పారిస్ : విద్యుత్ ఆదా, డబ్బు పొదుపు అవుతుందనే ఉద్ధేశ్యంతో ప్రపంచం మొత్తం ఎల్‌ఈడీ బల్బుల బాట పట్టింది. అయితే ఎల్‌ఈడీ బల్బుల వాడకం వల్ల కంటిలోని రెటీనా శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉందని ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. ఫ్రాన్స్‌కు చెందిన ‘ఫ్రెంచ్ ఏజెన్సీ ఫర్ ఫుడ్, ఎన్విరాన్‌మెంట్ అండ్ ఆక్కూపేషనల్ హెల్త్ అండ్ సేఫ్‌టీ(ఏఎన్‌ఎస్‌ఈఎస్)’ జరిపిన పరిశోధనలో ఎల్‌ఈడీ బల్బులు కంటిచూపును దెబ్బతీస్తాయని తేలింది. సంప్రదాయబద్ధంగా వాడుతున్న సోడియం బల్బులకన్నా కూడా ఎల్‌ఈడీ బల్బులు మన ఆరోగ్యానికి ఎక్కువ హాని చేస్తున్నట్లు వెల్లడైంది. ఎల్‌ఈడీ బల్బులు ఫోటో టాక్సిక్ అని ఏఎన్‌ఎస్‌ఈఎస్ పేర్కొంది. రెటీనాలోపలి కణాలను దెబ్బతీసి కంటిచూపును కోల్పోయేలా చేస్తుందని తెలిపింది.
ఎల్‌ఈడీ బల్బుల నుంచి వెలువడే బ్లూలైట్(నీలికాంతి) ఎక్కువస్థాయిలో ఉండటం వల్ల అది కంటిచూపును దెబ్బతీస్తుందని వెల్లడించింది. ఈ బల్బుల వాడకాన్ని వీలైనంత తగ్గించుకోవాలని సూచించింది. వెలుగుతున్న ఎల్‌ఈడీ బల్బులను నేరుగా చూడటం చేయకూడదని, రాత్రి నిద్రపోయే సమయంలో బల్బులను ఆఫ్ చేసి పడుకోవాలని పేర్కొంది. మొబైల్ ఫోన్స్, లాప్‌టాప్స్, ట్యాబ్లెట్లనుంచి వెలువడే నీలికాంతి కంటే ఎల్‌ఈడీ బల్బుల నుంచి వెలువడే కాంతి ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment