
దుబాయ్: మత కట్టుబాటులు దాటుకోని అర్‌బ్ మహిళలు ఇప్పుడు ఇప్పుడే క్రీడల వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(డబ్ల్యూ డబ్ల్యూఈ)లోకి ప్రవేశించి ఓ కొత్త అధ్యయానికి తెరతీశారు. జోర్డాన్‌కు చెందిన మహిళా రెజ్లర్ షాదియా బెసిసో డబ్ల్యూడబ్ల్యూఈతో ఆదివారం ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఆమె డబ్ల్యూ డబ్ల్యూఈ ఒప్పందం కుదుర్చుకున్న తొలి అరబ్ మహిళా రెజ్లర్‌గా గుర్తింపు పొందారు.
‘అరబ్ అథ్లేట్లకు ఎట్టకేలకు స్వాతంత్ర్యం లభించింది. నచ్చిన క్రీడల్లో అవకాశం రావడం అదృష్టం. మా మతం కూడా సానుకూలంగా భావిస్తుందనుకుంటున్నా. అరబ్ మహిళలకు అవకాశాలు కల్పిస్తే మరిన్ని క్రీడల్లో భాగస్వామ్యాలు అవుతారని’ షాదియా బెసిసో తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూఈ పట్ల అభిమానులకు ఉండే పిచ్చికి నేను ఒక సాక్షినని, రెజ్లింగ్‌లో రాణించి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్‌ను అవుతానని బెసిసో ఆశాభావం వ్యక్తం చేశారు. తన ఇష్టాన్ని కుటుంబసభ్యులకు చెప్పి ఒప్పించానన్నారు. ఇక బెసిసో ప్రస్తుతం దుబాయ్‌లోని ఓ టీవీ చానల్ వాయిస్-ఓవర్ ఆర్టీస్ట్‌గా పనిచేస్తున్నారు.
షాదియా బెసిసో కసరత్తు ..వీడియో