viajyawada
-
మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదు
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రపై ఆదివారం పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోవిడ్ నిబంధనలు ఉల్లఘించి హోటల్లో మీటింగ్ పెట్టారని తెలియడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీకి సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ధూళిపాళ్లను రెండు నెలల క్రితం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సంగం డెయిరీ ఛైర్మన్గా ధూళిపాళ్ల నరేంద్ర ఉన్న సమయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. -
విజయవాడలో జడివాన బీభత్సం
సాక్షి, విజయవాడ : విజయవాడలో శుక్రవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. గంటపాటు ఎడతెరిపిలేని జడివానతో విజయవాడలోని ప్రధాన కూడళ్లన్ని జలమయమయ్యాయి. వన్ టౌన్ రోడ్ ,బందర్ రోడ్ ,ఎంజే నాయుడు హాస్పిటల్ రోడ్ ,పాలీక్లినిక్ రోడ్ లతో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. జడివాడతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. రహదారులన్ని సెలయేళ్ళను తలపించాయి. భారీ వర్షంతో వాహనచోదకులు ,పాదచారులు తీవ్ర అవస్థలు పడ్డారు. విజయవాడ అండర్ బ్రిడ్జీల వద్ద మొకాలు లోతుకు వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించి ద్విచక్ర వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడనుందని పేర్కొంది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆదివారం సాయంత్రంలోగా తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈ రోజు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారం అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు,ఆదివారం పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలుల వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని.. తీరప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు హెచ్చరించారు. -
విజయవాడ లో వైఎస్సార్సీపీ కరపత్రాల పంపిణీ
-
కోళ్ల పందాల శిబిరాలపై పోలీసుల దాడి
-
విజయవాడలో మరో ప్రమాదం: ఇద్దరు మృతి
సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. భవానీపురం మార్కెట్ యార్డు దగ్గర డివైడర్ ను బైక్ ఢీకొంది. దీంతో కొండారెడ్డి, తిరుపతి అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు భవానీపురం ప్రియదర్శిని కాలనీవాసులుగా గుర్తించారు. కాగా గత మూడు రోజుల క్రితమే సింగ్ నగర్ బ్రిడ్జిపై జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. మూడు రోజుల వ్యవధిలోనే మరో రోడ్డు ప్రమాదం జరగడం, ఇరువురు మృతి చెందడంతో నగరవాసులు బయటకు రావాలంటేనే భయపడి పోవాల్సి వస్తోంది. -
రోడ్డు ప్రమాదాలపై చినరాజప్ప దిగ్ర్బాంతి
విజయవాడ: రంగారెడ్డి జిల్లా, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల పట్ల ఉప ముఖ్యమంత్రి, ఏపీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన అయిదుగురు వ్యక్తులు మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆ జిల్లా పోలీసు అధికారులను సంప్రదించి మృతదేహాలను వారి స్వస్ధలాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీని ఆదేశించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో పెళ్ళి బృందం బస్సు చెట్టును ఢీకొట్టిన ఘటనపై కూడా ఆయన వివరాలు తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీతో చినరాజప్ప ఫోనులో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. -
రేపటి నుంచి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు
విజయవాడ: రేపటి నుంచి ప్రకాశం బ్యారేజీపై వాహనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ప్రకాశం బ్యారేజీని మంగళవారం మంత్రి దేవినేని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.100 కోట్లతో ప్రకాశం బ్యారేజీ ఆధునీకరణ చేపట్టామని తెలిపారు. 14 కొత్తగేట్లను మార్చామని, 43 గేట్లకు మరమ్మతులు చేపట్టామని వివరించారు. ఈ పనులపై నిపుణల కమిటీ బ్యారేజీని పరిశీలిస్తుందన్నారు. కృష్ణా డెల్టాలో 13 లక్షల ఆయకట్టుకు నీరందించేలా మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. -
ఇద్దరు చిన్నారుల సజీవ దహనం
-
ఇద్దరు చిన్నారుల సజీవ దహనం
విజయవాడ: నగరంలోని పటమటలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారికి అగ్నికి బలయ్యారు. వివరాలు.. యనమలకుదురు రోడ్డులో ఉన్న ట్రెజరీ కాలనీలో నివాసముంటున్నఖరగ్పూర్కు చెందిన పద్మ తన భర్తతో కలసి పనుల నిమిత్తం విజయవాడకి వచ్చారు. వారికి లోకేష్ (6), రాజేష్( 2) ఇద్దరు పిల్లలున్నారు. పిల్లలను గుడిసెలో వదిలి తల్లిదండ్రులు పనికివెళ్లారు. ఉదయం ట్రెజరీ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఇంట్లో ఉన్న చిన్నారులు మృత్యువాతపడ్డారు. సమాచారమందుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. సజీవ దహనమైన చిన్నారుల వివరాలు అడిగితెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం మాత్రం చెప్పలేకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. -
'ఏపీలో మూడు పార్టీల ప్రభుత్వం'
-
ఏపీలో మూడు పార్టీల ప్రభుత్వం: రామకృష్ణ
విజయవాడ: రాష్ట్రంలో ఇప్పుడు మూడు పార్టీల ప్రభుత్వం అధికారంలో వుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలను మంత్రులు చేస్తే రాజకీయ వ్యభిచారం అన్న చంద్రబాబు.. ఇప్పుడు తమరు చేసేదేంటో చెప్పాలి. ప్రస్తుతం క్యాబినెట్లో వైఎస్సార్పీపీ ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ఉన్నారు. బాబుకు రాజకీయ నైతిక విలువలు లేవు. ఫిరాయింపుదారులకు మంత్రి పదువులు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. స్వర్ణభారతీ ట్రస్ట్ అక్రమాలపై విచారణ జరిపించాలి.. ఇందులో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి పాత్రపై నిగ్గుతేల్చాలని’’ డిమాండ్ చేవారు.