నీ కళ్లు చల్లగుండ... కాఫీ తాగవయ్యా!
నీ కళ్లు చల్లగుండ... కాఫీ తాగవయ్యా!
Published Fri, May 9 2014 2:17 PM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM
కళ్లు బాగుండాలనుకుంటున్నారా? కంటి చూపు మందగించకుండ ఆఉండాలనుకుంటున్నారా? గ్లకోమా, డయాబెటిస్ వంటి సమస్యల వల్ల రెటీనా చెడిపోయే పరిస్థితి రాకుండా చూసుకోవాలనుకుంటున్నారా?
అయితే హాయిగా కాఫీ తాగేసేయండి. కాఫీ తాగితే కళ్లు బాగుంటాయని తాజా అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.
కాఫీలో కెఫీన్ ఉంటుంది. అది ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ కాఫీలో 9 శాతం వరకూ క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. అది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. కంటి లోపలి పొర అయిన రెటీనా లో లక్షలాది వెలుతురును గుర్తించే కణాలుంటాయి. వీటి ఆధారంగానే మనం చూడగడుగుతాం. వీటికి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్ అందుబాటు తగ్గితే కంటి చూపు మందగిస్తుంది. క్లోరోజెనిక్ యాసిడ్ వల్ల ఆక్సిజెన్ అందుబాటు పెరుగుతుంది.
ఇప్పటికే కాఫీ వల్ల అల్జీమర్స్, పార్కిన్ సన్స్ వంటి పలు వ్యాధులు రాకుండా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మంచి కాఫీ లాంటి ఈ వార్త చదివాక ఓ కప్పు కాఫీ తయారు చేసుకుని తాగేయండి!.
Advertisement