గంటలపాటు చీకట్లో స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ.. | Statue of Liberty goes dark and Twitter lit up | Sakshi
Sakshi News home page

గంటలపాటు చీకట్లో స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ..

Published Thu, Mar 9 2017 12:49 PM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

గంటలపాటు చీకట్లో స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ..

గంటలపాటు చీకట్లో స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ..

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరం అనగానే వెంటనే గుర్తొచ్చేది స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ. స్వేచ్ఛకు పతీకగా ప్రపంచానికే తలమానికంగా ఆ విగ్రహాన్ని న్యూయార్క్‌ నగరం నడి బొడ్డున నిలబెట్టారు. దాని గురించి సోషల్‌ మీడియా ట్విట్టర్‌లో పలు కామెంట్లు మోతమోగాయి. ఎన్నడూ లేనిది స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ వద్ద తొలిసారి విద్యుత్‌ లైట్లు ఆగిపోయి చీకట్లో అది దర్శనం ఇచ్చింది. ఇలా కొద్ది సేపు కాదు.. దాదాపు కొన్నిగంటలపాటు.

చీకట్లో ఆ విగ్రహాన్ని ఉండటాన్ని చూసిన ఓ ఎర్త్‌ క్యామ్‌ లైవ్‌ స్ట్రీమ్‌ చేసింది. దీంతో అసలు అక్కడ లైట్లు ఎలా ఆగిపోయాయి? ఏం జరిగి ఉంటుంది? ఎందుకు స్వేచ్ఛా తల్లి చీకట్లో ఉండిపోయిందంటూ? రకరకాల ప్రశ్నలతోపాటు తమ వ్యూహాలు అందులో పంచుకున్నారు. ‘మహిళ స్వేచ్ఛ నేడు చీకట్లోకి వెళ్లింది. స్టాట్యూఆప్‌ లిబర్టీ లైట్లు ఆగిపోయాయి. స్వేచ్ఛతో 200 ఏళ్లపాటు సాగిన మన బంధం ఇక ముగిసింది. మహిళలు లేని రోజు వద్దని చెబుతూ చీకట్లోకి వెళ్లిన స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీకి ధన్యవాదాలు’   అంటూ ఇలా రకరకాలుగా ట్విట్టర్‌లో కామెంట్లు పెట్టారు.

అయితే, దీనిని నిర్వహిస్తున్న నేషనల్ పార్క్‌ సర్వీస్‌ సంస్థ వివరణ ఇస్తూ..‘ఇలాంటి అనుభవం చాలా కొద్ది సేపేనని, కావాలని చేసింది కాదని అన్నారు. అనుకోకుండా అలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. పని సంబంధమైన ఆలస్యం జరగడం వల్ల ఇలా అయ్యిందని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement