ఆమెరికాలో ఉన్న శాస్త్రీయ నృత్య సంస్థ డాన్సెస్ ఆఫ్ ఇండియా సెయింట్ లూయిస్. ఈ సంస్థ అధ్యక్షురాలు నర్తన ప్రేమచంద్ర. మహాభారతం నుండి ప్రేరణ పొందిన దుర్యోధనుడి పాత్రను ’డ్రీమ్స్ ఆఫ్ ది డార్క్ ప్రిన్స్’ పేరుతో నృత్యరూపకాన్ని రూపొందించింది. ఎంతోమందిని ఆకట్టుకుంటున్న ఈ కళారూపం గురించి ప్రేమచంద్ర ఏమంటున్నారంటే...
‘ఇతిహాసంలోని ప్రధాన పాత్రలలో ఒకరైన యువరాజు దుర్యోధనుడి కథాంశాన్ని ‘డ్రీమ్స్ ఆఫ్ ది డార్క్ ప్రిన్స్' కోసం తీసుకొని రూపొందించాం. ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్నదంతా మహాభారతంలో ఉంది. దాయాదుల మధ్య జరిగిన పోరు ఈ రోజుల్లోనూ అనేక సంఘర్షణలతో ప్రతిధ్వనిస్తుంది’ అని తెలిపే ప్రేమ చంద్ర ఈ అద్భుత సంక్లిష్టమైన కథనాన్ని నృత్యరూపకంగా మలిచారు.
నాడు–నేడు
‘దుర్యోదనుడిది యుద్ధాన్ని ప్రేరేపించాలనే ఆలోచన. నేను వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్‌ల సమస్య గురించి ఆలోచించాను. ఇది కూడా ఈ భూభాగంపై దాయాదుల మధ్య జరుగుతున్న యుద్ధమే‘ అంటారామె. ‘యుద్ధంలో ఒక సన్నివేశం ఉంటుంది. దానిని మేం మా నిర్మాణంలో చూపించలేం. కానీ, యుద్ధ భూమిలో పాండవ వీరుడు అర్జునుడు తన ఆయుధాలను వదిలేసి ‘నేను నా సొంత కుటుంబ సభ్యులను చంపలేను’ అంటాడు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల గురించి ఆలోచించినప్పుడు ఆ వివరణ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
‘డ్రీమ్స్ ఆఫ్ ది డార్క్ ప్రిన్స్‘ రాసేటప్పుడు ప్రేమచంద్ర మహాభారతం భ్రాంతి, వాస్తవికత, సత్యం అన్వేషణలను కూడా మెరుగుపరిచారు – ఆమె చెప్పిన ఇతివృత్తాలు ఈ సమయంలో చాలా సందర్భోచితంగా ఉన్నాయి. ‘సత్యం, భ్రమలు, అధికారం, దురాశల గురించి కథ చేయాలి అనుకున్నాను. ఇది ఈ రోజుల్లో రాజకీయాల్లో భాగమైంది. ప్రతిచోటా భ్రమ ఉంది. ప్రతిరోజూ నిజమైన యుద్ధం చేస్తున్నాం’ అంటారామె. ఈ ప్రదర్శనకు ప్రిన్స్ దుర్యోధనుడిగా నటుడు ఇసయ్య డి లోరెంజోతో కలిసి ప్రేమచంద్ర వర్క్ చేశారు.
(చదవండి: గంటలకొద్దీ కూర్చొని పనిచేసే వాళ్లకు ది బెస్ట్ వర్కౌట్స్ ఇవే!)
Comments
Please login to add a commentAdd a comment