మైక్ టైసన్‌కు షాకిచ్చిన యువ బాక్సర్‌ జేక్ పాల్ | Jake Paul Beats Mike Tyson In 2024s Biggest Boxing Match | Sakshi
Sakshi News home page

Mike Tyson Vs Jake Paul: మైక్ టైసన్‌కు షాకిచ్చిన యువ బాక్సర్‌ జేక్ పాల్

Published Sat, Nov 16 2024 12:04 PM | Last Updated on Sat, Nov 16 2024 12:16 PM

Jake Paul Beats Mike Tyson In 2024s Biggest Boxing Match

ప్రపంచ మాజీ హెవీ వెయిట్‌ చాంపియన్ మైక్ టైసన్ ఊహించని షాక్ త‌గిలింది. టెక్సాస్‌లో జ‌రిగిన బిగ్ బౌట్‌లో మైక్ టైసన్‌ను సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, యువ బాక్సర్ జేక్‌ పాల్ ఖంగు తినిపించాడు. ఈ మ్యాచ్‌లో జేక్ పాల్ చేతిలో 74-78 తేడాతో ఐర‌న్ మైక్ మైక్ ఓట‌మిపాల‌య్యాడు.

టైసన్ గేమ్‌లో వయస్సు ప్రభావం స్పష్టంగా కనిపించింది. 58 ఏళ్ల టైసన్‌ త‌న‌కంటే 37 ఏళ్ల చిన్నోడైన జేక్ సూప‌ర్‌ పంచ్‌లకు తట్టుకోలేకపోయాడు. తొలి రెండు రౌండ్ల‌లో మైక్ టైసన్ ఆధిప‌త్యం క‌న‌బ‌రిచిన‌ప్ప‌ట‌కి.. త‌ర్వాతి 8 రౌండ్ల‌లో జేక్ పాల్ త‌న అద్బుత‌మైన బాక్సింగ్ స్కిల్స్‌ను ప్ర‌ద‌ర్శించాడు.

ఆ తర్వాత మైక్‌ తిరిగి కమ్‌బ్యాక్‌ ఇవ్వలేకపోయాడు. కొన్ని పంచ్‌లు ఇచ్చినప్పటికి పెద్దగా పవర్‌ కన్పించలేదు. దీంతో మహాబలుడు మైక్ టైసన్‌ యువ బాక్సర్‌ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే గెలిచిన వెంటనే  జేక్ పాల్ మైక్ టైసన్‌కు తల వం‍చి నమస్కరించాడు. 

టైసన్‌ కూడా పాల్‌ను మంచి ఫైటర్‌గా కొనియాడాడు. ఇక విజేతగా నిలిచిన బాక్సర్ జేక్ పాల్ కు 40 మిలియన్ అమెరికా డాలర్లు ప్రైజ్ మనీగా లభించింది. కాగా మ్యాచ్‌ ఈ మొదలు కాగాగే పోటెత్తిన వ్యూయర్‌షిప్‌తో నెట్‌ఫ్లిక్స్‌ క్రాష్‌ అయింది.
చదవండి: IND vs SA: చ‌రిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. ప్రపంచంలో ఒకే ఒక్కడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement