అనంతపురం అగ్రికల్చర్ : తొమ్మిది వాట్స్ సామర్థ్యం కలిగిన 45 వేల ఎల్‌ఈడీ బల్బులు బుధవారం జిల్లాకు వచ్చినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఆర్‌ఎన్ ప్రసాదరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రెండు చొప్పున ఎల్‌ఈడీలు ఉచితంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 5 వేలు పంపిణీ చేయగా తాజాగా 45 వేలు వచ్చాయన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 96 వేల కుటుంబాలు గుర్తించామని తెలిపారు. ఈనెలాఖరులోగా అందరికీ ఎల్‌ఈడీలు అందజేస్తామన్నారు.