విజయవాడ : ఇంధన పొదుపుపై ఏప్రిల్ 7,8 తేదీల్లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. శనివారం విజయవాడలో అజయ్ జైన్ విలేకర్లతో మాట్లాడుతూ... ఈ సదస్సుకు 35 దేశాల నుంచి దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రంలో 1.87 కోట్ల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశామన్నారు. దీంతో ఇప్పటి వరకు 35 శాతం విద్యుత్ ఆదా అయిందని చెప్పారు. వినియోగదారులకు తక్కువ ధరలకే ఎల్ఈడీ బల్బులు అందజేస్తామన్నారు. రాష్ట్రంలోని 30 మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేస్తున్నట్లు అజయ్ జైన్ వివరించారు.