
సాక్షి, అనంతపురం: అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీలో అమ్మాయి బాత్‌రూమ్‌లోకి కొందరు తొంగిచూశారని ఆరోపిస్తూ విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు. దీంతో, పోలీసులు, విద్యార్థి సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు.
వివరాల ప్రకారం.. అనంతపురంలోని బుక్కరాయసముద్రంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి ఉద్రికత్త చోటుచేసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిలు ఆందోళన దిగారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయి బాత్‌రూమ్‌ల్లోకి తొంగి చూశారని విద్యార్థినిలు ఆరోపించారు. దీంతో, వారంతా ఆందోళనకు దిగారు. అనంతరం, ఈ విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వీసీ తీరుకు నిరసనగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు.

Comments
Please login to add a commentAdd a comment