Statue of Liberty
-
పంజాబ్‌లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ... నమ్మబుద్ధి కావడం లేదా, ఇదిగో వీడియో వైరల్
ప్రపంచ ప్రఖ్యాత కట్టడం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కడ ఉంది అంటే అమెరికాలోని న్యూయార్క్ సిటీలో అని ఠక్కున సమాధానం వచ్చేస్తుంది కదా. మరి మన ఇండియాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడాలని ఉందా? అయితే మీరు పంజాబ్ వెళ్లాల్సిందే. అవును మీరు చదివింది నిజమే. ఇదేమి చోద్యం అనుకుంటున్నారా? అయితే మీరీ కథనం చదవి తీరాల్సిందే.ఇండ్లు, భవనాల పైకప్పులపై భిన్నమైన ఆకృతుల్లో నిర్మాణాలు చేపట్టడం, విగ్రహాల్ని ఏర్పాటు చేయడం చాలా చోట్ల, ముఖ్యంగా పంజాబ్‌లో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. తాజాగా పంజాబ్‌లోని ఒక భవనంపై ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ని అచ్చం అమెరికాలో ఉన్నట్టే నిర్మిస్తున్నారు. న్యూయార్క్ నగరంలో ఉన్నంతగా కాకపోయినా తమ గ్రామంలో అత్యంత ఎత్తుగా ఉన్న భవనంపై దీన్ని నిర్మిస్తున్నట్టు స్థానిక గ్రామస్థులు తెలిపారు.Some where in Punjab the THIRD liberty statue is installed.😂 pic.twitter.com/WZqrXpK9Jb— Alok Jain ⚡ (@WeekendInvestng) May 26, 2024పంజాబ్ లోని తర్న్ తరణ్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నమూనా లేటెస్ట్ సెస్సేషన్. దీన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. విగ్రహాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ‘అది మంచినీళ్ల ట్యాంకు అయ్యుంటుంది అని ఒకరు, పంజాబ్‌లో చాలా మంది ఇళ్లపై మంచి నీళ్ల ట్యాంకులు విమానాలు, ఎస్ యూవీల ఆకారంలోనే కనిపిస్తాయి’ అని పేర్కొన్నాడు. మరొకరేమో ‘నయాగారా ఫాల్స్ ను నిర్మించాల్సింది.. అప్పుడు కెనడాను మిస్ అయ్యే వాళ్లు కాదు’ అని చమత్కరించాడు. ‘ఇక ప్రజలు న్యూయార్క్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.పంజాబ్ లోని ఈ ఇంటిని చూసేందుకు వెళ్తే సరిపోతుందన్నమాట’ అని కామెంట్ చేయడం విశేషం. మూడో పెద్ద లిబర్టీ విగ్రహం పంజాబ్‌లో అంటూ అలోక్ జైన్ఎక్స్లోదీన్ని పోస్ల్ చేశారు. ప్రపంచంలోని రెండవ ఎత్తైన విగ్రహం, చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ వద్ద ఉన్న అద్భుతమైన వైరోకానా బుద్ధుని విగ్రహం. ఇది తామరపువ్వు ఆకారం ఆసనంలో బుద్ధుడు ఆసీనుడై ఉంటాడు.. ఫోడుషాన్ సీనిక్ ఏరియాలో ఉన్న ఈ విగ్రహ నిర్మాణం 1997లో ప్రారంభమై 2008లో పూర్తి అయిందట. -
ఔరా నయాగారా.. చూడరా లిబర్టీ స్టాచ్యూ.!
పౌరులు ఎప్పుడు బయటకు వచ్చినా చిరునవ్వుతో కనబడాలని ఇటలీలోని మిలాన్‌లో చట్టం చేశారట, ఆస్పత్రులు అంత్యక్రియలకు వెళ్లేవారు తప్ప ! అదేమిటో కాని అలాంటి ఏ చట్టమూ లేకున్నా అమెరికన్స్ , వాళ్ళ మనసులో ఏమైనా ఉండనిగాక, కొత్త పాత అనకుండా , మనిషిని చూడగానే ఒక చిరునవ్వు విసరడం వారి సహృదయతను, సంస్కారాన్ని చాటుతుంది. అక్కడి వారిలో ఈ లక్షణం నేను చూసిన ఇటు పసిఫిక్ తీరం లాసంజెల్స్ నుండి గల్ఫ్ అఫ్ మెక్సికో డల్లాస్ మీదుగా అట్లాంటిక్ మహా సముద్రం న్యూయార్క్ వరకు దారి పొడుగునా గమనించాను. ఎప్పుడు అమెరికా వచ్చినా మొక్కుబడిగా సమీప సందర్శనీయ స్థలాలు మాత్రమే చూస్తున్నాం, అలాకాదు ఈసారి ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేద్దామనుకున్నాం. లాస్ఎంజెల్స్ నుంచి ఈస్ట్ కోస్ట్ ట్రిప్‌కు వెళ్లాం. అలా మొదట మేము వెళ్ళింది బఫెలో కు. ఇటు అమెరికా ( న్యూ యార్క్ ) అటు కెనడా ( ఒంటారియా ) ల మధ్య గుర్రపునాడా ఆకారంలోనున్న జలపాతం నయాగరా అందాలను చూసాం. ఇది 167 ఫీట్ల ఎత్తు నుండి ఎక్కువ వెడల్పులో కిందికి జారుతుంటే.. దాన్ని సమీపంగా చూడాలని చిన్న పడవలో వెళ్ళాం, రెయిన్ కోట్ వేసుకున్నా తడిసినంత పనైంది. ఈ జలపాతాన్ని రెండు దేశాల వైపు నుంచి చూడొచ్చు. అమెరికా, కెనడాలను విడదీసేది కూడా నయాగారా జలపాతమే. ఈ నదిపైనే రెయిన్బో అనే బ్రిడ్జి ఉంటుంది. బ్రిడ్జిపై నడుచుకుంటూ రెండు దేశాలు దాటేయవచ్చు. అయితే రెండు వైపులా ఎంట్రీ పాయింట్, చెక్ పాయింట్, టోల్ గేట్ ఉంటాయి. చాలా మంది కెనడా వైపు నుంచి చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. కెనడా వైపు నుంచి మరింత ముందుకు.. అంటే జలపాతం చివరి వరకు చూడొచ్చంటారు. పైగా కొండపైనే గుహలను కూడా కెనడా వైపు నుంచి చూసే అవకాశం ఉంది. ఆ రోజు రాత్రి వర్షంలో కారు ప్రయాణం, మధ్యరాత్రి ఎప్పుడో న్యూయార్క్ చేరుకొని హోటల్ హాలిడే ఇన్ లో బస. ఇది మన గుజరాతీ పటేల్ లు నడుపుతున్న హోటల్ కావడం విశేషం. పేరుకు అమెరికానే కానీ.. పటేల్ బ్రదర్స్ స్టోర్లు మనకు దాదాపు అమెరికా అంతటా కనిపిస్తాయి. ఇండియాలో దొరికే ఏ సరుకయినా.. పటేల్ బ్రదర్స్‌లో కనిపిస్తుంది. జండూ బామ్ నుంచి బఠానీల దాకా, పల్లీల నుంచి కొత్తిమీర దాకా కేరాఫ్ పటేల్ బ్రదర్స్. అమెరికాలో గుజరాతీల వ్యాపారం ఎంత పెద్దదంటే.. మనం ఊహించలేనంత పెద్ద టర్నోవర్ నడుస్తుందని అక్కడ సెటిల్ అయిన మనవాళ్లు చెబుతారు. గుజరాతీ వ్యాపారులు చాలా ఇన్ఫ్యూయన్సర్లని పేరు. అందుకే గుజరాతీల ఈవెంట్లలో మేయర్ల నుంచి గవర్నర్ల దాకా అతిథులుగా కనిపిస్తారు. పటేల్ బ్రదర్స్ హోటల్ వాళ్ళే ఏర్పాటు చేసిన బస్‌లో ‘ న్యూయార్క్ టైం స్క్వేర్ ’ వైపు వెళ్ళాం. న్యూయార్క్ యూఎస్‌లోనే ఎక్కువ జనాభా కలిగిన నగరం. దీన్ని ప్రపంచ రాజధాని కూడా అంటార , ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉండడంవల్ల కాబోలు. నాకు దీన్ని చూస్తుంటే అచ్చం మన ముంబైలాగే అనిపించింది, వీధుల్లో జన సంచారం ఎక్కువ, ఇండియన్ రెస్టారెంట్లు కూడా. అయితే ఆధునికత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. 1931 లోనే నిర్మించబడిన, ఎన్నిసార్లు పిడుగులు పడ్డా చెక్కు చెదరని, 102 అంతస్తుల ‘ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ’ ఎక్కి న్యూయార్క్ నగర అందాలను చూసాము. మేడం టుస్సాడ్ మ్యూజియం గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్టోబర్1 నాడు కారులో బయలుదేరి ‘లిబర్టీ ఐల్యాండ్’కు వెళ్ళాం. అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వేచ్చా స్వాతంత్రాలకు ప్రతీకయైన, రోమన్ దేవతలావున్న‘ లిబర్టీ స్టాచ్యు ’ చూసాం. ఇది ఫ్రెంచ్ శిల్పి ఫ్రెడరిక్ అగస్టే బర్తోలీ రూపొందించిన 151 అడుగుల ఎత్తయిన శిల్పం, 1886 లో ఫ్రాన్స్ ప్రజల నుండి యూ ఎస్ కు వచ్చిన కానుక. నిజంగానే గొప్ప విగ్రహం అనిపించింది. విగ్రహం కాలి బొటన వేలు మనిషి సైజంతా ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే.. విగ్రహం లోపల ఉండే మెట్ల దారి గుండా తలలోని కిరీటం వరకు ఎక్కొచ్చు. కింది నుంచి లెక్కిస్తే 354 మెట్లు ఎక్కితే తల వరకు వస్తాం. అక్కడి నుంచి మరో 192 మెట్లు ఎక్కితే చివరి వరకు చేరుకుంటాం. తలకున్న కిరీటంలో 25 కిటీకీలున్నాయి. ఈ భూమి మీద ఉన్న 25 అత్యంత విలువైన అణిముత్యాలను దృష్టిలో పెట్టుకుని 25 కిటీకీలు ఏర్పాటు చేశారు. దాంతో పాటు కిరీటం నుంచి ఏడు కాంతి రేఖలు కనిపిస్తాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కో ఖండాన్ని ప్రతిబింబిస్తాయి ‘ఎల్లిస్ ఐ ల్యాండ్ ’ ఒకప్పటి యూఎస్ ఎంట్రీ పోర్ట్. 1892 నుండి 1954 వరకు దాదాపు 12 మిలియన్ల మంది వలసదారులు యూఎస్ లో అడుగు పెట్టింది ఇక్కడి నుండే. ఇక్కడున్న ఇమ్మిగ్రేషన్ జాతీయ మ్యూజియం చరిత్ర పై ఆసక్తి వున్నవారు తప్పనిసరి చూడాల్సింది. గాంధీజయంతి రోజు మేము వాషింగ్టన్ డి సి చేరుకున్నాము. ప్రపంచంలో శాంతి అయినా ఆశాంతి అయినా అది మాచేతిలో పని అని విర్రవీగే అగ్రరాజ్యం అమెరికా రాజధాని నగరం అది. చూడడానికి మాత్రం విశాలమైన రోడ్లు , అందమైన భవనాలతో ప్రశాంతంగా కనబడింది. ప్రపంచ స్థాయి వ్యూహాలకు నిలయమైన ఆ దేశ అధ్యక్షులవారి అధికారిక నివాసం ‘వైట్ హౌస్ ’ అనబడే శ్వేత సౌధం ఉన్నది వాషింగ్టన్ డి సి లోనే. మేము దాన్ని బయటి నుండే చూసి అక్కడి నుండి బయటపడ్డాం. వైట్ హౌజ్ అందాలను పూర్తి స్థాయిలో ఆస్వాదించాలంటే జులై 4న ఇండిపెండెన్స్‌డే రోజున చూడాలి. ఆ రోజు రాత్రి అద్భుతమైన రీతిలో బాణా సంచా కాల్చి కనువిందు చేస్తారు. యూఎస్ ‘ పార్లమెంట్ హౌస్ ’ చూసాం , అప్పుడు జరుగుతున్న 112 వ కాంగ్రెస్ సెనెట్ సమావేశాలు సెనెటర్ పాస్ కూడా సంపాదించి సందర్శకుల గ్యాలరీ నుండి చూశాం, అక్కడ సెక్యూరిటీ చాలా పకడ్బంధిగా వున్నా మాకేమి ఇబ్బంది కలగలేదు. అక్కడి నుంచి మా కారు పిట్స్ బర్గ్ గుట్ట మీదున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వైపు మళ్ళింది . సరిగ్గా స్వామివారి దర్శన సమయానికి మేము అక్కడికి చేరుకోగాలిగాము. ఈ ఆలయం గురించి మరో కథనంలో రాస్తాను. వేముల ప్రభాకర్ (చదవండి: US: ఏరియల్ రోప్ వే.. అదో అద్భుత ప్రయాణ అనుభూతి!) -
ఈ జిరాఫీని తినొచ్చు
మీరు చదివింది నిజమే. ఈ జిరాఫీని తినేయొచ్చు. అడవుల్లో ఆకు లు, అలములు తిని బతికే జిరాఫీని మనం తినడం ఏంటి అని తిట్టుకుంటున్నారా? అపార్థం వద్దు.. ఎందుకంటే ఇది చాక్లెట్ జిరాఫీ. ఈవారం ఇంటర్నెట్ సంచలనంగా మారిన ఈ జిరాఫీని జూమార్ఫిక్ కలినరీ ఆర్ట్స్‌లో నిపుణుడైన అమౌరీ గుయ్‌చాన్ రూపొందించాడు. 8.3 అడుగుల పొడవైన ఈ జిరాఫీని పూర్తిగా వందశాతం చాక్లెట్‌తోనే తయారు చేశారు. దూరం నుంచి చూస్తే నిజమైన జిరాఫీని తలపిస్తున్న దీన్ని దగ్గరికి వెళ్తేగానీ శిల్పమని గుర్తించలేం. చాక్లెట్‌తో ఇప్పటికే సింహం, పులిలాంటి జంతువులను, మరెన్నో సముద్ర జీవులను, టెలిస్కోప్, క్లాక్ వంటి క్లాసిక్ వస్తువులను, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని సైతం రూపొందించిన అమౌరీ... ఇంత పెద్ద జంతువును తయారు చేయడం ఇదే మొదటిసారి. 72.5కిలోల బరువున్న ఈ జిరాఫీని రూపొందించడానికి ఏడురోజుల సమయం పట్టిందట. చాక్లెట్‌తో మరెన్నో తయారు చేయొచ్చని చెబుతూ... అమౌరీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తయారీ వీడియోను 8కోట్ల మంది చూశారు. -
‘మా నాన్న సంకల్పమే నాకు ఆదర్శం’
వాషింగ్టన్ : 16వ ఏట మా నాన్న క్యూబా నుంచి వలసవచ్చారు. అప్పుడు ఆయనకు ఇంగ్లీష్ కూడా రాదు. కానీ ఇవేవి తన అమెరికా కల నుంచి ఆయనను దూరం చేయలేకపోయాయి అన్నారు అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు జెఫ్ బేజోస్. స్టాట్యూ ఆఫ్ లిబర్టి మ్యూజియం ప్రారంభోత్సవం సందర్భంగా.. తన తండ్రి అమెరికా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు జెఫ్ బేజోస్. ఈ సందర్భంగా ఆయన ‘16వ ఏట నా తండ్రి క్యూబా నుంచి అమెరికా వలస వచ్చారు. అప్పుడు ఆయనకు స్పానిష్ తప్ప మరో భాష తెలీదు. కానీ ఇవేవి ఆయనను అమెరికా కల నుంచి దూరం చేయలేకపోయాయి. సంకల్పం, దీక్ష, ఆశావాద దృక్పథం ఆయనను నిరంతరం తన గమ్యం వైపు నడిపించేవి. అవే నాకు ఆదర్శం. కష్టకాలంలో ప్రజలు ఒకరికి ఒకరు బాసటగా ఎలా నిలుస్తారనే అంశాన్ని నా తండ్రి అమెరికా ప్రయాణం చూస్తే అర్థం అవుతుంది. స్టాట్యూ ఆఫ్ లిబర్టి కొత్త మ్యూజియం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రయాణాన్ని మరోసారి గుర్తు తెచ్చుకునే అవకాశం లభించింది. ఇది తన చరిత్ర’ అంటూ జెఫ్ ట్వీట్ చేశారు. My dad’s journey to the U.S. shows how people come together to help each other. We got a chance to celebrate him last night for the opening of the Statue of Liberty’s new museum. This is his story. https://t.co/VdOtlPY953 pic.twitter.com/E4C1KPho2u — Jeff Bezos (@JeffBezos) May 16, 2019 జెఫ్ బేజోస్ తండ్రి మైక్ బేజోస్ తన 16వ ఏట క్యూబా నుంచి వలస వచ్చారు. ఇదిలా ఉంటే మైక్ బేజోస్, జెఫ్ సొంత తండ్రి కాదు. జెఫ్ నాలుగేళ్ల వయసులో అతని తల్లి జాక్లిన్ గిసే మైక్ బేజోస్ను వివాహమాడారు. మారు తండ్రి అయినప్పటికి మైక్ తనను చాలా ప్రేమగా పెంచాడంటారు జెఫ్. -
స్టాచ్యూ ఆఫ్ స్వేచ్ఛకు సంకెళ్లు
అమెరికాలో అందరికీ తెలిసిన విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’.ఆ స్టాచ్యూని ఎక్కి అమెరికాలో నేనున్నాను అని తెలిపిన సాహస మహిళ థెరీస్ పెట్రీషియా ఒకౌమా. ఆమెకిప్పుడు జైలు శిక్ష పడబోతోంది. ఆమెకు శిక్ష పడడం అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకే సంకెళ్లు పడడమే! ఆఫ్రికాలోని కాంగోనదికి పశ్చిమాన ఉన్న కాంగో రిపబ్లికన్‌లోని బ్రాజవిల్లో పుట్టి అమెరికాకి వలస వచ్చి అక్కడే స్థిరపడిన 45 ఏళ్ల థెరీస్ పెట్రీషియా ఒకౌమా పేరు సాధారణంగా అయితే అమెరికా ప్రజలకు పెద్దగా తెలిసే అవకాశం లేదు. ఇప్పటికీ చాలామందికి ఆ పేరు తెలియదు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలకు వ్యతిరేకంగా థెరీస్ చేసిన సాహసోపేత నిరసనని మాత్రం అమెరికా ప్రజలే కాదు, పసిబిడ్డల పట్ల ప్రేమ ఉన్న ఏ దేశ మహిళా మర్చిపోదు. మర్చిపోలేదు. కారణం.. అమెరికా చరిత్రలో ఎవ్వరూ చేయని సాహసం ఆమె చేశారు. ప్రపంచ దేశాల ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్న ట్రంప్ సహన శూన్యతకు (‘జీరో టాలరెన్స్’) వ్యతిరేకంగా థెరీస్ గత ఏడాది 2018, జూలై 4 న అమెరికా పోలీసులు కళ్లు గప్పి న్యూయార్క్ సిటీలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని వడివడిగా ఎక్కేసారు. థెరీస్ ఎన్నుకున్న ఈ తరహా ధిక్కారాన్ని ఆమెరికా అంతకు మునుపెన్నడూ ఎరగదు. అయితే ఆనాటి ఆమె సాహసోపేత నిరసనకు ఆమె చెల్లించబోతోన్న మూల్యం 18 నెలల జైలు శిక్ష! మార్చి 5 వ తేదీన అమెరికా ట్రయల్ కోర్టు ఇవ్వబోయే ఈ తీర్పుకి ఆమె ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఎక్కడాన్ని పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ, అది క్షమార్హం కాని నేరంగా భావించింది మన్‌హాట్టన్ జిల్లా కోర్టు. ఆమెపై మోపిన నేరారోపణలకు గాను ఒక్కోదానికి ఆరు నెలల చొప్పున 18 నెలలు శిక్ష పడొచ్చని భావిస్తున్నారు. దుర్మార్గంపై ధర్మాగ్రహం థెరీస్ పెట్రీషియా ఒకౌమా.. ట్రంప్ జీరో టాలరెన్స్ విధానంతో పసిబిడ్డలను కుటుంబాలనుంచి వేరు చేయడం దారుణమని పని అని ఆమె భావించారు. మెక్సికో సరిహద్దు నుంచి యు.ఎస్‌లోకి వలస వస్తున్న కుటుంబాలలో చివరకు పాలుతాగే పిల్లలని సైతం తల్లుల నుంచి దూరం చేయడం వల్ల ఆ చర్య దీర్ఘకాలంలో పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందన్న ఆందోళన ఆమె అంతరంగాన్ని కల్లోల పరిచింది. ఈ అమానుషత్వాన్ని వ్యతిరేకించడం ఒక మహిళగా తన బాధ్యతని ఆమె అనుకున్నారు. జీరో టాలరెన్స్‌లోని దుష్ప్రభావాన్ని సమాజం దృష్టిలోకి ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచించారు. థెరీస్కు స్వతహాగా చిన్నప్పటినుంచి ఎల్తైన ప్రదేశాలను అధిరోహించడం ఇష్టం. ప్రధానంగా ఎల్తైన ఇళ్లు ఎక్కడం ఆమెకెంతో ఇష్టమైన పని. ఆమె సోదరులు సైతం ఆమెతో పోటీపడేవారు కాదు. అందుకే ట్రంప్ వలస విధానానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని వినిపించడానికి స్వేచ్ఛకి ప్రతీక అయిన లిబర్టీఆఫ్ స్టాచ్యూని ఎక్కడమే మార్గం అనుకున్నారు. తమది కూడా అమెరికాకి వలస వచ్చిన కుటుంబమే కనుక తను ట్రంప్ వలస విధానాన్ని వ్యతిరేకించడం లేదని, అది తన బాధ్యతగా భావించాననీ ఆనాడే చెప్పారు థెరీస్. సొంత వ్యక్తిత్వంతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆలోచించడాన్నీ, బతకడాన్నీ ఇష్టపడే థెరీస్, 2016 లో ప్రవేశపెట్టిన ట్రంప్ వలస విధానాన్ని నిరసించి తొలిసారి ప్రపంచానికి కొద్దిగా పరిచయం అయ్యారు. అంతకుముందు ఆమె ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేసేవారు. అమెరికా వలస విధానానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో థెరీస్ ఒక విధంగా ఒంటరి సైనికురాలు. అప్పటివరకు ఆమె తనదైన శైలిలో వివిధ అంశాలపైన ఒంటరిగా నిరసన ప్రదర్శనలు జరిపినా, 2017లో న్యూయార్క్‌లోని రైజ్ అండ్ రెసిస్ట్ యాక్టివిస్ట్ గ్రూప్‌లో సభ్యులుగా చేరాక తన ఉద్యమప్రస్థానాన్ని విభిన్నంగా మలుచుకున్నారు. మెరుపులా ఎక్కేశారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కడానికి ఒకరోజు ముందు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద రైజ్ అండ్ రెసిస్ట్ ఆర్గనైజేషన్ నేతృత్వంలో జరిగిన నిరసన ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. న్యూయార్క్ పోలీసులు ఉద్యమకారులను అరెస్టు చేస్తున్న సందర్భంలో థెరీస్ అక్కడి నుంచి అదృశ్యమై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 20 అడుగులపైకి ఎగబాకి స్టాచ్యూ పాదాల వద్దకి చేరుకున్నారు. 3 గంటల ప్రయత్నం తరువాత న్యూయార్క్ పోలీసులు ఆమెను చేరుకోగలిగారు. ఈమె సాహసోపేత నిరసనని అమెరికా మీడియా విస్తృతంగా కవర్ చేసింది. ప్రసిద్ధ ‘ఎల్’ పత్రిక థెరీస్ చర్యను ‘‘2018లో అత్యంతశక్తిమంతమైన మహిళా కార్యక్రమంగా’’ పేర్కొన్నది. స్ట్రీట్ ఆర్ట్ తో కూడా థెరీస్ పరాక్రమ ప్రదర్శన ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకుంది. -
ఉల్లిపాయ–ఉక్కు మనిషి
ఉల్లిపాయకీ ఉక్కుమనిషికీ దగ్గర సంబంధం ఉన్నదని చెప్పడం తాటిచెట్టుకీ తాత పిల కకీ ముడిపెట్టడం అని చాలామందికి అనిపించవచ్చు. ముఖ్యంగా మన దేశంలో ఉల్లిపాయని చిన్నచూపు చూడటానికి వీలు లేదని అనుభవజ్ఞులకు ఈపాటికే అర్ధమయివుంటుంది. నిజానికి ఉల్లిపాయని ‘రాజకీయ’ ఆయు ధంగా మనం గుర్తించాలి. 1998లో ఉల్లిపాయ బిజేపీ ప్రభుత్వాన్ని అల్లల్లాడించింది. ఈ సందర్భంగా రెండు జోకులు గుర్తుచేసుకోవాలి. ఆ రోజుల్లో ఢిల్లీలో ఉల్లిపాయ ధర కిలో 60 రూపాయలు కాగా, ఒక వ్యాపారి ఒక కిలో ఉల్లిపాయ కొన్నవారికి రెండు టీ–షర్టులు ఉచితమని ప్రకటించాడట! గ్రేటర్ కైలాష్‌లో దొంగలు ఒక ఇంట్లో దొంగతనానికి వచ్చారు. 500 రూపాయలు దోచుకుని బొత్తిగా ఇంట్లో ఏమి విలువైన వస్తువులు ఉంచనందుకు యజమానిని హింసించబోయి–5 కిలోల ఉల్లిపాయలు చూశారట. తృప్తిపడి ఉల్లిపాయ సంచీతో వారు నిష్క్రమించారట! అలనాడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ గారు తమ రాష్ట్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించడానికి నిర్ణయించారు. ప్రపంచంలోకెల్లా ఎల్తైన ఈ విగ్రహాన్ని ప్రధానిగా మొన్న ఆవిష్కరిం చారు. కేవలం 33 నెలలలో నిర్మితమైన ఈ విగ్రహం 2,989 కోట్ల ఖర్చుతో నిర్మితమైంది. ఈ స్ఫూర్తితోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మొన్న సరయు నదీతీరాన 151 మీటర్ల ఎత్తున శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మింపజేయనున్నట్టు ప్రకటించారు. ఇంతకూ ఉల్లిపాయకీ పటేల్గారికీ ఏం సంబంధం? పటేల్‌గారు ‘ఐరన్ మాన్’ మాత్రమే కాక ‘ఆనియన్ మాన్’ అని ఒకానొక పత్రికలో పేర్కొన్నారు. రెజినాల్డ్ రేనాల్డ్స్ అనే గాంధీజీ అనుయాయుడు సబర్మతి ఆశ్రమంలో తన అనుభవాల గురించి ఒక పుస్తకాన్ని (టు లివ్ ఇన్ మాన్‌కైండ్) రాశారు. ఒకసారి ఎవరో ఆశ్రమానికి కూరగాయల సంభారాన్ని బహుకరించారట. అందులో ఉల్లిపాయలున్నాయి. ఉల్లిపాయలు బ్రహ్మచారులకు నిషిద్ధం–అవి రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి కనుక . ఆశ్రమంలో ఉన్న మరో బ్రిటిష్ అనుయాయురాలు మిరాబెన్–అందరికన్నా చాదస్తురాలు. ఈ ఉల్లిపాయలని వెంటనే నిషేధించాలని అన్నారట. కాని పటేల్ గారు ‘‘ఉండనీయండి. నేనూ రెజినాల్డ్ ఈ ఉల్లిపాయల్ని తింటాం’’ అన్నారట. వీరిద్దరూ నరభక్షణ చేస్తున్నట్టు అందరూ నిర్ఘాంతపోయి చూస్తుండగా వీరు భుజించారట. తరు వాత తరువాత గాంధీజీ ఉల్లిపాయ ఉపకారాన్ని గ్రహిం చారు. ముఖ్యంగా వెల్లుల్లిపాయ చేసే మేలుని ఆయన గుర్తించారు. కేవలం సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా వాస్తవాలకు అనుగుణంగా పటేల్ తన కర్తవ్యాన్ని మలుచుకోవడానికి ఈ సందర్భం ఒక గుర్తుగా నిలుస్తుంది. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సమైక్య భారత స్థాపనకు–ఆస్థానాల విలీనానికి అప్పటి వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యమించిన ఉక్కుమనిషి కర్తవ్య మూలాలు ఇలాంటి సందర్భాలలో కనిపిస్తాయి. ఒకే ఒక సంస్థాన విలీనానికి నెహ్రూగారు తలదూర్చారు–కశ్మీర్. ఆ సమస్య ఇప్పటికీ రావణకాష్టంలాగా రాజుకుం టూనే ఉంది. మరొక సంస్థానంలో నెహ్రూ కలగజేసుకోబోయారు–హైదరాబాదు. అదృష్టవశాత్తూ పటేల్ ఆయన్ని దృష్టి మళ్లించి పోలీసు యాక్షన్ జరిపించారు. లేకపోతే దక్షిణాన మరో కాష్టం ఈనాటికీ రాజు కుంటూ ఉండేది. మహాత్ముడు దక్షిణాఫ్రికా నుంచి వచ్చి–అక్కడ ఆచరించిన సత్యాగ్రహాన్ని మన దేశంలో అమలు జరపాలనుకున్నప్పుడు–1918లో ఖేడాలో–గ్రామీణులని మేల్కొల్పడానికి పటేల్ ఉల్లిపాయను గాంధీగారికి తీసుకువచ్చారట. ఆ ప్రాంతంలో ఉల్లి రైతులకు జీవనాధారం. అయితే పంటలు పండకపోయినా రైతులు శిస్తుకట్టాల్సిందేనని బ్రిటిష్ ప్రభుత్వం పట్టుబట్టారు. అప్పటి స్థానిక కలెక్టరు ఫెడిరిక్ ప్రాట్ బ్రిటిష్ ఆదాయానికి ఆటపట్టు ఉల్లి పంటల భూముల శిస్తు అని గాంధీకి హెచ్చరించి చెప్పారట. అప్పుడే పాలకవర్గాన్ని గద్దె దించేది ‘ఉల్లిపాయ’ అని గాంధీజీ గ్రహించారు. దండి యాత్రలో కూడా గాంధీజీ ‘బ్రిటిష్ వారి జులుంకి మనం తలవొంచం. అవసరమైతే ఉల్లిపాయలు కారణంగా వెయ్యిసార్లు జైలుకి వెళ్తాం’’ అన్నారట. ఈవిధంగా పటేల్ గారి ప్రమేయంతో, స్ఫూర్తితో–సామాన్య రైతు జీవనాన్ని, తద్వారా ప్రజానీకానికంతటికీ వినియోగపడే ఉల్లిపాయ ‘జాతీయో ద్యమం’లో భాగమైనది అంటే పరోక్షంగా ‘ఉప్పు’ సత్యాగ్రహంలో ‘ఉల్లి’ సత్యాగ్రహం భాగమన్నమాట. నాకనిపిస్తుంది–ఇదంతా వింటున్నప్పుడు–కొద్దిలో తప్పిపోయింది కానీ–అది ప్రపంచ ప్రఖ్యాత ‘‘ఉప్పు–ఉల్లి సత్యాగ్రహం’’ అయ్యేదని. ఆవిధంగా 1998లో ఉల్లిపాయకీ అప్పటి ప్రభుత్వానికీ, 1918లో ఉల్లిపాయకీ బ్రిటిష్ ప్రభుత్వానికీ సంబంధించిన ‘చరిత్ర’ ఉన్నది. మొదటి చరిత్రకి మూలపురుషుడు–సామాన్య ప్రజానీకం అవసరాలను తీర్చి, ప్రతీక్షణం వారి జీవికకు ఆసరాగా నిలిచే ప్రాణ ధాతువుని పట్టుకున్న ఘనుడు–నేడు ప్రపంచంలో అందరికన్నా ఎత్తుగా నిలిచిన ఉక్కుమనిషి–సర్దార్ పటేల్. గొల్లపూడి మారుతీరావు -
ట్రంప్ (అమెరికా ప్రెసిడెంట్)రాయని డైరీ
అమెరికాలోనే ఉన్నామా అనిపిస్తోంది! ప్రెసిడెంటుకే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేనప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మాత్రం ఎందుకిక్కడ? లేపేసి హైతీలోనో, ఆఫ్రికాలోనో పెట్టేస్తే సరిపోతుంది. ఐక్యరాజ్యసమితిని కూడా ఇక్కడి నుంచి లేపేయాలి. ఐక్యరాజ్యసమితిలా లేదది. ఐక్య ఆఫ్రికాసమితిలా బిహేవ్ చేస్తోంది. ఎవర్నీ ఒక మాట అనకుండా కూర్చోడానికైతే అమెరికాకు ఒక ప్రెసిడెంట్ ఎందుకు? ‘షిట్‌హోల్’.. అన్నానట! నాకైతే గుర్తు లేదు. అంతా ఫీలైపోతున్నారు. ‘షిట్‌హోల్’ అని నేను ఎప్పుడు అన్నానో, ఎందుకు అన్నానో, ఎవర్ని అన్నానో మరి! పనికిమాలిన విషయాల్ని మీడియా వెంటనే పట్టేసుకుంటుంది. అన్నవాళ్లకు గుర్తుండదు. అనిపించుకున్న వాళ్లకూ గుర్తుండదు. మీడియా గుర్తుపెట్టుకుంటుంది. సిక్ పీపుల్. వాషింగ్టన్ పోస్ట్‌ని కూడా ఇక్కణ్ణుంచి లేపేయాలి. అమెరికా శుభ్రమౌతుంది. ప్రజలు ఓట్లేస్తేనే కాదు, పేపర్లూ ఇష్టపడితేనే ఎవరైనా అమెరికా ప్రెసిడెంట్ అవుతారు అనే చట్టం లేదు కాబట్టి ఈ మాత్రమైనా మాట్లాడగలుగుతోంది అమెరికా. ‘షిట్‌హోల్’ అనడం ఏంటని వీళ్లందరి అబ్జెక్షన్! ‘దేశాలన్నీ కలిసి నిర్మించిందే అమెరికా..’ అని అంటున్నవాళ్లు.. భాషలన్నీ కలిసిందే అమెరికన్ లాంగ్వేజ్ అని ఎందుకు అనుకోరు? ‘షిట్‌హోల్’ అని అంటే మాత్రం.. షిట్హోలే ఎందుకు కనిపించాలి ఈ డర్టీ డెమోక్రాట్స్కి. నా ఉద్దేశంలోని పారిశుద్ధ్యం వీళ్లకు అర్థం కాదా? కడుపులో ఏదుంటే అదేగా వస్తుంది. మనిషన్నాక అదే రావాలి. ఇంకేదో రాకూడదు. కోపంలో కోపం రావడం, విసుగులో విసుగు రావడం నేచురల్. కోపంలో, విసుగులో కూడా నోట్లోంచి çపూలగుత్తుల పరిమళాలు రావడం అన్ నేచురల్. ఈ డెమోక్రాట్లు, మీడియాక్రాట్లు అంతా అన్ నేచురల్. బయటి వాళ్లను ఇంట్లోకి పిలిచి, ఇంట్లోని వాళ్లను బయటికి తరిమేసే రకం. అందర్నీ రానివ్వాలంటారు, అమెరికా డెవలప్ అవ్వాలంటారు! కుదురుతుందా? డెవలప్మెంట్ అంటే మన తో అవసరం ఉన్నవాళ్లు రావడం కాదు. మనకు అవసరం ఉన్నవాళ్లు రావడం. నేనన్నది ఈ మాటే. దాన్ని వదిలేసి, ‘షిట్‌హోల్’ని పట్టుకున్నారు. వీళ్లకూ తెలుసు.. అమెరికాకు అవసరమైన వాళ్లే అమెరికాకు కావాలని. ఆ మాట ధైర్యంగా చెప్పలేరు. ఒబామా చెప్పలేడు. వాషింగ్టన్ పోస్టూ చెప్పలేదు. ఒక కంట్రీని నేను షిట్‌హోల్ అనుకున్నప్పుడు షిట్‌హోల్ అనే అంటాను. ఎందుకనుకున్నానో అడగడం మానేసి, ఎందుకన్నావ్ అని అడుగుతున్నారు! ఇంకోలా ఎలా అనగలను? ‘దయచేసి నా షిట్‌హోల్ కంట్రీలోకి రాకండి’ అనైతే అనలేను కదా. అప్రియమైన మనుషుల్ని దూరంగా పెట్టడం కోసం ప్రియమైన పదాల్ని వెదుక్కునేంత టైమ్ ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్‌ని కాదు నేను. మాధవ్ శింగరాజు -
చిమ్మచీకట్లో ‘స్వేచ్ఛాతల్లి’!
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరం అనగానే వెంటనే గుర్తొచ్చేది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. స్వేచ్ఛకు ప్రతీకగా ప్రపంచానికే తలమానికంగా ఆ విగ్రహాన్ని న్యూయార్క్ నగరం నడి బొడ్డున నిలబెట్టారు. దాని గురించి సోషల్ మీడియా ట్విట్టర్లో పలు కామెంట్లు మోతమోగాయి. ఎన్నడూ లేనిది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వద్ద తొలిసారి విద్యుత్ లైట్లు ఆగిపోయి చీకట్లో అది దర్శనం ఇచ్చింది. ఇలా కొద్ది సేపు కాదు.. దాదాపు కొన్నిగంటలపాటు. చీకట్లో ఆ విగ్రహాన్ని ఉండటాన్ని చూసిన ఓ ఎర్త్ క్యామ్ లైవ్ స్ట్రీమ్ చేసింది. దీంతో అసలు అక్కడ లైట్లు ఎలా ఆగిపోయాయి? ఏం జరిగి ఉంటుంది? ఎందుకు స్వేచ్ఛా తల్లి చీకట్లో ఉండిపోయింది? ‘మహిళ స్వేచ్ఛ నేడు చీకట్లోకి వెళ్లింది’ అంటూ ఇలా రకరకాలుగా ట్విట్టర్లో కామెంట్లు పెట్టారు. అయితే, దీనిని నిర్వహిస్తున్న నేషనల్ పార్క్ సర్వీస్ సంస్థ వివరణ ఇస్తూ..‘ఇలాంటి అనుభవం చాలా కొద్ది సేపేనని, కావాలని చేసింది కాదని అన్నారు. అనుకోకుండా అలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సాంకేతిక కారణాలవల్లే కరెంటు పోయిందని చెప్పారు. -
గంటలపాటు చీకట్లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ..
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరం అనగానే వెంటనే గుర్తొచ్చేది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. స్వేచ్ఛకు పతీకగా ప్రపంచానికే తలమానికంగా ఆ విగ్రహాన్ని న్యూయార్క్ నగరం నడి బొడ్డున నిలబెట్టారు. దాని గురించి సోషల్ మీడియా ట్విట్టర్లో పలు కామెంట్లు మోతమోగాయి. ఎన్నడూ లేనిది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వద్ద తొలిసారి విద్యుత్ లైట్లు ఆగిపోయి చీకట్లో అది దర్శనం ఇచ్చింది. ఇలా కొద్ది సేపు కాదు.. దాదాపు కొన్నిగంటలపాటు. చీకట్లో ఆ విగ్రహాన్ని ఉండటాన్ని చూసిన ఓ ఎర్త్ క్యామ్ లైవ్ స్ట్రీమ్ చేసింది. దీంతో అసలు అక్కడ లైట్లు ఎలా ఆగిపోయాయి? ఏం జరిగి ఉంటుంది? ఎందుకు స్వేచ్ఛా తల్లి చీకట్లో ఉండిపోయిందంటూ? రకరకాల ప్రశ్నలతోపాటు తమ వ్యూహాలు అందులో పంచుకున్నారు. ‘మహిళ స్వేచ్ఛ నేడు చీకట్లోకి వెళ్లింది. స్టాట్యూఆప్ లిబర్టీ లైట్లు ఆగిపోయాయి. స్వేచ్ఛతో 200 ఏళ్లపాటు సాగిన మన బంధం ఇక ముగిసింది. మహిళలు లేని రోజు వద్దని చెబుతూ చీకట్లోకి వెళ్లిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి ధన్యవాదాలు’ అంటూ ఇలా రకరకాలుగా ట్విట్టర్లో కామెంట్లు పెట్టారు. అయితే, దీనిని నిర్వహిస్తున్న నేషనల్ పార్క్ సర్వీస్ సంస్థ వివరణ ఇస్తూ..‘ఇలాంటి అనుభవం చాలా కొద్ది సేపేనని, కావాలని చేసింది కాదని అన్నారు. అనుకోకుండా అలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. పని సంబంధమైన ఆలస్యం జరగడం వల్ల ఇలా అయ్యిందని తెలిపారు. -
శరణార్థులకు స్వాగతం!
న్యూయార్క్: అమెరికా ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రానికి ప్రతీకగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ వద్ద శరణార్థులకు స్వాగతం అంటూ మంగళవారం ఓ బ్యానర్ వెలిసింది. బ్యానర్‌ను గమనించిన వెంటనే నేషనల్ పార్క్ రేంజర్స్ దానిని తొలగించారు. అయితే.. అప్పటికే దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి. దేశాధ్యక్షుడు ట్రంప్ వలస వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలో.. కనిపించిన ఈ బ్యానర్‌పై నెటీజన్లు పాజిటీవ్‌గా స్పందించారు. ఈ బ్యానర్‌ను తామే ఏర్పాటు చేశామని ఆల్ట్ లేడీ లిబర్టీ అనే సంస్థ ప్రకటించుకుంది. ఈ మేయిల్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో.. 'దాదాపు అమెరికన్లందరి పూర్వికులు వేరువేరు ప్రాంతాలకు చెందినవారు. వలసదారులు, శరణార్థులే ఈ దేశాన్ని గొప్పగా మార్చారు. అంతేగానీ వలస వ్యతిరేక విధానాలు ఈ దేశాన్ని గొప్పగా చేయవు. ముస్లింలు, శరణార్థులు, వలసదారులు అందరూ దేశంలోకి ఆహ్వానితులే' అని ఆల్ట్ లేడీ లిబర్టీ గ్రూప్ వెల్లడించింది. అలాగే..దేశాల మధ్య గోడలు, మత ప్రాతిపదికన నిషేధం విధించడం లాంటివి మన విలువలకు వ్యతిరేకం అని ప్రకటనలో పేర్కొన్నారు. -
లిబర్టీ తలనరికేసిన ట్రంప్ !
బెర్లిన్: ‘అధికారం చేపట్టిన ఏడు రోజులలోపే ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధం విధించి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ శాంతికి శనిలా మారాడు.. స్వేచ్ఛకు సంకెళ్లేస్తున్నాడు.. తన కంపు నోటితో భూగోళాన్ని మింగేస్తున్నాడు..’ అంటూ ప్రఖ్యాత జర్మన్ వార్తా పత్రిక డెర్ స్పీగెల్.. అమెరికా అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో మండిపడింది. ఆ మ్యాగజీన్లోని రాతల సంగతి సరేగానీ, కవర్‌పేజీపై ముద్రించిన ట్రంప్ కార్టూన్‌పై మాత్రం తీవ్రస్థాయి దుమారం చెలరేగుతున్నది. పేరులోనే ‘స్వేచ్ఛ’ను కలిగిన అమెరికా విశిష్ఠతను చాటిచెప్పే ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’(లిబర్టీ విగ్రహం) తలను ట్రంప్ నరికేసినట్లుగా ఆ కార్టూన్ ఉంది. ఎడెల్ రోడ్రిగ్జ్ అనే కార్టూనిస్టు వేసిన ఈ బొమ్మపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ‘ట్రంప్‌ను విమర్శించాలనే ఉద్దేశం మంచిదే అయినా, లిబర్టీ తలను నరికేయడం మాత్రం సరికాదు’అని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. యురోపియన్ యూనియన్(ఈయూ) కూడా సదరు కార్టూన్‌ను ఖండించింది. అయితే ఆ కార్టూన్ గీసిన ఎడెల్ మాత్రం తాను గీసింది సరైనే బొమ్మేనని వాదిస్తున్నారు. గతంలో న్యూయార్క్ డైయిలీ న్యూస్ కూడా ట్రంప్-లిబర్టీ కార్టూన్‌ను ప్రచురించింది. కాకపోతే రక్తపాతం తక్కువగా చూపించారు. తాజా కార్టూన్‌ను ముద్రించింది జర్మన్ పత్రిక కావడంతో ఇప్పుడీ అంశం వివాదాస్పదమైంది. శరణార్థుల విషయంలో జర్మనీ తప్పు చేసిందని ట్రంప్ పలు మార్లు తిట్టిపోయడం, ప్రతిగా యురోపియన్ యూనియన్ ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ కార్టూన్ ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తుందో చూడాలి.. (ట్రంప్‌ను అడ్డుకోకుంటే మనం మటాషే!) -
చందమామను అందుకునే స్వేచ్ఛ
నీలాకాశంలో నీలిమబ్బుల మధ్య దాగుడుమూతలాడే చందమామ నేలకు దిగివస్తే... ఆ చందమామతో ఆడుకోవడానికి అందరికంటే తానే ముందున్నానంటూ అందుకోబోతున్నట్లుగా కనిపిస్తోంది కదూ.న్యూయార్క్ నగరంలో సోమవారం అర్ధరాత్రి పూర్ణ చంద్రుడిని అందుకోవడానికా అన్నట్లు ఉన్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీని ఫొటోగ్రాఫర్ ఎంతో అందంగా తన కెమెరాలో బంధించాడు. -
సాగర్‌లో.. తథాగత చరిత్ర..
► 1984లో విగ్రహ ఏర్పాటుకు నాంది ► రెండేళ్ల తర్వాతజిబ్రాల్టర్ రాక్‌పైకి.. ►1990లో హుస్సేన్ సాగర్‌లో మునక సిటీబ్యూరో: హైదరాబాద్ అనగానే చార్మినార్ తర్వాత గుర్తొచ్చేది హుస్సేన్‌సాగర్.. అందులోని బుద్ధ విగ్రహం. ఈ గౌతముడు ఇక్కడ నిలవడానికి ముందు పెద్ద చరిత్రే జరిగింది. అమెరికాలో పుట్టిన ఆలోచనకు రాయ్‌గిరి కొండల్లో రూపునిచ్చారు. ‘రెండేళ్ల జలవాసం’ అనంతరం సాగర్‌లోని జిబ్రాల్టర్ రాక్ పైకి చేరింది. ఈ క్రమంలో 10 మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ‘లిబర్టీ’ ఇచ్చిన స్ఫూర్తి.. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు 1984లో అమెరికా పర్యటనకు వెళ్లారు. న్యూయార్క్ నగరంలో ఉన్న ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ని చూసి స్ఫూర్తి పొందిన ఆయన అలాంటి ఓ విగ్రహం హైదరాబాద్‌లోనూ ఉండాలని భావించారు. సుదీర్ఘ ఆలోచనల తరవాత సిటీలో ఏర్పాటు చేసే విగ్రహం గౌతమ బుద్ధుడిదే కావాలని, దాన్ని హుస్సేన్‌సాగర్ మధ్యలో ఉన్న జిబ్రాల్టర్ రాక్‌పై నిలబెట్టాలని నిర్ణయించారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ సైతం న్యూయార్క్ హార్బర్లో ఉండడంతో సాగర్ మధ్యలో ఏర్పాటుకే మొగ్గు చూపారు. గణపతి స్థపతి నేతృత్వంలో రూపు హుస్సేన్‌సాగర్‌లో నిల్చునే మహా బుద్ధ విగ్రహం ఏకశిలతో మలచినదై ఉండాలన్న ఉద్దేశంలో అనేక ప్రాంతాల్లోని రాతి కొండలను సర్వే చేశారు. ఎట్టకేలకు హైదరాబాద్‌కు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో నల్లగొండ జిల్లా రాయ్‌గిరిలో ఉన్న కొండల్లో ఆ రాయిని గుర్తించారు. విగ్రహాన్ని తీర్చిదిద్దే పనిని శిల్పి ఎస్ఎం గణపతి స్థపతికి అప్పగించారు. 1985 అక్టోబర్‌లో విగ్రహం చెక్కే పని ప్రారంభించారు. వందల మంది కార్మికులు చాలాకాలం శ్రమించి 58 అడుగులు భారీ బుద్ధుడికి తుది రూపాన్నిచ్చారు. ఇందుకోసం దాదాపు రూ.కోటికి పైగా ఖర్చయిందని అంచనా. తరలింపు పెద్ద సవాలు.. భారీస్థాయిలో ఉన్న తధాగతుడి భారీ విగ్రహాన్ని రాయ్‌గిరి నుంచి హుస్సేన్‌సాగర్ వరకు చేర్చడం, జిబ్రాల్టర్ రాక్‌పై నిలబెట్టడం పెద్ద సవాలు. ఇందుకోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఊర్మిళ అండ్ కంపెనీ కంటే కేవలం రూ.20 వేల తక్కువకు టెండర్ వేసి అసోం బెంగాల్ కారియర్స్ లిమిటెడ్ (ఏబీసీఎల్) సంస్థ ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. విగ్రహం రవాణా కోసం 192 చక్రాలతో కూడిన భారీ వాహనాన్ని రంగంలోకి దింపారు. బుద్ధుడి రాక నేపథ్యంలో వాహనానికి అవాంతరాలు లేకుండా ఉండేందుకు హైదరాబాద్‌లోని అనేక రోడ్లను విస్తరించారు. ఎట్టకేలకు విగ్రహం 1990 ఫిబ్రవరిలో హుస్సేన్‌సాగర్ తీరానికి చేరింది. సాగర్‌లోకి దిగగానే ప్రమాదం హుస్సేన్‌సాగర్ ఎన్టీఆర్ ఘాట్ వైపు నుంచి విగ్రహాన్ని జిబ్రాల్టర్ రాక్ వద్దకు తీసుకువెళ్లడానికి ఏబీసీఎల్ భారీ జెట్టీ వంటి రవాణా సాధనాన్ని ఏర్పాటు చేసింది. 1990 మార్చి 10న సాగర్ తీరం నుంచి బుద్ధుడితో బయలుదేరిన జెట్టీ నీటిలో 91 మీటర్లు ప్రయాణించి మునిగిపోయింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ మృతదేహం ఆచూకీ సైతం లభించలేదు. తీరం నుంచి సాగర్‌లోకి కిలోమీటరు పరిధిలో మార్గాన్ని నిర్మించి, విగ్రహాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుందంటూ టెండర్ దాఖలు చేసిన ఊర్మిళ అండ్ కంపెనీ సంస్థ ఎందుకు చెప్పిందో అప్పుడు అర్థమైంది. రెండేళ్ల అనంతరం.. సుమారు 40 అడుగుల లోతులో ఉండిపోయిన విగ్రహాన్ని 1992 ఏప్రిల్‌లో సాగర్ నుంచి బయటకు తీయగలిగారు. నిర్ణీత ప్రాంతంలో నిలబెట్టడం, ఇతర పనులు పూర్తయిన తరవాత అదే ఏడాది డిసెంబర్ 1న జిబ్రాల్టర్ రాక్‌పై 4.6 మీటర్ల ఎత్తులో నిర్మించిన ప్లాట్‌ఫామ్ మీద బుద్ధ విగ్రహం ఆవిష్కృతమైంది. నిత్యం ఎంతో మందిని ఆకర్షిస్తున్న ఈ బుద్ధుడిని 2006 దలైలామా సైతం సందర్శించారు. 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బరువున్న ఈ విగ్రహం చెక్కడం, రవాణా ఇతర అన్నీ కలిపి రూ. 5.58 కోట్లు ఖర్చయ్యాయి. -
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ ఓ అరబ్ ముస్లిం మహిళ!
న్యూయార్క్: అమెరికా ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రానికి ప్రతీకగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ వాస్తవానికి మొఖం కనిపించేలా బురఖా ధరించిన అరబ్ ముస్లిం యువతి స్కెచ్ నుంచి రూపొందిన విగ్రహమని తాజాగా తేలింది. 1855-56లో ఈజిప్టులో ప్రయాణించిన ఫ్రెంచ్ శిల్పి ఫ్రెడరిక్ అగస్టీ బర్థోల్దీ. లిబర్టీ విగ్రహాన్ని రూపొందించారు. ప్రజా చిహ్నాలుగా చరిత్రలో నిలిచిపోయే భారీ విగ్రహాలను చెక్కడం పట్ల అమితాసక్తి కలిగిన ఫెడరిక్ను సూయిజ్ కెనాల్‌కు ఓ లైట్‌హౌస్‌ను డిజైన్ చేయాల్సిందిగా అప్పటి ఈజిప్టు ప్రభుత్వం 1869లో కోరింది. సూయిజ్ కెనాల్‌కు కాగడా పట్టుకొని కాపాల కాస్తున్న ఓ అరబ్ రైతు మహిళ రూపంలో లైట్‌హౌస్‌ను నిర్మించేందుకు ఫ్రెడరిక్ ఓ డిజైన్ రూపొందించారు. ఆ డిజైన్‌కు ఇప్పటి లిబర్టీ విగ్రహానికి కొన్ని పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అప్పుడు డిజైన్ చే సిన అరబ్ మహిళ ఎడమ చేతిలో కాగడా పట్టుకున్నట్టు ఉండగా, ప్రస్తుత లిబర్టీ విగ్రహంలో కుడిచేతిలో కాగడా పట్టుకున్నట్టు ఉంది. అప్పుడు ఆ అరబ్ మహిళ స్కెచ్‌కు ఫెడరిక్ ‘ఈజిప్ట్ బ్రింగ్స్ లైట్ టు ఆసియా’ అని నామకరణం కూడా చేశారు. అప్పట్లో ఈజిప్టులో మెజారిటీ శాతం ముస్లింలే ఉండేవారు. అలెగ్జాండ్రియా, కైరోలో 86 శాతం మంది, మిగతా ప్రాంతాల్లో 91 శాతం ముస్లింలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు, నివేదికలు వెల్లడిస్తున్నాయి. అనివార్య కారణాల వల్ల సూయిజ్ కెనాల్ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అమెరికా స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఫ్రెంచ్ ప్రజల తరఫున ఆ దేశానికి ఓ భారీ విగ్రహాన్ని అందజేయాలనే ఆలోచన ఫ్రెంచ్ ప్రభుత్వానికి వచ్చింది. అప్పటి ఫ్రెంచ్ చరిత్రకారుడు ఎడౌర్డ్ డీ లబైలాయే ద్వారా దీన్ని డిజైన్ చేయాల్సిన కాంట్రాక్ట్ ఫెడరిక్కు వచ్చింది. ఫెడరిక్ గతంలో తను రూపొందించిన డిజైన్ల ఆధారంగా 1870లో కొత్త విగ్రహం కొరకు డిజైన్లు గీయడం ప్రారంభించారు. అందులో భాగంగా అరబ్ ముస్లిం మహిళ స్కెచ్‌ను రోమన్ స్వేచ్ఛామూర్తిగా అభివృద్ధి చేశారు. దాన్ని పారిస్ ప్రభుత్వం అంగీకరించింది. పారిస్‌లో ఈఫిల్ టవర్‌ను నిర్మించిన ప్రముఖ బిల్డర్ గుస్తవ్ ఈఫిల్ సహకారంతో ఈ విగ్రహాన్ని ఫెడరిక్ పూర్తి చేశారు. సకాలంలో దీని నిర్మాణం పూర్తికాలేదు. అయినప్పటికీ అమెరికా స్వాతంత్య్ర శతజయంతోత్సవాలను పురస్కరించుకొని ఫ్రాన్స్ ఈ లిబర్టీ విగ్రహాన్ని అమెరికాకు అందజేయగా 1886లో ప్రతిష్టించారు. అమెరికా స్వేచ్ఛకు ప్రతీకగా ఓ బహుమానంగా వచ్చిన విగ్రహాన్ని ప్రతిష్టించడం సబబుకాద ంటూ అప్పట్లో రాజకీయ వర్గాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. ఫెడరిక్ తన తల్లి చార్లోటీ బెస్సర్ బర్థోల్దిని స్ఫూర్తిగా తీసుకొని లిబర్టీ విగ్రహాన్ని చెక్కారన్న వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. -
తస్లీమా నస్రీన్ రాయని డైరీ
కొద్దిసేపటిగా చీకట్లో ఉన్నాను. కొద్దిసేపటిగా అంటే ఓ ఇరవై ఏళ్లుగా. ఉద్యమ జీవితంలో ఇరవయ్యేళ్లన్నది ఏమాత్రం వ్యవధి కనుక! పోరుబాటలో గడిచిపోతున్నవి... అవి దశాబ్దాలైనా, శతాబ్దాలైనా కాల ప్రవాహంలో ఒడ్డుకు చేరిన గులకరాళ్ల వంటివే. గదిలో, గది చీకట్లో ఒక్కదాన్నే ఉంటున్నా నాకేమీ భయం కలగడం లేదు. నా లోపల నాలుగు కాగడాలు వెలుగుతున్నాయి. సెక్యులర్ హ్యూమనిజం, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, జెండర్ ఈక్వాలిటీ, హ్యూమన్ ైరె ట్స్... ఆ నాలుగు కాగడాలు. చీకటిలో నేను వెలిగించుకున్నవి కాక, నా చుట్టూ ఉన్న చీక టితో నేను వెలిగించుకున్న కాగడాలవి. కిటి కీలోంచి దూరంగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తోంది. యూఎస్‌లో స్వేచ్ఛకు ఇప్పుడు నేను ఏ వైపున ఉన్నానో స్పష్టం కావడం లేదు. ఇండియా నుంచి వచ్చి కొన్నాళ్లయింది కానీ, ఎన్నాళ్లయిందో తెలియడం లేదు. స్వేచ్ఛా ప్రతిమ కింద కదులుతున్న నీడల్లో అల్‌ఖైదా జాడల్ని నా చూపులు అంచనా వేస్తున్నాయి. మృత్యువు నాకు సమీపంలోనే ఉందని తెలుస్తూనే ఉంది. ఎంత సమీపంలో అన్నది నా సమస్య కాదు. నా శత్రువు సమస్య. నా శత్రువుది కూడా కాదు. నన్ను శత్రువుగా భావిస్తున్నవాళ్లది. నాకు స్నేహితులు తప్ప శత్రువుల్లేరు. ఆ స్నేహితులను అల్‌ఖైదా వరసగా చంపుకుంటూ వస్తోంది. స్త్రీ స్వేచ్ఛ, మత స్వాతంత్య్రం నా స్నేహితుల నినాదం. అందుకే చంపేస్తోంది. ఉగ్రవాదం మనుషుల్ని మాత్రమే నరికి చంపగలదు. నినాదాల తాకిడిని తట్టుకునే శక్తి దానికి లేదు. ఈ ఫండమెంటలిస్టులు, ప్రభుత్వాలు, ప్రెస్వాళ్ల ధోరణి తరచు నాకు ఒకేలా అనిపిస్తుంటుంది! ఈ మూడు శక్తులదీ ఒకేరకమైన ఇన్సేనిటీ. ఉద్యమకారుల్ని ఫండమెంటలిస్టులు వెంటబడి తరుముతుంటారు. ఉద్యమకారుల్ని లోపలికి రానీయకుండా ప్రభుత్వాలు తలుపులు వేసుకుంటాయి. ఉద్యమకారుల దారుల్ని ప్రెస్‌వాళ్లు చక్కగా స్కెచ్‌గీసి బయటపెడుతుంటారు. నేను యూఎస్ రాగానే ఇండియా నుంచి ఒక జర్నలిస్టు మిత్రుడు అడిగాడు... ‘అల్‌ఖైదా హిట్‌లిస్టులో ఉన్నారట కదా’. ‘అవును’. ‘ఇండియన్ గవర్నమెంట్ మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదట కదా!’. ‘అవును’. ‘యూఎస్ లోనే ఉండిపోతారట కదా’. ‘కాదు’. ‘కానీ, భారత ప్రభుత్వం...’ అంటూ మళ్లీ మొదటికొచ్చాడు మిత్రుడు. ‘ఎన్నాళ్లిలా దేశం నుంచి దేశానికి తప్పించుకుని తిరుగుతారు’ అని అడిగాడు! ‘ఎన్నాళ్లయినా’ అని చెప్పాను. సిద్ధాంతాలను బతికించుకోవాలంటే ముందు మనం బతికి ఉండాలి. బతికుండడం కోసం నాకు ఏ దేశమైనా ఒక్కటే. యూఎస్గానీ, స్వీడన్ గానీ, ఇంకోటి గానీ. కానీ బతకడం కోసం మాత్రం నాకు ఇండియా కావాలి. మాధవ్ శింగరాజు -
మనల్ని కాపీ కొట్టేవాళ్లే!
మన నగరాన్ని అంతర్జాతీయ నగరం చేస్తామనీ, విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చాలామంది నేతలు అంటున్నారుగానీ... నాకేమో ఇప్పటికే ఇది ఆల్రెడీ విశ్వనగరమే అని గట్టినమ్మకం. అంతర్జాతీయంగా అనేక నగరాలు మన పేర్లనూ, ప్రతిష్ఠలనూ, విశిష్టతలనూ కాపీ కొట్టాయేమోనని అనుమానం కూడా. ఉదాహరణకు మన లిబర్టీ సెంటర్‌నే తీసుకుందాం. అక్కడ లిబర్టీ థియేటర్ అని సినిమా హాల్ ఉండేదట. కాలక్రమాన సినిమాహాలు కాలగర్భంలో కలిసిపోయినా మన స్వేచ్ఛా ప్రియత్వానికి చిహ్నంగా ‘లిబర్టీ సెంటర్’ మాత్రం అలాగే మిగిలింది. ఈ పేరును కాపీ కొట్టి న్యూయార్క్ నగరం వాళ్లు ఒక ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ అని ఒక విగ్రహాన్ని తయారు చేయించుకుని, వాళ్ల సెంటర్‌కు ఆ పేరు పెట్టుకున్నారేమో మనకు తెలియదు. కానీ వాళ్లకు దీటుగా మన దగ్గరా ఓ ‘స్టాట్యూ లెస్ లిబర్టీ’ సెంటర్ ఆల్రెడీ ఉందన్నమాట మాత్రం వాస్తవం. ఇక మన రోడ్డు పేర్లలో కోఠీని తీసుకోండి. దీని పేరును కాపీ కొట్టే... జపాన్ దేశస్తులు వాళ్ల దేశంలో ఒక నగరానికి క్యోటో అని పేరు పెట్టారు. అంతెందుకు... వాళ్ల రాజధానికి ఏ పేరు పెట్టాలో తెలియక ఇదే నగరం పేరును తిరగేసి ‘టోక్యో’ అని పిలుస్తూ, దాన్ని తమ రాజధాని చేసుకున్నారు. ఎందుకంటే... కింగ్ కోఠీలో అప్పట్లో రాజప్రసాదం ఉండేదని తెలుసుకున్న తర్వాత, జపనీయులు తమ నగరం పేరు తిరగేసి, దాన్ని రాజధానిగా చేసుకున్నారేమోనని నా అభిప్రాయం. మన నగర వాసులం... ఎంత హాస్యప్రియులమో తెలుసా? పాతబస్తీలో చాలా కాలం క్రితం ఒకాయన నివసించేవాడట. అతడెప్పుడూ కోపంగా కనిపించేవాడట. అతణ్ణి చూడగానే అందరికీ వేపాకు తిన్నట్లుగా చేదుగా అనిపించేదట. అందుకే అతడి అసలు పేరును మరిచి అందరూ అతడికి ‘కడ్వే సాబ్’ (చేదు మహనీయుడు) అని నిక్‌నేమ్ పెట్టారట. చివరకు ఆయన పేరిట కూడా ఒక గల్లీకి కడ్వే సాబ్ కీ గల్లీ అని ఆటోమేటిగ్గా నామకరణం జరిగిపోయిందట. మళ్లీ జపాన్వాడికి అర్థాలతో నిమిత్తం లేదు కదా. మన పేర్లు కాపీ కొట్టడమే అతడి పని కదా. అందుకే వాళ్ల నగరాల్లో ప్రముఖమైన ఒకదానికి ‘కడోమా’ అని నామకరణం చేసుకున్నారట. అది కూడా మన పొరుగు రాష్ట్ర నగరం విశాఖ పేరును కాపీ కొట్టి ‘ఒసాకా’గా మార్చుకున్న నగరానికి దగ్గర్లో ఉందట ఈ కడోమా సిటీ. ఇక పాకిస్థాన్ వాడికైతే మరీ సిగ్గు లేదు కదా. అందుకే మొత్తానికి మొత్తం మన నగరం పేరుతో మరో హైదరాబాద్‌నే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కాపీ రాయుళ్లతో ఎంతకని ఛస్తాం. కాబట్టి మన గొప్పతనానికి తార్కాణంగా ఒక్కమాట అనుకుందాం. అద్భుత రచయిత ఆస్కార్‌వైల్డ్ ఏమన్నాడు? గొప్పవాళ్లకు మామూలు వాళ్లిచ్చే గౌరవమే ‘అనుకరణ’ అన్నాడు. విశ్వమంతా ఇప్పటికే మనల్ని అనుకరిస్తుంటే... కొత్తగా చెప్పేదేం లేదు... ఆల్రెడీ మనది ప్రపంచ పట్టణం... విశ్వమహానగరం! -
లిబర్టీ స్టాట్యూ కంటే పెద్దదిగా సర్దార్ పటేల్ విగ్రహం!
హర్యానా: దేశ ప్రజలను ఐక్యతగా ఉంచడానికి స్టాట్యూ ఆఫ్ యూనిటీని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక చిహ్నంగా నిర్మిస్తామని.. ఆ విగ్రహం న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే పెద్దగా ఉంటుంది అని నరేంద్రమోడీ హర్యానాలోని ఓ సభలో తెలిపారు. ఆసభలో మాట్లాడుతూ 'అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండింతలు పెద్దదిగా సర్ఱార్ పటేల్ ఐక్యత స్మారక చిహ్నం ఉంటుంది' అని బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ అన్నారు. దేశానికి తొలి హోంమంత్రిగా సేవలందించిన సర్దార్ పటేల్.. దేశ ఐక్యత కోసం పాటు పడ్డారని.. అయితే ఆయన సేవలను ప్రభుత్వాలు మరిచిపోయాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కు దేశంలోని రైతులందరూ తమ నాగళ్ల నుంచి చిన్న ఇనుము ముక్కను పంపించాలని.. ప్రతి గ్రామం నుంచి 200-300 గ్రాముల ఇనుముని సేకరిస్తాం అని తెలిపారు. న్యూయార్క్ నగరంలోని లిబర్టీస్ అనే రోమన్ దేవత విగ్రహం 1886 సంవత్సరలో అమెరికా దేశానికి ఫ్రాన్స్ ప్రజలు బహుమతిగా ఇచ్చారు.