dark
-
పసిఫిక్ మహాసముద్రంలో చీకటి జీవి
భూగోళంపై ఎన్ని రకాల జీవులున్నాయో లెక్కేలేదు. ఎన్నో రకాల జీవులు ఇప్పటికే అంతరించిపోయినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. మరోవైపు కొత్తరకం జీవుల ఉనికి బయటపడుతూనే ఉంది. దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ, చిలీ దేశాల సముద్ర తీరంలో ఒక జీవిని గుర్తించారు. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో భాగమైన అటకామా ట్రెంచ్ అట్టడుగున ఈ ప్రాణి నివసిస్తున్నట్లు కనిపెట్టారు. యాంఫీపాడ్ పాడ్ వర్గానికి చెందిన ఈ జీవికి డుల్సిబెల్లా కమాంచక అని పేరుపెట్టారు. కమాంచక అంటే స్థానిక భాషలో చీకటి అని అర్థం. ఈ చీకటి జీవి మాంసాహారి. ఇతర జీవులే దీని ఆహారం. ఇవి ఇక్కడ పెద్దగా కనిపించలేదు కాబట్టి అంతరించేపోతున్న జీవుల జాబితాలో చేర్చారు. ఇంటిగ్రేటెడ్ డీప్–ఓషియన్ అబ్జర్వింగ్ సిస్టమ్(ఐడీఓఓఎస్)లో భాగంగా గత ఏడాది సముద్రం అడుగు భాగంలో శోధించారు. ఉపరితలం నుంచి 7,902 మీటర్ల లోతులో కొత్త రకం జీవి ఉన్నట్లు బయటపడింది. అంటే దాదాపు 8 కిలోమీటర్ల లోతున ఇది సంచరిస్తుండడం గమనార్హం. వాస్తవానికి అక్కడ అత్యధిక నీటి ఒత్తిడి ఉంటుంది. జలాంతర్గాములు సైతం అంత లోతుకి చేరుకోవడం కష్టం. మానవుడు ఇప్పటికీ చూడని సముద్రాల అడుగు భాగంలో జీవ వైవిధ్యానికి కొదవ లేదు. మనకు తెలియని ఎన్నో ప్రాణులు అక్కడ ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అటకామా ట్రెంచ్ అనేది భూమిపై అత్యంత లోతైన సముద్ర ప్రాంతం. ఇక్కడ సముద్రం లోతు 6,000 మీటర్ల నుంచి 11,000 మీటర్ల దాకా ఉంటుంది. ఎన్నో విశిష్టమైన జీవులకు అటకామా ట్రెంచ్ నెలవుగా మారింది. అరుదైన యాంఫీపాడ్స్, స్నెయిల్ ఫిష్, మడ్ డ్రాగన్స్ ఇక్కడ కనిపిస్తాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంకా తెలవారని సిరియా!
కుటుంబ పాలనలో.. ఆ పాలకుల నియంతృత్వ పోకడలతో యాభై ఏళ్లుగా చిధ్రమైంది సిరియా. దశాబ్దంపైగా సాగిన అంతర్యుద్ధం ఆ నేలపై ఐదు లక్షల మందిని పొట్టనపెట్టుకోగా.. 13 లక్షల మందిని దేశం విడిచిపోయేలా చేసింది. చివరకు తిరుగుబాటుదారులు పైచేయి సాధించడంతో నియంతాధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. దీంతో.. 2024 డిసెంబర్ 8న సిరియా స్వేచ్ఛా వాయువుల్ని పీల్చింది. కానీ..సిరియాలో చీకట్లు తొలగినా.. ఇంకా తెలవారలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసద్ పలాయనం తర్వాత ఊహించిందే జరుగుతోంది. ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. అలాగే సైన్యం, భద్రతా బలగాలు వెనక్కి తగ్గడం.. శాంతిభద్రతలు పూర్తిగా పట్టు తప్పాయి. చాలాచోట్ల దోపిడీల్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం ఏర్పడడం అక్కడ ఇప్పట్లో కుదరని పని. పోనీ.. ఆపద్ధర్మ ప్రభుత్వమైనా ఏర్పడాలన్నా కొత్త తలనొప్పి వచ్చిపడింది!.నా కేబినెట్లో పని చేసినవాళ్లంతా రెబల్స్‌కు సన్నిహితులే. కాబట్టి సిరియాలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకైనా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. -ప్రధాని ముహమ్మద్ అల్ జలీల్రాజధాని డమాస్కస్ సహా ప్రధాన నగరాలు మా ఆధీనంలోకి వచ్చాయి. సిరియాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. మేం ఎలాంటి ఆటంకాలు కలిగించబోం.-రెబల్స్ గ్రూప్స్సిరియాలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వ ఏర్పాటుకు మా పూర్తి మద్ధతు తప్పక ఉంటుంది. - విపక్షాల కూటమిసిరియాలో ప్రభుత్వ ఏర్పాటునకు ప్రజలు మాత్రమే కాదు.. ఆయుధం పట్టి పోరాడిన వాళ్ల మద్దతు కూడా ముఖ్యమే!-హెచ్‌టీఎస్ గ్రూప్ నేత డిమ మౌస్సాపైన ప్రకటనలన్నీ ప్రభుత్వ సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆధిపత్య పోరులో అవి తలమునకలైపోయాయి. ప్రభుత్వ ఏర్పాటునకు ప్రభుత్వాలు ముమ్మరం చేశామని, చర్చలు జరుపుతున్నామని చెప్పిన రెబల్ గ్రూప్ హెచ్‌టీఎస్.. ఇంకోపక్క యుద్ధాన్ని మాత్రం కొనసాగిస్తోంది. తూర్పు సిరియాలోనే అతిపెద్ద పట్టణమైన దెయిర్ అల్ జౌర్పై పట్టుకోసం దాని మిత్రపక్షాలతో తీవ్రంగా యత్నిస్తోంది. ఇంకోవైపు సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ స్వాధీనంలో ఉన్న అలెప్పోపై.. టర్కీ మద్దతుతో సిరియన్ నేషనల్ ఆర్మీ విరుచుకుపడుతోంది. ఇంకా కొన్ని రెబల్ గ్రూప్స్.. పలు ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు యత్నిస్తున్నాయి. ఇవికాకుండా..ఇదీ చదవండి: అసద్ పీఠాన్ని కూలదోసిన పిల్ల చేష్టలు!సిరియాలో ఆయుధ కారాగారాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ తన దాడులను ఉధృతం చేసింది. ముఖ్యంగా రసాయనిక ఆయుధాలు హెజ్బొల్లాలాంటి ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్లకూడదనే ఉద్దేశంతో తాము దాడుల్ని కొనసాగిస్తున్నామని ప్రకటించుకుంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌కు అమెరికా కూడా సహాకారం అందిస్తోంది. మరోవైపు.. ఈ పరిణామాలను ఉగ్ర సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే రెబల్స్‌లో కొన్నింటికి వీటి మద్దతు ఉంది. హెచ్‌టీఎస్ లాంటి సంస్థ మూలాలు ఆల్‌ఖైదా నుంచే ఉన్నాయి. పైగా ఒకప్పుడు అలావైట్, సున్నీల మధ్య చిచ్చులో జిహాదీ గ్రూపులు చలి కాచుకున్న చరిత్ర ఉండనే ఉంది. ఇప్పుడు రాజకీయ సంక్షోభం తలెత్తితే గనుక ఆ గ్రూపులు మరింత బలపడొచ్చు.ప్రస్తుతానికి.. సిరియాలో అధికారాన్ని చేపట్టేందుకు అసలు ప్రతిపక్షమే లేదు. అంతర్యుద్ధం ముగిసిపోయిందనడానికి అస్సలు వీల్లేదు. తిరుగుబాటు గ్రూపుల మధ్య విభేదాలు, అంతర్గత పోరు నడుస్తోంది. వీటికి తోడు విదేశీ జోక్యం ఈ సమస్యను మరింత జఠిలంగా మార్చే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి.. వీలైనంత త్వరగా అధికార శూన్యత భర్తీ జరిగి.. దేశం వెలుతురు దిశగా పయనించాలని సిరియా ప్రజానీకం బలంగా కోరుకుంటోంది. -
అమెరికాలో ... శాస్త్రీయ నృత్య రూపకంగా దుర్యోధనుడు
ఆమెరికాలో ఉన్న శాస్త్రీయ నృత్య సంస్థ డాన్సెస్ ఆఫ్ ఇండియా సెయింట్ లూయిస్. ఈ సంస్థ అధ్యక్షురాలు నర్తన ప్రేమచంద్ర. మహాభారతం నుండి ప్రేరణ పొందిన దుర్యోధనుడి పాత్రను ’డ్రీమ్స్ ఆఫ్ ది డార్క్ ప్రిన్స్’ పేరుతో నృత్యరూపకాన్ని రూపొందించింది. ఎంతోమందిని ఆకట్టుకుంటున్న ఈ కళారూపం గురించి ప్రేమచంద్ర ఏమంటున్నారంటే... ‘ఇతిహాసంలోని ప్రధాన పాత్రలలో ఒకరైన యువరాజు దుర్యోధనుడి కథాంశాన్ని ‘డ్రీమ్స్ ఆఫ్ ది డార్క్ ప్రిన్స్' కోసం తీసుకొని రూపొందించాం. ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్నదంతా మహాభారతంలో ఉంది. దాయాదుల మధ్య జరిగిన పోరు ఈ రోజుల్లోనూ అనేక సంఘర్షణలతో ప్రతిధ్వనిస్తుంది’ అని తెలిపే ప్రేమ చంద్ర ఈ అద్భుత సంక్లిష్టమైన కథనాన్ని నృత్యరూపకంగా మలిచారు.నాడు–నేడు‘దుర్యోదనుడిది యుద్ధాన్ని ప్రేరేపించాలనే ఆలోచన. నేను వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ల సమస్య గురించి ఆలోచించాను. ఇది కూడా ఈ భూభాగంపై దాయాదుల మధ్య జరుగుతున్న యుద్ధమే‘ అంటారామె. ‘యుద్ధంలో ఒక సన్నివేశం ఉంటుంది. దానిని మేం మా నిర్మాణంలో చూపించలేం. కానీ, యుద్ధ భూమిలో పాండవ వీరుడు అర్జునుడు తన ఆయుధాలను వదిలేసి ‘నేను నా సొంత కుటుంబ సభ్యులను చంపలేను’ అంటాడు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల గురించి ఆలోచించినప్పుడు ఆ వివరణ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ‘డ్రీమ్స్ ఆఫ్ ది డార్క్ ప్రిన్స్‘ రాసేటప్పుడు ప్రేమచంద్ర మహాభారతం భ్రాంతి, వాస్తవికత, సత్యం అన్వేషణలను కూడా మెరుగుపరిచారు – ఆమె చెప్పిన ఇతివృత్తాలు ఈ సమయంలో చాలా సందర్భోచితంగా ఉన్నాయి. ‘సత్యం, భ్రమలు, అధికారం, దురాశల గురించి కథ చేయాలి అనుకున్నాను. ఇది ఈ రోజుల్లో రాజకీయాల్లో భాగమైంది. ప్రతిచోటా భ్రమ ఉంది. ప్రతిరోజూ నిజమైన యుద్ధం చేస్తున్నాం’ అంటారామె. ఈ ప్రదర్శనకు ప్రిన్స్ దుర్యోధనుడిగా నటుడు ఇసయ్య డి లోరెంజోతో కలిసి ప్రేమచంద్ర వర్క్ చేశారు. (చదవండి: గంటలకొద్దీ కూర్చొని పనిచేసే వాళ్లకు ది బెస్ట్ వర్కౌట్స్ ఇవే!) -
క్విక్ విస్తరణ!
క్విక్ కామర్స్ కంపెనీలకు దండిగా నిధులు లభిస్తుండటంతో విస్తరణ జోరు పెంచాయి. నగరాల్లో ఈ మోడల్ మంచి సక్సెస్ సాధించడంతో జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ తదితర సంస్థలు డార్క్ స్టోర్ల సంఖ్యను భారీగా పెంచడంపై దృష్టి పెడుతున్నాయి. కిరాణాతో మొదలు పెట్టిన కంపెనీలు ఇప్పుడు నెమ్మదిగా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, మేకప్, టాయ్స్ వంటి ఇతర ప్రొడక్టులను కూడా కార్ట్‌లోకి చేర్చుతున్నాయి. అయితే, బడా నగరాల్లో ఈ మైక్రో వేర్‌హౌస్‌ల కోసం స్థలాల వేట కష్టతరంగా మారుతోందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.సమీపంలోని ప్రాంతాలకు 30 నిమిషాల్లోపే ఆర్డర్లను డెలివరీ చేయడానికి వీలుగా ఏర్పాటు చేసే చిన్న స్థాయి గోడౌన్లను డార్క్ స్టోర్లుగా పేర్కొంటారు. కిక్కిరిసిన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలంటే భారీ ఖర్చుతో కూడిన వ్యవహరం. అయినప్పటికీ కంపెనీలు తగ్గేదేలే అంటున్నాయి. మరోపక్క, రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, క్విక్ డెలివరీ విషయంలో లోటుపాట్లు లేకుండా చూసేందుకు భారీ స్థాయిలో సిబ్బంది నియామకాలతో ఈ రంగంలో హైరింగ్ కళకళలాడుతోంది. చిన్న నగరాల్లో స్పీడ్... నగరాల్లోని కిక్కిరిసిన ప్రాంతాల్లో డార్క్ స్టోర్ల ఏర్పాటు సవాలుగా మారుతోందని జెప్టో సీఈఓ ఆదిత్ పలీచా చెబుతున్నారు. గత రెండు నెలల్లోనే బిలియన్ డాలర్లను (దాదాపు రూ.8,400 కోట్లు) సమీకరించడంతో కంపెనీ విలువ 5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కాగా, చండీగఢ్, భువనేశ్వర్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో వేగంగా స్థలాలు దొరుకుతుండటంతో అక్కడ విస్తరణ స్పీడ్ పెంచుతున్నామని పలీచా పేర్కొన్నారు. ‘ఈ రంగంలోకి నిధులు పుష్కలంగా వస్తున్నాయని పసిగట్టిన స్థిరాస్తి యజమానులు అద్దెలు భారీగా పెంచేస్తున్నారు.కొన్నిచోట్ల పోటీ కారణంగా బిడ్డింగ్‌లో పాల్గొనాల్సి వస్తోంది’ అని పలీచా వివరించారు. జొమాటో బ్లింకిట్ సైతం భటిండా, హరిద్వార్, విజయవాడ వంటి నగరాల్లో అడుగుపెట్టింది. కస్టమర్లకు వేగంగా సేవలదించేలా డార్క్ స్టోర్ల సైజును కంపెనీలు పెంచుతున్నాయి. గతంలో సగటున 2,500 చదరపు అడుగులున్న ఈ స్టోర్ సైజు 4,000–5,000 చ.అ.కు పెరిగింది. కొన్నిచోట్ల 10,000 చ.అ., మరికొన్ని చోట్ల ఏకంగా 25,000 చ.అ. డార్క్ స్టోర్లు కూడా ఏర్పాటవుతుండటం ఈ రంగంలో జోరుకు నిదర్శనం.‘అమ్మతోడు అరగంటలోపే డెలివరీ చేసేస్తాం’ క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో స్లోగన్ ఇది! ఇందుకు తగ్గట్టుగానే శరవేగంగా దూసుకెళ్తున్న క్విక్ కామర్స్ రంగంలో కంపెనీలు నువ్వానేనా అనేలా తలపడుతున్నాయి. బంపర్ వేల్యుయేషన్లతో ఈ రంగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతుండటంతో సేవలను ‘క్విక్’గా విస్తరించేందుకు పోటీ పడుతున్నాయి. సిబ్బంది నియామకాలతో పాటు డార్క్ స్టోర్ల సంఖ్య, సైజును కూడా భారీగా పెంచుకుంటున్నాయి. దీంతో కస్టమర్లకు మరిన్ని ఉత్పత్తులు లభించడంతో పాటు మరింత వేగంగా సేవలు లభించేందుకు దోహదం చేస్తోంది.రూ. 300-500 : సగటు ఆర్డర్ విలువ (గతంలో ఇది 200–250గా ఉండేది)4,000 చ. అ. : డార్క్ స్టోర్ ప్రస్తుత సగటు సైజు (అంతక్రితం 2,500 స్థాయిలో ఉండేది). కొన్ని ఏరియాల్లో 10,000 చ. అ. స్టోర్లు కూడా ఉన్నాయి.హైరింగ్.. ఫుల్ స్వింగ్ ‘క్విక్’ విస్తరణ నేపథ్యంలో సిబ్బంది డిమాండ్ తారస్థాయికి చేరుకుంది. ‘ఈ రంగంలో అన్ని విభాగాల్లోనూ హైరింగ్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తోంది. ఐదు ప్రధాన కంపెనీలు అగ్ర స్థానం కోసం పోటీ పడుతుండటమే దీనికి ప్రధాన కారణం. ప్రధానంగా లాజిస్టిక్స్ ఇక్కడ అత్యంత కీలక పాత్ర పోషిస్తుండటంతో ఇతర కంపెనీల్లోని నిపుణులైన ఉద్యోగులకు గాలం వేస్తున్నాయి’ అని ఒక క్విక్ కామర్స్ సంస్థ చీఫ్ వెల్లడించారు. ‘మినిట్స్’ పేరుతో లేటుగా ఈ విభాగంలోకి అడుగుపెట్టిన ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాల వేగం పెంచేందుకు బిగ్‌బాస్కెట్ వంటి ఇతర కంపెనీల నుంచి చాలా విభాగాల్లో సిబ్బందిని భర్తీ చేసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క, బిగ్‌బాస్కెట్ సైతం పూర్తి స్థాయి క్విక్ కామర్స్ మోడల్లోకి మారే ప్రయత్నాల్లో ఉండటం విశేషం. ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేశ్ ఝా ఇటీవలే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సీఈఓగా చేరారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు మధ్య స్థాయి మేనేజర్లకు డిమాండ్ నెలకొంది. క్యూ–కామర్స్‌లోని మార్కెటింగ్, ఆపరేషన్స్, సప్లయ్ చైన్, ఫైనాన్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ వలసలు జోరందుకోవడం గమనార్హం. జెప్టో కూడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, స్విగ్లీ, ఓలా, అర్బన్ కంపెనీ తదితర కంపెనీల నుంచి కీలక సిబ్బందిని భారీగా నియమించుకుంటోంది. కంపెనీ ప్రధాన కేంద్రాన్ని బెంగళూరు నుంచి మంబైకి మార్చే సన్నాహాల్లో ఉన్న జెప్టో.. 500 మంది ఎగ్జిక్యూటివ్‌ల వేటలో ఉన్నట్లు పలీచా తెలిపారు. -
ట్రెండ్ మారుతోంది.. విషాదాలపై ఆసక్తి
సాక్షి, అమరావతి: మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా ప్రపంచ పర్యాటక రంగం కూడా సరికొత్త మార్గంలో పయనిస్తోంది. ప్రకృతి రమణీయత, కొత్త ప్రదేశాల అందాలు, సంస్కృతుల సందడుల నుంచి మారణహోమ క్షేత్రాల సందర్శన దిశగా అడుగులు వేస్తోంది. ఇంతకాలం ప్రశాంతత కోసం పర్యాటకం కాగా... ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. భయానక వాతావరణానికి అద్దంపట్టే ప్రాంతాల సందర్శనకు డిమాండ్ పెరుగుతోంది.చరిత్రలో నిలిచిపోయిన విషాదాలు, చీకటి అధ్యాయాలపై ఉత్సుకత.. చరిత్రలోని తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలనే కోరిక, ప్రత్యేకమైన విజ్ఞాన అనుభవం కోసం పర్యాటకులు ‘డార్క్ టూరిజం’ దిశగా మొగ్గు చూపుతున్నారు. ఘోరకల్లోల పరిస్థితులు, విపత్తులకు దారితీసిన సంఘటనల గురించి తెలుసు కోవాలనే ఆసక్తిని కనబరుస్తున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇటీవల డార్క్ టూరిజం ఊపందుకుంది. డార్క్ టూరిజం అంటే... డార్క్ టూరిజం అనగా ప్రపంచంలో ఘోరమైన, క్రూరమైన ఘటనలకు గుర్తుగా మిగిలిన ఆనవాళ్లను సందర్శించడం. ఈ జాబితాలో తరచుగా మరణాలు, విషాద ఘటన, విపత్తులు ఎక్కువగా సంభవించే ప్రాంతాలు ఉంటాయి. అదేవిధంగా పూర్వపు యుద్ధ భూములు, జైళ్లు, నిర్బంధ శిబిరాలు, స్మారక చిహ్నాలు సైతం ఉన్నాయి. మారణ హోమాలు, హోలిస్టిక్, పారానార్మల్(ఘోస్ట్ టూర్స్, మంత్రగత్తెల ప్రాంతాలు), యుద్ధభూమి, న్యూక్లియర్ విస్ఫోటాలు జరిగిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఘోస్ట్ హౌస్‌లు, గ్రహాంతరవాసులు–యూఎఫ్‌వోలు (గాలిలో గుర్తుతెలియని ఎగిరే వస్తువులు) గుర్తించిన ప్రదేశాల సందర్శన కూడా డార్క్ టూరిజం కిందకే వస్తుంది.డార్క్ టూరిజానికి ఈ దేశాలు ప్రసిద్ధి.. అమెరికా, కెనడా, బ్రెజిల్, మెక్సికో, లాటిన్ అమెరికా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, రష్యా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, రొమేనియా, భారత్, బంగ్లాదేశ్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్(జీసీసీ)దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్ దేశాల్లో డార్క్ టూరిజం ప్రసిద్ధి చెందు తోంది. అమెరికాలోని ఓ సర్వే ప్రకారం.. 82 శాతం మంది పాస్‌పోర్టు ప్రయాణికుల్లో కనీసం ఒక చీకటి ప్రదేశాన్ని సందర్శించినట్టు తేలింది. తాజాగా కేరళలోని ప్రకృతి విపత్తును తిలకించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులువెళుతున్న నేపథ్యంలో డార్క్ టూరిజంపై చర్చ జరుగుతోంది.ఒక్కో దేశంలో.. ఒక్కో విషాద ఘటన.. ⇒ చరిత్రలోని చీకటి ప్రదేశాలపై యాత్రికులకు ఆసక్తి పెరుగుతోంది. మిస్టరీలను తెలుసుకుంటూ థ్రిల్ కావడానికి పర్యాటకులు సాహసాలు చేస్తున్నారు. ⇒ ఉక్రెయిన్–రష్యా యుద్ధం జరుగుతున్న సమయంలో చాలామంది విదేశీ పర్యాటకులు అక్కడి యుద్ధాన్ని నేరుగా చూసేందుకు రూ.లక్షల్లో ఖర్చు చేసుకుని వెళ్లారు. గతంలో ఉక్రెయిన్ అందాలను వీక్షించేందుకు వచి్చన పర్యాటకులు ఇప్పుడు శిథిలమైన ఉక్రెయిన్ను కూడా చూసేందుకు క్యూ కట్టడం విశేషం. ⇒ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నైరుతి పోలాండ్‌లో యూదులను నాజీలు చిత్రహింసలు పెట్టిన నిర్బంధ శిబిరం (ఆష్విట్జ్), న్యూక్లియర్ పేలుళ్లు జరిగిన ప్రాంతం (చెర్నోబిల్), అమెరికాలోని గెట్టిస్బర్గ్ పట్టణంలోని యుద్ధభూమి(సివిల్‌వార్) డార్క్ టూరిజానికి ప్రసిద్ధి చెందాయి. ⇒ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యకు గురైన ప్రదేశాన్ని కూడా ఎక్కువ మంది సందర్శిస్తున్నారు. ⇒ చాలాకాలం కిందట ఫ్రాన్స్‌లో బహిరంగ ఉరి శిక్షలను అమలుచేసిన ప్రాంతాలను చూడటానికి కూడా సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ⇒ జపాన్‌లో అణుబాంబులతో నాశనమైన హిరోíÙమా, నాగసాకి పట్టణాలు, కంబోడియాలోని కిల్లింగ్ ఫీల్డ్, అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (గ్రౌండ్ జీరో), రువాండా (మారణహోమం) ప్రాంతాలను కూడా సందర్శించే అంతర్జాతీయ పర్యాటకులు పెరుగుతున్నారు.మన దేశంలో డార్క్ టూరిజానికి ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రదేశాలు... ⇒భారతదేశంలో స్వాతంత్య్ర సమరయోధుల జ్ఞాపకాలను గుర్తుచేసే ఫోర్ట్ బ్లెయిర్ సెల్యులార్ జైలు. ⇒అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్ (జనరల్ డయ్యర్ భారతీయులను ఊచకోత చేసిన ప్రాంతం)ఉద్యానవనం, స్మారక చిహ్నం. ⇒ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల్లో ఎత్తయిన రూప్‌కుండ్ సరస్సు(అస్థిపంజర అవశేషాలతో నిండి ఉంటుంది). ⇒రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో కుద్దార గ్రామం (ఇక్కడి ప్రజలు ఒక్కరాత్రిలో అంతరించిపోయారని పురాణాలు చెబుతున్నాయి). ⇒మహారాష్ట్రలోని పుణేలో శనివార్ వాడ చారిత్రక కోట (అతీంద్రియ శక్తులు ఉన్నాయని ప్రచారం ఉంది). ⇒రాజస్థాన్‌లో భాంగర్ కోట(మొఘల్ దళాలు చేసిన ఊచకోత) ⇒గుజరాత్‌లోని అరేబియా తీరంలో డుమాస్ బీచ్ (పురాణాల ప్రకారం ఒకప్పుడు ఇది హిందువుల శ్మశాన వాటికని, అందుకే అక్కడ ఇసుక నల్లగా ఉంటుందని నమ్మకం). ⇒ గుజరాత్‌లోని లోథాల్ సింధూ లోయ నాగరికత ప్రదేశాలు ⇒ముంబైలోని తాజ్ హోటల్ (2008లో ఉగ్రవాద దాడి జరిగిన ప్రాంతం). ⇒ భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ పాండ్ (భోపాల్ విషవాయువు దుర్ఘటన జరిగిన ప్రదేశం). ⇒గుజరాత్‌లోని భుజ్ (భూకంపానికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతం). ⇒ తాజాగా భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన కేరళలోని వయనాడ్ ప్రాంతాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. అయితే సైన్యం చేపడుతున్న సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడటంతో అధికారుల విజ్ఞప్తుల మేరకు వెనక్కి తగ్గారు. -
Voyager-1: హస్త లా విస్తా.. బేబీ!
వోయేజర్-1.. ఈ పేరే ఖగోళ శాస్త్రవేత్తలకు ఓ స్ఫూర్తి. ఈ పేరు.. ఉత్సాహంగా నింగికేసి చూసేలా కొన్ని తరాల వారిని పురిగొల్పిన ప్రేరణ శక్తి. అలుపెరుగని యాత్ర.. కోట్లాది కిలోమీటర్ల జైత్రయాత్ర.. దాదాపు అర్ధ శతాబ్ద కాలపు వైజ్ఞానిక పరిశోధనల సారం.. మానవాళి కలలుగన్న ‘సుదూర’ లక్ష్యం సాకారం.. అది గ్రహాంతర హద్దులను దాటి నక్షత్రాంతర రోదసికేగిన విశ్వవిఖ్యాత వ్యోమనౌక.. అదే వోయేజర్-1. అంతరిక్షంలో ఇప్పటివరకు అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన మానవ నిర్మిత వస్తువు ఇదే. అమెరికా 1977 సెప్టెంబరు 5న ప్రయోగించిన ఈ వ్యోమనౌకది 46 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. ఈ ఏడాది జనవరి నాటికి అది భూమి నుంచి 2,440 కోట్ల కిలోమీటర్ల దూరాన ఉంది. ఇప్పుడీ వ్యోమనౌకకు అంతిమ ఘడియలు ఆసన్నమయ్యాయి. గత ఏడాది నవంబరు నుంచి వోయేజర్-1 భూమికి సరైన సమాచారం ఇవ్వడం లేదు. భావ వ్యక్తీకరణ సామర్థ్యం కోల్పోయిన వృద్ధ పక్షవాత రోగిలా... ‘నాసా’ శాస్త్రవేత్తలకు అది ‘పిచ్చి’ సందేశాలు పంపుతోంది. వోయేజర్-1లోని ఓ కంప్యూటర్లో సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది. దాంతో కాలిఫోర్నియాలోని పసడెనాలో జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీలో ఉన్న గ్రౌండ్ కంట్రోల్ కేంద్రానికి వ్యోమనౌక నుంచి అర్థరహిత సమాచారం అందుతోంది. వోయేజర్-1ను నిర్మించి, ప్రయోగించినప్పటి ‘నాసా’ సిబ్బందిలో చాలామంది కాలం చేశారు. దాంతో తాజా సమస్యను పరిష్కరించి వ్యోమనౌకను మళ్లీ గాడిన పెట్టేందుకు దాని నిర్మాణం తాలూకు పాత పత్రాలను ముందేసుకుని శాస్త్రవేత్తలు కొన్ని నెలలుగా కుస్తీలు పడుతున్నారు. ప్రస్తుత సమస్య నుంచి తమ వ్యోమనౌక బయటపడితే అద్భుతం జరిగినట్టేనని వోయేజర్ ప్రాజెక్టు మేనేజర్ సుజానే డాడ్ వ్యాఖ్యానించారు. ఆమె 2010 నుంచి ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. వోయేజర్-1 నేడు ముదిమి వయసులో ఉంది. దాని చరిత్ర ఇక ముగిసిన అధ్యాయమేనని తెలుస్తోంది. జంట వోయేజర్స్ విజయాలు.. వోయేజర్ ప్రాజెక్టులో వోయేజర్-1, వోయేజర్-2 భాగస్వాములు. వోయేజర్-2ను వోయేజర్-1 కంటే రెండు వారాల ముందు ప్రయోగించారు. నిజానికి వీటిది కేవలం నాలుగేళ్ల మిషన్. కానీ నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. వోయేజర్-2 ప్రస్తుతం పనిచేస్తున్నప్పటికీ దాన్ని కూడా సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. పయనీర్-10, 11 వ్యోమనౌకల యాత్రలకు కొనసాగింపుగా… గురుడు, శని గ్రహాల అన్వేషణ కోసం వోయేజర్ జంటనౌకలను పంపారు. వీటితో గురు గ్రహం (బృహస్పతి)పై పెద్ద ఎర్ర మచ్చ, శని వలయాలు, ఈ రెండు గ్రహాల కొత్త చంద్రుళ్లకు సంబంధించి ఎన్నో విశేషాలు వెలుగుచూశాయి. వోయేజర్-1 1979లో గురుగ్రహాన్ని 3.5 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి తిలకించింది. దాని చంద్రుడు ‘అయో’పై క్రియాశీల అగ్నిపర్వతాలను గుర్తించింది. భూమి మినహా సౌరకుటుంబంలోని తక్కిన ఖగోళ వస్తువుల్లో అగ్నిపర్వత క్రియాశీలతను కనుగొనడం అదే తొలిసారి. 1990 ఫిబ్రవరి 14న సూర్యుడికి 600 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ‘లేత నీలి చుక్క’లా కనిపిస్తున్న భూమి ఫొటోను వోయేజర్-1 తన కెమెరాలో బంధించింది. ఆ సింగిల్ పిక్సెల్ ఫొటో... ‘మానవాళి తనకుతాను గీసుకున్న సొంత చిత్తరువు’లా అనిపిస్తుంది. ఇక వోయేజర్-2 యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను సందర్శించిన ఏకైక వ్యోమనౌకగా పేరుగాంచింది. శిలాగ్రహాలైన బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడిని అంతర గ్రహాలు అంటారు. వాయుమయ గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ లను బాహ్యగ్రహాలుగా పిలుస్తారు. 4 బాహ్య గ్రహాలను దగ్గరగా సందర్శించిన ఏకైక వ్యోమనౌకగా వోయేజర్-2 1989లో రికార్డు సృష్టించింది. సౌరవ్యవస్థను దాటి మున్ముందుకు! హీలియోస్ఫియర్ అంటే సౌరవ్యవస్థ చుట్టూ సూర్యుడు నేరుగా ప్రభావం చూపే పొడవైన బుడగ లాంటి ప్రదేశం. హీలియోస్ఫియర్ అంచును హీలియోపాజ్ అంటారు. ఈ ‘హీలియోపాజ్’ను 2012లోనే వోయేజర్-1 దాటవేసి నక్షత్రాంతర రోదసిలోకి ప్రవేశించింది. అలా ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి అడుగిడిన తొలి మానవ నిర్మిత వస్తువుగా అది గణుతికెక్కింది. 2018లో వోయేజర్-2 కూడా హీలియోస్ఫియర్ బాహ్య అంచును దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్ (సూర్యుడు, ఇతర నక్షత్రాల మధ్యనున్న ప్రాంతం)లోకి ప్రవేశించింది. హీలియోపాజ్ ఆవల నుంచి నక్షత్రాంతర రోదసి మొదలవుతుంది. కాస్మిక్ కిరణాలు, నక్షత్రాంతర ప్రాంతంలోని అయస్కాంత క్షేత్రంలో అసాధారణ అలజడులు, ప్లాస్మా కణాలపై వోయేజర్-1 అధ్యయనం చేస్తోంది. వోయేజర్-1కు భూమి నుంచి ఆదేశం పంపడానికి 22.5 గంటలు, వ్యోమనౌక నుంచి శాస్త్రవేత్తలు డేటా స్వీకరించడానికి మరో 22.5 గంటలు.. ఇలా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి రమారమి రెండు రోజులు పడుతోంది. ఫ్లైట్ డేటా సిస్టమ్ లోపాలు వోయేజర్-1లో మూడు కంప్యూటర్లు ఉన్నాయి. అవి ఫ్లైట్ డేటా సిస్టమ్ (ఎఫ్‌డీఎస్), కమాండ్ అండ్ కంట్రోల్ సెంట్రల్ సిస్టమ్, ఆటిట్యూడ్ కంట్రోల్ అండ్ పాయింటింగ్ సిస్టమ్. వ్యోమనౌక సైన్స్ పరికరాల నుంచి శాస్త్ర పరిశోధనల డేటాను, నౌక ఆరోగ్యానికి సంబంధించిన ఇంజినీరింగ్ డేటాను ఎఫ్‌డీఎస్ సేకరించి సింగిల్ ప్యాకేజీగా మారుస్తుంది. అనంతరం అది టెలిమెట్రీ మాడ్యులేషన్ యూనిట్ (టీఎంయూ) ద్వారా బైనరీ కోడ్ రూపంలో భూమికి ప్రసారమవుతుంది. ప్రస్తుతం ఎఫ్‌డీఎస్ కంప్యూటరులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇంజినీరింగ్, సైన్స్ డేటాను భూమికి పంపే సామర్థ్యాన్ని వోయేజర్-1 కోల్పోయింది. వోయేజర్-1, 2లలో ప్రయోగ సమయంలో రెండేసి ఎఫ్‌డీఎస్ లు ఉన్నాయి. దురదృష్టవాశాత్తు వోయేజర్-1 బ్యాకప్ ఎఫ్‌డీఎస్ 1981లో విఫలమైంది. ‘నాసా’ శాస్త్రవేత్తలు తాజాగా ఎఫ్‌డీఎస్ ను రీ-స్టార్ట్ చేసేందుకు యత్నించారు. కానీ ఈ అన్ ‘ప్లగ్ అండ్ ప్లగ్ ఇన్’ పద్ధతి ఫలితమివ్వలేదు. 2025 నాటికి వోయేజర్ జంట నౌకల్లోని ప్లూటోనియమ్ ఆధారిత అణుశక్తి జనరేటర్లు పని చేయడం మానేస్తాయని ‘నాసా’ అంచనా. భూమ్మీది జీవం, మానవాళి భిన్న సంస్కృతులను ప్రతిబింబించే చిత్రాలు, వివిధ భాషల్లో శుభాకాంక్షలు, ఆడియో-విజువల్ సందేశాలను డిస్కుల (గోల్డెన్ రికార్డులు) రూపంలో ఈ నౌకల్లో పంపారు. (Photo Credits: The New York Times, NASA, Business Insider, Gizmodo, NPR, Popular Mechanics, WIRED, Ars Technica, Science Alert, Popular Science, Smithsonian Magazine) ✍️ జమ్ముల శ్రీకాంత్ -
చీకటి సొరంగమా?.. దట్టమైన అడవా?.. అబ్బురపరుస్తున్న వీడియో!
ఆప్టికల్ ఇల్యూజన్(దృష్టి భ్రాంతి) అనేది ఒక్కోసారి మనల్ని గందరగోళానికి గురిచేస్తుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ అయిన ఒక వీడియో ఇటువంటివి చూడాలనే ఆసక్తి కలిగినవారిని ఎంతగానో అలరిస్తోంది. వీడియో ప్రారంభంలో ఒక అంథకారమయమైన గుహ కనిపిస్తుంది. క్లిప్ ముందుకు వెళుతున్న కొద్దీ మరో విధంగా మారిపోతుంది. ఈ వీడియోను ట్విట్టర్లో @Rainmaker1973 హ్యాండిల్ నుంచి షేర్ చేశారు. ఈ వీడియోను ఏదో కారు లోపలి నుంచి రికార్డు చేశారు. వీడియోలో కారు ఒక చీకటి సొరంగం గుండా వెళుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆ వాహనం ఆ కనిపించే సొరంగం దగ్గరకు చేరుకోగానే అది భ్రమ అని తేలిపోతుంది. అటునిటు దట్టంగా ఉన్న చెట్లు కనిపిస్తాయి. ఈ పోస్టు క్యాప్షన్‌లో @Rainmaker1973 ఇలా రాశారు..‘థాయ్‌ల్యాండ్ పాహిలి ప్రాంతంలో చెట్లతో కూడిన ఈ సొరంగం విచిత్రమైన భ్రాంతిని కలుగజేస్తుంది. దూరం నుంచి ఎంతో చీకటిగా కనిపిస్తుంది. అయితే ముందుకు సాగగానే వెలుతురు ప్రవేశించి, ప్రకృతి సహజ సౌందర్యం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ వీడియోను ఆగస్టు 10న షేర్ చేయగా, ఇప్పటివరకూ 10 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వీడియోను చూసిన చాలామంది లైక్స్ చేయడంతోపాటు, పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ‘ప్రకృతి ఒక్కోసారి ఎంతో ఆసక్తిగొలుపుతుంది’ అని రాశారు. మరో యూజర్ ‘ఇది ఎంతో బాగుంది. ఒక సినిమా సీన్‌ను తలపిస్తోంది’ అని రాశారు. ఇంకొక యూజర్ ‘రాత్రివేళ దీని గుండా ప్రయాణించడాన్ని ఊహించండి’ అని రాశారు. ఇది కూడా చూడండి: నాడు సీమా, నేడు సానియా.. ప్రేమ కోసం తరలివస్తున్న ప్రియురాళ్లు! This tree tunnel in Pahili, Thailand, has a peculiar optical illusion. It appears extremely dark from the distance, but once you're in the lightning level is naturally adjusted [video: https://t.co/PE0MReEqRG]pic.twitter.com/CGEOHMUa9x — Massimo (@Rainmaker1973) August 10, 2023 -
ఆ చీకటి రోజులను మరచిపోలేము.. ప్రధాని మోదీ
భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 48 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో 21 నెలల పాటు సాగిన ఆనాటి చీకటి రోజులను మరువలేమని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 1975, జూన్ 25న ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. నేటికి ఆ ఘట్టం జరిగి 48 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో భావోద్వేగభరితమైన ట్వీట్ చేశారు. ఆనాడు ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తూ ఎమర్జెన్సీని ధైర్యంగా వ్యతిరేకించిన ప్రతి ఒక్కరికీ నా నివాళులు సమ్పర్పిస్తున్నాను. రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా సాగిన ఆ ఎమర్జెన్సీ చీకటి రోజులను ఎన్నటికీ మరువలేమని రాశారు. I pay homage to all those courageous people who resisted the Emergency and worked to strengthen our democratic spirit. The #DarkDaysOfEmergency remain an unforgettable period in our history, totally opposite to the values our Constitution celebrates. — Narendra Modi (@narendramodi) June 25, 2023 భారతీయ జనతా పార్టీ నేత స్మృతి ఇరానీ కూడా ట్విట్టర్ వేదికగా ఈ ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. చిత్రహింసలు, అరెస్టులు, హత్యలు, పత్రికా స్వేచ్ఛను తుంగలో తొక్కి వారి స్వరాన్ని అణచివేయడం వంటి ఎన్నో దురాగతాలకు ప్రతీక 1975 నాటి జూన్ 25. ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి ఈ వీడియోని చూడండి. కాంగ్రెస్ సమర్ధత ఏమిటో మీకు అర్ధమవుతుందని రాసి వీడియోని కూడా జత చేశారు. Torture , imprisonment, murder , stifling the voice of free press - 25 th June 1975 symbolises all that and more. Lest you forget what the Emergency imposed on India and Indians entailed ; do watch this video & see what the Congress party is capable of ! #DarkDaysOfEmergency pic.twitter.com/kBlGbcKBSR — Smriti Z Irani (@smritiirani) June 25, 2023 వీరితోపాటు కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు కూడా ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితుల గురించి ప్రస్తావించారు. ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్ధి అయితే మద్దతివ్వం -
స్వీయ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి
న్యూఢిల్లీ: వినియోగదారులను నష్టపర్చేలా పలు ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ ’డార్క్ ప్యాటర్న్’ పద్ధతులు పాటిస్తుండటంపై కేంద్రం దృష్టి సారించింది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే దిశగా స్వీయ నియంత్రణ వ్యవస్థను రూపొందించుకోవాలని సంస్థలను ఆదేశించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగీ, జొమాటో తదితర ఈ–కామర్స్ సంస్థలతో భేటీ అనంతరం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో ఇందుకు సంబంధించిన తగు వ్యవస్థ ఏర్పాటు కాగలదని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నెట్లో వినియోగదారులను ఉద్దేశపూర్వకంగా మోసం చేసే విధానాలను డార్క్ ప్యాటర్న్లుగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు యూజరు ఎంచుకోకపోయినా షాపింగ్ బాస్కెట్లో కొన్ని ఐటమ్‌లను జోడించేయడం, చెక్ అవుట్ చేసే సమయంలో ఉత్పత్తుల ధరలను మార్చేయడం, తక్షణం కొనుగోలు చేయకపోతే నష్టపోతామేమో అనే తప్పుడు భావన కలిగేలా తొందరపెట్టడంలాంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి. మధ్యవర్తులు అమ్మకాలను పెంచుకునేందుకు లేదా అమ్ముకునేందుకు అమలు చేసే మోసపూరిత విధానాల గురించి ఈ–కామర్స్ సైట్లను వాడే వినియోగదారులకు, విక్రేతలకు పెద్దగా తెలియదని సింగ్ చెప్పారు. దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ అవగాహన కల్పించి, స్వీయ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇలాంటి పద్ధతులు కొనసాగితే ఈ విషయంలో నిబంధనలను ప్రవేశపెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. -
క్రేజీ లవ్: గర్ల్ ఫ్రెండ్ కోసం మొత్తం గ్రామానికే కరెంట్ లేకుండా చేశాడు
పాట్నా: ప్రేమలో ఉన్నప్పుడూ ప్రేమికులు రకరకాల వెర్రి పనులు చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ప్రమాదకరంగా కూడా ఉంటాయి. కొంతమంది ఏకంగా తమ ప్రేమ కోసం ఇతరులను ఇబ్బంది పెట్టేలా పిచ్చి పనులు చేస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక గ్రామానికి కరెంట్ లేకుండా చేశాడు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. వివారాల్లోకెళ్తే....బిహార్‌లోని పూర్నియ జిల్లాలోని గణేశ్‌పూర్ గ్రామంలోని ప్రజలు తరుచు కరెంట్ కోతలతో బాధపడుతున్నారు. ఐతే తమ చుట్టుపక్కల గ్రామాల వాళ్లకి ఇలాంటి సమస్య లేదు మా గ్రామానికి మాత్రమే ఏంటీ ? దుస్థితి అని ఆందోళన చెందారు. దీంతో ఆ గ్రామస్తులంతా ఎలాగైన ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా గ్రామంలోని ప్రజలంతా కలిసి నిఘా పెట్టడం మొదలు పెట్టారు. ఇంతకీ ఇదంతా చేస్తోంది ఆ ఊరి ఎలక్ట్రీషియన్ అని తెలుసుకుని ప్రజలంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అదీ కూడా కేవలం తన గర్ల్‌ఫ్రెండ్‌ని చీకటిలో కలిసేందు కోసం మొత్తం గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నాడని తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో గ్రామస్తులంతా పథకం వేసి మరీ ఆ ప్రేమికులిద్దరిని పట్టుకోవడమే కాకుండా ఆ ఎలక్ట్రీషియన్ని చితకొట్టి మరీ గ్రామంలో ఊరేగించారు. అంతేకాదు ఈ సమస్య మళ్లీ తలెత్తకుండా ఉండేలా ఆ ఊరిలోని గ్రామస్తులు, సర్పంచ్, ఇతర గ్రామ కౌన్సిల్ సభ్యుల సమక్షంలోనే ఆ ప్రేమికులిద్దరికి వివాహం చేశారు. ఐతే ఆ గ్రామస్తులు ఆ ఎలక్ట్రీషియన్ పై ఎలాంటి కేసు పెట్టలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. (చదవండి: వీడియో: ఎదురుగా భారీ మొసలి.. అడుగు ముందుకు పడ్డా చావే! ఎందుకలాగంటే..) -
భూతవైద్యుడి బాగోతం.. దయ్యం పట్టిందని చెప్పి..
సాక్షి, ఏటూరునాగారం(వరంగల్): ఆరోగ్యం బాగోలేకపోవడంతో దయ్యం పట్టిందని వైద్యం చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి రూ.16,500 నగదు, రెండు తులాల పుస్తెలతాడు తీసుకొని ఓ ప్రబుద్దుడు పరారైన సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లిలో గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొండగొర్ల రమేష్, ఎల్లమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు రాధిక, రవళి, రమ్య ఉన్నారు. అందులో చిన్న కు మార్తెకు కడుపులో నొప్పి ఉండడంతో గత ఏడాది శ స్త్ర చికిత్స చేయించారు. అయితే వారి ఇంటి ముందుకు బైక్‌పై ఓ భూతవైద్యుడు వచ్చి మీ ఇంటిలో ఒ కరి ఆరోగ్యం బాగులేదు, కొన్ని మంత్రాలతో న యం చేస్తానని మాయమాటలు చెప్పాడు. భూతవైధ్యానికి సంబంధించిన వస్తువులను తెప్పించుకున్నా రు. నగదు రూ.16,500, బంగారు ఆభరణం కావా లని చెప్పడంతో నమ్మిన రమేష్ భార్య నగదుతోపా టు తన మెడలోని రెండు తులాల పుస్తెలతాడును అతడికి ఇచ్చింది. దీంతో సదరు వ్యక్తి ఏదో పూజ చేస్తున్నట్లు నాటకమాడి రమేష్ దంపతులను కల్లుమూసుకొని చెప్పి అక్కడి నుంచి బైక్‌పై పరారు అయ్యా డు. ఇక తాము మోసపోయామని గుర్తించి లబోది బోమన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ అవి పనిచేయకపోవడం బాధాకరమని స్థానికులు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. -
మనసు దోచే ‘టాటా’ డార్క్ ఎడిషన్స్
న్యూఢిల్లీ : డార్క్ ఎడిషన్ పేరుతో సక్సెస్ఫుల్ మోడల్ కార్లకు టాటా మోటార్స్ కొత్త రూపు ఇస్తోంది. టాటా హ్యరియర్, అల్ట్రోజ్, టాటా నెక్సాన్, టాటా నెక్సాన్ ఈవీ మోడల్స్‌లో ఉన్న అన్ని వేరియంటర్లలో డార్క్ వెహికల్స్ అందుబాటులోకి తేనుంది. ధర ఎంతంటే ఢిల్లీ షోరూమ్ ధరల ప్రకారం డార్క్ ఎడిషన్లకు సంబంధించి టాటా ఆల్ట్రోజ్ ధర రూ. 8.71 లక్షలు, నెక్సాన్ ధర రూ. 10.40 లక్షలు, నెక్సాన్ ఈవీ ధర రూ. 15.99 లక్షలు ఉండగా హ్యరియర్ ధర రూ. 18.04 లక్షలుగా ఉంది. వివిధ నగరాలు, వేరియంట్లను బట్టి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండవచ్చు. డార్క్ స్పెషల్స్ ఆల్ట్రోజ్‌లో డార్క్ ఎడిషన్‌ను XZ ప్లస్‌గా వ్యవహరిస్తున్నారు. న్యూ మోడల్ కాస్మో డార్క్ కలర్ స్కీంతో ఎక్స్టీరియర్ డిజైన్ చేశారు. ఎల్లాయ్ వీల్స్, క్రోమ, బ్యానెట్, ముందు భాగంలో డార్క్ ఎంబ్లమ్ అమర్చారు. ఇక ఇంటీరియర్‌కి సంబంధించి గ్రాఫైట్ బ్లాక్ థీమ్‌తో పాటు గ్లాసీ ఫినీష్ ఉన్న డ్యాష్‌బోర్డ్, ప్రీమియం లెదర్ సీట్స్ విత్ డార్క్ ఎంబ్రాయిడరీతో వచ్చేలా డిజైన్ చేశారు. నెక్సాన్ ఇలా ఇక నెక్సాన్‌లో చార్కోల్ ఎల్లాయ్ వీల్స్, సోనిక్ సిల్వర్ బెల్ట్‌లైన్, ట్రై యారో డ్యాష్‌బోర్డ్ , లెదర్ సీట్లు, డోర్ ట్రిమ్స్ అండ్ ట్రై యారో థీమ్‌తో డిజైన్ చేశారు. నెక్సాన్ ఈవీలో నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్‌లో కారు బాడీకి మిడ్నైట్ బ్లాక్ కలర్ ఇచ్చారు. సాటిన్బ్లాక బెల్ట్‌లైన్, చార్కోల్ వీల్ ఎల్లాయిస్ అందించారు. ఇంటీరియర్‌లో కూడా పూర్తిగా డార్క్ థీమ్ ఫాలో అయ్యారు. హ్యారియర్‌తో మొదలు డార్క్ ఎడిషన్‌ను ప్రత్యేకంగా తీసుకురావడం గురించి టాటా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. మొదట హ్యారియర్ మోడల్లో డార్క్ ఎడిషన్‌ను ప్రయోగాత్మకంగా చేపట్టాం. మేము ఊహించనదాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. హ్యారియర్ అమ్మకాల్లో డార్క్ ఎడిషన్‌కు ప్రత్యేక స్థానం ఇవ్వాల్సిన స్థాయికి చేరుకుంది. దీంతో వినియోగదారుల టేస్ట్‌కి తగ్గట్టుగా మిగిలిన మోడల్స్‌లో కూడా డార్క్ ఎడిషన్స్ తీసుకురావాలని నిర్ణయించాం’ అని తెలిపారు. -
రెండ్రూపాయలు
మొన్న మధ్యాహ్నం మా ఇంటికెవరో చుట్టాలొచ్చి కాసేపుండి ఫలారాల్చేసి కాఫీల్తాగి వెళ్లిపోతుంటే, మా చిన్న అమ్మాయి వెళ్లి రిక్షా దగ్గర నిలబడి నోట్లో వేలు పెట్టుకుని చీకుతూ చూస్తోంటే– వాళ్లు రెండ్రూపాయ కాగితాలు దాని చేతిలో పెట్టారు.(నేను చూసీ చూడనట్లు ఊరుకున్నాను)‘‘హుష్.. వొద్దొద్దు– పుచ్చుకోకు’’ అంటూ మాయావిడ పైనుంచి యాక్షన్ చేస్తోంది. మెట్ల మీద నిలబడి (మేం ఉండేది మేడ మీద) నేను ‘‘తీసుకోవే’’ అన్నాను. దానికి డబ్బు సంగతి ఇప్పట్నుంచి తెలిస్తే మంచిదని. అది ఆ రెండ్రూపాయలూ పుచ్చుకుని రోడ్డు మీదకు ఉడుంలా పరుగు ప్రారంభించింది. దాని వెనకాతల పరిగెత్తమని నాకు కళ్లెగరేసి చెప్పింది. తాను మేడ మెట్ల మీద నుంచి అంగుళం ఇటూ అటూ కదలకుండా మా ఇంటావిడ మరియు గృహలక్ష్మి, రిక్షాలో వెళ్తున్న చుట్టాలు చేతులూపుతుండగానే నేను పాప వెంట పరుగెత్తవలసి వచ్చింది. పాప చేతిలోని నోట్ల కోసం నేను పరుగెత్తుతున్నానని వాళ్లనుకుంటే మాత్రం నేనేం చేయనూ? పిల్లనెత్తుకుని ‘‘అమ్మా అన్నకోటిచ్చెయ్’’ అన్నా. ఏవీ లక్ష్యం లేకుండా నిర్లప్తంగా ఒక నోటు తీసి వాడికి ఇచ్చేసింది. వాడు ఆ నోటు తన లిక్కిజేబులో కుక్కి– దాని మెడమీద చేతులేసి ముద్దు పెట్టుకున్నాడు. ‘‘ఏవీ కొనకు. మార్చవో డొక్క చీరేస్తాను’’ అంది మా ఆవిడ. అని అశ్వత్థామ హతః కుంజరః అన్నట్లు ‘మీరంతా సినిమాకు వెళ్లండి ఆనక’ అంది. మావాడికదేమీ ఇష్టంగాలేదు. ఆ నోటు జేబులో పెట్టీ తీసీ చూసుకుంటూ ఇటూ అటూ పరుగెత్తుతున్నాడు. మధ్యాహ్నం ఎండలని చెప్పి మూడు మాట్లు తీసుకొచ్చి వాడిని చీకటి గదిలో తోసింది. (చీకటి గది అంటే తలుపులేసుకుని మధ్యాహ్నం ఓ గంటో అరగంటో నడుం వాల్చుకునే చోటు) మూడు మాట్లూ వాడు అడ్డంగా దుంగలా పడుకున్న తన నుంచి దూకి పారిపోవడం, కిందకు వెళ్లి రూపాయి నోటు అందరికీ చూపిస్తూ ఆడటం, వాళ్లెవరేనా కుర్రవెధవన్చేసి నెత్తి మీద రెండు మొత్తో, చేతిలో పిప్పరెంటు బిళ్లో బెల్లంముక్కో పెట్టి ఆ నోటు లాక్కుంటారేమోనని ఈవిడకు అనుమానం కలిగి ప్రాణం ఉండబట్టక కళ్లు నులుముకుంటూ వెళ్లి వాడి వీప్మీద రెండేసి ఈడ్చుకు రావడం ఈ తతంగం అంతా చూస్తూ చాప మీద పడుకున్నా. ఈ సీను చాలాసార్లు రిపీటవడం ఒక రూపాయికి వాడు అరడజను గిల్లులో మొట్టికాయలో దెబ్బలో తినడం చూస్తూ ఆలోచిస్తున్నా. ఓ పది పైసలో, ఐదు పైసలో అయితే ఇన్ని దెబ్బలు పడుండవు కదా అనే సానుభూతి కలిగింది. మా చంటిదానికి రూపాయి కాగితం గురించి ఏపాటి పరిజ్ఞానం ఉందో తెలుసుకోవాలనే అభిప్రాయం కలిగి ‘అమ్మలో ఏంతే అది’ అంటూ ముద్దుగా పలకరించా.‘‘ఐదు పైసలిత్తా నాకిచ్చేత్తావా?’’ అన్నా.‘‘వూపాయి... పో’’ అంది. అని కళ్లు చిత్రంగా తిప్పి ఆ రూపాయి నోటును సాగదీయడం మొదలెట్టింది.‘‘దాన్నేవనకండి. అది చింపి రెండు ముక్కలు చేస్తుంది.’’ అని మా చంటిది అప్పుడే నా మూలకంగా రూపాయి నోటును ధ్వంసం చేసినట్లుగా గాబరాపడుతూ మా ఆవిడ లేచింది. కంగారులో జారిపోయిన కొప్పును మోచేత్తో తాచుపామును లాగినట్టుగా లాగి బిగిస్తూ, లేచినప్పుడు నీళ్లలోంచి ఏనుగు లేచినట్లున్నా ఇప్పుడీ పోజు మాత్రం ఈవిడకు బ్రహ్మాండంగా ఉంది అని లోపల్నే మెచ్చుకున్నా.‘‘ఈ రెండ్రూపాయలూ మార్చి చెరో ఐదు పైసలూ ఇయ్యి. ఓ ఇరవై రోజులు కాలక్షేపం అవుతుంది’’ అన్నా. కానీ నా సలహా ఎవరిక్కావాలి బోడి సలహా!ఈలోగా ఇద్దరు సపోటా వాళ్లను, ముగ్గురు ముంజెల వాళ్లను మేడ మీదకు పిల్చుకున్నారు ఈ ఇద్దరు తుంటర్లూ కలిసి. లక్ష్మి చంచలం కదా! అది ఎప్పుడు బయటకు పోదామా అని చూస్తూ ఉంటుంది. ఈ రహస్యం తెలిసిన దారికి మల్లే మా ఆవిడ వాళ్లతో పనిగట్టుకు పోట్లాడి బేరం కుదరనివ్వకుండా చేసి వాళ్లను తిప్పి పంపేసింది. ఈ కుట్రను గ్రహించిన దానిలా మా చంటిది అరిచి గొడవ చేయబోతే, దాని దగ్గర రూపాయి లాక్కుని బోడ్లో దోపేసి ఆ కుర్ర వెధవను ఈడ్చుకొచ్చి పవిట చెంగును వాళ్లిద్దరి మీదా కప్పి నేల మీద పడేసి వాళ్ల మీద చేతులూ కాళ్లూ అడ్డం వేసి తిరిగి నిద్రకుపక్రమించింది.నాకు పగలు నిద్రపోయే అలవాటు లేదు. మేకులా అలా కూర్చోవలసిందే! బల్ల మీద పుస్తకాలు కాసేపు కెలికి ‘‘ఛెస్ పట్రావే– రెండెత్తులు వేద్దాం’’ అన్నా. ఏ కళనుందో చటుక్కున లేచి వెళ్లి ఒక మామిడిపండు తెచ్చి ‘‘నిన్న మూడు డజన్లు కొన్నాను గుమ్మం దగ్గర బేరవాడి. ఇదొక్కటే మిగిలింది. తినండి’’ అని నా ఒళ్లో పడేసింది కళ్లు మూసుకుని నడుస్తూ.ఎత్తుకు పై ఎత్తు అంటే ఇదే కావల్ను.‘‘డజను ఎట్లా కొన్నావ’న్నాను పళ్లు బిగించి.నిన్న మూడు డజన్లు కొంటే ఇవాళ్టి మధ్యాహ్నందాక ఆ సంగతి వీళ్లకు గుర్తు రానందుకు నాకు లోపల అసంతృప్తిగా ఉంది. పండు చూస్తే కింద ఆకుపచ్చగా ఉంది. అక్కడ టెంక పుల్లగా ఉంటుంది. పైగా అది అందరూ వదిలేసిన పండయి ఉంటుంది. నా అనింపార్టెన్సుకి గింజుకుంటూ, ఆ పండు తినలేకా వదలలేకా దిక్కులు చూస్తూ కూర్చున్నా. నా చేతిలో ఆ పండును చూడగానే మా ఇద్దరు అజ్ఞానులూ లేచి నా చెరోవైపుకి వచ్చి నిలబడి దానికేసి చూస్తూ ‘వీడు మనకు పెడతాడా పెట్టడా? పెట్టకుండా ఎలా తింటాడో చూద్దాం’ అన్నట్లుగా పోజు పెట్టారు.పిల్లలంత నిర్మొహమాటస్తుల్ని నేనెక్కడా చూడలేదు. పండు కొంచెం చీకి రుచి చూసి, టెంకొకరికి తొక్కొకరికి ఇచ్చేసి వెళ్లి పంపు వద్ద చేతులు కడుక్కుని దండాలకు వంకీలకు వేలాడిన బట్టల్ను చీరల్ను లంగాల్ను జాకెట్లనూ చూస్తూ కూర్చున్నా. కుర్రవెధవలు కొంచెంసేపు పండు తినీ ఆ టెంకతోనూ తొక్కతోనరూ యుద్ధాలు చేసి వెళ్లి పంపు తిప్పి బాత్రూంలో పడ్డారు. పిల్లల్లో అల్లరిచేసే శక్తి దారుణంగా ఉంటుంది. బాత్రూంలో పడేసిన ఎంగిలి కంచాలూ అంట్లగిన్నెలూ తెచ్చి హాల్లో పరిచారు. అక్కడే కూర్చుని బట్టల సబ్బుతో వాళ్ల అమ్మను ఇమిటేట్ చేస్తూ అంట్లు తోమటం ప్రారంభించారు. హాల్లో అంట్లు తోముకోరని వాళ్లకు తెలీదు.ఇంతలో మెట్ల దగ్గరెవరో కూర్చున్నారని వచ్చి శుభ్రం చేయమని పితూరీ వచ్చింది. అప్పుడీవిడ అట్నుంచి ఇటు దొర్లి పెద్ద పిల్లను వెళ్లి చూసి రమ్మంది. అది చూసొచ్చి మనవాళ్లు కాదని చెప్పింది.‘ఇదివరకు ఒకటిరెండు సార్లు ఇలానే అంటే శుభ్రంచేసి వచ్చాం వెర్రిపీనుగుల్లా వీళ్లకు ఇదో ఆటైపోయింది. ఊరుకో’– అని ఆవిడ కేసు కొట్టేసింది. పిల్లలను నేను ‘‘హాయ్! హుష్! హమ్మయ్య!’’ అంటూ కేకలు వేస్తుంటే, వాళ్లు నన్నో జోకర్ కింద కట్టి వాళ్ల ఆటలు వాళ్లాడుతున్నారు.‘అమ్మొస్తుందర్రా’ అని దయ్యమొస్తుంది కాసుకోండన్నట్లు భయపెట్టాను. ఆవిడను భయంకరంగా చిత్రించడం అవసరమేననిపించింది. ఆనందంగా కూడా ఉంది. అప్పుడు ‘ఇదిగో ఇటు చూడు, పిల్లలు అల్లరి చేస్తున్నారు’ అని నేనూ సుప్రీంకోర్టుకి ఫిర్యాదు చేశాను. (లెట్ హర్ సెటిల్ మేటర్స్ బిఫోర్ దె బికం వర్స్) ఆవిడ లేచింది (మహంకాళిలా), లేస్తూనే నెత్తి మొత్తుకుంది. పళ్లు పటపటలాడించింది. ఎదురుగుండా బొమ్మల పుస్తకం తిరగేస్తున్న పెద్దదాన్ని తిట్టింది. కొట్టబోతే అది పారిపోయింది. ఆ హాలు స్థితి చూసి ‘మీరేం చేస్తున్నారు?’ అని నా వైపో డర్టీ లుక్ పారేసి, ఆ యావత్తు బీభత్సానికి కారకులైన దుష్టశక్తుల్ని రెంటినీ తరిమి పట్టుకుని విచక్షణారహితంగా బాదటం మొదలెట్టింది.‘‘ఏం కొంప? వెధవ కొంప. ఏం పిల్లలు? వెధవ పిల్లలు. ఏం మొగుడు–’’ అని ఆగి మళ్లీ మొదలెట్టింది.ఓమూల అంటే ఉండనివ్వరమ్మా ఈ పిల్లలూ, ఈ సంసారమూనూ. లొడితెడు వెధవ, లాగులో తప్ప వెళ్లడు. అంత ఉగ్గబట్టుకుని లాగంతా పాడయేదాకా ఏడవడం ఎందుకూ? ముందే ఆ ఏడుపేదో ఏడవకూడదా? రోజుకి అరడజను లాగులు ఖరాబుచేసి మూల పారేస్తే అవన్నీ ఉతికితేనే కాని మర్నాడు తొడుక్కోవడానికి లాగుండదు. ఈ వెధవ లాగులు ఉతికి విస్తరి ముందు కూర్చుంటే అన్నం తినబుద్ధవడం లేదు. పిల్లలు ముద్దు కాని పీతుళ్లు ముద్దా? ఇహ ఆయనున్నారు. ఆయన తిరుగుళ్లూ ఆయన ప్రపంచం ఆయన గొడవ అదంతా వేరు. వేళకు విస్తరి ముందొచ్చి కూర్చోవటానికే నన్నేదో ఉద్ధరిస్తున్నట్లు బెట్టు చేస్తారు. బెట్టెవరి మీద? ఇహ నేనేగా అందరికీ లోకువ. ఇంట్లో ఇది ఉంది ఇది లేదు, వీళ్లొస్తున్నారు వాళ్లు వెళ్తున్నారు, ఇది అవసరం ఇది అనవసరం, ఇది ముఖ్యం ఇది అముఖ్యం– ఈ గొడవేం పట్టదమ్మా! ఇహ నేనెన్నిటికి ఏడవను? నా వల్ల ఏమిటవుతుంది? ఛస్తే ఛస్తారు. ఉంటే ఉంటారు. పోతే పోతారు. ఏది జరగాలో అదే జరుగుతుంది. నాకెందుకీ రొష్టూ– నాకెందుకీ హైరాణా? మీరంతా కట్టగట్టుకుని ఏ ఏట్లో దూకుతారో దూకండి. మరి నేను మాట్లాడను. నా పని అయిపోయింది’’ అని ఆవిడ లెక్చరిచ్చేసి, హాలంతా కడుక్కుని శుభ్రం చేసుకుని ఆ గిన్నెలన్నీ తోముకుని ప్రాణం చల్లబడటానికి బాత్రూంలోకెళ్లి స్నానం చేస్తూ కూర్చుంది. ఆ క్షతగాత్రులిద్దర్నీ నేను దగ్గరకు తీసుకుని వెనక వరండాలోకి తీసుకెళ్లి సబ్బెట్టి రుద్ది స్నానాలు చేయించా. ఇంతలో జ్ఞాపకం వచ్చి ‘‘ఇదిగో ఆ రూపాయి తడుస్తుంది’’ అని కేకేశా. ఈవేళ తెల్లారి లేచాక నేను తెలివైన పని చేయటానికి దొరికిన అవకాశం ఇదొక్కటే. రోజుకి కనీసం ఒక తెలివైన పని చేయాలి కదా!‘‘అయ్యో నా మతి మండా’’ అని బాత్రూం మీద వేలాడుతున్న చీరంతా దులిపి ఆ నోటు తీసి ఇవతల పడేసింది. మా చంటిది వెళ్లి మళ్లీ ఆ కాగితాన్ని తెచ్చి దాన్ని తిరగేసి బోర్లేసి ఆడుతోంది. అప్పుడు ‘‘నా రూపాయో’’ అంటూ ఎవరో కొట్టినట్టు మా కుర్రాడు ఏడుపు లంకించుకున్నాడు. అవును వాడి రూపాయి వాడి బుష్‌కోటు లిక్కిజేబులో ఉండిపోయింది. వాళ్లమ్మ ఇందాక తడిసిన బుష్కోటును హాల్లోంచి బాత్రూంలోకి ఉండచుట్టి బంతిలా విసిరేసింది మేమంతా చూస్తుండగానే.‘‘పద పద నీ రూపాయి తెచ్చుకో’’ అని వాడ్ని బాత్రూంకేసి నెట్టాను. ఆ తడిచొక్కా అవతల్నుంచివతలకు టోపీలా ఎగిరొచ్చి పడింది. నిజంగా మన ఆడవాళ్లకు సరైన ట్రైనింగు ఇవ్వకపోబట్టి గాని ఇస్తే ఎన్నెన్ని సర్కస్ ఫీట్లయినా అవలీలగా చేయగలరు. అందుకే జీవితం ఒక సర్కస్లాంటిదని అన్నారెవరో! అయితే రింగ్ మాస్టర్‌కి జోకర్‌కి తేడా తెలియని జీవితం సర్కస్ మనది అనుకూంటూ ఆ చొక్కా అందుకున్నాను. అందులో నోటు మడతపెట్టి ఉన్నందున కొంచెం తడిసింది. తడిసినందుకు వాడు ఏడుపు వదలకుండా సాగించాడు కాళ్లతో నేలను బాదుతూ.స్వయంకృతాపరాధం కనుక ఆ నోటు తీసుకుని ఇద్దరం వెళ్లి ఎండలో కూర్చున్నాము. ఇప్పుడే ఆరిపోతుందని నేను మావాడికి అభయమిచ్చాను. కాని ఒక తడిసిన రూపాయి నోటు గురించి ఎండలో కూర్చోటం అట్టే తెలివైన పనికాదు. మమ్మల్ని చూసి ఎవరైనా నవ్వొచ్చు. ఇంతలో ఒక బ్రెయిన్ వేవొచ్చింది. వీధీలో రెండిళ్లవతల ఒక లాండ్రీ ఉంది. అక్కడకు వెళ్తే రూపాయి నోటును కమ్మగా ఇస్త్రీ చేసి ఇస్తాడు. మళ్లీ కొత్త నోటులా తయారవుతుంది. పిల్లాడు ఏడుపు మాన్తాడు కదా అని జాగ్రత్తగా తలుపు దగ్గరసా వేసి, పిల్లను చంకనెత్తుకుని, కుర్రాడిని నడిపించుకుంటూ పిల్లల తండ్రిలా లాండ్రీ దగ్గరకెళ్లి నిలబడ్డాను.మనం బట్టలిచ్చినప్పుడు వాడు రాక్షసుళ్లా కనపడతాడు కాని లేకపోతే వాడు చిరమందహాసం ఒలికిస్తూ కడు యోగ్యుడులాగే దర్శనమిస్తాడు. వాడి పెళ్లాం చాలా అన్‌సైజు మనిషి. అది వెళ్లి డబ్బులడిగితే ఉతికిన వాటికీ ఉతకని వాటికీ పారేసిన బట్టలకి కూడా డబ్బులిచ్చేస్తారు ఇల్లాళ్లు కిక్కురుమనకుండా. దాన్ని చూస్తే మా ఆవిడకి చాలా భయం. అది ఇల్లాళ్లను నిలువనియ్యదు. కాళ్ల కింద నిప్పులోసి డబ్బులు లేవన్నా మఠం వేసుకుని కూర్చుని డెఫిసిట్ ఫైనాన్సింగు గురించి నీతి సూత్రాలు వల్లిస్తుంది. ‘‘ఏంటమ్మగోరూ! మాకేవన్నా నెల జీతాలా పాడా– ఎండలో పగలల్లా రేవుకాడ చస్తే ఎప్పటి డబ్బులప్పుడిచ్చెయ్యడానికి లేవు పొమ్మంటారు. చీటీ కట్టాలా? బొగ్గులకెంతయిపోతున్నాదని. లాండ్రీ అద్దె పాతిక రూపాయలు. నీలిమందు ఖర్చు, సోడా ఖర్చు, రిక్షా ఖర్చులెంత పెరిగిపోయాయో మీకేటి తెలుసుద్ది? బియ్యం సేరు రూపాయిన్నర. మీ మడేలు తాగుడు ఖర్చు రోజుకి రెండ్రూపాయలు. నా సినిమా ఖర్చు వోరానికి మూడ్రూపాయలు. ఆ కోక యిప్పి పారేసి నాకిచ్చీకూడదా? ఇంద ఈ చీర తీసుకోమని మీరివ్వకపోతే నాకేటుంది? నవార్లుతకాల, బొంతలుతకాల, దయ్యల్లాటి దుప్పట్లుతకాల, మరేటి డబ్బుల్లేవంటే ఎలాగమ్మగారూ! చూడండి. ఇంత మేడద్దికి తీసుకునున్న మారాజు– మాకిస్తే మీకేటి పోతుంది? మాకెవరడిగినా లేదంటారు కాని మీకు పది రూపాయలప్పు ఇట్టే పుడుతుంది. వర్షాకాలం బట్టలారవు. ఓసారి ఫానేపించి మీ చీర ఆరబెట్టి ఇస్త్రీ చేసి ఇచ్చాను కదా? మావోడు సేతి రేడియో కొందావన్నాడు. ఆవకాయముక్క పారేయండమ్మగోరూ– జివ్వ సచ్చిపోనాది’’ అంటూ ఊదరగొట్టేస్తుంది.అది నన్ను చూసి పోల్చుకుందో లేదో తెలీదు కాని నేను లాండ్రీ గడప దగ్గర నిల్చోగానే ‘‘రండి రండయ్యగోరూ! కనకమ్మగారి అయ్యగారొచ్చారొరే–’’ అని నిద్రపోతున్న మొగుడ్ని ఓ కుదుపు కుదిపింది. వాడు తెల్లగా ఉతికిన బట్టల మీద పాలసముద్రం మీద పవ్వళించిన శేషశాయిలా పడుకుని గుర్రు పెడుతున్నాడు. వాడి నోట్లోంచి వస్తున్న గుర్రుకి లాకు తలుపులు దడదడలాడినట్లు వాడి పెదిమలు మీసాలు కదుల్తున్నాయి.ఇస్త్రీపెట్టె ఎర్రగా కణకణలాడుతూ నోరు తెరుచుకున్న చిరుతపులిలా ఉంది.నేను కనకమ్మగారి అయ్యగారిని కానని జానకమ్మగారి పెనిమిట్నని చెప్పుకున్నాక– ‘‘అయ్యబాబో తమరేటిలాగొచ్చార’’ని బోల్డు మర్యాద చేసి అడిగింది. రూపాయి నోటు తడిసిపోయింది. ఇస్త్రీ చేసి పెట్టాలన్నా.‘‘రూపాయి నోటు తడిసిపోతే మీకేటి బాబూ!’’ అని నోటు తీసుకుని చిరుతపులి నోరుమూసి పైనో తువ్వాలు పరిచి రెండు పావులు పావి హాట్‌హాట్‌గా పొగలు గక్కుతున్న రూపాయి నోటుని నా చేతిలో పెట్టి ‘‘అమ్మగారిని పురుటికి ఎప్పుడంపిస్తారు బాబూ’’ అని అడిగింది.పురుడేవిటి ఫామిలీ ప్లానింగ్ ఆపరేషను చేయించుకున్నాను కదా అని కొంచెం గాబరాపడ్డాను.‘‘తొమ్మిదో నెలేవిటి?’’ అన్నాను.‘‘అదేటి బాబూ– మీరు జానికమ్మగారి పెనిమిట్నని చెప్పారిప్పుడు కాదంటున్నారు.’’‘‘ఈ పిల్లల సాక్షిగా నేను జానికమ్మ భర్తనే–’’‘‘అయితే మీరు లావుపాటి మెల్లకన్ను జానికమ్మగారి తాలుక్కాదా? చెయ్యిలాగీడుస్తాది. ఇదిగో ఇలా కాలెగరేస్తూ ధనలక్ష్మిలా నడుస్తాది’’ అని అభినయం చేసి చూపెట్టింది. మా పిల్లలు నవ్వారు. ‘‘నేను లావుపాటి జానికమ్మ మొగుడ్ని’’ అన్నాను ఖచ్చితంగా. ‘‘అహ్హా! సూదిముక్కు లేడి కళ్ల ఉంగరాల జుత్తు కుక్కల్తరువుకొస్తే అడివిలో లేళ్లు పరిగెట్టినట్టు పరిగెడతా ఉంటాది. ఆ పచ్చ డాబాలోని జానికమ్మగోరా..’’ ప్రవాహాన్ని ఆపుచేసి ‘‘అవునవును. ఆ జానికమ్మ సూదిముక్కూ లేడి కళ్లూ...’’‘‘ఆయమ్మకేం బంగారపు బొమ్మ’’ అని సర్టిఫికెటిచ్చింది. నేను ఇంకేం అడుగుతుందో చలివిడి పాకంలా పట్టుకుని వొదల్దని వస్తానని చెప్పి పిల్లల్ని బరబరా లాక్కుంటూ రోడ్డు మీదకొచ్చాను.రిబ్బన్లూ మొలతాళ్లవాడో పక్క నుంచి, బూరలమ్మేవాడో పక్క నుంచి, టమటమాల బండివాడో పక్క నుంచి, మరమరాలూ బఠాణీలవాడో పక్క నుంచి నా ప్రాణానికి నాలుగు వైపుల నుంచి నలుగురూ శత్రువుల్లా పోగయ్యారు. ఎప్పుడు విడిపించుకున్నారో నా పట్టు విడిపించుకుని వాళ్ల దగ్గరకు పారిపోయి కొనమని గెంతుతున్నారు పిల్లలిద్దరూ. నేను ఆలోచించుకోవటానికి వ్యవధి లేకుండా పిల్లలు నడిరోడ్డులో మారాం మొదలెట్టారు. ఆ నలుగురు శత్రువులూ అలా నిలబడిపోయారు నన్నే గమనిస్తూ. రిబ్బన్ల వాడి దగ్గరో రెండు మూడు రిబ్బన్లు తీసుకున్నాను. రెండు టమటమాల బళ్లు కొన్నాను. మరమరాలూ బఠాణీలూ కొని లుంగీలో రెండు మూటలుగా కట్టి ఎత్తి పట్టుకుని ఇంత చేశావా భగవంతుడా అని బఫూన్లా ఇంటివైపు నడక ప్రారంభించాను. మొత్తం బిల్లు రిబ్బను వాడికి రూపాయిన్నర, రెండు టమటమాల బళ్లూ రూపాయి పావలా మరమరాలు పావలా, బఠానీలు అర్ధరూపాయి. నా దగ్గర రూపాయి ఉంది. వాళ్లందర్నీ వెనకేసుకుని ఇంటి దగ్గరిద్దావని గ్రేట్ మార్చ్ చేయించి తీసుకొచ్చాను.సూదిముక్కూ లేడికళ్ల జానకమ్మ వీధిలోనే నిలబడి మేమెక్కడికి పోయామా అని చూస్తూంది గావల్ను మా ప్రొసెషన్ని చూసి ‘ఏం జరిగిందేం జరిగింద’ని ఆదుర్దాగా అడిగింది.‘‘హేవీ లేదు.. హేవీ లేదు. నువ్ లోపలికి నడు–’’ అని రిబ్బన్లవాడికి రూపాయిన్నర, టమటమాల బళ్లకి రూపాయి పావలా, మరమరాలూ బఠాణీలకి ముప్పావలా ఇచ్చేమని చెప్పాను.‘‘ఏవిటీ? హేవిటేవిటేవిటీ? ఈ రిబ్బన్లు రూపాయిన్నరా? ఈ బళ్లెందుక్కొన్నారూ? వీటికి రూపాయా? ఇవి పావలా మరమరాలా? ఇవి అర్ధరూపాయి బఠాణీలా? ‘హవ్వ’ అని నోరు నొక్కుకుని ఇచ్చెయ్యండి. ఇవి వాళ్లకిచ్చెయ్యండి. మీ మొహం చూసి మిమ్మల్నెవరో బాగా టోపీ వేశారు. ఇచ్చేసి వాళ్లను వెళ్లమనండి. శుద్ధ దండగ’’ అని రూలింగిచ్చేసింది. నాకు ముచ్చెమటలు పోశాయి. వీధిలోకెళ్లానంటే వాళ్లూరుకోరు. ఇంట్లో ఈవిడూరుకోదు. పిల్లలు వాళ్లమ్మకేసి కోపంగా, నాకేసి జాలిగా చూస్తున్నారు. పైగా మేవు దారిపొడుగునా బఠాణీలు నవుల్తూ వచ్చాము. పిల్లల జేబుల్లో పోశారు వాళ్లే. ఆఖరికి నేనే తెగించి పెళ్లాం ముందు హీనపడిపోవడం ఇష్టంలేక– వీధిలోకెళ్లి,‘‘ఏవిటోయ్ మరీ కాసిని మరమరాలు బఠాణీలిచ్చి ముప్పావలా అంటావు? ఆడవాళ్ల దగ్గరో బేరమూ, మగాళ్ల దగ్గరో బేరమూనా? ఆ కొల్తలేవిటి? ఆ డొక్కులేవిటి? మరమరాలకీ, బఠాణీలకి కలిపి అర్ధరూపాయి చేసుకో–మరి మాట్లాడకు’’ అని రిబ్బన్లవాడికేసి తిరిగి–‘‘ఈ వెలిసిపోయిన రిబ్బన్లు ఇచ్చావేమిటయ్యా సాయిబూ, పైగా రూపాయిన్నరేమిటి? రూపాయి చేసుకో– మా ఆవిడ ముప్పవాలాయే ఇమ్మంటోంది. అయినా రిబ్బన్లక్కూడా ఇంత ధరేవిటి? అలా ఇస్తే ఇవ్వు. లేకపోతే తీసేసుకో’’ అంటూ నిర్మొహమాటంగా మా ఆవిడకు వినిపించేలా అనేసి టమటమాల బండి అబ్బాయికేసి తిరిగి బిగ్గరగా కేకలెట్టాను.‘‘మా పిల్లలకి చెరో చేతిలో చెరో బండి పెట్టింది నువ్వేనా? నన్నడక్కుండా నా పర్మిషన్ లేకుండా పిల్లల చేతిలో బళ్లు పెట్టి నువ్వు రూపాయి పావలా ఇచ్చేమంటే ఇచ్చేడానికి నేనేవీ తెలివితక్కువవాణ్ణి కాదు. అసలీ వీధిలో నువ్వు కనిపించావంటే జాగర్త! పావలా పావలా చేసుకో. అబ్బో నేనెరగననుకోకు. నా చిన్నప్పుడు అణా అణా.అప్పుడు మట్టిచిప్పకి కాదు, కొబ్బరిచిప్పకే పల్చటి చర్మం అంటించేవారు. దాని మీద దెబ్బపడితే రణభేరి రణభేరే అనుకో. నువ్విప్పుడు జిగురుపూసి కాగితం అంటించావు. నువ్వింకా ఈ సందు తిరక్కుండానే కాగితం చిరిగిపోతుంది. ఇచ్చెయ్ జానకీ! వాళ్లకు డబ్బులిచ్చేసి పంపించు’’ అని లోపలికెళ్లిపోయాను. వాళ్లు ముగ్గురూ డబ్బులిస్తానని నా వెనకాలే వచ్చిన వాళ్లు నా ఉపన్యాసం విని డంగైపోయారు. మా ఆవిడ ఒక్కొక్కరితో ‘‘ఆయనకేవీ తెలీదనీ, వెర్రిబాగులోడనీ, ఇలా నష్టాలు తెస్తుంటే తను తెలివిగా సర్దుకొస్తూ ఉంటుంద’’నీ నన్నో పది అని, వాళ్లని పొగిడి ఒక టమటమాల బండి వాపసు చేసి, రిబ్బన్లని మళ్లీ మార్పించి మొత్తానికి నేను మూడ్రూపాయల పావలా ఇవ్వవలసిన చోట రెండ్రూపాయల కన్నా తక్కువే ఇచ్చి హైరాణా పడిపోతూ మహిషాసుర మర్దనిలా లోపలికొచ్చి ‘‘ఈ వీధిలో వాళ్ల దగ్గర బేరాలు మీకు తెలియవు. వాళ్లు పావలా చెబితే మనం పది పైసలకడగాలి. సగానికి సగం ఎక్కువ చెప్పి డబ్బు దోచేస్తారు.’’ అని లెక్చరిస్తుండగా బూరలవాడొచ్చాడు ‘‘డబ్బులిమ్మంటూ’’. వాడు దారిలో ఆగాట్ట మరో బేరమేదో వస్తే.‘‘బండీ కొంటే మళ్లీ బూరాలెందుకు కొన్నారు?’’ అని నన్ను తీక్షణంగా అడిగింది. బండి కొన్నప్పుడు బూరాలు కొనకూడదు కావును. ఆ సంగతి నాకు తెలీనట్లు నేను నిలబడ్డాను.‘‘బూరాలేవర్రా వెధవల్లారా?’’ అంది వాళ్లకేసి తిరిగి.‘‘పేలిపోయాయ్’’ అన్నారు వాళ్లు బిక్కమొగాలేసుకుని. దీన్తో ఆవిడకు చిర్రెత్తుకొచ్చింది.‘‘మీరు బూరాలు వాళ్ల చేతుల్లో చూశారా’’ అని నన్ను క్రాసెగ్జామిన్ చేసింది.‘‘చూశాననుకుంటాను’’ అన్నాన్నేను కంగారుపడి.‘‘అయ్యో నా మతిమండా– మీరెక్కడ దొరికారండీ నాకు. బూరాలు కొన్నారో లేదో గుర్తులేదు మీకు. వాడెవడో వీధిలోకొచ్చి డబ్బులడగ్గానే ఇచ్చెయ్యమంటున్నారు. ఈ సంసారం ఇంకెందుకైనా పనికొస్తుందీ? ఇక ఈ కొంప బాగుపడదు. బాగుపడదు’’ అనివాడికేసి తిరిగి, ‘‘పిల్లల చేతిలో బూరాల్లేవు. నువ్విచ్చావో ఇవ్వలేదో– మళ్లీ ఇచ్చెయ్. ఇచ్చేసి డబ్బులట్టుకుపో– నన్నాట్టే విసిగించకు. బూరాల వాడు తమాయించుకుని–‘‘జేబులు సూడండమ్మగారూ–’ అని ‘బాబూ ఎర్రబూరా నీకు పచ్చబూరా చెల్లికి ఇవ్వలేదూ’ అని వాళ్లనడిగాడు. వాళ్లు బుర్ర ఊపారు.‘అటికి పిడతల్లాగ తలకాయలూపుతారు’ అని విసుక్కుని మావాడి జేబు వెతికింది. జేబులో రెండు బూరాలున్నాయి.‘‘ఇవి తీసుకుని మంచివిచ్చేయ్. డబ్బులివ్వకుండానే బూరాలు పేలిపోతే నువ్వే మళ్లీ మంచి బూరాలివ్వాలి. నువ్వు ఊత్తోంటే పేలిపోతే మళ్లీ మరోటిస్తావా లేదా? పిల్లల చేతిలో ఒకవేళ నువ్వన్నట్లు పేలిపోతే మళ్లీ మంచివివ్వాలిగాని అలా పేలిపోయిన వాటికి డబ్బులుచ్చుకుంటే పసిపిల్లల్ని అన్యాయం చేసినట్లవుతుంది. చిన్నపిల్లలు నారాయణ స్వరూపాలు’‘మీరూదుకోవటానిక్కావాలంటే ఓటిస్తానుగాని పేలిపోయిన వాటికి డబ్బులిచ్చేయండమ్మగారూ! బూరాలను అమ్ముతావుకాని అవి పేలిపోకుండా ఇన్సూరెన్స్ కంపెనీ ఎట్టలేదండీ’ అని నవ్వేడు వాడు.డబ్బులిచ్చేసి ‘పోకిరీ చచ్చినాడా’ అని గొణుక్కుంది జానకి మెటికలు విరుస్తూ.మేవంతా గదిలో బాస మీద కూర్చుని తీరిగ్గా బఠాణీలూ మరమరాలూ నవుల్తూ కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. అంతలో మాచంటివాడొచ్చి ‘నా రూపాయి నాకిచ్చెయ్ నాన్నా’ అని నుంచున్నాడు కాబూలీవాడిలాగ. వాడి వెనకాలే చంటిది కూడా వచ్చి నిల్చుంది. ‘‘మీ రూపాయి ఏవిట్రా వెధవల్లారా? ఇంకా ఎక్కడుంది? బఠాణీలు మరమరాలు బొక్కారు కదా, ఇవి తేరగా వచ్చాయా? టమటమాల బండి కొనలేదా? రిబ్బన్లు కొనలేదా? ఇవన్నీ ఊరికే వచ్చాయా?’’ అన్నాను. నా మాట వినిపించుకోకుండా నేనేదో చేసినట్లు ఘొల్లుమని శోకాలారంభించాడు. పన్లో పని ఎందుకైనా మంచిదని రెండు తగల్నిచ్చాను. వాళ్లమ్మ జెట్ ప్లేన్లాగా విసురుగా వచ్చి పిల్లల్ని విడదీసి పట్టుకుని ‘ఎందుకలా కొట్టుకుంటారు? మీవి చేతులు కావా? పసిపిల్లల్ని ఎండలో తిప్పడమే కాకుండా ఏదో అడిగితే సరైన సమాధానం చెప్పాలేగాని కొట్టుకుంటారా? పిల్లలూరికే రాలేదు. నవమాసాలు మోసి కంటే వచ్చారు. మీకేం తెలుస్తుంది?’’ అని నన్ను దులిపేసింది.‘‘అవును. తేరగా మెక్కి రూపాయి తెమ్మని ఏడుస్తున్నారు. ఆ మాత్రం జ్ఞానం ఉండొద్దూ?’’‘‘ఇదేమిటి నువ్విలా నా మీద తిరగబడుతున్నావు? అయినకాడికి అన్నీ చేయించుకుని అంతా నన్ననే వాళ్లే–’’‘‘అవునండీ మీరు తండ్రి కాబట్టి వాళ్లు చనువుగా అది కావాలి ఇది కావాలి అని అడుగుతారు. మారాం చేస్తారు. మనం కొనిస్తాం. అది వాళ్లకేం అర్థమవుతుందీ? వాళ్లకెవరో రెండ్రూపాయలిస్తే ఆ రెండ్రూపాయలెట్టి మీరివన్నీ కొనిపెట్టారు గనుక దానికింత చెల్లు అని చెబితే వాళ్లకు బోధపడుతుందా?’’‘‘అయితే ఈ రెండు రూపాయలింకా ఉందంటావు నువ్వు?’’‘‘అవును. మీరు వాళ్లకి బాకీ. వాళ్లేడిచింది రైటు. అయినా చిన్న పిల్లలకెవరో ఏదో ఇస్తే దాని గురించి పిల్లల్నేడిపించడం మీకేవైనా బాగుందా? ఎవరేనా వింటే నవ్వుతారు!’’‘‘మరి ఇందాకెప్పుడో సినిమాకెళ్దామన్నావు. సినిమాకెళ్లినా ఆ రెండు రూపాయలు అలాగే ఉంటాయా?’’‘‘ఉంటాయీ ఉంటాయీ ఉంటాయీ’’‘‘ఎలా చెప్పు?’’‘‘ఎలాగేవిటండీ? మనం సినిమాకెళితే మన ఖర్చులో వెళతాంగాని ఎవరో పిల్లలకిచ్చిన రెండు రూపాయలకి మరికొంత వేసి కాదు కదా! అలా కక్కుర్తి పడటానికి మనకేం గతి కడుక్కుపోలేదు. నా మొగుడికి ఆరువందల్జీతం.’’‘‘ఆల్రైట్. ఒప్పుకున్నాను. అయితే ఆ రెండు రూపాయల నుంచి నాకు విముక్తి లేదా?’’‘‘ఇలాటివి ఎవరేనా ఇచ్చినప్పుడు అవన్నీ ఓ చోట వేసుకుని, పట్టాలు పరికిణీలు ఏవైనా కొనుక్కునేదాన్ని’’ అని కాళ్లకేసి చూసుకుంది. అక్కడ పట్టాలు పెట్టుకున్న మచ్చలున్నాయి.ఆడవాళ్ల లాజిక్కు ఆడవాళ్ల ఎకనామిక్స్ వేరని తెలుసుకున్నాను. నాకు ఈ రెండ్రూపాయల అప్పు నుంచి మా ఆవిడ దయతలిస్తే కాని విముక్తి లేదు. పెళ్లాం దగ్గర అప్పు అది ఒక తీయని బాధ. పైకి చెప్పుకోడానికి వీల్లేని రుణం. ఆవిడకెలా తోస్తే అలా దాని వడ్డీ పెరుగుతూ ఉంటుంది. ఈ సంసారమనేది చెల్లుపడని నోటు మీద ఏ సుముహూర్తానో చేసిన తెలివి తక్కువ సంతకం. - పురాణం సుబ్రహ్మణ్యశర్మ -
చిమ్మచీకటిలో పసిబిడ్డ
కావలిరూరల్: కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాల సిబ్బంది నిర్వాకంతో అప్పుడే పుట్టిన పసిబిడ్డ మూడు గంటల పాటు చిమ్మచీకటిలో ఆర్తనాదాలు చేస్తూ ఉండాల్సి వచ్చింది. బోగోలు మండలం బిట్రగుంటకు చెందిన యు.అంజలి పురుడు కోసం గురువారం కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు వచ్చింది. మధ్యాహ్నం 2.50 గంటలకు డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేసి మగబిడ్డను కాన్పు చేశారు. అనంతరం 3.20 గంటలకు ఆమెను అప్పుడే పుట్టిన బిడ్డతో సహా పే వార్డులోని రూం నంబరు 2లోకి మార్చారు. అయితే రూంలో లైటు పని చేయలేదు. ఈ విషయం గమనించిన డ్యూటీ సిస్టర్ వెంటనే ఎలక్ట్రీషియన్‌కు సమాచారమందించారు. అయితే ఎలక్రీషియన్ 6.25 గంటలకు వచ్చి లైట్‌ను సరిచేసి వెళ్లాడు. అయితే మూడు గంటల పాటు ఆ చిన్నారి ఏడుస్తూనే ఉంది. ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్ పొత్తిళ్లలో బిడ్డతో సహా అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. వీరి బాధ చూడలేక అక్కడ విధులలో ఉన్న సిబ్బంది పదే పదే ఫోన్లు చేయడంతో ఎలక్ట్రీషియన్ తీరుబడిగా 3గంటల తర్వాత వచ్చి లైటు సరిచేయడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు బాగా చేస్తున్నారని వస్తే సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారేంటని అంజలి కుటుంబ సభ్యులు వాపోయారు. -
గంటలపాటు చీకట్లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ..
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరం అనగానే వెంటనే గుర్తొచ్చేది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. స్వేచ్ఛకు పతీకగా ప్రపంచానికే తలమానికంగా ఆ విగ్రహాన్ని న్యూయార్క్ నగరం నడి బొడ్డున నిలబెట్టారు. దాని గురించి సోషల్ మీడియా ట్విట్టర్లో పలు కామెంట్లు మోతమోగాయి. ఎన్నడూ లేనిది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వద్ద తొలిసారి విద్యుత్ లైట్లు ఆగిపోయి చీకట్లో అది దర్శనం ఇచ్చింది. ఇలా కొద్ది సేపు కాదు.. దాదాపు కొన్నిగంటలపాటు. చీకట్లో ఆ విగ్రహాన్ని ఉండటాన్ని చూసిన ఓ ఎర్త్ క్యామ్ లైవ్ స్ట్రీమ్ చేసింది. దీంతో అసలు అక్కడ లైట్లు ఎలా ఆగిపోయాయి? ఏం జరిగి ఉంటుంది? ఎందుకు స్వేచ్ఛా తల్లి చీకట్లో ఉండిపోయిందంటూ? రకరకాల ప్రశ్నలతోపాటు తమ వ్యూహాలు అందులో పంచుకున్నారు. ‘మహిళ స్వేచ్ఛ నేడు చీకట్లోకి వెళ్లింది. స్టాట్యూఆప్ లిబర్టీ లైట్లు ఆగిపోయాయి. స్వేచ్ఛతో 200 ఏళ్లపాటు సాగిన మన బంధం ఇక ముగిసింది. మహిళలు లేని రోజు వద్దని చెబుతూ చీకట్లోకి వెళ్లిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి ధన్యవాదాలు’ అంటూ ఇలా రకరకాలుగా ట్విట్టర్లో కామెంట్లు పెట్టారు. అయితే, దీనిని నిర్వహిస్తున్న నేషనల్ పార్క్ సర్వీస్ సంస్థ వివరణ ఇస్తూ..‘ఇలాంటి అనుభవం చాలా కొద్ది సేపేనని, కావాలని చేసింది కాదని అన్నారు. అనుకోకుండా అలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. పని సంబంధమైన ఆలస్యం జరగడం వల్ల ఇలా అయ్యిందని తెలిపారు. -
కన్నా.. భయపడకు..!
- విద్యుత్ సౌకర్యానికి నోచుకోని మహిళా ఆసుపత్రి - చీకటిలోనే మహిళ ప్రసవం ఓ మహిళ కడుపుతో ఉన్నప్పుడు ప్రసవ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి రండి.. తల్లీబిడ్డా క్షేమమంటూ వైద్య సిబ్బంది ఇంటికొచ్చి చెప్పారు. నెల నెలా వచ్చి ఆరోగ్య సలహాలు చెప్పారు. బిడ్డ భద్రం అంటూ ఎన్నో సూచనలు ఇచ్చారు. గర్భిణుల విషయంలో ప్రభుత్వం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుందా అని ఆశ్చర్యపోయింది. తీరా ఆసుపత్రికి వెళ్తేగానీ అధికారుల తీరు ఆమెకు అర్థం కాలేదు. గర్భంలో ఉన్న తన బిడ్డకు చీకటి ప్రపంచాన్ని పరిచయం చేయాల్సి వస్తుందని. ప్రసవ వేదనలోనే ‘కన్నా భయపడకు’ అంటూ పేగు తట్టి బిడ్డకు గుండె ధైర్యాన్నిచ్చింది. అందమైన లోకంలోకి అడుగుపెట్టిన శిశువుకు చీకటే స్వాగతం పలికింది. - జూపాడుబంగ్లా పారుమంచాల మహిళా ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పేరుకే 24గంటల ఆసుపత్రి. సౌకర్యాలు అంతంత మాత్రమే. సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన సుహాసిని ప్రసవవేదనతో ఆసుపత్రికి చేరుకుంది. అయితే కాన్పుల వార్డులో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఽస్టాఫ్‌నర్సు సుప్రజ టార్చిలైట్లు, సెల్ఫోన్ల వెలుతురులోనే మహిళకు ప్రసవం చేయాల్సి వచ్చింది. సుఖప్రసవంలో జన్మించిన మగ శిశువుకు శ్వాస ఆడకపోవటంతో వెంటనే 108లో నందికొట్కూరుకు తరలించారు. ఏటా ఆసుపత్రి అభివృద్ధికి రూ. లక్షల్లో నిధులు మంజూరవుతున్నా కనీసం విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం వైద్యుల నిర్లక్ష్యాన్ని నిదర్శనంగా నిలుస్తోంది. నా చేతుల్లో ఏమి లేదు: మహేశ్వర ప్రసాద్, వైద్యాధికారి ఆసుపత్రిలోని కాన్పుల వార్డుకు విద్యుత్ సౌకర్యం లేక చాలా రోజులైంది. ఇన్వర్టర్ ఏర్పాటు చేసినా పని చేయడం లేదు. విద్యుత్ ఏర్పాటు విషయం నా చేతిలో లేదు. -
జనగామకు చీకటి రోజు
మా గొంతు కోయకండి ఆరు మండలాలతో రెవెన్యూ డివిజనా? ఈ ప్రాంత ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలి జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి నేటినుంచి ఆమరణ దీక్ష.. అన్ని పార్టీల మద్దతు జనగామ : నూతన జిల్లాల ముసాయిదా ప్రకటనతో జనగామలో చీకట్లు కమ్ముకున్నాయని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. పట్టణంలోని జూబ్లీ గార్డెన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, పోకల లింగయ్య, నాగారపు వెంకట్‌తో కలిసి మాట్లాడారు. జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకటించి, సంబురాలు చేసుకోమంటున్న సీఎం కేసీఆర్, జనగామ ప్రజలు ఏం చేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో ముఖ్యభూమిక పోషించినందుకే ఈ శిక్ష వేశారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని, శాస్త్రీయ పద్ధతిలో జిల్లాలను చేస్తామని ప్రకటించిన సీఎం, ఏకపక్షంగా డ్రాఫ్ట్‌ను ప్రకటించడం సిగ్గుచేటన్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లోనూ రెవెన్యూ డివిజన్ పరిధిలో కలిపిన మండలాల జాబితాలో జనగామ పేరు గల్లంతు చేశారని విమర్శించారు. జనగామ కో సం పది మండలాల ప్రజలు ఉద్యమాలు చే స్తుంటే, వద్దంటున్న హన్మకొండ, నిర్మల్ జిల్లాలను చేయడమేంటని ప్రశ్నించారు. సిద్దిపేట, అర్భన్ రెండు మండలాలు చూపించిన ప్రభుత్వం, జనగామ మున్సిపాలిటీ, రూరల్‌ను ఒకే మండలంగా గుర్తించడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ స్థాయికి దిగజార్చారు.. పది మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా కొనసాగుతున్న జనగామకు ఆరు మండలాలను మాత్రమే కేటాయించి, గ్రామపంచాయతీ స్థాయికి దిగజార్చారని దశమంతరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేటి నుంచి ఆమరణ దీక్ష.. నూతన జిల్లాల ముసాయిదాలో జనగామకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నేటి నుంచి ఆమరణ దీక్ష చేపడతానని దశమంతరెడ్డి ప్రకటించారు. అన్ని పార్టీలు పూర్తి మద్దతు ప్రకటించాయని తెలిపారు. జనగామ జిల్లా ప్రకటించేవరకూ దశల వారీగా ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు తీగల సిద్దూగౌడ్, ఆలేటి సిద్దిరాములు, సత్యం, కాసుల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అతి తక్కువ ధరకే ఆ.. వీడియోల విక్రయం..!
న్యూఢిల్లీః ఉత్తరప్రదేశ్, ఢిల్లీల్లో డార్క్ ట్రేడ్ జోరుగా సాగుతోంది. రోజురోజుకూ మహిళలపై నేరాల ఘటనలు పెరుగుతుండటమే కాక.. దానివెనుక పెద్ద నల్లబజారు నడుస్తున్నట్లు తెలుస్తోంది. నేరస్తులకు ప్రభుత్వం కఠినమైన శిక్షలు అమలు చేయకపోవడంతో చట్టాలకు భయపడకుండా వారు బరితెగించి స్వేఛ్చగా బయట తిరగడంతోపాటు.. మరిన్ని నేరాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. తాజాగా బయటపడ్డ రేప్ వీడియోల బ్లాక్ ట్రేడ్ అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. భయంకర, అత్యాచార వీడియోలు సైతం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో నామమాత్రపు ధరకే సులభంగా అమ్మకాలు జరుపేస్తున్నారు. నల్లబజారుల్లో రేప్ వీడియోలు వందలకొద్దీ అమ్ముడవుతున్నట్లు ఓ పేరొందిన పత్రిక సేకరించిన ఆధారాలప్రకారం తెలుస్తోంది. 30 సెకన్లనుంచీ 5 నిమిషాల నిడివి ఉండే.. ప్రత్యేక రేప్ వీడియోలు, వీడియో క్లిప్పులు కేవలం 50 నుంచి 150 రూపాయలకే ఆయా మార్కెట్లలో భారీగా అమ్ముడుపోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అటువంటి వీడియోలు వినియోగదారులు పొందాలంటే విశ్వసనీయమైన ఓ చిన్న సోర్స్ ఉంటే సరిపోతుంది. తమకు దొరికిన సమాచారుంద్వారా వారు డీలర్లవద్దకు చేరుకుంటే పనైపోతుంది. అయితే ఆయా డీలర్లు మాత్రం ముందుగా వచ్చినవారితో ఎటువంటి సమాచారం గురించి చర్చించరు. వచ్చిన కస్టమర్ విశ్వసనీయమైన సమాచారం అందించిన తర్వాత మాత్రమే ఒప్పందం ప్రకారం ధర నిర్ణయించుకొని, డీలర్స్ డైరెక్టుగా వినియోగదారుల స్మార్ట్ ఫోన్లలోకి డౌన్లోడ్ చేయడమో.. లేదంటే పెన్ డ్రైవ్ లో కాపీ చేయడం ద్వారా విక్రయాలు జరుపుతారు. కొన్నిసార్లు ఇటువంటి విక్రయాలు వ్యక్లులు లేదా వ్యవస్థీకృత ముఠాలు ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి అకౌంట్లద్వారా డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా అమ్మకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అదంతా ఒకరకం వ్యాపారం అయితే.. కొన్నిసార్లు నేరస్తులు అత్యాచారాల వీడియోలను రికార్డు చేసి సదరు బాధితులపై వేధింపులకు పాల్పడటం, వాటిని అన్లైన్ లో పోస్ట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేయడం వంటివి కూడా జరుగుతుంటాయని డీలర్లే చెప్తుండటం విశేషం. రేపిస్టులు నేరాలను తమ ఫోన్లలో రికార్డు చేసి వేధింపులకు పాల్పడుతున్నట్లు కొందరు సీనియర్ పోలీసులు కూడా చెప్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు, లేదంటే వారిపై తిరిగి లైంగిక కార్యకలాపాలకు పాల్పడేందుకు ఆ వీడియోలను సాధనంగా ఉపయోగించుకుంటున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే ఆన్ లైన్లో పోస్ట్ చేస్తామని భయపెట్టడంతో కూడా బాధితులను మరింత లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నా...ఆగ్రాలోని బెలాన్ గంజ్, బాల్కేశ్వర్, కమ్లానగర్ మార్కెట్లతోపాటు.. మీరట్ లోని బారెల్లీ, అలిగర్ మొదలైన ప్రాంతాల్లో అటువంటి భయంకరమైన అత్యాచార వీడియోలు అందుబాటులో ఉండటం హాస్యాస్పదంగా కనిపిస్తోంది. -
అంధకారంలో ఆదర్శ, కస్తూర్బా పాఠశాల
తుర్కపల్లి : తుర్కపల్లి మండలానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదర్శ, కస్తూరిబా పాఠశాలల్లో 2 రోజుల నుంచి విద్యుత్ లేకపోవడంతో విద్యార్థినులు అంధకారంలోనే ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కరెంట్ లేక పోవడంతో ఉదయం నుంచి స్నానాలు కూడా చేయలేదని, రాత్రి పూట దోమలతో పడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్స్ అడవిలో ఉండటం వల్ల భయానికి లోనవుతున్నామని రాత్రి వేళల్లో భోజనం చేయడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని. రెండు రోజుల నుంచి విద్యుత్ అధికారులు గానీ ఉపాధ్యాయులుగానీ పట్టించుకోక పోవడంతో ఇబ్బందులెదుర్కుంటున్నామని విద్యార్థునులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో విద్యుత్ స్తంభం కూలడంతోనే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ట్రాన్కో ఏఈ చారి తెలిపారు. సాక్షి సందర్శించిన అనంతరం స్పందించిన విద్యుత్ అధికారులు మరమ్మతులు జరిపి విద్యుత్ పునరుద్ధరించారు. -
స్మార్ట్‌ఫోన్‌తో అంధత్వం !
లండన్: స్మార్ట్ఫోన్లు పక్కన పెట్టుకుని పడుకునే వారికి హెచ్చరిక. చీకట్లో స్మార్ట్‌ఫోన్‌ను తదేకంగా చూసిన ఇద్దరు మిహళల్లో తాత్కాలిక ఒంటికన్ను అంధత్వాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరిద్దరు నిద్రలేచి కూర్చోవడానికి ముందు తమ స్మార్ట్‌ఫోన్‌లో వార్తలు చెక్ చేసేవారు. మంచంలోనే ఉండటం వల్ల వారు ఒక కన్నునే తెరిచేవారని లండన్‌లోని మూర్ఫీల్డ్ కంటి ఆసుపత్రి వైద్యుడు ఒమర్ మహ్రూ తెలిపారు. దీంతో ఒక రెటీనా వెలుతురుకు, మరొకటి చీకటికి అలవాటుపడ్డాయని వివరించారు. -
చితికిన బతుకుల చీకటి వెలుగులు
వారు తమ జీవితం గురించి ఆలోచించడం లేదు. ఎవరైతే తమ జీవితాలను చీకట్లోకి నెట్టారో... వారిని తప్పు పట్టడం లేదు. ఎవరినీ నిందించడం లేదు. తమ వారి బతుకుల్లో వెలుగులు నింపడానికి తాము చీకట్లో మగ్గిపోతున్నారు. చీకటి వెలుగులతో దోబూచులాడుతున్న వారంతా ఎలాంటి జీవితాన్ని వెళ్లబుచ్చుతున్నారు? వారి ద్వారానే తెలుసుకుందాం... ‘చీకట్లో నన్ను నేను వేరొకరికి అప్పజెప్పుకుంటూ... ఇంట్లో నా బిడ్డ ఏ పరిస్థితిలో.. ఎలా ఉందో.. అని ప్రాణాలు అరచేతిలో నిలుపుకుంటుంటాను’ వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి రెండు క్షణాలు ఆగింది పూర్ణ(పేరు మార్చాం). ఆమె వయసు 29. మనిషి మంచి ఒడ్డూ పొడుగుతో ఉంది. కాలం ఆమెకు చేసిన గాయాలను ఆ కళ ్లకింద వలయాలు చెప్పకనే చెబుతున్నాయి. పూర్ణ మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టింది... ‘‘ఈ ‘పని’ చేయకపోతే ఎలా.. రేపటి మా ఆకలి తీరేదెలా... అని గుర్తుకు తెచ్చుకుంటాను. ఎప్పుడెప్పుడు నా బిడ్డ దగ్గరకు వెళ్లిపోతానా అని ఎదురుచూస్తుంటాను. తెల్లవారకముందే ఉరుకులు పరుగులతో ఇంటికి చేరుకుంటా. తాళం తీసి బిడ్డ ఏ మూల ఉందా అని వెతుక్కుంటా. చాలా సార్లు మా రమ్య (పేరు మార్చాం) పడుకునే కనిపిస్తది. ఒక్కోసారి ఆ చీకట్లో అరుస్తూ గోడకేసి తలబాదుకుంటూ ఉంటది. బిడ్డను గుండెలకదుము కొని... ఊరడించి పడుకోబెడతా. అది ఆకలికి తట్టుకోలేదు. ఏ పండో, బ్రెడ్డు ముక్కనో తినిపించి పడుకోబెడతా! దానికి మతిస్థిమితం లేదమ్మా! ’’ అంటూ ఏడుస్తూనే.. ‘‘నా గురించి ఇంకా ఏముంది చెప్పడానికి. రోత బతుకు. ఒక్కపూటలోనో, ఒక్కరోజులోనో ఈ దుఃఖం తీరిపోయేది కాదు. దేవుడి పిలుపు వచ్చేంతవరకు ఈ కష్టం తప్పదు...’’ అని కళ్లనీళ్లు తుడుచుకుంది. ‘‘మాది అమలాపురం దగ్గర ఓ చిన్న పల్లెటూరు. అమ్మనాన్నలది కలిగిన కుటుంబమే. అన్న, ఇద్దరు అక్కలున్నారు. పదిహేనేళ్ల క్రితం ‘ప్రేమించాను..’ అని ఒకతను వెంటపడ్డాడు. నిజం అని నమ్మాను. ఇంట్లో వాళ్లకు చెబితే ఊరుకోరని... చెప్పాపెట్టకుండా వాడి చేత తాళి కట్టించుకొని, పట్నం వచ్చేశా. ఇంటి నుంచి తెచ్చుకున్న సొమ్ముతో మూడు నెలలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు. కొన్ని రోజులు నా మొగుడు బేల్దారీ పని చేశాడు, కొన్ని రోజులు ఆటో నడిపాడు. ఆనందంగా సాగిపోతుందనుకున్నా. నెలరోజులుగా ఏ పనికీ పోలేదు. ఎందుకంటే ‘పని దొరకలేదు’ అంటుండేవాడు. నెల తప్పిన విషయం నా భర్తకు సంతోషంగా చెప్పా. కానీ, అతనేం మాట్లాడలేదు. ఓ రోజు చీకటి పడుతూనే నా భర్త తన స్నేహితుడు ఒకడిని తీసుకొచ్చాడు. ఆ రాత్రి అతడితో గడపమన్నాడు. చీదరించుకున్నాను, తిట్టాను, అరిచాను, కాళ్లావేళ్లాపడ్డాను. అయినా నా మొగుడి మనసు కరగలేదు. నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. వాణ్ని లోపలుంచి, బయట తాళం వేసుకొని వెళ్లిపోయాడు. రోజూ.. ఎవరినో ఒకరిని తీసుకొస్తూనే ఉండేవాడు. పగటి పూట పారిపోకుండా తలుపులకు తాళం వేసి బయటకు వెళ్లేవాడు. కడుపుతో ఉన్నానని కూడా కనికరం ఉండేది కాదు. నేనెప్పుడూ కాలు బయటపెట్టింది లేదు కాబట్టి చుట్టుపక్కల ఇళ్లవాళ్లకు ఇదేమీ తెలిసేది కాదు. ఈ పరిస్థితిలోనే కూతురు పుట్టింది. పచ్చిబాలింతనని.. అప్పటికైనా వదిలిపెట్టమని బతిమాలుకున్నాను. మా ఊరు వెళ్లిపోతానని కాళ్లు పట్టుకున్నాను. అప్పటికి ‘సరే’ అనేవాడు. రాత్రి అయ్యేవరకు తన అసలు రూపం చూపించేవాడు. బాగా తాగి, తను తీసుకొచ్చినవారి కోరిక తీర్చకపోతే బిడ్డకు పాలు కూడా కొనేవాడు కాదు. బిడ్డ ఆకలి చూసే శక్తి ఇవ్వని దేవుడు, మొగుడు పెట్టే హింసను భరించే శక్తిని ఎలా ఇచ్చాడో...!! చాలా సార్లు చచ్చిపోదామనుకున్నా. పసిదాని మొఖం చూసేసరికి ఏం చేయాలో తెలిసేది కాదు. బిడ్డ పదినెలల వయసున్నప్పుడు నా మొగుడు మంచాన పడ్డాడు. ఏమైందో తెలియదు... విపరీతమైన జ్వరంతో మూలిగేవాడు. ఉన్న కాసిన్ని డబ్బులతో మందులు కొనిచ్చినా తగ్గలేదు. వారం రోజులు తిరక్కుండానే చచ్చిపోయాడు. మున్సిపాలిటీ వాళ్లు వచ్చి శవాన్ని తీసుకెళ్లారు. ఇల్లు గలవాళ్లు ఇల్లు ఖాళీ చేయమన్నారు. చంటిబిడ్డనెత్తుకొని మా ఊరెళ్లాను. మావాళ్లంతా నన్ను ఛీత్కరించుకున్నారు. చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి వాళ్ల పరువు తీశానని. ‘పట్నంలో ఏ కూలో నాలో చేసుకొని పైసలు తెచ్చిస్తా. నా బిడ్డను చూసుకోమ’ని మావాళ్ల కాళ్లావేళ్లా పడ్డా. ‘మా పిల్లలే మాకు బరువు, ఇంక నీ పిల్లనేం చూస్తాం’ అన్నారు. ఇక చేసేదేమీ లేక బిడ్డనెత్తుకొని పట్నం వచ్చా. నాకు నా బిడ్డ, దానికి నేను... అంతే! మాకెవరూ లేరు. పని కోసం వెతికి వెతికి అలసిపోయా! ఆకలితో బిడ్డనెత్తుకొని రాత్రిపూట ఓ రోడ్డుపక్కగా నిల్చున్నా. ‘వస్తావా!’ అన్న మాటలకు ఉలిక్కిపడ్డ. బతకడానికి, బిడ్డను బతికించుకోవడానికి ఏ పనైనా చేయాల్సిందే! నా మొగుడు పుణ్యమా అని తెలిసిన దారే ఎంచుకున్నా! ఓ చిన్న రూము అద్దెకు తీసుకున్నా. ఏడాది దాటినా బిడ్డ తల నిలపడం లేదు. మాట లేదు, ముచ్చట లేదు. అనుమానం వచ్చి ఆసుపత్రిలో చూపించా. బిడ్డకు మతిస్థిమితం లేదన్నారు. ఎప్పటికీ బాగవదన్నారు. కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. ఏం పాపం చేశానని... కడుపుతో ఉండగా నా మొగుడు తన్నిన తన్నులకు నా బిడ్డ ఇలా పుట్టిందా?! వచ్చీ పోయేవాళ్ల కారణంగా నా బిడ్డ ఇలా పుట్టిందా?! ఎవరిని తప్పు పట్టాలి?! ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయేదాన్ని. బతికినన్నాళ్లూ నా బిడ్డ కడుపుకింత తిండి పెట్టగలిగితే అంతే చాలు అనుకుంటున్నా.. ఇప్పుడు దానికి ఎనిమిదేళ్లు. నన్ను గుర్తుపట్టదు. కాస్త వదిలిపెడితే చాలు దారితెన్నూ లేకుండా వెళ్లిపోతుంది. ఒంటిసోయి తెలియదు. పొద్దంతా ఈ బిడ్డతోనే. చీకటిపడితే.. ఎక్కడో... !! నా భయం అంతా ఒకటే. మతిలేని బిడ్డకు ఒళ్లు గురించి తెలియదు. కానీ, దాని ఒళ్లు పెరుగుతోంది. చూడ్డానికి అందంగా కనిపిస్తోంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఎలా కాపాడుకోవాలి?! ఎన్నాళ్లో ఇలా...!!’’ అంటూ ఏడుస్తూనే చేతులెత్తి కనపడని దేవునికి దణ్నం పెట్టుకుంది. పూర్ణ దుఃఖం ఎవరూ తీర్చలేనిది. కానీ, తోటి సెక్స్‌వర్కర్లు ఆమెను అర్థం చేసుకున్నారు. అండగా ఉంటామని ఆమెను అక్కున చేర్చుకున్నారు. - నిర్మలారెడ్డి, సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి జీవితానికి భరోసా! సెక్స్‌వర్కర్లు తమ భవిష్యత్తు గురించి తాము ఏ మాత్రం ఆలోచించరు. తమను నమ్ముకున్నవారికి విపరీతమైన సేవ చేస్తారు. ముందు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతాం. వీరిలో హెచ్.ఐ.వి. బాధితులు ఉంటారు. వ్యసనాల బారిన పడిన వారుంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ‘మీరు ఎవరి కోసమైతే కష్టపడుతున్నారో వాళ్లకు ముఖ్యంగా మీ పిల్లలకు దూరమైపోతార’ని చెబుతాం. సెక్స్‌వర్కర్లు తమ జీవితం మెరుగ్గా చేసుకునేందుకు కావల్సిన అవగాహన కల్పించడమే మా పని. పదేళ్లుగా 1400 మంది సెక్స్‌వర్కర్లకు వెన్నుదన్నుగా ఉంది మా ఫౌండేషన్. - బి. నారాయణస్వామి, టిఐ-ప్రాజెక్ట్ మేనేజర్, రాంకీ ఫౌండేషన్, హైదరాబాద్ నాదగ్గరే ఉండమ్మా అని ఏడుస్తుంది... నా కూతురు ఇప్పుడు ఏడవ తరగతి చదువుతోంది. బిడ్డ సదువుకు, తిండికయ్యే పైసలన్నీ నేనే ఇస్తా, దానికింత నీడనివ్వండని మా బంధువులకు మొక్కిన. వాళ్లు దయతలిచారు. మొదట్లో సెక్స్‌వర్కర్ గానే ఉన్నా. ఇప్పుడు హోటల్లో పని చేస్తున్నా. ఆరువేల రూపాయల నెల జీతం వస్తది. అవన్నీ నా బిడ్డకోసం పట్టుకెళతా! ఊరి నుంచి వచ్చేటప్పుడు ‘ఇక్కడే ఉండిపొమ్మా’ అని ఏడుస్తది. రొంపిలోంచి బయటపడ్డదాన్ని ఈ రొంపి గురించి నా బిడ్డకు తెల్వకూడదు. అందుకే, ఇంత దూరంలో ఉంటున్న. - మాలిని పిల్లల చదువులకు తప్పని జీవితం... నాకు ఇద్దరు పిల్లలు. నా భర్త నయం కాని జబ్బుతో మంచాన పడ్డాడు. పూట గడవలేని పరిస్థితిలో ఓ వ్యక్తి ఈ రొంపిలోకి దించాడు. ఎప్పటికప్పుడు మానేద్దాం అనుకుంటాను. కానీ, నా బిడ్డ ఇప్పుడు బి.టెక్ చేస్తోంది. కొడుకు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. వాళ్లు బాగా చదువా లంటే పైసలు కావాలి. అందుకే నేనీ పని చేయకతప్పదు. అష్టకష్టాలతోనే ఈ రొంపిలోకి వచ్చిన వాళ్లుంటారు. వారిని కనిపెట్టి, టెస్టులు చేయిస్తా! ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తుంటాను. నాలాంటి వారి మేలు కోసం కృషి చేస్తున్నా! - వసుమతి నియమాలు తప్పనిసరి... మాకు మేం కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం. 18 ఏళ్లు నిండని అమ్మాయిలు ఎవరైనా ఈ రొంపిలోకి వచ్చినట్టుగా గుర్తిస్తే వెంటనే ఫౌండేషన్ నిర్వాహకుల వద్దకు తీసుకురావాలి. అలాగే వారికి కౌన్సెలింగ్ ఇప్పించి మళ్లీ వాళ్ల వాళ్ల దగ్గరకు పంపించేయాలి. అందుకు మేమే తలా కొంత డబ్బు వేసుకుంటాం. ఎన్నో సమస్యల నుంచి తప్పించుకోవడానికి, పరిష్కరించుకోవడానికి ఇప్పుడిప్పుడే మాకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. మా బతుకులు మేం బతకడానికి టైలరింగ్ వంటివి నేర్చుకుంటున్నాం. - ఉష -
చలువ చేసే సబ్జా...
తిండి గోల ఎండాకాలం వస్తే చాలామంది చేసే పని సబ్జాగింజలు నానబెట్టిన నీటిని తాగడం. సబ్జా నీళ్లు తాగితే వేసవి తాపం తగ్గి, వంటికి చలవ చేస్తుందని పెద్దవాళ్లు చెబుతారు. చూడ్దానికి ఆవాలను లేదా తోటకూర విత్తనాలను పోలి ఉండే ఈ సబ్జాగింజలకు ఔషధాలకు రాజువంటిదని పేరు. ఆంగ్లంలో బాసిల్ సీడ్స్ అని పిలుస్తారు. తులసిలో కృష్ణతులసి, లక్ష్మీతులసి, రామ తులసి రకాలున్నట్లుగానే దీనిలో కూడా లెమన్ బాసిల్, కేంఫర్ బాసిల్, పర్పుల్ బాసిల్.. ఇలా ఇంకా చాలా రకాలున్నాయి. తెలుగువారు దీనిని రుద్రజడ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ఐదువేల ఏళ్ల క్రితమే సబ్జాగింజలను ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. అయితే దీని గురించి మన దేశంలోకంటే గ్రీకు కవులు, రచయితల వర్ణనల్లోనే అధికంగా కనిపిస్తుంది. మన వంటల్లో కొత్తిమీర, కరివేపాకు వేసినట్లు ఇటాలియన్లు దీనిని తమ వంటకాలలో సువాసన కోసం వాడతారు. అంతేకాదు; ఇండోనేసియా, థాయ్‌లాండ్, మలేసియా, వియత్నాం, లావోస్, తైవాన్ దేశాల్లో కూడా ఇది ప్రధాన సుగంధ ద్రవ్యం. కొన్ని దేశాల్లో దీనిని హోలీ బాసిల్ పేరుతో మనం తులసి మొక్కను పూజించినట్లు దీనిని ఆరాధిస్తారు. తేలు కుట్టినప్పుడు దీని ఆకులను నలిపి, కట్టు కడితే ఉపశనమం లభిస్తుందంటారు. పూర్వం దీన్ని రాజవైద్యులు తాము తయారు చేసే ఔషధాలలో వాడేవారట. అందుకే దీన్ని ఔషధాలలో రాజుగా కీర్తిస్తారు. ఊబకాయం కలవారు సబ్జాగింజలను నానబెట్టిన నీటిని పడుకోబోయే ముందు తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. కొన్ని రకాల శీతలపానీయాల్లోనూ, ఐస్‌క్రీముల తయారీనూ వీటిని విరివిగా ఉపయోగిస్తారు. -
రోడ్లకు సోలార్ సిమెంట్ వెలుగులు
మెక్సికోః ఇకపై చీకట్లో సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. విద్యుత్ అవసరం లేకుండానే రహదార్లు ప్రకాశవంతం కానున్నాయి. మెక్సికో సైంటిస్టుల సృష్టి.. వాహనదారులకు, ప్రయాణీకులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. సూర్యరశ్మితో తయారయ్యే విద్యుత్ విధానమైన సోలార్ పవర్ ను కరెంటు లేని సమయంలో వినియోగించుకునే విధానంతో రోడ్లను నిర్మించే దిశగా సైంటిస్టులు అడుగులు వేస్తున్నారు. తమ ప్రయత్నాలు ప్రయోగ స్థాయిని అధిగమించి విజయవంతమవ్వడంతో త్వరలో కొత్త రోడ్లను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మెక్సికోలోని మికోకెన్స్ యూనివర్శిటీ ఆఫ్ శాన్ నికోలస్ హిడాల్గో (ఎంఎస్ఎన్ఎస్) కు చెందిన శాస్త్రవేత్తలు.. సోలార్ శక్తితో కూడిన రోడ్లకు రూపకల్పన చేశారు. సోలార్ విద్యుత్తును పీల్చుకోగలిగే సిమెంట్ తో రోడ్లను నిర్మించే విధానాన్ని కనిపెట్టారు. తొమ్మిదేళ్ళ క్రితం ప్రాజెక్టును ప్రారంభించిన సైంటిస్ట్ జోసే రూబియో.. ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ లేకుండా రోడ్లపై కాంతిని ప్రసరింపచేసే కొత్త సిమెంట్ ను కనిపెట్టారు. జీబ్రా క్రాసింగ్స్ లోనూ, రెండు రోడ్లను విభజించేందుకు, డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు ఇప్పటిదాకా రేడియం పదార్థాన్ని, లైట్లను వాడుతుండగా ఇకపై స్వయం ప్రకాశిత సిమెంట్ ను వినియోగించి రోడ్లను కాంతివంతంగా మార్చే పద్ధతికి రూబియో శ్రీకారం చుట్టారు. కొత్తగా కనుగొన్న సిమెంట్ తో రోడ్లు వేయడం వల్ల... అవి పగటి పూట సూర్యరశ్మిని గ్రహించి, రాత్రి సమయంలో సోలార్ విద్యుత్ కాంతులను వెదజల్లుతాయి. ఈ సిమెంట్ తో నిర్మించిన రోడ్లపై ఆకుపచ్చ, నీలం రంగుల్లో కాంతి వెదజల్లుతుంటుంది. దీంతో రోడ్ లైట్స్ లేకుండానే వాహనాలు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు వాడే రేడియం వంటి స్వయం ప్రకాశిత పదార్థాలు కేవలం మూడు నాలుగేళ్ళపాటు మాత్రమే పనిచేసి, ఆ తర్వాత వాటి శక్తిని కోల్పోయే పరిస్థితిలో... ఈ స్వయం ప్రకాశిత సిమెంట్ మాత్రం... వందల ఏళ్ళైనా తన కాంతిని కోల్పోదు. అయితే రోడ్లకు ఈ సిమెంట్ వాడితే దానిపై పడే దుమ్ము, ధూళి వల్ల కాంతిని కోల్పోతాయన్న అనుమానాలను చాలామంది వ్యక్తం చేశారని, సమస్యను అధిగమించేందుకు సిమెంట్ లో క్రిస్టల్స్ ను కూడ వినియోగించినట్లు రూబియో తెలిపారు. కొత్తరకం సిమెంట్ తో నిర్మించిన ఈ రోడ్లు ఒకరోజు మొత్తం సూర్యరశ్మిని గ్రహిస్తే దాదాపుగా వాటికి అందిన సోలార్ శక్తితో 12 గంటలపాటు ప్రకాశించగల్గుతాయి. అంతేకాక పర్యావరణ అనుకూలంగా ఉండటంతోపాటు, భూమికి సైతం ఎటువంటి ఇబ్బంది కలగదని, రోడ్ల నిర్మాణంపై ప్రయోగాలు పూర్తిచేసిన శాస్త్రవేత్తల బృందం పేటెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. పేటెంట్ పొందిన వెంటనే తమ ప్రాజెక్టుద్వారా రోడ్ల అభివృద్ధిని ప్రారంభిస్తామని రూబియో వెల్లడించారు. -
చాక్లెట్ తింటే మధుమేహం దూరం!
లండన్ః రోజూ వంద గ్రాముల చాక్లెట్ తిని మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చంటున్నారు తాజా అధ్యయనకారులు. త్వరలో డాక్టర్లు కూడ ఇదో వైద్యంగా సలహా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. డార్క్ చాక్లెట్ తీసుకోవడం ద్వారా ముధుమేహాన్ని నియంత్రించ వచ్చని లండన్ లోని వార్విక్ యూనివర్శిటీ జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. చాక్లెట్ లో ఉండే పదార్థాలు ఇన్సులిన్ లెవెల్స్ ను నియంత్రిస్తాయని తద్వారా గుండె జబ్బులు కూడ వచ్చే అవకాశం తగ్గుతుందని చెప్తున్నారు. వార్విక్ విశ్వవిద్యాలయం అధ్యయనకారులు 18 నుంచి 69 ఏళ్ళ మధ్య వయసుగల 1153 మందిపై నిర్వహించిన పరిశోధనల్లో తాజా విషయాలు వెలుగులోకి వచ్చాయి. చక్కెర వ్యాధి గ్రస్థులు ప్రతిరోజూ వంద గ్రాముల డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణకు సహకరించడంతోపాటు ఇతర హృద్రోగ సమస్యలు కూడ చాలావరకూ తగ్గే అవకాశం ఉందని లక్సెంబర్గ్ పరిశోధనల్లో తెలుసుకున్నారు. డార్క్ చాక్లెట్ తయారీకి వినియోగించే కోకోలో మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ప్రతిరోజూ 100 గ్రాముల చాక్లెట్ ను తీసుకోవడం వల్ల లివర్ లోని ఎంజైములు అభివృద్ధి చెంది, ఇన్సులిన్ ను నియంత్రించేందుకు తోడ్పడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే ఈ చాక్లెట్ ను ప్రతిరోజూ తీసుకునేవారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని, రోజుకు 28.8 గ్రాముల చొప్పున ప్రతిరోజూ తీసుకునే వారిలో చురుకుదనం పెరిగి ఉత్సాహంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలినట్లు చెప్తున్నారు. అంతేకాక కోకో ఉన్న ఉత్పత్తులను తరచుగా తీసుకోవడం వల్ల కూడ గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చని, ఇది గుండె మెటబాలిక్ కండిషన్ ను మెరుగు పరుస్తుందని వార్విక్ మెడికల్ స్కూల్ పరిశోధకుల సెవేరియో స్టేంజెస్ తెలిపారు. పరిశోధనా వివరాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించారు. -
జాతీయాలు
బ్రహ్మాండం! ఒక ఆలోచన గురించో, వస్తువు గురించో ప్రశంసాపూర్వకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు- ‘బ్రహ్మాండంగా ఉంది’ అనడం చూస్తుంటాం. ఇంతకీ ఈ ‘బ్రహ్మాండం’ ఏమిటి? సృష్టికర్త బ్రహ్మ భూగోళాన్ని, ఇతర గోళాలను గుడ్డు(అండం) ఆకారంలో తయారుచేశాడని నమ్ముతారు. భూగోళాన్ని, ఇతర గోళాలను కలిపి ‘బ్రహ్మాండం’ అంటారు. పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినా, పెద్ద పెద్ద రాక్షసులు గట్టిగా అరిచినా... ఇంకేమైనా పెద్ద ఘటనలు జరిగినా బ్రహ్మాండ భాండం(కుండ) బద్దలవుతుంది అంటారు. స్థూలంగా చెప్పుకోవాలంటే ‘బ్రహ్మాండం’ అంటే ‘చాలా పెద్దది’ అని అర్థం. అందువల్ల పెద్ద పనులు, వస్తువుల విషయంలో ఈ మాటను వాడేవారు. అయితే కాలక్రమంలో అద్భుతమైన, అసాధారణ విషయాలు, విజయాల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ‘బ్రహ్మాండంగా ఉంది’ అనడం మొదలైంది. దంపతి కలహం! ‘వాళ్ల పోట్లాట చూసి కంగారు పడకు. అది దంపతి కలహం’ ‘దంపతులన్నాక కలహం మామూలే కదా. పెద్దగా పట్టించుకోవాల్సిన కలహం కాదు... దంపతి కలహం అనే మాట ఉండనే ఉంది కదా’... ఇలాంటి మాటలు వింటుంటాం. దంపతి అంటే భార్యాభర్తలు.కలహం అంటే తగాదా. దాంపత్యంలో ప్రేమానురాగాలు ఎంత సహజమో, తగాదాలు కూడా అంతే సహజం. కొందరు దంపతులు తీవ్రంగా తగాదా పడతారు. ఆ తరువాత కాసేపటికే మామూలై పోయి నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. భార్యభర్తలు తగాదా పడుతున్నప్పుడు మధ్యలో వెళ్లినవారిని- ‘అది భార్యభర్తల తగాదా. ఇప్పుడే తిట్టుకుంటారు. ఇప్పుడే కలుసుంటారు. మధ్యలో నువ్వెళ్లడం దేనికి?’ అనే మాట కూడా వింటుంటాం. భార్యభర్తల మధ్య తగాద అనేది తాటాకు మంటలాంటిదని, అది శాశ్వతమైన శత్రుత్వం కాదు అని చెప్పడానికే ‘దంపతి కలహం’ అనే మాట వాడతారు. చీకటిని నెత్తినేసుకొని... సూర్యుడింకా ఉదయించక ముందే, చాలా పొద్దున్నే బయటికి వెళ్లినప్పుడు ఉపయోగించే జాతీయం ఇది. ‘ఏమాత్రం ఆలస్యం చేయకుండా చీకటిని నెత్తినేసుకొని వెళ్లాడు’ అంటారు. తెల్లవారుజామున చీకటి చీకటిగానే ఉంటుంది. బయటికి వెళ్లేటప్పుడు తలకు రుమాలు కట్టుకొని వెళుతుంటారు. అలా చీకటిని తల మీద వేసుకొని బయటికి వెళుతున్నాడు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. నాథుడు! ‘ఈ రోడ్డును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు’ ‘నగరంలో ఎటు చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి. పట్టించుకునే నాథుడే లేడు’లాంటి మాటలను తరచుగా వింటుంటాం. నాథుడు అనే పదానికి ‘భర్త’ ‘రాజు’ అనే అర్థాలు ఉన్నాయి. అయితే వ్యవహారికంలో మాత్రం వేరే అర్థాలు ఏర్పడ్డాయి. ‘ఆధారం’ ‘పెద్దదిక్కు’ ‘బాగోగులు చూసేవాడు’ మొదలైన అర్థాలతో ఇప్పుడు ‘నాథుడు’ను వాడుతున్నారు.