LED bulbs
-
దీపావళి వేళ.. వళ్లంతా దీపాలే!
దీపావళి వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి. దీపావళి అంటే వెలుగుల పండుగ. దీపావళి రోజున ఇళ్లను దీపాలతో అలంకరిస్తారు. అయితే దీపావళి వేళ ఒక మహిళ వినూత్నంగా అలంకరించుకుంది. ఇళ్లను అలంకరించేందుకు వినియోగించే చిరు దీపాలను తన దుస్తులకు అల్లుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు దీపావళికి ఇటువంటి దుస్తులు పర్ఫెక్ట్ అని కితాబిస్తున్నారు. వర్షా. యాదవ్ పేరిట ఉన్న ఇన్‌స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోలో ఒక మహిళ ఘాగ్రా చోళీని ధరించి కనిపిస్తుంది. ఘాగ్రాతో పాటు వేసుకున్న చున్నీకి రంగురంగుల దీపాలు అతికించి ఉన్నాయి. కాంతులీనుతున్న ఈ దుస్తులను చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకు దాదాపు 5 లక్షల లైక్స్ వచ్చాయి. లెక్కకు మించిన కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇది కూడా చదవండి: దీపావళి వేళ.. ఢిల్లీలో 200కుపైగా అగ్నిప్రమాదాలు! View this post on Instagram A post shared by Varsha Bai (@varsha.yadav777) -
ఖర్చు తక్కువ, ఇంధనం ఆదా అయ్యే సరికొత్త కుకింగ్ స్టవ్‌లు, ఫ్యాన్లు!
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) ఆధ్వర్యంలో నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్(ఎన్‌ఈసీపీ), ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రామ్(ఈఈఎఫ్‌పీ)ని ప్రారంభించారు. అందులో భాగంగా ఈఈఎస్ఎల్ దేశవ్యాప్తంగా ఒక కోటి సమర్ధవంతమైన బీఎల్డీసీ ఫ్యాన్లు, 20 లక్షల సమర్థవంతమైన ఇండక్షన్ కుకిగ్ స్టవ్‌లను పంపిణీ చేస్తోంది. వంట పద్ధతులను విప్లవాత్మకంగా మార్చడం, శక్తి సామర్థ్యం వినియోగంపై ప్రాముఖ్యత, ఆవశ్యకతలను తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఈఈఎస్ఎల్. ఇంతకీ ఈ ఇండక్షన్ స్టవ్‌లు, బీఎల్డీసీ ఫ్యాన్ల ఉపయోగం, ప్రయోజనాలు ఏమిటి? ఇవి సాధారణ ప్రజలకు ఉపయోగపడతాయా? ఈ కుకింగ్ స్టవ్ ప్రత్యేకత.. నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్(ఎన్‌ఈసీపీ) తీసుకువచ్చిన ఈ ఇండక్షన్ ఆధారిత కుకింగ్ స్టవ్ సాంప్రదాయ వంట పద్ధతులకు మించి సుమారు 25 నుంచి 30 శాతం ఖర్చు ప్రయోజనాలను అందిస్తాయి. వీటితో ఇంధనం ఆదా అవ్వడమే గాక తక్కువ ఖర్చుతో మంచి వంటను అందించగలుగుతాం. భారతదేశం అంతట ఈ ఇండక్షన్ స్టవ్‌లు వినియోగించడం వల్ల ముఖ్యంగా పర్యావరణం హితకరంగా ఉంటుంది. అంతేగాదు వాతావరణంలో గాలి స్వచ్ఛంగా ఉండటమే గాక పౌరులకు మెరుగైన ఆరోగ్యం అందుతుంది. ఈ స్టవ్‌లను ఈఈఎస్ఎల్, మోడరన్ ఎనర్జీ కుకింగ్ సర్వీసెస్(ఎంఈసీఎస్)ల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున దేశంలో పంపిణీ చేస్తోంది. దీంతో వంటశాలల్లో ఈ ఆధునిక ఎలక్ట్రిక్ వంట పరికరాల హవా వేగవంతంగా విస్తరించడమే గాకుండా వంట పద్ధతుల్లో వేగవంతంమైన మార్పులు వస్తాయని చెబుతున్నారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్. తక్కువ ఆదాయ కుటుంబాలకు ఈ స్టవ్ చాలా బాగా ఉపయోగపడుతుందని అన్నారు. సీలింగ్ ఫ్యాన్ ప్రత్యేకత ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రామ్(ఈఈఎఫ్‌పీ) ఎల్సీడీ బల్బులు మాదిరిగా విద్యుత్ ఖర్చు తక్కువ, పర్యావరణానికి మేలు కలిగించేలా ఈ సీలింగ్ ఫ్యాన్లను అభివృద్ధి చేశారు. ఈ ఫ్యాన్ వల్ల విద్యుత్ బిల్లు కూడా తక్కువగానే ఉంటుంది. విద్యుత్ వినియోగంలో 35% తగ్గించే లక్ష్యంతో ఈ ఆధునాత ఫ్యాన్లను తీసుకొచ్చింది ఈఈఎస్ఎల్. ఇంతకమునుపు ఎల్ఈడీ బల్బులను తీసుకొచ్చి ప్రతి ఇంట్లో అవి ఉండేలా విజయవంతమైంది. మళ్లీ అదేవిధమైన విజయం పునరావృత్తమయ్యేలా ఈ ఆధునాత ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లు, ఇండక్షన్ స్టవ్‌లను తీసుకొచ్చింది. ప్రయోజనం ఈ రెండు ఆధునాత ఎలక్రిక్ పరికరాల వల్ల కార్బన్ ఉద్గారాలు గణనీయంగా త్గగుతాయి అలాగే 12 జీడబ్ల్యూ గరిష్ట విద్యుత్ డిమాండ్‌ని నిరోధించగలం వినియోగదారులకు విద్యుత్ బిల్లు కూడా తక్కువగానే వస్తుంది. ఈ నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్, ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్ ప్రోగ్రామ్‌లు భారతీయ గృహాలలో ఇంధన సామర్థ్యాన్ని పెంచడం తోపాటు కార్బన్ ఉద్గారాల పాదముద్రలను తగ్గించేలా సాహసోపేతమైన చర్యలు తీసుకుంటోంది. అంతకమునుపు ఉజ్వలా కింద జాతీయ వీధిలైట్ల కార్యక్రమంలో మిలియన్ల కొద్దీ ఎల్ఈడీ బల్బుల పంపిణీని తీసుకొచ్చి క్షేత్ర స్థాయిలో శక్తి వినియోగాన్ని, గరిష్ట విద్యుత్ డిమాండ్‌ని తగ్గించి గణనీయమైన ఫలితాన్ని పొందేలా చేసింది ఈఈఎస్ఎల్ . అదేవిధంగా ఈ ఇండక్షన్ కుకింగ్ స్టవ్‌లు, సీలింగ్ ఫ్యాన్లు శక్తి వినియోగాన్ని, కార్గన్ ఉద్గారాలను తగ్గించి పూర్తి స్థాయిలో విజయవంతమవుతాయని విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఆ కాంక్షిస్తున్నారు. (చదవండి: చేతులు లేని తొలి మహిళా పారా ఆర్చర్! రెండు పతకాలతో ప్రపంచాన్నే..) -
వెలగబెట్టేశారు!
ఒక్క గ్రామంలోనే ఏటా రూ.25 వేలు ఆదా అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని మాల్యవంతం గ్రామంలో ఐదు నెలల కిత్రం వరకు ఎల్ఈడీ వీధి దీపాలు 24 గంటలూ వెలుగుతుండేవి. గ్రామంలో 325 విద్యుత్ స్తంభాలుంటే ప్రతి నెలా 650 యూనిట్ల వరకు కరెంట్ వినియోగం అయ్యేది. 2018 జూలై నుంచి అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రైవేట్ కాంట్రాక్టర్ల అధీనంలో ఉన్న వీధి దీపాల నిర్వహణ బాధ్యతను తిరిగి గ్రామ పంచాయతీలకు అప్పగించడంతో గత జూలైలో వినియోగం 310 యూనిట్లకు తగ్గిపోయింది. అంటే ఒక్క గ్రామంలోనే నెలకు 340 యూనిట్లు ఆదా అవుతోంది. యూనిట్ రూ.6.05 చొప్పున పంచాయతీపై కరెంట్ బిల్లు భారం ప్రతి నెలా రూ.2,057 తగ్గింది. ఇలా ఒక్క పంచాయతీలోనే ఏడాదికి దాదాపు రూ.25 వేల వరకు ఆదా కానుంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించినప్పటికీ ఏళ్ల తరబడి వీధి దీపాల కరెంట్ వృథా కారణంగా ఇంకా రూ.లక్షల్లో బకాయిలున్నట్లు పంచాయతీకి ప్రతి నెలా నోటీసులు అందుతున్నాయి. – సాక్షి, అమరావతి ఏం చేస్తున్నావురా వెంకన్నా...? మా అయ్య చేసిన అప్పులు తీరుస్తున్నా..! రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడు ఇదే మాదిరిగా ఉంది. గత సర్కారు మోపిన అవినీతి గుదిబండ భారాన్ని మోయలేక గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్ శాఖ సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలుండగా దాదాపుగా అన్ని గ్రామాల పరిస్థితి ‘మాల్యవంతం’ మాదిరిగానే ఉంది. 2018 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 9 నుంచి 13 లక్షల దాకా వీధి దీపాలు పగలు రాత్రి తేడా లేకుండా వెలుగుతూనే ఉండటమే దీనికి కారణం. వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ కోసం టీడీపీ సర్కారు నియమించిన కాంట్రాక్టర్లు నిర్వహణ బాధ్యతలను గాలికి వదిలేశారు. కనీసం పంచాయతీలకైనా అప్పగించకుండా నానా ఇబ్బందులకు గురి చేశారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వీధి దీపాల నిర్వహణ బాధ్యత నుంచి కాంట్రాక్టర్లను తప్పించి తిరిగి పంచాయతీలకు అప్పగించింది. పగటి పూట వృథాను నివారిస్తూ ప్రతి 20–30 వీధి దీపాలకు ఒక స్విచ్ బాక్స్ ఏర్పాటు చేసి పంచాయతీ సిబ్బందికి పర్యవేక్షణ బాధ్యతలు కేటాయించారు. గత రెండు నెలలుగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్విచ్ బాక్స్‌ల ఏర్పాటు చేపట్టారు. కర్నూలు మినహా మిగిలిన 12 జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో స్విచ్ బాక్స్‌ల ఏర్పాటు పూర్తైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రూ.వందల కోట్లు ఆదా.. వీధి దీపాలు రాత్రి 6.30 నుంచి తెల్లవారుజాము వరకు సగటున 11 గంటల పాటు వెలిగితే సరిపోతుంది. రోజంతా 24 వాట్ల ఎల్ఈడీ బల్బు అనవసరంగా వెలగడం వల్ల ఏడాదికి 114 యూనిట్లు అదనంగా వినియోగం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదంతా విద్యుత్తు వృథానే. వీధి దీపాల కరెంట్‌కు యూనిట్ రూ.6.05 చొప్పున బిల్లు చెల్లించాలి. పగలు కూడా వెలగడంతో ఒక్కో బల్బుకు ఏటా దాదాపు రూ.700 అదనంగా బిల్లు కట్టాల్సి వస్తోంది. 200 వీధి దీపాలుండే చిన్న పంచాయతీపై ఏటా రూ.1.40 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. పగటి పూట వెలిగే వీధి దీపాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలపై ఏటా రూ.70 కోట్ల మేర అదనపు భారం పడినట్లు అంచనా. 15 మంది ప్రైవేట్ కాంట్రాక్టర్లకు.. ఎల్ఈడీ బల్బుల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ నెడ్‌క్యాప్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో చేపడుతున్నట్టు గత సర్కారు పేర్కొంది. అయితే ఆ తర్వాత టీడీపీ పెద్దల అనుయాయులే కాంట్రాక్టర్ల అవతారమెత్తి ఒప్పందాలు చేసుకున్నారు. 15 మంది కాంట్రాక్టర్లు జిల్లాలవారీగా పంచుకొని రాష్ట్రవ్యాప్తంగా 24.86 లక్షల ఎల్ఈడీ బల్బులు మార్పిడి చేశారు. వాటి పర్యవేక్షణ, మరమ్మతుల బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్‌దేనని ఒప్పందంలో ఉన్నప్పటికీ నిర్వహణను గాలికి వదిలేశారు. 13 లక్షల వీధి దీపాలకు స్విచ్ బాక్స్‌లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో నిరంతరం వెలిగి పెద్ద ఎత్తున విద్యుత్తు వృథా జరిగినట్లు అధికారులు తెలిపారు. రూ.3,800 కోట్లకు చేరిన బకాయిలు.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు చెల్లించాల్సిన కరెంట్ బిల్లుల బకాయిలు రూ.3,800 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. కాంట్రాక్టర్ల నిర్వాకంతో వీధి దీపాలు నిరంతరం వెలగడం, ప్రతి నెలా అపరాధ రుసుము పేరుకుపోవడం భారీ బకాయిలకు కారణం. 2018 ఆగస్టు నుంచి పంచాయతీల్లో సర్పంచుల పాలన ముగిసి ప్రత్యేకాధికారుల కొనసాగిన సమయంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రూ.వెయ్యి బల్బుకు రూ.6,000 పంచాయతీల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ట్యూబ్‌లైట్ వీధి దీపాలను అధిక విద్యుత్తు వినియోగం జరుగుతోందంటూ గత సర్కారు 2017లో తొలగించి ఎల్డీఈ బల్బులు ఏర్పాటు చేసింది. పంచాయతీలపై రూపాయి భారం పడకుండా వీటిని సమకూరస్తున్నట్లు నాటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఎల్ఈడీ బల్బుల వల్ల ఆదా అయ్యే విద్యుత్ బిల్లులో 80 శాతాన్ని సంబంధిత పంచాయతీలు కాంట్రాక్టర్లకు చెల్లించాలంటూ మెలిక పెట్టారు. ఒక్కో బల్బుకు మూడు నెలలకు ఒకసారి రూ.150 చొప్పున ఏడాదికి రూ.600 పదేళ్ల పాటు కాంట్రాక్టర్‌కు చెల్లించాలని ప్రభుత్వం షరతు విధించింది. రూ.1,000 విలువైన ఎల్ఈడీ బల్బుకు గ్రామ పంచాయతీ పదేళ్ల పాటు దాదాపు రూ.6,000 కాంట్రాక్టర్లకు చెల్లించేలా గత సర్కారు ఒప్పందం చేసుకుంది. -
గ్రామాల్లో ఎల్ఈడీ వెలుగులు
సాక్షి, అమరావతి: గృహ వినియోగదారుల విద్యుత్ బిల్లులను తగ్గించేందుకు వీలుగా గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు రూపొందించిన గ్రామ ఉజాలా పథకాన్ని త్వరలోనే ఏపీలో అమలు చేయనున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, ఏపీ సీడ్కోల సహకారంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) ఈ ఎల్ఈడీ బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈ పథకం అమలుపై చర్చించేందుకు సీఈఎస్ఎల్ ఎండీ మహువా ఆచార్య బుధవారం రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. రాష్ట్రంలో పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 450 కోట్లు వెచ్చించేందుకు అవకాశం ఉందని మహువా వివరించారు. ఈ పథకాన్ని ఇప్పటికే బిహార్, యూపీలో అమలు చేస్తున్నామని, ఇప్పుడు ఏపీలో ప్రారంభించడానికి అవసరమైన లాంఛనాలన్నీ పూర్తి చేసినట్టు తెలిపారు. గ్రామాల్లో నమూనా సర్వే కూడా పూర్తయిందన్నారు. ఎల్ఈడీ లైట్లు 75 శాతం తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయని, 25 రెట్లు ఎక్కువ కాలం పనిచేస్తాయని వివరించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఈ పథకం విజయవంతానికి వలంటీర్ల సేవలు వినియోగించుకుంటామన్నారు. గ్రామ ఉజాలా కార్యక్రమం ప్రారంభ తేదీ, వేదికను ఖరారు చేయాలని అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. అమలు ఎలా? ► ఈ పథకంలో భాగంగా అర్హులైన గ్రామీణ ప్రజల నుంచి వాళ్ల ఇళ్లలో ఇప్పుడు వినియోగిస్తున్న 60 వాట్, 100 వాట్ బల్బులను తీసుకొని వాటి స్థానంలో ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేస్తారు. ► ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 5 ఎల్ఈడీ బల్బులను అందజేస్తారు. ► బహిరంగ మార్కెట్లో 7 వాట్ ఎల్ఈడీ బల్బు రూ.70, 12 వాట్ ఎల్ఈడీ బల్బు రూ.120 ధర ఉండగా.. కేవలం రూ. 10కే వాటిని అందజేస్తారు. లాభం ఇలా.. పథకం అమలుతో ప్రతి ఇంటికీ ఏడాదికి రూ. 600 నుంచి రూ.700 వరకు విద్యుత్ బిల్లుల ఖర్చు తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖకు అనుబంధంగా పనిచేసే స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఏస్‌ఈసీఎం) అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ ఏడాదికి 1,144 మెగా వాట్ల మేర తగ్గి, డిస్కంలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 81,55,316 కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయని తెలిపారు. -
Chrysanthemum: ఎల్ఇడీ బల్బుల వెలుగులో చామంతి పూల సాగు!
మార్కెట్లో ఎప్పుడు ఏ పంట దిగుబడులకు గిరాకీ ఉంటుందో అప్పుడు ఆ పంట దిగుబడి వచ్చేలా ప్రణాళిక రూపొందించుకొని పంటలు పండిస్తే రైతులకు ఆదాయం పెరుగుతుంది అనటానికి విద్యాధిక యువ రైతు మంచిరెడ్డి శశికళాధరప్ప చామంతి సాగు అనుభవమే నిదర్శనం. అన్‌సీజన్‌లో చామంతి సాగుకు శ్రీకారం చుట్టి తక్కువ పెట్టుబడితో మంచి నికదాయాన్ని పొందుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల తోడ్పాటుతో అన్‌సీజన్‌లో కృత్రిమ కాంతితో చామంతి పూల సాగు విధానాన్ని అమలుచేస్తూ శశికళాధరప్ప సత్ఫలితాలు సాధిస్తుండటం విశేషం. సాధారణంగా జూన్–జూలై నుంచి చామతి పూల సాగు చేపడుతారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో శాఖీయోత్పత్తి జరుగుతుంది. నవంబరు నెల నుంచి పూలు కోతకు వస్తాయి. అయితే, రైతులందరూ ఈ సీజన్లో ఒకేసారి సాగు చేయడం, దిగుబడులు ఒకేసారి మార్కెట్లోకి వస్తుండటం వల్ల ఒక్కోసారి గిట్టుబాటు ధర లభించదు. ఈ సమస్యను అధిగమించి వేసవిలో పూల దిగుబడి వచ్చేలా శాస్త్రవేత్తల తోడ్పాటుతో శవికళాధరప్ప కృత్రిమ కాంతిని ఉపయోగించి దిగుబడులు తీస్తున్నారు. ఎల్ఈడీ బల్బుల వెలుగు.. శశికళాధరప్ప(31) ఎంసీఏ పూర్తి చేసి 2020–21లోనే కాడిపట్టి సేద్యానికి శ్రీకారం చుట్టారు. మిరప, ఉల్లి, సీజన్లో చామంతి సాగు చేపట్టి విశేషంగా రాణిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఎకరా విస్తీర్ణంలో పూర్ణిమ ఎల్లో, పూర్ణిమ వైట్ రకాల చామంతి పూల సాగు చేపట్టారు. చామంతిలో శాఖీయోత్పత్తిలో కొమ్మలు బాగా రావడానికి పగటి సమయం ఎక్కువగా ఉండాలి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పగటి సమయం తక్కువగా ఉంటుంది. శాఖీయోత్పత్తిని పెంచుకోవడానికి పగటి సమయం సరిపోకపోతుండటంతో కృత్రిమంగా పగటి సమయాన్ని పెంచుకున్నారు. రూ.20 వేలు ఖర్చు చేసి చామంతి పొలం చుట్టూ మూడు మీటర్లకు ఒకటి చొప్పున 84 ఎల్ఇడీ బల్బులు అమర్చారు. దీంతో చామంతి పూల తోటలో రాత్రి సమయంలో కూడా పగటి పూట మాదిరిగా వెలుతురు పరుచుకుంది. జనవరి 6 నుంచి ఫిబ్రవరి 10 వరకు కృత్రిమంగా పగటి సమయాన్ని పెంచుకోవడంతో అన్ సీజన్లో కూడా చామంతిలో కొత్తగా ఇగుర్లు వచ్చాయి. 30 రోజులకు తలలు తుంచడంతో విశేషంగా కొమ్మలు వచ్చాయి. ఇప్పటికి ఒక సారి పూలు కోశారు. ప్లాస్టిక్ షీట్లతో కృత్రిమ చీకట్లు.. శశికళాధరప్ప ఈ నెలలో కృత్రిమంగా రాత్రి సమయాన్ని పెంచుకోనున్నారు. శాఖీయోత్పత్తి జరిగిన తర్వాత పూ మొగ్గలు ఏర్పడి పువ్వులు వచ్చేందుకు రాత్రి సమయం కనీసం 14 గంటలు అవసరం. 14 గంటలు రాత్రి/ చీకటి వాతావరణం ఉండాలి. ఇందుకోసం ఎకరాలోని చామంతి పూల తోటలో కర్రలు పాతి నల్లటి ప్లాస్టిక్ షీట్లు కప్పి కృత్రిమ చీకటిని సృష్టించుకోవడానికి రంగం సిద్ధం చేసుకోనున్నారు. వేసవిలో చామంతి పూల సాగు చేపట్టడం వల్ల చీడపీడల బెడద లేకుండా పోయింది. డ్రిప్ సదుపాయం కల్పించుకొని ఎరువులు వినియోగించారు. సూక్ష్మ పోషకాల నివారణకు పార్ములా–1, పార్ములా–2 మందులు పిచికారీ చేశారు. ఇప్పటికే ఒక్కకోత పూలు వచ్చాయి. ఇంకా దాదాపు 50 రోజుల వరకు పూల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అన్‌సీజన్‌లో చామంతి పూలు లభిస్తుండటం వల్ల నికరాదాయం కనీసం రూ.2 లక్షల వరకు ఉండవచ్చని శశికళాధరప్ప అంచనా వేస్తున్నారు. – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్) రూ. 2 లక్షల నికరాదాయం ఆశిస్తున్నా! మాకు గ్రామం ప్రక్కనే 8.50 ఎకరాల సారవంతమైన భూమితోపాటు బోరు ఉంది. ఎంసీఏ పూర్తి చేసిన తర్వాత గత ఏడాది వైఎస్ఆర్ కడప జిల్లా ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తల సూచనలతో అన్‌సీజన్‌లో చామంతి పూల సాగు చేపట్టాను. అనువుకాని కాలంలో పూల సాగు చేపట్టి కృత్రిమ కాంతి, కృత్రిమ చీకటి కల్పించడం వల్ల పూల సాగు ఆశాజనకంగా ఉంది. పెట్టుబడి రూ.90 వేలు అవుతోంది. రూ.2 లక్షల వరకు నికరాదాయం వస్తుందనుకుంటున్నా. – మంచిరెడ్డి శశికళాధరప్ప, రామళ్లకోట, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా (99669 98816, 91823 27249) ఇక్కడ చదవండి: కొత్త బంగారు లోకం.. సతత హరిత పంటలు -
ఎల్'ఛీ'డీ
తూర్పుగోదావరి ,బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కరెంటును ఆదా చేసే పేరుతో గత టీడీపీ సర్కారు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధిదీపాలు.. ఆ ప్రభుత్వం అమలు చేసిన విధానం పుణ్యమా అని ఇప్పుడు అలంకారప్రాయంగా మిగిలాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సహకారంతో 2017–18 కాలంలో ఎల్ఈడీ బల్బులు అమర్చారు. వీటి నిర్వహణ కాంట్రాక్టును నాటి ప్రభుత్వం ఓ సంస్థకు అప్పగించింది. నిర్వహణ నిధులు వసూలు చేసిన ఆ సంస్థ.. తరువాత ఎల్ఈడీ బల్బుల నిర్వహణను గాలికొదిలేసింది. ఫలితంగా కొన్ని స్తంభాలకు రాత్రి, పగలు అనే తేడా లేకుండా లైట్లు వెలుగుతున్నాయి. కొన్ని బల్బులు వెలగడం లేదు. కాంట్రాక్టు సంస్థ పట్టించుకోకపోగా.. స్థానిక ఎలక్ట్రీషియన్లు కూడా వాటికి మరమ్మతులు చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఫలితంగా పల్లెల్లోని పలు వీధుల్లో ప్రస్తుతం అంధకారం అలముకుంటోంది. నెలల తరబడి వీధిదీపాలు వెలగక గ్రామీణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దీపాలు వెలగక రాత్రి సమయంలో వీధుల్లో చీకట్లు అలముకోవడంతో భయపడుతున్నారు. ఎల్ఈడీల పేరుతో టీడీపీ సర్కారు పెద్దలు గ్రామాలను అంధకారంలోకి నెట్టారు తప్ప.. వీటివల్ల తమకు ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ చార్జీల వసూలు జిల్లాలోని 1,072 గ్రామ పంచాయతీల్లో మొత్తం 3.10 లక్షల ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేశారు. మేజర్ గ్రామ పంచాయతీలో 300 పైగా, మైనర్ పంచాయతీలో 150 పైగా ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు బల్బుకు, నెలకు రూ.50 చొప్పున చార్జీలు వసూలు చేశారు. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా వివిధ గ్రామ పంచాయతీల నుంచి రూ.1.80 కోట్లు వసూలు చేసి, సంబంధిత కాంట్రాక్టరుకు చెల్లించారు. అయినప్పటికీ ఆ సంస్థ ఎల్ఈడీ దీపాల నిర్వహణను పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో కొన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు నిర్వహణ చార్జీలు చెల్లించడం లేదు. ఈఈఎస్ఎల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 10 సంవత్సరాల వరకూ ఎల్ఈడీ దీపాలు పాడైతే కొత్తవి వారే వేయాల్సి ఉంది. కానీ, గ్రామాల్లో ఎల్ఈడీ బల్బులు పాడైనప్పటికీ వాటిని మార్చడం లేదు. అసలు ఈఈఎస్ఎల్ సంస్థ కానీ, సంబంధిత కాంట్రాక్టు సంస్థ కానీ ఎల్ఈడీ బల్బుల నిర్వహణ కోసం ఎక్కడా సిబ్బందినే నియమించలేదు. స్థానికంగా ఉండే విద్యుత్ సిబ్బందిని కొన్ని మండలాల్లో నియమించినా, డబ్బులు ఇవ్వకపోవడంతో వారు ఎల్ఈడీ బల్బుల నిర్వహణను పట్టించుకోవడం లేదు. నియంత్రణ కరవు జిల్లా మొత్తం మీద ఎల్ఈడీ దీపాలను నియంత్రించేందుకు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని ప్రారంభ దశలో అధికారులు చెప్పారు. జిల్లా కేంద్రం నుంచి ఇది పని చేస్తుందని పేర్కొన్నారు. కానీ ఇది ఆచరణలో కనిపించిన దాఖలాలు లేవు. కొన్ని గ్రామాల్లో వీధిదీపాలను కంట్రోల్ చేసేందుకు టీసీఎంఎస్ బాక్సులు ఏర్పాటు చేసినా, దీపాల అమరికల్లో లోపాలుండడంతో అవి సక్రమంగా పని చేయడం లేదు. కొన్ని గ్రామాల్లో వర్షం కురిసేటప్పుడు లైట్లు వెలగడం లేదు. ఇవి ఎప్పుడు వెలుగుతాయో, ఎప్పుడు చీకట్లు అలముకుంటాయో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. బాగు చేయించేదెవరో తెలీదు గ్రామంలోని ప్రధాన వీధులు అంధకారంలో మగ్గుతున్నాయి. రాత్రి సమయంలో వీధుల్లోకి వెళ్లాలంటే భయంగా ఉంది. పాములు, క్రిమి కీటకాల బెడద ఎక్కువగా ఉన్నందున బయటకు రాలేకపోతున్నాం. అసలు ఈ వీధి దీపాలను ఎవరు బాగు చేయిస్తారో కూడా తెలియదు. వెంటనే మరమ్మతులు చేయించి, దీపాలు వెలిగేలా చూడాలి.– బలగం ప్రసన్నకుమార్, మాజీ సర్పంచ్, తూరంగి కార్యదర్శులు ఫిర్యాదులుచేస్తున్నారు గ్రామాల్లో ఎల్ఈడీలు బల్బులు వెలగని విషయాన్ని పలువురు కార్యదర్శులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని కాంట్రాక్టర్లకు తెలియజేశాం. అన్ని గ్రామాల్లోనూ బల్బులకు మరమ్మతులు చేయించి, సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకుంటాం.– వై.అమ్మాజీ, డీఎల్పీవో, కాకినాడ -
‘నీట్’ క్వాలిఫై అయితేనే విదేశాల్లో ఎంబీబీఎస్
న్యూఢిల్లీ : విదేశాల్లో ఎంబీబీఎస్ తత్సమానమైన వైద్య విద్యా కోర్సుల్లో చేరదలచుకున్న అభ్యర్థులు కచ్చితంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌లో(నీట్) అర్హత సాధించాలని ఆరోగ్య శాఖ సహాయం మంత్రి అశ్వినీ కుమార్ చౌబే స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మంగళవారం రాజ్యసభలో ఈ విషయం వెల్లడించారు. అలాగే రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు. గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) నిర్వహించే స్ర్కీనింగ్ టెస్ట్ నిబంధనల ప్రకారం విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలంటే ప్రతి అభ్యర్థి ఎంసీఐ నుంచి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్‌ను పొందాల్సి ఉండేదన్నారు. 2018 మర్చిలో ఈ నిబంధనలను సవరించారని.. ప్రస్తుతం విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలంటే నీట్లో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుందని వివరించారు. నీట్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంసీఐ నుంచి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ పొందాల్సి అవసరం లేదన్నారు. గడిచిన మూడేళ్లలో ప్రపంచంలోని 48 దేశాల్లో ఎంబీబీఎస్ లేదా తత్సమానమైన మెడికల్ కోర్సులు అభ్యసిస్తున్న భారతీయ అభ్యర్థులు 41,562 మంది ఉన్నట్టు వెల్లడించారు. చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్న వారి సంఖ్య 8,328గా ఉందన్నారు. భారతీయ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఎంబీబీఎస్ చదువుతున్న దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉండగా, జార్జియా, కిర్గిస్తాన్, రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ మొదటి పది స్థానాల్లో ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. విదేశాల్లో మెడిసిన్ చదవడానికి అనుమతి కోరుతూ 2019 జనవరి వరకు ఎంసీఐకి 4,558 దరఖాస్తులు అందయాని.. అందులో అత్యధికులు చైనాలో చదివేందుకే ఆసక్తి చూపారని పేర్కొన్నారు. 35 కోట్ల ఎల్ఈడీ బల్బుల పంపిణీ.. ఉజాలా పథకం కింద దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి గృహ వినియోగదారులకు 35 కోట్ల 16 లక్షల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేసినట్టు విద్యుత్ శాఖ సహాయ మంత్రి కేకే సింగ్ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఈ పథకం కింద పంపిణీ చేస్తున్న ఎల్ఈడీ బల్బులు నాణ్యతా నియంత్రణ ప్రమాణాలకు లోబడి ఉంటాయని చెప్పారు. దేశీయ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు సైతం ఎల్ఈడీ బల్బుల తయారీ విషయంలో ఈ నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మార్కెట్లో ఉన్న తయారీదారులకు ఇప్పటివరకు 111 కోట్ల ఎల్ఈడీ బల్బులను విక్రయించినట్టు పేర్కొన్నారు. ఉజాలా పథకం కింద పంపిణీ చేస్తున్న ఎల్ఈడీ బల్బుల్లో విఫలమవుతున్న వాటి శాతం అతి తక్కువగా ఉన్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైందన్నారు. -
ఎల్ఈడీ బల్బులు వాడితే ప్రమాదమే!
పారిస్ : విద్యుత్ ఆదా, డబ్బు పొదుపు అవుతుందనే ఉద్ధేశ్యంతో ప్రపంచం మొత్తం ఎల్ఈడీ బల్బుల బాట పట్టింది. అయితే ఎల్ఈడీ బల్బుల వాడకం వల్ల కంటిలోని రెటీనా శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉందని ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. ఫ్రాన్స్‌కు చెందిన ‘ఫ్రెంచ్ ఏజెన్సీ ఫర్ ఫుడ్, ఎన్విరాన్మెంట్ అండ్ ఆక్కూపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ(ఏఎన్ఎస్ఈఎస్)’ జరిపిన పరిశోధనలో ఎల్ఈడీ బల్బులు కంటిచూపును దెబ్బతీస్తాయని తేలింది. సంప్రదాయబద్ధంగా వాడుతున్న సోడియం బల్బులకన్నా కూడా ఎల్ఈడీ బల్బులు మన ఆరోగ్యానికి ఎక్కువ హాని చేస్తున్నట్లు వెల్లడైంది. ఎల్ఈడీ బల్బులు ఫోటో టాక్సిక్ అని ఏఎన్ఎస్ఈఎస్ పేర్కొంది. రెటీనాలోపలి కణాలను దెబ్బతీసి కంటిచూపును కోల్పోయేలా చేస్తుందని తెలిపింది. ఎల్ఈడీ బల్బుల నుంచి వెలువడే బ్లూలైట్(నీలికాంతి) ఎక్కువస్థాయిలో ఉండటం వల్ల అది కంటిచూపును దెబ్బతీస్తుందని వెల్లడించింది. ఈ బల్బుల వాడకాన్ని వీలైనంత తగ్గించుకోవాలని సూచించింది. వెలుగుతున్న ఎల్ఈడీ బల్బులను నేరుగా చూడటం చేయకూడదని, రాత్రి నిద్రపోయే సమయంలో బల్బులను ఆఫ్ చేసి పడుకోవాలని పేర్కొంది. మొబైల్ ఫోన్స్, లాప్టాప్స్, ట్యాబ్లెట్లనుంచి వెలువడే నీలికాంతి కంటే ఎల్ఈడీ బల్బుల నుంచి వెలువడే కాంతి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. -
ఓరియంట్ ఎల్ఈడీ బల్బ్‌కు 5 స్టార్ రేటింగ్
హైదరాబాద్: ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ 9 వాట్ల ఎల్ఈడీ బల్బ్‌కు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) నుంచి 5–స్టార్ రేటింగ్ లభించింది. బీఈఈ నుంచి ఈ 5–స్టార్ రేటింగ్‌ను పొందిన తొలి బ్రాండ్ తమదేనని ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ తెలిపింది. తమ 9 వాట్ల ఎల్ఈడీ బల్బ్ 25 వేల గంటల దీర్ఘకాలిక మన్నిక కలిగి, ప్రతి వ్యాట్‌కు 120 లుమెన్స్ను అందిస్తుందని ఓరియంట్ ఎలక్ట్రిక్ లైటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ పునీత్ ధవన్ పేర్కొన్నారు. తమ ఎల్ఈడీ లైటింగ్ వ్యాపారం 2 ఏళ్లలో 8 రెట్లు వృద్ధి సాధించిందని వివరించారు. -
లక్ష్యానికి తూట్లు !
కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలోని పంచాయతీల్లో విద్యుత్తు బిల్లులను తగ్గించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వీధిలైట్లకు ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్పార్ జిల్లాలో 790 గ్రామ పంచాయతీలకు గాను 322 గ్రామ పంచాయతీల్లో 61,100 ఎల్ఈడీ బల్పులను జూన్ 2నాటికి ఏర్పాటు చేశారు. కానీ ఏ లక్ష్యంతోనైతే వాటిని ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం నెరవేడరం లేదు. అధికారుల నిర్లక్ష్యమో లేక కిందిస్థాయి సిబ్బంది అలసత్వమో తెలియదు కానీ లక్ష్యానికి మాత్రం తూట్లు పొడుస్తున్నారు. రాత్రి వేళల్లో మాత్ర మే వెలగాల్సిన ఎల్ఈడీ బల్బులు పగలు రాత్రి అనే తేడా లేకుండా నిరంతరాయంగా వెలుగుతున్నాయి. ఫలితంగా విద్యుత్ బిల్లులు గతంలో మాదిరే వచ్చే అవకాశం ఉంది. విద్యుత్తు బిల్లులు తగ్గించాలనే ప్రభుత్వ లక్ష్యం మంచిదైనా కిందిస్థాయిలో అమలు చేసే వారి నిర్లక్ష్యం వల్ల సంబంధిత పథకం పలు విమర్శలకు తావిస్తోంది. ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసే వారు వాటికి ఆన్ఆఫ్ చేసే కంట్రోల్‌కు సంబంధించిన ప్రత్యేక లైన్‌ను (తాడు వయర్) ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఎక్కడా అవి ఏర్పాటు చేయనట్లు తెలిసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో పగలు వెలగకుండా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జాతీయ రహదారి వెంబడి: కడప కర్నూల్ జాతీయ రహదారిలో చెన్నూరు దాటాక ఖాజీపేట మండల పరిధిలో జాతీయరహదారి వెంబడి ఉన్న పలు గ్రామాల్లో ఎల్ఈడీ బల్పులు నిత్యం వెలుగుతూ కనిపిస్తున్నాయి. కొత్తనెల్లూరు, సంజీవనగరం, కూనవారిపల్లె తదితర గ్రామాలతో పాటు జిల్లాలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి. ఈ విషయంలో అధికారులు స్పందించాల్సి న అవసరం ఉంది. లేకపోతే ఏలక్ష్యంతోనైతే ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం నీరుగారిపోయే అవకాశం ఉంది. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి మోహన్‌రావ్‌ను వివరణ కోరగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ బల్పులు నిరంతరం వెలుగుతున్న ట్లు తమ దృష్టికి రాలేదన్నారు. అయినా దీనిపై పరి శీలించి చర్యలు తీసుకుంటామని వివరించారు. 24 గంటలు వెలుగులే మాగ్రామంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధి బల్పులు నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నా యి. ఆన్‌ఆప్ చేద్దామంటే ఎక్కడ స్విచ్‌లుకానీ ఆన్ఆఫ్ కంట్రోల్ కానీ ఏర్పాటు చేయలేదు. దీంతో రాత్రింబవళ్లు అన్న తేడా లేకుండా నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి.– పెద్దరామయ్య, సర్పంచ్, చక్రాయపేట -
సబ్సిడీపై ఎల్ఈడీ బల్బులు
సాక్షి మెదక్ : బహిరంగ మార్కెట్లో రూ.120 ఉండే ఎల్ఈడీ బల్బులను సబ్సిడీపై రూ.65కే ప్రజలకు అందజేయనున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. జిల్లా అంతటా రేషన్ దుకాణాల్లో సబ్సిడీ ఎల్ఈడీ బల్బులను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఎల్ఈడీ బల్బుల అమ్మకంపై కలెక్టర్ ధర్మరెడ్డి గురువారం మెదక్ పట్టణ రేషన్ డీలర్లతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీపై తక్కువ ధరకే ఎల్ఈడీ బల్బులు అందజేస్తున్నట్లు చెప్పారు. ఎల్ఈడీ బల్బుల వాడకంతో కరెంటు ఆదా, బల్బులు కింద పడినా పగిలే అవకాశం ఉండదని తెలిపారు. రేషన్‌డీలర్లు అమ్మే ప్రతి బల్బుకు రూ.5 కమిషన్‌గా వస్తుందన్నారు. డీలర్లు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అయితే ప్రజలకు బలవంతంగా బల్బులను అమ్మవద్దని సూచించారు. పౌష్టికాహారం అందించాలి.. గర్భిణులు, పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని కలెక్టర్ ధర్మారెడ్డి స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులు, అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. కలెక్టరేట్లో స్త్రీ శివు సంక్షేమ శాఖపై కలెక్టర్ ధర్మారెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని నెలలుగా గర్భిణుల్లో పోషకాహార లోపం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. 20 శాతం మంది గర్భిణుల్లో పౌష్టికాహార లోపం ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మెదక్ ప్రాజెక్టు పరిధిలో 400 మందికిపైగా చిన్నారుల్లో తక్కువ బరువు కలిగి ఉన్నట్లు తెలిపారు. గర్భిణు లు, పిల్లలకు సరైన పౌష్టికాహారం అందేలా అంగన్వాడీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రాబోయే నాలుగు మాసాల్లో తక్కువ బరువుతో పిల్లలకు ఉండకుండా చూడాలని అదేశించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఐసీడీఎస్ అధికారి జోత్యపద్మ, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో తనిఖీ మెదక్‌జోన్: మెదక్ ఆర్డీఓ కార్యాలయాన్ని కలెక్టర్ ధర్మారెడ్డి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రికార్డులను ఎప్పటికప్పుడు భద్రపరుచుకోవాలన్నారు. ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టిసారించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఆయన వెంట మెదక్ ఆర్డీఓ నగేశ్‌తో పాటు సిబ్బంది ఉన్నారు. -
షైనింగ్ సిటీ!
మహానగరం పూర్తిస్థాయి ఎల్ఈడీ దీపాల వెలుగులతో నిండనుంది. సిటీలో 4.60 లక్షల లైట్ల ఏర్పాటు లక్ష్యం కాగా, ఇప్పటికే 4.03లక్షల లైట్లను ఏర్పాటు చేశారు. మిగిలినవి నెలరోజుల్లో ఏర్పాటు చేయనున్నారు. దీంతో దేశంలో ఈ ఘనత సాధించిన తొలి మున్సిపల్కార్పొరేషన్గా జీహెచ్ఎంసీ గుర్తింపు పొందనుంది. పైగా ఈ లైట్లఏర్పాటుతో గ్రేటర్లో ఏటా 162.275 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. సాక్షి, సిటీబ్యూరో: పూర్తిస్థాయి ఎల్ఈడీ వీధిదీపాల నగరంగా హైదరాబాద్ త్వరలోనే అవతరించనుంది. దేశంలోనే ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయని విధంగా దాదాపు 4.60 లక్షల ఎల్ఈడీల లక్ష్యాన్ని జీహెచ్ఎంసీ పూర్తి చేయనుంది. నగరంలోని మొత్తం వీధిదీపాల స్థానే ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ.. ఇప్పటి వరకు 4.03 లక్షల లైట్లను ఏర్పాటు చేసింది. మిగతా వాటిని మరో నెలరోజుల్లో ఏర్పాటు చేయనుంది. దేశంలో ఎన్నో మునిసిపల్ కార్పొరేషన్లు ఎల్ఈడీల ఏర్పాటుకు సిద్ధమైనప్పటికీ ఏర్పాటుకు మాత్రం ఎంతో సమయం పడుతోంది. ఇప్పటి వరకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో రెండు లక్షల ఎల్ఈడీలు, విశాఖపట్నం కార్పొరేషన్లో లక్ష ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. వాటిని అధిగమించి జీహెచ్ఎంసీ దాదాపు ఎనిమిది నెలల్లో 4 లక్షల పైచిలుకు ఎల్ఈడీలను ఏర్పాటు చేసింది. మిగతా ఏర్పాటు పూర్తయితే దేశంలోనే అత్యధిక ఎల్ఈడీలే కాక నగరమంతా ఎల్ఈడీలు అందుబాటులోకి తెచ్చిన కార్పొరేషన్‌గా జీహెచ్ఎంసీ అవతరించనుంది. రహదారుల వెంబడి, జీహెచ్ఎంసీ పార్కులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, శ్మశానవాటికలు ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) ఆధ్వర్యంలో ఈ పనులుజరుగుతున్నాయి. తగ్గిన విద్యుత్ ఖర్చులు జీహెచ్ఎంసీలో ఈ లైట్ల ఏర్పాటు ద్వారా ఏటా 162.275 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. తద్వారా రూ.115.12 కోట్ల విద్యుత్ ఖర్చులు తగ్గుతాయి. ఏడాదికి 1,29,820 టన్నుల కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయని విద్యుత్ ఇంజినీర్లు చెబుతున్నారు. ఎల్ఈడీ వీధిదీపాల ఏర్పాటుతో రహదారులు ప్రకాశవంతంగా ఉండి రాత్రుళ్లు ప్రమాదాలు ఇప్పటికే చాలా వరకు తగ్గాయని పేర్కొన్నారు. గడచిన ఐదు మాసాల్లోనే జీహెచ్ఎంసీ విద్యుత్ బిల్లులు దాదాపు రూ.29 కోట్లు తగ్గాయి. ప్రాజెక్టు మొత్తం పూర్తయితే విద్యుత్ వినియోగం 55 శాతం తగ్గుతుందని అంచనా. ఎల్ఈడీల ఏర్పాటు ప్రాజెక్ట్ వ్యయం మొత్తం రూ.217.12 కోట్లు కాగా, జీహెచ్ఎంసీ ఎలాంటి పెట్టుబడి పెట్టలేదు. విద్యుత్ ఆదాతో మిగిలే నిధులనే వాయిదాల పద్ధతిలో ఈఈఎస్ఎల్కు చెల్లించనుందని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆటోమేటిగ్గా ఆన్/ ఆఫ్.. ♦ సూర్యకాంతి కనుగుణంగా ఆటోమేటిగ్గా స్ట్రీట్‌లైట్స్ ఆన్/ఆఫ్ అవుతాయి. ♦ సెంట్రల్లీ కంట్రోల్డ్ మానిటరింగ్ సిస్టమ్‌తో ఏరోజు ఎన్ని లైట్లు వెలగనిదీ తెలుస్తుంది. ♦ ప్రకాశవంతమైన వెలుతురు వల్ల రహదారి ప్రమాదాలు తగ్గుతాయి. ఏటా ప్రయోజనం ఇదీ.. ♦ ఆదా అయ్యే విద్యుత్ చార్జీలు: రూ.115.22 కోట్లు ♦ తగ్గే నిర్వహణ ఖర్చు: రూ.22 కోట్లు ♦ తగ్గనున్న కార్బన్ డై ఆక్సైడ్: 1,29,820 టన్నులు ♦ తగ్గే పీక్ డిమాండ్: 40.42 మెగావాట్లు -
తేలని ఎల్ఈ‘ఢీ’
సాక్షి, గుంటూరు: నగరంలో ఎల్ఈడీ బల్బుల వ్యవస్థను చీకట్లు కమ్ముకున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో పట్టణంలో శివారు కాలనీలు, విలీన గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. అధికంగా బిల్లుల చెల్లింపు పనులు పూర్తి చేయకుండానే కాంట్రాక్టు సంస్థకు గతంలో పనిచేసిన కొందరు అధికారులు ఎక్కువ మొత్తంలో బిల్లులు చెల్లించారు. దీన్ని గుర్తించిన ఉన్నతాధికారులు నిలిపివేసి నోటీసులు జారీ చేయడంతో వారికి చిర్రెత్తుకొచ్చింది. నగరపాలక సంస్థకు విద్యుత్ బిల్లులు ఎంత ఆదా అవుతుందనేది తమకు సంబంధం లేదని, లోడును బట్టి బిల్లులు చెల్లించాల్సిందేనంటూ కాంట్రాక్ట్ సంస్థ పట్టుబట్టింది. అగ్రిమెంట్ ప్రకారం తమకు విద్యుత్ బిల్లు ఎంత ఆదా అవుతుందో అంత మాత్రమే చెల్లిస్తామని నగరపాలక సంస్థ అధికారులు తేల్చి చెప్పేశారు. మూడేళ్లు దాటుతున్నా పూర్తి కాని పనులు గుంటూరు నగరంలో విద్యుత్ ఆదా చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీఎంఎస్ జీవో నంబరు 74 ప్రకారం ఎనర్జీ ఎఫీషియంట్ సర్వీసు లిమిటెడ్ సంస్థతో 2015లో అగ్రిమెంట్ నగరపాలక సంస్థ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. 25,008 ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయడంతోపాటు ఏడేళ్ళపాటు నిర్వహణ, రిపేర్లు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ పనుల్ని పది వారాల్లో పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ మూడేళ్లు దాటుతున్నా అతీగతీ లేదు. కాంట్రాక్ట్ సంస్థతో కుమ్మక్కైన అప్పటి అధికారులు కొందరు 2017 జనవరి నుంచి నెలకు రూ. 30 లక్షలు చొప్పున బిల్లులు చెల్లించేశారు. నిర్వహణ బాధ్యతలు, రిపేర్లు అయినా చేస్తున్నారా? అంటే అది లేదు. శివారు కాలనీలో చీకట్లు నగర శివారు కాలనీలైన జన్మభూమి నగర్, స్వర్ణభారతినగర్, ఏటుకూరు రోడ్డు, సుద్దపల్లి డొంక, చండ్రరాజేశ్వరరావు నగర్ వంటి పలు కాలనీలతోపాటు విలీన గ్రామాల్లోసైతం ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయలేదు. దీంతో ఆయా కాలనీలు, గ్రామాల ప్రజలు అంధకారంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై జన్మభూమి కార్యక్రమాల్లో సైతం నగరవాసులు అధికారులను నిలదీసిన విషయం తెలిసిందే. గతంలో జరిగిన అక్రమ బిల్లుల చెల్లింపును గుర్తించిన అధికారులు 2017 ఆగస్టు నుంచి కాంట్రాక్ట్ సంస్థకు బిల్లులు నిలిపివేశారు. అంతేకాకుండా నిర్వహణ, రిపేర్లతో పాటు గతంలో తీసుకున్న బిల్లులకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు రావాలంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరు నోటీసులు జారీ చేశారు. దీనిపై జనవరి 19వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన ‘‘వెలుగు చూసిన చీకటి కోణం’’ అనే కథనానికి స్పందించిన కాంట్రాక్ట్ సంస్థ ఐదు రోజుల క్రితం జీఎంసీ అధికారులతో సమావేశమైంది. చేతులెత్తేసిన కాంట్రాక్టర్ ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు తరువాత బల్బులకు సగం లోడు మాత్రమే పడుతుందని, దాన్ని బట్టి తమకు బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టు సంస్థ పట్టుబట్టింది. లోడుతో తమకు సంబంధం లేదని, అగ్రిమెంట్ ప్రకారం విద్యుత్ బిల్లులో ఎంత ఆదా అవుతుందో అంత మొత్తం మాత్రమే చెల్లించే వీలుందని నగరపాలక సంస్థ అధికారులు తేల్చి చెప్పారు. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధుల అగ్రిమెంట్ మార్చుకుని వస్తామని, అప్పటి వరకు తాము రిపేర్లు, నిర్వహణ బాధ్యతలు నిర్వహించలేమని చేతులెత్తేసి వెళ్లిపోయారు. ఆరు నెలల క్రితం వేసిన లెక్కల ప్రకారం సుమారుగా 3వేల బల్బులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈసంఖ్య ఇప్పుడు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్టు సంస్థ చేతులు ఎత్తేయడంతో కొత్త బల్బులు ఏర్పాటు చేయలేక వాటి నిర్వహణ, రిపేర్లు ఎవరు చూడాలో తెలియక నగరపాలక సంస్థ అధికారులు సతమతమవుతున్నారు. డీఎంఈ దృష్టికి తీసుకెళ్లాం ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసిన ఎనర్జీ ఎఫీషియంట్ సర్వీసు లిమిటెడ్ సంస్థకు అగ్రిమెంట్ ప్రకారం బిల్లులు చెల్లిస్తామని చెప్పాం. అయితే వారు అందుకు అంగీకరించకుండా అగ్రిమెంట్ మార్చుకుని వస్తామని వెళ్లారు. ఈవిషయాన్ని డీఎంఈ కన్నబాబు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ఆదేశాల మేరకు కొత్త ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు చేస్తాం. – చల్లా అనురాధ, కమిషనర్ -
ఎల్ఈడీ వెలుగులేవీ?
కర్నూలు(అర్బన్): గ్రామాల్లో ఎల్ఈడీ దీపాల ఏర్పాటుకు గ్రహణం పట్టింది. గతేడాది ప్రారంభంలో జిల్లాలోని 889 పంచాయతీల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాల, గోస్పాడు మండలాల్లో మాత్రమే పూర్తి ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేశారు. మిగిలిన పంచాయతీ(854)ల గురించి పట్టించుకోవడం లేదు. కర్నూలు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈఎస్‌ఐఎల్ కంపెనీ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మూడో లైన్ ఏదీ? గ్రామ పంచాయతీల్లోని అన్ని వీధుల్లో ఎల్ఈడీ లైట్లు వేయాలంటే ముందుగా ప్రస్తుతం ఉన్న విద్యుత్ వైరింగ్‌కు తోడు విద్యుత్ సరఫరాను కంట్రోల్ చేసేందుకు అవసరమైన మూడో లైన్‌ను (ఆన్ ఆఫ్) వేయాల్సి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం 2,96,478 మీటర్ల వైర్ అవసరం కానుంది. ఏపీఎస్పీడీసీఎల్ ఉచితంగా అన్ని గ్రామ పంచాయతీల్లో మూడో లైన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే సంస్థ ఈ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఎల్ఈడీ లైటింగ్‌లో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 1.81,760 విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. అనేక గ్రామ పంచాయతీలు విస్తరించిన నేపథ్యంలో తాజాగా 19,969 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు గుర్తించారు. ఒక్కో ఎల్ఈడీ బల్బుకు రూ.150 చెల్లించాల్సిందే ... గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటుకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీలు ఒక్కో బల్బుకు రూ.150 ప్రకారం చెల్లించాల్సి ఉంది. ఒక్క సారి ఈ మొత్తం చెల్లిస్తే సదరు కంపెనీ పదేళ్లపాటు వాటి నిర్వహణ బాధ్యతను స్వీకరిస్తుంది. ఈ మేరకు జిల్లాలో మొత్తం 2,01,729 ఎల్ఈడీ బల్బులకు గాను రూ.3.02 కోట్లను పంచాయతీలు చెల్లించాల్సి ఉంది. మార్చి నాటికి పూర్తి చేయాలని కోరాం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మూడో విద్యుత్ లైను ఏర్పాటు చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులను కోరాం. అలాగే అవసరమైన మేరకు కొత్తగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపట్టాం. ఈ పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పంచాయతీల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. మార్చి ఆఖరు నాటికి ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ దాదాపు పూర్తి చేయాలని కోరాం. – బీ పార్వతి, జిల్లా పంచాయతీ అధికారిణి -
పంచాయతీలకు ఎల్ఈడీ షాక్!
సాక్షి, అమరావతి: కాదేదీ కవితకనర్హం అని కవి చెప్పిన మాట. కానీ కాదేదీ అవినీతికనర్హం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు రుజువు చేస్తున్నారు. ఇసుక నుంచి ఇరిగేషన్ వరకు, మట్టి నుంచి మద్యం వరకు, సోలార్ టెండర్ల నుంచి బొగ్గు కొనుగోళ్ల వరకు.. చివరకు గుడి భూములను కూడా వదలకుండా అన్నిటినీ అవినీతిమయం చేసిన సర్కారు పెద్దలు చివరకు గ్రామ పంచాయతీలనూ వదల్లేదు. ఎల్ఈడీ వీధి దీపాల పేరుతో పంచాయతీలపై మోయలేని గుదిబండను మోపి అందులో కమీషన్లను కొట్టేస్తున్నారు. గ్రామాల్లోని వీధి దీపాలుగా ఇప్పుడున్న ట్యూబ్‌లైట్లు, సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసుకోవాలంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ జారీ చేసిన ఉత్తర్వులు పంచాయతీల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఈ ఎల్ఈడీ బల్బుల కుంభకోణం.. పంచాయతీలపై అప్పుల భారాన్ని మోపుతూ.. ప్రయివేటు కంపెనీలకు కాసులను, ప్రభుత్వ పెద్దలకు కమీషన్లను కురిపిస్తోంది. రూ.900 బల్బుకు రూ. 4,570 గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసినందుకు ఆయా గ్రామ పంచాయతీ ప్రతి నెలా కరెంట్ బిల్లులు యదావిధిగా చెల్లిస్తూనే లైట్ ఏర్పాటు చేసిన కాంట్రాక్టరుకు ఒక్కొక్క బల్బుకు ప్రతి ఏటా రూ.457 చొప్పున పదేళ్ల పాటు అంటే రూ. 4,570 చెల్లించాలట. ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఈడీ గుదిబండను మోపుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఏడాదిలోగా అన్ని గ్రామ పంచాయతీలలో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు పూర్తి కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేశ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రూ.900 పెట్టుబడి పెట్టి ఒక్క ఎల్ఈడీ లైటు ఏర్పాటు చేస్తే ఏడాదికి రూ.457 చొప్పున రేండేళ్లలోనే ఆ కాంట్రాక్టరు చేతికి పెట్టుబడి వచ్చేస్తుంది. మరో 8 ఏళ్లపాటు లాభాలందుకుంటారు. అలా పదేళ్లలో కాంట్రాక్టరు చేతికి రూ.4,570లు చేరతాయి. సర్కారు పెద్దలకు భారీగా కమీషన్.. మార్కెట్లో ఒక్కొక్క 24 వాట్ల ఎల్ఈడీ బల్బు ధర సుమారు రూ.900 ఉంది. టోకున కొంటారు కాబట్టి ఇంకా తక్కువకే లభించే అవకాశం ఉంది. 38 లక్షల బల్బులకుగాను పదేళ్లలో రూ. 1,736 కోట్లు పంచాయతీలు చెల్లిస్తాయి. ఇందులో పెట్టుబడి, వడ్డీలు, నిర్వహణ ఖర్చులు అన్నీ రూ.736 కోట్లు తీసేసినా పదేళ్లలో ప్రయివేటు కాంట్రాక్టర్లకు మిగిలేది రూ.1,000 కోట్లకు పైమాటే. అందులో పెద్దమొత్తంలో సర్కారు పెద్దలకు దశలవారీగా కమీషన్ల రూపంలో చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందని పంచాయతీరాజ్ శాఖలో వినిపిస్తోంది. మొత్తం 38 లక్షల బల్బులు రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 29,89,630 విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. గ్రామాల్లో కొత్తగా మరో 8 లక్షల విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి, మొత్తం 38 లక్షల స్తంభాలకు ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిన్న గ్రామ పంచాయతీలో కూడా రెండు వందలకు పైనే విద్యుత్ స్తంభాలు ఉండే పరిస్థితి. నెడ్‌క్యాప్, ఈఎస్ఎస్ఎల్లతో ఒప్పందం ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు ప్రక్రియ కోసం... నెడ్‌క్యాప్, ఈఎస్ఎస్ఎల్ సంస్థలతో పంచాయతీరాజ్ శాఖ ఒప్పందం చేసుకుంది. నెడ్‌క్యాప్, ఈఎస్ఎస్ఎల్ సంస్థలు ప్రైవేట్ కాంట్రాక్టర్లను నియమించుకొని, అన్ని గ్రామాల్లో ఏడాది కాలంలోనే ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయాల్సి ఉంది. తొలివిడతగా తూర్పుగోదావరిలో సూర్య కంపెనీ, విశాఖ జిల్లాలో తేజ కంపెనీ ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయనున్నాయి. గ్రామాల్లో ఏర్పాటు చేసే 24 వాట్ల ఎల్ఈడీ బల్బు ఒక్కో దానికి ఏటా రూ.457 చొప్పున పదేళ్ల పాటు క్రమం తప్పుకుండా గ్రామ పంచాయతీ చెల్లించాల్సి ఉంది. (గ్రామ కూడలి ప్రాంతాల్లో 75 వాట్ల ఎల్ఈడీ బల్బు ఏర్పాటు చేసుకుంటే ఒక్కొక్క బల్బుకు చెల్లించాల్సిన మొత్తం కూడా ఆ మేరకు పెరుగుతుంది.) ఒక్కో పంచాయతీకి ఏటా రూ.లక్ష అప్పే ఒక్కొక్క స్తంభానికి ఎల్ఈడీ బల్బు ఏర్పాటు చేసినందుకు రూ.457 చొప్పున 200 స్తంభాలకు సంబంధిత పంచాయతీ ఏటా రూ.లక్ష వరకు చెల్లించాల్సి ఉంటుంది. పదేళ్ల పాటు పంచాయతీ ఈ మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీల్లో 10,500 గ్రామ పంచాయతీలు మైనర్ పంచాయతీలే. కేంద్రం 14వ ఆర్థిక సంఘం పేరిట గ్రామ పంచాయతీలకు నేరుగా ఇచ్చే నిధులను కలుపుకొన్నా కూడా ఒక్కొక్క మైనర్ పంచాయతీ ఏడాది ఆదాయం ఐదారు లక్షలకు ఆటు ఇటుగానే ఉంటుంది. -
‘ఎల్ఈడీ’ చిక్కులకు చెక్
సాక్షి, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించిన ఎల్ఈడీ బల్బులు భవిష్యత్తులో దృష్టి లోపాలను సరిదిద్దేందుకూ ఉపయోగపడొచ్చని నీలిరంగు ఎల్ఈడీల సృష్టికర్త, నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ హిరోషీ అమానో తెలిపారు. మనం విరివిగా వాడుతున్న తెల్లని ఎల్ఈడీ బల్బుల వల్ల నిద్రలేమి వంటి సమస్యలొస్తాయన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. వీటిని సరిదిద్దేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. గురువారం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ప్లాటినమ్ జూబ్లీ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎల్ఈడీల కాంతి మెలటోనిన్ అనే రసాయన ఉత్పత్తిని తగ్గిస్తున్న కారణంగా కొందరిలో నిద్రలేమి సమస్యలొస్తున్నాయని పేర్కొన్నారు. టీవీ, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ల కాంతి తీవ్రతను తగ్గించుకోవడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు అధిగమించొచ్చని సూచించారు. 1,500 సార్లు విఫలం.. నీలిరంగు ఎల్ఈడీ సృష్టికి జరిగిన ప్రయత్నాలు, ప్రాముఖ్యం గురించి ఆయన ఈ సందర్భంగా వివరించారు. ‘విద్యతో మానవుడి కష్టాలు తీర్చాలి’ అన్న తన ప్రొఫెసర్ మాటలు ఎంతో ప్రభావితం చేశాయని హిరోషీ పేర్కొన్నారు. అప్పటివరకు చదువుపై పెద్దగా అంతగా శ్రద్ధ పెట్టలేదని, ఆ తర్వాతే ఏదైనా చేయాలనే తపనతో కృషి చేసినట్లు వివరించారు. నీలి రంగు ఎల్ఈడీలు చేసేందుకు ఒకే ప్రయోగాన్ని 1,500 సార్లు చేసి విఫలమయ్యానని, అయినా పట్టు వదలకుండా ప్రయత్నించినట్లు వివరించారు. చివరికి గాలియం నైట్రైట్ అనే పదార్థంతో విజయం సాధించినట్లు పేర్కొన్నారు. నీలిరంగు ఎల్ఈడీ ఎంతో కీలకం.. ఎరుపు, పచ్చ రంగు ఎల్ఈడీలు దశాబ్దాల కిందే తయారైనా, విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు.. అందరికీ అనుకూలంగా ఉండే తెల్లటి బల్బుల కోసం నీలి రంగు ఎల్ఈడీలు తయారు చేసే సాంకేతికత ఎంతో కీలకమైందని చెప్పారు. నీలిరంగు బల్బులకు ప్రత్యేక పదార్థపు పొరను జోడించడంతో తెలుపు ఎల్ఈడీలు తయారయ్యాయని వివరించారు. సాధారణ బల్బుల కంటే ఎన్నో రెట్లు తక్కు విద్యుత్‌తో ఎక్కువ వెలుగునిచ్చే ఎల్ఈడీలు పేదల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిందని, ఇది తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని వివరించారు. ఐఐసీటీతో కలసి పనిచేయాలని.. తెలుపు ఎల్ఈడీలతో వస్తున్న ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు 360 నానోమీటర్ల స్థాయి తరంగాలను వెదజల్లే డయోడ్లు పనికొస్తాయని హిరోషీ వివరించారు. ఈ రకమైన బల్బుల తయారీకి ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయని చెప్పారు. ఇవి అందుబాటులోకి వస్తే చిన్న పిల్లల్లో కనిపించే హ్రస్వదృష్టిని సరిచేసేందుకు కూడా అవకాశం ఉంటుందని వివరించారు. ప్రస్తుతం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందని.. తాము మాత్రం ఇంటర్నెట్ ఆఫ్ ఎనర్జీ గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. వైర్లెస్ పద్ధతిలో 120 మీటర్ల దూరానికి కూడా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఉపయోగపడే ఈ టెక్నాలజీతో భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. 20 నుంచి 60 నిమిషాలు మాత్రమే గాల్లో ఎగరగల డ్రోన్లను ఇంటర్నెట్ ఆఫ్ ఎనర్జీ ద్వారా రోజంతా ఎగిరేలా చేయొచ్చని పేర్కొన్నారు. దీంతో రోడ్లపై వాహనరద్దీ తగ్గించే ఎయిర్ ట్యాక్సీలు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఈ విషయంలో ఐఐసీటీలోని యువ శాస్త్రవేత్తలతో కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఎల్ఈడీ బల్బులు వాడుతున్నారా..?
సాక్షి, న్యూఢిల్లీ: పవర్ ఆదాతో పాటు పర్యావరణానికీ మేలు చేసే ఎల్ఈడీ బల్బులు వాడేందుకు మొగ్గుచూపుతున్నారా..? అయితే ఒకసారి మార్కెట్ పరిశోధన సంస్థ నీల్సన్ చేపట్టిన సర్వేపై దృష్టిసారించాల్సిందే. ఎల్ఈడీ బల్బుల్లో 75 శాతం వరకూ ప్రభుత్వం నిర్ధేశించిన వినియోగదారుల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఈ సర్వేలో వెల్లడైంది. జులైలో ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్, న్యూఢిల్లీలోని 200 రిటైల్ అవుట్లెట్లలో నిర్వహించిన ఈ అధ్యయనంలో ఎల్ఈడీ ఉత్పుత్తులు ప్రమాదకరమని, అత్యంత రిస్క్‌తో కూడినవని తేలింది. జాతీయ రాజధాని ఢిల్లీలోనే భద్రతా ప్రమాణాలను యథేచ్ఛగా ఉల్లంఘించారని వెల్లడైంది. నాన్ బ్రాండెడ్ ఎల్ఈడీ ఉత్పత్తులు మరింత ప్రమాదకరమని సర్వే పేర్కొంది. ఇక ఎల్ఈడీ బల్బు బ్రాండ్‌ల్లో 48 శాతం తయారీదారుల అడ్రస్‌ను ఇవ్వడం లేదు. మరో 31 శాతం తయారీదారు పేరును ప్రస్తావించడం లేదని ఈ సర్వేలో తేలింది. ఎల్ఈడీ ఉత్పత్తుల రంగంలో తక్కువ నాణ్యతతో రూపొందిన చైనా బల్బులు పోటెత్తుతున్న క్రమంలో ఎల్ఈడీ తయారీదారులు భద్రతా ప్రమాణాలను దీటుగా రూపొందించుకునేందుకు వారి ఉత్పత్తులను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వద్ద (బీఐఎస్) వద్ద నమోదు చేయించుకోవాలని ఈ ఏడాది ఆగస్టులో కోరింది. చైనా నుంచి చవకబారు వినిమయ వస్తువుల రాకకు చెక్ పెట్టేందుకు వినియోగ, క్యాపిటల్ గూడ్స్ వస్తువులకు భారత్ కఠిన నాణ్యతా ప్రమాణాలను నిర్ధేశించింది. మార్కెట్‌ను ముంచెత్తే చైనా వస్తువులతో పన్ను రాబడి తగ్గడంతో పాటు పెట్టుబడి ఉద్దేశాలను దెబ్బతీసి సులభతర వాణిజ్య స్ఫూర్తికీ తూట్లు పొడుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. -
అన్ని నగరాల్లో ఎల్ఈడీ పెడ్తాం
-
పెట్రోల్ బంకుల్లో ఎల్ఈడీలు, సీలింగ్ ఫ్యాన్లు
న్యూఢిల్లీ: దేశంలోని పెట్రోల్ బంకుల్లో త్వరలో విద్యుత్‌ను అదా చేసే ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు, సీలింగ్ ఫ్యాన్లను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో ఎల్ఈడీ బల్బును రూ.65కు, ట్యూబ్‌లైట్‌ను రూ.230, సీలింగ్ ఫ్యాన్‌ను రూ.1,150కు ప్రజలకు అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఆ తర్వాత నెలరోజుల్లో అమ్మకాలు మొదలైతాయి. ఓఎంసీకి దేశవ్యాప్తంగా 53 వేల పెట్రోల్ బంకులు ఉన్నాయి. అయితే వీటన్నిటిలోనూ ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు, సీలింగ్ ఫ్యాన్లను విక్రయిస్తారా, లేదా అనేది స్పష్టం కాలేదు. -
సాంకేతిక రంగంలో గిరిజన యువతులు
‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగ¯ŒS’ అనే విషయాన్ని మరోమారు ఆదివాసీ యువతులు రుజువు చేశారు. ఎల్ఈడీ బల్బుల తయారీలో ముందంజ వేశారు. దాదాపు 70 మంది గిరిజన యువతులు ఉపాధి పొందుతున్నారు. రూ.ఐదు కోట్ల బల్బుల సరఫరాకు ఆర్డర్ పొందారు. స్వయం ఉపాధి రంగంలో దిక్సూచిగా నిలిచిన రంపచోడవరం ఆదివాసీ యువతులు విజయగాథ ఎందరికో స్ఫూర్తిని ఇస్తుంది. – రంపచోడవరం ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కో సం అనేక చోట్ల తిరిగి నేడు అనేక మంది గిరిజన యువతకు ఉపాధినిస్తోంది వీరలక్ష్మి. ‘రంప గిరి జన మహిళ సమాఖ్య పరిశ్రమ కో ఆపరేటివ్ సొసైటీ’ పేరుతో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ బల్బుల తయారీ యూనిట్లో 41 మంది గిరిజన యువతులు సభ్యులుగా మరో 29 మంది ఉపాధి పొందుతున్నారు. వీరికి జీతాలతో పాటు సభ్యులు యూనిట్ నిర్వహణ ద్వారా వచ్చే లాభాలను సమానంగా పంచుకుంటారు. ఏజెన్సీలో ఇంజినీరింగ్ చదివి గిరిజనులకు ఉపాధి అవకాశాలు లేవని కేవలం ఏజెన్సీ డీఎస్సీ తప్ప అంటూ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ మీటింగ్‌లో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించింది. ఏజెన్సీలో పరిశ్రమ స్థాపన కోసం నిర్వహించిన అన్ని అర్హత పరీక్షల్లో విజయం సాధించి నేడు ఎల్ఈడీ యూనిట్ నిర్వహణ దగ్గర నుంచి మార్కెట్ వరకు అన్ని తానై చూసుకుంటుంది. రూ.5 కోట్ల ఆర్డర్ లాభాల బాటలో పయనిస్తున్న ఎల్ఈడీ యూనిట్ రూ. 5 కోట్లు వ్యాపారం దిశగా అడుగులు వేస్తోది. ఏపీఈపీడీసీఎల్‌కు రూ. 3 కోట్లతో పాటు ఇతర సంస్థలకు కూడా ఎల్ఈడీ ఉత్పత్తులు సరఫరా చేసేందుకు అర్డర్ పొందారు. జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, ఐటీడీఏ పీవో ఎఎస్ దినేష్‌కుమార్ ప్రోత్సాహంతో ముందుకు వెళ్లుతున్నారు. -
136 గ్రామాల్లో ఎల్ఈడీ వెలుగులు
అనంతపురం సిటీ : రాష్ట్ర ప్రభుత్వం 136 గ్రామాల్లో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చిందని జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వరమ్మ తెలిపారు. ఈ మేరకు గురువారం అనుమతి వచ్చిందని తెలిపారు. బల్బుల ఏర్పాటుకు పంచాయతీ కార్యదర్శులను ఆదేశించినట్లు తెలిపారు.136 గ్రామాల్లో ఎన్ని విద్యుత్ స్తంభాలు, పని చేస్తున్న మీటర్లు, వాటి బిల్లులు వస్తున్నాయా? లేదా లాంటి విషయాలను ఆరాతీయాలని చెప్పినట్లు తెలిపారు. ఈ నెల 20 లోపు ఈ నివేదికను పంచాయతీ కార్యదర్శులు అందజేయాల్సి ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు పంచాయతీ కార్యాలయాలు ఇతర వినియోగాలకు విద్యుత్ వాడకున్నా బిల్లులు చెల్లిస్తూ వచ్చారన్నారు.తక్షణం అనవసరపు విద్యుత్ కనెక్షన్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చీకట్లో మగ్గుతున్న గ్రామాలను గుర్తించి అక్కడ ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
జిల్లాకు చేరిన 45 వేల ఎల్ఈడీ బల్బులు
అనంతపురం అగ్రికల్చర్ : తొమ్మిది వాట్స్ సామర్థ్యం కలిగిన 45 వేల ఎల్ఈడీ బల్బులు బుధవారం జిల్లాకు వచ్చినట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ ఆర్ఎన్ ప్రసాదరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రెండు చొప్పున ఎల్ఈడీలు ఉచితంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 5 వేలు పంపిణీ చేయగా తాజాగా 45 వేలు వచ్చాయన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 96 వేల కుటుంబాలు గుర్తించామని తెలిపారు. ఈనెలాఖరులోగా అందరికీ ఎల్ఈడీలు అందజేస్తామన్నారు. -
ఆదివాసీ మహిళా దీపం
సాంకేతికంగా రాణిస్తున్న గిరిజన యువతులు ‘ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్’ అన్న చిలకమర్తి మాట అక్షర సత్యమని నిరూపించారు ఆదివాసీ యువతులు. ఇంటింటా అతితక్కువ ఖర్చుతో ఎక్కువ వెలుగులిచ్చే ఎల్ఈడీ బల్బుల తయారీలో వారిది అందెవేసిన చేయి అయింది. రంపచోడవరంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ బల్బుల తయారీ కేంద్రంలో ఆరు నెలల్లోపే రూ. 40 లక్షల సరుకును తయారు చేసి రికార్డు సృష్టించారు. ఈ గిరిజన యువతుల విజయం అందరికీ స్ఫూర్తిదాయకం. – రంపచోడవరం ఏజెన్సీలోనే గిరిజన యువతకు ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో రంపచోడవరంలో ఎల్ఈడీ బల్బుల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్ భావించారు. ఆయన ఆలోచనలకు కార్యరూపం ఇస్తూ 42 మంది గిరిజన యువతులను ఎంపిక చేశారు. వారికి బెంగళూరుకు చెందిన సాంకేతిక నిపుణులతో రంపచోడవరం, మారేడుమిల్లిల్లోని యూత్ ట్రైనింగ్ సెంటర్ల (వైటీసీ)లో శిక్షణ ఇప్పించారు. శిక్షణ అనంతరం ఐటీడీఏ మంజూరు చేసిన రూ. 18 లక్షలతో రంపచోడవరంలోని సెట్రాజ్ భవనంలో ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్‌ల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. రంప గిరిజన మహిళా సమాఖ్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ పేరుతో ప్రారంభించిన ఈ ఎల్ఈడీ యూనిట్‌కు ఆంధ్రాబ్యాంకు నుంచి రూ. 50 లక్షల రుణం తీసుకున్నారు. ఉత్పత్తి ప్రారంభించిన ఆరు నెలల్లోనే రూ. 40 లక్షల విలువైన ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్‌లను తయారు చేశారు. వీటిని ప్రభుత్వం ద్వారా గృహ అవసరాలకు సరఫరా చేశారు. ఆర్డర్లు ఇలా.. రంప గిరిజన మహిళా సమాఖ్య పారిశ్రామిక సహకార సంఘం తయారు చేసిన ఎల్ఈడీ ఉత్పత్తులతో శ్రీశైలం ఆలయం మొత్తం లైటింగ్‌ను ఎల్ఈడీగా మార్చేందుకు కాంట్రాక్ట్ వచ్చింది. ఇద్దరు ఎలక్ట్రీషియన్లను ఏర్పాటు చేసి అక్కడ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే ఏపీ ఈపీడీసీఎల్ లక్ష ఎల్ఈడీ బల్బులు సరఫరాకు అర్డర్ ఇచ్చింది.అలాగే జిల్లాలో నగరం పంచాయతీ పరిధిలో ఎల్ఈడీ కాంతుల నింపేందుకు అర్డర్‌ను దక్కించుకున్నారు. నిర్వహణ బాధ్యతలన్నీ ఆమెవే.. ఒకప్పుడు ఉద్యోగం కోసం ఐటీడీఏ చుట్టూ తిరిగి విసుగుచెందిన కె. వీరలక్ష్మీ ఎల్ఈడీ బల్బుల యూనిట్ నిర్వహణ బాధ్యత చూస్తున్నారు. కొత్త బ్యాచ్‌కు శిక్షణతో పాటు యూనిట్లో తయారవుతున్న ఉత్పత్తుల పర్యవేక్షణ, మార్కెట్‌ను కూడా తానే చూస్తున్నారు. కొత్తగా 20 మంది గిరిజన యువతులకు ఎల్ఈడీ బల్బులు తయారీపై శిక్షణ ఇస్తున్నారు. యూనిట్లో 0.5 వాల్ట్ నుంచి120 వాల్ట్స్ వరకు ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్‌లను తయారు చేస్తున్నారు. వీటిలో చార్జింగ్‌తో పనిచేసే బెడ్‌ల్యాంప్‌లు, చార్జింగ్ లైట్లు కూడా ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీల ఎల్ఈడీ బల్బుల కంటే తక్కువ ధరకే వీరు విక్రయిస్తున్నారు. 300 మందికి ఉపాధే లక్ష్యం ఈ ఎల్ఈడీ బల్బుల యూనిట్ ద్వారా 300 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనేదే నా లక్ష్యం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసినా ఇవ్వని తృప్తి స్థానిక గిరిజన యువతులతో కలిసి పనిచేయడంలో లభిస్తోంది. ఎల్ఈడీ యూనిట్లో టెక్నికల్ విభాగంలో ఇంజనీరింగ్ చదివిన వారితో పాటు ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ చదివిన వారిని మాత్రమే ఎంపిక చేసి యూనిట్‌ను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాం. రా మెటీరియల్ కొనుగోలుకు మరికొంత పెట్టుబడి ఉంటే బాగుంటుంది. ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకువెళ్లాం. ఇంజనీరింగ్ చదివి గేట్ పరీక్షలు రాసేందుకు కనీసం రూ. 700 లేని పరిస్ధితి నుంచి అనేక మందికి జీతాలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. –కె వీరలక్ష్మి, చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎల్ఈడీ యూనిట్, రంపచోడవరం సొంతప్రాంతంలో ఉపాధి ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉండలేక వారి ఇచ్చే జీతాలు సరిపోక ఇబ్బందులు పడే కంటే సొంత ప్రాంతంలో ఉపాధి దొరకడం ఎంతో సంతోషంగా ఉంది. ఐటీడీఏ సహకారం ఎంతో ఉంది. –ఎం శాంతకుమారి, ఎల్ఈడీ యూనిట్ -
రేపటి నుంచి ఎల్ఈడీ బల్బుల మార్పిడి
సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. పాడైన ఎల్ఈడీ బల్బుల స్థానం లో కొత్త బల్బులను ఉచితంగా పంపిణీ చేసేందుకు విద్యుత్ శాఖ సిద్ధమైంది. బుధవారం నుంచి రోజుకు రెండేసి మండలాల్లో బల్బుల పంపిణీకి సమాయత్తం చేశారు. ఈ మేరకు ఎస్పీడీసీఎల్ అధికారులు అవసరమైన మేర కొత్తబల్బులు సిద్ధం చేశారు. గత మార్చి, ఏప్రిల్ మాసాల్లో అధికారులు ఈఈఎస్ఎల్ సంస్థకు చెందిన ఎల్ఈడీ బల్బులను ఇంటికి రెండేసి చొప్పున పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 14.80 లక్షల బల్బులను అప్పట్లో పంపిణీ చేయగా ఇందులో 10 శాతం బల్బులు పాడయ్యాయి. విద్యుత్ వినియోగదారుల ప్రయోజనార్థం పాడైన బల్బుల స్థానంలో కొత్త బల్బులను పంపిణీ చేయడానికి ఈఈఎస్ఎల్ అంగీకరించింది. దీంతో బుధవారం నుంచి పంపిణీకి వాహనాలు బయలుదేరుతున్నాయని ఎస్ఈ హరనాథరావు సోమవారం సాయంత్రం తెలిపారు. ఏ రోజు ఎక్కడంటే... ఒక వాహనంలో ఈ నెల 23న తిరుపతి బాలాజీకాలనీ, రాజీవ్‌నగర్, 24న తిరుపతి ఉత్తరం, పశ్చిమం, 25న తిరుపతి దక్షిణం, తిరుపతి రూరల్, 26న తిరుచానూరు, సబ్‌స్టేషన్, 28న మంగళం, మంగళం రూరల్ 29న కొర్లకుంట, దామినేడు ప్రాంతాల్లో పర్యటించి, బల్బులు పంపిణీ చేస్తారు. అలాగే మరో వాహనంలో 23న ఏర్పేడు, శ్రీకాళహస్తి రూరల్, 24న కేవీబీ పురం, పాపానాయుడు పేట, 25న బుచ్చినాయుడు కండ్రిగ, తొట్టంబేడు, 26న పాకాల ఆపరేషన్, పాకాల రూరల్, 28న చంద్రగిరి, చంద్రగిరి రూరల్, 29న తిరుపతి రూరల్, కల్లూరు 30న శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి సీసీఓ వద్ద పంపిణీ చేస్తారు. అలాగే మూడో వాహనంలో 23న చిన్నగొట్టిగల్లు, ఎర్వ్రారిపాళెం, 24న రొంపిచెర్ల, పీలేరు రూరల్, 25న పీలేరు, గర్నిమిట్ట 26న సదుం, సోమల 28న కలికిరి, కలకడ, 29న వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల్లో పంపిణీ చేస్తారు. నాలుగో వాహనంలో 23న రాయలచెరువు, వెదురుకుప్పం, 24న వడమాలపేట, పుత్తూరు 25న పుత్తూరు రూరల్, నారాయణవనం 26న నిండ్ర, పిచ్చాటూర్, 28న నగరి, నగరి రూరల్ 29న కార్వేటినగరం, ఎస్ఆర్పురం, 30న వరదయ్యపాలెం, చెరివి ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నారు. డిసెంబరు ఒకటో తేదీ నాగలాపురం, పన్నూరు, 2న సత్యవేడు మండలాల్లో పంపిణీ చేయనున్నారు. చిత్తూరు డివిజన్లో.. అలాగే చిత్తూరు డివిజన్లో డిసెంబరు ఒకటో తేదీన పూతలపట్టు, మిట్టూరు, 2న సంతపేట, గిరింపేట, 3న కొంగారెడ్డిపల్లి, చిత్తూరు రూరల్, 5న పెనుమూరు, గంగాధర్‌నెల్లూరు 6న ఆవల్కొండ, పాలసముద్రం, 7న రొంపిచెర్ల, పీలేరు రూరల్ 8న కొత్తపల్లి, రెడ్గిగుంట మండలాల్లో పంపిణీ చేస్తారు. రెండో వాహనం ద్వారా డిసెంబరు ఒకటిన అరగొండ, పైపల్లి, 2న ఐరాల, ఐరాల రూరల్, 3న బంగారుపాళెం, యాదమర్?ర, 5న బంగారుపాళెం, రూరల్, గంగవరం, 6న పలమనేరు, పలమనేరు రూరల్ 7న బెరైడ్డిపల్లి, వీ.కోట మండలాల్లో పంపిణీ చేస్తారు. మూడో వాహనం ద్వారా నబంబరు 30న నిమ్మనపల్లి, చౌడేపల్లి, డిసెంబరు ఒకటో తేదీన పెద్దపంజాణి, పుంగనూరు, 2న పుంగనూరు, రామసముద్రం, 3న మదనపల్లి ఈస్ట్, మదనపల్లి నార్త్, 5న మదనపల్లి వెస్ట్, మదనపల్లి టౌన్, 6న కురబలకోట, బీ. కొత్తకోట, 7న పెద్ద తిప్పసముద్రం, ములకలచెరువు, 8న తంబళ్లపల్లి, పెద్దమండ్యం, 9న సీటీఎం మండలాల్లో పాడైన బల్బులకు కొత్త బల్బులు పంపిణీ చేయనున్నారు. -
ఎల్ఈడీ బల్బులతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
లండన్: స్మార్ట్ ఎల్ఈడీ (లైట్ ఎమిటింగ్ డయోడ్) లైట్లను ఉపయోగించి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను కనెక్ట్ చేయవచ్చని శాస్త్రవేత్తలంటున్నారు. బొమ్మలు, మన ఇంట్లో ఉండే వివిధ రకాల వస్తువులకు బల్బుల నుంచి వచ్చే కాంతి ద్వారా నెట్‌వర్క్‌ను అనుసంధానించవచ్చని వారు చెబుతున్నారు. ఇళ్లలో వాడే ఎల్ఈడీ బల్బులు కాంతిని ప్రసరించడంతోపాటు లైటు సెన్సార్లుగా కూడా పనిచేస్తాయి. ఇవి ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని సందేశాలు పంపుకోగలవు, వస్తువులకు కనెక్ట్ అవ్వగలవు. గృహోపకరణాలు, ధరించదగిన వస్తువులు, సెన్సార్లు, బొమ్మలను బల్బుల కాంతితో కలిపి ఉంచడానికి ఎల్ఈడీల ద్వారా వీలవుతుంది. ఈ పరిశోధనను స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు చేశారు. -
'త్వరలోనే ప్రతి ఇంటికి ఎల్ఈడీ బల్బులు'
హైదరాబాద్: విద్యుత్ పొదుపును ప్రోత్సహించడం కోసం త్వరలోనే ప్రతి ఇంటికి ఎల్ఈడీ బల్బులు వచ్చేలా ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. గురువారం తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో కేసీఆర్‌తో కేంద్రమంత్రి పియుష్ గోయల్ భేటీ అయ్యారు. నిరంతర విద్యుత్‌ను అందించే ఉదయ్ పథకంలో చేరుతామని అన్నారు. త్వరలోనే ఉదయ్‌పై కేంద్ర, రాష్ట్ర అధికారుల మధ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు కేసీఆర్ తెలిపారు. -
విద్యుత్ పొదుపుపై రెండు రోజుల అవగాహన సదస్సు
విజయవాడ : ఇంధన పొదుపుపై ఏప్రిల్ 7,8 తేదీల్లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. శనివారం విజయవాడలో అజయ్ జైన్ విలేకర్లతో మాట్లాడుతూ... ఈ సదస్సుకు 35 దేశాల నుంచి దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 1.87 కోట్ల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశామన్నారు. దీంతో ఇప్పటి వరకు 35 శాతం విద్యుత్ ఆదా అయిందని చెప్పారు. వినియోగదారులకు తక్కువ ధరలకే ఎల్ఈడీ బల్బులు అందజేస్తామన్నారు. రాష్ట్రంలోని 30 మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అజయ్ జైన్ వివరించారు. -
పారిశుద్ధ్య పట్నం
♦ 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం ♦ ప్రతి ఇంటికీ రెండు ఎల్ఈడీ బల్బులు ♦ వందరోజుల ప్రణాళికను ప్రకటించిన ప్రభుత్వం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి ఎంపిక చేసిన పట్టణాలను బహిర్భూమి రహితం(ఓడీఎఫ్)గా మార్చాలనే సంకల్పంతో వంద రోజుల ప్రణాళికను ప్రభుత్వం విడుదల చేసింది.. ఈ ప్రణాళికను అమలు చేసిన మున్సిపాలిటీలకు ప్రోత్సాహక నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పారిశుద్ధ్యం మెరుగు పరిచేందుకు 100 శాతం మరుగుదొడ్లను నిర్మించుకునేలా ప్రజలను చైతన్యపరచాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం జిల్లా కలెక్టర్లతో జరిపిన వీడియోకాన్ఫరెన్స్‌లో మార్గదర్శకాలను జారీచేశారు. బహిరంగ మలవిసర్జన ప్రాంతాలను గుర్తించాలని, వ్యక్తిగత మరుగుదొడ్లు, బహిరంగ ప్రదే శాల్లో టాయిలెట్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేయాలని నిర్దేశించారు. ప్రతి ఇంటికి రెండు ఎల్ఈడీ బల్బులు మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి రెండు ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేయనుంది. విద్యుత్‌ను ఆదా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం సంప్రదాయ బల్బుల వాడకానికి మంగళం పాడాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే రూ.20కే రెండు తొమ్మిది వాట్ల సామర్థ్యం గల ఎల్ఈడీలను అందించేందుకు ప్రతిపాదనలు తయారుచేస్తోంది. వీటిని డిస్కమ్‌ల ద్వారా మున్సిపాలిటీల్లోనే గాకుండా గ్రామ పంచాయతీల్లోనూ పంపిణీ చేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు న్యూఢిల్లీకి చెందిన ఈఈఎస్ఎల్ సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. అలాగే మున్సిపాలిటీల్లో అత్యవసర సేవలకు విఘాతం కలుగకుండా మూడో విద్యుత్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ సరఫరాలో లోపాలు తలెత్తకుండా 24 గంటలపాటు అత్యవసర సేవలందించే సంస్థలకు ప్రత్యేక లైన్ ద్వారా పంపిణీ చేయాలని యోచిస్తోంది. వందశాతం పన్నుల వసూలు స్థానిక సంస్థల్లో పన్నుల వ సూళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్ బకాయిలు, ఆస్తిపన్నును వంద శాతం వసూలు చేసే స్థానిక సంస్థలకు ప్రోత్సాహకాలు అందజేసే అంశాన్ని పరిశీలిస్తోంది. కొత్తగా ఏర్పాటైన ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ కూడా రూ.2 కోట్ల మేర బకాయి పడింది. వీటన్నింటిని రాబట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించనుంది. ఇదిలావుండగా, బడంగ్‌పేట, వికారాబాద్ మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు/ ఘన వ్యర్థాల నిర్వహణకు స్వచ్ఛభారత్ మిషన్ కింద నిధులు కేటాయించేందుకు పురపాలక శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనికి అనుగుణంగా డంపింగ్‌యార్డులకు స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసింది. -
మున్సిపాలిటీలకు ‘ఎల్ఈడీ’ వెలుగులు
తొలి దశలో 25 మున్సిపాల్టీల్లో ప్రారంభం 6 లక్షల కుటుంబాలకు 12 లక్షల బల్బులు: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 25 మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ ధగధగలు క నువిందు చేయనున్నాయి. రాబోయే 100 రోజుల్లోగా ఎల్ఈడీ బల్బుల బిగింపు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశం అనంతరం మున్సిపల్‌మంత్రి కె.తారకరామారావు, విద్యుత్ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. మున్సిపల్, డిస్కంల అధికారులతో జరిగిన సమావేశంలో ఎల్ఈడీ బల్బులను సరఫరా చేసే ఈఎస్ఎస్ఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం 25 మున్సిపాల్టీల్లోని ఆరు లక్షల కుటుంబాలకు సుమారు 12 లక్షల ఎల్ఈడీ బల్బులను సరఫరా చేయనున్నామని, సాధ్యమైనంత తక్కువ ధరకు అందించాలని ఈఎస్ఎస్ఎల్ ప్రతినిధులను మంత్రి కోరారు. గ్రామ పంచాయతీల్లోనూ ఈ తరహా ప్రయత్నానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. రెండో దశలో భాగంగా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీధి దీపాలకు, మూడో దశలో ప్రజలందరికీ సబ్సిడీపై ఎల్ఈడీ బల్బులను సరఫరా చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. ఇంధన పొదుపే లక్ష్యం... విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంధన పొదుపు లక్ష్యంగా పెద్దెత్తున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందన్నారు. త్వరలోనే నల్గొండ, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఎల్ఈడీ బల్బుల బిగింపు కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ చేపడుతుందన్నారు. ప్రతి ఇంటికి 9 వాట్ల ఎల్ఈడీ బల్బులను ప్రజలకు ఉచితంగా సరఫరా చేయనున్నామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డిస్కం, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణ మున్సిపాలిటీలకు ఎల్ఈడీ కాంతులు
హైదరాబాద్ : తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ కాంతులు విరజిమ్మనున్నాయి. తెలంగాణలోని 25 మున్సిపాలిటీల్లో రాబోయే 100రోజుల్లో ఎల్ఈడీ బల్బుల బిగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఐటీ, పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు, ఇందనశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ మరియు డిస్కమ్ అధికారులతో జరిగిన ఈ సమావేశంలో ఎల్ఈడీ బల్బులు సరఫరా చేసే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ ఈఎస్ఎస్ఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి కె.తారకరామరావు ఈ సంస్ధ ఎండీని సాధ్యమైనంత తక్కువకి ఎల్ఈడీ బల్బులను సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 25 మున్సిపాలిటీల్లోని 6లక్షల గృహాలకు 12 లక్షల ఎల్ఈడీ బల్బులను సరఫరా చేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. త్వరలోనే మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లోనూ ఎల్ఈడీ బల్బులను అందిస్తామన్నారు. గ్రామపంచాయితీల్లోనూ ఈ తరహా ప్రయత్నానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి పంచాయితీరాజ్ శాఖ అధికారులను అదేశించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీధి దీపాల్లో ఎల్ఈడీ బల్బుల ఉపయోగాన్ని ప్రారంభిస్తామన్నారు. ఆ కార్యక్రమాన్ని రెండో దశలో చేపట్టనున్నట్లు తెలిపారు. మూడో దశలో ప్రజలకు సబ్సిడీ ద్వారా ఎల్ఈడీ బల్బుల సరఫరా అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. సమావేశానంతరం మాట్లాడిన ఇంధన శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంధన వినియోగాన్ని పొదుపు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. తమ విద్యుత్ శాఖా సిబ్బంది బల్బులను బిగించే భాద్యత తీసుకుంటారన్నారు. త్వరలోనే నల్లగొండ, మెదక్ , నిజామాబాద్ జిల్లాల్లో మెత్తం ఎల్ఈడీ బల్బుల బిగింపును చేపట్టనున్నట్లు తెలిపారు. మెత్తం రాష్ట్రంలో ఉన్న తొంభై లక్షల గృహాల్లో ఎల్ఈడీ బల్బుల బిగింపే లక్ష్యమన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకి ఇంధన ఖర్చు తగ్గుతుందని, ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 9 వాట్ల ఎల్ఈడీ బల్బులను సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఈ రెండు బల్బులను ప్రజలకు పూర్తి ఉచితంగా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి చేసే ఖర్చు విద్యుత్ సరఫరా సంస్ధలకు కరెంట్ ఆదా రూపంలో తిరిగి వస్తుందన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు మున్సిపల్ శాఖాధికారులు, డిస్కమ్ , విద్యుత్ శాఖాధికారులు పాల్గొన్నారు. -
ఇంటింటికీ ఎల్ఈడీ వెలుగులు
♦ రాష్ట్రంలో డిమాండ్ సైడ్ ఎఫీషియంట్ లైటింగ్ ప్రోగ్రాం అమలు ♦ పైలట్ ప్రాజెక్టు కింద మెదక్,నిజామాబాద్ జిల్లాలు ఎంపిక సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ విద్యుత్ బల్బులకు బదులు ఎల్ఈడీ బల్పుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో డిమాండ్ సైడ్ ఎఫీషియంట్ లైటింగ్ ప్రోగ్రాం (డీఈఎల్పీ)ను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్కొన్నారు. సంప్రదాయ విద్యుత్ బల్బులతో పోలిస్తే ఎల్ఈడీ బల్బుల వినియోగం వల్ల 80 శాతం విద్యుత్ పొదుపు అవుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతి ఇంటికి 9 వాట్ల సామర్థ్యం గల రెండు ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేస్తామన్నారు. మంగళవారం జరిగిన రాష్ట్ర పునరుత్పాదక ఇంధన సంస్థ (టీఎన్‌ఆర్‌ఈడీసీఎల్) బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద తొలుత మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గృహాల్లో విద్యుత్ పొదుపు చర్యల వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన భద్రత సాధించవచ్చని అరవింద్ కుమార్ అన్నారు. విద్యుత్ డిమాండు పతాక స్థాయికి చేరినపుడు డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేసేందుకు ఇంధన పొదుపు చర్యలు దోహదపడతాయన్నారు. సమావేశంలో ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ పండా దాస్, సంస్థ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సి.శ్రీనివాస్‌రావు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వెలుగులు నిండేనా!
జిల్లాలో దీనదయాళ్ పథకం అమలు రూ.125కే కొత్త విద్యుత్ కనెక్షన్ ప్రచార లోపంతో ప్రజల దరి చేరని పథకం రూ.13.3 కోట్లతో గ్రామాల్లో విద్యుత్ అభివృద్ధి పనులు జిల్లాలోని అన్ని గ్రామాల్లో నూరు శాతం విద్యుత్ ఉండాలి... విద్యుత్ దీపం లేని ఇల్లు అనేది రానున్న రోజుల్లో ఉండకూడదు...ఇదీ దీన దయాళ్ ఉపాధ్యాయ జ్యోతి యోజన పథకం లక్ష్యం. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. వచ్చే రెండేళ్లలో జిల్లా వ్యాప్తంగా పరిస్థితిలో పూర్తి మార్పు రావాలనే లక్ష్యంతో ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్ కనెక్షన్, ఉచితంగా ఎల్ఈడీ బల్బులు అందిస్తోంది. నిధులు కూడా మంజూరు చేసింది. జిల్లాలో ఈ పథకం మూడు నెలలుగా అమలులో ఉంది. విసృ్తత ప్రచారం లేకపోవటం వల్ల జిల్లాలో ఎవరికీ తెలియకపోవటం గమనార్హం. ఫలితంగా పథకం లక్ష్యం నీరుగారుతోంది. విజయవాడ: జిల్లాలోని అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం ఉంది. విద్యుత్ కనెక్షన్లు లేని ఇళ్లు సుమారు 50 వేల వరకు ఉన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వచ్చే రెండేళ్లలో 50 వేల కొత్త కనెక్షన్లు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో విద్యుత్ అభివృద్ధి పనులు, వివిధ అవసరాలను వివరిస్తూ జిల్లా అధికారులు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. కేంద్ర ప్రభుత్వం దీన దయాళ్ ఉపాధ్యాయ జ్యోతి యోజన పథకం కింద జిల్లాకు రూ.13.3 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు వివిధ అభివృద్ధి పనులకు టెండర్లు పిలచి మొదలుపెట్టారు. ముఖ్యంగా గ్రామాల్లో విద్యుత్ స్తంభాల ఏర్పాటు, విద్యుత్ దీపాలు, ట్రాన్స్ఫార్మర్లు కొత్తవి ఏర్పాటు చేయటం, అవసరమైన చోట మరమ్మతులు నిర్వహించటం వంటి పనులు నిర్వహిస్తున్నారు. వార్షిక సంవత్సరం ముగింపులోగా నిధులు వినియోగం జరగాల్సి ఉంది. యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు. 20 వేల కొత్త కనెక్షన్లు... మరో వైపు ఈ పథకం ద్వారా జిల్లాలో 20 వేల కొత్త కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు విద్యుత్ సౌకర్యం లేని ఇళ్లను గుర్తించి వాటికి అందిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. డివిజనల్ పరిధిలో డివిజనల్ ఇంజనీర్లు వాటిని గుర్తించి కొత్త కనెక్షన్‌కు దరఖాస్తు మంజూరు చేసి వారం వ్యవధిలో కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో జిల్లాలో ఇప్పటి వరకు 8వేల కనెక్షన్లు మంజూరు చేశారు. మిగిలిన 12 వేల కనెక్షన్లు ఏప్రిల్ నాటికి ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రూ.125 కే కొత్త విద్యుత్ కనెక్షన్‌తో పాటు విద్యుత్ మీటరు, బోర్డు, కొత్త లైన్‌కు అవసరమయ్యే విద్యుత్ వైర్లు, 9 వాట్ల ఎల్ఈడీ బల్బును పథకం ద్వారా అందజేస్తున్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈ విజయ్‌కుమార్ సాక్షితో మాట్లాడుతూ జిల్లాలో పథకం అమలతీరును తరచూ సమీక్షిస్తునామని చెప్పారు. ఇప్పటికి కొత్తగా 8వేల కనెక్షన్లు ఇచ్చామని మిగిలిన 12 వేల కనెక్షన్లు రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. రూ.13.3 కోట్ల నిధులతో గ్రామాల్లో విద్యుత్ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని చెప్పారు.ఇప్పటికే పనులు 60 శాతం పూర్తయినట్లు వివరించారు. -
ఎరక్కపోయి.. ఇరుక్కుపోయి
నరసాపురం అర్బన్ :పట్టణాల్లోని వీధి దీపాలకు ఎల్ఈడీ బల్బుల్ని అమర్చే విషయమై పురపాలకులు పునరాలోచనలో పడ్డారు. ఎల్ఈడీ బల్బుల్ని వాడటం వల్ల విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని, తద్వారా మునిసిపాలిటీలపై ఆర్థిక భారం బాగా తగ్గుతుందని భావించారు. దీంతో జిల్లాలోని రెండు మునిసిపాలిటీలు మినహా మిగిలినవన్నీ ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఎల్ఈడీ బల్బుల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాక, ఒప్పందాన్ని కొనసాగించాలా లేక వదులుకోవాలా అనే మీమాంసలో పడ్డాయి. వీధుల్లో తగినంత కాంతులు వెదజల్లలేకపోతున్న ఎల్ఈడీ ప్రాజెక్ట్ ఏర్పాటు కు ఎరక్కపోయి అంగీకరించామనే అభిప్రాయం పురపాలకుల్లో వ్యక్తమవుతోంది. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ఎలా ఉంటుందోనన్న ఆలోచనకు వస్తున్నారు. ఇందుకు పరిస్థితులు అనుకూలిస్తాయో లేదోననే ఆందోళన వారిని వెన్నాడుతోంది. ఒప్పందం ఇలా కేంద్ర ఇంధన వనరుల శాఖ యోచన మేరకు మునిసిపాలిటీల్లో ఇప్పుడున్న వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులు అమర్చాలని నిర్ణయించారు. ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) ఇందుకు జిల్లాలోని మునిసిపాలిటీలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రస్తుతం మునిసిపాలిటీల్లో ఉన్న వీధి దీపాలు తొలగించి ఆ సంస్థ ఎల్ఈడీ లైట్లు అమర్చుతోంది. మునిసిపాలిటీలకు వీధి దీపాల నిర్వహణకుగాను నెలవారీ వస్తున్న విద్యుత్ బిల్లులో సగంపైగా ఆదా చూపిస్తోంది. ఒప్పందం ప్రకారం మునిసిపాలిటీలకు ప్రస్తుతం వస్తున్న విద్యుత్ బిల్లులో సగం మాత్రమే ఈఈఎస్ఎల్కు చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఒప్పందం ఏడేళ్లు అమలులో ఉంటుంది. ఈ కాలంలో వీధి దీపాల నిర్వహణతో మునిసిపాలిటీకి సంబంధం లేకుండా ఆ కంపెనీయే చూస్తుంది. ఇదంతా బాగానే ఉన్నా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆశించిన ఫలితాలు రావడం లేదనేది పురపాలకుల భావన. భారం తగ్గుతుందనుకుంటే.. జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం మినహా ఏలూరు కార్పొరేషన్‌తో సహా మిగిలిన మునిసిపాలిటీలు ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో లైట్లు ఏర్పాటు చేశారు. లైట్లు ఎక్కడా సవ్యంగా వెలగటం లేదు. గతంలో ఉన్న లైట్లతో పోలిస్తే వీటి కాంతి చాలా తక్కువగా ఉంది. తక్కువ లైటింగ్ సామర్థ్యం గల నాసిరకం బల్బులు వేయటమే దీనికి కారణమనే ఆరోపణలు వస్తున్నారుు. వెలుగుతున్న లైట్ల మీద వర్షం పడుతుంటే అవి పేలిపోతున్నాయి. నరసాపురం పట్టణంలో పుష్కరాల సమయంలో 2వేల 380 లైట్లు ఏర్పాటు చేయగా, ఇప్పటికే 270 బల్బులు పాడైపోయాయి. ఇతర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లాలోని ఏ మునిసిపాలిటీ ఇంతవరకూ ఈఈఎస్ఎల్కు మొదటి బిల్లు కూడా చెల్లించలేదు. ఇప్పుడు ఒప్పందం రద్దు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. పరిస్థితి మెరుగవుతుందా? ఇంకా పూర్తిస్థాయిలో లైట్లు ఏర్పాటు చేయలేదని, నిర్వహణ కూడా గాడిలో పడలేదని మునిసిపల్ అధికారులు చెబుతున్నారు. పురపాలనకు సంబంధించి వీధిదీపాల నిర్వహణ ముఖ్యమైన అంశాల్లో ఒకటి. ఇప్పటికే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులు మొదట్లోనే పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు కౌన్సిల్ సమావేశాల్లో అరుుతే పెద్ద చర్చే జరిగింది. కేంద్ర ప్రభుత్వం సలహా అంటూ అధికార పార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మునిసిపాలిటీల్లో వీధి దీపాల నిర్వహణకు కాంట్రాక్ట్ పద్ధతిపై వందలాది మంది పనిచేస్తున్నారు. వీరి పరిస్థితి ఏమిటి అనే దానిపై కూడా మునిసిపాలిటీలు ఆలోచనలో పడ్డాయి. నరసాపురం పట్టణంలో కొన్నిచోట్ల ఎల్ఈడీ బల్బుల స్థానంలో మామూలు లైట్లు బిగించేస్తున్నారు. -
స్మార్ట్ ఎల్ఈడీ బల్బు...
ఎల్ఈడీ బల్బులు విద్యుత్తు తక్కువ వాడతాయి. ఎక్కువ కాలం మన్నుతాయి. ఈ విషయాలు మనకు తెలుసు. కానీ ఖరీదెక్కువన్న ఒకే ఒక కారణంతో వాడేందుకు సందేహిస్తాం. కానీ ఫొటోలో కనిపిస్తున్న ఎల్ఈడీ ‘క్రీ’ పరిస్థితి వేరు. దీని ఖరీదు దాదాపు రూ.900. కాకపోతే దీన్ని ఆన్/ఆఫ్ చేయాలంటే స్విచ్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమేమీ లేదు. ఇంట్లోంచైనా, పక్క ఊరి నుంచైనా ఈ పని చేయవచ్చు. అలా పనిచేసేందుకు దీంట్లో ఓ మైక్రోప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారుమరి. వెలుతురు తగ్గించేందుకు, ఆన్/ఆఫ్ చేసేందుకు, ఫలానా టైమ్‌కు ఆన్ లేదా ఆఫ్ కావాలి అన్న అదేశాలు పంపేందుకు మొబైల్‌ఫోన్ అప్లికేషన్ ఒక్కటుంటే సరిపోతుంది.! అమెరికాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ కొత్త దీపాలు కనీసం 81 శాతం తక్కువ విద్యుత్తు వాడతాయట