ఇద్దరు చిన్నారుల సజీవ దహనం
Published Wed, May 3 2017 4:20 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
విజయవాడ: నగరంలోని పటమటలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారికి అగ్నికి బలయ్యారు. వివరాలు.. యనమలకుదురు రోడ్డులో ఉన్న ట్రెజరీ కాలనీలో నివాసముంటున్నఖరగ్పూర్‌కు చెందిన పద్మ తన భర్తతో కలసి పనుల నిమిత్తం విజయవాడకి వచ్చారు. వారికి లోకేష్ (6), రాజేష్( 2) ఇద్దరు పిల్లలున్నారు. పిల్లలను గుడిసెలో వదిలి తల్లిదండ్రులు పనికివెళ్లారు. ఉదయం ట్రెజరీ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఇంట్లో ఉన్న చిన్నారులు మృత్యువాతపడ్డారు. సమాచారమందుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. సజీవ దహనమైన చిన్నారుల వివరాలు అడిగితెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం మాత్రం చెప్పలేకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.
Advertisement
Advertisement