
హైదరాబాద్: ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ 9 వాట్ల ఎల్‌ఈడీ బల్బ్‌కు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) నుంచి 5–స్టార్ రేటింగ్ లభించింది. బీఈఈ నుంచి ఈ 5–స్టార్ రేటింగ్‌ను పొందిన తొలి బ్రాండ్ తమదేనని ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ తెలిపింది. తమ 9 వాట్ల ఎల్‌ఈడీ బల్బ్ 25 వేల గంటల దీర్ఘకాలిక మన్నిక కలిగి, ప్రతి వ్యాట్‌కు 120 లుమెన్స్‌ను అందిస్తుందని ఓరియంట్ ఎలక్ట్రిక్ లైటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ పునీత్ ధవన్ పేర్కొన్నారు. తమ ఎల్‌ఈడీ లైటింగ్ వ్యాపారం 2 ఏళ్లలో 8 రెట్లు వృద్ధి సాధించిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment