న్యూఢిల్లీః ఉత్తరప్రదేశ్, ఢిల్లీల్లో డార్క్ ట్రేడ్ జోరుగా సాగుతోంది. రోజురోజుకూ మహిళలపై నేరాల ఘటనలు పెరుగుతుండటమే కాక.. దానివెనుక పెద్ద నల్లబజారు నడుస్తున్నట్లు తెలుస్తోంది. నేరస్తులకు ప్రభుత్వం కఠినమైన శిక్షలు అమలు చేయకపోవడంతో చట్టాలకు భయపడకుండా వారు బరితెగించి స్వేఛ్చగా బయట తిరగడంతోపాటు.. మరిన్ని నేరాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. తాజాగా బయటపడ్డ రేప్ వీడియోల బ్లాక్ ట్రేడ్ అందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
భయంకర, అత్యాచార వీడియోలు సైతం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో నామమాత్రపు ధరకే సులభంగా అమ్మకాలు జరుపేస్తున్నారు. నల్లబజారుల్లో రేప్ వీడియోలు వందలకొద్దీ అమ్ముడవుతున్నట్లు ఓ పేరొందిన పత్రిక సేకరించిన ఆధారాలప్రకారం తెలుస్తోంది. 30 సెకన్లనుంచీ 5 నిమిషాల నిడివి ఉండే.. ప్రత్యేక రేప్ వీడియోలు, వీడియో క్లిప్పులు కేవలం 50 నుంచి 150 రూపాయలకే ఆయా మార్కెట్లలో భారీగా అమ్ముడుపోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అటువంటి వీడియోలు వినియోగదారులు పొందాలంటే విశ్వసనీయమైన ఓ చిన్న సోర్స్ ఉంటే సరిపోతుంది. తమకు దొరికిన సమాచారుంద్వారా వారు డీలర్లవద్దకు చేరుకుంటే పనైపోతుంది. అయితే ఆయా డీలర్లు మాత్రం ముందుగా వచ్చినవారితో ఎటువంటి సమాచారం గురించి చర్చించరు. వచ్చిన కస్టమర్ విశ్వసనీయమైన సమాచారం అందించిన తర్వాత మాత్రమే ఒప్పందం ప్రకారం ధర నిర్ణయించుకొని, డీలర్స్ డైరెక్టుగా వినియోగదారుల స్మార్ట్ ఫోన్లలోకి డౌన్లోడ్ చేయడమో.. లేదంటే పెన్ డ్రైవ్ లో కాపీ చేయడం ద్వారా విక్రయాలు జరుపుతారు. కొన్నిసార్లు ఇటువంటి విక్రయాలు వ్యక్లులు లేదా వ్యవస్థీకృత ముఠాలు ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి అకౌంట్లద్వారా డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా అమ్మకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అదంతా ఒకరకం వ్యాపారం అయితే.. కొన్నిసార్లు నేరస్తులు అత్యాచారాల వీడియోలను రికార్డు చేసి సదరు బాధితులపై వేధింపులకు పాల్పడటం, వాటిని అన్లైన్ లో పోస్ట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేయడం వంటివి కూడా జరుగుతుంటాయని డీలర్లే చెప్తుండటం విశేషం. రేపిస్టులు నేరాలను తమ ఫోన్లలో రికార్డు చేసి వేధింపులకు పాల్పడుతున్నట్లు కొందరు సీనియర్ పోలీసులు కూడా చెప్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు, లేదంటే వారిపై తిరిగి లైంగిక కార్యకలాపాలకు పాల్పడేందుకు ఆ వీడియోలను సాధనంగా ఉపయోగించుకుంటున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే ఆన్ లైన్లో పోస్ట్ చేస్తామని భయపెట్టడంతో కూడా బాధితులను మరింత లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నా...ఆగ్రాలోని బెలాన్ గంజ్, బాల్కేశ్వర్, కమ్లానగర్ మార్కెట్లతోపాటు.. మీరట్ లోని బారెల్లీ, అలిగర్ మొదలైన ప్రాంతాల్లో అటువంటి భయంకరమైన అత్యాచార వీడియోలు అందుబాటులో ఉండటం హాస్యాస్పదంగా కనిపిస్తోంది.
అతి తక్కువ ధరకే ఆ.. వీడియోల విక్రయం..!
Published Thu, Aug 4 2016 3:56 PM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM
Advertisement
Advertisement