స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ ఓ అరబ్ ముస్లిం మహిళ! | Statue of Liberty inspired by Arab woman, researchers say | Sakshi
Sakshi News home page

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ ఓ అరబ్ ముస్లిం మహిళ!

Published Thu, Dec 3 2015 6:19 PM | Last Updated on Mon, Aug 20 2018 3:58 PM

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ ఓ అరబ్ ముస్లిం మహిళ! - Sakshi

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ ఓ అరబ్ ముస్లిం మహిళ!

న్యూయార్క్: అమెరికా ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రానికి ప్రతీకగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ వాస్తవానికి మొఖం కనిపించేలా బురఖా ధరించిన అరబ్ ముస్లిం యువతి స్కెచ్ నుంచి రూపొందిన విగ్రహమని తాజాగా తేలింది. 1855-56లో ఈజిప్టులో ప్రయాణించిన ఫ్రెంచ్ శిల్పి ఫ్రెడరిక్ అగస్టీ బర్థోల్దీ. లిబర్టీ విగ్రహాన్ని రూపొందించారు.  ప్రజా చిహ్నాలుగా చరిత్రలో నిలిచిపోయే భారీ విగ్రహాలను చెక్కడం పట్ల అమితాసక్తి కలిగిన ఫెడరిక్‌ను సూయిజ్ కెనాల్‌కు ఓ లైట్‌హౌస్‌ను డిజైన్ చేయాల్సిందిగా అప్పటి ఈజిప్టు ప్రభుత్వం 1869లో కోరింది.

 

సూయిజ్ కెనాల్‌కు కాగడా పట్టుకొని కాపాల కాస్తున్న ఓ అరబ్ రైతు మహిళ రూపంలో లైట్‌హౌస్‌ను నిర్మించేందుకు ఫ్రెడరిక్ ఓ డిజైన్ రూపొందించారు. ఆ డిజైన్‌కు ఇప్పటి లిబర్టీ విగ్రహానికి కొన్ని పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అప్పుడు డిజైన్ చే సిన అరబ్ మహిళ ఎడమ చేతిలో కాగడా పట్టుకున్నట్టు ఉండగా, ప్రస్తుత లిబర్టీ విగ్రహంలో కుడిచేతిలో కాగడా పట్టుకున్నట్టు ఉంది. అప్పుడు ఆ అరబ్ మహిళ స్కెచ్‌కు ఫెడరిక్ ‘ఈజిప్ట్ బ్రింగ్స్ లైట్ టు ఆసియా’ అని నామకరణం కూడా చేశారు.

అప్పట్లో ఈజిప్టులో మెజారిటీ శాతం ముస్లింలే ఉండేవారు. అలెగ్జాండ్రియా, కైరోలో 86 శాతం మంది, మిగతా ప్రాంతాల్లో 91 శాతం ముస్లింలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు, నివేదికలు వెల్లడిస్తున్నాయి. అనివార్య కారణాల వల్ల సూయిజ్ కెనాల్ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అమెరికా స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఫ్రెంచ్ ప్రజల తరఫున ఆ దేశానికి ఓ భారీ విగ్రహాన్ని అందజేయాలనే ఆలోచన ఫ్రెంచ్ ప్రభుత్వానికి వచ్చింది. అప్పటి ఫ్రెంచ్ చరిత్రకారుడు ఎడౌర్డ్ డీ లబైలాయే ద్వారా దీన్ని డిజైన్ చేయాల్సిన కాంట్రాక్ట్ ఫెడరిక్‌కు వచ్చింది.

 ఫెడరిక్ గతంలో తను రూపొందించిన డిజైన్ల ఆధారంగా 1870లో కొత్త విగ్రహం కొరకు డిజైన్లు గీయడం ప్రారంభించారు. అందులో భాగంగా అరబ్ ముస్లిం మహిళ స్కెచ్‌ను రోమన్ స్వేచ్ఛామూర్తిగా అభివృద్ధి చేశారు. దాన్ని పారిస్ ప్రభుత్వం అంగీకరించింది. పారిస్‌లో ఈఫిల్ టవర్‌ను నిర్మించిన ప్రముఖ బిల్డర్ గుస్తవ్ ఈఫిల్ సహకారంతో ఈ విగ్రహాన్ని ఫెడరిక్ పూర్తి చేశారు.

 

సకాలంలో దీని నిర్మాణం పూర్తికాలేదు. అయినప్పటికీ అమెరికా స్వాతంత్య్ర శతజయంతోత్సవాలను పురస్కరించుకొని ఫ్రాన్స్ ఈ లిబర్టీ విగ్రహాన్ని అమెరికాకు అందజేయగా 1886లో ప్రతిష్టించారు. అమెరికా స్వేచ్ఛకు ప్రతీకగా ఓ బహుమానంగా వచ్చిన విగ్రహాన్ని ప్రతిష్టించడం సబబుకాద ంటూ అప్పట్లో రాజకీయ వర్గాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. ఫెడరిక్ తన తల్లి చార్లోటీ బెస్సర్ బర్థోల్దిని స్ఫూర్తిగా తీసుకొని లిబర్టీ విగ్రహాన్ని చెక్కారన్న వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement