Dark Days Of Emergency Are Unforgettable Says PM Narendra Modi - Sakshi
Sakshi News home page

ఎమర్జెన్సీ కాలంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్..   

Published Sun, Jun 25 2023 1:27 PM | Last Updated on Sun, Jun 25 2023 2:40 PM

Dark Days Of Emergency Are Unfogettable Says PM Narendra Modi - Sakshi

భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 48 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో 21 నెలల పాటు సాగిన ఆనాటి చీకటి రోజులను మరువలేమని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 

1975, జూన్ 25న ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. నేటికి ఆ ఘట్టం జరిగి 48 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో భావోద్వేగభరితమైన ట్వీట్ చేశారు. ఆనాడు ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తూ ఎమర్జెన్సీని ధైర్యంగా వ్యతిరేకించిన ప్రతి ఒక్కరికీ నా నివాళులు సమ్పర్పిస్తున్నాను. రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా సాగిన ఆ ఎమర్జెన్సీ చీకటి రోజులను ఎన్నటికీ మరువలేమని రాశారు. 

భారతీయ జనతా పార్టీ నేత స్మృతి ఇరానీ కూడా ట్విట్టర్ వేదికగా ఈ ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. చిత్రహింసలు, అరెస్టులు, హత్యలు, పత్రికా స్వేచ్ఛను తుంగలో తొక్కి వారి స్వరాన్ని అణచివేయడం వంటి ఎన్నో దురాగతాలకు ప్రతీక 1975 నాటి జూన్ 25. ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి ఈ వీడియోని చూడండి. కాంగ్రెస్ సమర్ధత ఏమిటో మీకు అర్ధమవుతుందని రాసి వీడియోని కూడా జత చేశారు. 

వీరితోపాటు కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు కూడా ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితుల గురించి ప్రస్తావించారు.        

ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్ధి అయితే మద్దతివ్వం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement