స్మార్ట్ ఎల్‌ఈడీ బల్బు... | Smart LED bulb Use less electricity | Sakshi
Sakshi News home page

స్మార్ట్ ఎల్‌ఈడీ బల్బు...

Published Tue, Jan 27 2015 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

స్మార్ట్ ఎల్‌ఈడీ బల్బు...

స్మార్ట్ ఎల్‌ఈడీ బల్బు...

ఎల్‌ఈడీ బల్బులు విద్యుత్తు తక్కువ వాడతాయి. ఎక్కువ కాలం మన్నుతాయి. ఈ విషయాలు మనకు తెలుసు. కానీ ఖరీదెక్కువన్న ఒకే ఒక కారణంతో వాడేందుకు సందేహిస్తాం. కానీ ఫొటోలో కనిపిస్తున్న ఎల్‌ఈడీ ‘క్రీ’ పరిస్థితి వేరు. దీని ఖరీదు దాదాపు రూ.900. కాకపోతే దీన్ని ఆన్/ఆఫ్ చేయాలంటే స్విచ్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమేమీ లేదు. ఇంట్లోంచైనా, పక్క ఊరి నుంచైనా ఈ పని చేయవచ్చు. అలా పనిచేసేందుకు దీంట్లో ఓ మైక్రోప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారుమరి.

వెలుతురు తగ్గించేందుకు, ఆన్/ఆఫ్ చేసేందుకు, ఫలానా టైమ్‌కు ఆన్ లేదా ఆఫ్ కావాలి అన్న అదేశాలు పంపేందుకు మొబైల్‌ఫోన్ అప్లికేషన్ ఒక్కటుంటే సరిపోతుంది.! అమెరికాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ కొత్త దీపాలు కనీసం 81 శాతం తక్కువ విద్యుత్తు వాడతాయట

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement