రాష్ట్రంలో విద్యుత్ పొదుపుపై మలివిడత థర్డ్‌పార్టీ సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్టు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. ఇప్పటికే తొలిదశలో నాలుగు జిల్లాల్లో సర్వే నిర్వహించామని, మరో తొమ్మిది జిల్లాల్లో త్వరలో చేపడతామని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కోటి ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేశామని, ఇంధనపొదుపు సామర్థ్యం ఉన్న స్టార్ రేటెడ్ ఫ్యాన్లు, విద్యుత్ ఉపకరణాలపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. వీటి ఫలితాలపై విశ్లేషించేందుకు ఈ నెల 6వ తేదీన ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతామని తెలిపారు.
విద్యుత్ పొదుపుపై సర్వే
Published Sun, Sep 4 2016 8:45 PM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement
Advertisement