ఏపీలో మూడు పార్టీల ప్రభుత్వం: రామకృష్ణ
విజయవాడ: రాష్ట్రంలో ఇప్పుడు మూడు పార్టీల ప్రభుత్వం అధికారంలో వుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలను మంత్రులు చేస్తే రాజకీయ వ్యభిచారం అన్న చంద్రబాబు.. ఇప్పుడు తమరు చేసేదేంటో చెప్పాలి. ప్రస్తుతం క్యాబినెట్‌లో వైఎస్సార్పీపీ ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ఉన్నారు. బాబుకు రాజకీయ నైతిక విలువలు లేవు. ఫిరాయింపుదారులకు మంత్రి పదువులు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. స్వర్ణభారతీ ట్రస్ట్ అక్రమాలపై విచారణ జరిపించాలి.. ఇందులో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి పాత్రపై నిగ్గుతేల్చాలని’’ డిమాండ్ చేవారు.