విద్యుత్ వ్యవస్థకు అపార నష్టం: అజయ్ జైన్
Published Mon, Oct 13 2014 4:22 PM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM
హైదరాబాద్: హుదూద్ తుఫాన్ కారణంగా విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థకు అపార నష్టం వాటిల్లిందని ఇంధన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. తుఫాన్ కారణంగా దాదాపు 400 ట్రాన్స్ ఫార్మార్లు దెబ్బతిన్నాయని అజయ్ జైన్ తెలిపారు.
విశాఖ, విజయనగరం జిల్లాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు ఇతర జిల్లాల నుంచి 2 వలే మంది సిబ్బందిని తరలిస్తున్నామన్నారు. సోమవారం రాత్రికి కొన్ని ప్రాంతాలకైనా విద్యుత్ సరఫరా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అజయ్ జైన్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
Advertisement
Advertisement