ఆహార పొట్లాలు అక్కర్లేదని చెబుతున్నారు: బాబు
తుఫాను వల్ల ఇబ్బంది పడిన విశాఖ ప్రజల్లో ధైర్యం కల్పించామని, అసలు తమకు ఆహార పొట్లాలు అక్కర్లేదని ప్రజలు చెబుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హుదూద్ తుఫాను వల్ల అస్తవ్యస్తమైన విద్యుత్ సరఫరా వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రైవేటు సంస్థల సహకారం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఎల్అండ్టీ వాళ్లు, పాతూరి రామారావు తదితరులందరినీ పిలిపిస్తున్నామని, వాళ్లతో కూడా మాట్లాడి వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేయిస్తామని చెప్పారు. వాస్తవానికి విశాఖలో మొదట విద్యుత్ సరఫరా చేయడానికి 15 రోజులు పడుతుందని అనుకున్నామని, కానీ మూడు రోజుల్లోనే ఇచ్చామని అన్నారు. పెట్రోలు, డీజిల్ కొరత కూడా తీరిందన్నారు.