T20 WC 2024: పట్టిక తారుమారు.. సెమీస్‌ బెర్తులు ఖరారు | W T20 WC 2024 Semi Finals Confirmed Qualified teams Venues Schedule | Sakshi
Sakshi News home page

T20 WC 2024: సెమీ ఫైనల్‌ బెర్తులు ఖరారు.. పూర్తి వివరాలు

Published Wed, Oct 16 2024 1:18 PM | Last Updated on Wed, Oct 16 2024 1:25 PM

W T20 WC 2024 Semi Finals Confirmed Qualified teams Venues Schedule

మహిళల టీ20 ప్రపంచకప్‌-2024లో సెమీ ఫైనల్‌ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్‌-ఏ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ టాప్‌-4కు అర్హత సాధించగా.. గ్రూప్‌-బి నుంచి ఊహించని జట్టు సెమీస్‌కు దూసుకువచ్చింది.  కాగా బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సిన ఈ మెగా టోర్నీ వేదికను ఐసీసీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు మార్చిన విషయం తెలిసిందే.

బంగ్లాలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తలెత్తిన అల్లర్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్లో గ్రూప్‌-ఏ నుంచి ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక.. గ్రూప్‌-బి నుంచి బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ పోటీపడ్డాయి.

టీమిండియాకు కలిసి రాలేదు
అయితే, టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న భారత జట్టు పేలవ ప్రదర్శనతో కనీసం సెమీస్‌ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో గ్రూప్‌-ఏలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ టాప్‌-4లో సగర్వంగా అడుగుపెట్టాయి. అయితే, గ్రూప్‌-బి టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్‌ ఊహించని రీతిలో ఒక్క మ్యాచ్‌ ఫలితంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

ఒక్క మ్యాచ్‌తో ఫలితం తారుమారు
వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హీథర్‌ నైట్‌ బృందం.. విండీస్‌ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో గ్రూప్‌-బి పాయింట్ల పట్టిక తారుమారైంది. 

మొదటిస్థానంలో ఉన్న ఇంగ్లండ్‌ మూడో స్థానానికి, మూడో స్థానంలో ఉన్న వెస్టిండీస్‌ టాప్‌లోకి వచ్చింది. ఇరు జట్లు పాయింట్ల పరంగా(6) సమానంగా ఉన్నా.. నెట్‌రన్‌రేటులో వెస్టిండీస్‌(1.536).. ఇంగ్లండ్‌(1.091) కంటే మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం.

ఫలితంగా గ్రూప్‌-బి నుంచి వెస్టిండీస్‌ సెమీస్‌కు వచ్చింది. మరోవైపు..  ఇదే గ్రూపులో ఉన్న సౌతాఫ్రికా కూడా ఆరు పాయింట్లే కలిగి ఉన్నా.. నెట్‌రన్‌రేటే(1.382) ఆ జట్టుకూ మేలు చేసి టాప్‌-4లో చేర్చింది. అలా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా మహిళా టీ20 వరల్డ్‌కప్‌-2024లో తమ సెమీస్‌ బెర్తులు ఖరారు చేసుకున్నాయి.

షెడ్యూల్‌, వేదికలు ఇవే
👉మొదటి సెమీ ఫైనల్‌- ఆస్ట్రేలియా వర్సెస్‌ సౌతాఫ్రికా- అక్టోబరు 17, దుబాయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం, దుబాయ్‌.
👉రెండో సెమీ ఫైనల్‌-  వెస్టిండీస్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌, అక్టోబరు 18, షార్జా క్రికెట్‌ స్టేడియం, షార్జా.
👉రెండు మ్యాచ్‌లూ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు మొదలవుతాయి.

ఆస్ట్రేలియా జట్టు
అలిసా హీలీ (కెప్టెన్), డార్సీ బ్రౌన్, యాష్ గార్డనర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలానా కింగ్, ఫోబీ లిచ్‌ఫీల్డ్‌, తహ్లియా మెక్‌గ్రాత్‌ (వైస్ కెప్టెన్), సోఫీ మొలినెక్స్, బెత్ మూనీ, ఎలిస్ పెర్రీ, మెగాన్ స్కట్, అన్నాబెల్ సదర్లాండ్, హీథర్ గ్రాహం, జార్జియా వేర్హామ్.

సౌతాఫ్రికా జట్టు
లారా వోల్వార్డ్ (కెప్టెన్), అన్నేక్ బాష్, టాజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నేరీ డెర్క్సెన్, మికే డి రైడర్, అయాండా హ్లూబీ, సినాలో జాఫ్తా, మారిజానే కాప్, అయబోంగా ఖాకా, సునే లూస్, నోన్కులులెకో మ్లాబా, సెష్నీ నాయుడు, తుమీ సెఖుఖున్, క్లోయ్ ట్రియాన్.

వెస్టిండీస్‌ జట్టు
హేలీ మాథ్యూస్ (కెప్టెన్), ఆలియా అల్లేన్, షమీలియా కాన్నెల్, డియోండ్రా డాటిన్, షెమైన్ కాంప్‌బెల్లె (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), అష్మిని మునిసర్, అఫీ ఫ్లెచర్, స్టెఫానీ టేలర్, చినెల్ హెన్రీ, చెడియన్ నేషన్, కియానా జోసెఫ్, జైదా జేమ్స్, కరిష్మా రాంహారక్, మాండీ మంగ్రూ, నెరిస్సా క్రాఫ్టన్.

న్యూజిలాండ్‌ జట్టు
సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇజ్జీ గాజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్, మెలీ కెర్, జెస్ కెర్, రోజ్మేరీ మైర్, మోలీ పెన్ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవే, లీ తహుహు.

చదవండి: W T20 WC: ‘హర్మన్‌పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకు ఛాన్స్‌ ఇస్తేనే’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement