాటక శాఖ ప్రకారం పుట్టినల్లు దుబాయ్ ఐ 250 మీటర్ల (825 అడుగులు) uత్తులో ఉంది. . ప్రపంచంలోనే అతిపెద్దది. లండన్ ఐ కంటే దాదాపు రెండు రెట్లు ఎత్తు. అంతర్జాతీయ కంపెనీల కన్సార్టియం నిర్మించిన దుబాయ్ఐ, బ్లూవాటర్స్లో ఉంది. ఈఫిల్ టవర్ కంటేఎక్కువ ఉక్కుతో తయారు చేయబడినజెయింట్ వీల్, నామమాత్రంగానే మిగిలిపోవడం పర్యాటక ప్రియులను నిరాశపరుస్తోంది. -
భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫైనాన్షింగ్‌కు సంబంధించి ఒక కొత్త ఒప్పంద ఖరారుకు పారిస్‌లో జరుగుతున్న సదస్సులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాల మెరుగుపై దృష్టి సారించారు. ఫ్రాన్స్, బ్రెజిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థికమంత్రులతో ఆమె వేర్వేరుగా చర్చలు జరిపారు. భారత్ ప్రెసిడెన్సీలో కీలక జీ20 దేశాల దృష్టి సారించిన అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను (ఎండీబీ) బలోపేతం చేయడం, రుణ సమస్యల నిర్వహణపై కూడా వీరి సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 22–23 తేదీల్లో జరిగిన ఈసమావేశాలను భారత్, ఫ్రాన్స్, బర్బాడోస్‌లు నిర్వహించాయి. వాతావరణ మార్పు, జీవవైవిధ్య సంక్షోభం, అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థకు మించిన కొత్త గ్లోబల్ ఫైనాన్సింగ్ ఆర్కిటెక్చర్‌కు పునాదులు ఏర్పాటు చేయడం ’న్యూ గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్’ శిఖరాగ్ర సమావేశం లక్ష్యం. డీపీఐతో ప్రజా సొమ్ము ఆదా : సీతారామన్ కాగా పన్ను చెల్లింపుదారులు చెల్లించే డబ్బులు చక్కగా వినియోగించుకోవడానికి డిజిటల్ ప్రజా మౌలిక వసతులు (డీపీఐ) ఉపకరిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. భారత సర్కారు నేడు ఎన్నో రకాల ప్రయోజనాలను నేరుగా లబి్ధదారుల బ్యాంకు ఖాతాలకు అందించగలుగుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థలో డీపీఐ గొప్ప సమర్థతను తీసుకొచి్చందని, నిధులను మెరుగ్గా వినియోగించడం సాధ్యపడినట్టు తెలిపారు. డీపీఐని ప్రవేశపెట్టిన తర్వాత కేవలం ఒక రాష్ట్రంలోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో రూ.లక్ష కోట్లను ఆదా చేసినట్టు చెప్పారు. మహిళలకు ఇచి్చన రుణ ఖాతాల పనితీరు మెరుగ్గా ఉందన్నారు. నూతన గ్లోబల్ ఫైనాన్సింగ్ ఒప్పందం విషయమై ప్రస్తుతం నిర్మలా సీతారామన్ ప్యారిస్‌లో పర్యటిస్తున్నారు. -
యూఏఈ నుంచి పెట్టుబడుల వెల్లువ
గతేడాది సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి భారత్‌కు పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2021–22లో అతి పెద్ద ఇన్వెస్టర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్న యూఏఈ 2022–23 నాలుగో స్థానానికి చేరింది. 2021–22లో 1.03 బిలియన్ డాలర్ల చేయగా గత ఆర్థిక సంవత్సరం దానికి మూడు రెట్లు అధికంగా 3.35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ ఆంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం 2022–23లో 17.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సింగపూర్ అతి పెద్ద ఇన్వెస్టరుగా నిల్చింది. మారిషస్ (6.1 బిలియన్ డాలర్లు), అమెరికా (6 బిలియన్ డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. యూఏఈతో ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులపరమైన సహకారం వేగంగా పటిష్టమవుతుండటం ఇన్వెస్ట్మెంట్ల రాకకు దోహదపడుతోందని శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కంపెనీ పార్ట్నర్ రుద్ర కుమార్ పాండే తెలిపారు. భారత్‌లో యూఏఈ ప్రధానంగా సర్వీసెస్, సముద్ర మార్గంలో రవాణా, నిర్మాణం, విద్యుత్ తదితర రంగాల్లో ఉంటున్నాయి. భారత్, యూఏఈ కుదుర్చుకున్న సమగ్ర ఎఫ్‌టీఏ గతేడాది మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో సుంకాల సమస్య లేకుండా ఒక దేశ మార్కెట్లో మరో దేశం తమ ఉత్పత్తులు, సేవలను విక్రయించుకోవడానికి వీలు లభించింది. అలాగే పెట్టుబడులను పెంచుకునేందుకు నిబంధనలను కూడా సడలించారు. 2000 ఏప్రిల్ నుంచి 2023 మధ్య కాలంలో భారత్‌కి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) యూఏఈ వాటా 2.5 శాతంగా ఉంది. ఈ వ్యవధిలో యూఏఈ 15.6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. -
పుస్తకాన్ని రాసి ప్రచురించిన నాలుగేళ్ల బాలుడు
అబుదాబి: పిట్ట కొంచెం కూత ఘనం అని సామెత. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ఈ నాలుగేళ్ల బాలుడిని చూస్తే పిట్ట కొంచెం రాత ఘనం అని సామెత మార్చుకోవాలి. అబుధాబిలో ఉండే సయీద్ రషీద్ అనే నాలుగేళ్ల వయసున్న బాలుడు ఒక పుస్తకాన్ని రాయడంతో పాటు దానిని ప్రచురించి గిన్నీస్ వరల్డ్ రికార్డులకెక్కాడు. ఒక ఏనుగుకి, ఎలుగుబంటికి మధ్య ఏర్పడిన స్నేహానుబంధాన్ని కథగా మలిచాడు. ఆ పుస్తకం వెయ్యి కాపీల వరకు అమ్ముడైంది. గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారులు ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా సయీద్ రికార్డులకెక్కినట్టుగా ప్రకటించారు. సయీద్ ఈ పుస్తకం రాయడానికి ఎనిమిదేళ్ల వయసున్న అతని అక్క అయిధాబీ స్ఫూర్తిగా నిలిచిందని ఖలీజా టైమ్స్ వెల్లడించింది. ఇప్పటికే అయిధాబీ ఒక ప్రచురణ సంస్థను కూడా నడుపుతూ రికార్డులు సాధించింది. మొత్తమ్మీద ఫ్యామిలీలో అందరికీ పుస్తకాలంటే ఎంతో ఇష్టం కావడంతో ఈ అరుదైన ఘనత సాధించగలిగాడు. -
ఆ ఐదుగురినీ విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్, సిరిసిల్లటౌన్: దుబాయి జైల్లో మగ్గుతున్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు తెలంగాణ వాసులను విడుదల చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలిని కోరారు. భారత పర్యటనలో భాగంగా అబ్దుల్ నసీర్ సోమవారం హైదరాబాద్ ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న వారి వివరాలతో కూడిన వినతిపత్రాన్ని కేటీఆర్ అందజేశారు. నేపాల్‌కు చెందిన దిల్‌ప్రసాద్‌రాయ్ మృతి కేసులో రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేశ్, రవి, నాంపల్లి వెంకటేశ్, దండుగుల లక్ష్మణ్, హనుమంతులు ప్రస్తుతం దుబాయ్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారని రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. యూఏఈ చట్టాల మేరకు రూ.15 లక్షల పరిహారాన్ని బాధితుని కుటుంబం స్వీకరించేందుకు అంగీకరించిందని, ఈ మేరకు 2013లో తానే స్వయంగా నేపాల్ వెళ్లి బాధితుడి కుటుంబాన్ని కలిసినట్లు తెలిపారు. బాధిత కుటుంబం నుంచి అన్నిరకాల పత్రాలను 2013లోనే దుబాయ్ ప్రభుత్వానికి అందించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిందని, ఇక దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాభిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని చెప్పారు. ఈ విషయంలో చొరవచూపాలని కోరారు. హైదరాబాద్ భేష్: యూఏఈ రాయబారి ప్రశంసలు కేటీఆర్‌తో జరిపిన భేటీలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలి ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌లో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం, ఐటీ దాని అనుబంధ రంగాల్లో తెలంగాణ బలం గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడి అవకాశాలు, తెలంగాణ ప్రభుత్వ పాలసీలను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా యూఏఈ రాయబారికి వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని స్టార్టప్ ఈకో సిస్టంతో ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లోని వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్నోవేషన్ ఈకో సిస్టం భాగస్వాములు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారని, ఇదే రీతిన యూఏఈలోని వెంచర్ క్యాపిటలిస్టులను టీ హబ్‌కు పరిచయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన యూఏఈ రాయబారి... తమ దేశంలోని ఔత్సాహిక వెంచర్ క్యాపిటలిస్టులను, హైదరాబాద్ ఈకో సిస్టంలోని స్టార్టప్ సంస్థలను అనుసంధానించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. -
అరబ్ ఎమిరేట్స్ అధికారి రేంజ్లో కలరింగ్.. చివరికి బిల్లు కట్టకుండా..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ప్రభుత్వాధికారిలా నటించి ఓ ఫైస్టార్ హోటల్‌నే మోసం చేశాడు. ఈఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వాధికారిలా నటించి దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ లీలా హోటల్ ఫ్యాలస్ అనే ఫైస్టార్ హోటల్లో బస చేశాడు. ఆ హోటల్ మేనేజర్ అనుపమదాస్ గుప్తాకి ఒక నకిలీ బిజినెస్ కార్డుని చూపించి దాదాపు మూడు నెలలు పాటు అక్కడే ఉన్నాడు. అతను ఆగస్టు1, 2022 నుంచి నవంబర్ 20, 2022 వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఉన్నటుండి హోటల్ బిల్ చెల్లించకుండా ఆ హోటల్లో ఉన్న విలువైన వస్తువులను దొంగలించి పరారయ్యాడు. అతను సుమారు రూ. 23 లక్షల బిల్లు కట్టకుండా పరారయ్యాడు. దీంతో మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడు గురించి తీవ్రంగా గాలించి అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి కర్ణాటకలోని దక్షిణ కన్నడకు చెందిన 41 ఏళ్ల మహ్మద్ షరీఫ్‌గా గుర్తించారు. అతను సమర్పించిన చెక్కు కూడా బౌన్స్ అయ్యిందని, అతను ఉద్దేశపూర్వకంగానే హోటల్ని మోసం చేసేందుకు యత్నించినట్లు విచారణలో తేలిందని పోలీసలు వెల్లడించారు. (చదవండి: షాకింగ్ ఘటన: కారుతో ఢీకొట్టి..ఎనిమిది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి...) -
నిజామాబాద్: షార్జాకి తీసుకెళ్లి.. పత్తా లేకుండా పోయి..
మోర్తాడ్(బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని షార్జాలో అల్వాజ్ క్యాటరింగ్ కంపెనీలో పని ఉందని చెప్పి 250 మందిని విడతల వారీగా విజిట్ వీసాలపై పంపించిన ఏజెంట్ పని చూపకుండా చేతులెత్తేశాడు. షార్జాకు మొదట విజిట్ వీసాలపై వెళ్లాలని అక్కడ వర్క్ వీసా ఇప్పిస్తానని నమ్మించిన ఏజెంట్ దాదాపు రూ.2 కోట్ల వరకు వసూలు చేసి ఉడాయించాడు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఆ కార్మికులు షార్జాలోని ఒక హోటల్లో గత నెల రోజులుగా ఉండిపోగా.. కొందరు తమకు తెలిసిన వారి ద్వారా మరో కంపెనీలో పని వెతుక్కున్నారు. మరికొందరు ఇంటిముఖం పట్టారు. ఒక్కొక్కరి నుంచి రూ.75వేలు వసూలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వర్ని మండలం కొత్తపేట్‌కు చెందిన ఓ వ్యక్తి ట్రావెల్ ఏజెన్సీని కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నాడు. లైసెన్స్ లేకపోయినా ఎంతో మందిని నమ్మకంగా గల్ఫ్ దేశాలకు పంపించాడనే ఉద్దేశంతో వలస కార్మికులు అతనిపై నమ్మకంతో డబ్బులు, పాస్‌పోర్టులు అందించారు. సదరు వ్యక్తి వివిధ ప్రాంతాల్లో దాదాపు 40 మందిని సబ్ ఏజెంట్లుగా నియమించుకుని వారి ద్వారా షార్జా పంపించడానికి 250 మంది కార్మికులకు విజిట్ వీసాలను జారీ చేశాడు. ఒక్కొక్కరి వద్ద విజిట్ కమ్ వర్క్ వీసాల కోసం రూ.75 వేల నుంచి రూ.85 వేల వరకు వసూలు చేశాడు. అయితే కేవలం విజిట్ వీసాలనే కార్మికులకు అంటగట్టి షార్జా పంపించాడు. అక్కడ వర్క్ వీసా ఇప్పించకుండా పత్తా లేకుండా పోయి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయడంతో ఏజెంట్ మోసం బయటపడింది. కాగా, వలస కార్మికుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో ఏజెంట్ సుమారు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేఎస్ ట్రావెల్స్‌కి చెందిన చిట్యాల స్వామిపై వలస కార్మికుల కుటుంబ సభ్యులు వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందనేది విచారణ చేస్తున్నాం.. అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు సాక్షికి వెల్లడించారు. -
వస్త్ర ఎగుమతులకు భారత్–యూఏఈ ఎఫ్‌టీఏ బూస్ట్
న్యూఢిల్లీ: భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) దేశం నుంచి భారీగా వస్త్ర రంగ ఎగుమతుల పురోగతికి దోహదపడుతుందని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్ విభాగం చైర్మన్ అశోక్ రజనీ విశ్లేషించారు. ఈ ఒప్పందం వల్ల సుంకం రహిత మార్కెట్ ఏర్పడుతుందని, ఇది మన ఎగుమతుల్లో యూఏఈ వాటా మరింత పెరగడానికి దోహపడుతుందని ఇక్కడ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ అపెరల్ అండ్ టెక్స్టైల్ ఫెయిర్ (ఐఏటీఎఫ్)లో 20 మందికి పైగా దేశీయ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. రెడీమేడ్ దుస్తుల్లో చైనా తర్వాతి స్థానంలో మనమే.. యూఏఈకి రెడిమేడ్ దుస్తులను సరఫరా చేసే దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉందని అశోక్ రజనీ తెలిపారు. ‘‘యూఏఈ సాంప్రదాయకంగా భారత వస్త్ర ఎగుమతులలో అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వామిగా ఉంది. రెండు దేశాలూ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై సంతకం చేయడంతో, భారత వస్త్ర ఎగుమతులకు యూఏఈలోకి సుంకం రహిత ప్రవేశం లభిస్తుంది. దీనితో దేశ వస్త్ర రంగం ఎగుమతులు మరింత పెరుగుతాయని అంచనా’’ అని ఆయన వివరించారు. ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుతూ, విస్తృత శ్రేణి సాంప్రదాయ పత్తి, ఎంఎంఎఫ్ (మాన్ మేడ్ ఫైబర్స్) వస్త్రాలలో తాజా ఫ్యాషన్ పోకడలకు అనుగుణంగా భారతదేశ అత్యుద్భుత దుస్తుల డిజైన్లు, శైలులను ప్రదర్శించాలని మన ఎగుమతిదారులు లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. వివిధ రకాల ముడిసరుకు లభ్యత, ఇతర సానుకూల అంశాల పరంగా మన దేశ గార్మెంట్ పరిశ్రమ పటిష్టతను పరిగణనలోకి తీసుకుని, భారత్‌ను ఒక సోర్స్‌గా (మూల ఉత్పత్తి వనరు) మలచుకోడానికి యూఏఈ దుస్తుల బ్రాండ్లకు ఈ ఫెయిర్ భారీ వ్యాపార అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. భారత్ వస్త్ర పరిశ్రమ పటిష్టతను ఆయన వివరిస్తూ, సాంప్రదాయ దుస్తుల విభాగంలో పరిశ్రమ స్థిరపడిన తర్వాత, మరిన్ని విభాగాల్లోకి విస్తరించడానికి వ్యూహ రచన చేస్తోందన్నారు. దేశ దుస్తుల పరిశ్రమ ఇప్పుడు 16 బిలియన్ డాలర్ల సాంకేతిక వస్త్ర విభాగంలో ఎంఎంఎఫ్ కొత్త రంగాలలోకి విస్తరించిందని పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్ విలువలో ఇది దాదాపు 6 శాతమని తెలిపారు. -
Dubai: ప్రపంచంలోనే ఎత్తైన నివాస భవనం
దుబాయ్: ఆకాశ హర్మ్యాలకు కేరాఫ్ అయిన యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్.. మరో ఘనతను దక్కించుకోబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనానికి దుబాయ్ వేదిక కాబోతోంది. దుబాయ్ పరిధిలో ఆర్థిక ప్రాంతంగా పేరున్న ‘బిజినెజ్ బే’లో వంద ఫ్లోర్లతో నిర్మించిన ఈ హైపర్‌టవర్ గిన్నిస్ రికార్డు ఘనతను సొంతం చేసుకోవడానికి సిద్ధమైంది. అంతకు ముందు ఈ రికార్డు న్యూయార్క్ నగరం(అమెరికా) మాన్‌హట్టన్ 57వ స్ట్రీట్‌లోని సెంట్రల్ పార్క్ టవర్ పేరిట ఉంది. ఆ భవనంలో 98 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక.. ఎత్తు 472 మీటర్ల రికార్డును సైతం దుబాయ్ హైపర్‌టవర్ అధిగమించనుంది. కేవలం ఎత్తులోనే కాదు.. అత్యంత విలాసవంతమైన నివాస భవనంగానూ ఇది రికార్డు సృష్టించడానికి సిద్ధమైంది. సెంట్రల్ పార్క్ టవర్ దుబాయ్‌లో ఈ హైపర్‌టవర్‌ను ప్రపంచ రికార్డు నెలకొల్పే ఉద్దేశంతోనే నిర్మిస్తున్నట్లు నిర్మాణ కంపెనీలు మంగళవారం ప్రకటించాయి. ఎమిరేటి ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ ‘బింఘట్టి’, ప్రముఖ వాచ్‌మేకర్ కంపెనీ ‘జాకోబ్ అండ్ కో’ సంయుక్తంగా ఈ భవనాన్ని నిర్మించాయి. దీంతో.. ఈ భవనానికి బుర్జ్ బింఘట్టి జాకోబ్ అండ్ కో రెసిడెన్సీగా నామకరణం చేశారు. అగ్రభాగాలు.. డైమండ్ ఆకారంలో ఉండడం ఈ భవనానికి ఉన్న మరో ప్రత్యేకత కాగా, రాత్రిపూట మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుతురులో ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఈ ఆకాశ హర్మ్యం. పూర్తిగా డబుల్, త్రిబుల్ బెడ్ రూంలతో పాటు ప్రత్యేకమైన సదుపాయాలెన్నింటినో ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ. చివరి ఐదు ఫ్లోర్లలో అత్యంత విలాసవంతమైన పెంట్‌హౌజ్‌లను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ భవనం ప్రారంభ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇదీ చదవండి: మొట్టమొదటి ఆకాశ హార్మ్యం ఏది? ఎవరు కట్టారో తెలుసా? -
‘విజిట్’కు రప్పించి స్మగ్లింగ్ చేయిస్తున్నారు..
మోర్తాడ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో తక్కువ ధరకు లభించే బంగారాన్ని ఇక్కడికి అక్రమంగా తరలించడానికి స్మగ్లర్ల ముఠాలు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా స్థానిక ముఠాలు, గల్ఫ్ స్మగ్లర్లతో కలసి ఉపాధి పేరుతో నిరుద్యోగ యువతకు గాలం వేస్తున్నాయి. దుబాయ్, షార్జా తదితర ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి తమ దందాకు పావులుగా వాడుకుంటున్నాయి. విజిట్ వీసాలపై యూఏఈ వెళ్లిన తర్వాత వర్క్ వీసాలు ఇప్పిస్తామని స్మగ్లర్లు నమ్మిస్తున్నారు. వారి మాటలు నమ్మి విజిట్ వీసాలపై యూఏఈ వెళ్లిన యువకులకు తమ పథకంలో భాగంగా ఎలాంటి పని చూపకుండా ఖాళీగా కూర్చోబెడుతున్నారు. పని కోసం వేచిచూసి విసిగిపోతున్న యువకులు తాము ఇంటికి వెళ్తామని చెప్పగానే అలాంటి వారికి బంగారం దాచి ఉంచిన సూట్‌కేసులు, బ్యాగులను ఇచ్చి పంపిస్తున్నారు. ఎయిర్‌పోర్టులలో పట్టుబడినప్పుడు ఈ స్మగ్లింగ్ వ్యవహారంపై అవగాహన లేని అమాయకులు కటకటాల పాలవుతున్నారు. స్మగ్లర్లు మాత్రం తప్పించుకుంటున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దుబాయ్ నుంచి వేరువేరు విమానాల్లో వచ్చిన ముగ్గురు యువకుల నుంచి రూ.4 కోట్ల విలువ చేసే బంగారం కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. అంతకు ముందు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెంకు చెందిన అస్లాం అనే 19 ఏళ్ల యువకుడి నుంచి రూ.1.20 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని అతడిని రిమాండ్‌కు తరలించారు. ఈ రెండు ఘటనలను పరిశీలిస్తే బంగారం స్మగ్లర్లు తమ దందా కోసం కొత్తగా గల్ఫ్‌కు వెళ్లాలనుకునే యువతను లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. కంపెనీ వీసాలుంటేనే రండి..: వర్క్ వీసా ఇస్తే కంపెనీలో పని చేసుకుంటారని.. అలా కాకుండా విజిట్ వీసాతో రప్పించి పని చూపకుండా ఖాళీగా ఉంచితే ఇంటికి వెళ్తామని ఆ యువకులే స్వచ్ఛందంగా చెబుతారని స్మగ్లర్లు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లోనే బంగారం స్మగ్లింగ్ గుట్టు బయటపడుతుండగా అనేక సమయాల్లో బంగారం యథేచ్ఛగా అక్రమ రవాణా అవుతోందని తెలుస్తోంది. కాగా, యూఏఈలో విజిట్ వీసాలపై వచ్చిన వారికి పనులు సులభంగా దొరకడం లేదని, కంపెనీ వీసాలు ఉంటేనే రావాలని వలస కార్మికుల సంఘాల నాయకులు సూచిస్తున్నారు. స్మగ్లర్ల మాయమాటలు నమ్మి జైలు పాలుకావద్దని హెచ్చరిస్తున్నారు. -
యూఏఈ ప్రభుత్వం ఖుషీ ఖబర్.. స్పాన్సర్ లేకుండా సొంతంగా వ్యాపారం
మోర్తాడ్ (బాల్కొండ): విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే వలసదారులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం ఖుషీ ఖబర్ అందించింది. వీసా నిబంధనలను సవరిస్తూ యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయంతో ఆ దేశానికి వెళుతున్న వలసదారులకు అనేక రకాల ప్రయోజనాలు కలుగనున్నాయి. యూఏఈ పరిధిలోని దుబాయ్, అబుదాబి, అజ్మన్, షార్జా తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు సొంతంగా వ్యాపారం చేయాలనుకునే విదేశీయులకు ఆ దేశానికి చెందిన వారి ద్వారానే లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇలా స్పాన్సర్ మధ్యవర్తిత్వం ద్వారా వ్యాపారం చేయాలనుకుంటే 51 శాతం స్పాన్సర్ పెట్టుబడి, మిగిలిన 49 శాతం వలసదారుడు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో స్పాన్సర్ పెట్టుబడి పెట్టినా పెట్టకపోయినా వలసదారుడే మొత్తం పెట్టుబడి పెట్టి లాభాల్లో వాటాను పంచిపెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు స్పాన్సర్‌తో సంబంధం లేకుండా యూఏఈ ప్రభుత్వం అనుమతితో ఎవరైనా ఆ దేశంలో వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. విజిట్ వీసా గడువు 60 రోజులకు పెంపు విజిట్ వీసా కాలపరిమితి 30 రోజులే ఉండగా ఇప్పుడు 60 రోజులకు పెంచారు. అనుకోని సందర్భంలో ఉద్యోగం కోల్పోయినవారు వెంటనే ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఆరు నెలల వరకు అక్కడే ఉండి మరో కంపెనీలో పని వెతుక్కుని వీసాను రెన్యువల్ చేసుకోవచ్చు. గతంలో కంపెనీ ఉద్యోగం నుంచి తొలగిస్తే ఇంటికి రావడం లేదా కార్మికునిగా ఉండిపోయి పోలీసులకు దొరికితే కటకటాల పాలైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఐదు సంవత్సరాల మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా ఉన్నవారు వరుసగా మూడు నెలల పాటు యూఏఈలో ఉండవచ్చు. గ్రీన్ వీసా పొందినవారు తమకు ఉన్న పర్మిట్ పూర్తయితే రెన్యువల్ చేసుకోవడానికి ఆరు నెలల గడువును పొడిగించారు. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలను కల్పిస్తూ యూఏఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈనెల 3 నుంచి అమలులోకి వచ్చింది. యూఏఈకి వలస వెళుతున్న వారిలో భారతీయుల సంఖ్యనే అధికంగా ఉండటంతో వీసా నిబంధనల సవరణ ప్రయోజనాలు ఎక్కువ శాతం మనవారికే కలుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
Ban Vs UAE: గట్టి పోటీనిచ్చిన యూఏఈ! అఫిఫ్ అద్భుత ఇన్నింగ్స్! బంగ్లాదే పైచేయి!
United Arab Emirates vs Bangladesh, 1st T20I- Dubai: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్ అఫిఫ్ హొసేన్ అదరగొట్టాడు. దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 55 బంతుల్లో అతడు 7 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగతా ఆటగాళ్లంతా విఫలమైన వేళ విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయం అందించాడు. తద్వారా మొదటి టీ20లో గెలుపుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ముందంజలో నిలిచింది. అదరగొట్టిన యూఏఈ బౌలర్లు.. కానీ! ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. యూఏఈ బౌలర్ల ధాటికి బంగ్లా టాపార్డర్ కుప్పకూలింది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో వచ్చిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అఫిఫ్ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడి 77 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది నురుల్ హసన్ బృందం. ఉత్కంఠ పోరులో ఆఖరికి! ఇక లక్ష్య ఛేదనలో యూఏఈ తడబడింది. ఓపెనర్ చిరాగ్ సూరి శుభారంభం అందించినా మిగతా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆఖరల్లో కార్తిక్ మయప్పన్(12), జునైద్ సిద్ధిఖీ(11) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 19.4 ఓవర్లలో 151 పరుగులకు యూఏఈ ఆలౌట్ కావడంతో 7 పరుగుల తేడాతో విజయం బంగ్లాదేశ్‌ను వరించింది. ఇక ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించిన అఫిఫ్ హొసేన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ దూరంగా ఉండటంతో నరుల్ హసన్ సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. చదవండి: Rohit Sharma- Virat Kohli: పట్టరాని సంతోషం.. కోహ్లి- రోహిత్ ఆలింగనం.. వీడియో వైరల్ Ind Vs Aus 3rd T20- Rohit Sharma: పంత్‌ను అందుకే ఆడించలేదు; హైదరాబాద్‌లో మ్యాచ్ ప్రత్యేకం.. ఎందుకంటే! -
I2U2 Summit: భారత్‌లో యూఏఈ పెట్టుబడులు
ఐ2యూ2 ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా సమీకృత ఫుడ్‌పార్కుల అభివృద్ధికి 2 బిలియన్ డాలర్లు (రూ.1.60 లక్షల కోట్లు) ఖర్చు చేస్తామని ప్రకటించింది. అలాగే గుజరాత్లో హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుకు ఐ2యూ2 భాగస్వామ్య దేశాలు ఆసక్తి కనబర్చాయి. ఫుడ్‌పార్కుల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను భారత ప్రభుత్వం సమకూర్చనుంది. ఈ పార్కులతో రైతులను అనుసంధానించనున్నారు. సదస్సు అనంతరం ఐ2యూ2 కూటమి ఒక ప్రకటన జారీ చేసింది. ‘అగ్రికల్చర్ ఇన్నోవేషన్ మిషన్ ఫర్ క్లైమేట్ ఇనీషియేటివ్’పై ఆసక్తి చూపిన భారత్‌ను అమెరికా, యూఏఈ, ఇజ్రాయెల్ స్వాగతించాయి. -
యూఏఈ నూతన అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌కు కొత్త అధ్యక్షుడిగా అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని శనివారం అక్కడి మీడియా అధికారికంగా ప్రకటించింది. అనారోగ్య సమస్యలతో యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ను ఇప్పుడు అధికారికంగా యూఏఈ అధ్యక్షుడిగా ప్రకటించారు. షేక్ ఖలీఫా పదవిలో ఉన్నప్పటికీ ఆయన అనారోగ్యం కారణంగా.. చాలా ఏళ్ల నుంచి షేక్ మొహమ్మద్ బిన్నే పాలన వ్యవహారాలను చూసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. షేక్ ఖలీఫా మరణంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. షేక్ మొహమ్మద్‌ను ఎంబీజీగా వ్యవహరిస్తుంటారు. అధ్యక్ష ప్రకటన నేపథ్యంలో.. UAE యొక్క ఏడు ఎమిరేట్స్ పాలకులతో కూడిన ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ సభ్యులను కలుసుకున్నారాయన. ఎన్నో మార్పులు.. ఎడారి సంప్రదాయ దేశం యూఏఈ గడ్డ మీద ఎన్నో సంస్కరణలకు తాత్కాలిక అధ్యక్షుడి హోదాలోనే షేక్ మొహమ్మద్ కారణం అయ్యారు. అంతరిక్షంలోకి యూఏఈ పౌరుడ్ని పంపడం, మార్స్ పరిశోధనలో భాగం కావడం, మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్‌ను ప్రారంభించడం, విదేశాంగ విధానాలను మెరుగు పర్చడం లాంటి ఎన్నో పనులు చేశారు. అమెరికా జోక్యాన్ని తగ్గించడం, ఇజ్రాయెల్‌తో సంబంధాలు, యెమెన్ యుద్ధంలో పాల్గొనడం లాంటి కీలక పరిణామాలెన్నో చోటుచేసుకున్నాయి కూడా. చదవండి👉🏼: యూఏఈ అధ్యక్షుడి కన్నుమూత! -
ఆస్ట్రేలియా, యూఏఈలతో వ్యాపారాభివృద్ధి
చెన్నై: ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)లతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వ్యాపార ఒప్పందాల (ఎఫ్‌టీఏ) ద్వారా ఒనగూడే వాణిజ్య అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశీయ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా ఆయా దేశాల్లో భాగస్వాములను గుర్తించాలని కూడా పిలుపునిచ్చారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఇక్కడ నిర్వహించిన ‘స్టేక్‌హోల్డర్స్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్’లో సీతారామన్ ఈ మేరకు కీలక ప్రసంగం చేశారు. ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ), ఆస్ట్రేలియాతో ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకాలు చేయడంతో, ఇప్పుడు ఆ రెండు దేశాలలో ‘‘తమ జాయింట్ వెంచర్ భాగస్వామి‘ని గుర్తించడం పరిశ్రమలకు కీలకం. ఇది ఆయా దేశాల్లో వ్యాపారావకాశాలను పెంచుతుంది. యూఏఈలో వ్యాపారవేత్తలు భారత్‌లో 75 బిలియన్ డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టేందుకు సింద్ధంగా ఉన్నారు. ► ఆరేడేళ్ల క్రితం తమిళనాడు పర్యటనకు వచ్చినప్పుడు, భారతదేశం ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశలో ముందడుగు వేయాలని పలు సూచనలు వచ్చాయి. ఈ రోజు భారత్ యూఏఈ, ఆస్ట్రేలియాతో ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ► స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం ఆస్ట్రేలియాతో 10 ఏళ్లకు పైగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఒప్పందం కేవలం 88 రోజుల్లోనే కుదరడం భారత్ ప్రభుత్వం ఈ విషయంలో సాధించిన పురోగతికి నిదర్శనం. ఇండో–పసిఫిక్ స్ట్రాటజిక్ ఫ్రేమ్‌వర్క్‌లో ఆస్ట్రేలియా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ► కంపెనీ లేదా ఇతర ఏదైనా సంస్థ తన కార్యకలాపాలలో పారదర్శకంగా ఉండాలి. కంపెనీలోని పెట్టుబడిదారులుసహా అన్ని వివరాలు ‘‘పబ్లిక్ డొమైన్’’లో అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఆయా అంశాలే పరిశ్రమ కార్యకలాపాలకు సంబంధించి పారదర్శకతను పెంపొందిస్తాయి. ► కేంద్రం పరిశ్రమకు తన పూర్తి సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. పన్ను విధానాల్లో ప్రభుత్వం సూచించిన పారదర్శక పద్దతులు పాటిస్తూ, పన్నులు చెల్లిస్తే ఎటువంటి తనిఖీలూ ఉండవు. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నందున భారత్ పరిశ్రమ ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తగిన అన్ని చర్యలూ తీసుకోవాలి. పరిశ్రమకు ఇది చాలా కీలకం. ► చాలా మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చారు. ఈ సమావేశానికి చాలా ఆసక్తితో హాజరు కావడానికి సమయం తీసుకున్నారు. మనం మన కార్యకలాపాలలో పారదర్శకతను తీసుకురావడం, సాంకేతికతను పెంచడం వంటి చర్యల ద్వారా వ్యాపారాన్ని వేగంగా వృద్ధిబాటన నడపగలుగుతాము. ► కంపెనీలు ఇతర దేశాలలో వ్యాపార సంబంధాలు నెరపడానికి గతంలో పలు అవరోధాలను ఎదుర్కొనాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. ఎటువంటి అవరోధాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏ విషయంలోనైనా ప్రభుత్వం తన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. పరిశ్రమకు విద్యుత్ కష్టాలు రానీయకండి...రాష్ట్రాలకు సూచన కాగా, పరిశ్రమలకు విద్యుత్ కష్ట నష్టాలు రానీయద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికమంత్రి విజ్ఞప్తి చేశారు. తగిన రేట్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరాలు చేయాలని ఆమె ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. 24 గంటలై 365 రోజులు పరిశ్రమకు విద్యుత్ అందేలా చర్యలు ఉండాలన్నారు. ఇందుకు తగిన మౌలిక ఇంధన ప్రణాళికను రూపొందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ పురోగతికి ఇది కీలకమని పిలుపునిచ్చారు. ఈ దిశలో రాష్ట్రాలకు కేంద్రం తగిన సహాయ సహకారాలను పూర్తిస్థాయిలో అందిస్తుందని భరోసాను ఇచ్చారు. దేశ మౌలిక రంగం పురోగతికి 2021–22 బడ్జెట్‌తో పోల్చితే 2022–23 బడ్జెట్లో నిధుల కల్పనను రూ.5.5 లక్షల కోట్ల నుంచి రూ.7.5 లక్షల కోట్లకు పెంచిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం 50 ఏళ్లపాటు రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాన్ని అందజేస్తామని బడ్జెట్లో ప్రకటించామనీ తెలిపారు. -
భారత్‌లో పెట్టుబడులు పెట్టండి
అబుదాబి: పెట్టుబడులు పెట్టేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వద్ద పుష్కలంగా నిధులు ఉన్నాయని, ఇన్వెస్ట్ చేయడానికి భారత్‌లో అపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. కనెక్టివిటీ, కృత్రిమ మేధ, కొత్త టెక్నాలజీలు, డేటా అనలిటిక్స్ వంటి వివిధ రంగాల్లో ఇరు దేశాలు పనిచేయగలవని ఆయన పేర్కొన్నారు. ఇండియా–యూఏఈ స్టార్టప్ ఫోరం 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘యూఏఈ వద్ద పెట్టుబడుల సామర్థ్యాలు ఉన్నాయి. భారీ మార్కెట్ రూపంలో భారత్ .. పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా నిలుస్తోంది. కాబట్టి ఇరు దేశాలకు ఒకదానితో మరొకదానికి పోటీ లేదు. రెండూ భాగస్వాములుగా కలిసి పనిచేయవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. అంకుర సంస్థలకు సదుపాయాలు కల్పించడంతో పాటు స్టార్టప్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఉందని, నంబర్ వన్ స్థానానికి చేరాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఆయన పేర్కొన్నారు. దుబాయ్ ఎక్స్పో సందర్భంగా భారత స్టార్టప్‌లకు మంచి స్పందన లభించిందని.. పలు అంకుర సంస్థలు నిధులను సమీకరించుకున్నాయని, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని గోయల్ చెప్పారు. అంకుర సంస్థలు తమ ఆవిష్కరణ ప్రయోజనాలు .. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు కూడా చేరువయ్యేలా చూడాలని ఆయన సూచించారు. -
అక్కడ యాక్సిడెంట్ ఫొటోలు, వీడియోలు తీస్తే జైలుకే!
నేరాలు, ఘోరాలు కళ్లెదుట జరుగుతున్నా, అడ్డుకోవడం సంగతి పక్కనపెడితే.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం తరచూ చూస్తుంటాం. అయితే ఇలాంటి చేష్టలను ఉపేక్షించబోయేది లేదంటూ ప్రకటించింది మిడిల్ ఈస్ట్ కంట్రీ యూఏఈ. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడ్డ వాళ్లను, చనిపోయినవాళ్లను వీడియోగానీ, ఫొటోలుగానీ తీస్తే కఠినంగా శిక్షించే చట్టం తీసుకొచ్చింది. ఇందుకుగానూ శిక్షగా లక్షా యాభై వేల దుబాయ్ దిర్హం నుంచి ఐదు లక్షల దిర్హంల దాకా జరిమానా. లేదంటే ఆరు నెలల జైలు శిక్ష. ఒక్కోసారి రెండూ విధించనున్నట్లు యూఏఈ సైబర్‌క్రైమ్ చట్టానికి సవరణ తీసుకొచ్చింది. జనవరి 2, 2022 నుంచే ఈ కొత్త చట్టం అమలులోకి వచ్చిందంటూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అధికారులకు మాత్రం సాక్ష్యాల సేకరణలో ఇందుకు మినహాయింపు మాత్రం ఉంటుంది. డిజిటల్ యుగంలో ఇలాంటి చేష్టలను ప్రొత్సహించడం మంచిది కాదు. రోడ్డు ప్రమాదాల్లో బాధితుల ఫొటోలు, వీడియోలు తీయడం, వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, ఇతరులకు ఫార్వార్డ్ చేయడం.. ఏదీ మంచిది కాదనే ఈ చట్టం తీసుకొచ్చాం అని చెబుతున్నారు అక్కడి అధికారులు. ఇంతేకాదు.. అవతలి వాళ్ల అనుమతులు లేకుండా వ్యక్తుల ఫొటోలు, వీడియోలు తీయడం లాంటి చేష్టలపై కూడా కొరడా ఝుళిపించేందుకు చట్టాలన్ని కఠినం చేసింది. ఇలాంటి చేష్టలకు ఏడాది జైలు శిక్షతో పాటు రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల దాకా దిర్హం జరిమానా, లేదంటే రెండూ విధిస్తారు. అలాగే డిజిటల్ స్టాకర్స్ (ఇంటర్నెట్లో వెంటాడి.. వేధించే నిందితులు)కు ఆరు నెలల జైలు శిక్ష, లక్షా యాభై వేల నుంచి ఐదు లక్షల దిర్హం దాకా జరిమానా లేదంటే రెండూ విధిస్తారు. -
భారత్–యూఏఈ బంధం బలోపేతం
న్యూఢిల్లీ: భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టమయ్యే కీలక ఒప్పందం శుక్రవారం జరిగింది. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) పేరుతో జరిగిన స్వేచ్చా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) పత్రాలపై భారత్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్, యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మరీ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సంతకాలు చేశారు. ఒప్పంద పత్రాలను ఒకరికొకరు మార్చుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, ఈ ఒప్పందం వల్ల రెండు దేశాలకూ బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని పేర్కొన్నారు.వస్తువులు, సేవలు, నిబంధనలు, కస్టమ్స్ విధానాలు, ప్రభుత్వ సేకరణ, మేధో సంపత్తి హక్కులు, ఈ–కామర్స్‌తో సహా పలు అంశాలు తాజా ఒప్పందం పరిధిలోకి వస్తాయని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఒప్పందం ప్రకారం రెండు దేశాలు గరిష్ట స్థాయి ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు తగ్గుతాయి. సేవలు, పెట్టుబడులకు సంబంధించి పలు నిబంధనలను సరళతరం అవుతాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో రెండు దేశాలు వాణిజ్య ఒప్పంద చర్చలను లాంఛనంగా ప్రారంభించాయి. కాగా, తాజా ఒప్పందంపై సంతకాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌లు ఒక వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ‘‘భారతదేశం–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం: కొత్త హద్దులు, మైలురాయి‘ అనే పేరుతో సంయుక్త విజన్ ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపు 60 బిలియన్ డాల ర్లు ఉంటే, ఇది వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ప్రపంచంలోని ఇతర దేశాలకు యూఏఈ ఒక గేట్వేగా ఉండడం మరో కీలక అంశం. స్మారక స్టాంప్ ఆవిష్కరణ: కాగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవడం, యూఏఈ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇరు దేశాల నాయకులు సంయుక్త స్మారక స్టాంప్‌ను విడుదల చేశాయి. అపార వాణిజ్య అవకాశాలు ఇది ఒక సమగ్ర, సమతౌల్య వాణిజ్య ఒప్పందం. దీనివల్ల రెండు దేశాలకూ అపార వాణిజ్య అవకాశాలు ఏర్పడతాయి. దైపాక్షిక వాణిజ్య సంబంధాలు రెట్టింపు అవుతాయి. – పీయూష్ గోయెల్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి -
అదృష్టాన్ని ఊహించగలమా?.. రూ. 44 కోట్లు గెల్చుకున్న లీనా
Kerala woman living in Abu Dhabi wins Big Ticket lottery Worth 44 Crores: నిజంగా అదృష్టాన్ని ఊహించగలమా? అలాంటి నమ్మకమే లేని ఓ యువతి.. సరదాగా తన కొలీగ్స్‌తో కలిసి టికెట్ కొన్న ఆ భారతీయ యువతికి జాక్‌పాట్ తగిలింది. అదీ కలలో కూడా ఆమె ఊహించని రేంజ్లో.. ఏకంగా 44 కోట్ల రూపాయల లాటరీ తగిలింది ఆమె టికెట్ మీద!. సౌదీ కంట్రీస్‌లో భారీ ప్రైజ్ మనీ లాటరీలు సర్వసాధారణం. అలాంటి జాక్‌పాట్ ఓ కేరళ యువతిని వరించింది. ఫిబ్రవరి 3న బిగ్ టికెట్ అబుదాబీ వీక్లీ డ్రా నిర్వహించారు. అందులో ఏకంగా 22 మిలియన్ల దీరామ్స్(మన కరెన్సీలో 44 కోట్ల 73 లక్షల 52 వేల 598 రూపాయల దాకా) ఆమె టికెట్ గెల్చినట్లు ప్రకటించారు. ఆమె పేరు లీనా జలాల్. లీనా స్వస్థలం కేరళ త్రిచూర్. అంజన్ గడి ప్రాంతానికి చెందిన ఆమె, ఉద్యోగరీత్యా గత నాలుగేళ్లుగా అబుదాబిలో ఉంటోంది. అబుదాబిలో షోయిదార్ ప్రాజెక్ట్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎల్ఎల్ సీ అనే కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తోంది. ఈ మధ్య తన పది మంది ఆఫీస్ సహచరులతో కలిసి Terrific 22 million series 236లో భాగంగా ఆమె టికెట్ కొన్నది. తాజాగా డ్రా తీయగా, లీనా జలాల్ కొనుగోలు చేసిన టికెట్ కు రూ.44 కోట్ల భారీ ప్రైజ్ మనీ దక్కింది. అయితే, ఆ టికెట్ ను ఆమె తనతో పాటు ఆఫీసులో పనిచేసే మరో తొమ్మిది మందితో కలిసి కొనుగోలు చేసింది. దాంతో, ఆ ప్రైజ్ మనీని ఇప్పుడు వారందరూ పంచుకోనున్నారు. అయినప్పటికీ, ఒక్కొక్కరికి రూ.4 కోట్లు దాకా వస్తుంది. దీనిపై లీనా జలాల్ మాట్లాడుతూ.. లాటరీ తగిలిందని చెప్పగానే, తొలుత నమ్మలేకపోయానని వెల్లడించింది. తనకు మాటలు రావడంలేదని, దేవుడికి రుణపడి ఉంటానని తెలిపింది. అయితే, ఈ డబ్బును ఏంచేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని, కుటుంబ సభ్యులను అడిగిన తర్వాత నిర్ణయించుకుంటానని లీనా తెలిపింది. మరో నలుగురూ భారతీయులే.. బిగ్ టికెట్ అబుదాబీ వీక్లీ డ్రాలో లీనా కాకుండా గెలిచిన మరో నలుగురు కూడా భారతీయులే కావడం విశేషం. సెకండ్ ప్రైజ్‌ను సురాయిఫ్ సురు(2 కోట్ల రూ. పైగా), సిల్జోహ్న్ హోయాన్నన్ (కోటికి పైగా), నాలుగో ప్రైజ్ అన్జర్ సుక్కారియా(యాభై లక్షల రూ.), ఐదో ప్రైజ్ దివ్య (20 లక్షలరూ.) దక్కాయి. బంగ్లాదేశ్‌కు చెందిన నజీర్ అనే వ్యక్తికి రేంజ్ రోవర్ ఎవోక్యూ దక్కింది. మార్చి 3న ఈ ప్రైజ్‌మనీని, గిఫ్ట్‌ను అందించనున్నారు. -
దుబాయ్ దూకుడు.. సాహసోపేత అడుగులు
Dubai Sucessfully Deployed AI Tech In Govt Sectors: ఆయిల్ కంట్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నగరం దుబాయ్.. గత ఏడాది కాలంగా అరుదైన ప్రయోగాలతో ప్రపంచాన్ని అచ్చెరువుకు గురి చేస్తోంది. ఆవిష్కరణల భాండాగారంగా ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తోంది. విప్లవాత్మక సంస్కరణలతో దూసుకుపోతున్న దుబాయ్.. ఇప్పుడు సాహసోపేతమైన అడుగులకు సైతం వెనకాడడం లేదు. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ఈ టెక్నాలజీ అవసరం దాదాపు అన్ని రంగాల్లో అవసరం పడుతోంది. మనకు తెలియకుండానే వాడేస్తున్నాం కూడా!. ప్రైవేట్ రంగాల్లో దాదాపు ఏఐ సహకారం లేకుండా ముందుకు సాగడం లేదు. అయితే ప్రభుత్వ రంగాలు మాత్రం పూర్తిస్థాయిలో ఏఐని ఉపయోగించుకునేందుకు తటపటాయిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం.. భద్రత. ఈ తరుణంలో దుబాయ్ సర్కార్ ఏమాత్రం బెణుకు ప్రదర్శించకుండా ముందుకు సాగుతోంది. ప్రమాదం లేకపోలేదు AI టెక్నాలజీ వాడకం ఇప్పుడు ఎంత ఉధృతంగా నడుస్తోందో.. సమీప-కాలంలో అంతే ఆందోళనను రేకెత్తిస్తోంది. గోప్యత, పారదర్శకత, అసమానత, భద్రత.. ఈ అంశాలు పెను సవాల్‌గా మారాయి. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీలో పుట్టుకొస్తున్న బెదిరింపులు, ఇతర పోకడలను సైతం గుర్తించింది CSER పరిశోధన. అంతేకాదు AI, డిజిటలైజేషన్, న్యూక్లియర్ వెపన్స్ సిస్టమ్‌ల తరపున ఎదురయ్యే ముప్పును సైతం ప్రస్తావించింది. ప్రధానమైన అంశాలు కావడం వల్లే అమెరికా లాంటి అగ్రరాజ్యాలు సైతం ఏఐను రక్షణ రంగంలో అన్వయింపజేసేందుకు ముందు వెనకా ఆలోచిస్తుంటుంది. అయితే.. ఎలా అధిగమిస్తోందంటే.. వనరులను, మేధస్సును వాడుకోవడంలో దుబాయ్ నిజంగానే అద్భుతాలు చేస్తోంది. అసలే టెక్నాలజీ కొత్తైన ఈ సిటీ.. అవసరం మేర మాత్రమే ఏఐను ఉపయోగించుకోవడంపై ఫోకస్ చేసింది. ఆరోగ్యభద్రత, విద్య, రవాణా, ప్రజా భద్రత విషయంలో ఏఐ సంబంధిత టెక్నాలజీనే ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టింది. ప్రజల దైనందిన జీవితంలోకి జొప్పించి.. అలవాటు చేయిస్తోంది. స్మార్ట్దుబాయ్ ఆఫీస్‌ల సహకారంతో ఎన్నో వ్యూహాల నడుమ కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. ఏఐ, బ్లాక్కెయిన్ ద్వారా ప్రభుత్వ సేవల్ని అందించడమే కాకుండా.. జనాల ఫీడ్‌బ్యాక్‌ను సైతం తీసుకుంటోంది. తద్వారా ఎదురయ్యే పరిణామాల్ని ఎదుర్కొనేందుకు పటిష్ట వ్యవస్థను సిద్ధం చేసుకుంటోంది. వీటికి తోడు ఎథికల్ టూల్ కిట్స్ ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తోంది. హైలెవల్ సర్వీసులు కావడంతో ఏఐ అల్గారిథమ్ పొరపచ్చాలతో తప్పులు దొర్లే అవకాశమూ లేకపోలేదు. ఇందుకోసం భారీగా ఇంజినీర్లను నియమించుకుంటోంది కూడా. 2030 నాటికి ఏఐ సంబంధిత వ్యవస్థ కోసం 320 బిలియన్ డాలర్ల ఖర్చు పెట్టే యోచనలో ఉన్నాయి మిడిల్ ఈస్ట్ దేశాలు. ఈ అవకాశం అందిపుచ్చుకోవాలనే ఆలోచనలో ఉంది దుబాయ్ మహానగరం. దుబాయ్ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. కానీ, ఆనందం అంటే కేవలం ఎక్కువ డబ్బును కలిగి ఉండడం కాదు. గ్లోబలైజ్డ్ వరల్డ్‌లో కమ్యూనిటీతో ఎలా పొత్తు పెట్టుకోవాలి? సామాజిక అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎలా పని చేయాలి? అనే విషయాలపైనే దుబాయ్ ఫోకస్ పెట్టింది. అలా దుబాయ్.. ఈ భూమిపై అత్యంత సంతోషకరమైన నగరంగా స్థానం సంపాదించుకునే మార్గం వైపు వెళ్తున్నట్లు కనిపిస్తోందని ఆర్థిక మేధావులు ఒక అంచనాకి వేస్తున్నారు. క్లిక్ చేయండి: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌లో దూసుకుపోతున్న హైదరాబాద్ -
యూఏఈ సంచలన చట్టం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం. దశాబ్దాలుగా సాగుతున్న ‘కుటుంబాల వ్యాపార’ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా కొత్త చట్టం తీసుకురాబోతోంది. ఒకవేళ చట్టం విదేశీ కంపెనీలు నేరుగా అక్కడ వ్యాపారలావాదేవీలు నిర్వహించుకునే అవకాశం కలగనుంది. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. యూఏఈలో చాలాఏళ్లుగా కొన్ని కుటుంబాల చేతుల్లోనే వ్యాపార సామ్రాజ్యం నడుస్తోంది. కమర్షియల్ ఏజెన్సీ అగ్రిమెంట్ల సాయంతో విదేశీ కంపెనీలన్నింటిని ఈ కుటుంబాలే నడిపిస్తూ వస్తాయి . అయితే ఆ అగ్రిమెంట్ల ఆటోమేటిక్ రెన్యువల్‌కు పుల్‌స్టాప్ పెట్టేలా యూఏఈ ప్రభుత్వం కొత్త చట్టం తేనుంది. ఇప్పటికే చట్ట రూపకల్పన జరిగిపోయిందని, ఎమిరేట్స్ నాయకత్వం దానిని ఆమోదం తెలపడం మాత్రమే మిగిలిందని ఆ కథనం వెల్లడించింది. అయితే ఎప్పటిలోపు ఆ చట్టం తీసుకురాబోతున్నారన్న విషయంపై మాత్రం స్పష్టత కొరవడింది. ఇదిలా ఉంటే ఈ గల్ఫ్ దేశంలో ఎక్కువ శాతం వ్యాపారాలు, ఇతర కమర్షియల్ యాక్టివిటీస్ కూడా కొన్ని కుటుంబాల చేతుల్లోనే నడుస్తున్నాయి. హోటల్ ఫ్రాంచైజీల దగ్గరి నుంచి కార్ డీలర్‌షిప్‌ల దాకా ప్రతీది కొన్ని కుటుంబాలే నడిపిస్తున్నాయి. ఒకవేళ తాజా చట్టం గనుక అమలులోకి వస్తే మాత్రం.. విదేశీ కంపెనీలకు ఊరట కలగనుంది. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే యోచనలో ఉన్నాయి కొన్ని కుటుంబాలు. చదవండి: వీకెండ్ సెలవుల్ని మార్చేసిన యూఏఈ. ఎప్పుడో తెలుసా? -
అరుదైన ఘనత.. చరిత్ర సృష్టించిన దుబాయ్
UAE City Dubai world's first govt to go 100% paperless: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ నగరం దుబాయ్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి 100 శాతం పేపర్‌లెస్ గవర్నమెంట్ ఖ్యాతి దక్కించుకుంది. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల సేవలను, ట్రాన్జాక్షన్స్ను ‘డిజిటల్ ఫార్మట్’లోనే కొనసాగిస్తూ.. ఈ ఘనత అందుకుంది దుబాయ్ నగరం. వంద శాతం ‘పేపర్‌లెస్’ సాధించిన తొలి ప్రభుత్వంగా దుబాయ్ సిటీ నిలిచింది. ఈ మేరకు ఎమిరేట్స్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. తద్వారా 14 మిలియన్ గంటల మనిషి శ్రమను.. 1.3 బిలియన్ దిర్హమ్(350 మిలియన్ డాలర్లు) ఆదా చేసినట్లు పేర్కొన్నారాయన. ప్రభుత్వానికి సంబంధించి ఇంటర్నల్, బయటి ట్రాన్జాక్షన్స్తో పాటు.. ప్రభుత్వానికి సంబంధించి ప్రతీ సేవలను డిజిటల్ పద్దతిలో.. అదీ ప్రభుత్వ వేదికల మీదుగానే సాగిందని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించుకుంది. మొత్తం 45 ప్రభుత్వ రంగాల్లో 1,800 రకాల డిజిటల్ సేవలను .. అదీ ఆలస్యం అవ్వకుండా డిజిటల్ ఫార్మట్‌లో ప్రజలకు చేరవేయడం విశేషం. ఈ క్రమంలో నగరవాసులపై ప్రభుత్వం ఏమాత్రం ఒత్తిడి చేయకుండా.. స్వచ్ఛందంగా ఈ ఘనత సాధించింది. పేపర్‌లెస్ ఘనత ప్రపంచానికి డిజిటల్ క్యాపిటల్‌గా నిలవడానికి దుబాయ్‌కు ఎంతో ప్రొద్భలం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు క్రౌన్ ప్రిన్స్. అంతేకాదు మరో ఐదు దశాబ్దాలపాటు అత్యాధునిక వ్యూహాలతో దుబాయ్‌లో డిజిటల్ లైఫ్ కొనసాగేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారాయన. ఇదిలా ఉంటే అమెరికా(ఖండాలు), యూకే, యూరప్ దేశాల్లో ప్రభుత్వాలు ఈ తరహా విధానానికి మొగ్గు చూపించినప్పటికీ.. సైబర్ దాడుల భయంతో వెనక్కి తగ్గాయి. కానీ, దుబాయ్ మాత్రం ధైర్యం చేసి ముందడుగు వేసి.. ఈ ఫీట్ సాధించింది. ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ మూమెంట్‌తో 336 మిలియన్ పేపర్లను, 1.3 బిలియన్ దిర్హమ్(350 మిలియన్ డాలర్లు) బడ్జెట్‌ను, 14 మిలియన్ గంటల ఉద్యోగుల శ్రమను మిగిల్చింది దుబాయ్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే ప్రపంచంలో రిచ్చెస్ట్ సిటీల్లో ఒకటిగా ఉన్న దుబాయ్ జనాభా 35 లక్షలు కాగా.. మెట్రో ఏరియాలో జనాభా 29 లక్షలకు పైనే ఉంది. చదవండి: అర్జెంటీనా టు అస్సాం వయా దుబాయ్.. ఖరీదు 20లక్షలకుపైనే! -
వలస కార్మికులకు ఉచిత వీసాలు
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని కొన్ని కంపెనీలు వలస కార్మికులకు తిరిగి స్వాగతం చెబుతున్నాయి. గతంలో వీసాల జారీ కోసం రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు చార్జీలు వసూలు చేసిన ఏజెన్సీలు ప్రస్తుతం ఉచిత రిక్రూటింగ్‌ను చేపట్టాయి. కరోనా కారణంగా కంపెనీలు భారీ సంఖ్యలో కార్మికులను ఇళ్లకు పంపించేయడంతో అనేక పోస్టులు ఖాళీ అయ్యాయి. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, కంపెనీల కార్యకలాపాలు ఊపందుకోవడంతో ఇప్పుడు వలస కార్మికుల సేవలు అత్యవసరం అయ్యాయి. దీంతో యూఏఈ పరిధిలోని దుబాయ్, అబుదాబి ఎయిర్‌పోర్టులలో క్లీనింగ్ పని కోసం పలు ఏజెన్సీలు కార్మికులను తరలిస్తున్నాయి. నిజామాబాద్, జగిత్యాల్, ఆర్మూర్‌లలో ఒక ఏజెన్సీ కొన్ని రోజులుగా ఉచిత రిక్రూటింగ్‌ను కొనసాగిస్తోంది. కేవలం రూ.5 వేలను సర్వీస్ చార్జీలుగా వసూలు చేస్తూ ఉచిత వీసా, ఉచిత విమాన టికెట్లను ఇచ్చి యూఏఈ పంపిస్తోంది. గతంలో గల్ఫ్ దేశాలకు వలసలు మొదలైన ఐదు దశాబ్దాల కింద ఉచిత రిక్రూటింగ్ జరిగింది. ఇదిలాఉండగా ఇక్కడి వారికి ఉచిత నియామకాలపై అవగాహన లేకపోవడంతో మన ప్రాంతంలో కొనసాగుతున్న ఇంటర్వూ్యలకు పొరుగు రాష్ట్రాల కార్మికులు హాజరవుతుండటం విశేషం. ఇప్పటివరకు ఏపీ, కేరళ రాష్ట్రాలకు చెందిన దాదాపు 2వేల మందిని యూఏఈ తరలించినట్లు ఏజెన్సీ నిర్వాహకులు వివరించారు. -
అఫ్గాన్ బోర్డర్ దాటించడానికి ‘పెళ్లిళ్లు’ చేస్తున్నారు..!
కాబుల్: అఫ్గానిస్తాన్ మహిళల పరిస్థితి రోజుకో మలుపు తిరుగుతోంది. తాలిబన్ల నుంచి తప్పించుకొనేందుకు కుటుంబ సభ్యులు తమ ఇంట్లో ఉన్న యువతులకు వివాహం చేసి మరీ బోర్డర్ దాటించే ప్రయత్నం చేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తరలింపు కేంద్రంలో వెలుగుచూసిన ఈ మానవ అక్రమ రవాణా ఉదంతంపై అమెరికా దౌత్య అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కాబుల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో.. అఫ్గాన్ నుంచి పారిపోవడానికి, కొన్ని కుటుంబాలు డబ్బులు చెల్లించీ మరీ పెళ్లి కొడుకుల్ని వెదుకుతున్నారు. వారికి భర్తలను చూసి దేశం దాటించేందుకు యత్నాలు ముమ్మరం చేశారు. చదవండి: Solar Storm: ‘కరోనా’తో పోలిక.. మహా తుపానుతో భారీ డ్యామేజ్!. మనకేం ఫరక్ పడదు ఈ ఘటనలు తాలిబన్ల కిరాతక పాలన నుంచి తప్పించుకోవాలనే అక్కడి మహిళల పరిస్థితికి అద్దం పడుతోంది. అమెరికా దౌత్యాధికారులు ఇటువంటి మానవ అక్రమ రవాణా సంఘటనలను గుర్తించి వారికి సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. కాగా అమెరికా దళాలు ఆగస్ట్ 30న అఫ్గన్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీనితో 20 యేళ్ళ సుదీర్ఘ యుద్ధానికి తెరపడింది. అయితే తాలిబన్ల పాలన ప్రారంభమయ్యాక మహిళల కనీస హక్కులులేని గత తాలిబన్ పాలనను గుర్తుచేసేలా ఉంది. అంతేకాకుండా మగ కుటుంబ సభ్యుడు లేని మహిళల ప్రయాణాలను తాలిబన్లు నిషేధించారు. ఈ పరిస్థితుల్లో కొన్ని పైవేటు గ్రూపులు తాలిబన్లు తమను వెంటాడుతున్నారని తెలిస్తే తప్ప దేశం సరిహద్దులు దాటవద్దని సూచించారు.దాంతో కుటుంబ సభ్యులు తమ పిల్లలకు ఇలా బలవంతంగా వివాహం చేసి మరీ పంపిస్తున్నారు. చదవండి: Hibatullah Akhundzada: అఫ్గాన్ సుప్రీం లీడర్‌గా అఖుంద్జాదా -
ఘనీ, భుట్టో, శినావత్రా... వీళ్లంతా యూఏఈకే ఎందుకు?!
న్యూఢిల్లీ: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను వశం చేసుకోగానే అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ దేశం విడిచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు పారిపోయారు. మానవతా దృక్పథంతో తాము ఘనీకి ఆశ్రయం ఇచ్చినట్లు యూఏఈ ప్రకటించింది కూడా. నిజానికి ఆ దేశం కేవలం ఘనీ ఒక్కరికే కాదు.. ఆయనలా శరణార్థులుగా వచ్చిన ఎంతో మంది దేశాధినేతలకు, ప్రముఖులకు ఆశ్రయం ఇచ్చింది. ఎందుకు వీళ్లంతా యూఏఈనే తమకు సురక్షిత స్థావరమని భావించారు? ఆ దేశం సైతం వారి రాకను స్వాగతించడం వెనుక కారణాలేంటి?! ఎందుకు యూఏఈకే? గల్ఫ్ దేశమైన యూఏఈకి అమెరికాతో సత్సంబంధాలే ఉన్నాయి. ముఖ్యంగా భద్రతాపరమైన విషయాల్లో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంది. అగ్రరాజ్యంతో మెరుగైన ద్వైపాక్షిక బంధాలు ఉండటం యూఏఈకి కలిసి వచ్చే అంశం. కాబట్టి, అక్కడికి వెళ్తే సురక్షితంగా ఉండవచ్చని అమెరికాతో వైరం లేని పెద్దలు భావించడం సహజం. అంతేకాదు, పెద్ద సంఖ్యలో చమురు నిల్వలు కలిగి ఉన్న ఈ గల్ఫ్ దేశంలో అండర్‌గ్రౌండ్ స్థావరాలు కూడా ఎక్కువే ఉంటాయి. ఎయిర్‌పోర్టుల్లో కూడా ఐరిస్ స్కానింగ్, భారీ సంఖ్యలో సెక్యూరిటీ కెమెరాలు, 24 గంటల పర్యవేక్షణ వంటి అంశాలు కూడా పారిపోయి వచ్చిన ఒకప్పటి దేశాధినేతలను ఆకర్షించే అంశాలు. ఇక యూఈఏలో విలాసాలకు కొదువ లేదు. అత్యాధునిక ఫైవ్‌స్టార్ హోటళ్లు, సకల సౌకర్యాలతో కూడిన భవనాలు, ఇతర వినోదాలు పంచే ప్రదేశాలు కోకొల్లలు. దేశం విడిచి వచ్చే సమయంలో తెచ్చుకున్న సొమ్మును ఖర్చు చేసేందుకు, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేందుకు ఇక్కడ అనువైన పరిస్థితులు ఉంటాయని విశ్లేషకుల అభిప్రాయం. తద్వారా ఇటు ఆశ్రయం కల్పించిన యూఏఈకి, అటు శరణుజొచ్చి వచ్చిన వారికి.. ఉభయులకు లాభదాయకమే. యూఏఈకి కలిగే ప్రయోజనమేమిటి? అజ్ఞాతంలో ఉన్న నేతల దశ తిరిగి ఒకవేళ మళ్లీ అధికారం చేపట్టినట్లయితే.. రాజకీయంగా, దౌత్యపరంగా సత్పంబంధాలు కొనసాగే అవకాశం ఉంటుంది. సంక్షోభ సమయంలో ప్రముఖులను ఆదుకోవడం, వారికి భద్రత కల్పించడం ద్వారా తాము నమ్మకమైన భాగస్వామినని నిరూపించుకుంటూ.. తదనంతర ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ విషయాల గురించి క్రైసిస్ గ్రుపునకు చెందిన మిడ్ఈస్ట్ అడ్వైజర్ దీనా ఎస్ఫాన్‌డియరీ ఏపీతో మాట్లాడుతూ.. ‘‘సంక్షోభంలో ఉన్న వారిని ఆదుకునే క్రమంలో ఏ దేశమైనా సరే తనను తాను గొప్ప ఉదారవాదిగా చిత్రీకరించుకోవడం సహజం. ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. ఎవరూ ఇందుకు అతీతం కాదు’’ అని వ్యాఖ్యానించారు. మిత్రదేశమైన అమెరికా సైనిక విన్యాసాలకు, ప్రయాణాలకు అనువైన పరిస్థితులు కల్పించే యూఏఈ.. తాను రిలయబుల్ పార్ట్నర్ అని నిరూపించుకునే క్రమంలో కూడా ఘనీకి ఆశ్రయం ఇచ్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఘనీకి ముందు వీళ్లు సైతం.. గత కొన్నేళ్లుగా యూఏఈలో అజ్ఞాతవాసం చేస్తున్న మాజీ దేశాధినేతల జాబితాలో ఇప్పుడు అశ్రఫ్ ఘనీ కూడా చేరారు. ఆయన కంటే ముందు.. తోబుట్టువులైన థాయ్‌లాండ్ మాజీ ప్రధానులు థక్సిన్ శినావత్రా, యింగ్లక్ శినావత్రా యూఏఈలోనే ఆశ్రయం పొందుతున్నారు. పాకిస్తాన్ దివంగత ప్రధాని బేనజీర్ భుట్టో, పాక్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్ కూడా ఒకప్పుడు దుబాయ్‌లో తలదాచుకున్న వారే. స్పానిష్ రాజు జువాన్ కార్లోస్(అవినీతి ఆరోపణలు), యెమెన్ నాయకుడి పెద్ద కుమారుడు అహ్మద్ అలీ అబ్దుల్లా సలేహ్ వంటి వారు కూడా ఈ లిస్టులో ఉన్నారు. కాగా అవినీతి ఆరోపణల నేపథ్యంలో థాయ్ మాజీ ప్రధాని థక్సిన్ శినావత్రా జైలు శిక్ష తప్పించుకునేందుకు యూఈఏ పారిపోగా.. ఆయన సోదరి యింగ్లక్ శినావత్రా సైనిక తిరుగబాటు నేపథ్యంలో 2018, జనవరిలో అక్కడికే వెళ్లారు. చదవండి: Kabul Airport: మరో 3 రోజులే.. రోడ్లన్నీ బ్లాక్ చేస్తున్న తాలిబన్లు! -
ముంబై, చెన్నై పోరుతో...
న్యూఢిల్లీ: భారత్‌లో మిగిలిపోయిన ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో షెడ్యూల్ ఖరారైంది. దుబాయ్‌లో సెప్టెంబర్ 19న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో మాజీ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్‌తో ఐపీఎల్–14 పునఃప్రారంభం కానుంది. మొత్తం 31 మ్యాచ్‌ల్ని 27 రోజుల వ్యవధిలో నిర్వహిస్తామని, ఇందులో ఏడు రోజులు రెండేసి మ్యాచ్‌లు జరుగుతాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. యూఏఈలోని మూడు వేదికలైన దుబాయ్‌లో 13, షార్జాలో 10, అబుదాబిలో 8 మ్యాచ్‌లు జరుగుతాయి. రెండు మ్యాచ్‌లుంటే తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది. బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య అక్టోబర్ 8న జరిగే మ్యాచ్‌తో లీగ్ దశ ముగుస్తుంది. అనంతరం 10న దుబాయ్‌లో తొలి క్వాలిఫయర్, 11న ఎలిమినేటర్‌తోపాటు 13న రెండో క్వాలిఫయర్ షార్జాలో జరుగుతుంది. అక్టోబర్ 15న దుబాయ్‌లో జరిగే ఫైనల్‌తో ఐపీఎల్ ముగుస్తుంది. యూఏఈ ప్రభుత్వం అనుసరిస్తున్న క్వారంటైన్, ప్రొటోకాల్ నిబంధనల్ని ఆటగాళ్లు, నిర్వాహకులు పాటించాలి. కోవిడ్‌తో ఆలస్యమైన గత సీజన్ మ్యాచులన్నీ యూఏఈలోనే నిర్వహించారు. భారత్‌లో మొదలైన ఈ సీజన్ మేలో కరోనా కేసుల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
యూఏఈలోనే టి20 ప్రపంచకప్!
ముంబై: మన ‘పొట్టి’ ఆటలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అవుతోంది. కల్లోల కరోనా సమయంలో టి20 ప్రపంచకప్ కూడా భారత్‌లో ఆతిథ్యమిచ్చే అవకాశం లేకుండా పోయింది. అందుకే యూఏఈ సౌజన్యంతో ఐపీఎల్ లాగే మెగా ఈవెంట్‌ను కూడా అక్కడే నిర్వహించాలనే నిర్ణయానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వచ్చింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి సమాచారమిచ్చింది. టి20 ప్రపంచకప్ అక్టోబర్ 17న మొదలవుతుంది. నవంబర్ 14న జరిగే టైటిల్ పోరుతో టోర్నీ ముగుస్తుంది. సరిగ్గా ఐపీఎల్ ఫైనల్ (అక్టోబర్ 15) ముగిసిన రెండో రోజే మెగా ఈవెంట్ ప్రారంభవుతుంది. ఓ వార్త సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో జై షా మాట్లాడుతూ ‘దేశంలో కోవిడ్ ఉధృతిని దృష్టిలో ఉంచుకునే టి20 ప్రపంచకప్‌ను భారత్ నుంచి యూఏఈకి తరలిస్తున్నాం. అన్ని అంశాలను పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రతకే మా ప్రాధాన్యం ఉంటుంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటిస్తాం’ అని అన్నారు. 16 దేశాలు పాల్గొనే మెగా ఈవెంట్‌ను అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికల్లో నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతుంది. యూఏఈలో సరళమైన క్వారంటైన్ నిబంధనలు... పటిష్టమైన బబుల్, మహమ్మారి కూడా అదుపులో ఉండటం వల్ల విదేశీ ఆటగాళ్లందరూ పాల్గొంటారు. పొట్టి ఆటలో పోటీ రసవత్తరంగా సాగుతుంది. స్పాన్సర్ల ప్రయోజనాలు, బీసీసీఐ ఆర్థిక అవసరాలు కూడా నెరవేరుతాయి. అందుకే బోర్డు యూఏఈకే జై కొట్టింది. నిజానికి యూఏఈ బ్యాకప్ వేదికగా ఉంది. అక్కడే ఎందుకంటే... బోర్డు అంతా ఆలోచించే వేదికను యూఏఈకి తరలించింది. కరోనాతో పాటు ఇతరత్రా కారణాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇన్నాళ్లు కోవిడ్ ఉధృతి తగ్గదా... మన దేశంలో మనం ఘనంగా నిర్వహించుకోలేమా అన్న ధీమాతో బోర్డు ఉండేది. కానీ డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు భారత ప్రభుత్వాన్నే కాదు... బీసీసీఐని కూడా కలవర పెడుతున్నాయి. ప్రమాదకరమైన ఈ వేరియంట్ వ్యాక్సిన్‌కు తలొగ్గుతుందా లేదా అనే కచ్చితమైన సమాచారం కూడా లేదు. ఇప్పటికే ఈ సీజన్ ఐపీఎల్లో బయో బబుల్ పేలడం... ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు భయాందోళనకు గురవడంతో అర్ధంతరంగా లీగ్‌ను వాయిదా వేశారు. ఇప్పుడు ప్రతిష్టకు పోయి భారత్‌లో నిర్వహించి ప్రమాదాన్ని తెచ్చుకోవడం... బుడగ పగిలి ప్రపంచకప్ కూడా వాయిదా పడితే పరువు కూడా పోతుంది. ఇదే జరిగితే భవిష్యత్తులో ఎన్నో క్రికెట్ సిరీస్‌లపై ఇది పెనుప్రభావం చూపిస్తుంది. పైగా ఈసారి భారత ప్రభుత్వం 2016లో ఇచ్చిన పన్ను మినహాయింపు కూడా ఇవ్వలేదు. యూఏఈలో జరిపితే ఆ ప్రయోజనం కూడా బోర్డుకు దక్కుతుంది. ఇవన్నీ ఆలోచించే వేదికను మారుస్తోంది. -
Mumbai To Dubai: 70 లక్షలు అయ్యేదేమో.. కానీ 18 వేలకే!
వెబ్‌డెస్క్: ఒక్కరి కోసమే విమానం మొత్తం బుక్ చేసుకోవాలనుకుంటే లక్షలు కుమ్మరించాల్సి ఉంటుంది. అంతేకాదు విలాసవంతమైన సేవలు పొందాలనుకుంటే అదనంగా మరింత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, రూ. 18 వేలకే.. 360 సీట్ల సామర్థ్యం ఉన్న బోయింగ్-777 విమానంలో ప్రయాణం చేసే అవకాశం వస్తే.. అది కూడా ఎయిర్‌హోస్టెస్ మొదలు కమాండర్ వరకు సాదర స్వాగతం పలికి విమానమంతా కలియదిరిగే అవకాశం ఇస్తే.. భలేగా ఉంటుంది కదా. దుబాయ్‌లో నివసించే భవేశ్ జవేరీ అనే వ్యక్తికి ఈ బంపర్ ఆఫర్ తగిలింది. ముంబై- దుబాయ్ వరకు ఆయన ఒక్కరే విమానంలో ప్రయాణం చేశారు. వివరాలు... కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం తమ పౌరులు, యూఏఈ గోల్డెన్ వీసా కలిగి ఉన్నవారు, దౌత్యవేత్తలకు మాత్రమే తమ దేశానికి అనుమతినిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ముంబై నుంచి దుబాయ్ వెళ్లాలనుకున్న జవేరి... 18 వేల రూపాయలు పెట్టి ఎకానమీ క్లాస్ టికెట్ కొనుగోలు చేశారు. అయితే, ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించగానే టికెట్‌పై సరైన తేదీ లేని కారణంగా లోపలికి అనుమతించమని అధికారులు తేల్చి చెప్పారు. అస్సలు ఊహించలేదు! వెంటనే జవేరి, ఎమిరేట్స్ సిబ్బందికి ఫోన్ చేయగా సమస్యకు పరిష్కారం దొరికింది. అంతేకాదు, ఆరోజు ఆ విమానంలో ప్రయాణించే వ్యక్తి తానొక్కడినే అని, ఆయన కోసమే ఎదురుచూస్తున్నామని చెప్పడంతో జవేరి ఆశ్చర్యపోయారు. మే 19 నాటి ఈ ఘటన గురించి భవేశ్ జవేరి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘విమానంలోకి అడుగుపెట్టగానే ఎయిర్‌హోస్టెస్ చప్పట్లు కొడుతూ నన్ను లోపలికి ఆహ్వానించారు. విమానం అంతా తిప్పి చూపించారు. నా లక్కీ నంబర్ 18 అని చెప్పగానే.. ఆ నంబరు గల సీట్లో కూర్చోమన్నారు. కమాండర్ సైతం ఎంతో సరదాగా మాట్లాడారు. ల్యాండ్ అవగానే నవ్వుతూ నాకు వీడ్కోలు పలికారు. నిజానికి ఇలా నేనొక్కడినే అంత పెద్ద విమానం(బోయింగ్ 777 చార్టర్)లో ప్రయాణించాలంటే సుమారు రూ. లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు అత్యంత తక్కువ ధరకే నాకు ఈ అవకాశం లభించింది. ఇప్పటికి దాదాపు 240సార్లు విమానాల్లో(ముంబై- దుబాయ్) ప్రయాణించి ఉంటాను. అంతేకాదు అప్పట్లో తొమ్మిది మంది ప్యాసింజర్లతో దుబాయ్ వెళ్తున్న 14 సీట్ల విమానంలోనూ ప్రయాణం చేశాను. కానీ, ఎప్పుడూ ఇలాంటి అద్భుత అనుభవం ఎదురుకాలేదు. డబ్బుతో ఇలాంటి వాటిని కొనుగోలు చేయలేం. కాలం కలిసి వస్తేనే ఇలా జరుగుతుంది కాబోలు’’ అని సంతోషం వ్యక్తం చేశారు. కాగా భవేశ్ జవేరి గత రెండు దశాబ్దాలుగా యూఏఈలో నివాసం ఉంటున్నారు. ఇక ఇలాంటి ఒంటరి ప్రయాణం కోసం సుమారు 70 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చేదని ఓ ఆపరేటర్ చెప్పినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. చదవండి: నిజాయతీ: చేతికి దొరికిన రూ.7 కోట్లు తిరిగిచ్చేశారు -
యూఏఈ నుంచి ప్రథమ మహిళా వ్యోమగామి
దుబాయ్: అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని పంపిన మొట్టమొదటి గల్ఫ్ దేశంగా రికార్డు సృష్టించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. మొట్టమొదటిసారిగా మహిళా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపనున్నట్లు దుబాయ్ పాలకుడు షేక్ మొహ్మమద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. శనివారం ఆయన ప్రకటించిన ఇద్దరు వ్యోమగాముల పేర్లలో ఒకరు మహిళ కావడం విశేషం. తమకు అందిన సుమారు 4వేల దరఖాస్తుల నుంచి నౌరా అల్ మత్రౌషి, మొహమ్మద్ అల్–ముల్లాను ఇందుకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. 1993లో జన్మించిన మత్రౌషి అబుధాబిలోని నేషనల్ పెట్రోలియం కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు. అదేవిధంగా, అల్–ముల్లా ప్రస్తుతం దుబాయ్ పోలీస్ విభాగంలో పైలట్ శిక్షణావిభాగానికి అధిపతిగా ఉన్నారని పేర్కొన్నారు. వీరిద్దరూ త్వరలో అమెరికాలో టెక్సాస్‌లోని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్లో శిక్షణ పొందనున్నట్లు వెల్లడించారు. చదవండి: మార్స్‌పై బుల్లి హెలీకాప్టర్, దానికి పేరు పెట్టిందెవరో తెలుసా? -
ప్రేయసికి అరుదైన కానుక.. ఇద్దరూ అరెస్టు
దుబాయ్: సాధారణంగా ఇష్టసఖి పుట్టినరోజు అంటే గులాబీలు, చాక్లెట్లు, టెడ్డీబేర్లు ఇచ్చే ప్రేమికుల గురించి విన్నాం. కానీ ఓ వ్యక్తి వీటన్నికంటే భిన్నంగా ఓ అరుదైన బహుమతిని ఇవ్వాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అప్పుడే పుట్టిన ఓ ఒంటె పిల్లను దొంగతనం చేసి ప్రేయసికి కానుక అందించాడు. అతడు చేసిన పనికి ఇద్దరూ కటకటాలపాలయ్యారు. ఈ ఘటన దుబాయ్‌లో చోటు చేసుకుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. కొన్ని రోజుల క్రితం ఓ జంట తమ ఒంటె పిల్ల కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా దొంగ వెన్నులో వణుకుపుట్టింది. ఈ క్రమంలో ఎక్కడి నుంచైతే ఒంటె పిల్లను ఎత్తుకొచ్చాడో అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో దానిని వదిలిపెట్టి వచ్చాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి తానే దాని జాడను చెప్పాడు. కొన్ని రోజులుగా అక్కడే తచ్చాడుతుందంటూ సమాచారం అందించారు. దీంతో లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. ప్రేమికురాలికి గిఫ్టు ఇచ్చేందుకే ఈ దొంగతనం చేశానని అతడు అంగీకరించాడు. తొలుత తల్లి ఒంటెనే తీసుకువెళ్దామని భావించానని, అయితే అప్పుడే ఓనర్లు రావడంతో దానిని వదిలేసి పిల్లను ఎత్తుకెళ్లినట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో చోరీ చేయడమే కాకుండా తమను తప్పుదోవపట్టించినందుకు నిందితుడు, అతడి ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా అరబ్ దేశాల్లో చాలా కుటుంబాలు పోషణ కోసం ఒంటెల మీద ఆధారపడతాయన్న విషయం తెలిసిందే. పాలు, ఇతర ఆహార ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా కొట్టాలు వేసి వాటిని పెంచుతూ ఉంటారు. మరోవైపు, రేసుల కోసం కూడా కొంతమంది ఒంటెలను కొనుగోలు చేస్తారు. కొన్ని ప్రత్యేక జాతులకు చెందిన ఒంటెలకు అందాల పోటీలు కూడా నిర్వహిస్తారు. చదవండి: ముక్కలు.. ముక్కలైన నవ్వుతున్నాడు..! -
ఏడేడు లోకాల ఎచటనుంటివో రాకుమారీ..!
మూడేళ్లుగా రాజుగారి కుమార్తె కనిపించడం లేదు. ఎక్కడుందో తెలియదు. ఎలా ఉందో తెలియదు. ఏ శత్రుదేశ సైనికులు ఆమెను అపహరించుకుని వెళ్లి ఉంటారు? శత్రుదేశ సైనికులు కాదు. ఏడు రాజ్యాల మహా సామ్రాజ్యాధీశుడే ఆమెను ఏడు లోకాల్లో ఎక్కడో నిర్బంధించాడు. ఆ రాకుమారి షేఖా లతీఫా. ఆ మహా సామ్రాజ్యాధీశుడు మొహమ్మద్ రషీద్. లతీఫా అతడి కుమార్తే. నిర్బంధించించి ఆ తండ్రే! ఇంతకీ ఆమె సజీవంగానే ఉందా? ఆ సంగతిని మొహమ్మద్ రషీదే చెప్పాలని ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషల్’ అంటోంది! ‘పనోరమా’ అని.. బి.బి.సి. ఒక పరిశోధనాత్మక నిజ ఘటనల టీవీ సీరీస్‌ను ప్రసారం చేస్తుంటుంది. మొన్న మంగళవారం ఆ సీరీస్‌లో షేఖా లతీఫా తనే విడుదల చేసిన ఒక చిన్న వీడియో క్లిప్‌లో మాట్లాడుతూ కనిపించారు! ‘ఓ మై గాడ్’ అనుకుంది ప్రపంచం ఒక్కసారిగా ఆమె తెరపై కనిపించగానే. వెంటనే ‘థ్యాంక్ గాడ్’ అని కూడా. ‘ఓ మై గాడ్’ అనుకోవడం ఎందుకంటే.. మూడేళ్ల క్రితం దుబాయ్‌లోని తన అంతఃపురం నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమై, తండ్రి చేతికి చిక్కాక తిరిగి మళ్లీ ఆమె లోకానికి కనిపించలేదు. మనిషీ లేదు. మాటా లేదు. ఆ మనిషి గురించిన మాట కూడా రాజసౌధం నుంచి చిన్న శబ్దంగానైనా లేదు. ఇప్పుడు ఆకస్మాత్తుగా బి.బి.సి.లో కనిపించినందుకే ఆ ఆశ్చర్యం. అయితే ఆ క్లిప్‌లో లతీఫా హాయిగా లేదు. నవ్వుతూ లేదు. ప్రశాంతంగా లేదు. బిక్కుబిక్కుమంటూ.. ఎవరూ వినకుండా మాట్లాడినట్లుగా ఉంది. అలసిపోయినట్లుగా ఉంది. అచేతనత్వానికి ప్రారంభ దశలో ఉన్నట్లుగా ఉంది. మొత్తానికి ప్రాణాలతోనైతే ఉందన్న భావనే ప్రేక్షకులు ‘థ్యాంక్ గాడ్’ అనుకోడానికి కారణం. అయితే ఆ క్లిప్ 2019 నాటిదని బి.బి.సి. ప్రకటించగనే అనుమానాలు. లతీఫా బతికే ఉందా?! క్లిప్‌లో ఆమె బాత్రూమ్లోంచి మాట్లాడినట్లుగా ఉంది. ఆ బాత్రూమ్ ఒక ఆకాÔ¶ హర్మ్యంలో ఉన్నట్లుగా ఉంది. ఆ ఆకాశహర్మ్యం ఏ రాజ్యంలో ఉన్నదో తెలియడం లేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్ (యు.ఎ.ఇ.) ఏడు రాజ్యాల మహాసామ్రాజ్యం. వాటిల్లో ఒకటి దుబాయ్. ఆ దుబాయ్ పాలకుడే లతీఫా తండ్రి మొహమ్మద్ రషీద్. యు.ఎ.ఇ.కి ప్రధాని, ఉపాధ్యక్షుడు కూడా కనుక కూతుర్ని ఆయన ఈ ఏడు లోకాలలో ఎక్కడైనా నిర్బంధించి ఉంచవచ్చని ఆమ్నెస్టీ ఇంటర్నేషల్ సంస్థ అనుమానిస్తోంది. ‘ఒక జైలు లాంటి విల్లాలో ఆమె రెక్కలు తెగిన పక్షిలా పడివున్నారన్నది మాత్రం నిజం’ అని మేరీ రాబిన్సన్ అంటున్నారు. లతీఫా నుంచి తను సంపాదించిన ఆ బాత్రూమ్ క్లిప్‌తో పాటు, ఐర్లాండ్ మాజీ అధ్యక్షురాలు, యు.ఎన్.హ్యూమన్ రైట్స్ మాజీ హై కమిషనర్ అయిన రాబిన్సన్ ఇంటర్వ్యూని కూడా తన షోలో ప్రసారం చేసింది బి.బి.సి. ‘‘ఈ స్థితిలో ఆమె ఎంతకాలం జీవించి ఉండగలరో తెలియడం లేదు’’ అని ఆ ఇంటర్వ్యూలో రాబిన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ∙∙ ‘‘బయటికి వెళ్లి ఇంత స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి కూడా లేకుండా పోయింది’’ అని బి.బి.సి.కి అందిన క్లిప్‌లో ఆవేదన చెందుతూ కనిపించారు లతీఫా. ఆ ఎపిసోడ్ ప్రసారం అవగానే.. ‘రాకుమారి ఎలా ఉందో చెప్పండి’ అని ప్రపంచ మీడియా నుంచి దుబాయ్ ప్రభుత్వ మీడియాకు వెళ్లిన ఏ విజ్ఞప్తికీ జవాబు లేదు! ‘‘ఈ నిర్బంధం నుంచి నేను ఎప్పటికి బయటపడతానో, ఏ నిబంధనలను అంగీకరిస్తే నన్ను విడుదల చేస్తారో నాకు తెలియడం లేదు. నా భద్రత గురించి, నా జీవితం గురించీ రోజు రోజుకూ నాలో భయం పెరిగిపోతోంది’’ అని కూడా ఆ వీడియో ద్వారా తెలియజెప్పడంతో లతీఫా ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారన్న దానిపై సందేహాలు మొదలయ్యాయి. మొహమ్మద్ రషీద్‌కు ఆరుగురు భార్యలు, ముప్పైమంది పిల్లలు. వారందరి సమాచారం ఎంతోకొంత బయటి ప్రపంచం వరకూ వస్తున్నా, గత మూడేళ్లుగా ఏ ఒక్కరి నోటి నుంచీ లతీఫా మాటే రాలేదు! 2018 ముందువరకు ఆమె గురించి తెలిసింది ఒక్కటే.. స్కై డైవింగ్ అంటే ఆమెకు ప్రాణమని! ∙∙ లతీఫా అనుభవిస్తున్న కష్టాలన్నిటికీ కారణం, కుటుంబ ఆంక్షల నుంచి స్వేచ్ఛను పొందేందుకు బయట పడాలని 2018లో ఆమె చేసిన ప్రయత్నమే. తన ఫిన్లాండ్ స్నేహితురాలు టీనా జౌహానియస్, దుబాయ్ పాలకుడి తరఫున పని చేస్తుండే అరవై ఏళ్ల ఫ్రెంచి నిఘా అధికారి హెర్వ్ జాబెర్ట్, మరో ముగ్గురి సహాయంతో రాజప్రాసాదం నుంచి తప్పించుకుని లండన్ పారిపోయే ప్రయత్నంలో వారు ప్రయాణిస్తున్న పడవ మార్చి 20న గోవాలో భారత తీరప్రాంత గస్తీ దళాలకు చిక్కింది. ఆశ్రయం పొందాలని వచ్చామని ఎంత చెప్పినా వినకుండా మన కమాండోలు భారత ప్రభుత్వ ఆదేశాలపై లతీఫాను తిరిగి దుబాయ్‌కి అప్పగించారు. ఇలా తప్పించుకునిపోడానికి ముందు కూడా మూడేళ్లపాటు వెలుతురే లేని గదిలో ఆమె బందీగా ఉన్నారు. అందుకే స్వేచ్ఛ కోసం అంతగా అలమటించిపోయారు. ఇక లతీఫాను తిరిగి దుబాయ్‌కి అప్పగించడం వెనుక భారత్ ఆశించిన ప్రయోజనమూ ఉంది. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో కీలక నిందితుడైన క్రిస్టియన్ మిషెల్‌ను యు.ఎ.ఇ. ప్రభుత్వం భారత్‌కు అప్పగిస్తుందన్నదే ఆ ప్రయోజనం. అప్పటికి పందొమ్మిది నెలలుగా మిషెల్‌ను అప్పగించాలని భారత్ కోరుతున్నా స్పందించని దుబాయ్ ప్రభుత్వం, లతీఫాను వెనక్కి పంపించడంతో ప్రతిఫలంగా అతడిని భారత్ చేతుల్లో పెట్టింది! ఇలా ఏదో ఒక ‘దౌత్య’ కారణంతో ఈనాటికీ లతీఫా నిర్బంధాన్ని ఓ ఇంటి వ్యవహారంలా మాత్రమే దేశాలన్నీ చూస్తున్నాయి. కొన్ని దేశాలు అసలే పట్టనట్లు ఉన్నాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు సైతం ఏమీ చేయలేకపోతున్నాయి. ఘటనల కాలక్రమం రాకుమారి ‘ఎస్కేప్’కి ముందు, తర్వాత ► జూన్–2002 : లతీఫా 16 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయేందుకు తొలి ప్రయత్నం చేశారు. మధ్యలోనే పట్టుకుని మూడేళ్ల, నాలుగు నెలల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. ► 2010: లతీఫా 24 ఏళ్ల వయసులో ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ టీనాతో సన్నిహితంగా ఉండటం చూసి ఆమె ద్వారా విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తుందేమోనన్న అనుమానంతో లతీఫాకు పాస్‌పోర్ట్ రాకుండా, డ్రైవింగ్ నేర్చుకోకుండా ఆ కుటుంబం జాగ్రత్తపడింది. ► 2018 ఫిబ్రవరి ప్రారంభం : లతీఫా తన 32 ఏళ్ల వయసులో ‘జస్ట్ ఇన్ కేస్’ అని తనపై ఒక వీడియో తీయించుకుని తన నమ్మకస్తులకు మెయిల్ చేశారు. ‘నేను అమెరికా పారిపోతున్నాను. మధ్యలో పట్టుపడితే కనుక ఈ వీడియోను మీడియాకు అందించండి..’ అని అందులో విజ్ఞప్తి చేశారు. ► 24 ఫిబ్రవరి 2018: రాజప్రాసాదం నుంచి తప్పించుకుని, ఇన్ఫ్లేటబుల్ బోట్ (గాలి నింపిన తేలికపాటి పడవ)లో, తర్వాత జెట్ స్కీ లో 24 మైళ్లు అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించి, ఫ్రెంచి అధికారి జాబెర్ట్ సిద్ధంగా ఉంచిన అమెరికన్ యాట్‌లో ఇండియా చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో అమెరికా వెళ్లి ఆశ్రయం పొందాలని పథకం. అయితే గోవాలో భారత తీర ప్రాంత కమాండోలకు చిక్కడంతో ఆ ప్రయత్నం విఫలం అయింది. ► 5 డిసెంబర్ 2018: లతీఫా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు బి.బి.సి. ప్రత్యేక కథనాన్ని ఇవ్వబోతున్నట్లు తెలియగానే లతీఫా తన ఇంట్లోనే సురక్షితంగా ఉందని దుబాయ్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ► 24 డిసెంబర్ 2018 : యు.ఎన్. మానవ హక్కుల కమిషనర్ మేరీ రాబిన్సన్ కలిసి డిసెంబర్ 15న లంచ్ చేస్తున్న లతీఫా ఫొటోను యూఏఈ విదేశాంగ శాఖ వ్యూహాత్మకంగా విడుదల చేసింది. నాటి నుంచి నేటి వరకు లతీఫా ఆచూకీకి సంబంధించిన ఒక్క వివరమూ లేదు! ► 16 ఫిబ్రవరి 2021: బి.బి.సి. ప్రసారం చేసిన ‘పనోరమా’ షో ఇంటర్వ్యూలో మాట్లాడిన మేరీ రాబిన్సన్.. ‘లతీఫా నాతో కలిసి లంచ్ చేస్తున్న ఫొటోను ప్రపంచానికి చూపి దుబాయ్ పాలకులు తమ గోప్యతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు’ అని వ్యాఖ్యానించారు. స్కై డైవింగ్ ప్రాణం, చిన్న పిల్ల మనసు బి.బి.సి. మంగళవారం ప్రసారం చేసిన వీడియో క్లిప్‌లో లతీఫా మేరీ రాబిన్సన్తో లతీఫా లంచ్ -
మనకు రెండో ఇల్లు అదే.. కానీ అమెరికానే ఫేవరెట్
సాక్షి, హైదరాబాద్: గత రెండు దశాబ్దాలుగా భారతదేశం నుంచే అత్యధికంగా విదేశాలకు వలస వెళ్తున్నారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశమే అగ్రస్థానంలో ఉంది. అదే సమయంలో భారత్‌కు విదేశాల నుంచి వలసలు తగ్గిపోయాయి. ఇలా బాగా వలసలు తగ్గిపోయిన దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇతర దేశాల పౌరులతో పోలిస్తే భారతీయులే అత్యధికంగా విదేశాల్లో నివసిస్తున్నారు. దాదాపు 1.8 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తుండగా, ఆ తర్వాత మెక్సికో (1.1 కోట్ల మంది), రష్యా (1.1 కోట్ల మంది), చైనా (1 కోటి మంది), సిరియా (80 లక్షల మంది) జాతీయులు విదేశాల్లో ఉంటున్నారు. కాగా అంతర్జాతీయ వలసలు– 2020 నివేదికను ఐక్యరాజ్య సమితి తాజాగా చేసింది. ఈ నివేదిక ప్రకారం గడిచిన రెండు దశాబ్దాల్లో విదేశాల నుంచి వలసలు అత్యతంగా తగ్గిన దేశాల్లో అర్మేనియా మొదటి స్థానంలో నిలవగా, భారత్ రెండో స్థానంలో ఉంది. అర్మేనియా, భారత్, పాకిస్తాన్, ఉక్రెయిన్, టాంజానియా దేశాలకు విదేశీయుల రాక గణనీయంగా తగ్గినట్లు ఐరాస తెలిపింది. మరోవైపు జర్మనీ, స్పెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ, అమెరికాకు వలసలు భారీగా పెరిగినట్లు వెల్లడించింది. మనకు రెండో ఇల్లు యూఏఈ ప్రవాస భారతీయులకు భారత దేశం తర్వాత మరో ఇల్లుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మారింది. ప్రపంచంలోనే అత్యధికంగా 35 లక్షల మంది ప్రవాస భారతీయులు యూఏఈలో నివాసముంటుండగా, అమెరికాలో 27 లక్షలు, సౌదీ అరేబియాలో 25 లక్షల మంది ఉంటున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్, పాకిస్తాన్, ఖతర్, బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్‌లో కూడా భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉన్నారు. 2020లో 1,78,69,492 మంది ప్రవాస భారతీయులు విదేశాల్లో నివసిస్తుండగా, భారత్‌లో 48,78,704 మంది విదేశీయులు నివాసం ఉంటున్నారు. దేశ జనాభాలో వీరి శాతం 0.4 మాత్రమే కాగా, వీరిలో 2,07,334 మంది శరణార్థులున్నారు. అమెరికాయే ఫేవరెట్.. ప్రపంచవ్యాప్తంగా 28.1 కోట్ల వలసదారులు ఉండగా, వీరిలో మూడో వంతు 20 దేశాల్లోనే నివసిస్తున్నారు. ప్రపంచ వలసదారుల ఇష్టమైన దేశంగా అమెరికా నిలిచింది. అత్యధికంగా 5.1 కోట్ల మంది విదేశీయులు అమెరికాలో నివసిస్తున్నారు. అత్యధిక సంఖ్యలో విదేశీయులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల్లో 1.6 కోట్ల మందితో జర్మనీ రెండో స్థానంలో, 1.3 కోట్ల మందితో సౌదీ అరేబియా మూడో స్థానంలో ఉంది. రష్యాలో 1.2 కోట్లు, బ్రిటన్, నెదర్లాండ్‌లో 90 లక్షల మంది విదేశీయులు ఉంటున్నారు. ఐరోపాలో అత్యధికంగా 8.7 కోట్ల వలసదారులు నివసిస్తుండగా, ఉత్తర అమెరికాలో 5.9 కోట్లు, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియాలో 5 కోట్ల మంది వలసదారులు ఉంటున్నారు. -
అక్షరాలా రూ. 4,000 కోట్ల ఆదాయం!
ముంబై: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడలు ఆగిపోయాయి. కనీసం చిన్న స్థాయి టోర్నీ కూడా నిర్వహించలేని పరిస్థితి. మన దేశంలోనైతే రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020లో కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణ గురించి ఆలోచించింది. ► సాధారణంగా ప్రతీ ఏటా నిర్వహించే ఏప్రిల్–మే షెడ్యూల్ సమయం గడిచిపోయినా ఆశలు కోల్పోలేదు. కోవిడ్–19 కాలంలో ఎన్నో కష్టాలకోర్చి క్రికెట్ నిర్వహించడం అవసరమా అని ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ► అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలన్నీ ఆలోచించి చివరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో విజయవంతంగా ఐపీఎల్‌ను నిర్వహించింది. బీసీసీఐ ఎందుకు ఇంతగా శ్రమించిందో తాజా లెక్కలు చూస్తే అర్థమవుతుంది. ► ఐపీఎల్–13 సీజన్ ద్వారా భారత బోర్డుకు ఏకంగా రూ. 4 వేల కోట్ల ఆదాయం వచ్చింది. లీగ్ జరపకుండా ఉండే ఇంత భారీ మొత్తాన్ని బోర్డు కోల్పోయేదేమో! తాజా సీజన్ ఐపీఎల్‌ను టీవీలో వీక్షించినవారి సంఖ్య గత ఏడాదికంటే 25 శాతం ఎక్కువగా ఉండటం విశేషం. –మరోవైపు ఐపీఎల్ సాగిన కాలంలో బోర్డు మొత్తంగా 1800 మందికి 30 వేల (ఆర్టీ–పీసీఆర్) కరోనా పరీక్షలు నిర్వహించడం మరో విశేషం. ఖర్చులు తగ్గించుకొని... సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఎలాంటి అంతరాయం లేకుండా జరిగిన 60 మ్యాచ్‌ల ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ► ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు దాదాపు రెండు నెలల ముందు ఎగ్జిబిషన్ టోర్నీ సమయంలో వరల్డ్ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ జొకోవిచ్‌కు కరోనా రావడంతో మా లీగ్ నిర్వహణపై కూడా సందేహాలు కనిపించాయి. చాలా మంది మమ్మల్ని ముందుకు వెళ్లవద్దని వారించారు. ఎవరైనా క్రికెటర్‌కు కరోనా వస్తే ఎలా అని వారు అడిగారు. అయితే మేం వాటిని పట్టించుకోలేదు. ∙గత ఐపీఎల్‌తో పోలిస్తే బీసీసీఐ 35 శాతం నిర్వహణా ఖర్చులు తగ్గించుకుంది. నిర్వహణకు శ్రీలంక నుంచి కూడా ప్రతిపాదన వచ్చినా యూఏఐ వైపు మొగ్గు చూపాం. మూడు నగరాల మధ్యలో బస్సులో ప్రయాణించే అవకాశం ఉండటంతో అలా కూడా ఖర్చు తగ్గించాం. ► సుమారు 40 సార్లు కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా గంటలకొద్దీ చర్చలు సాగాయి. బయో సెక్యూర్ బబుల్ కోసం రెస్ట్రాటా అనే కంపెనీ సహకారం తీసుకున్నాం. బీసీసీఐ అధికారులు ముందుగా వెళ్లి ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. క్వారంటైన్ విషయంలో దుబాయ్ ప్రభుత్వం ఆటగాళ్లకు సడలింపులు ఇచ్చినా... యూఏఈ ప్రభుత్వం ససేమిరా అంది. చివరకు ఎంతో శ్రమించి వారిని కూడా ఒప్పించగలిగాం. ఇంత చేసినా ఆరంభంలోనే చెన్నై బృందంలో చాలా మందికి కరోనా వచ్చినట్లు తేలడంలో ఆందోళన కలిగింది. అయితే ఆ తర్వాత అంతా కోలుకున్నారు. మొత్తంగా యూఏఈ ప్రభుత్వ సహకారంతో లీగ్ సూపర్ హిట్ కావడం సంతోషకరం. చివరకు మాకు రూ. 4 వేల కోట్ల ఆదాయం కూడా వచ్చింది. -
ఐపీఎల్ 2020: బీసీసీఐ ఆదాయం ఎంతంటే!
న్యూఢిల్లీ: క్యాష్ రిచ్ ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కరోనా కాలంలోనూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి సిరులు కురిపించింది. యూఏఈ వేదికగా నిర్వహించిన ఐపీఎల్-13వ సీజన్‌కు గానూ బోర్డు సుమారు 4 వేల కోట్ల రూపాయాల ఆదాయాన్ని ఆర్జించింది. బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమల్ ఈ విషయాన్ని వెల్లడించారు. అదే విధంగా గతేడాదితో పోలిస్తే ఈసారి టీవీ వ్యూయర్షిప్ కూడా 25 శాతం మేర పెరిగిందని పేర్కొన్నారు. కాగా మహమ్మారి కరోనా దెబ్బకు క్రీడా ఈవెంట్లన్నీ వాయిదా పడ్డ వేళ ఐపీఎల్ నిర్వహణపై కూడా సందేహాలు తలెత్తిన విషయం తెలిసిందే. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో మార్చి 29న మొదలు కావాల్సిన ఐపీఎల్-2020 సీజన్‌ను తొలుత వాయిదా వేశారు.(చదవండి: కోహ్లి త్వరలోనే ఆ ఘనత సాధిస్తాడు: భజ్జీ) ఆ తర్వాత జూన్-జులై నెలల్లో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేసినా సాధ్యం పడకపోవడంతో.. ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేద్దామని బీసీసీఐ పెద్దలు భావించారు. అయితే టోర్నీ నిర్వహణకు యూఏఈ అనుకూలమని భావించిన బోర్డు.. అక్కడి అధికారులతో సంప్రదించగా సానుకూల స్పందన లభించింది. దీంతో కోవిడ్ నిబంధనల నడుమ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు కొనసాగిన టోర్నీని బీసీసీఐ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత సంపన్న బోర్డుగా పేరొందిన బీసీసీఐ భారీ ఎత్తున ఆదాయం గడించినట్లు అరుణ్ ధుమాల్ తెలిపారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘గతేడాది ఐపీఎల్‌తో పోలిస్తే ఈసారి 35 శాతం మేర నిర్వహణ ఖర్చు తగ్గింది. కరోనా కాలంలో 4 వేల కోట్ల రూపాయాల ఆదాయం ఆర్జించాం. డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. టీవీ వ్యూయర్షిప్ 25 శాతం వరకు పెరిగింది. తొలుత మాపై సందేహాలు వ్యక్తం చేసిన వారే ఐపీఎల్‌ను విజయవంతంగా పూర్తిచేసినందుకు మాకు ధన్యవాదాలు తెలిపారు. ఒకవేళ ఈ సీజన్ నిర్వహించకపోయి ఉంటే క్రికెటర్లు ఓ ఏడాది కాలాన్ని కోల్పేయేవారు’’ అని చెప్పుకొచ్చారు. (చదవండి: యూఏఈకి బీసీసీఐ బంపర్ బొనాంజ!) ఇక కోవిడ్ కాలంలో టోర్నీ నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తల గురించి చెబుతూ.. ‘‘ఈ టీ20 లీగ్‌లో 53 రోజులపాటు మొత్తంగా 60 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా 1800 మందికి సుమారు 30 వేల మేర కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన పక్షంలో వారు కోలుకునేంత వరకు అన్ని రకాల చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. క్వారంటైన్ కోసం సుమారు 200 గదులు బుక్ చేశాం’’ అని అరుణ్ ధుమల్ పేర్కొన్నారు. కాగా ఐపీఎల్-13వ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్ ట్రోఫీని ఎగురేసుకుపోయిన సంగతి తెలిసిందే. తద్వారా ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టుగా రోహిత్ సేన చరిత్ర సృష్టించింది. -
ఐపీఎల్: యూఏఈకి బీసీసీఐ బంపర్ బొనాంజ!
దుబాయ్: కరోనా అడ్డంకులను దాటుకుని ఐపీఎల్ 13వ సీజన్ సక్సెస్ అయిందంటే కారణం వేదిక యూఏఈ కావడమే! రెండున్నర నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 2020 నిర్వహణకు సంబంధించి యూఏఈకి బీసీసీఐ భారీ మొత్తంలోనే ముట్టజెప్పినట్టు జాతీయ మీడియా తెలిపింది. దాదాపు రూ.100 కోట్ల రూపాయలు యూఏఈకి అందినట్టు సమాచారం. కాగా, ఏప్రిల్-మే నెలల్లో భారత్‌లో నిర్వహించాల్సిన ఐపీఎల్ 13 వ సీజన్ కరోనా విజృంభణతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అనంతరం జూన్-జులై నెలల్లో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేసినా సాధ్యం కాలేదు. దాంతో ఈ ఏడాది ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేద్దామని భావించారు. (చదవండి: సీఎస్కే కెప్టెన్‌గా అతడికే అవకాశం!) అయితే, టోర్నీ నిర్వహణకు యూఏఈ అనుకూలమని భావించిన బీసీసీఐ అధికారులు.. అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపారు. 2014 ఐపీఎల్‌కు వేదికైన యూఏఈ.. ఐపీఎల్ 2020కి ఓకే చెప్పడంతో మార్గం సుగమమైంది. బీసీసీఐ, ఐపీఎల్ సిబ్బంది, ఆటగాళ్లు, యూఏఈ అధికారుల సహకారంతో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ తాజా సీజన్ దిగ్విజయంగా కొనసాగింది. ఇదిలాఉండగా.. వచ్చే ఏడాది ప్రారంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్ కూడా యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. (చదవండి: ‘కడక్‌నాథ్’ కోళ్ల బిజినెస్‌లోకి ధోని ఎంట్రీ!) -
పుట్టగానే మాస్కు లాగిపడేసింది!
ఒకప్పుడు కేవలం వైద్య సిబ్బంది మాత్రమే అది కూడా ఆస్పత్రిలో, మరీ ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లోనే సర్జికల్ మాస్కులు ధరించే వారు. కర్మాగారాల్లో పని చేసే కార్మికులు కూడా కాలుష్యం నుంచి తమను తాము కాపాడుకునేందుకు మాస్కులు వాడేవారు. కానీ ఎప్పుడైతే మహమ్మారి కరోనా పంజా విసరడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి సామాన్యుల జీవితాల్లోనూ ఇదొక భాగమైపోయింది. ఇప్పుడప్పుడే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే దాఖలాలు లేకపోవడంతో.. ‘‘చికిత్స కన్నా నివారణే మేలు’’అన్న చందంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు ముందుకు సాగుతున్నారు. ప్రాణాంతక కోవిడ్-19 అంతమై, మునుపటి పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. (చదవండి: తల్లిని కాపాడేందుకు ఐదేళ్ల పిల్లాడు..) యూఏఈకి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ సమీర్ చీబ్ కూడా ఈ కోవకు చెందిన వారే. గతంలో ఓ డెలివరీ సందర్భంగా ఆపరేషన్ థియేటర్లో తీసిన ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆయన.. ‘‘త్వరలోనే మాస్కును తొలగించే సమయం ఆసన్నం కావాలంటూ మనమందరం కోరుకుంటున్నాం కదా’’ అంటూ క్యాప్షన్ జతచేశారు. అప్పుడే పుట్టిన చిన్నారి, సమీర్ మాస్కును తన చేతితో లాగిపడేయగా, ఆయన చిరునవ్వులు చిందిస్తున్న ఆ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘‘పుట్టగానే మాస్కు తీసి పడేసింది. 2020లో నేను చూసిన అద్భుతమైన ఫొటో ఇదే. అన్నీ సజావుగా సాగి మనమంతా మాస్కు లేకుండా బయటకు వెళ్లగలిగే రోజులు త్వరలోనే రావాలి. మెరుగైన మన భవిష్యత్తుకు ఈ చిన్నారి ఫొటో ఓ సంకేతంలా కనిపిస్తోంది’’అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘‘మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చినా, అది పూర్తిగా అంతమైపోదని, కాబట్టి మాస్కు ధరిస్తే కరోనాతో పాటు, ఇతర వైరస్లు కూడా సోకకుండా జాగ్రత్త పడవచ్చు’’అంటూ సలహాలు ఇస్తున్నారు. View this post on Instagram We all want sign are we going to take off the mask soon 🙏🏻 #instagram #goodnews #goodvibes #uae🇦🇪 #dubai #instagood #love #photooftheday #cute #babyboy #instmoment @dubaimediaoffice A post shared by Dr Samer Cheaib د سامر شعيب (@dr.samercheaib) on Oct 5, 2020 at 6:02am PDT -
వచ్చే ఐపీఎల్ కూడా యూఏఈలోనే!
దుబాయ్: కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు (యూఏఈ) తరలించిన బీసీసీఐ... వచ్చే సీజన్ విషయంలో కూడా ఇదే తరహాలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2021 ఐపీఎల్ సమయానికి మన దేశంలో కరోనా అదుపులోకి రాకపోతే వరుసగా రెండో ఏడాది కూడా అక్కడే నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మెరుగుపర్చుకోవడం, పరస్పర సహకారంతో టోర్నీల నిర్వహణలో భాగంగా బీసీసీఐ, యూఏఈ క్రికెట్ బోర్డు మధ్య ఒక ప్రత్యేక ఎంఓయూ కుదిరింది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. జై షాతో పాటు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కోశాధికారి అరుణ్ ధుమాల్ కూడా ఇందులో పాల్గొన్నారు. మరోవైపు ఈ ఏడాది చివర్లో ఇంగ్లండ్ జట్టుతో టెస్టు సిరీస్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు దీనిని కూడా యూఏఈలోనే జరిపే అవకాశం కనిపిస్తోంది. ప్రతి ఏటా షెడ్యూల్‌లాగే ఏప్రిల్–మేలోనే ఐపీఎల్ జరగాల్సి వస్తే యూఏఈనే సరైన వేదికగా భావిస్తున్నట్లు చెప్పిన బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు... ఇంగ్లండ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు కూడా ప్రత్యామ్నాయంగా ఎడారి దేశాన్ని చూసినట్లు చెప్పారు. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత భారత జట్టు యూఏఈలో ఆడేందుకు (2006లో పాక్‌తో 2 వన్డేల సిరీస్ మినహా) నిరాకరిస్తూ వచ్చింది. అయితే 2014లో కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించిన తర్వాత బీసీసీఐ మెత్తబడింది. 2018లో ఇక్కడే జరిగిన ఆసియా కప్‌లో కూడా భారత్ పాల్గొంది. -
ఎడారిలో ఒయాసిస్...
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ క్రీడల గురించి కనీసం ఆలోచించలేని పరిస్థితిలో కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ బంగారు బాతును బ్రహ్మాండంగా వాడుకునే ప్రయత్నంలో పడింది. ఎలాగైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాత్రం కచ్చితంగా నిర్వహించాలని పట్టుదల కనబర్చి అందుకు తగినట్లుగా అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. కోవిడ్–19 నేపథ్యంలో అన్ని దేశాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొన్న స్థితిలో కూడా ఒయాసిస్‌లా ఆశలు రేపుతున్న ఆదాయాన్ని ఆర్జించేందుకు ఎడారి దేశం బాట పట్టింది. కొన్నాళ్ల క్రితం వరకు అసాధ్యం అనుకున్న లీగ్‌ను ఇప్పుడు సన్నద్ధం చేసి బోర్డు తొలి అడుగును విజయవంతంగా వేసింది. షెడ్యూల్ ప్రకారమైతే ఏప్రిల్–మే నెలలో ఐపీఎల్ జరగాలి. కానీ కరోనా కారణంగా అంతా మారిపోయింది. మార్చిలోనే దక్షిణాఫ్రికా జట్టు తమ వన్డే సిరీస్‌ను రద్దు చేసుకొని స్వదేశం వెళ్లిపోవడంతో మన దేశంలో క్రికెట్ ఆగిపోయింది. ఇలాంటి సమయంలో బీసీసీఐ కూడా దాదాపుగా చేతులెత్తేసింది. ఐపీఎల్ జరుగుతుందో లేదో అన్నట్లుగానే మొదటి నుంచీ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూనే వచ్చాడు. అయితే బయో బబుల్ సెక్యూరిటీలో జరిగిన ఇంగ్లండ్–వెస్టిండీస్ టెస్టు సిరీస్ బీసీసీఐకు ఒక దారి చూపించింది. ప్రేక్షకులు లేకపోవడం సంగతి తర్వాత... ముందు మ్యాచ్‌లు జరిగేదెలాగో చూడమన్నట్లుగా ఒక్కసారిగా బోర్డులో కదలిక వచ్చింది. దాని ఫలితమే ఎలాగైనా లీగ్ నిర్వహించాలనే పట్టుదలతో ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించేలా చేసింది. యూఏఈలోనే ఎందుకు... ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని భావిస్తే భారత్‌లోనే ఐపీఎల్ జరపవచ్చుగా అనేదానిపై ఆరంభంలో బోర్డులో కూడా చర్చ జరిగింది. అయితే దేశంలో కరోనా తీవ్రత ఉండటంతో ఏ నగరం కూడా క్షేమంగా లేదు. ఐపీఎల్ గురించి ప్రణాళికలు రూపొందిస్తున్న సమయంలో ఢిల్లీ, ముంబైలు కరోనా కేసుల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. పైగా ఇలాంటి సమయంలోనూ లీగ్ జరుగుతుంటే పలు విమర్శలు రావడం సహజం. పైగా భారత్‌లాంటి చోట బయో బబుల్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం అంత సులువు కాదు. ఆటగాళ్లు ఎంత క్రమశిక్షణ పాటించాలని భావించినా... స్థానిక పరిస్థితుల కారణంగా బయటి వ్యక్తులు కూడా భద్రతా నిబంధనలు ఉల్లంఘించడం చాలా సులువు. ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఏదో ఒక సమస్య సగటు అభిమానుల నుంచి ఎదురైనా లీగ్‌కు దెబ్బ పడవచ్చు. ఇలాంటి కారణాలతో పాటు వసతుల పరంగా చూసినా అత్యుత్తమమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని బీసీసీఐ ఎంచుకుంది. స్థానిక బోర్డు, ప్రభుత్వం కూడా సహకరించేందుకు íసిద్ధం కావడంతో సమస్య లేకుండా పోయింది. యూఏఈలో కూడా కరోనా కేసులు ఎక్కువే (మంగళవారం నాటికి మొత్తం సుమారు 80 వేలు, కోలుకున్నవారు 70 వేలు) ఉన్నాయి. కానీ కఠిన చట్టాల వల్ల నియంత్రణలోనే ఉంది. ఆటగాళ్ల పరిస్థితేంటి... కోవిడ్–19 కారణంగా సుదీర్ఘ కాలం ఇళ్లకే పరిమితమైపోయిన క్రికెటర్ల దృష్టిలో మాత్రం ఇప్పుడు ఐపీఎల్ పెద్ద పండగలా మారిపోయింది. అందుకే వారంతా టోర్నీ కోసం ఉత్సాహంగా సిద్ధమయ్యారు. యూఏఈ రావడానికి ముందు, వచ్చిన తర్వాత విధించిన కఠిన ఆంక్షలు, కరోనా నిబంధనలు ఆరంభంలో కొంత ఇబ్బందికి గురి చేసినా... ఇప్పుడు వారంతా పరిస్థితులకు అలవాటు పడిపోయారని ఆయా జట్ల ప్రాక్టీస్ ఫొటోలు, వీడియోలు చూస్తే తెలుస్తోంది. మాస్క్‌లు, పీపీఈ కిట్లతో ప్రత్యేక విమానం ఎక్కిన వీరంతా బయో బబుల్లోఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటం సానుకూలాంశం. గతంలోలాగా స్వేచ్ఛగా బయట విహరించే అవకాశం లేకపోయినా, సహచర క్రికెటర్లతో మైదానంలో ఆటను ఆస్వాదిస్తున్న కారణంగా ఆ లోటు తెలియకపోవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ బృందంలో ఇద్దరు ఆటగాళ్లతో సహా 13 మంది కరోనా సోకి కొంత ఆందోళన రేగింది. అయితే ఇప్పడు పరిస్థితులు చక్కబడగా, ఆ ఉదంతం తర్వాత మళ్లీ ఐపీఎల్లో ‘పాజిటివ్’ మాట వినిపించలేదు. బయో సెక్యూర్ బబుల్‌లో ఆటగాళ్లు సమర్థంగా నిబంధనలు పాటిస్తున్నారనే దీన్ని బట్టి అర్థమవుతోంది. దాదాపు 80 రోజులు ఈ తరహాలో బందీగా ఉండాల్సి రావడం ఆటగాళ్లపై మానసికంగా ప్రభావం చూపిస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నా... ఇప్పుడైతే అలాంటిది కనిపించడం లేదు. ఒకవేళ టోర్నీ సాగినకొద్దీ తెలుస్తుందని అనుకున్నా... ప్రొఫెషనల్ క్రీడాకారులు అంత బలహీనంగా ఉండరని, తమ ఆటపై మాత్రమే దృష్టి పెడతారని కూడా భావించవచ్చు. మీడియా సమావేశాలు కూడా లేవు కాబట్టి ఆటగాళ్లపై ఆ ఒత్తిడి కూడా తగ్గినట్లే. అభిమానులూ ఇంటినుంచే... కరోనా కష్టకాలంలో ఐపీఎల్ జరుగుతున్నా... ఆటపరంగా లీగ్ ప్రమాణాల్లో ఎలాంటి లోటూ ఉండకపోవచ్చు. అభిమానుల ముందు ఆడే అవకాశం లేకపోవడం కొందరు ఆటగాళ్లను నిరుత్సాహపరిచే అంశం. అయితే అన్ని రకాల పరిస్థితులకు అనుగుణంగా ఆడటమే క్రికెటర్ల లక్షణం కాబట్టి ఫ్యాన్స్ ప్రోత్సాహం లేకపోవడంవంటివి వారిపై పెద్దగా ప్రభావం చూపవు. ఇక వీరాభిమానులు ఎప్పటిలాగే టీవీల్లో మ్యాచ్‌లతో వినోదాన్ని పొందవచ్చు. మరోవైపు మొబైల్లో మ్యాచ్‌లు చూపించే హాట్‌స్టార్ మాత్రం ఐపీఎల్ కోసం రారమ్మంటూ భారీ ప్రచారం మొదలు పెట్టడంతో పాటు ‘నో సబ్స్క్రిప్షన్ నో ఐపీఎల్’ అంటూ ప్రత్యేకంగా సబ్స్క్రయిబ్ చేసుకోమంటూ ఒక రకమైన హెచ్చరిక పంపించింది. స్పాన్సర్ల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అభిమానులతో సరదా ముచ్చట్లు, ఆటోగ్రాఫ్‌లు, ఫోటోల సందడిలాంటి మాత్రం ఈసారి పూర్తిగా మిస్. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గానే అన్నట్లు ఐపీఎల్–2020 కూడా క్రికెట్ అభిమానులకు పసందైన విందు భోజనం అందిస్తుందనడంలో సందేహం లేదు. చివరగా... వేదికలు మారాయి, ఏర్పాట్లు, ఇతర ఖర్చులు పెరిగాయి, చైనా దెబ్బతో టైటిల్ స్పాన్సర్షిప్ విలువలో సగం డబ్బులే వచ్చాయి, అనుబంధ స్పాన్సర్లు బేరమాడుతున్నారు.... అయినా సరే బోర్డు మాత్రం లీగ్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అసలు ఐపీఎల్ జరగకపోవడంకంటే ఇలాగైనా నిర్వహిస్తే చాలంటూ ఫ్రాంచైజీ యాజమాన్యాలు కూడా బోర్డుకు మద్దతు పలికాయి. ఆర్థికంగా లాభాలకంటే ఆట జరగడం ముఖ్యమని దీంతో సంబంధం ఉన్న అందరూ భావించడంతో లీగ్ వాస్తవరూపం దాలుస్తోంది. గత 12 సీజన్లతో పోలిస్తే పూర్తి భిన్నంగా జరగబోతున్న ఈ ఐపీఎల్–2020ని ఈ శనివారం నుంచి ఎంజాయ్ చేసేందుకు సిద్ధం కండి. -
దుబాయ్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ పాంటింగ్
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) హెడ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ గురువారం దుబాయ్ చేరుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్–13 కోసం ఆదివారమే డీసీ జట్టు ఇక్కడికి రాగా పాంటింగ్ ఆలస్యంగా జట్టుతో కలిశాడు. నిబంధనల ప్రకారం అతను ఆరు రోజుల క్వారంటైన్‌కు వెళ్లిపోయాడు. తనకు కేటాయించిన హోటల్ గదికి చేరుకున్న పాంటింగ్ ఆరు రోజుల అధికారిక క్వారంటైన్ ప్రారంభమైందంటూ ట్వీట్ చేశాడు. ఈ సీజన్లో తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌ను మన్కడింగ్ చేయనివ్వబోనని వ్యాఖ్యానించి రికీ తాజాగా భారీ చర్చకు తావిచ్చాడు. -
అన్ని జట్లు చేరుకున్నాయి
దుబాయ్: ఐపీఎల్ తాజా సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్లు ఆదివారం దుబాయ్ చేరుకున్నాయి. మిగతా జట్లన్నీ ఇప్పటికే అక్కడికి చేరుకోగా... ఈ రెండు జట్లు మాత్రం కాస్త ఆలస్యంగా యూఏఈ బయలుదేరి వెళ్లాయి. తొలుత హైదరాబాద్, అనంతరం ఢిల్లీ జట్లు దుబాయ్‌లో అడుగుపెట్టాయి. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ బ్యాట్స్‌మన్ శ్రీవత్స్ గోస్వామి ట్విట్టర్లో తెలిపాడు. మరోవైపు చాలా కాలం తర్వాత తమ జట్టుతో కలిసిన ఢిల్లీ క్యాపిటల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ధీరజ్ మల్హోత్రా, అసిస్టెంట్ కోచ్ మొహమ్మద్ కైఫ్ హర్షం వ్యక్తం చేశారు. మళ్లీ కుటుంబంతో కలిసినట్లుగా చాలా ఉత్సాహంగా ఉందని ధీరజ్ పేర్కొన్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఈ రెండు జట్లు ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నాయి. ఈ సమయంలో మూడు సార్లు ఆటగాళ్లందరికీ ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌గా తేలిన వారిని మాత్రమే ‘బయో బబుల్’లోకి అనుమతించనున్నారు. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో ఐపీఎల్ 13వ సీజన్ జరుగనుంది. దీంతో లీగ్‌తో సంబంధమున్న భారత ఆటగాళ్లు, సిబ్బంది యూఏఈ చేరుకున్నారు. ఆర్సీబీతో కలిసిన డివిలియర్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విధ్వంసక ఆటగాడు డివిలియర్స్ దుబాయ్ చేరుకున్నాడు. ఆర్సీబీ జట్టు శుక్రవారమే అక్కడికి చేరుకోగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డేల్ స్టెయిన్, క్రిస్ మోరిస్, డివిలియర్స్ శనివారం జట్టుతో కలిశారు. ‘ఐపీఎల్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. దుబాయ్‌కి రావడం సంతోషంగా ఉంది. నా దక్షిణాఫ్రికా మిత్రులతో కలిసి ఆర్సీబీ కుటుంబంలో చేరాను. ఇక కోవిడ్–19 పరీక్షకు హాజరు కావాలి’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు. -
సందడి షురూ...
దుబాయ్: అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)– 2020కి రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 19నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని మూడు వేదికల్లో లీగ్ జరగనుండగా... సుమారు నెల రోజుల ముందుగానే జట్లు అక్కడికి చేరుకుంటున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లి నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం యూఏఈ గడ్డపై అడుగు పెట్టాయి. మరో రెండు టీమ్‌లు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే అక్కడికి వెళ్లాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఆరు రోజుల వరకు అందరికీ క్వారంటీన్ తప్పనిసరి. ఈ సమయంలో ఒక్కొక్కరికి కనీసం మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహి స్తారు. ఆ తర్వాతేనుంచి ఆటగాళ్ల ప్రాక్టీస్, లీగ్ వార్తలు క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించనున్నాయి. మలింగ మరింత ఆలస్యంగా... శ్రీలంక స్పీడ్‌స్టర్, ముంబై ఇండియన్స్ ప్రధాన పేసర్ లసిత్ మలింగ కూడా ఆలస్యంగానే యూఏఈ వెళ్లనున్నాడు. దీంతో తొలి దశ మ్యాచ్‌లకు అతను జట్టుకు అందుబాటులో ఉండడు. కుటుంబ కారణాల వల్లే లంక ఆటగాడు కాస్తా ఆలస్యంగా ఐపీఎల్ ఆడనున్నాడు. ఈ పేసర్ తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు త్వరలోనే సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉండటంతో మలింగ తండ్రి వెంటే ఉండాలనుకుంటున్నాడు. దీంతో సగం మ్యాచ్‌లు అయ్యాకే అక్కడికి వెళ్లే అవకాశముంది. గతేడాది మలింగ మలుపు తిప్పిన ఆఖరి ఓవర్‌తోనే ముంబై నాలుగోసారి చాంపియన్ అయ్యింది. 8 పరుగులు చేస్తే చెన్నై గెలిచే ఆ ఓవర్లో అద్భుతంగా కట్టడి చేయడం వల్లే రోహిత్ సేన నెగ్గింది. చెన్నై బౌలర్ హర్భజన్ సింగ్ కూడా వ్యక్తిగత కారణాలతో జట్టుతో పాటే యూఏఈ వెళ్లలేకపోయాడు. -
యూఏఈలో భారత స్వాతంత్ర్య వేడుకలు
అబుదాబీ: 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో నిరాడంబరంగా జరిగాయి. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ యూఏఈ ప్రభుత్వం ఇచ్చిన పరమితమైన అనుమతుల మేరకు ఐఎస్సీ యాజమాన్యం మొత్తం వేడుకలను రెండు భాగాలుగా విభజించి నిర్వహించింది. ఉదయం 7.30 నిమిషాలకు ఐఎస్సీ యాజమాన్య కార్యవర్గం, సెంటర్ ఉద్యోగుల సమక్షంలో ఐఎస్సీ అధ్యక్షుడు యోగేష్ ప్రభు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో వీరుల త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ వాయువులని, అందరం దేశ ప్రగతికి తోడ్పడిననాడే వారికి నిజమైన నివాళి అర్పించినవాళ్లమవుతామని తెలిపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సాంకేతిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్షంగా వీక్షిస్తున్న సంఘ సభ్యులు, యూఎన్ఈలో ఉంటున్న ఎంతోమంది భారతీయులందరికీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కరోనా ప్రభావం, ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు ఇలా జరుపుకోవాల్సి వచ్చిందని సంఘ ప్రధాన కార్యదర్శి జోజో అంబూకేన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండో భాగమైన సాంస్కృతిక కార్యక్రమం సాయంత్రం 7.30 నిమిషాల నుంచి రెండు గంటలపాటు జరుపుకున్నారని సాంస్కృతిక కార్యదర్శి జయప్రదీప్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 10 రాష్ట్రాల సాంస్కృతిక సంఘాల పాలు పంచుకున్నాయని దక్షిణ భారత కార్యదర్శి రాజా శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో తెలుగు వారి తరపున పావని ఆధ్వర్యంలో వర్షిణి, ఆముక్త, కువీర, సంస్కృతి, అక్షర, కవీష్, అభిరామ్ పాల్గొని ప్రేక్షకులను వారి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తెలుగు వారి ప్రదర్శన ఈ కార్యక్రమానికే వన్నె తెచ్చిందని ఉపాధ్యక్షులు జార్జి వర్గీస్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని జూమ్ ద్వారా యూఏఈలో ఉన్న ఎందరో భారతీయులు వీక్షించారని సెంటర్ జనరల్ మేనేజర్ రాజు అన్నారు. అలాగే భారత దౌత్య కార్యాలయం 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిపిన ఆన్లైన్ దేశ భక్తి గీతాల, చిత్ర లేఖన ప్రదర్శనలో కవీష్ పాడిన పాటను కాన్సులేట్ జనరల్ అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన తెలుగు మిత్రులు, వారి కుటుంబ సభ్యులందరికీ రాజా శ్రీనివాసరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
భారత్ కాకుంటే లంక, యూఏఈల్లో...
దుబాయ్: వచ్చే ఏడాది భారత్‌లో టి20 ప్రపంచ కప్ (పురుషులు) జరగాల్సివుంది. అయితే ప్రతికూల పరిస్థితుల వల్ల కుదరకపోతే శ్రీలంక లేదంటే యూఏఈల్లో నిర్వహించేలా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రత్యామ్నాయ వేదికల్ని ఖరారు చేసింది. నిజానికి ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలకు ప్రత్యామ్నాయ వేదికలను ప్రకటించడం సర్వసాధారణం. ఇది ఎప్పటినుంచో ఉన్న ఆనవాయితీ. ప్రస్తుత కరోనా మహమ్మారి వల్ల ప్రతిపాదించిన కొత్త అంశమేమీ కాదు. అయితే భారత్‌లో కరోనా ఉధృతి నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే 23 లక్షల (2.3 మిలియన్లు) పైచిలుకు కేసులతో టాప్–3లో ఉంది. దీంతో వచ్చే ఏడాదికల్లా కరోనా నియంత్రణలోకి రాకపోతే మెగా ఈవెంట్ పరిస్థితి ఏంటని సగటు క్రికెట్ అభిమానికి తలేత్తే ప్రశ్న! ఇప్పుడు ఐసీసీ నిర్ణయంతో ఈ ప్రశ్నకు జవాబు దొరికినట్లయింది. ఇప్పటికే ఈ ఏడాది భారత్‌లో సాధ్యంకానీ ఐపీఎల్ 13వ సీజన్‌ను యూఏఈలో నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహమ్మారి వల్ల ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 మెగాఈవెంట్ 2022కు వాయిదా పడింది. -
అసలు ఆటగాళ్లతో పాటు...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ లేదా ఐపీఎల్ మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా స్థానిక యువ బౌలర్లు నెట్స్‌లో వివిధ జట్లకు సహకరించటం పరిపాటి. జట్టు ప్రధాన బౌలర్లపై భారం తగ్గించడంతో పాటు విభిన్న శైలి బౌలర్లను ఎదుర్కొంటే బ్యాట్స్‌మెన్‌కు అది మేలు చేస్తుందనే నమ్మకమే అందుకు కారణం. సాధారణంగా ఐపీఎల్ సమయంలో ఆయా వేదికల్లో పెద్ద సంఖ్యలో నెట్ బౌలర్లు స్టార్ క్రికెటర్లకు బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే ఇప్పుడు లీగ్ స్వదేశంలో కాకుండా యూఏఈలో జరుగుతోంది. అక్కడ కూడా జట్టు కోరితే స్థానికంగా బౌలర్లు అందుబాటులో ఉండవచ్చు. అయితే తాజా కోవిడ్–19 పరిస్థితుల్లో ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. అందుకే టీమ్‌తో పాటు ఇక్కడినుంచే నెట్ బౌలర్లను కూడా తీసుకెళ్లాలని భావిస్తున్నాయి. వీరంతా ‘బయో బబుల్’లో తమతో భాగంగా ఉండాలని, బయటి వ్యక్తులు ఎవరూ రావాల్సిన అవసరం ఉండరాదని కోరుకుంటున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ పది మంది ఆటగాళ్లను ఇందు కోసం తమ జట్టుతో పాటు యూఏఈకి ప్రత్యేకంగా తీసుకెళ్లనున్నట్లు వెల్లడించింది. వీరంతా తమ జట్టుతో పాటే ఉంటారని చెన్నై టీమ్ సీఈఓ కాశీ విశ్వనాథన్ చెప్పారు. ఇదే తరహాలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా పది మందిని తీసుకెళ్లనున్నట్లు చెప్పింది. కేకేఆర్ అకాడమీ కోచ్ అభిషేక్ నాయర్ వీరిని ఎంపిక చేస్తారు. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆరుగురు బౌలర్లను తమ టీమ్‌తో పాటు తీసుకెళ్లనున్నట్లు సమాచారం. యూఏఈకి వెళ్లే ఐపీఎల్ ఫ్రాంచైజీ బృందంలో సభ్యుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేకపోవడంతో వారు ఈ తరహా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కలిగింది. సాధారణంగా రంజీ ట్రోఫీ లేదా సీనియర్ స్థాయిలో దేశవాళీ టోర్నీ ఆడిన, అండర్–23, అండర్–19 బౌలర్లు నెట్ బౌలర్లుగా వ్యవహరించే అవకాశం ఉంది. మరో వైపు యూఏఈ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండటం, తీవ్ర వేడిమి కారణంగా పొడిబారిన పిచ్‌లపై వారు ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ప్రతీ జట్టు నెట్ బౌలర్ల బృందంలో ఎక్కువ మంది స్పిన్నర్లు ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 20 నుంచి... ఐపీఎల్ జట్లు ప్రత్యేక విమానాల్లో యూఏఈకి వెళ్లే తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. అందరికంటే ముందుగా ఈ నెల 20న రాజస్తాన్ రాయల్స్ బయల్దేరుతుంది. ఆగస్టు 21న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ వెళతాయి. తర్వాతి రోజు పంజాబ్, ఢిల్లీ జట్లు వెళ్లే అవకాశం ఉంది. ముంబై జట్టులోని కొందరు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది గత వారం రోజులుగా క్వారంటైన్ కేంద్రంలో ఉంటూ కోవిడ్ పరీక్షలకు కూడా హాజరయ్యారు. ధోనిసేన మాత్రం యూఏఈ బయల్దేరడానికి ముందు 15 మందితో చెన్నైలో స్వల్పకాలిక (ఆగస్టు 16 నుంచి 20 వరకు) శిబిరంలో పాల్గొంటుంది. కోహ్లి నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ నెల చివరి వారంలో యూఏఈ వెళుతుంది. ఆగస్టు 23 వరకు ఈ జట్టుకు చెందిన భారత ఆటగాళ్లంతా వారం రోజుల పాటు క్వారంటైన్లో గడుపుతారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఇంకా తమ ప్రయాణ తేదీలు, ఇతర ఏర్పాట్లను ఇంకా ఖరారు చేసుకోలేదు. -
'దుబాయ్' భారం..!
ఎన్ని అవాంతరాలొచ్చినా ఐపీఎల్ సీజన్–13 జరగడం ఖాయమైంది. కరోనా కబళిస్తున్నా... భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నా, ఉన్నపళంగా భారీ ఆర్థిక నష్టం వాటిల్లినా లీగ్ నిర్వహణకే బీసీసీఐ మొగ్గు చూపింది. నిర్వహణపై అమితాసక్తితో ఎదురు చూసిన ఫ్రాంచైజీలకు యూఏఈలో టోర్నీ జరగడం మొత్తం ఆర్థికంగా నష్టపరిచే అంశం. వారి ఆదాయంపై పెద్ద ఎత్తున దెబ్బ పడనుంది. అయితే పూర్తిగా లీగ్ రద్దు కావడంతో పోలిస్తే ఎంతో కొంత ఆదాయం రానుండటం ఊరట కలిగించే అంశం. సాక్షి క్రీడా విభాగం: ఐదేళ్లకు ఏకంగా రూ. 2199 కోట్ల భారీ డీల్... సాలీనా రూ. 440 కోట్ల చెల్లింపులు... ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం వివో 2017లో చేసుకున్న ఒప్పందం ఇది. ఐపీఎల్ రెవిన్యూ షేరింగ్ అగ్రిమెంట్లో ఫ్రాంచైజీలకు టైటిల్ స్పాన్సర్షిప్ అనేది కీలక ఆదాయ వనరు. మొత్తం టైటిల్ స్పాన్సర్‌షిప్‌లో సగభాగం (దాదాపు 1000 కోట్లు) లీగ్‌లోని 8 ఫ్రాంచైజీలకు అందజేస్తారు. అంటే ఏడాదికి రూ. 20 కోట్లకు పైగానే ఫ్రాంచైజీలు ఆర్జిస్తున్నాయి. రాజకీయ కారణాలతో చైనా మూలాలున్న వివో తప్పుకోవడంతో ఆ ప్రభావం ఫ్రాంచైజీలపై పడనుంది. ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ‘వివో’ ఇచ్చే మొత్తాన్నే ఇవ్వగల కొత్త స్పాన్సర్ దొరకడం కష్టమే. మరోవైపు ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహిస్తుండటంతో టిక్కెట్ల విక్రయం ద్వారా లభించే గేట్ రెవెన్యూ కూడా ఫ్రాంచైజీలు కోల్పోనున్నాయి. మీడియా హక్కులే ఆలంబన... ప్రస్తుతం ఫ్రాంచైజీల్ని లీగ్ నిర్వహణ వైపు నడిపిస్తోన్న ఆదాయ వనరు మీడియా హక్కులు. ఈ హక్కుల్ని స్టార్ ఇండియా యాజమాన్యం 2017లో రికార్డు మొత్తానికి సొంతం చేసుకుంది. ఐదేళ్ల కాలానికి రూ. 16,347 కోట్లతో ఈ ఒప్పందం కుదిరింది. క్రికెట్ మీడియా హక్కుల ఒప్పందంలో చరిత్ర సృష్టించిన ఈ భారీ డీల్‌తో ఫ్రాంచైజీలు ఏటా రూ. 150 కోట్లు ఆర్జిస్తున్నాయి. ఈ మీడియా హక్కుల ఫలితంగా ప్రతి సీజన్‌కు రూ. 50 కోట్లు లాభం ఉంటుందని అంచనా. ఇతర ఆదాయ మార్గాల్లోనూ కోత! మీడియా హక్కులతో పాటు కిట్, జెర్సీ, హెల్మెట్లకు వేరు వేరు సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తుంటాయి. వీటి ద్వారా ఫ్రాంచైజీలు సీజన్‌కు రూ. 45–50 కోట్లు ఆర్జిస్తున్నాయి. అయితే గత సీజన్లో ఒక జట్టుకు రూ. 33 కోట్లు ఆదాయాన్ని సమకూర్చిన ఒక ప్రధాన స్పాన్సర్... ఈ సారి అంత మొత్తం ఇవ్వలేమంటూ సంప్రదింపులకు దిగింది. మిగతా జట్లకూ ఇదే అనుభవం ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. కరోనా కారణంగా ఈ సారి ఈ ఆదాయంలో కూడా గండిపడే అవకాశముంది. ఖర్చులు అదనం యూఏఈలో జరిగే టోర్నీ కోసం ఆటగాళ్ల భద్రత దృష్ట్యా చార్టెడ్ ఫ్లయిట్స్‌ను ఫ్రాంచైజీలు వినియోగించనున్నాయి. లీగ్ జరిగినన్ని రోజులు ఆటగాళ్ల వసతి, వారుండే హోటళ్లలో బయో సెక్యూర్ పరిస్థితుల ఏర్పాటు, రవాణా వీటన్నింటికి భారీగా ఖర్చయ్యే అవకాశముంది. వీటి కోసమే దాదాపు రూ. 10–12 కోట్లు ఖర్చయ్యే అవకాశముందని ఫ్రాంచైజీలు పేర్కొన్నాయి. భారత్‌లో ఖర్చుతో పోలిస్తే ఇది 50–60 శాతం అదనం. మరో వైపు టికెట్లు అమ్మకపోవడం ద్వారా తాము కోల్పోయే ‘గేట్ రెవెన్యూ’కు నష్టపరిహారం చెల్లించాలంటూ ఫ్రాంచైజీలు చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ నిర్ద్వద్వంగా తిరస్కరించింది. అదే విధంగా ఈ ఏడాది మ్యాచ్‌లు జరగకపోయినా దేశంలో ఎనిమిది ఐపీఎల్ జట్లకు కేంద్రాలుగా ఉన్న రాష్ట్ర సంఘాలకు ప్రతీ ఏటా ఒక్కో ఫ్రాంచైజీ చెల్లించే రూ. 8 కోట్లు (మొత్తం రూ. 64 కోట్లు) కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని దిగువ స్థాయి క్రికెట్‌ను ప్రోత్సహిస్తేందుకు ఉపయోగిస్తామని, ఈ డబ్బు లేకపోతే ఆయా సంఘాల్లో క్రికెట్ దెబ్బ తింటుందని బోర్డు అభిప్రాయ పడింది. -
10న ‘ఫైనల్’ చేశారు
ముంబై: గత పుష్కరకాలంగా ఐపీఎల్ నిరాటంకంగా జరుగుతోంది. దక్షిణాఫ్రికాలో జరిగినా... పుట్టింట్లో నిర్వహించినా... విజేత మాత్రం ‘సూపర్ సండే’లోనే తేలింది. కానీ ఈసారి ఆనవాయితీ మారింది. ఫైనల్ ఆదివారం కాకుండా మంగళవారం నిర్వహించనున్నారు. లీగ్ చరిత్రలో తొలిసారి ఈ మార్పు చోటుచేసుకుంది. ఆదివారం ఎక్కడివారక్కడే ఉండి వర్చువల్ పద్ధతిలో జరిగిన ఐపీఎల్ పాలకమండలి (గవర్నింగ్ కౌన్సిల్–జీసీ) సమావేశంలో ఆట కోసం మూడు వేదికల్ని, గరిష్టంగా యూఏఈకి వెళ్లే ఫ్రాంచైజీ ఆటగాళ్లను ఖరారు చేశారు. దుబాయ్, అబుదాబి, షార్జా స్టేడియాల్లో 53 రోజుల పాటు మెరుపుల టి20లు జరుగుతాయి. 24 మంది ఆటగాళ్లతో కూడిన ఫ్రాంచైజీలు అక్కడికి ఈ నెలలోనే బయల్దేరతాయి. ముందుగా అన్నట్లు నవంబర్ 8న కాకుండా నవంబర్ 10న ఫైనల్ నిర్వహిస్తారు. భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా డ్రాగన్ స్పాన్సర్‌షిప్‌పై వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ఈ సీజన్లో పాత స్పాన్సర్లనే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ‘వివో ఐపీఎల్–2020’కి సంబంధించిన కీలక నిర్ణయాలను జీసీ వెలువరించింది. యూఏఈలో ఐపీఎల్ టోర్నీ నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి అనుమతి లభించిందని ఆదివారం రాత్రి వార్తలు వచ్చినా... బీసీసీఐ మాత్రం ఇంకా అనుమతి రాలేదని... ఈ వారంలో గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశముందని తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇవీ ప్రధానాంశాలు... ► యూఏఈలో జరిగే ఐపీఎల్–13వ సీజన్ సెప్టెంబర్ 19న మొదలవుతుంది. దీపావళికి (నవంబర్ 14న) నాలుగు రోజుల ముందుగా నవంబర్ 10న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ∙మ్యాచ్‌ల సమయం మారింది. రాత్రి 8 గంటలకు కాకుండా అరగంట ముందుగా గం. 7.30 నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. 53 రోజుల షెడ్యూల్లో 10 రోజులు మాత్రం ఒకే రోజు రెండేసి మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ∙రెండు మ్యాచ్‌లు ఉన్న రోజున మాత్రం తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 3.30న మొదలవుతుంది. ఐపీఎల్లో పాల్గొనే ఫ్రాంచైజీలు ఈ నెల 26 తర్వాత అక్కడికి బయలు దేరతాయి. ఒక్కో జట్టు గరిష్ట పరిమితి 24 మంది ఆటగాళ్లు. ► కరోనా మహమ్మారి దృష్ట్యా టోర్నీ మధ్యలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆ ఆటగాళ్లను సబ్స్టిట్యూట్లతో భర్తీ చేసుకునే వెసులుబాటు ఉంది. ► మొదట ప్రేక్షకుల్లేకుండానే పోటీలు జరుగుతాయి. కొన్ని మ్యాచ్‌లు జరిగాక అక్కడి స్థానిక ప్రభుత్వ ఆమోదం లభిస్తే కొంతమందికి ప్రవేశం కల్పిస్తారు. ► భారత స్టార్ ఆటగాళ్లయినా... విదేశీ ప్లేయర్లయినా... అందరూ చార్టెడ్ విమానాల్లోనే యూఏఈకి చేరుకోవాలి. ► నిష్ణాతుల ఆధ్వర్యంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) రూపొందిస్తారు. జీవరక్షణ వలయం (రక్షిత బుడగ) ఏర్పాటు కోసం టాటా గ్రూప్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ► యూఏఈ హాస్పిటళ్లకు చెందిన స్పెషాలిటీ డాక్టర్లతో కూడిన ఉన్నతస్థాయి వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. ► ఐపీఎల్ స్పాన్సర్లు యథాతథంగా 2020 సీజన్లోనూ కొనసాగుతారు. ► గత ఐపీఎల్ సమయంలో నిర్వహించినట్లుగా ఈసారీ టోర్నీ చివరి దశలో మహిళల టి20 చాలెంజ్ టోర్నీని నిర్వహిస్తారు. యూఏఈలోనే ఈ టోర్నీ జరుగుతుంది. మూడు మహిళల జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు (మూడు లీగ్ మ్యాచ్‌లు, ఒక ఫైనల్) ఉంటాయి. -
అన్నీ చర్చిస్తారా... అంతా చెప్పేస్తారా!
ఇప్పటికే ఈ ఏడాది ఆలస్యమైన ఐపీఎల్ ముందుకు వెళ్లేందుకు రెండు అడుగులు పడ్డాయి. మొదటిది వేదిక. రెండోది షెడ్యూల్. ఇక ఆఖరి అడుగే మిగిలుంది. అదే విధి విధానాలు. ఎందుకంటే ఇన్నాళ్లు భారత్‌లో జరిగాయి. ఇంటాబయటా పోటీలుండేవి. కానీ ఇది కరోనా కాలం. జరిగేది యూఏఈ వేదికపై! దీంతో పెద్ద కసరత్తే అవసరమైంది. అందుకే నేడు జరిగే పాలకమండలి (గవర్నింగ్ కౌన్సిల్–జీసీ) సమావేశం అత్యంత కీలకమైంది. ఆదివారమే అన్నీ చర్చిస్తారు. అనంతరం అంతా చెప్పేస్తారు. అక్కడికి వెళ్లిన దగ్గరి నుంచి తిరిగి స్వదేశం చేరేదాకా చేయాల్సినవి... చేయకూడనివి అన్నీ కూలంకశంగా చర్చిస్తారు. ఒక్కో ఫ్రాంచైజీలో వెళ్లే ఆటగాళ్ల సంఖ్య, ఆడే మ్యాచ్‌లు... ఉండే పరిమితులు, ఏర్పాటు చేసే బుడగ, దాటితే వచ్చే సమస్యలు ఇలా ఒకటి రెండు కాదు... అన్నింటికీ సమాధానాలు ఈ సమావేశంలోనే వెల్లడవుతాయి. ముందు కావాల్సింది... ఆమోదం కరోనా వాయిదా వేసినా... వరల్డ్‌కప్‌తో కలిసొచ్చిన కాలంతో ఐపీఎల్‌కు రంగం సిద్ధమవుతోంది. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చకచకా పనులు చక్కబెడుతున్నప్పటికీ భారత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కావాల్సిందే. యూఏఈలో నిర్వహించేందుకు, అక్కడికి భారత ఆటగాళ్లను, సిబ్బందిని చార్టెడ్ ఫ్లయిట్లలో తరలించేందుకు సర్కారు అనుమతి కావాలి. ఇప్పటికైతే కేంద్రం స్పందించలేదు. అయితే కరోనా ప్రొటోకాల్ పాటిస్తే ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత ఉండదు. అందుకే ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ కేంద్ర ప్రభుత్వం ఆమోదం వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నేడు జరిగే సమావేశంలో బోర్డు అధ్యక్ష, కార్యదర్శులు సౌరవ్ గంగూలీ, జై షాలతో పాటు కోశాధికారి అరుణ్ ధుమాల్, ఐపీఎల్ జీసీ సభ్యులు, ఫ్రాంచైజీ యజమానులు పాల్గొంటారు. విదేశాల్లో కొత్త కాకపోయినా... ఐపీఎల్ విదేశీ గడ్డపై జరగడం ఇదే తొలిసారి కాదు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండుసార్లు (2009లో పూర్తిగా దక్షిణాఫ్రికాలో, 2014లో మరోసారి పాక్షికంగా యూఏఈలో) ఐపీఎల్ మ్యాచ్‌లు దేశం బయట జరిగాయి. అలాగని ఇది కూడా అంత సులభమే అనుకుంటే పొరపాటు. ఆ టోర్నీలకు ఇప్పటి టోర్నీకి చాలా తేడా. ఆటగాళ్లు, సిబ్బంది రక్షణే కత్తిమీద సాములా తయారైంది. అయితే ఇంగ్లండ్‌లో సాఫీగా జరిగిన విండీస్ పర్యటనతో ఎనిమిది ఫ్రాంచైజీలు ఆడే ఐపీఎల్‌ను పోల్చలేం. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ)లోని నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి. ఈ మీటింగ్ అనంతరం ఫ్రాంచైజీలకు ఎస్ఓపీ బుక్‌లెట్‌ను అందజేస్తారు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ దరిచేరకుండా ఏర్పాటు చేసే జీవ రక్షణ వలయంపై చర్చిస్తారు. ఈ బుడగలో ఉంటే సరి... మరి గాయంతోగానీ, పొరపాటుగా కానీ బుడగ దాటితే ఎదురయ్యే పరిణామాలేంటి అనే అంశాలే అన్ని ఫ్రాంచైజీలను వేధిస్తున్నాయి. డివిలియర్స్ కష్టమేనా... దక్షిణాఫ్రికాలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సఫారీ ప్లేయర్లు ఈ సీజన్లో ఆడే అవకాశాలు క్లిష్టమవుతున్నాయి. దీంతో ‘మిస్టర్ 360’ డివిలియర్స్ మెరుపులు ఉండవేమో! అలాగే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, విండీస్ ఆటగాళ్లు తొలి రౌండ్ పోటీలకు అందుబాటులో ఉండరు. ద్వైపాక్షిక సిరీస్‌లతో బిజీగా ఉండటం వల్లే సెప్టెంబర్‌లో జరిగే పోటీల్లో ఆడకపోవచ్చు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ వల్ల విండీస్ ఆటగాళ్లు ఆలస్యంగా ఐపీఎల్ ఆడేందుకు వస్తారు. ఆటగాళ్ల వెంట భార్యలను, గర్ల్‌ఫ్రెండ్స్‌ను అనుమతించే అంశంపైనే పాలక మండలి తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇది ఒక్కో జట్టులోని గరిష్ట పరిమితికి లోబడి ఉండొచ్చని బోర్డు వర్గాలు తెలిపాయి. -
ప్రేక్షకుల్ని అనుమతిస్తాం!
దుబాయ్: తమ దేశంలో జరిగే ఐపీఎల్–13 మ్యాచ్‌లు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతిస్తామని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది. ప్రభుత్వ ఆమోదం లభిస్తే... సీటింగ్ సామర్థ్యంలో 30 నుంచి 50 శాతం వరకు ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉందని ఈసీబీ కార్యదర్శి ముబాషిర్ ఉస్మాని చెప్పారు. ఐపీఎల్ తుది షెడ్యూల్ ఖరారు చేశాక లీగ్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ మాట్లాడుతూ... ప్రేక్షకులను అనుమతించే విషయం పూర్తిగా యూఏఈ ప్రభుత్వం, ఈసీబీ పరిధిలోనే ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం బీసీసీఐ... భారత ప్రభుత్వ అమోదం కోసం ఎదురుచూస్తోంది. భారత్ నుంచి అధికారిక ఆమోదం లభించిన వెంటనే యూఏఈ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని ముబాషిర్ తెలిపారు. తమ దేశంలో పూర్తిస్థాయిలో జరిగే ఐపీఎల్లో కచ్చితంగా ప్రేక్షకులు ఉండాలనే కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే పూర్తి సామర్థ్యం ఉండదని 30 నుంచి 50 శాతం మేర అనుమతిస్తామని, దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని ఆయన వెల్లడించారు. యూఏఈ లో కరోనా నియంత్రణలోనే ఉంది. ప్రస్తుతం 6000 కేసులే ఉన్నాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు జరుగుతాయి. -
ఏమిటి.. ఎలా.. ఎందుకు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2020 ప్రకటన ఇప్పటికే వచ్చేసింది... సెప్టెంబర్ 19నుంచి యూఏఈ వేదికగా టోర్నీ జరగడం ఖాయమైంది. ప్రధానంగా టీవీ ద్వారానే వినోదాన్ని పొందే సగటు క్రికెట్ అభిమానికి ఇది ఒక సంబరంలాంటిదే. ఫోర్లు, సిక్సర్ల హోరు... విధ్వంసకర బ్యాటింగ్ గురించి ఇకపై ఎంత చర్చించినా తక్కువే. అయితే అభిమానులకు సంబంధం లేని మరో అంశం ఇప్పుడు ఐపీఎల్ విషయంలో కీలకంగా మారింది. అసలు మైదానంలో దిగే ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉండబోతోంది...ఫ్రాంచైజీలు ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి...కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే లీగ్ విజయవంతంగా పూర్తవుతుంది... ఇలాంటి సందేహాలన్నీ నిర్వాహకులు తీర్చాల్సి ఉంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ఖరారు చేసేందుకు బోర్డు ఆదివారం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణలో ఎదురు కానున్న సవాళ్లు ఏమిటి? వీటికి బీసీసీఐ సమావేశంలో సమాధానం లభిస్తుందా అనేది చూడాలి. పాజిటివ్‌గా తేలితే... ఐపీఎల్‌లోని ఎనిమిది జట్ల ఆటగాళ్లను బయో సెక్యూర్ బబుల్‌లో ఉంచడంలో ఫ్రాంచైజీలదే బాధ్యత కానుంది. టోర్నీకి కొద్ది రోజుల ముందునుంచీ వీరందరినీ క్వారంటీన్లో ఉంచుతారా అనేదానిపై స్పష్టత లేదు. ఒక వేళ టోర్నీ జరిగే సమయంలో ఎవరైనా ఒక ఆటగాడు ‘పాజిటివ్’గా తేలితే అప్పుడేం చేయాలని ఫ్రాంచైజీలు మరింత సమాచారం కోరుతున్నాయి. సదరు ఆటగాడి జట్టులోని సహచరులందరినీ మళ్లీ పరీక్షిస్తారా...అదే హోటల్లో మరో జట్టు ఉంటే జట్టు మొత్తాన్ని ఐసోలేట్ చేస్తారా తెలియదు. ఆ జట్టు తర్వాతి రోజు మ్యాచ్ ఆడాల్సి ఉంటే దానిని రద్దు చేస్తారా లేక వాయిదా వేస్తారా చూడాలి. ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ తరహాలో ఎవరైనా ‘బబుల్’ దాటి బయటకు వస్తే అప్పుడేం చేయాలనేది తెలియాలి. ఐపీఎల్ ఆడేవారికి ఎన్ని రోజులకు ఒకసారి టెస్టులు నిర్వహిస్తాలో కూడా నిర్ణయించాల్సి ఉంది. కొన్ని జట్లలోని ప్రధాన ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను కూడా తీసుకొస్తామని ఇప్పటికే ఫ్రాంచైజీలకు చెప్పేశారు. దీనిపై మరింత స్పష్టత అవసరం. అదనపు ఆటగాళ్లు ఎలా... కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఐపీఎల్లో ఆడటంపై సందేహాలు రేకెత్తుతున్నాయి. అదే జరిగితే వారి స్థానంలో కొత్త ఆటగాళ్లకు ఎలా తీసుకోవాలనే విషయంపై బోర్డుకు స్పష్టత లేదు. ముఖ్యంగా బెంగళూరు జట్టులో గరిష్టంగా 21 మంది మాత్రమే ఉండగా...వారిలో ముగ్గురు సఫారీ ఆటగాళ్లు ఉన్నారు. ఇదే కాకుండా టోర్నీ మధ్యలో ఎవరికైనా గాయమైతే అప్పటికప్పుడు మరో ఆటగాడిని తీసుకునేవారు. ఇప్పుడు అలా చేయాలంటే మళ్లీ అతనికి కోవిడ్ పరీక్షలు, క్వారంటీన్‌లాంటి సమస్యలన్నీ ఉన్నాయి. అలా కాకుండా ముందే సన్నద్ధమై పెద్ద సంఖ్యలో జట్టును తీసుకెళ్లే అవకాశం ఇస్తారా చూడాలి. యూఏఈ చేరడం, వసతి... తమ ఆటగాళ్లకు కనీసం మూడు వారాల ప్రాక్టీస్ ఉండాలంటూ, ఇందు కోసం ఆగస్టు 20 వరకే యూఏఈ వెళతామంటూ కొన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐకి సమాచారం అందించాయి. భారత క్రికెటర్లతో పాటు తమ జట్టులోని విదేశీ ఆటగాళ్లకు కూడా ఒకే చోటికి చేరేలా చేయడం కూడా జట్టు యాజమాన్యాలదే బాధ్యత. మ్యాచ్‌లు మూడు నగరాల్లో ఉన్నా...సౌకర్యాలను బట్టి చూస్తే దుబాయ్‌లో ఉండటాన్నే అన్ని జట్లు ఇష్టపడుతున్నాయి. కొందరు ఇప్పటికే హోటళ్ల ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే అవే హోటళ్లకు వచ్చే పర్యాటకులు, ఇతర అతిథుల విషయంపై వారూ కొంత ఆందోళనగానే ఉన్నారు. కనీసం 80 రోజులు ఉండాల్సి రావడంతో అన్ని రోజులు హోటళ్లలో సోషల్ డిస్టెన్సింగ్‌తో కొనసాగడం అంత సులువు కాదు. బయటివారిని అనుమతిస్తారా... ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రధానంగా యూఏఈ దేశపు నిబంధనలను పరిగణలోకి తీసుకుంటూ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్–విండీస్ టెస్టు సిరీస్ తరహాలో క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బంది, హోటల్, భద్రతా సిబ్బంది అంతా కరోనా టెస్టులు నెగిటివ్‌గా తేలిన తర్వాత బయో బబుల్‌లోకి వచ్చారు. సిరీస్ ముగిసే వరకు అంతా ఒకే చోట ఉన్నారు. ఇప్పుడు ఐపీఎల్లో ఎనిమిది జట్లతో పాటు ఇతరులంతా సుదీర్ఘ కాలం ఇలా ఉండటం సాధ్యమేనా. ఇంగ్లండ్ సిరీస్‌లో ఆటగాళ్లను తీసుకువెళ్లే బస్సు డ్రైవర్ కూడా వరుసగా కోవిడ్ పరీక్షలకు హాజరు కావాలని నిబంధన పెట్టడంతోనే ఎవరూ ముందుకు రాలేదని తెలిసింది. అందువల్లే సౌతాంప్టన్ నుంచి మాంచెస్టర్ వరకు వారంతా సొంత కార్లలో ప్రయాణించగా ఆర్చర్ మధ్యలో ఇంటికి వెళ్లిన ఘటన మరచిపోవద్దు! -
ప్రభుత్వ నిర్ణయమే తరువాయి!
దుబాయ్: ఐపీఎల్–13ను యూఏఈలో నిర్వహించడానికి రంగం సిద్ధమవుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పంపిన అంగీకార పత్రం తమకు అందిందని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) జనరల్ సెక్రటరీ ముబాషిర్ ఉస్మాని సోమవారం వెల్లడించారు. ఇక లీగ్ నిర్వహణకు భారత ప్రభుత్వ ఆమోదమే మిగిలి ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా విజృంభణతో ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ టోర్నీ వాయిదా పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌లో లీగ్ నిర్వహించడం కష్టంగా మారింది. దీంతో తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ముందుకు రావడంతో... అందుకు బీసీసీఐ అంగీకరించింది. తాజాగా దానికి సంబంధించిన ‘అంగీకార పత్రాన్ని’ ఈసీబీకి మెయిల్ ద్వారా బీసీసీఐ పంపింది. 13వ సీజన్ పోటీలు సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో జరుగుతాయని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్æ పటేల్ ఇదివరకే ప్రకటించారు. అందుకోసం అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికలను ఎంపిక చేశారు. -
ఇంతకీ ఏం చేద్దాం?
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఆటకు యూఏఈలో ఏర్పాట్లు జరుగుతుండగా... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇక్కడ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)పై సమాలోచనలు చేస్తోంది. ఆటగాళ్ల రక్షణ కోసం ఏర్పాటు చేయబోయే జీవ భద్రత వలయంపై ప్రత్యేకంగా దృష్టిసారించిన బోర్డును అసలు కంటే కొసరు సమస్యే కాస్త తికమక పెడుతున్నట్లుంది. ఆటగాళ్ల సతీమణులు, ప్రియురాళ్లను బుడగలోకి తీసుకురావాలా లేదంటే ఇప్పుడున్న కరోనా ప్రొటోకాల్ పరిస్థితుల్లో అనుమతి నిరాకరించాలా అన్న అంశంపై బోర్డు తర్జనభర్జన పడుతోంది. దీనిపై ఫ్రాంచైజీల నుంచి భిన్నవాదనలు వచ్చినట్లు తెలిసింది. కొన్ని ఫ్రాంచైజీలేమో అసలే బయటి ప్రపంచంతో సంబంధం లేనట్లుగా గప్‌చుప్‌గా (ప్రేక్షకుల్లేకుండా) జరిగే ఈవెంట్ కాబట్టి... ఆటగాళ్లతో కనీసం కుటుంబసభ్యుల్ని అనుమతించాలని సూచిస్తున్నాయి. ఇతర ఫ్రాంచైజీలేమో వారిని బుడగలోకి తెస్తే... రెండు, మూడేళ్లున్న పిల్లల సంరక్షణ ఎలా? షాపింగ్‌కని, వేరే చోటుకని బుడగదాటితే ఎదురయ్యే పరిణామాలేంటని వారిస్తున్నాయి. దీనిపై త్వరలోనే బోర్డు నిర్ణయం తీసుకొని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను ఎనిమిది ఫ్రాంచైజీలకు జారీచేయనుంది. -
క్రికెటర్లకు రోజూ కరోనా పరీక్షలు నిర్వహించాలి
న్యూఢిల్లీ: యూఏఈలో ఐపీఎల్ సజావుగా జరిపేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉండాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని నెస్ వాడియా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆటగాళ్లకు ప్రతీ రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. సెప్టెంబర్ 19 నుంచి అరబ్ ఎమిరేట్స్‌లో లీగ్‌ను నిర్వహించాలని భారత బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో నెస్ వాడియా ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఐపీఎల్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ని బీసీసీఐ తయారు చేయనుంది. ‘ఐపీఎల్ జరిగే సమయంలో మైదానంలోనూ, మైదానం బయట కూడా కచ్చితమైన ఆరోగ్య పరిరక్షణ నిబంధనలు పాటించాలి. ఇందులో ఏమాత్రం రాజీ పడరాదు. సాధ్యమైనంత ఎక్కువగా కరోనా పరీక్షలు జరపాలి. సరిగ్గా చెప్పాలంటే ప్రతి రోజూ నిర్వహిస్తే మంచిది. నేనే ఆటగాడినైతే ఎలాంటి అభ్యంతరం చెప్పను. లీగ్‌లో ఎనిమిది జట్లు ఉంటాయి కాబట్టి ఇంగ్లండ్‌లో జరుగుతున్న టెస్టు సిరీస్ తరహాలోనైతే బయో సెక్యూర్ వాతావరణం సాధ్యం కాదు. కోవిడ్–19 పరీక్షల విషయంలో యూఏఈ కూడా చాలా బాగా పని చేస్తోంది కాబట్టి బీసీసీఐ అక్కడి ప్రభుత్వానికి సహకరిస్తే చాలు’ అని నెస్ వాడియా వివరించారు. టీవీలో సూపర్ హిట్టవుతుంది... కరోనా కష్టకాలంలో ఐపీఎల్‌కు స్పాన్సర్లు రాకపోవచ్చనే వాదనను నెస్ వాడియా తిరస్కరించారు. నిజానికి స్పాన్సర్లు అదనపు ప్రయోజనం పొందేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాదని ఆయన అన్నారు. ‘గతంలో ఏ ఐపీఎల్‌కూ లభించని వీక్షకాదరణ టీవీల్లో ఈసారి లీగ్‌కు దక్కనుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జనం మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రకంగా స్పాన్సర్లు ముందుకొచ్చేందుకు ఇది సరైన తరుణం’ అని పంజాబ్ యజమాని పేర్కొన్నారు. మరోవైపు ప్రేక్షకులు లేకుండా లీగ్‌ను ఆడిస్తే తాము టికెట్ల రూపేణా కోల్పోయే నష్టాన్ని బీసీసీఐ ఏదో రూపంలో భర్తీ చేస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
చలో దుబాయ్@ ఐపీఎల్-2020
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరోసారి అరబ్ దేశం చేరింది. దేశంలో కరోనా విజృంభిస్తున్నా సరే... ఎలాగైనా ఐపీఎల్ ఆదాయాన్ని కోల్పోకూడదని పట్టుదలగా ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సరైన వేదికగా కనిపించింది. దాంతో అక్కడే టోర్నీ నిర్వహణకు పచ్చ జెండా ఊపింది. తమ వద్ద లీగ్ నిర్వహించుకోవచ్చంటూ గతంలోనే యూఏఈ ఇచ్చిన ప్రతిపాదనకు భారత బోర్డు సరే అని చెప్పింది. ఇప్పుడు దీనిని గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ కూడా ఖరారు చేశారు. ఇక లీగ్ తేదీలు ప్రకటించడమే తరువాయి. ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూడలేకపోతున్నా... టీవీ ద్వారా అయినా ఐపీఎల్ వినోదం దక్కనుండటం సగటు క్రికెట్ అభిమానికి సంతోషం. ముంబై: ఐపీఎల్–2020ని యూఏఈలో నిర్వహించడం ఖాయమైంది. టోర్నీ మొత్తం అక్కడే జరపనున్నట్లు లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్, భారత మాజీ క్రికెటర్ బ్రిజేశ్ పటేల్ ప్రకటించారు. వచ్చే వారం జరిగే మరో సమావేశంలో తుది షెడ్యూల్‌తోపాటు ఇతర వివరాలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. టి20 ప్రపంచకప్ వాయిదా కోసం ఎదురుచూస్తూ వచ్చిన బీసీసీఐ ఇప్పుడు ఆ ప్రకటన రాగానే లీగ్ కార్యాచరణకు సిద్ధమైంది. కోవిడ్–19 కారణంగా పలు ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉందని పటేల్ చెప్పారు. షెడ్యూల్ ఎప్పుడంటే... ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 7 వరకు టోర్నీ జరిగే అవకాశం కనిపిస్తోంది. లీగ్ తర్వాత కొద్ది రోజులకే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సిన ఉన్న కారణంగా ఆటగాళ్లకు తగినంత విరామం ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. ప్రత్యేక విమానాల్లో... కోవిడ్–19కు సంబంధించి మన దేశంలో పలు ఆంక్షలు కొనసాగుతున్నాయి. లీగ్ విదేశంలో జరిపినా భారత ప్రభుత్వం నుంచి అనుమతి కావాలి. పైగా విదేశీ ప్రయాణాలపై కూడా నిషేధం ఉంది. దీనిపై ఇప్పటికే బీసీసీఐ అనుమతి కోరింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తనయుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా ఉండటంతో ఇది లాంఛనమే కావచ్చు. భారత క్రికెటర్లు ప్రత్యేక విమానాల్లో వెళితే... విదేశీ ఆటగాళ్లు నేరుగా యూఏఈ చేరుకుంటారు. యూఏఈ ప్రభుత్వ అనుమతి? అక్కడి ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. బీసీసీఐ ఇప్పుడు తమ తరఫు నుంచి స్పష్టతనిచ్చిన తర్వాత నిర్ణయం రావచ్చు. అయితే గతంలో యూఏఈ బోర్డు ఐపీఎల్‌ను తమ వద్ద నిర్వహించమని స్వయంగా విజ్ఞప్తి చేసింది కాబట్టి ఈ విషయంలో సమస్య ఉండకపోవచ్చని భారత బోర్డు భావిస్తోంది. ఇప్పటికే యూఏఈ అనుమతి కోసం బోర్డు దరఖాస్తు చేసింది. ప్రేక్షకులకు ప్రవేశముందా? ఇది కూడా యూఏఈ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మంగళవారం నాటికి యూఏఈలో సుమారు 57 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కోలుకున్నవారి సంఖ్య కూడా 49 వేలు ఉండటం విశేషం. కాబట్టి అక్కడ కరోనా మహమ్మారి తీవ్రత తక్కువే. అయితే బీసీసీఐ మాత్రం ప్రేక్షకుల విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీవీ, వెబ్ ప్రసారాల ఆదాయమే లక్ష్యంగా ఖాళీ మైదానాల్లోనైనా నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం టికెట్ల ద్వారా వచ్చే ‘గేట్ రెవెన్యూ’ కోల్పోయినా నష్టం లేదని బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. మ్యాచ్‌ల వేదికలు, ఏర్పాట్లు... దుబాయ్, అబుదాబి, షార్జా వేదికలుగా టోర్నీ జరుగుతుంది. మన దేశంలో 2014లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సమయంలో ఐపీఎల్ తొలి భాగం (20 మ్యాచ్‌లు) ఇక్కడే జరిగాయి. అన్ని వసతులున్న అత్యాధునిక స్టేడియాలు ఉండటంతో పాటు గతానుభవంతో బీసీసీఐకి ఇక్కడ నిర్వహణ కష్టం కాకపోవచ్చు. లీగ్‌కు కుదించకుండా పూర్తి స్థాయిలో 60 మ్యాచ్‌లు జరుపుతామని బ్రిజేశ్ పటేల్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను పాటించాల్సి ఉంటుంది. ఐసీసీ మార్గనిర్దేశకాలు పరిగణలోకి తీసుకొని టోర్నీ జరపాలి. బయో–బబుల్ సెక్యూరిటీలో నిర్వహణ దాదాపు అసాధ్యం. క్వారంటైన్ విషయంలో యూఏఈ ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందే. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఐపీఎల్ జట్లు కనీసం నెల రోజుల ముందుగా ఆ దేశంలో మకాం వేయాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటినవారు (సునీల్ గావస్కర్ తదితరులు) తమ ఇంటినుంచే కామెంటరీ చేసే అవకాశం ఉందో పరిశీలిస్తున్నారు. -
యూఏఈనే ప్రత్యామ్నాయం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నత స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. ఐపీఎలే అజెండాగా చర్చించింది. కానీ... అచ్చూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లాగే ప్రపంచకప్‌పై ఏ నిర్ణయం తీసుకోనట్లే... లీగ్‌పై కూడా మన బోర్డు స్పష్టమైన నిర్ణయమేదీ తీసుకోలేదు. అయితే బోర్డు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... దేశంలో మిలియన్ కరోనా బాధితులు (10 లక్షలు) దాటిన నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్ పుట్టింట్లో జరిగే అవకాశాలైతే లేవు. అందుకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోనే లీగ్ మెరుపులు సాధ్యమవుతాయి. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో యూఏఈనే సరైన ప్రత్యామ్నాయమని బోర్డు పెద్దలు అభిప్రాయపడ్డారు. ఇక భారత జట్టు కసరత్తు కోసం మూడు వేదికల్ని పరిశీలించారు. మార్చి నుంచి అసలు మైదానంలోకి దిగని టీమిండియాకు నిర్వహించే శిబిరం కోసం దుబాయ్‌తో పాటు అహ్మదాబాద్, ధర్మశాల వేదికలపై చర్చ జరిగింది. ఒకవేళ ఐపీఎల్ గనక యూఏఈలో జరిగితే కోహ్లి సేనకు దుబాయ్‌లో శిబిరం అనివార్యమని బోర్డువర్గాలు తెలిపాయి. -
ప్రత్యేక విమానం.. బోనస్.. గ్రేట్ సర్!
‘‘కష్టసుఖాల్లో నాకు తోడున్న ఉద్యోగులను కాపాడుకోవడం నా బాధ్యత. నా విజయవంతమైన ప్రయాణంలో భాగస్వామ్యమైన వారికి ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పుకొనే అవకాశం లభించింది. మా సంస్థలో పనిచేసే వాళ్లు కూడా మా కుటుంబ సభ్యులే. నిజానికి వాళ్లు బాగుంటేనే సంస్థ బాగుంటుంది. వారు కష్టాల్లో ఉంటే నేనెలా చూస్తూ ఊరుకోగలను. నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను అంతే’’ అంటూ ఆర్. హరికుమార్ అనే వ్యాపారవేత్త పెద్ద మనసు చాటుకున్నారు. లాక్డౌన్ కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చిక్కుకుపోయిన తన కంపెనీ ఉద్యోగులను ప్రత్యేక విమానంలో భారత్‌కు పంపించారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లాలనుకున్న వారి ఆకాంక్షను నెరవేర్చారు. (పాక్‌లో భారత అధికారులు మిస్సింగ్) అంతేకాదు నెల జీతం బోనస్‌గా ఇవ్వడంతో పాటుగా వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక బహుమతులు కూడా పంపించారు. అదే విధంగా తిరిగి యూఏఈకి వెళ్లేందుకు ఇష్టపడని వాళ్లు తమిళనాడులోని కోయంబత్తూరులో గల ప్లాంట్‌లో పనిచేసే వీలు కల్పించారు. సంస్థ కోసం శ్రమంచిన తమ కష్టాన్ని గుర్తించి.. వారికి అండగా నిలబడిన హరికుమార్‌పై ఉద్యోగులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాలు.. కేరళలోని అలప్పుళకు చెందిన హరికుమార్ థియేటర్ ఆర్టిస్టు. 20 ఏళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన ఆయన.. తదనంతర కాలంలో గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగారు. (పిల్ల బంట్లు.. న్యాయపోరాటం) ఈ క్రమంలో భవన నిర్మాణరంగం, ఇతర రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను సొంత మనుషుల్లా భావించే కుమార్.. యూఏఈలో ఉండిపోయిన 120 మంది ఉద్యోగులను కొచ్చి పంపేందుకు ప్రత్యేక విమానం బుక్ చేశారు. కేవలం వారే కాకుండా భారత్‌కు వెళ్లేందుకు టికెట్లు దొరక్క కష్టాలుపడుతున్న మరో 50 మంది ప్రవాస భారతీయుల కోసం కూడా టికెట్లు కొన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 170 మందితో షార్జా నుంచి బయల్దేరిన విమానం ఆదివారం రాత్రి కొచ్చి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. -
కరోనా: బుర్జ్ ఖలీఫా..12 లక్షల భోజనాలు!
దుబాయ్ : దుబాయ్‌లో ఉన్న ప్రపంచంలోనే ఎత్తయిన భవనం బుర్జ్ ఖలీఫా నిర్వాహకులు వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టారు. కరోనా వల్ల ఇబ్బందులు పడే పేద ప్రజలను ఆదుకునేందుకు విరాళాల సేకరణ ప్రారంభించారు. ఈ ప్రక్రియలో భాగంగా దాతలెవరైనా 10 దిర్హామ్‌ల విరాళం(ఒక భోజనానికి అయ్యే ఖర్చు) అందిస్తే బుర్జ్ ఖలీఫా భవనం ముందు భాగంలో ఒక లైటు వెలిగించేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటి వరకు మొత్తం 12 లక్షల మంది విరాళాలు అందించడంతో 1.2 మిలియన్ల లైట్లు అమ్ముడుపోయాయని నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా 12 లక్షల లైట్లను వెలిగించి దాతల్లో స్పూర్తి నింపారు. (ఒక్కరోజులో 3,525 కేసులు ) కాగా రంజాన్ సందర్భంగా ఎంబీఆర్జీఐ(ఆర్గనైజింగ్ బాడీ ద మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్) ద్వారా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు దాదాపు 10 మిలియన్ల భోజనానికి సరిపడే నిధులు సమకూర్చేందుకు ఈ విరాళ సేకరణ ప్రక్రియ చేపట్టినట్లు దుబాయ్ పాలకుడు, యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. ఇక కరోనా కారణంగా దుబాయి ఆర్థిక పరిస్థితి విపరీతంగా దెబ్బతింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాలు, పర్యాటక ప్రాంతాలు, వ్యాపారాలు పూర్తిగా కుప్పకూలిపోయాయి. యూఏఈలో ఇప్పటి వరకు 19,881 కరోనా కేసులు నమోదవ్వగా 203 మంది ప్రాణాలు కోల్పోయారు. (పట్టాలెక్కిన రైళ్లు.. ప్రయాణానికి రెడీనా! ) -
గల్ఫ్ కార్మికులకు శుభవార్త..
మోర్తాడ్ (బాల్కొండ): కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల కారణంగా సొంతూళ్లకు వెళ్లిపోవాలనుకుంటున్న వలస కార్మికులకు కువైట్ మినహా అన్ని గల్ఫ్ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలు శుభవార్తను అందించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా, ఒమన్, బహ్రెయిన్, ఖతర్ తదితర దేశాలలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్డౌన్ అమలవుతోంది. దీంతో అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఉద్యోగాలు కోల్పోయిన వేలాదిమంది భారత కార్మికులు తమను స్వదేశానికి రప్పించేలా చూడాలని కోరడంతో గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు వారిని ఆదుకోవడానికి చర్యలు చేపట్టాయి. ఇంటికి చేరుకోవాలనుకునే భారతీయ కార్మికులు మన విదేశాంగ శాఖ వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాయబార కార్యాలయాలు తెలిపాయి. -
కరోనా: మీ పౌరులను తీసుకువెళ్లండి.. లేదంటే..
అబుదాబి: కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తున్న తరుణంలో తమ దేశంలో చిక్కుకుపోయిన పౌరులను స్వదేశాలకు తీసువెళ్లని దేశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హెచ్చరించింది. వర్క్ వీసాలపై ఆంక్షలు కఠినతరం చేస్తామని పేర్కొంది. ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా తమ దేశంలో చిక్కుకుపోయిన ఇతర దేశాల పౌరులకు కరోనా నిరార్ధరణ పరీక్షల్లో నెగటివ్ ఫలితం వస్తే స్వదేశాలకు పంపిస్తామని యూఏఈ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. అన్ని దేశాల రాయబార కార్యాలయాలకు ఈ మేరకు సమాచారం అందించింది. అయితే ఇప్పటి వరకు చాలా దేశాలు ఇందుకు స్పందించకపోవడంతో వర్క్ వీసాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీచేసింది.(కుప్పలుగా శవాలు.. అక్కడే ఎందుకు ఎక్కువ మరణాలు? ) కాగా దాదాపు 90 లక్షల జనాభా కలిగిన యూఏఈలో చాలా మంది పొట్టికూటి కోసం వచ్చిన వారే ఉన్నారు. ఇక ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న తరుణంలో కరోనా నెగటివ్‌గా తేలి... స్వదేశాలకు వెళ్లాలని భావిస్తున్న వారిని తమ దేశాలకు పంపుతామని రెండు వారాల క్రితం యూఏఈ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు 25 వేల మంది పాకిస్తానీలు దుబాయ్, అబుదాబిలో చిక్కుకుపోయారని పాకిస్తాన్ యూఏఈ రాయబారి గులాం దస్తగిర్ గల్ఫ్ న్యూస్‌కు వెల్లడించారు. వారిని స్వదేశానికి తరలించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే మిగతా దేశాల నుంచి సరైన స్పందన రాకపోవడంతో యూఏఈ తాజాగా ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఇక కరోనా ధాటికి ఇప్పటివరకు యూఏఈలో 20 మంది మరణించగా.. 3736 మంది దీని బారిన పడ్డారు. కరోనా వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా మాల్స్, రెస్టారెంట్లు మూసివేసింది. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించింది.(కరోనా: భారత్ నుంచి 444 మంది స్వదేశాలకు) భారత్ నుంచి 1300 మంది వెనక్కి: అమెరికా -
ప్రియురాలిని హత్యచేసి.. శవంతో ప్రయాణం
దుబాయ్: ప్రియురాలి మీద అనుమానంతో దారుణానికి తెగబడ్డాడో యువకుడు. ఆమెను హత్య చేసి ఏకంగా 45 నిమిషాల పాటు శవంతో ప్రయాణించాడు. ఆఖరికి పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. చేసిన నేరానికి త్వరలోనే శిక్ష అనుభవించబోతున్నాడు. గత జూలైలో దుబాయ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానిక కోర్టు ఆదివారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలు న్యాయస్థానానికి వెల్లడించారు. ఈ మేరకు... భారత్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో భారత్‌కే చెందిన యువతితో అతడు ప్రేమలో పడ్డాడు. కొన్ని రోజులపాటు సజావుగా సాగిన వీరి బంధంలో అనుమానం చిచ్చు పెట్టింది. తనను కాదని ప్రియురాలు మరో వ్యక్తితో మాట్లాడుతోందని భావించిన సదరు యువకుడు.. తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో కారులో తనను తీసుకువెళ్లి... నచ్చచెప్పేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం ముదిరి... చివరకు వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియురాలి గొంతు కోశాడు. కారు ముందు సీట్లో తన శవాన్ని పెట్టుకుని దాదాపు 45 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఓ హోటల్లో ఆగి భోజనం చేశాడు. అనంతరం డైరాలోని పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో కేసు ఆదివారం విచారణకు వచ్చింది. ఈ విషయం గురించి పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘రక్తం నిండిన దుస్తులతో అతడు పోలీసు స్టేషనులో అడుగుపెట్టగానే నేను షాకయ్యాను. వణుకుతున్న గొంతుతో తన గర్ల్‌ఫ్రెండ్‌ను చంపేశానని చెప్పాడు. బాధితురాలి మృతదేహం అతడి కారు ముందు సీట్లోనే ఉంది. గొంతు కోసిన ఆనవాళ్లు కనిపించాయి. వెనుక సీట్లో పెద్ద కత్తిని మేం స్వాధీనం చేసుకున్నాం. తనను మోసం చేసిందనే అనుమానంతో ఈ ఘటనకు పాల్పడ్డట్లు నిందితుడు అంగీకరించాడు’’ అని కోర్టుకు తెలిపారు. అదేవిధంగా బాధితురాలి హత్యకు ముందు తనను చంపేస్తానంటూ ఆమె కుటుంబ సభ్యులకు ఇ-మెయిల్ పంపినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో సదరు యువకుడికి ఉరిశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ లాయర్ వాదించారు. ఇందుకు సంబంధించిన తీర్పు త్వరలోనే వెలువడనుంది. -
ఇదీ లక్ అంటే: కోట్లు గెలుచుకున్నాడు!
అబుదాబి: అదృష్టమంటే ఇదేనేమో... ఏడాది బుడ్డోడు ఒక మిలియన్ డాలర్(సుమారు ఏడు కోట్ల పైచిలుకు) గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. ఈ అరుదైన ఘటన దుబాయ్‌లో జరిగింది. రమీస్ రహ్మాన్ అనే కేరళకు చెందిన వ్యక్తి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ నిర్వహిస్తున్న లాటరీ టికెట్లో తన అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోవాలనుకున్నాడు. వెంటనే తన ఏడాది వయసున్న కొడుకు మహమ్మద్ సాలా పేరు మీద టికెట్ కొనుగోలు చేశాడు. మంగళవారంనాడు లాటరీ సంస్థ నిర్వాహకులు లక్కీడ్రా నిర్వహించగా అందులో తనయుడు మహమ్మద్ పేరు కూడా ఉండటంతో అతని తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. (కోటి రూపాయల లాటరీ.. భయంతో పోలీసుల వద్దకు!) ‘ఇది నిజంగా ఎంతో సంతోషకరమైన వార్త. ఇక నాకు ఎలాంటి ఢోకా లేదు. లాటరీ డబ్బు నా కుమారుడి భవిష్యత్తుకు ఎంతగానో భరోసానిస్తుంది’ అని రమీస్ సంతోషంతో ఉబ్బితబ్బిబైపోయాడు. కాగా గతంలోనూ చాలామంది భారతీయులు లక్కీడ్రాలో తమ అదృష్టాన్ని నిరూపించుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఓ భారతీయ రైతు ఉపాధిని వెతుక్కుంటూ దుబాయ్‌కు వలస వచ్చాడు. కానీ సరైన ఉపాధి దొరక్కపోవడంతో భారత్‌కు తిరుగుముఖం పట్టాడు. ఈ క్రమంలో తన దగ్గర చిల్లిగవ్వ లేకపోయినప్పటికీ భార్య దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని మరీ లాటరీ టికెట్ కొనుగోలు చేయగా 4 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. దీంతో అతని దిశే తిరిగిపోయింది. చదవండి: ఎర్రచీరలో ఇరగదీసిన పెళ్లికూతురు చెత్తలో పడేసిన టికెట్.. జీవితాన్నే మార్చేసింది -
దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
అబుదాబి : దుబాయ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన ఓ మహిళ తీవ్రంగా గాయపడగా. నాలుగేళ్ల చిన్నారి అక్కడిక్కడే తనువు చాలించింది. ఈ విషాద ఘటన దుబాయ్‌కు 35 కి.మీ దూరంలో ఉన్న జెబెల్ అలీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు...యూఏఈలోని ఓ పాఠశాలలో చదువుతున్న తన కూతురుని తీసుకు రావడానికి మహిళ ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఈ క్రమంలో.. కారులో అధిక వేగంతో దుసుకొస్తున్న ఓ ఆఫ్రికన్ మహిళ వీరిని ఢీకొట్టింది. తన వాహనాన్ని రివర్స్ చేసే క్రమంలో ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు ఇద్దరు కిందపడిపోగా..పక్కనే ఆగి ఉన్న కారుకు, ఎదురుగా వస్తున్న మరో కారుకు మధ్యలో పడి నుజ్జునుజ్జు అయ్యారు. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి అక్కడికక్కడే మరణించగా, తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న మరో మూడు వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. మరోవైపు షార్జాలోని మువీలా ప్రాంతంలో కొడుకు చేతిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళ మృతి చెందారు. వివరాలు..17 ఏళ్ల బాలుడు కారును పార్క్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బ్రేక్ అనుకొని యాక్సిలేటర్‌ను లాగడంతో సమీపంలో ఉన్న తల్లిని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మహిళను ఆసుపత్రికి చేర్చగా మార్గ మధ్యలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే మైనర్ వ్యక్తికి ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడని, డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని పోలీసులు తెలిపారు. -
38 దేశాల్లో ‘పీఎం నరేంద్ర మోదీ’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘పీఎం నరేంద్ర మోదీ’ని అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తోసహా 38 దేశాల్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత ఆనంద్ పండిట్ చెప్పారు. ఒమంగ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. భారత్‌లో 1,700, ఓవర్సీస్లో 600 స్క్రీన్లలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని ఆనంద్ చెప్పారు. ‘ఈ సినిమా వినోదం సైతం ఉంది. ప్రధానిని పొగుడుతూ, విపక్ష పార్టీలకు కౌంటర్‌గా సినిమా తీయలేదు. క్రియాశీలక రాజకీయాల్లోకి మోదీ ప్రయాణాన్నే ప్రధానంగా చూపించాం’ అని చెప్పారు. సినిమా హిందీ, తెలుగు, తమిళం భాషల్లో సినిమా విడుదల కానుంది. -
అబు ధాబిలో హిందూ ఆలయం ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : ఇస్లాం దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబు ధాబి నగరంలో 26 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఓ హిందూ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం 2015లోనే యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ 16 ఎకరాల స్థలాన్ని ఉచితంగా కేటాయించగా, ఇటీవల యూఏఈ ప్రభుత్వం నిర్వహించిన సర్వమత సమ్మేళనం సందర్భంగా ఆలయంలో పార్కింగ్ ఇతర సౌకర్యాల కోసం మరో పది ఎకరాలు స్థలాన్ని విరాళంగా ప్రకటించారు. అబు ధాబి–దుబాయ్ ప్రధాన రోడ్డు పక్కన నిర్మించనున్న స్వామి నారాయణ్ ఆలయ నిర్మాణానికి ఏప్రిల్ 13వ తేదీన మహంత్ స్వామి మహరాజ్ భూమి పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వామి నారాయణ్ సంప్రదాయానికి చెందిన బ్రహ్మవిహారి స్వామి ఆలయ నిర్మాణ బాధ్యతలు చూస్తారు. అతిపెద్ద షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ మసీదుకు సమీపంలోనే ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2019 సంవత్సరాన్ని టాలరెన్స్ (సహనం) సంవత్సరంగా ప్రకటించడమే కాకుండా టాలరెన్స్ పేరిట ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మత సామరస్యం కోసం ఓ నిధిని కూడా ఏర్పాటు చేసింది. ప్రపంచంలో సహనం శాఖను ఏర్పాటు చేసిన ఏకైక దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చరిత్రలోకి ఎక్కింది. ఈ శాఖ సమన్వయంతో ఇస్లాం మత పెద్దల మండలి ఈ నెల మూడు, నాలుగు తేదీల్లో క్రైస్తవ, ఇస్లాం సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించింది. దీనికి క్రైస్తవుల తరఫున పోప్ ఫ్రాన్సిస్ హాజరుకాగా, ఇస్లాం మతస్థుల తరఫున అల్ అజర్ ఇమామ్ అహ్మద్ అల్ తయ్యబ్ ముఖ్య అతిథిగా హాజరై ఓ సంయుక్త ప్రకటన చేశారు. ‘తూర్పు–పశ్చిమ ప్రాంతాలకు చెందిన క్యాథలిక్కులు, క్యాథలిక్ చర్చి, తూర్పు–పశ్చిమ ప్రాంతాలకు చెందిన ముస్లింలు, అల్ అజర్ అల్ షరీఫ్‌లు సంయుక్తంగా చేస్తున్న ప్రకటన ఏమిటంటే పరస్పర సహకారం, పరస్పర అవగాహనే ప్రవర్తన నియామావళిగా చర్చలే సరైన మార్గంగా కలసి ముందుకు సాగుతాం’ అన్న డిక్లరేషన్‌ను పోప్, ఇమామ్‌లు సంయుక్తంగా విడుదల చేశారు. పాశ్చాత్య దేశాల్లో క్రైస్తవులు, అరబ్ ప్రపంచంలోని ఇస్లాం మతస్థుల మధ్యన సత్సంబంధాలు నెలకొల్పాలనే లక్ష్యంతోనే ఈ సమ్మేళనాన్ని నిర్వహించినప్పటికీ ప్రపంచంలోని పలు మతాలకు చెందిన ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. భారత ప్రతినిధిగా హాజరైన బ్రహ్మ విహారి స్వామి సమ్మేళనంలో మాట్లాడుతూ ‘నేడు ప్రపంచంలోని అన్ని దేశాలు, అన్ని సంస్కతులు, అన్ని మతస్థుల ముందున్న ముఖ్యమైన అంశం ఒక్కటే. ఐక్యంగా కలిసి ముందుకు వెళితే కలిసి పురోభివృద్ధి సాధిస్తాం. విడిపోయి ముందుకు పోవాలనుకుంటే సర్వనాశనం అవుతాం’ అని చెప్పారు. ఒకప్పుడు కరడుగట్టిన దేశమే! గతంలో యూఏఈ కరడుగట్టిన ఇస్లాం దేశం. భారత దేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడిన దావూద్ ఇబ్రహీం తొలుత యూఏఈలోనే ఆశ్రయం పొందారు. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వాన్ని 1996లో గుర్తించిన మూడవ దేశం యూఏఈ. పాకిస్థాన్, సౌదీ అరేబియా తర్వాత ఈ దేశం అక్కిడి ప్రభుత్వాన్ని గుర్తిస్తూ ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అప్ఘానిస్తాన్’ అని నామకరణం కూడా చేసింది. అలాంటి దేశంలో యువరాజు పట్టాభిషక్తుడైన నాటి నుంచి వివిధ మతాల మధ్య సామరస్యం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. తమ దేశంలో నివసిస్తున్న వివిధ మతాల వారికి ఉదారంగా స్థలాలు కేటాయించారు. అందులో భాగంగా హిందూ దేవాలయం కోసం 26 ఎకరాలు ఇచ్చారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ ప్రస్తుతం జబ్బు పడడంతో ప్రభుత్వ పాలనా వ్యవహారాలను కూడా యువరాజే చూసుకుంటున్నారు. కేవలం 12 శాతం దేశస్థులు, 88 శాతం ప్రపంచ వలసకార్మికులను కలిగిన దేశంలో ఇలాంటి సంస్కరణలు తప్పవనే వారూ ఉన్నారు. యూఏఈలో 26 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరికోసం దుబాయిలో ఓ శివాలయం, కృష్ణుడి ఆలయం ఉండగా, అబుదాబిలో నిర్మించబోయే ఆలయమే మొదటిది.