హైదరాబాద్: కొత్త ఇసుక పాల సీపై తీవ్ర కసరత్తులు చేసిన తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించిన విధివిధానాలను శుక్రవారం ప్రకటించింది. ఇసుక పాలసీ విభజనను ఐదు కేటగిరీలుగా విభజించిన ప్రభుత్వం.. ఇసుక లభ్యతను మాత్రం మూడు కేటగిరీలుగా విభజించింది. ఇసుక తవ్వకం, రవాణా రేట్లను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. ఇసుక పాలసీ విధానాలు ఖరారు చేస్తూ జీవో నంబరు 38ను విడుదల చేసింది. దీంతో పాటు రాక్ సాండ్ ను ప్రోత్సహిస్తూ వ్యాట్, విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
కేటగిరి-1 నదులు, కాలువల్లో లభించే ఇసుక
కేటగిరి-2: రిజర్వాయర్, పరివాహక ప్రాంతాల్లో లభించే ఇసుకు
కేటగిరి-3 ప్రైవేటు పట్టాభూముల్లో లభించే ఇసుకు