స్మార్ట్‌ఫోన్‌తో అంధత్వం !
లండన్: స్మార్ట్‌ఫోన్లు పక్కన పెట్టుకుని పడుకునే వారికి హెచ్చరిక. చీకట్లో స్మార్ట్‌ఫోన్‌ను తదేకంగా చూసిన ఇద్దరు మిహళల్లో తాత్కాలిక ఒంటికన్ను అంధత్వాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరిద్దరు నిద్రలేచి కూర్చోవడానికి ముందు తమ స్మార్ట్‌ఫోన్‌లో వార్తలు చెక్ చేసేవారు. మంచంలోనే ఉండటం వల్ల వారు ఒక కన్నునే తెరిచేవారని లండన్‌లోని మూర్‌ఫీల్డ్ కంటి ఆసుపత్రి వైద్యుడు ఒమర్ మహ్రూ తెలిపారు. దీంతో ఒక రెటీనా వెలుతురుకు, మరొకటి చీకటికి అలవాటుపడ్డాయని వివరించారు.