ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిన్నారులు మృతి! | fire accident in united arab emirates | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిన్నారులు మృతి!

Published Mon, Jan 22 2018 5:12 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

fire accident in united arab emirates - Sakshi

యునైటెడ్ ఎమిరేట్స్‌లో సోమవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిన్నారులు మరణించారు. అనుకోకుండా ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఏడుగురు చిన్నారులు అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటన  దుబాయ్‌కి దాదాపు 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న దడ్‌నా గ్రామంలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలతో ఇళ్లంతా దట్టమైన పోగలు అలుముకొని పిల్లలు చనిపోయారని, వారి తల్లి ప్రాణాలతో బయటపడిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపుచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement