‘వారికి మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటు’ | CPI Ramakrishna Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘వారికి మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటు’

Published Mon, Aug 6 2018 1:11 PM | Last Updated on Mon, Aug 6 2018 2:30 PM

CPI Ramakrishna Fires On Chandrababu Naidu - Sakshi

రామకృష్ణ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, తిరుపతి : అధికారుల అవినీతి కారణంగానే కర్నూలు క్వారీ ఘటనలో పదిమంది మరణించారని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పాలన అవినీతి మయంగా మారిందని మండిపడ్డారు. ఆయన సోమవారం తిరుపతిలో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అవినీతి సొమ్ముతో ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌​ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారని రామకృష్ణ మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement