సాక్షి,నెల్లూరు: సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం మొత్తం అసత్యాలే అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కాకాణి గోవర్థన్ మండిపడ్డారు. ఆయన మంగళవారం చంద్రబాబు విద్యుత్ రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంపై మీడియాతో మాట్లాడారు.
‘సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం మొత్తం అసత్యాలే. శ్వేత పత్రం పేరుతో వైఎస్ జగన్ విమర్శించడానికి చంద్రబాబు ప్రయత్నించారు. జగన్ హయాంలో 25 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగింది. చంద్రబాబు చేయనిది కూడా చేసినట్లు చెబుతున్నారు. 2014 నుంచి 2019 వరకు సగటు వృద్ధి రేటు కేవలం 1. 9 శాతం. జాతీయ వృద్ధి రేటులో మూడో వంతుకు పడిపోయింది. చంద్రబాబ హయాంలో కోవిడ్ లేదు.. ఉక్రెయిన్ యుద్ధం లేదు. కేంద్రం చెప్పిన లేక్కల ప్రకారమే మాట్లాడుతున్నాం.
..అసలు విద్యుత్ రంగాన్ని కుప్పకూల్చింది చంద్రబాబే, చంద్రబాబు పరిపాలనలోనే అప్పుల కుప్పలు ఉన్నాయి. బాబు దిగిపోయే నాటికి విద్యుత్ రంగంలో రూ. 86,215 కోట్లు అప్పు ఉంది. చంద్రబాబు హయాంలోనే డిస్కంలు కుప్పకూలాయి. విద్యుత్ రంగంపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రం అబద్ధాల మయం. వైఎస్ జగన్ హయాంలో విద్యుత్ రంగం అభివృద్ధి చెందనట్టుగా చెప్పారు. జగన్‌ను విమర్శించేందుకే ఎక్కువ సమయం కేటాయించారు.
శ్వేత పత్రం అంటే ఆయా రంగంలో ఉన్న పరిస్థితిని వివరించాలి, కానీ ఆ సంప్రదాయానికి తిలోదకాలు ఇస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. విద్యుత్ ఉత్పత్తిని బ్రహ్మాండంగా పెంచామని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో విద్యుత్ రంగంలో 4.7 శాతం వృద్ధిరేటు నమోదు అయింది. జాతీయ సగటు కంటే ఇది అధికం. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చంద్రబాబు ప్రస్తావించలేదు. చంద్రబాబు అన్నీ అబద్ధాలే చెప్పారు.
..రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా విద్యుత్ ఒప్పందాలను చంద్రబాబు చేసుకున్నారు. ట్రూ అప్ ఛార్జిలు ఎత్తేస్తానని బాబు చెప్పగలరా?. ప్రపంచవ్యాప్తంగా సోలార్ విద్యుత్ ధరలు తగ్గుముఖం పడితే, రాష్ట్రంలో మాత్రం యూనిట్‌ను ఏడు రూపాయలకు కొనుగోలు చేసేలా చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఇలాంటి నిర్ణయం వల్ల ఎంతో నష్టం జరిగింది. రైతులకు సంబంధించి సబ్సిడీ బకాయిలు కూడా చెల్లించలేదు.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని చెల్లించారు. వినియోగదారులతో పాటు రైతులపై భారం పడకుండా చేశారు. ట్రూ అప్ చార్జీలు చంద్రబాబు హయాంలోనే వచ్చాయి. కానీ తనకు ఏమీ తెలియనట్టు చంద్రబాబు మాట్లాడారు. రైతులకు మీటర్లను పెట్టనివ్వబోమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించకుండా దాటవేశారు. ఎన్నికల ముందు మీటర్లు ఉరి తాళ్లు అన్న చంద్రబాబు.. ఇప్పుడైనా స్పందించాలి’ అని కాకాణి అన్నారు’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment