ఎల్‌బీనగర్ సీసీఎస్ కానిస్టేబుల్ తిరుపతి రెడ్డికి సోమవారం మధ్యాహ్న సమయంలో కరెంటు షాక్ తగిలి తీవ్రగాయాలయ్యాయి.
ఎల్‌బీనగర్ సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తిరుపతి రెడ్డికి సోమవారం మధ్యాహ్న సమయంలో కరెంటు షాక్ తగిలి తీవ్రగాయాలయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించారు. వివరాలు..దొంగతనాలు అరికట్టేందుకు ఎల్‌బీనగర్ సీసీఎస్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నపుడు సౌత్‌ఎండ్ పార్కు సమీపంలో ఒక ఇనుప ఎలక్ట్రికల్ పోలు దగ్గరలో నిలబడి ఉన్నప్పుడు అకస్మాత్తుగా కరెంటు వైరు తగిలింది. తీవ్రంగా గాయపడిన తిరుపతి రెడ్డిని పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ లక్ష్మీకాంత రెడ్డి స్థానికుల సహాయంతో కామినేని ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ను పోలీసు ఉన్నతాధికారులు పరామర్శించి ఆర్ధిక సాయం అందజేశారు.