retina
-
మానవ నిర్మిత రెటీనా త్వరలోనే సాధ్యం కానుందా?! మృతకణాల స్థానంలో..
కంటి చూపుకు రెటీనా తెర ఆరోగ్యంగా ఉండటం ఎంత అవసరమో తెలిసిందే. వయసు పెరగడంతో వచ్చే కొన్ని కంటి సమస్యలతో రెటీనా దెబ్బతిని చాలామంది కనుచూపు కోల్పోవడం పరిపాటి. అయితే చాలా తొందర్లోనే మానవులకు ‘ల్యాబ్’లో నిర్మించిన రెటీనా సాకారం కానుందా? దాన్ని మనుషుల్లో ప్రయోగించి చూశాక... అది విజయవంతమైతే... త్వరలోనే చూపు లేని ఎంతో మందికి చూడటం సాధ్యపడనుందా? అవుననే అంటున్నారు యూఎస్ఏలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిస్–మేడిసన్‌కు చెందిన పరిశోధకులు. ఆ వివరాలేమిటో చూద్దాం. కాంతి వల్ల కంటి వెనక ఉండే పలుచని పొర అయిన ‘రెటీనా’ వల్లనే దృష్టిజ్ఞానం కలుగుతుందన్న విషయం తెలిసిందే. ప్రమాదాల్లో రెటీనా ఊడిపోవడం, వయసు పెరుగుతున్న కొద్దీ కంటి జబ్బుల కారణంగా రెటీనా బలహీనపడి చూపు మందగించడం... ఇలాంటి కారణాలతో చాలా మంది అంధత్వానికి లోనవుతున్నారు. వీళ్లందరికీ దృష్టిజ్ఞానం ఇవ్వడం కోసం చాలా పరిశోధనలే చోటు చేసుకుంటున్నాయి. అందునా పరిశోధనశాల (ల్యాబ్)లో రెటీనాను రూపొందించడానికీ అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొందరు శాస్త్రవేత్తలు ‘ఆర్గనాయిడ్స్’ అనే తరహా కణాలను 2014లోనే రూపొందించారు. ఇవి అచ్చం రెటీనా పనే చేస్తాయి. అంటే తమపై ‘3–డి’ ఇమేజ్ను ప్రతిబింబించేలా చేయగల కణాల సమూహాలివి. మనిషి చర్మం నుంచి ‘మూలకణాల్లాంటి (స్టెమ్సెల్స్లాంటి) వాటిని సేకరించడంతో ఈ ప్రయత్నం సాకారమైంది. అటు తర్వాత మరో అడుగు ముందుకేసి రకరకాల రెటీనాలను రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మృతకణాల స్థానంలో పై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల బృందాలే.. ల్యాబ్‌లో రూపొందించిన రెటీనా కణాలు వివిధ వేవ్లెంత్ గల కాంతి కిరణాలకు స్పందిస్తున్నాయనీ, అవి పొరుగున ఉన్న ఇతర కణాలతోనూ అనుసంధానమవుతున్నాయంటూ గతేడాది (2022)లో నిరూపించగలిగారు. ‘‘మేము ఆర్గనాయిడ్స్ నుంచి కొన్ని కణాలను సేకరించి, వాటిని రకరకాల జబ్బుల కారణంగా దెబ్బతిన్న రెటీనాలోని మృతకణాల స్థానంలో అమర్చాడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ఇదే మాముందున్న సవాలు’’ అంటున్నారు ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న ఆఫ్తాల్మాలజిస్టు డాక్టర్ డేవిడ్ గామ్. తమ ముందున్న ప్రతిబింబాన్ని తీసుకున్న ఆ కణాలు యాగ్జాన్స్ అనే పురికొసలాంటి కణాల ద్వారా... వెనక ఉన్న ‘సైనాప్స్’ అనే ఓ సిగ్నల్ బాక్స్ లాంటి దాన్నుంచి వెలువడాలి. ఆ సమాచారాన్ని ఎట్టకేలకు మెదడుకు చేరవేయాలి. కణాల్లోంచి వేరు చేసి అమర్చాక కూడా అవి రెటీనా నుంచి బయల్దేరి యాగ్జాన్స్ ద్వారా మెదడు కేంద్రం వరకు చక్కగా అనుసంధానితమవుతూనే (రి–కనెక్ట్ అవుతూనే) ఉండాలి. ఈ మధ్యలో ఎక్కడా సిగ్నల్స్‌ను కోల్పోకూడదు. అప్పుడే ‘చూడటం’ అనే ప్రక్రియ (విజన్ ప్రాసెస్) పూర్తవుతుంది. ‘రేబీస్ వైరస్’ను అంటించి శాస్త్రవేత్తలు ఇక్కడో విచిత్రాన్ని చేసి చూశారు. ఎక్కడా సిగ్నల్స్ కోల్పోని విధంగా అంతటా అనుసంధానం చక్కగా జరుగుతోందా, లేదా అనే విషయాన్ని పరిశీలించడం కోసం ఈ రెటీనా కణాలకు కావాలనే ‘రేబీస్ వైరస్’ను అంటించారు. ఇది న్యూరోవైరస్ కావడం వల్ల దీన్ని ఎంచుకుని, వారం రోజుల వ్యవధిలో ఈ వైరస్ చివరి కణం వరకూ చేరిందంటే అన్ని కణాలూ చక్కగా అంటుకుని, అనుసంధానితమై ఉన్నాయని అర్థం. ‘‘ల్యాబ్‌లో కొనసాగిన ఈ ఫలితాలన్నీ పరిశోధనశాల వరకైతే చక్కగానే ఉన్నాయి. ఇక చివరి టాస్క్ ఏదైనా ఉందంటే... అది మానవులపై పరిశోధనలు (హ్యూమన్ ట్రయల్స్) సాగించడమే. ఈ కణాల అమరిక బాగా జరిగి అవి రెటినాలోని కణాలుగా మనగలుగుతూ, రెటినల్ గ్యాంగ్లియాన్ సైనాప్సెస్ అమరికతో మనకు దృష్టిజ్ఞానాన్నిచ్చే ‘ఆప్టిక్ నర్వ్’తో చక్కగా అనుసంధానమైతే చాలు! అదే జరిగితే రెటినైటిస్ పిగ్మెంటోజా, ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్, గ్లకోమా వంటి అనేక జబ్బుల కారణంగా చూపుకోల్పోయిన / చూపు మందగించిన వారికి చూపును ఇవ్వగలిగే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అంటూ ఎంతోమందిలో ఓ ఆశాభావాన్ని రేకెత్తేంచే చల్లటి కబురు చెబుతున్నారు ఆఫ్తాల్మాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ గామ్. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘పీఎన్ఏఎస్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరంటే..? షాకింగ్ విషయాలు Health Tips: రోజుకు కప్పు బూడిద గుమ్మడి రసం తాగడం, గుప్పెడు శనగలు నానబెట్టి తింటే -
మీరు డయాబెటికా?
అదుపులో లేకుండా ఉండే చక్కెరవ్యాధి అన్ని అవయవాలతో పాటు కంటిని కూడా దెబ్బతీస్తుందన్న విషయం తెలిసిందే కదా. ఇలా డయాబెటిస్ కారణంగా కంటికి కూడా పలు సమస్యలు వస్తాయి. వాటిలో ముఖ్యమైనది ‘డయాబెటిక్ రెటినోపతి’. మిగతా ఏదైనా అవయవానికి లోపం వస్తే కొద్దో గొప్పో సమస్యను మేనేజ్ చేయవచ్చేమోగానీ... కంటికి వచ్చే సమస్యలతో అంతా అంధకారమైపోతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు అన్ని అవయవాల విషయంలోనూ జాగ్రత్తగా ఉన్నప్పటికీ ... కంటి విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలన్న విషయం గుర్తుంచుకోవాలి. షుగర్వ్యాధి ఉన్న ప్రతివారూ తమ రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచుకోవడం ఎంతముఖ్యమో... డయాబెటిక్ రెటినోపతిపై అవగాహన పెంచుకోవడమూ అంతే ప్రధానం. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. డయాబెటిక్ రెటినోపతి అంటే ఏమిటో తెలుసుకునే ముందుగా... అసలు మనకు చూడటం అన్న ప్రక్రియ ఎలా సాధ్యమవుతుందో అర్థం చేసుకుందాం. మన కంటి వెనక భాగంలో రెటీనా అనే తెర ఉంటుంది. మనకు కనిపించే దృశ్యం దీనిపై తలకిందులుగా పడుతుంది. అక్కడి నుంచి ఆ ఇమేజ్ మెదడుకు చేరడం వల్ల మనకు చూడటం అనే ప్రక్రియ సాధ్యమవుతుంది. కంటికి వెనక ఉన్న రెటినా తెరకు అత్యంత సన్నటి రక్తనాళాల (క్యాపిల్లరీస్) ద్వారా రక్తం సరఫరా అవుతుంటుంది. డయాబెటిస్ నియంత్రణ లేనివారిలో ఈ క్యాపిల్లరీస్ ఉబ్బడం జరుగుతుంది. దీన్నే మైక్రో అన్యురిజమ్ అంటారు. కొందరిలో క్యాపిలరీస్ మూసుకుపోతాయి. క్యాపిలరీస్ మూసుకుపోయినప్పుడు రెటినాకు కావాల్సిన పోషకాలు, ఆక్సిజన్ అందవు. అప్పుడు రెటీనా సరిగా పనిచేయదు. మైక్రో అన్యురిజమ్స్ లీక్ అయినప్పుడు ఎగ్జుడేట్స్ అనే పదార్థం రెటినాలో పేరుకుపోతుంది. దీనివల్ల రెటినా ఉబ్బతుంది. ప్రధానంగా మాక్యులా అనే మధ్యభాగంలో ఈ ఉబ్బు ఎక్కువగా ఉంటుంది. దీన్నే డయాబెటిక్ మాక్యులార్ ఎడిమా అంటారు. రక్తనాళాలు మూసుకుపోయినవారిలో అసాధారణమైన అవాంఛిత కొత్తరక్తనాళాలు పెరుగుతాయి. ఈ కొత్త రక్తనాళాల నుంచి మాటిమాటికీ రక్తస్రావం జరుగుతుంటుంది. ఈ రక్తం రెటినాలోనూ, విట్రియస్ అనే జెల్‌లోనూ స్రవిస్తుంది. దీనివల్ల అకస్మాత్తుగా చూపు తగ్గిపోతుంది. ఈ రక్తస్రావం రెటినాలోగానీ, విట్రియస్‌లో గానీ కొంతకాలం అలాగే ఉంటే రెటినా ఊడే ప్రమాదం ఉంది. దీన్నే ‘రెటినల్ డిటాచ్మెంట్’ అంటారు. క్రమేణా ఈ కొత్తరక్తనాళాలు కంటి ముందుభాగానికి (యాంగిల్ ఆఫ్ ది యాంటీరియర్ ఛేంబర్) వచ్చినప్పుడు నియోవాస్కులార్ గ్లకోమా అనే ప్రమాదకరమైన గ్లకోమా వస్తుంది. రెటినల్ డిటాచ్మెంట్ వల్లగానీ లేదా గ్లకోమా వల్లగానీ చాలామంది తమ చూపును పూర్తిగా కోల్పోతారు. అయితే డయాబెటిక్ రెటినోపతి లక్షణాలు మొదటి దశలో కనిపించవు. ఇలాంటి అసాధారణ, అవాంఛిత రక్తనాళాల నుంచి రక్తస్రావం అయి, అది కంటిలోని విట్రియస్ అనే జెల్లీలోకి స్రవించినప్పుడు ఈ కండిషన్‌ను తొలిసారి గుర్తించడం సాధ్యమవుతుంది. తర్వాత కంటి ముందు నల్లటి చుక్కలు తేలుకుంటూ పోతున్నట్లుగా, అల్లుకుపోతున్నట్లుగా కనిపిస్తుంటాయి. ఆ తర్వాత మెల్లమెల్లగాగానీ లేదా ఒక్కోసారి అకస్మాత్తుగా గాని కంటిచూపు పోవచ్చు. డయాబెటిస్ ఉంటే తరచూ కంటి పరీక్ష తప్పదు... పైన పేర్కొన్న పరిస్థితులను నివారించుకోవడం కోసం డయాబెటిస్ ఉన్నవారు కనీసం ఆర్నెల్లకొకసారి అయినా లేదా కంటి వైద్యుడు సూచించిన ప్రకారం కంటి పరీక్షలు చేయించుకోవాలి. మనం పైన చెప్పుకున్న అవాంఛిత పరిణామాలను తొలిదశలోనే గుర్తించి, తగిన చికిత్స చేస్తే చూపు కోల్పోయే ప్రమాదం ఉండదు. సాధారణంగా రెటినోపతి సమస్య ఉన్నవారికి ఫండస్ ఫొటో, ఓసీటీ పరీక్ష, ఫ్లోరెసిన్ యాంజియోగ్రఫీ అనే పరీక్షలు చేసి, రెటినోపతి ఏ దశలో ఉందో నిర్ధారణ చేస్తారు. ఫండస్ ఫొటో ద్వారా స్టేజ్‌తో పాటు... మొదటిసారి పరీక్షించినప్పుడూ, ఆ తర్వాతి విజిట్స్లోనూ తేడాలు గమనిస్తారు. ఓసీటీ పరీక్షలో రెటినా ఎంతగా మందం అయ్యింది అనే విషయం తెలుస్తుంది. యాంజియోగ్రఫీలో కొత్తరక్తనాళాలు, రెటినాలో జరిగే రక్తసరఫరా (రెటినల్ సర్క్యులేషన్) గమనిస్తారు. డయాబెటిస్ ఉన్నవారు ఎవరైనా సరే... కనీసం ఆర్నెల్లకోసారి లేదా తమ కంటిడాక్టరు సూచించిన వ్యవధుల్లో తరచూ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలతో చూపును జీవితాంతం పదిలంగా కాపాడుకోవడం సాధ్యమవుతుందని గుర్తుంచుకోవాలి. చికిత్స డయాబెటిక్ రెటినోపతిలో కంటికి జరిగిన నష్టాన్ని బట్టి అనేక రకాల చికిత్సలు చేయాల్సిరావచ్చు. ఉదాహరణకు లేజర్ ఫొటో కోయాగ్యులేషన్ అనే ప్రక్రియ ద్వారా లీకేజీలను అరికడతారు. ఇది గోల్డ్‌స్టాండర్డ్ చికిత్స. ఈ ప్రక్రియలో అసాధారణంగా, అవాంఛితంగా పెరిగిన రక్తనాళాలనూ తగ్గిస్తారు. మ్యాక్యులార్ ఎడిమా ఉన్నవారికి యాంటీవెజ్ ఇంజెక్షన్ల ద్వారా రెటినా వాపును తగ్గిస్తారు. అడ్వాన్స్డ్ రెటినోపతి ఉన్నవారికి, విట్రియస్ హేమరేజీతో పాటు రెటినల్ డిటాచ్మెంట్ ఉన్నవారికి మైక్రో విట్రియో రెటినల్ సర్జరీ నిర్వహిస్తారు. డాక్టర్ రవికుమార్ రెడ్డి కంటి వైద్య నిపుణులు -
ఎల్ఈడీ బల్బులు వాడితే ప్రమాదమే!
పారిస్ : విద్యుత్ ఆదా, డబ్బు పొదుపు అవుతుందనే ఉద్ధేశ్యంతో ప్రపంచం మొత్తం ఎల్ఈడీ బల్బుల బాట పట్టింది. అయితే ఎల్ఈడీ బల్బుల వాడకం వల్ల కంటిలోని రెటీనా శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉందని ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. ఫ్రాన్స్‌కు చెందిన ‘ఫ్రెంచ్ ఏజెన్సీ ఫర్ ఫుడ్, ఎన్విరాన్మెంట్ అండ్ ఆక్కూపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ(ఏఎన్ఎస్ఈఎస్)’ జరిపిన పరిశోధనలో ఎల్ఈడీ బల్బులు కంటిచూపును దెబ్బతీస్తాయని తేలింది. సంప్రదాయబద్ధంగా వాడుతున్న సోడియం బల్బులకన్నా కూడా ఎల్ఈడీ బల్బులు మన ఆరోగ్యానికి ఎక్కువ హాని చేస్తున్నట్లు వెల్లడైంది. ఎల్ఈడీ బల్బులు ఫోటో టాక్సిక్ అని ఏఎన్ఎస్ఈఎస్ పేర్కొంది. రెటీనాలోపలి కణాలను దెబ్బతీసి కంటిచూపును కోల్పోయేలా చేస్తుందని తెలిపింది. ఎల్ఈడీ బల్బుల నుంచి వెలువడే బ్లూలైట్(నీలికాంతి) ఎక్కువస్థాయిలో ఉండటం వల్ల అది కంటిచూపును దెబ్బతీస్తుందని వెల్లడించింది. ఈ బల్బుల వాడకాన్ని వీలైనంత తగ్గించుకోవాలని సూచించింది. వెలుగుతున్న ఎల్ఈడీ బల్బులను నేరుగా చూడటం చేయకూడదని, రాత్రి నిద్రపోయే సమయంలో బల్బులను ఆఫ్ చేసి పడుకోవాలని పేర్కొంది. మొబైల్ ఫోన్స్, లాప్టాప్స్, ట్యాబ్లెట్లనుంచి వెలువడే నీలికాంతి కంటే ఎల్ఈడీ బల్బుల నుంచి వెలువడే కాంతి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. -
వెల్డింగ్ చేస్తాను. కంటికి రక్షణ ఎలా?
ఐ కౌన్సెలింగ్ నా వయుస్సు 25 ఏళ్లు. నా చిన్నతనంలో 6, 7 ఏళ్ల వయుసప్పుడు తల వెనుకభాగాన 2,3 సార్లు రారుు తగిలి తీవ్ర రక్తస్రావం అరుు్యంది. ఒక్కోసారి తల బరువుగానూ, దివుు్మగానూ ఉంటుంది. తల గట్టిగా పట్టేసినట్లు ఉంటుంది. చిన్నప్పటి నుంచి కళ్లు నీళ్లు కారుతూ ఉంటారుు. డాక్టర్ గారిని సంప్రదిస్తే విటమిన్-ఏ లోపం వల్ల ఇలా అవుతోంది, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవున్నారు. కానీ నీళ్లు కారుతూనే ఉన్నారుు. నేను వెల్డింగ్ చేస్తాను. దీని వల్ల ఏదైనా కళ్ల సవుస్యలు వస్తాయూ? కళ్ల నుంచి నీరు కారడం తగ్గాలంటే నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? - రమేశ్, ఏలూరు మీకు తల దివుు్మగా బరువుగా ఉన్నట్లు ఉండటానికీ మీ చిన్నప్పటి దెబ్బ కారణం కావచ్చు, కాకపోవచ్చు కూడా. అరుుతే ఆ విషయూన్ని నిర్ధరించడానికి మీరు న్యూరో ఫిజీషియున్ను కలవండి. మీరు వెల్డింగ్ చేసే వృత్తిలో ఉన్నారు కాబట్టి మీరు చేసే పని వల్ల కలిగే వృత్తిపరమైన సవుస్య (ప్రొఫెషనల్ హజార్డ్) ప్రభావం కంటిపైన కూడా పడవచ్చు. వెల్డింగ్ వల్ల ప్రధానంగా వుూడు రకాల సవుస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒకటి... కంటి పైభాగం కార్నియూలో పైపొర అరుగుదల (ఎపిథీలియుల్ ఎరోజన్). ఎపిథీలియుల్ ఎరోజన్ లక్షణాలు... వెలుగు చూడలేకపోవడం, నీళ్లు కారడం, ఎరుపెక్కడం, కన్ను నొప్పిగా ఉండటం వంటివి. రెండోది... వెల్డింగ్ సవుయుంలో నేరుగా ఆ లైట్‌కు ఎక్స్పోజ్ అవుతున్నందువల్ల రెటీనాలో బర్న్స్ రావచ్చు. ఇందువల్ల కంటిచూపు వుందగించడం, కొంతవుందిలో చూపు పూర్తిగా తగ్గిపోవడం కూడా జరిగేందుకు ఆస్కారం ఉంది. వుూడోది... కొందరిలో క్యాటరాక్ట్ సవుస్యలు రావచ్చు. చూపు వుందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే క్యాటరాక్ట్ ఉందేమో అని అనువూనించాలి. అందుకే... వెల్డింగ్ చేసేవాళ్లు తప్పనిసరిగా ఫిల్టరింగ్ గ్లాస్ ఉపయోగించాలి. అది అడ్డుగా పెట్టుకునే అద్దంలాగా ఉంటుంది. కావాలంటే కళ్లజోడులో కూడా ఈ ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు. ఈ ఫిల్టర్స్ అల్ట్రా వయొలెట్, ఇన్ఫ్రా రెడ్ కిరణాల నుంచి కంటికి రక్షణ కల్పిస్తారుు. పై లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే కంటి డాక్టర్‌కు చూపించాల్సిన అవసరం ఉంది. వెంటనే కంటి డాక్టర్‌ను సంప్రతించండి. డాక్టర్ రవికుమార్ రెడ్డి కంటి వైద్య నిపుణులు, మెడివిజన్ ఐ హాస్పిటల్, హైదరాబాద్ గుండెపోటును గుర్తించండిలా! కార్డియాలజీ కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 48 ఏళ్లు. ఈ మధ్య అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. మా నాన్నగారికి ఇదివరకు ఎలాంటి గుండెజబ్బులూ లేవు. ఇలా ఎందుకు జరిగింది? ఎవరిలో గుండెపోటు ఎక్కువగా వస్తుంది. ముప్పు ఉన్నప్పుడు దాన్ని ముందుగానే తెలుసుకోవడం ఎలా? - వాసు, నిజామాబాద్ మీరు చెప్పినదాన్ని బట్టి నాన్నగారికి వచ్చిన దాన్ని సడన్ కార్డియాక్ డెత్, లేదా సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. అప్పటివరకు చురుకుగా పనిచేసిన మనిషి... హఠాత్తుగా గుండెపట్టుకుని విలవిలలాడుతూ పడిపోవడం ఆగమేఘాల మీద ఆసుపత్రికి తరలించే లోపే మనకు దక్కకుండా పోవడం వంటివి సడెన్ కార్డియాక్ అరెస్ట్ జరిగిన వారిలో కనిపిస్తాయి. ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది? గతంలో ఒకసారి గుండెపోటు బారిన పడ్డవారు గుండె కండరం బలహీనంగా ఉన్నవారు కుటుంబంలో హఠాన్మరణం చరిత్ర ఉన్నవారు కుటుంబంలో గుండె విద్యుత్ సమస్యలు ఉన్నవారు గుండె లయ అస్తవ్యస్తంగా ఉన్నవారు. పైన పేర్కొన్న వారితో పాటు ఇప్పటికే గుండెజబ్బు తీవ్రంగా ఉన్నవారిలో కూడా అకస్మాత్తుగా మరణం సంభవించవచ్చు. ముప్పు ఉన్నా... రక్షించే మార్గమూ ఉంది... క్షణాల్లో మనిషిని మృత్యుముఖానికి తీసుకెళ్లిపోయే సమస్య ఇది. అయితే ఎవరికైనా గుండెపోటు వస్తున్న ఘడియల్లో తక్షణం స్పందించి వారిని వేగంగా హాస్పిటల్‌కు తీసుకెళ్లగలిగితే వారిని రక్షించే అవకాశాలూ ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ హార్ట్ ఎటాక్ పై అవగాహన కలిగి ఉంటే మృత్యుముఖంలోకి వెళ్లిన మనిషిని కూడా తిరిగి బతికించే అవకాశాలుంటాయి. అందుకే దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహనను పెంచుకోవాలి. గుండెపోటును గుర్తుపట్టడం ఎలా? ఎవరైనా హఠాత్తుగా ఛాతీలో అసౌకర్యంతో కుప్పకూలిపోతుంటే... వెంటనే వాళ్లు స్పృహలో ఉన్నారా, శ్వాస తీసుకుంటున్నారా లేదా అన్న అంశాలను చూడాలి. అవసరాన్ని బట్టి గుండె స్పందనలను పునరుద్ధరించే ప్రథమ చికిత్స (కార్డియో పల్మనరీ రిససియేషన్- సీపీఆర్) చేయాలి. సీపీఆర్ వల్ల కీలక ఘడియల్లో ప్రాణం పోసినట్లు అవుతుంది. చాలా దేశాల్లో సీపీఆర్‌పై శిక్షణ ఉంటుంది. గుండె స్పందనలు ఆగిన వ్యక్తికి సీపీఆర్ ఇచ్చి ఆంబులెన్స్ వచ్చే వరకు రక్షించగలిగితే దాదాపు కోల్పోయిన జీవితాన్ని నిలబెట్టినట్లవుతుంది. అందుకే సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వడం, ఆ ప్రక్రియపై అవగాహన కలిగించాలి. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్ సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. పైల్స్... తగ్గుతాయా? హోమియో కౌన్సెలింగ్ నా వయసు 49 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా వస్తోంది. మల విసర్జన సమయంలో రక్తం పడుతోంది. అప్పుడప్పుడు సూదితో గుచ్చినట్లుగా నొప్పి వస్తోంది ఉంది. కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్‌ను కలిస్తే పైల్స్ అన్నారు. హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? - చిన్నారెడ్డి, ఆదిలాబాద్ ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తున్న సమస్యలలో ఇది ఒకటి. మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి, మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి. మొలల దశలు: గ్రేడ్-1 దశలో మొలలు పైకి కనిపించవు. నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది. గ్రేడ్-2లో రక్తం పడవచ్చు, పడకపోవచ్చు కానీ మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి. వాటంతట అవే లోపలకు వెళ్లిపోతుంటాయి. గ్రేడ్-3లో మల విసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి. కానీ మల విసర్జన తర్వాత వాటంతట అవి లోపలికి పోకుండా వేలితో నెడితే లోనికి వెళ్తాయి. గ్రేడ్-4 దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు. కారణాలు: మలబద్ధకం మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండరబంధనం సాగిపోతుంది. తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం స్థూలకాయం (ఒబేసిటీ) చాలాసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువ మలబద్ధకం మాత్రమే గాక అతిగా విరేచనాలు కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు మంచి పోషకాహారం తీసుకోకపోవడం నీరు తక్కువగా తాగడం ఎక్కువగా ప్రయాణాలు చేయడం అధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లుగా నొప్పి మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం నివారణ: మలబద్ధకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం సమయానికి భోజనం చేయడం ముఖ్యం ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం కొబ్బరినీళ్లు నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తక్కువగా తీసుకోవడం మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటివి పైల్స్ నివారణకు తోడ్పడే కొన్ని జాగ్రత్తలు. హోమియోపతిలో రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఇచ్చే మందులు ఇచ్చి, వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. -
లేజర్ పాయింటర్‌తో పిల్లల కళ్లకు కీడు
హెల్త్ ల్యాబ్ లేజర్ పాయింటర్‌తో పిల్లల కళ్లకు కీడు గోడమీద ఎర్రగా ఫోకస్‌లా పడుతుండే ‘లేజర్ పాయింటర్’తో పిల్లలు ఆడుకుంటూ ఉండటం తరచూ చూస్తుంటాం. సాధారణంగా మీటింగ్స్‌లో ఏదైనా విషయాన్ని వివరించేందుకు దీన్ని ఒక ‘పాయింటర్’ను ఉపయోగిస్తుంటారు. సాధారణంగా ఇది అంత కీడు చేయదని అందరిలోనూ ఒక భావన. అయితే ఈ ‘లేజర్ పాయింటర్’ పిల్లల చూపును దెబ్బతీయవచ్చని ఇటీవల కొన్ని కేసుల అధ్యయనం తర్వాత తెలిసింది. ఈ పాయింటర్ నుంచి వచ్చే కాంతి రెటీనాను దెబ్బతీస్తుందని అమెరికాలోని మిన్నెయాపోలిస్కు చెందిన కంటివైద్య నిపుణుడు డాక్టర్ డేవిడ్ అల్మెడియా పేర్కొన్నారు. గతంలో పదిలక్షల మందిలో ఒకరిలో మాత్రమే లేజర్ పాయింటర్ వల్ల కలిగే దుష్ర్పభావాలు కనిపిస్తాయని అనుకునేవారు. అయితే ఇటీవల ఒక అధ్యయనంలో వీరి సంఖ్య చాలా ఎక్కువని తేలింది. గతంలో లేజర్ పాయింటర్ నుంచి వచ్చే కాంతి 1 నుంచి 5 మిల్లీవాట్లు మాత్రమే ఉంటున్నందున ఇది కంటికి అంతగా ప్రమాదం చేయదని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ కాంతి వల్ల కూడా ప్రమాదం ఉంటుందని ఇటీవలి అధ్యయనాలలో తేలింది. ‘‘ఇటీవల ఇలాంటి పాయింటర్లను ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతోంది. ఆన్లైన్లో అవి తేలిగ్గా లభ్యమవుతున్నాయి. వాటిపై అదుపు కూడా ఏమీ లేదు. దాంతో ఇలా రెటీనాపై దుష్ర్పభావం పడ్డ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి’’ అంటున్నారు హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్‌కు చెందిన బ్లాంటన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్తాల్మాలజీ విభాగం డిప్యూటీ చైర్పర్సన్ డాక్టర్ చార్మెస్ వైకాఫ్. -
స్మార్ట్‌ఫోన్‌తో అంధత్వం !
లండన్: స్మార్ట్ఫోన్లు పక్కన పెట్టుకుని పడుకునే వారికి హెచ్చరిక. చీకట్లో స్మార్ట్‌ఫోన్‌ను తదేకంగా చూసిన ఇద్దరు మిహళల్లో తాత్కాలిక ఒంటికన్ను అంధత్వాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరిద్దరు నిద్రలేచి కూర్చోవడానికి ముందు తమ స్మార్ట్‌ఫోన్‌లో వార్తలు చెక్ చేసేవారు. మంచంలోనే ఉండటం వల్ల వారు ఒక కన్నునే తెరిచేవారని లండన్‌లోని మూర్ఫీల్డ్ కంటి ఆసుపత్రి వైద్యుడు ఒమర్ మహ్రూ తెలిపారు. దీంతో ఒక రెటీనా వెలుతురుకు, మరొకటి చీకటికి అలవాటుపడ్డాయని వివరించారు. -
ఆర్గస్-2.. వృద్ధాప్యంలో కాంతిరేఖ!
వృద్ధులకు వయసు మీద పడుతున్నకొద్దీ కంటిచూపు మందగించడం సాధారణమే. రెటీనా ఎక్కువగా దెబ్బతింటే కొందరిలో చూపు పూర్తిగా పోతుంది కూడా. అయితే, వయసు రీత్యా అంధత్వానికి గురయ్యే పండుటాకుల జీవితాల్లో ఇకపై వెలుగులు తిరిగి ప్రసరించనున్నాయి. దెబ్బతిన్న రెటీనా పనిచేసేలా ప్రేరేపించే ‘ఆర్గస్-2 రెటీనల్ ఇంప్లాంట్’ వృద్ధులకు కారుచీకట్లో కాంతిరేఖలా మారనుంది. ‘వయసు రీత్యా వచ్చే అంధత్వం(ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజెనరేషన్-ఏఎండీ)’ సమస్యతో చూపు కోల్పోయిన ఓ వృద్ధుడికి మొట్టమొదటిసారిగా ఆర్గస్-2తో బ్రిటన్ వైద్యులు విజయవంతంగా చూపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపేందుకు మరో మార్గం సుగమం చేశారు. రేమండ్ ఫ్లిన్. మాంచెస్టర్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు. రెటీనా మధ్యభాగం దెబ్బతినడంతో ఏఎండీ వల్ల కొన్నేళ్ల క్రితమే పూర్తిగా చూపు కోల్పోయాడు. ఇన్నేళ్ల తర్వాత మాంచెస్టర్‌లోని రాయల్ ఐ హాస్పిటల్ వైద్యులు మళ్లీ అతడికి వెలుగులు ప్రసాదించారు. ఆర్గస్-2 ఇంప్లాంట్‌ను అమర్చి ఇటీవల మళ్లీ చూపును తెప్పించారు. సెకండ్ సైట్ సంస్థ రూపొందించిన ఆర్గస్-2 కృత్రిమ రెటీనా పరికరానికి 2013లోనే అమెరికాలో ఆమోదం లభించింది. రెటీనా దెబ్బతినడం వల్ల దృష్టిక్షేత్రంలో బయటివైపు ఖాళీ ఏర్పడే ‘రెటీనైటిస్ పిగ్మెంటోసా’ అనే వ్యాధికి చికిత్స కోసమే దీనిని ఇంతవరకూ వినియోగించారు. అయితే, ఏఎండీకి కూడా దీనిని ఉపయోగించవచ్చని తొలిసారిగా బ్రిటన్ వైద్యులు నిరూపించారు. ఇంప్లాంట్‌తో సహా మొత్తం చికిత్సకు రూ. 79 లక్షల వరకూ ఖర్చయిందట. భవిష్యత్తులో ఇంప్లాంట్ ఖరీదు తగ్గే అవకాశాలున్నాయి. ఇలా పనిచేస్తుంది... * కంటిలో దెబ్బతినకుండా మిగిలిపోయిన రెటీనా కణాలు తిరిగి పనిచేసేలా ఆర్గస్-2 ఇంప్లాంట్ ప్రేరేపిస్తుంది. * కళ్లజోడులోని కెమెరా తొలుత దృశ్యాలను చిత్రీకరిస్తుంది. ఈ వీడియోలోని చిత్రాలను కంప్యూటర్ ప్రాసెసర్ విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది. * విద్యుత్ సంకేతాలు వైర్‌లెస్‌గా కనుగుడ్డుకు పక్కన అమర్చిన చిన్న యాంటెన్నాకు చేరుతాయి. యాంటెన్నా నుంచి కేబుల్ ద్వారా రెటీనాపై ఇంప్లాంట్‌కు ఉండే ఎలక్ట్రోడ్‌కు చేరతాయి. * ఎలక్ట్రోడ్లు రెటీనాపై కణాలను ప్రేరేపిస్తాయి. మెదడుకు సమాచారం చేరి కాంతి తేడాల విశ్లేషణ జరుగుతుంది. * దీంతో పూర్తిగా కాకపోయినా కొంత మేరకు చూపు తిరిగి వస్తుంది. రోగి అస్పష్టంగా చూడగలుగుతాడు. * భవిష్యత్తులో దీనిని మరింత అభివృద్ధిపరిస్తే చూపు మెరుగవుతుందని చెబుతున్నారు. -
కంటి వ్యాధులను గుర్తించే... మాలిక్యులర్ మ్యాపు!
కరెంటు పోయినప్పుడు టీవీ తెరపై ప్రత్యక్షమయ్యే చారలకు సంబంధించిన ఫొటోలా ఉంది కదూ! కానీ కాదు. అంధత్వానికి కారణమయ్యే కంటి వ్యాధులను గుర్తించేందుకు ఉపయోగపడే అణుస్థాయి చిత్రపటం(మాలిక్యులర్ మ్యాపు) ఇది. కంటిలోని నేత్రపటలంపై ప్రొటీన్లు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉన్నాయన్నది ఈ మ్యాపు సాయంతో తెలుసుకోవచ్చట. ఈ ప్రొటీన్ల స్థాయిని బట్టి అంధత్వం, కంటి వ్యాధులను కచ్చితత్వంతో గుర్తించడమే కాకుండా.. వాటికి కచ్చితమైన చికిత్సలు కూడా చేయవచ్చట. రెటీనాకు ఆక్సిజన్‌ను, రక్తాన్ని సరఫరా చేసే నేత్రపటలంలో 4 వేలకు పైగా ప్రొటీన్ల సమాచారాన్ని ఈ హై రిజల్యూషన్ మాలిక్యులర్ మ్యాపు ద్వారా అధ్యయనం చేయవచ్చని, అణుస్థాయిలో ఇలా కంటి వ్యాధులను గుర్తించేందుకు ఉపయోగపడే మ్యాపును రూపొందించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అన్నట్టూ.. ఈ మ్యాపును తయారు చేసింది మన భారత సంతతి వ్యక్తే. యూనివర్సిటీ ఆఫ్ అయోవా ఆఫ్తాల్మాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ వినీత్ మహాజన్ మరో శాస్త్రవేత్తతో కలిసి దీనిని ఆవిష్కరించారు. ఈ మ్యాపునకు సంబంధించిన పరిశోధన వివరాలు ‘జేఏఎంఏ ఆఫ్తాల్మాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
నీ కళ్లు చల్లగుండ... కాఫీ తాగవయ్యా!
కళ్లు బాగుండాలనుకుంటున్నారా? కంటి చూపు మందగించకుండ ఆఉండాలనుకుంటున్నారా? గ్లకోమా, డయాబెటిస్ వంటి సమస్యల వల్ల రెటీనా చెడిపోయే పరిస్థితి రాకుండా చూసుకోవాలనుకుంటున్నారా? అయితే హాయిగా కాఫీ తాగేసేయండి. కాఫీ తాగితే కళ్లు బాగుంటాయని తాజా అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. కాఫీలో కెఫీన్ ఉంటుంది. అది ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ కాఫీలో 9 శాతం వరకూ క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. అది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. కంటి లోపలి పొర అయిన రెటీనా లో లక్షలాది వెలుతురును గుర్తించే కణాలుంటాయి. వీటి ఆధారంగానే మనం చూడగడుగుతాం. వీటికి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్ అందుబాటు తగ్గితే కంటి చూపు మందగిస్తుంది. క్లోరోజెనిక్ యాసిడ్ వల్ల ఆక్సిజెన్ అందుబాటు పెరుగుతుంది. ఇప్పటికే కాఫీ వల్ల అల్జీమర్స్, పార్కిన్ సన్స్ వంటి పలు వ్యాధులు రాకుండా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మంచి కాఫీ లాంటి ఈ వార్త చదివాక ఓ కప్పు కాఫీ తయారు చేసుకుని తాగేయండి!.