న్యూఢిల్లీ: దేశంలోని పెట్రోల్ బంకుల్లో త్వరలో విద్యుత్‌ను అదా చేసే ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు, సీలింగ్ ఫ్యాన్లను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో ఎల్‌ఈడీ బల్బును రూ.65కు, ట్యూబ్‌లైట్‌ను రూ.230, సీలింగ్ ఫ్యాన్‌ను రూ.1,150కు ప్రజలకు అందించనున్నారు.
ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఆ తర్వాత నెలరోజుల్లో అమ్మకాలు మొదలైతాయి. ఓఎంసీకి దేశవ్యాప్తంగా 53 వేల పెట్రోల్ బంకులు ఉన్నాయి. అయితే వీటన్నిటిలోనూ ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు, సీలింగ్ ఫ్యాన్లను విక్రయిస్తారా, లేదా అనేది స్పష్టం కాలేదు.
పెట్రోల్ బంకుల్లో ఎల్‌ఈడీలు, సీలింగ్ ఫ్యాన్లు
Published Fri, May 19 2017 9:41 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
Advertisement