విజయవాడ నగరంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. భవానీపురం మార్కెట్ యార్డు దగ్గర డివైడర్ ను బైక్ ఢీకొంది. దీంతో కొండారెడ్డి, తిరుపతి అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు భవానీపురం ప్రియదర్శిని కాలనీవాసులుగా గుర్తించారు.
కాగా గత మూడు రోజుల క్రితమే సింగ్ నగర్ బ్రిడ్జిపై జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. మూడు రోజుల వ్యవధిలోనే మరో రోడ్డు ప్రమాదం జరగడం, ఇరువురు మృతి చెందడంతో నగరవాసులు బయటకు రావాలంటేనే భయపడి పోవాల్సి వస్తోంది.