Classical Dance
-
ఎనిమిది శాస్త్రీయ నృత్య రూపాలు ఒకేసారి..!
ఎవరైనా ఒకటో రెండో శాస్త్రీయ నృత్య కళలను ప్రదర్శించడం చూస్తుంటాం. వారి కళకు అభివాదం తెలియజేస్తుంటాం. కేరళలోని ఇరింజలకుడకు చెందిన అనఘశ్రీ సజీవనాథ్ భారతీయ శాస్త్రీయ నృత్య కళారూపాలైన కథాకళి, కూచిపూడి, సత్రియా, మణిపురి, ఒడిస్సీ, మోహినియాట్టం, భరతనాట్యం, కథక్లను ఒక గంటా 30 నిమిషాల్లో ప్రదర్శించి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను నెలకొల్పారు. అన్ని భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలను అత్యధిక కాలం పాటు ప్రదర్శించి, రికార్డు సాధించిన ఘనత అనఘశ్రీ సొంతం చేసుకుంది. 27 ఏళ్ల అనఘ చిన్ననాటి నుంచే శాస్త్రీయ నృత్య సాధనలో తనైదన మార్క్ చూపిస్తూ ఉండేది. తమ స్థానిక కళ మోహినియాట్టం నేర్చుకోవడంలో చూపే ఆసక్తి, ఆ తర్వాత తర్వాత ఇతర నృత్య సాధనలవైపు మల్లేలా చేసిందని చెబుతుంది అనఘ. (చదవండి: బ్రెస్ట్ కేన్సర్ ఉంటే భవిష్యత్తులో ఫర్టిలిటీ చాన్సెస్ తగ్గొచ్చా..?) -
క్లాసికల్ డ్యాన్స్ మహోత్సవ్!
మైసూరు కళా దివస్‌లో వసుంధరోత్సవ– 2024 పేరుతో 10 రోజుల మెగా క్లాసికల్ డ్యాన్స్మహోత్సవం జరిగింది. మెగా క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్లో భాగంగా నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో 550 మందికి పైగా నృత్యకారులు పాల్గొన్నారు. నృత్యకళాకారిణి వసుంధర దొరస్వామి 75వ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంత మంది నృత్యకళాకారులు పాల్గొన్న ఈ వేడుక ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంది. ఈ నృత్యరూపకానికి ప్రఖ్యాత నృత్య కళాకారిణి వసుంధర దొరస్వామి నృత్య దర్శకత్వం వహించారు. నృత్యకారులలో ఆమె విద్యార్థులే కాకుండా ఇతర గురువుల వద్ద నృత్యం నేర్చుకున్న వారు కూడా తమ కళను ప్రదర్శించాను. మైసూరు కళా దివస్ పేరుతో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి చెందిన దత్త విజయానంద తీర్థ స్వామి, సుత్తూరు మఠానికి చెందిన శివరాత్రి దేశికేంద్ర స్వామి, మైసూరు ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్, సంగీత అకాడమీ పీఠాధిపతి సంధ్యా పురేచ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన శివరాత్రి దేశికేంద్ర స్వామి మాట్లాడుతూ ‘యోగా మాదిరిగానే భారతనాట్యం కూడా ఈ దేశం ప్రపంచానికి అందించింది. వసుంధర దొరస్వామి భరతనాట్యానికి చేసిన కృషికి, ప్రపంచ స్థాయిలో గొప్ప, ప్రాచీన నృత్య రూపాన్ని ప్రోత్సహించారు’ అని ప్రశంసించాడు. మైసూరు కళా దివస్ వసుంధర పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్ నిర్వహించిన శాస్త్రీయ నృత్యం ఇది. వసుంధర దొరస్వామికి భరతనాట్యానికి 50 ఏళ్లుగా చేస్తున్న సేవను పురస్కరించుకొని ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో మైసూరులోని కళాకారులు, నృత్య గురువులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులూ పాల్గొన్నారు. ఈ ఉత్సవం భరతనాట్యానికి అంకితం చేస్తుమన్నామని వివరించారు. క్లాసికల్ డ్యాన్స్ మహోత్సవ్! -
ఆరు నాట్యరీతుల అద్భుత సమాగమం
ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేసారి ఒకే వేదికపై ఆరు రకాల నృత్యరీతులను అత్యంత అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపజేసింది.. అమ్రిత కల్చరల్ ట్రస్టు వారి నాట్యతోరణం కార్యక్రమం. నగరంలోని శిల్పకళావేదికలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమానికి ప్రాంగణం సామర్థ్యాన్ని మించి ప్రేక్షకులు రావడంతో మొత్తం కిక్కిరిసిపోయింది. భరతనాట్యం, కూచిపూడి, మోహినీ అట్టం, కథక్, ఒడిస్సీ, ఆంధ్రనాట్యం లాంటి నృత్యరీతులకు చెందిన కళాకారిణులు ఒక్కో విభాగంలో 6 నుంచి 10 మంది చొప్పున తమ తమ నాట్యాలను ప్రదర్శించారు. అనంతరం మొత్తం కళాకారిణులు అందరూ కలిసి ఒకేసారి చేసిన జుగల్బందీ ప్రేక్షకులను కట్టిపడేసింది.ప్రముఖ నాట్యగురువులు కళాకృష్ణ (ఆంధ్రనాట్యం), అనితా గుహ (భరతనాట్యం), చావలి బాల త్రిపురసుందరి (కూచిపూడి), నీనా ప్రసాద్ (మోహినీ అట్టం), శామా భాటే (కథక్), బిచిత్రానంద స్వైన్ (ఒడిస్సీ), పేరిణి కుమార్ (పేరిణి నాట్యం-ఆంధ్రనాట్యం) తదితరుల సారథ్యంలో ఈ కళాకారులంతా తమ తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. అమ్రిత కల్చరల్ ట్రస్టును పగడాల రాజేష్, భార్గవి దంపతులు ప్రారంభించారు. దీని యాజమాన్య కమిటీలో సీతా ఆనంద్ వైద్యం, రేవతి పుప్పాల, సురేంద్రనాధ్ తదితర దిగ్గజాలు ఉన్నారు.భారతీయ సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ... అన్ని ప్రాంతాలకు చెందిన నృత్య కళారీతులను ప్రోత్సహించేలా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు అమ్రిత కల్చరల్ ట్రస్టును అభినందించకుండా ఉండలేకపోతున్నామని కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యర్, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, ఆదాయపన్ను శాఖ మాజీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ పి.వి. రావు అన్నారు. నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్న కళాకారిణులందరికీ ఈ రంగంలో అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి టీవీ నరసింహారావు, పద్మశ్రీ పద్మజారెడ్డి, కోటి సూర్య ప్రభ, శిల్పారెడ్డి, టీవీ9 రజనీకాంత్, పద్మశ్రీ ఉమామహేశ్వరి, మాదాల రవి, ఆశ్రిత వేముగంటి తదితరులు పాల్గొన్నారు.(చదవండి: Mouni Roy:కథక్‌తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మెస్మరైజ్ చేసిన నటి) -
అట్లాంటా: పేద రోగులకు భరోసా.. ‘శంకర నేత్రాలయ’ నిధుల సేకరణ కార్యక్రమం
శంకర నేత్రాలయ అమెరికా సంస్థ (SN USA) అట్లాంటాలో ఈ నెల 17న ఒక అద్భుతమైన శాస్త్రీయ నృత్య కార్యక్రమాన్ని పేద రోగుల దృష్టిని పునరుద్ధరించే మహత్తర కార్యం కోసం నిధులను సేకరించే లక్ష్యంతో నిర్వహించింది. ఈ కార్యక్రమంతో శంకర నేత్రాలయ అమెరికా సంస్థ $1,300,000(సుమారు రూ.10 కోట్లు పైన)ని సేకరించింది. ఈ నిధులు ద్వారా 20,000 కంటిశుక్లం శస్త్రచికిత్సలు చేయవచ్చు.అట్లాంటాకు చెందిన నాలుగు ప్రసిద్ధ శాస్త్రీయ నృత్య అకాడమీల నుంచి సుమారు 100 మంది విద్యార్థులు తమ ప్రదర్శనలతో వేదికను అలంకరించడం ద్వారా ఈ కార్యక్రమం విజయవంతమయ్యింది. ప్రతి నృత్యం ప్రేక్షకుల నుంచి గర్జించే చప్పట్లు అందుకుంది, ఇచ్చిన ప్రదర్శనలు:నేపధ్యం : వాసవీ కన్యకా పరమేశ్వరిఅకాడమీ ఆఫ్ కూచిపూడి నృత్య గురువు: శశికళ పెనుమర్తినృత్యకారుల సంఖ్య: 17నేపధ్యం : శరణం అయ్యప్పకలైవాణి డ్యాన్స్ అకాడమీ గురువు: పద్మజ కేలంనృత్యకారుల సంఖ్య: 13నేపధ్యం : నాద బ్రహ్మ శంకరశ్రీవాణి కూచిపూడి అకాడమీ గురువు: రేవతి కొమండూరినృత్యకారుల సంఖ్య: 13నేపధ్యం : పంచభూత ప్రశస్తినటరాజ నాట్యాంజలి కూచిపూడి అకాడమీ గురువు: నీలిమ గడ్డమణుగునృత్యకారుల సంఖ్య: 50ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన అన్ని విద్యాసంస్థలకు, గురువులకు, విద్యార్థులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు నిర్వాకులు తెలిపారు. ఈ కార్యక్రమం కళ మాత్రమే కాకుండా సమాజం, దాతృత్వం వంటి వాటికి ప్రేరణగా నిలిచింది. ప్రతి నృత్యకారిణి, వాలంటీర్ అవసరమైన వారి కోసం నిధులను సేకరించడంలో కీలక పాత్ర పోషించారు. పేద రోగుల దృష్టిని పునరుద్ధరించే ఉదాత్తమైన లక్ష్యం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సేవకులు, దాతలందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ..అట్లాంటా హిందూ దేవాలయం నుంచి పూజారి పవన్ కుమార్ క్రిస్టాపతి పవిత్ర మంత్రాలతో సత్కారాలు ప్రారంభించారు.మెగా డోనర్ ప్రసాద రెడ్డి కాటంరెడ్డి, అతని భార్య శోభా రెడ్డి కార్యక్రమానికి హాజరు కాలేక పోయారని నిర్వాకులు తెలిపారు. దురదృష్టవశాత్తు, ప్రసాద రెడ్డి గారి ప్రియమైన తల్లి ఇటీవల మరణించడంతో, దంపతులు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో డోనర్ ప్రసాద రెడ్డి గారి తల్లిగారి ఆత్మకు శాంతి చేకురాలని కోరుతూ ప్రగాఢ సంతాపం తెలిపారు నిర్వాహకులు. అలాగే ఇంత ఈ కష్ట సమయంలోనూ, $500,000(రూ. 4 కోట్లు) సహకారంతో మద్దతు అందించారు. ఈ ఉదార సహకారం ద్వారా 11 కంటి శిబిరాలకు మద్దతు లభించిందని తెలిపారు. దీంతోపాటు భారతదేశంలోని అత్యవసర ప్రాంతంలో మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU)ని కూడా ఏర్పాటు చేయగలిగామని అన్నారు. శంకర నేత్రాలయ యూఎస్ఏ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రసాద రెడ్డి కాటంరెడ్డి గారిని ప్రకటించారు. ఆయన తరఫున బాలా ఇందుర్తి , మాధవి ఇందుర్తి ఈ ఘనతను స్వీకరించారు.SN USA బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ సభ్యుడు డాక్టర్ కిషోర్ చివుకుల గారు $100,000 విరాళంగా అందించారు. ఈ విరాళం సంస్థకు అవసరమైన కంటి సంరక్షణ సేవలను అత్యవసరమైన రోగులకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వేలాది మంది రోగులు తగిన దృష్టి పునరుద్ధరణ శస్త్రచికిత్సలను పొందే అవకాశం కల్పిస్తుంది.SN USA బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ జగదీష్ షేత్ స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో కార్యక్రమానికి హాజరైన వారందరినీ ఆకట్టుకున్నారు. MESU అడాప్ట్-A-విలేజ్ కంటి శిబిరానికి స్పాన్సర్ చేయడానికి $12,500(రూ. 10 లక్షలు) విరాళం అందించి డాక్టర్ షేత్ తన మద్దతును మరింతగా చాటిచెప్పారు. ఈ సహకారం వందలాది మంది పేద రోగులకు కంటి చూపును పునరుద్ధరించడానికి సహాయపడటమే గాక కొత్త ఆశను కలిగిస్తుంది.ఆగస్టా, జార్జియా నుంచి T. రామచంద్రారెడ్డి గారు 8 కంటి శిబిరాలకు $100,000 విరాళం ప్రకటించారు. ఇక తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా నంది వడ్డెమాన్ గ్రామంలో ఒక కంటి శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఎస్ఎన్ యూఎస్ఏ ప్రెసిడెంట్ బాలా రెడ్డి ఇందుర్తి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మూర్తి రేకపల్లి భారతదేశంలో MESU కార్యకలాపాల పురోగతిని వివరించారు. గ్రామీణ మారుమూల ప్రాంతాలకు చేరుకునే లక్ష్యంతో పేద రోగులకు సేవలను అందించడంపై దృష్టి పెట్టారు. భవిష్యత్తులో ఈ సేవలను మొత్తం భారతదేశానికి విస్తరించే ప్రణాళికను గురించి కూడా వెల్లడించారు.ముఖ్య అతిథిగా రావాలన్న మా ఆహ్వానాన్ని అంగీకరించి హాజరైన భారత కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్ గారికి మా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయడంలో ఆయన చూపిన అంకితభావం, మద్దతుకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. కార్యక్రమంలో పాల్గొన్న వారిని నిర్వాహకులను గౌరవంగా గుర్తించేందుకు ఆయన ఫలకాలను అందజేశారు.సాయంత్రం మొత్తం ఎస్ఎన్ యూఎస్ఏ అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి నాయకత్వం దార్శనికతకు ప్రతి ఒక్కరూ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో ఈ కార్యక్రమం గణనీయమైన నిధులను సేకరించడం మాత్రమే కాకుండా, గొప్ప కారణం కోసం అవగాహనను విస్తృతంగా పెంచగలిగింది. ముందుండి ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయడంమేగాక, ఈ మిషన్‌లో చేర్చేలా ఇతరులను ప్రేరేపించడంలో బాలా గారి ఎనలేని కృషి ప్రధాన భూమికను పోషించింది. తన విశేష సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక శంకరరత్న పురస్కారం అందుకోవడం పట్ల నిర్వాహకులందరూ ఆయనకు అభినందనలు తెలిపారు. వెనుకబడిన వ్యక్తుల జీవితాలను మెరుగుపరచడం, దృష్టిని పునరుద్ధరించడం పట్ల ఆయన చూపిన అచంచలమైన అంకితభావం స్ఫూర్తిదాయకం.SN USA ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీని వంగిమల్ల, మెహర్ చంద్ లంక, రాజ్ ఐల, శ్రీధర్ జూలపల్లి, నీలిమ గడ్డమణుగు, డాక్టర్ మాధురి నాముదురి, స్పోర్ట్స్ కమిటీ చైర్ రమేష్ చాపరాల, MESU కమిటీ సభ్యుడు డాక్టర్ కిషోర్ రెడ్డి రసమల్లు వంటి ప్రముఖుల నుంచి నిరంతరం మద్దతు అందింది. అట్లాంటా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తడికమళ్ళతో పాటు చాప్టర్ లీడర్స్ చిన్మయ్ దస్మోహపాత్ర, హేమంత్ వర్మ, పేన్మెట, సుధీర్ పాత్రో, విజయ్ గార్లపాటి ఈ ఈవెంట్‌ను విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. కార్యక్రమ నిర్వహణ, భోజన ఏర్పాట్ల సమన్వయంపై ఈ బృందం చేసిన కృషికి ప్రేక్షకుల నుంచి భారీగా చప్పట్లు వచ్చాయి.గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న రెండు MESU బృందాలలో ఒకటి చెన్నై కేంద్రంగా, మరొకటి జార్ఖండ్‌లో టాటా ట్రస్ట్స్ సహకారంతో సేవలందిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లలో 13నుంచి పది రోజుల కంటి శిబిరాలను విజయవంతంగా నిర్వహించింది. నాల్గవ యూనిట్ పుట్టపర్తిలో మార్చి 2025లో ప్రారంభమవుతుండగా, ఐదవ యూనిట్ ఆగస్టు 2025లో వైజాగ్‌లో ప్రారంభమవుతుంది. ప్రతి యూనిట్ దాని బేస్ లొకేషన్ నుంచి 500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు సేవలు అందిస్తుంది. ఈ యూనిట్లు పూర్తిగా ఆపరేషనల్ అయిన తర్వాత భారతదేశంలోని దాదాపు 1/3 గ్రామీణ ప్రాంతాలను కవర్ చేస్తాయి.MESU అడాప్ట్-ఎ-విలేజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా, అట్లాంటా SN చాప్టర్ స్పాన్సర్లు బాలా రెడ్డి ఇందుర్తి, శ్రీని రెడ్డి వంగిమల్ల, డాక్టర్ మాధురి నాముదురి, మెహర్ చంద్ లంక, రాజశేఖర్ ఐల, నీలిమ గడ్డమణుగు ఈ శిబిరాలు వందలాది మంది రోగుల దృష్టిని పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ MESU ప్రోగ్రామ్ ద్వారా పేద రోగులకు అందించిన సేవల పట్ల వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అనుభవాలను పంచుకున్నారు.చాలా మంది వ్యక్తులు ముందుకు వచ్చి MESU అడాప్ట్-ఎ-విలేజ్ ప్రోగ్రామ్‌ను స్పాన్సర్ చేయడం ద్వారా తమ స్వస్థలం చుట్టుపక్కల ప్రాంతాల్లోని పేద రోగులకు సేవలను అందించడంలో భాగస్వాములు అయ్యారు. రూ. $12,500 విరాళంతో బేస్ హాస్పిటల్ నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల్లో కంటి శిబిరాలను నిర్వహించడం ద్వారా ఈ కార్యక్రమం పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మాత్రమే కాకుండా దృష్టి కోల్పోయిన వారికి కొత్త ఆశలను అందించగలిగింది.SN USA ప్రెసిడెంట్ బాలా ఇందుర్తి గారు రాబోయే MESU ప్రాజెక్ట్‌ల గురించి, అవి ఎంత విస్తీర్ణంగా ఉన్నాయో, అలాగే ట్రస్టీలు, వాలంటీర్లు వివిధ నగరాల్లో నిధుల సేకరణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భారతదేశంలో అంధత్వాన్ని నిర్మూలించేందుకు ఎలా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారో వివరించారు.పేద రోగులకు దృష్టిని పునరుద్ధరించడానికి SN USA చేస్తున్న కృషికి ప్రేక్షకుల నుంచి భారీ కరతాళ ధ్వనులు వచ్చాయి.. SN USA అట్లాంటా బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు - మూర్తి రేకపల్లి, నీలిమ గడ్డమణుగు, మెహర్ లంక, శ్రీని రెడ్డి వంగిమళ్ల, ఉపేంద్ర రాచుపల్లి, డా. మాధురి నాముదూరి, రాజశేఖర్ ఐల, సురేష్ వేములమాడ, శ్రీధర్ రావు జూలపల్లి, రాజేష్ తడికమల్ల, రమేష్ చాపరాల, డాక్టర్ కిషోర్ రాసమల్లు - ఈ కార్యక్రమాన్ని ఘనవిజయంగా నిర్వహించడానికి లక్షల గంటలు కష్టపడ్డారు. డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి (NRU), SN USA సెక్రటరీ శ్యామ్ అప్పాలి మాస్టర్స్ ఆఫ్ సెర్మనీ, శంకరనేత్రాలయ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు(చదవండి: ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్) -
అమెరికాలో ... శాస్త్రీయ నృత్య రూపకంగా దుర్యోధనుడు
ఆమెరికాలో ఉన్న శాస్త్రీయ నృత్య సంస్థ డాన్సెస్ ఆఫ్ ఇండియా సెయింట్ లూయిస్. ఈ సంస్థ అధ్యక్షురాలు నర్తన ప్రేమచంద్ర. మహాభారతం నుండి ప్రేరణ పొందిన దుర్యోధనుడి పాత్రను ’డ్రీమ్స్ ఆఫ్ ది డార్క్ ప్రిన్స్’ పేరుతో నృత్యరూపకాన్ని రూపొందించింది. ఎంతోమందిని ఆకట్టుకుంటున్న ఈ కళారూపం గురించి ప్రేమచంద్ర ఏమంటున్నారంటే... ‘ఇతిహాసంలోని ప్రధాన పాత్రలలో ఒకరైన యువరాజు దుర్యోధనుడి కథాంశాన్ని ‘డ్రీమ్స్ ఆఫ్ ది డార్క్ ప్రిన్స్' కోసం తీసుకొని రూపొందించాం. ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్నదంతా మహాభారతంలో ఉంది. దాయాదుల మధ్య జరిగిన పోరు ఈ రోజుల్లోనూ అనేక సంఘర్షణలతో ప్రతిధ్వనిస్తుంది’ అని తెలిపే ప్రేమ చంద్ర ఈ అద్భుత సంక్లిష్టమైన కథనాన్ని నృత్యరూపకంగా మలిచారు.నాడు–నేడు‘దుర్యోదనుడిది యుద్ధాన్ని ప్రేరేపించాలనే ఆలోచన. నేను వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ల సమస్య గురించి ఆలోచించాను. ఇది కూడా ఈ భూభాగంపై దాయాదుల మధ్య జరుగుతున్న యుద్ధమే‘ అంటారామె. ‘యుద్ధంలో ఒక సన్నివేశం ఉంటుంది. దానిని మేం మా నిర్మాణంలో చూపించలేం. కానీ, యుద్ధ భూమిలో పాండవ వీరుడు అర్జునుడు తన ఆయుధాలను వదిలేసి ‘నేను నా సొంత కుటుంబ సభ్యులను చంపలేను’ అంటాడు. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల గురించి ఆలోచించినప్పుడు ఆ వివరణ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ‘డ్రీమ్స్ ఆఫ్ ది డార్క్ ప్రిన్స్‘ రాసేటప్పుడు ప్రేమచంద్ర మహాభారతం భ్రాంతి, వాస్తవికత, సత్యం అన్వేషణలను కూడా మెరుగుపరిచారు – ఆమె చెప్పిన ఇతివృత్తాలు ఈ సమయంలో చాలా సందర్భోచితంగా ఉన్నాయి. ‘సత్యం, భ్రమలు, అధికారం, దురాశల గురించి కథ చేయాలి అనుకున్నాను. ఇది ఈ రోజుల్లో రాజకీయాల్లో భాగమైంది. ప్రతిచోటా భ్రమ ఉంది. ప్రతిరోజూ నిజమైన యుద్ధం చేస్తున్నాం’ అంటారామె. ఈ ప్రదర్శనకు ప్రిన్స్ దుర్యోధనుడిగా నటుడు ఇసయ్య డి లోరెంజోతో కలిసి ప్రేమచంద్ర వర్క్ చేశారు. (చదవండి: గంటలకొద్దీ కూర్చొని పనిచేసే వాళ్లకు ది బెస్ట్ వర్కౌట్స్ ఇవే!) -
శాస్త్రీయ నృత్యంతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
భరత నాట్యం నుంచి కూచిపూడి వరకు భారతీయ శాస్త్రీయ నృత్యాలలో వ్యాయామానికి సమానమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ తరం శాస్త్రీయ నృత్యాలపై ఆసక్తి ప్రదర్శిస్తోంది. నృత్య సాధనతో ఫిట్నెస్ను సొంతం చేసుకుంటుంది. ముంబైలో ఎంబీఏ చేస్తున్న శివానీ దీక్షిత్‌కు ఏ చిన్న పనిచేయాలన్న బద్దకంగా అనిపించేది. దీని వల్ల చదువు కూడా దెబ్బ తినే ప్రమాదం ఏర్పడింది. తన కజిన్ సలహా ప్రకారం అయిష్టంగానే భరతనాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టింది. మొదట్లో ఎలా ఉన్నా ఆ తరువాత మాత్రం భరతనాట్యంపై దీక్షిత్లో అంతకంతకూ ఇష్టం పెరుగుతూపోయింది. ‘నేను ఎప్పుడూ వ్యాయామాలు చేయలేదు. అయితే భరతనాట్యం వల్ల ఎన్నో వ్యాయామాలు ఒక్కసారే చేస్తున్నట్లుగా అనిపించింది. బద్దకాన్ని వదిలించుకున్నాను. మనసు తేలిక అయినట్లుగా ఉంది’ అంటుంది శివానీ దీక్షిత్. ‘అధిక బరువుతో బాధ పడుతున్న నాకు కథక్ నృత్యం కాంతి కిరణంలా కనిపించింది. కథక్ నృత్య సాధనతో బరువు తగ్గడం సంతోషంగా ఉంది. కథక్ డ్యాన్స్ అనేది మచ్ మోర్ దెన్ ఏ వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ అనేది నా అభిప్రాయం. బరువు తగ్గడానికే కాదు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ల విషయంలోనూ కథక్ ఉపయోగపడుతుంది’ అంటుంది కోల్‌కతాకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల నయనిక. బరువు తగ్గడానికి ఉపయోగపడే ఒడిస్సీ, జాజ్, కాంటెంపరీ వెస్ట్రన్ డ్యాన్స్‌లను కలిపి ఒక డ్యాన్స్ ఫామ్ రూపొందించినట్లు తెలుసుకున్న నయనిక ప్రస్తుతం ఆ సమ్మేళన నృత్యరూపం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉంది. ‘కేవలం బరువు తగ్గడానికే కాదు ఏకాగ్రతను పెంచడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో శాస్త్రీయ నృత్యాలు ఉపయోగపడతాయనే విషయాన్ని నృత్యసాధన ద్వారా స్వయంగా తెలుసుకున్నాను. శాస్త్రీయ నృత్యకదలిలకు చేతులు, కళ్ల మధ్య సమన్వయం అవసరం. ఇది ఆటోమెటిగ్గా ఏకాగ్రతను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది’ అంటున్నాడు బెంగళూరు చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ సందేష్ సృజన్. శివానిక్ దీక్షిత్, నయనిక, సందేశ్ సృజన్‌ల మాటలు శాస్త్రీయ నృత్యాల పట్ల యువతరం చూపుతున్న ఆసక్తికి అద్దం పడతాయి. ‘మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాస్త్రీయ నృత్యాల జాబితా పెద్దది. ప్రతి నృత్యానికి తనదైన వేషధారణ, అలంకరణ, సంగీతం ఉంటాయి. శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకునే విధానం చాలా కఠినమైనది. దీనికి తగిన సమయం, శక్తి అవసరం. శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి ఆసక్తి మాత్రమే కాదు అంకితభావం చాలా ముఖ్యం, నృత్యం అనేది శారీరక, మానసిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. శాస్త్రీయ నృత్య రూప శైలి ఒకదానికొకటి భిన్నంగా ఉన్నప్పటికీ అభ్యాస ప్రక్రియ కండరాలను బలోపేతం చేస్తుంది. భరతనాట్యం, కూచిపూడి, మోహినియాట్టంలాంటి శాస్త్రీయ నృత్యరూపాలను సాధన చేయడం ద్వారా మజిల్ ఇంప్రూమెంట్ ఉంటుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ శరీరంలోని ఆక్సిజన్ స్థాయులను పెంచడంలో సహాయపడుతుంది’ అంటుంది ప్రోఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్, ట్రైనర్ కీర్తి దివాకరన్. కేరళ కొచ్చీలోని వైనవి నృత్యకళాక్షేత్రం వ్యవస్థాపకురాలు కీర్తి.‘డ్యాన్సింగ్ అనేది న్యూరో–మస్క్యులార్ బ్యాలెన్స్‌ను వృద్ధి చేయడంలో సహాయపడుతుంది’ అంటుంది క్లాసికల్ డ్యాన్సర్, ట్రైనర్, కోజికోడ్‌లోని గౌరీశంకరం క్లాసికల్ డ్యాన్స్ థెరపీ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. ప్రియా మేనన్. శాస్త్రీయ నృత్యరూపకాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అప్లైడ్ రిసెర్చ్ పేపర్ ప్రకారం... ఏదైనా వర్కవుట్ పదినిమిషాల ఒడిస్సీ డ్యాన్స్‌తో సమానం. డ్యాన్స్‌లో భాగంగా కాళ్ల నుంచి మెడ వరకు అన్నీ కదులుతాయి. గంట ఒడిస్సీ నృత్యం 250 కేలరీలు ఖర్చు కావడానికి కారణం అవుతుంది. ‘సైన్స్ అండ్ జర్నల్’లో ప్రచురితమైన రిసెర్చ్ పేపర్ ప్రకారం నాన్–డ్యాన్సర్లతో పోల్చితే కథక్ డ్యాన్సర్ల శరీర బరువు, బాడీ మాస్ ఇండెక్స్... మొదలైన వాటికి సంబంధించి బాడీ కంపోజిషన్ మెరుగ్గా ఉంటుంది. కథక్ డ్యాన్స్‌లోని క్విక్ ఫుట్ వర్క్ వల్ల ఒత్తిడి మాయం అవుతుంది. వ్యాయమాలతో కూడిన డ్యాన్స్ అనగానే ఒకప్పుడు జాజ్, లైన్ డ్యాన్స్, హిప్ హప్, సల్సా... మొదలైన వెస్ట్రన్ డ్యాన్స్‌లు మాత్రమే గుర్తొచ్చేవి. ‘ఎక్కడి దాకో ఎందుకు మన దగ్గరే బోలెడు శక్తిసంపద ఉంది’ అని గ్రహించిన యువతరం మన శాస్త్రీయ నృత్యాలకు దగ్గరవుతోంది. సాధన చేస్తోంది. ఆరోగ్య భాగ్యానికి చేరువ అవుతోంది. బాడీ బయో మెకానిక్స్ బాడీ బయోమెకానిక్స్ను బాగా అర్థం చేసుకోవడం డ్యాన్సర్ కమ్యూనిటీకి ముఖ్యం అంటుంది మధుమతి బెనర్జీ. భరతనాట్య కళాకారిణీ అయిన బెనర్జీ ఎన్నో దేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది. ఇండియన్ క్లాసికల్ అండ్ ఫోక్ మ్యూజిక్‌లో కూడా ప్రావీణ్యం సాధించింది. శాస్త్రీయ నృత్యాలు నేర్చుకోవడానికి అవసరమైన స్ఫూర్తిని యువతరానికి ఇస్తోంది. నృత్యం ధ్యాన సాధనం.. ‘రోల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ పేరుతో రిమ్లీ భట్టాచార్య ఒక ఆర్టికల్ రాసింది. ‘భారతీయ శాస్త్రీయ నృత్యం మన విద్యా విధానంలో భాగంలో కావాలి. ఇది మన సంస్కృతికి సంబంధించిన శక్తిరూపమే కాదు అద్భుతమైన ధ్యాన సాధనం కూడా. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఏకాగ్రత, సృజనాత్మకతను పెంపొందించడానికి శాస్త్రీయ నృత్యం ఉపయోగపడుతుంది. డ్యాన్స్ మూమెంట్స్‌తో శారీరక దృఢత్వం కలుగుతుంది. శరీరంపై నియంత్రణ పెరుగుతుంది. అంతర్గత భావాలను వ్యక్తీకరించే పద్ధతి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి’ అంటుంది రిమ్లీ భట్టాచార్య. మెకానికల్ ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్ అయిన రిమ్లీ ఎంబీఏ చేసింది. కార్పోరేట్ సెక్టార్లో పనిచేసింది. మానసిక ఆరోగ్యంపై ఎన్నో వ్యాసాలు రాసింది. ‘ఏ బుక్ ఆఫ్ లైట్’ పేరుతో పుస్తకం ప్రచురించింది. (చదవండి: నర్సు వెయిట్ లాస్ స్టోరీ..ఆ ఒక్క ఎక్స్ర్సైజ్తో జస్ట్ ఒక్క ఏడాదిలోనే..) -
మాటలతో చెప్తే వినరు.. అందుకే డ్యాన్స్‌తో..!
నాట్యం అంటే వినోదం.. ఆ వినోదానికి సమాచారం తోడైతే.. అదెలాగో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే! విమానంలో ప్రయాణించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎయిర్ ఇండియా వినూత్నంగా తెలిపింది. నాట్యపద్ధతిలో అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది . సేఫ్టీ ముద్రాస్ పేరిట ఓ వీడియో రిలీజ్ చేసింది. 👉 భరతనాట్యం ఇందులో మొదటగా భరతనాట్యం చేస్తున్న అమ్మాయి సీటుబెల్ట్ ఎలా పెట్టుకోవాలో చూపించింది. అలాగే ప్రయాణికులు వారి సామాన్లను ఓవర్‌హెడ్ కంపార్ట్మెంట్లో పెట్టమని సూచించింది. 👉ఒడిస్సి నాట్యం సీటు ముందు ఉన్న ట్రే టేబుల్స్ క్లోజ్ చేయమని చెప్తూనే విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు విండోస్ ఓపెన్ చేసి ఉంచాలని చెప్పారు. 👉మోహిని నాట్యం ప్రయాణికులు ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులనులను విమానం బయల్దేరేటప్పుడు, కిందకు దిగేటప్పుడు వాడవద్దని సూచించారు. మొబైల్ ఫోన్స్ ఫ్లైట్ మోడ్‌లో వాడుకోవచ్చన్నారు. సిగరెట్స్‌తో పాటు ఇ సిగరెట్స్ కూడా వాడటానికి వీల్లేదన్నారు. 👉కథక్ నాట్యం ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఎనిమిది ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి. అవి ఎక్కడున్నాయో ఒకసారి చూసుకోండి. దాదాపు మీ వెనకాలే ఓ ఎగ్జిట్ ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆక్సిజన్ మాస్కులు రిలీజవుతాయి. దాన్ని కచ్చితంగా ధరించాలని నొక్కి చెప్పారు. 👉ఘూమర్ నాట్యం అనుకోని కారణాల వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగితే.. ఎమర్జెన్సీ లైటింగ్ మీరు ఎగ్జిట్ దగ్గరకు వెళ్లేందుకు సహాయపడుతుందని, దాన్ని గుర్తించాలన్నారు. 👉బిహు నాట్యం అనుకోకుండా విమానం నీళ్లలో ల్యాండ్ అయినప్పుడు సీట్ల కింద లేదా సీట్ల మధ్య ఉన్న రక్షణ కవచాన్ని ధరించాలని తెలిపారు. 👉గిద్ధ నాట్యం ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపే సేఫ్టీ కార్డును సీటు పాకెట్లో ఉందని, ఏమైనా సందేహాలు ఉంటే దాన్ని తీసి చదవమని విజ్ఞప్తి చేశారు. ఈ స్పెషల్ వీడియోకు శంకర్ మహదేవన్ సంగీతం అందించగా ప్రసూన్ జోషి గేయ రచయితగా పని చేశారు. దీనికి భారత్బాలా దర్శకత్వం వహించారు. -
Meenakshi Seshadri: అరవైలోనూ ఇరవై!
నృత్యానికి వయసు అడ్డు కాదని మరోసారి నిరూపించింది మాజీ బాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి. 60 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన క్లాసికల్ డ్యాన్స్ కొరియోగ్రఫీతో నెటిజనులను ఆకట్టుకుంది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. క్లిష్టమైన ఫుట్‌వర్క్, హావభావాల వ్యక్తీకరణతో నెటిజనులను ఆకట్టుకుంది. ఆమె కాలాతీత అందం, క్లాసికల్ డాన్స్ పట్ల నిబద్ధతకు అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 1980లలో హీరో, మేరీ జంగ్, దామినిలాంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి భర్త, బిడ్డలతో అమెరికాలో స్థిరపడింది. అక్కడ ఒక డ్యాన్స్ స్కూల్ ప్రారంభించి భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలను నేర్పించేది. ఆన్–స్క్రీన్ మీద కనిపించనప్పటికీ ఈ అందాల నటి సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటోంది. ‘అప్పుడు–ఇప్పుడూ’ అనే కాప్షన్‌తో పాత, కొత్త ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. -
శివపదం గీతాలకు ఇండోనేషియా బాలిలో నృత్య ప్రదర్శన
శివపదం గ్లోబల్ ఫ్యామిలి భారతీయ నృత్య ప్రదర్శనకు సరిహద్దులు లేవని చాటిచెప్పారు. అమెరికాలో పుట్టి పెరిగిన 45 మంది భారతీయ విద్యార్థులు ఇండోనేషియా బాలిలో కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ వంటి సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. శివపదం గీతాలకు వాణి గుండ్లాపల్లి (నో యువర్ రూట్స్, యూ. ఎస్. ఏ.), దినేష్ కుమార్ (సంగమం అకాడమీ, ఇండియా) నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. డా.సామవేదం షణ్ముఖ శర్మ రచించిన శివపదం సాహిత్య పద్యాలతో పాటు త్యాగరాజు, అన్నమయ్య, మైసూర్ వాసుదేవాచార్యులు రచించిన సాహిత్యాలకు నృత్య ప్రదర్శన చేశారు. అలాగే శివాష్టకం, దుర్గా దేవిస్తోత్రం వంటి వేద స్తోత్రాలను అనేక నృత్య కళారూపాలలో ప్రదర్శించారు.మైత్రీమ్ భజత అనే గీతాన్ని కూడా అందమైన నృత్య రూపంతో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా నవీన్ మేఘ్వాల్ (బాలిలోని ఐ.సి.సి.ఆర్ – ఎస్.వి.సి.సి డైరెక్టర్), డైరెక్టర్: ప్రొఫెసర్ డా. ఐ వాయన్ అద్న్యానా ఇసి, డెన్పాసర్లతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కళలకు ఎల్లలు లేవని చాటిచెప్పడానికే ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. -
దేశ నలుమూలల నుంచి నాట్య తోరణంలో పాల్గొన్న నృత్యకారులు
-
క్లాసిక్+వెస్ట్రన్ =ఫైర్
మన కథాకళికి పాప్ పాట జత చేస్తే ఎలా ఉంటుంది? రెండు కళ్లు చాలనంత అద్బుతంగా ఉంటుందని చెప్పడానికి ఈ వైరల్ వీడియోనే సాక్ష్యం. అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ గోమెజ్, నైజీరియన్ సింగర్, ర్యాపర్ రెమోల ‘బేబీ కామ్‌డౌన్’ పాట సెన్సేషనల్ గ్లోబల్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు తమదైన క్రియేటివ్ ట్విస్ట్ ఇస్తున్నారు కళాకారులు. మనదేశం విషయానికి వస్తే... ముగ్గురు మహిళా డ్యాన్సర్లు ‘బేబి కామ్‌డౌన్’ పాటకు వేసిన కథాకళీ స్టెప్పులు ‘వారెవా’ అనిపించాయి. ముఖ్యంగా వారి ఎక్స్ప్రెషన్స్ ‘అదరహో’ అన్నట్లుగా ఉన్నాయి. డ్యాన్సర్ శెయాలి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 10 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. క్లాసిక్+వెస్ట్రన్ =ఫైర్ అని నెటిజనులు స్పందించారు. -
భారతదేశంలోని టాప్ 10 శాస్త్రీయ నృత్యాలు
-
కూచిపూడి నృత్య అరంగేట్రం చేసిన శాలిని దేవరకొండ
-
సంధ్యారాజు 'నాట్యం'పై ఏఆర్ రెహమాన్ ప్రశంసలు
ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ఇటీవల `నాట్యం` సినిమాలో తన డ్యాన్స్, మరియు నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశారు.. తాజాగా ఉమెన్స్‌డే సందర్భంగా ప్రముఖ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత మాయ ఏంజిలో రాసిన ఇంగ్లీష్ పద్యం `ఫినామినల్ ఉమెన్`కు మోడ్రన్ కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ ఫినామినల్ ఉమెన్ డ్యాన్స్ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ప్రశంసించి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే మూడు లక్షలకుపైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో విశేష ఆదరణ సొంతం చేసుకుంది. మన తెలుగు అమ్మాయి, క్లాసికల్ డ్యాన్సర్ జాతీయ స్థాయిలో ప్రసిద్ది చెందిన ఏఆర్ రెహమాన్ ప్రశంసలు అందుకోవడం గర్వించదగిన క్షణం. Sandhya Raju / Modern Kuchipudi / Performance Poetry / Maya Angelou's P... https://t.co/oUHeimC2Ai via @YouTube — A.R.Rahman (@arrahman) March 13, 2022 -
ఆమె నాట్యం... మూడుకోట్ల వ్యూస్
సాధారణంగా ఏడు పదులకు పైబడిన వయసులో చకచకా నడవడమే గొప్ప. అలాంటిది నాట్యం చేస్తే ఎలా ఉంటుంది? అదీ చీరకట్టులో... షీమా కిర్మానీ అయితే అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు. ఇటీవల ఆమె నాట్యం చేస్తూ విడుదల చేసిన ‘పసూరి’ వీడియో యూట్యూబ్‌లో తెగ సందడి చేస్తోంది. ఇప్పటి దాకా దాదాపు మూడు కోట్లమంది ఈ వీడియోను చూశారు. పాకిస్థాన్ లో బాగా పాపులర్ అయిన మ్యూజిక్ టీవీ సీరీస్– 14లో భాగంగా ఈ వీడియోను విడుదల చేశారు. గత నలభై ఏళ్లుగా సంప్రదాయ చీరకట్టులోనే నాట్యం చేస్తూ పాకిస్థానీ మహిళల స్వేచ్ఛ, హక్కుల కోసం పోరాడుతున్నారామె. రావల్పిండిలోని ఓ బ్రిగేడియర్ కుటుంబంలో పుట్టి పెరిగిన షీమా కిర్మానీకి చిన్న వయసునుంచే నాట్యం మీద ఎనలేని మక్కువ. షీమా తల్లి హైదరాబాద్‌కు చెందిన వారు. ఆమె ఎక్కువగా చీరనే ధరించేవారు. చిన్నప్పటినుంచి ఆమె చీరకట్టు చూస్తూ పెరిగిన షీమా తను కూడా చీర కట్టుకోవడానికి ప్రయత్నించేది. దేశ విభజన జరగడంతో.. కుటుంబం రావల్పిండికి మారింది. అయినప్పటికీ ప్రతి వేసవికాలం సెలవులకు ఇండియా వచ్చేది. దీంతో ఆమెకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై ఆసక్తి ఏర్పడింది. ఈ ఆసక్తితో స్కూలు చదువు పూర్తయ్యాక, లండన్ లో ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తిచేసింది. లండన్ లో ఉన్నప్పుడు అక్కడి మహిళలకు ఉన్న స్వేచ్ఛాస్వాతంత్య్రాలు ఆమెను ఎంతగానో ఆకర్షించాయి. ఇతర ప్రపంచ దేశాల్లో ఎక్కడాలేని నిబంధనలు పాకిస్థాన్ లోనే ఉండడం తనకి నచ్చలేదు. దీంతో 1979లో ‘తెహ్రీక్–ఇ–నిస్వాన్ ’ అనే స్త్రీవాద గ్రూపును ప్రారంభించి, మహిళల కనీస హక్కుల కోసం పోరాటం మొదలు పెట్టింది. ఔరత్ మార్చ్... ఎనభయ్యవ దశకంలో ఢిల్లీ వచ్చిన షీమా.. భరతనాట్యం, ఒడిస్సీలలో శిక్షణ తీసుకుంది. శిక్షణ పూర్తయిన తరువాత కరాచీకి తిరిగి వెళ్లింది. కానీ అప్పుడు జనరల్‌గా పనిచేస్తోన్న జియా ఉల్హక్.. పాకిస్థాన్ లో అంతా ఇస్లాంనే అనుసరించేలా సరికొత్త నిబంధనలు తీసుకొచ్చారు. భారతీయ స్త్రీలు ధరించే చీరలను అక్కడ ధరించకూడదని నిషేధం విధించారు. నాట్యం చేయడానికి కూడా అనుమతి లేదు. అప్పుడే శాస్త్రీయ నృత్యకారిణిగా పట్టభద్రురాలైన షీమాకు ఆ నిబంధనలు అస్సలు మింగుడు పడలేదు. తన భావాలను వ్యక్తం చేయడానికి నాట్యం మంచి సాధనమని భావించిన షీమా అక్కడి నిబంధనలకు విరుద్ధంగా చీరకట్టుకుని నాట్యం చేసేది. ఇందులో భాగంగానే ‘ఔరత్ మార్చ్’ పేరిట ప్రదర్శనలు ఇస్తూ మహిళల హక్కుల గురించి గొంతెత్తి చెబుతోంది. ప్రతి సంవత్సరం ఉమెన్ ్సడేకు ఔరత్ మార్చ్‌ను నిర్వహిస్తూ సమాన హక్కుల కోసం పోరాడుతోంది. 2017లో ప్రముఖ లాల్ షహబాజ్ క్వాలందర్ మందిరంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో అనేకమంది చనిపోయారు. అప్పుడు దానికి నిరసనగా షీమా తన తెహ్రీక్ గ్రూపుతో కలిసి ఆ మందిరం వద్దకు చేరుకుని ‘ధమాల్’ను ప్రదర్శించింది. ధమాల్ అనేది ఒకరకమైన నృత్యం. దీనిని దర్గాలలో సూఫీ సాధువులు వారి ఆరాధనలో భాగంగా చేస్తారు. ధమాల్‌ను ప్రదర్శించి అప్పుడు కూడా వార్తలో నిలిచింది. గత నలభై ఏళ్లుగా డ్యాన్ ్స చే స్తూనే మహిళా హక్కుల కోసం పోరాడుతోంది. ఎంతోమంది అధికారుల ఆగ్రహానికి లోనైనప్పటికీ తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. అంతేగాక ఎంతోమంది విద్యార్థులకు నాట్యం నేర్పిస్తూ వారిలో అవగాహన కల్పిస్తోంది. సంకల్పం ఉంటే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చనడానికి ఉదాహరణగా నిలుస్తోంది షీమా. -
శాస్త్రీయ నృత్యం చేస్తూ పెయింటింగ్
చిత్రలేఖనం అందరికీ తెలుసు. లీజా దినూప్ చేసేది నృత్య లేఖనం. శాస్త్రీయ నృత్యం చేస్తూ పెయింటింగ్ చేసి నృత్యకళను, చిత్రకళను వేదిక మీద సంగమకళగా ప్రదర్శిస్తోందామె. ఇలా చేస్తున్న ఒకే కళాకారిణి లీజా. అందుకే ఆమె పేరు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ ‘చిత్రనర్తకి’ పరిచయం. తెలుగు వారి విశిష్ట సంప్రదాయ నృత్యం ‘కూచిపూడి’లో ‘తాళ చిత్ర నృత్యం’ అనే విభాగం ఉంది. అందులో చిత్రకారిణి నృత్యం చేస్తూ పాదాల కదలికతో బట్ట మీద పరిచిన రంగును చెదరగొడుతూ నర్తనం ద్వారా ఒక బొమ్మను గీస్తుంది. ఎంతో సాధన ఉంటే తప్ప ఈ విద్య సాధ్యం కాదు. ఇదే కూచిపూడిలో ‘సింహనందిని’ అనే నృత్యవిభాగం దుర్గపూజ సమయంలో నర్తకీమణులు ప్రదర్శిస్తారు. ఈ నృత్యంలో రంగు పరిచిన బట్ట మీద నర్తిస్తూ పాదాలతో సింహం బొమ్మ గీస్తారు. ఇది దుర్గాదేవిని ఆరాధించే ఒక పద్ధతిగా వ్యాఖ్యానిస్తారు. భారతీయ నృత్యకళల్లో వేరే నృత్యాలకు లేని విశిష్టత ఈ విధంగా కూచిపూడికి ఉంది. అయితే కేరళలోని కాసర్గోడ్ టౌన్‌కు సమీపంలో ఉండే పయ్యూర్ అనే ఊరికి చెందిన 30 ఏళ్ల లీజా దినూప్ భరతనాట్యం చేస్తూ వేదిక మీద సిద్ధంగా ఉంచిన కేన్వాస్ మీద దేవతల బొమ్మలను గీస్తూ నృత్య చిత్రాల సంగమ కళను ప్రదర్శిస్తూ గుర్తింపు పొందుతోంది. కన్నూర్ యూనివర్సిటీలో ఎం.ఏ భరతనాట్యం చేసిన లీజా ఆ తర్వాత తిరువనంతపురంలో బేచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసింది. ఆమె నృత్యం చేయగలదు... చిత్రకళను ప్రదర్శించగలదు. ఈ రెంటిని కలిపి తానొక ‘చిత్రనర్తకి’ని ఎందుకు కాకూడదు అనిపించింది. వెంటనే ఆమె ఆ కళను సాధన చేసింది. ‘రామాయణ గాధలను, శివ ఆరాధనను, రవివర్మ గీసిన చిత్రాలను కేన్వాస్ మీద పునఃప్రతిష్టిస్తూ నేను భరతనాట్యం చేస్తాను’ అని లీజా దినూప్ అంటుంది. వివాహం అయ్యి మూడేళ్ల పాప ఉన్న లీజా కేరళలో రాష్ట్ర, జాతీయ సాంస్కృతిక కార్యక్రమం ఏది జరిగినా ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుంది. ఇప్పటికి ఆమె రాష్ట్రమంతా దాదాపుగా 50 చిత్రనర్తన ప్రదర్శనలు ఇచ్చింది. అంతే కాదు ఇలా చేసే ఏకైక చిత్రకారిణి కనుక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కింది. వేదిక మీద సంగీత బృందం రాగతాళాలు కొనసాగిస్తుండగా నృత్యం చేస్తూ మధ్య మధ్య కేన్వాస్ దగ్గరకు వస్తూ కుంచెతో ఆమె ఆ నృత్యంలో ఉన్న ఆధ్యాత్మిక, భక్తిభావాలకు తగిన బొమ్మను గీస్తుంది. ముఖ్యంగా రామాయణంలోని నవరసచిత్రాలను, గణేశ భక్తిని, స్త్రీ శక్తి రూపాన్ని ఆమె కేన్వాస్ మీద రంగుల్లో నాట్యం ద్వారా దేహంలో ప్రదర్శించి మెప్పు పొందుతోంది. ‘కళాత్మిక లలితకళాగృహం’ పేరుతో ఒక నటనాలయాన్ని ప్రారంభించి చిన్నారులకు శిక్షణ ఇస్తున్న లీజా నుంచి చిత్రనృత్యాన్ని అభ్యసించే కొత్తతరం తయారవుతోంది. భవిష్యత్తులో ఈ ప్రయోగం మరింత ముందుకు వెళ్లొచ్చని ఆశిద్దాం. -
యువతి క్లాసికల్ డ్యాన్స్; స్టెప్పులతో పెంపుడు కుక్క అదుర్స్
సాధారణంగానే కుక్కలను విశ్వాసానికి మారుపేరు అని వింటుంటాం. ఎమోషన్స్ పరంగా చూసుకుంటే కుక్కులు మనుషులతో కలిసిపోయిన సందర్భాలు చాలానే కనిపిస్తాయి.ముఖ్యంగా పెంపుడు కుక్కల్లో ఈ విశ్వాసం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. మనలో బాధ, సంతోషం, కోపం ఇలా ఏది కనిపించినా దానిని అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా మెలుగుతుంటాయి. తాజాగా ఒక యువతి తన పెంపుడు కుక్క ముందు క్లాసికల్ డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చింది. యువతి క్లాసికల్ స్టెప్పులు అదిరిపోవడంతో తన పెంపుడు కుక్క కూడా తన ముందు కాళ్లతో ఆమెను ఎంకరేజ్ చేస్తూ ఉత్సాహపరిచింది. యువతి డ్యాన్స్ చేసినంత సేపు కుక్క అలాగే నిల్చొని ఉత్సాహపరచడం విశేషం. ఆమె తన డ్యాన్స్ పూర్తి చేసిన అనంతరం తన కుక్క దగ్గరకు వెళ్లి దానిని గట్టిగా హత్తుకొని సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీనిని మొత్తం వీడియోగా తీసి ఆమె తన ఫేస్బుక్లో షేర్ చేసింది. ఇంకేముంది క్షణాల్లో వీడియో వైరల్‌గా మారిపోయింది. ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మంది వీక్షించగా.. లెక్కలేనన్ని లైక్స్, కామెంట్స్ వచ్చాయి. చదవండి: డ్రోన్‌తో అద్భుతం; ఎనిమిదో వింతను చూడాల్సిందే cannibalism: నాగుపామును మింగేసిన మరో నాగుపాము -
ఇటలీ ఇలియానా టూ పద్మశ్రీ ఇలియానా
విదేశీయులు మన భారతీయ సంప్రదాయాలను ఇష్టపడడం పెద్ద విశేషం కాకపోవచ్చు. కానీ ఇటలీకి చెందిన ఇలియానా సిటార్టి మన సంస్కృతి, కళలను ఇష్టపడడమే కాకుండా, వాటిని నేర్చుకుని మరెంతోమందికి నేర్పిస్తున్నారు. భారతీయ సంప్రదాయ నృత్యాలపై ఎంతో మక్కువ పెంచుకున్న ఇలియానా 1979లో ఒడిషా రాష్ట్రం చేరుకుని అక్కడ ఒడిస్సీ, చౌ డ్యాన్స్‌లను నేర్చుకున్నారు. నేర్చుకోవడమంటే ఏదో ఆషామాషీగా నేర్చుకోలేదు. ఇలియానా ఒడిస్సీని ఒడిసి పట్టారు. 1995 నుంచి ఆమె తాను నేర్చుకున్న నాట్యాన్నీ వివిధ వేదికలపై ప్రదర్శిస్తూ.. ఎంతోమంది ఔత్సాహికులకు నేర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలియనా వివిధ వేదికలపై ఒడిస్సీ నృత్యాన్నీ ప్రదర్శించడం, ఎక్కువ మందికి నాట్యం నేర్పించడం ద్వారా 2006లో పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. క్లాసికల్ డ్యాన్స్‌లో పద్మశ్రీ అందుకున్న తొలి విదేశీయురాలిగా ఇలియానా గుర్తింపు పొందారు. 43వ జాతీయ చిత్ర పురస్కారాల్లో యుగాంత్ అనే బెంగాలీ సినిమాకు గాను బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డును కూడా అందుకున్నారు. 1995లో ‘ఆర్ట్ విజన్’ అనే సంస్థను ఇలియానా భువనేశ్వర్ లో స్థాపించారు. దీని ద్వారా స్థానిక విద్యార్థులకు ఒడిస్సీ, ఛౌ డ్యాన్స్‌లలో శిక్షణనిస్తున్నారు. అంతేకాకుండా ఆర్ట్ విజన్ ద్వారా వివిధ భావనలను థీమ్‌గా తీసుకుని ఏళ్లుగా రకరకాల పేర్లతో డ్యాన్స్ పండుగలను నిర్వహిస్తున్నారు. వీటిలో ‘ఫెస్టివల్ ఆఫ్ ఫిల్మ్స్ ఆన్ పెర్ఫార్మింగ్ అండ్ విజువల్ ఆర్ట్స్’ వంటివి కూడా ఉన్నాయి. ఒడిషా వచ్చినప్పటి నుంచి తన గురువు అయిన పద్మ విభూషణ్∙కేలుచరణ మోహపాట్రా దగ్గర డ్యాన్స్‌ను నేర్చుకున్నారు. ‘సైకోఎనాలసిస్ అండ్ ఈస్ట్రన్ మైథాలజీ’లో పీహెచ్డీ చేశారు. శ్రీ హరి నాయక్ గురువు దగ్గర ఛౌ డ్యాన్స్ నేర్చుకున్నారు. ఒరియా సంస్కృతి సంప్రదాయాలపై ఆమె పరిశోధనలతోపాటు, అనేక ఆర్టికల్స్ రాసి ప్రచురించారు. అంతేకాకుండా లెక్చర్ డిమాన్స్ట్రేషన్తో ఒరియా సంప్రదాయాల ప్రాముఖ్యతను చాటిచెబుతున్నారు. ఒడిస్సీ, ఛౌ డ్యాన్సలపై అనేక వర్క్‌షాపులు నిర్వహిస్తూ ఈ రెండింటి ప్రాముఖ్యతను ప్రపంచానికి వివరిస్తున్నారు. ఇలియానా ఇండియాలోనేగాక ఇటలీ, అర్జెంటినా, పోలండ్, ఫ్రాన్స్, జర్మనీ, హోలాండ్, డెన్మార్క్, మలేసియా, హాంగ్‌కాంగ్, జపాన్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇజ్రాయేల్, స్పెయిన్, దక్షిణ కొరియా, కెనడా, పెరు వంటి దేశాల్లో అనేక ప్రదర్శనలు ఇస్తున్నారు. మన దేశంలోనే గాక వివిధ దేశాల్లో ఒడిస్సీ ప్రదర్శిస్తూ అనేక అవార్డులు పొందారు. మన దేశ సాంప్రదాయాలను వదిలేస్తున్న ఈతరానికి ఇలియానా ఆదర్శంగా నిలుస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కాదనుకుని..!
సాక్షి,యద్దనపూడి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో లక్ష రూపాయల జీతంతో కూడిన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని దక్కించుకోవడమంటే ఆషామాషీ కాదు. కానీ, ఆమె మాత్రం తనను వెతుక్కుంటూ వచ్చిన ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసుకుంది. శాస్త్రీయ నృత్యంపై ఉన్న మక్కువతో ఆ దిశగా అడుగులు వేసింది. నృత్య రూపకాలపై పరిశోధన చేసి ఆధ్యాత్మిక జతులు, జావళీలకు, సామాజిక ఇతివృత్తాన్ని జోడిస్తూ నృత్య ప్రదర్శనలిస్తూ కళాభిమానుల మన్ననలు అందుకుంది. అంతటితో సరిపెట్టుకోకుండా ఆ విద్యను పదిమందికి నేర్పించేందుకు శిక్షణాలయాన్ని స్థాపించింది. ఎంతో మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తూ నృత్య కళాకారులుగా తీర్చిదిద్దుతోంది. వారితో కలిసి ప్రదర్శనలిస్తూ తాను ఇష్టంగా ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంది. నాట్యంపై మక్కువతో తనను వివాహం చేసుకున్న సాఫ్ట్వేర్ రంగంలో నిపుణుడైన భర్తకు సైతం గురువుగా మారి నాట్యంలో శిక్షణ ఇచ్చి అతన్ని గొప్ప కళాకారునిగా తయారు చేసింది. ఈ యువ దంపతులిద్దరూ కలిసి ప్రస్తుతం దేశవ్యాప్తంగా నృత్య రూపకాలు ప్రదర్శిస్తూ నాట్య దాంపత్యం కొనసాగిస్తున్నారు. కళాభిమానుల ప్రశంసలు పొందుతున్నారు. వారే, యద్దనపూడి మండలం అనంతవరం గ్రామానికి చెందిన అద్దంకి ఆదిశేష వెంకటసుబ్రహ్మణ్యం, బాలత్రిపురసుందరి దంపతులు. తెనాలికి చెందిన చల్లా బాలత్రిపురసుందరికి చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యమంటే మక్కువ. దస్తగిరి, రంగనాయికి, చింతా రామనాథం, కేవీ సుబ్రహ్మణ్యం వంటి గురువుల వద్ద శాస్త్రీయ నృత్యం అభ్యసించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కూచిపూడిలో ఎంఏ కూడా చేసింది. భావితరాలకు కూచిపూడి కళను అందించాలన్న ఆకాంక్షతో మాస్టర్ ఆఫ్ పర్ఫారి్మంగ్ ఆర్ట్స్ (ఎంపీఏ) కూడా అభ్యసించింది. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు కాలేజీలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌లో ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఎంపికైనప్పటికీ.. నాట్యం కోసం ఆ అవకాశాన్ని కాదనుకుంది. అనంతరం కూడా నెలకు లక్ష రూపాయల వరకూ జీతమిచ్చే ఉద్యోగాలను పలు కంపెనీలు ఆఫర్ చేసినప్పటికీ నిస్సందేహంగా తిరస్కరించింది. ‘ఉద్యోగం చేస్తే బోలెడు మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లలో నేనూ ఒకదాన్నవుతా.. అదే నృత్యం చేస్తే అరుదైన కళాకారిణిగా మిగులుతా’ అనే భావనతో తాను ఎంచుకున్న మార్గం వైపే ముందుకు సాగింది. కళాకారిణిగా నృత్య ప్రదర్శనలు ఇస్తూనే.. 2010లో కల్యాణి కూచిపూడి ఆర్డ్స్ అకాడమీ పేరిట శిక్షణాలయాన్ని స్థాపించింది. శాస్త్రీయ నృత్యంలో ఎంతోమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి మంచి కళాకారులను తయారు చేసింది. కళాభిమానిని భర్తగా పొంది.. కళాకారునిగా తీర్చిదిద్ది... యద్దనపూడి మండలం అనంతవరం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ రంగ నిపుణుడు అద్దంకి ఆదిశేష వెంకటసుబ్రహ్మణ్యానికి కూడా సంప్రదాయ నృత్యమంటే ఎంతో ఇష్టం. 2019లో పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో అతని పెద్దలు అనుకోకుండా బాలత్రిపురసుందరి సంబంధం తెచ్చారు. ఆమె గురించి తెలుసుకున్న వెంకటసుబ్రహ్మణ్యం ఆనందంతో ఎగిరి గంతేశాడు. వెంటనే ఆమెను వివాహం చేసుకున్నాడు. అనంతరం కళావేదికలపై తన భార్య చేస్తున్న నృత్యానికి మరింత ఆకర్షితుడై ఎలాగైనా నాట్యం నేర్చుకోవాలని భావించాడు. అనుకున్నదే తడవుగా తన శ్రీమతినే గురువుగా చేసుకుని నెలల వ్యవధిలోనే ఆమె వద్ద నాట్యం నేర్చుకున్నాడు. వివిధ నృత్యరూపకాల పాత్రలకు తగిన హావభావాలు పలికించడంలోనూ నేర్పు సాధించాడు. గతేడాది తిరుమలలో జరిగిన నాదనీరాజనంలో శ్రీనివాసరూప కల్యాణాన్ని భార్యతో కలిసి ప్రదర్శించాడు. మహాశివరాత్రి వేడుకల్లో శ్రీశైలం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో నిర్వహించిన శివకల్యాణం రూపకంలోనూ ఈ దంపతులిద్దరూ శివపార్వతులుగా అభినయించి అభినందనలు అందుకున్నారు. షిరిడీలో బాలసుబ్రహ్మణ్యం ఒక్కరే బాబాగా అభినయించి అందరినీ మెప్పించాడు. భార్యభర్తలిద్దరూ కలిసి భవిష్యత్తులో మరిన్ని నృత్య ప్రదర్శనలు ఇచ్చేందుకు, తమ శిక్షణాలయం ద్వారా మరింత మందికి సంప్రదాయ నృత్యంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. కళామతల్లికి సేవలందించడమే లక్ష్యం : మా ఇద్దరికీ నాట్యమంటే ప్రాణం. రాబోయే రోజుల్లో కూడా ఇలానే మా నాట్య ప్రయాణాన్ని సాగించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. భార్యభర్తలు ఎటువంటి అరమరికలు లేకుండా ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకుంటే ఏ రంగంలోనైనా ఇద్దరూ అద్భుత విజయాలు సాధించగలరు. మా అకాడమీ ద్వారా చిన్నారులకు నృత్యం నేరి్పస్తూ కళామతల్లికి సేవలందిస్తాం. -బాలత్రిపురసుందరి, వెంకటసుబ్రహ్మణ్యం దంపతులు -
అనార్కలీకి అరవై ఏళ్లు
ఆమెకు క్లాసికల్ డాన్స్ రాదు. నేర్చుకొని ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ అంది. దిలీప్ కుమార్‌తో మాటలు లేవు. తెర మీద అతనిపై ఎంతో ప్రేమ ప్రదర్శించగలిగింది. హృద్రోగి. నిజమైన ఇనుప సంకెలలు ధరించి డైలాగులు చెప్పి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె చూపిన ఫ్యాషన్ నేటికీ అనార్కలీ డ్రెస్‌గా ఉనికిలో ఉంది. మధుబాల. భారతీయుల అపురూప అనార్కలీ. ‘మొఘల్–ఏ–ఆజమ్’ రిలీజయ్యి నేటికి సరిగ్గా 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఓ జ్ఞాపకం. ‘మొఘల్–ఏ–ఆజమ్’ కోసం అనార్కలీ పాత్ర మొదట నర్గీస్‌కు వెళ్లింది. కుదరలేదు. ఆనాటి సింగింగ్ సూపర్‌స్టార్ సురయ్యకు వెళ్లింది. ఆమెకూ కుదరలేదు. దాని కోసం మధుబాల జన్మెత్తి ఉన్నప్పుడు ఆ పాత్ర ఆమె దగ్గరకు వెళ్లడమే సబబు. మధుబాల అనార్కలీగా నటించింది. ఆ పాత్రకు తన సౌందర్యం ఇచ్చింది. ఆ పాత్రలోకి తన కళాత్మక ఆత్మను ప్రవేశపెట్టింది. మీకు గుర్తుందో లేదో. మధుబాల కేవలం 36 ఏళ్ల వయసులో చనిపోయింది. కాని నేటికీ జీవించే ఉంది. ఆమె చేసిన అనార్కలీ పాత్ర ఆమెను జీవింప చేస్తూనే ఉంది. అక్బర్ కుమారుడు జహంగీర్ (ముద్దుపేరు సలీమ్) తన రాజాస్థానంలో ఉన్న అనార్కలీ అనే నాట్యకత్తెతో ప్రేమలో పడ్డాడట. అలాగని దానికి ఎటువంటి చారిత్రక ఆధారం లేదు. కాని ప్రజలు ఆ ప్రేమకథను ఎంతో మక్కువగా చెప్పుకుంటూ వచ్చారు. 1920లో ఈ కథ మొదటిసారి ఉర్దూలో నాటకంగా వచ్చింది. ఆ నాటకం ఆధారంగా అనేక సినిమాలు వచ్చాయి. బీనారాయ్ అనార్కలీగా ‘అనార్కలీ’ సినిమా వచ్చి– ఏ జిందగీ ఉసీకి హై పాట గుర్తుందా– హిట్ అయ్యింది కూడా. కాని దర్శకుడు కె.ఆసిఫ్ చాలా పెద్దగా, అట్టహాసంగా, నభూతోగా ఈ ప్రేమకథను తీయదలిచాడు. ఎంత పెద్దగా అంటే ఆరేడు లక్షల్లో సినిమా అవుతున్న రోజుల్లో కోటి రూపాయలు ఖర్చు పెట్టి తీసేంతగా. అందుకు సలీమ్‌గా దిలీప్ కుమార్‌ను తీసుకున్నాడు. అక్బర్‌గా పృధ్వీరాజ్ కపూర్‌ను తీసుకున్నాడు. అనార్కలీగా మధుబాలని. హాలీవుడ్లో మార్లిన్ మన్రో ఉంది. మధుబాలను ఇండియన్ మార్లిన్ మన్రో అని పిలిచేవారు. వీనస్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఆమె బిరుదు. ‘మహల్’, ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’, ‘చల్తీ కా నామ్ గాడీ’... తెర మీద ఆమె ఒక అందమైన ఆకర్షణగా ఉంది. నిజానికి ఆమె నటనకు సవాలుగా నిలిచే సినిమా అంతవరకూ లేదనే చెప్పాలి. ‘మొఘల్–ఏ–ఆజమ్’తో ఆ అవకాశం వచ్చింది. దానిని ఆమె ఒక సవాలుగా స్వీకరించింది. మధుబాలకు పుట్టుక నుంచి గుండెకు సంబంధించిన సమస్య ఉంది. దానిని తర్వాతి కాలంలో గుర్తించినా వైద్యం ఏమీ లేక ఊరుకున్నారు. అయినప్పటికీ ఆ మగువ గుండె అనంత భావఘర్షణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దిలీప్‌కుమార్ ఆమెను వివాహం చేసుకోదలిచాడు. కాని అందుకు మధుబాల తండ్రి అడ్డుపడ్డాడు. అంతే కాదు వీళ్ల గొడవ కోర్టు కేసుల వరకూ వెళ్లింది. ఇద్దరూ తీవ్ర వ్యతిరేక భావనతో విడిపోయారు. ఇవన్నీ మొఘల్–ఏ ఆజమ్ నిర్మాణం జరిగిన సుదీర్ఘకాలం (1948–60) ల మధ్యే జరిగాయి. మొఘల్–ఏ–ఆజమ్ షూటింగ్ సమయంలో కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలలో కూడా వారిద్దరి మధ్య మాటలు లేవు. కాని తెర మీద అవేమీ తెలియకుండా ఇద్దరూ చేయగలిగారు. షహజాదా సలీమ్ కోసం ప్రాణం పెట్టే ప్రియురాలిగా తన కంటి రెప్పల మీద సకల ప్రేమనంతా అనార్కలీ అయిన మధుబాల నింపుకోగలిగింది. మధుబాల క్లాసికల్ డాన్సర్ కాదు. కాని సినిమాలో ఆమె కృష్ణుడి ఆరాధన గీతం ‘మొహె ఫంగట్ పే’ పాటలో శాస్త్రీయ నృత్యం చేయాల్సి వచ్చింది. నాటి ప్రసిద్ధ కథక్ ఆచార్యుడు కిష్షు మహరాజ్ దగ్గర నేర్చుకుని చేసింది. ఇక చరిత్రాత్మకమైన ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ పాటలో ఆమె మెరుపు వేగంతో పాదాలను కదిలించి, చురకత్తుల కంటే వాడిగా చూపులను విసిరి అక్బర్ పాదుషానే కాదు ప్రేక్షకులను కూడా కలవర పరుస్తుంది. ఇటు ప్రియుడి ప్రేమను వదలుకోలేక అటు రాచవంశానికి తుల తూగలేక ఇద్దరు పురుషుల మధ్య నలిగిపోయే పాత్రలో మధుబాల ప్రేక్షకులను సతమతం చేస్తుంది. దర్శకుడు కె.ఆసిఫ్ పర్ఫెక్షనిస్టు. అతను ఈ సినిమా కోసం మొదటిసీనులోనే రాజస్తాన్ ఎడారిలో పృథ్వీరాజ్ కపూర్‌ను ఉత్తపాదాలతో నడిపించాడు. మధుబాలాను అట్ట సంకెళ్లు వేసుకొని కారాగారంలో నటించడాన్ని అనుమతించలేదు. నిజమైన ఇనుప సంకెళ్లనే వేశాడు. ఆ సంకెళ్లు ఆమె లేలేత చర్మాన్ని కోసేవి. ఆ బరువుకు ఆమె సొమ్మసిల్లేది. అయినా సరే... ఆ పాత్ర కోసం ప్రాణాన్ని ఉగ్గబట్టుకుని నటించింది. ‘నీ చివరి కోరిక ఏమిటో కోరుకో’ అని అక్బర్ అడిగితే ‘ఒక్క రోజైనా మొఘల్ సామ్రాజ్యపు సింహాసనానికి రాణిగా ఉండాలని ఉంది’ అంటుంది అనార్కలీ. ‘నీ అల్పబుద్ధి మానుకున్నావు కాదు’ అంటాడు అక్బర్. ‘అయ్యా... ఇది నా కల కాదు. మీ కుమారుడి కల. అతని కల అసంపూర్ణంగా ఉంచి నేను మరణించలేను’ అంటుంది అనార్కలీ. మొఘల్–ఏ–ఆజమ్ సినిమాను ప్రేక్షకులు ఎన్నోసార్లు చూడాలి. మొత్తం సినిమా కోసం. దిలీప్ కోసం. మధుబాల కోసం. డైలాగ్స్ కోసం. పాటల కోసం. ఆగస్టు 5, 1960లో విడుదల అయిన మొఘల్ ఏ ఆజమ్ భారతీయ సినిమా కలెక్షన్ల రికార్డులను కొత్తగా లిఖించింది. ఆ విజయంలో ఎవరి వాటా ఎంతైనా మధుబాల వాటా సరి సమానమైనది. అనార్కలీకి తన ప్రేమ దక్కనట్టు మధుబాలకు నిజ జీవితంలో ప్రేమ దక్కిందా... చెప్పలేము. గాయకుడు కిశోర్ కుమార్‌ను వివాహం చేసుకుని చేసిన 9 సంవత్సరాల కాపురం పెళుసైనది. సుకుమారి అయిన మధుబాల గుండె జబ్బుతో గువ్వంతగా మారి 1971లో మరణించింది. అమె వల్ల అనార్కలీ అనార్కలీ వల్ల ఆమె సజీవమవుతూనే ఉంటారు. ఆమె స్మృతికి కొన్ని అక్షర దానిమ్మ మొగ్గలు. ఇష్క్ మే జీనా ఇష్క్ మే మరనా ఔర్ అబ్ హమె కర్నా క్యా జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా – సాక్షి ఫ్యామిలీ -
కుముదిని కదంబం
‘ప్రశ్న తలెత్తితేనే సృష్టించగలం.. స్పష్టత ఉంటేనే జయించగలం’ అని నాట్యాచారిణి కుముది లఖియా తొమ్మిది పదుల జీవితం చెబుతుంది. జీవితమంతా నేర్చుకోవడం, అన్వేషించడం, బోధించడం, సృష్టించడం.. వీటికే అంకితమైంది. డెబ్భయ్యేళ్లుగా నాట్య వృత్తిలో కుముదిని లఖియా పేరు కథక్కు పర్యాయపదంగా నిలిచింది. దాదాపు 50 ఏళ్ల క్రితం ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకారిణి అయిన కుముదిని లఖియా పొడవాటి జుట్టుతో, సాధారణ చీర కట్టుతో వేదికపై అడుగుపెట్టింది. చూస్తున్న ప్రేక్షకుల్లో విస్మయం కలిగించింది. అప్పటి వరకు శాస్త్రీయ కథక్ నర్తకిగా భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందినప్పటికీ సంప్రదాయ స్టేజ్ మేకప్ ఇతర అలంకారాలేవీ ఆమె ఆ సమయంలో ధరించలేదు. ఒక మధ్య వయస్కుడైన భర్తకు భార్యగా, తల్లిగా స్వతంత్రభావాలను ప్రేక్షకులు ముందు రూపుకట్టిన ఆ ఒకే ఒక్క ప్రదర్శన కథక్ నృత్యానికి ఒక గొప్ప మలుపు, కొత్త శకానికి నాంది. నాటి నుంచి నేటి వరకు ఎన్నో నృత్యరీతులను కథక్ ద్వారా పరిచయం చేస్తున్న కుముదిని లఖియా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1930లో జన్మించారు. ఈ నెల 17న 90వ పుట్టిన రోజు జరుపుకున్నారు. సనతాన శైలిలో కొత్త ఒరవడి సనాతన సంప్రదాయ శైలిలో శిక్షణ తీసుకున్నప్పటకీ ఎన్నో ప్రయోగాలను కథక్ కళ ద్వారా సృష్టించారు కుముదిని. నేడు భారతీయ సమకాలీన కథక్ నృత్య రీతులకు కుముదిని లఖియానే మార్గదర్శకురాలిగా భావిస్తారు. ఆమె కొరియోగ్రఫీలు నృత్య వార్షికోత్సవాలలో మైలురాళ్లుగా నిలిచాయి. ‘నా చిన్నతనం నుంచీ నాలో ఎప్పుడూ అనేక ప్రశ్నలు తలెత్తేవి. కథక్ అంటే సంప్రదాయ రీతుల్లో ఒకే విధంగా నృత్యం చేయాలా..! దీంట్లో కొత్తగా ఏమీ చేయలేమా? అని. అవే నన్ను మిగతావారి నుంచి విభిన్నంగా చూపాయి’ అంటారు కుముదిని. భారతీయ నృత్యంలో ప్రసిద్ధుడైన రామ్‌గోపాల్‌తో కలిసి 1941లో ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు కుముదిని వయసు 11 ఏళ్లు. 1950లో న్యూయార్క్‌లో ప్రదర్శన ఇచ్చింది మొదలు సోలో పెర్ఫార్మర్గా, కొరియోగ్రాఫర్‌గా ప్రపంచమంతా పర్యటించింది. 1967లో భారతీయ నృత్యానికి, సంగీతానికి కేంద్రబిందువుగా ‘కదంబ్’ పాఠశాలను నెలకొల్పింది. పెరుగుతున్నది వయసు కాదు ప్రఖ్యాత కథక్ నృత్యకారులు అదితి మంగల్దాస్, దక్షా శేత్, ప్రశాంత్ షా, అంజలి పాటిల్, పరుల్ షా.. వంటి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఎందరో ఆమెకు శిష్యులు. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో పాటు ఎన్నో అవార్డులు ఆమె ఖాతాలో సగౌరవంగా చేరాయి. రచయిత రీనా షా రాసిన ‘మూవ్మెంట్ ఇన్ స్టిల్స్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తినిచ్చిన జీవిత చరిత్ర ఆమెది. ఇన్నేళ్లూ నృత్యకారిణిగా కొనసాగుతున్న ఆమెలోని శక్తి రహస్యాన్ని అడిగితే – ‘నాలోనే కాదు మీ అందరిలోనూ ఉంది ఆ శక్తి. మీరు జీవితం నుండి ఏం కోరుకుంటున్నారో ఆ విషయం పట్ల స్పష్టత ఉంటే చాలు. మీద పడుతున్న వయసును కాదు గుర్తుచేసుకోవాల్సింది. మన జ్ఞానాన్ని, హృదయాన్ని ఇతరులతో ఎంత విస్తృతపరుచుకుంటే అంత శక్తిమంతులం అవుతాం. ఇప్పటికీ పాతికేళ్ల వయసున్న విద్యార్థులతో ప్రతిరోజూ చర్చిస్తుంటాను. ఆ విధంగా యువతరం ఆలోచనలను అర్థం చేసుకుంటుంటాను. నా దినచర్య బ్రహ్మముహూర్తం నుంచే మొదలవుతుంది. జీవనాన్ని తపస్సుగా భావిస్తేనే కఠినమైన పనులైనా సులువుగా అవుతాయని నా నమ్మకం’ అని చెప్పే ఈ నాట్యాచారిణి మాటలు నేటితరానికి మార్గదర్శకాలు. ముందెన్నడూ చూడని నృత్యరూపాలు ‘నా మొదటి గురువు ఎవరో నాకు తెలియదు’ అని చెప్పే కుముదినికి నృత్యం పుట్టుకతోనే అబ్బిన కళగా ప్రస్తావిస్తారు అంతా. కుముదిని రూపొందించిన కొరియోగ్రఫీలలో ధబ్కర్, యుగల్, అటాహ్ కిమ్.. వంటివి అత్యంత ప్రసిద్ధ చెందాయి. వీటిలో ముందెన్నడూ చూడని కథక్ నృత్య రూపాలను ప్రదర్శించడం ఆమె గొప్పతనం. ఈ కొరియోగ్రఫీలు కథక్‌లో ఇప్పుడు క్లాసిక్‌గా పరిగణించబడుతున్నాయి.సినిమా కొరియోగ్రాఫర్‌గానూ.. శాస్త్రీయ నృత్యానికి, సంగీతానికి కోటలా ఎదిగిన కుముదిని చిత్రసీమలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ‘బాలీవుడ్లో మూడు సినిమాలకు కొరియోగ్రఫీ చేశాను. వాటిలో ‘ఉమ్రావ్ జాన్’ సినిమా హిట్ అయ్యింది. ఒక సినిమాలో నటి జయప్రదకు కథక్ నేర్పించాను. నటి రేఖ భరతనాట్యం నేర్చుకోవడానికి చాలా కష్టపడేది. అప్పట్లో సినిమాల్లో అర్థవంతమైన నృత్యాలు ఉండేవి. ఈ రోజుల్లో ఏరోబిక్ డాన్స్ల్లా కాదు’ అంటూ నవ్వుతారు కుముదిని. కుటుంబ జీవనమూ తోడుగా.. ‘జీవితంలో ఏదీ కోల్పోలేదు. వృత్తినీ – కుటుంబాన్ని సమంగా చూసుకుంటూ వచ్చాను’ అని చెప్పే కుముదిని లా చదివిన రజనీకాంత్ లఖియాను పెళ్లి చేసుకున్నారు. రజనీకాంత్ వయోలిన్ వాద్యకారుడు కూడా. నాట్యాచార్యుడు రామ్‌గోపాల్ బృందంలో రజనీకాంత్ ఉండేవారు. వీరికి కొడుకు, కూతురు సంతానం. ప్రస్తుత మహమ్మారి పరిస్థితులను కుముదిని ముందు ప్రస్తావిస్తే –‘కరోనా గురించే కాదు జీవితంలో దేని గురించీ భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు స్వీకరించే అవగాహన మనలో పెరగాలి’ అంటారు కుముదిని. -
కరోనా: ఆమె డ్యాన్స్‌కు ఫిదా
సాక్షి, కేరళ: కరోనాను అధిగమించడానికి సినీ తారలు, విశ్లేషకులు, కళాకారులు..ఇలా ప్రతీఒక్కరూ తమకు తోచిన విధంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల కేరళలోని ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి డాన్సర్ డాక్టర్ మెథిల్ దేవికా అద్భుతమైన నృత్యంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఆమె ప్రదర్శించిన మోహినియట్టం వీడియోను ఏప్రిల్1న యూట్యూబ్‌లో షేర్ చేసింది. దీనికి ఇప్పటికే వేలాది లైకులు, వందలాది కామెంట్లు వచ్చాయి. మెథిల్ దేవికా ప్రదర్శనకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కరోనాపై పోరాడటానికి మీ డ్యాన్స్‌నే ఆయుధంగా వాడుకున్నారు. గ్రేట్.. మీరు రియల్ ఆర్టిస్ట్. కళాకారులందరికీ ప్రేరణగా నిలుస్తున్నారు. మీ కాన్సెప్ట్ చాలా బాగుంది అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గత నెలలో కూడా పేస్‌బుక్‌లో దేవికా ఓ డ్యాన్స్ వీడియోని షేర్ చేసింది. దానికి కూడా యూజర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక దేశంలో కరోనా మహమ్మారి కారణంగా రెండువేలకు పైగా కేసులు నమోదవ్వగా, 58 మంది చనిపోయారు. -
డ్యాన్స్ బామ్మా.. డ్యాన్స్
స్థ్థలం.. కేరళలోని కొచ్చి. అక్కడి ఎడప్పల్లి నృత్య ఆస్వాదక సదస్‌లో 26 మంది మహిళలు భరతనాట్యం, మోహినీ ఆట్టం నేర్చుకుంటున్నారు. అందరూ యాభైఏళ్లు పైబడ్డవాళ్లే. ఆ గ్రూప్‌లోని అందరికన్నా పెద్దావిడకు 75 ఏళ్లు. వాళ్లకు డాన్స్ నేర్పుతున్న టీచరమ్మకు 30 ఏళ్లుంటాయి. చిన్నప్పుడు డాన్స్ నేర్చుకోవాలని ఉన్నా.. కుటుంబం, పరిస్థితులు, ఇతర కారణాల ఆ ఇష్టాన్ని మనసులోనే దాచుకొని .. కళ పట్ల ఆరాధన పెంచుకుంటూ... జీవితంలో ఎప్పుడు అవకాశం దొరికినా నృత్యం నేర్చుకొని తీరాలన్న కలను సాకారం చేసుకుంటున్న వారే అందరూ. తమను తాము ప్రేమించుకుంటూ.. తమ కోసం సమయం చిక్కించుకున్న వారే అంతా! ‘మాలాంటి వాళ్ల కోసమే ఈ డాన్స్ ఇన్స్ స్టిట్యూట్ స్టార్ట్ అయింది. మొదట్లో అడుగులు వేయడానికి చాలా కష్టపడ్డాం. అయినా ప్రాక్టీస్ ఆపలేదు. చిన్నప్పుడు చేయాలనుకున్నది ఇప్పటికి గానీ సాధ్యపడలేదు. బెటర్ లేట్ దేన్స్ ఎవర్ అంటారు కదా (నవ్వుతూ). నిజం చెప్పొద్దూ.. మాకు నచ్చింది చేసుకోవడానికి మా పిల్లలూ ప్రోత్సహిస్తున్నారు’ అంటూ 60 ఏళ్ల లీనా చెప్తూంటే ‘పిల్లలు అంటే కొడుకులు అనుకుంటారేమో.. కాదు కూతుళ్లు, కోడళ్లు అని చెప్పండి లీనా’ అంటూ ఆమె పక్కనే ఉన్న ఉష మాటందుకున్నారు. ‘అవునవును.. నా విషయంలో నా మనవలు, మనవరాళ్లు కూడా’ అంటూ శ్రుతి కలిపింది 75 ఏళ్ల మామ్మ. గత సంవత్సరం దసరా రోజున ప్రారంభమైంది ఈ నృత్య ఆస్వాదక సదస్. ఈ 26 మందిలో గృహిణి నుంచి టీచర్, డాక్టర్, రిటైర్డ్ ఉద్యోగినుల దాకా ఉన్నారు. ఈ నాట్యాలయానికి వచ్చాకే వీళ్లంతా స్నేహితులయ్యారు. ‘ఈ ఇన్స్టిట్యూట్ మాకొక థెరపీ క్లినిక్ లాంటిది. డ్యాన్స్ సరే.. ఈ వయసులో ఇంతమంది కొత్త ఫ్రెండ్స్ అయ్యారు. రకరకాల అభిరుచులు ఉన్నవాళ్లమే అంతా. ఇంటి విషయాల నుంచి హాబీస్, స్పోర్ట్స్, సినిమాలు.. వరల్డ్ పాలిటిక్స్ దాకా అన్ని విషయాల మీద చర్చించుకుంటాం.. ఒకరినొకరం టీజ్ చేసుకుంటాం’ అంటుంది డాక్టర్ ప్రేమ. ‘అందరూ ఒకే వయసు వాళ్లు కాదు కాబట్టి.. అందరూ తేలిగ్గా చేయగలిగే స్టెప్స్‌ను కంపోజ్ చేసి నేర్పిస్తున్నాను. వాళ్ల పట్టుదల చూస్తుంటే ముచ్చటేస్తోంది. పిల్లల్లా అల్లరి చేస్తారు.. జోక్స్ వేస్తూంటారు.. నవ్వుతారు... నవ్విస్తారు.. వీళ్లున్నంతసేపు టైమే తెలియదు. సందడిగా ఉంటుంది. కొత్త శక్తి వస్తుంది. వాళ్లు నా దగ్గర నేర్చుకునే కంటే వీళ్ల దగ్గర నేను నేర్చుకునేదే ఎక్కువ’ అంటుంది వీళ్ల డ్యాన్స్ మాస్టర్ ఆఎల్వి మి«థున. అన్నట్టు ఈ డ్యాన్స్ స్కూల్ యానివర్సరీకి వీళ్లందరి చేత పెర్ఫార్మెన్స్ కూడా ఇప్పించబోతోంది ఈ టీచరమ్మ. అందుకు రిహార్సల్స్ కూడా మొదలెట్టేశారు ఈ బేబీలు.‘యూత్‌కి మేము ఎగ్జాంపుల్‌గా ఉండాలనుకుంటున్నాం..’ అంటారు ముక్తకంఠంతో. అన్నట్టు ఈ మధ్య హిట్టయిన ‘ఓ బేబీ’ సినిమా ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిందేగా! -
నేను .. మీ రోజా
సాక్షి, హైదరాబాద్ : ఏపీఐఐసీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అద్భుతమైన నాట్యంతో ఆహుతులను అలరించారు. శనివారం రవీంద్రభారతిలో ఆమె ప్రదర్శించిన ‘నవ జనార్దన పారిజాతం’ నృత్య ప్రదర్శనతో అందర్ని ఆకట్టుకున్నారు. లైఫ్ ఎన్ లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నాట్య గురువు కళాకృష్ణ నేతృత్వంలో ఆర్కే రోజా, సీఎస్ సుభారాజేశ్వరిలచే ప్రదర్శించిన నవ జనాదర్దన పారిజాతం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆంధ్రా నాట్య ప్రదర్శన నయన మనోహరంగా సాగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలతో దైవం ఉంటుందని అన్నారు. ఏపీ సాహిత్య అకాడమి చైర్మన్ లక్ష్మీపార్వతి, తెలంగాణ సంగీత నాటక అకాడమి చైర్మన్ శివకుమార్, సినీ దర్శకుడు సెల్వమణి, ఫౌండేషన్ జనరల్ ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వరి, సంయుక్త కార్యదర్శి టికె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటలో మేటి.. నాట్య మయూరి
హిమాయత్‌నగర్: ఆమె ఆటలోకి దిగితే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేగాల్సిందే. స్టేజీపై భరతనాట్యం ప్రదర్శిస్తే ప్రేక్షకులు మంత్రముగ్ధులు కావాల్సిందే. ఓ పక్క గేమ్‌లో బంగారు పతకాలను సాధిస్తూ.. ఇంకోపక్క నాట్యంలోనూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటోంది రాజశ్రీ శెట్టి. పదేళ్ల వయసులో తల్లి చెప్పిన మాటలను శాసనంగా తీసుకున్న ఆ యువతి చేసిన కృషి ఇప్పుడు త్రోబాల్ గేమ్‌లోనూ, భరతనాట్యంలోను మేటిగా దూసుకెళుతోంది జూబ్లీహిల్స్‌కు చెందిన రాఘవేంద్రప్రసాద్, సునీతసాపూర్ల కుమార్తె రాజశ్రీ. ప్రస్తుతం సెంట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బిఎస్సీ చదువుతున్న ఈమె స్కూల్ డేస్‌లోనే త్రోబాల్, భరతనాట్యంపై ఇష్టం పెంచుకుంది. అమ్మ కోసం నాట్యం రాజశ్రీ తల్లి సునీత సాపూర్కి భరతనాట్యమంటే ఇష్టం. ఆమె చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకున్న విధానాన్ని కూతురుకు చెప్పేది. అంతేకాదు.. భరతనాట్యం ప్రాముఖ్యతను సైతం వివరిస్తుండేది. ఆ మాటలే రాజశ్రీని నాట్యం వైపు నడిపించాయి. ‘‘అప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా భరతనాట్యం నేర్చుకోవాలని. నాకు పదేళ్ల వయసప్పుడు ప్రముఖ భారతనాట్య గురువు హేమమాలిని ఆర్ని వద్ద నాట్యం నేర్చుకున్నాను. ఆమె నేర్పించే విధానం, చెబుతున్న తీరు అద్భుతం. అప్పటి వరకు మామూలుగా నేర్చుకుంటే పర్లేదనుకున్న నేను.. భరతనాట్యాన్ని సీరియస్‌గా తీసుకున్నాను. ప్రస్తుతం హేమమాలిని ఆర్నీ శిష్యురాలైన కిరణ్మయి మదుపు వద్ద నాట్యంలో మెళకువలు నేర్చుకుంటున్నాను’ అని చెప్పింది రాజశ్రీ. స్కూల్ టు నేషనల్స్ సిటీలో 2017లో నేషనల్స్ జరిగాయి. ఈ పోటీల్లో చాలా రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద క్రీడాకారులు వచ్చారు. సిటీ నుంచి రాజశ్రీ టీం కూడా పాల్గొని ఉత్తమ ప్రతిభ చాటింది. ఫైనల్లో వీరి జట్టు ఢిల్లీతో తలపడి విజేతగా నిలిచింది. ‘‘స్కూల్ నుంచి మొదలైన నా త్రోబాల్ ప్రయాణం నేషనల్స్ వరకు వచ్చింది. చిన్న చిన్న పతకాల నుంచి బంగారు పతకాలను సైతం సాధించగలిగాను. అమ్మాయిలు త్రోబాల్ని ఇంతబాగా ఆడతారా! అని మేం నేషనల్స్ గెలిచినప్పుడు ప్రతి ఒక్కరూ కితాబివ్వడం నాకు ఇప్పటికీ గుర్తే’ అంటూ ఆ నాటి సంఘటనలు వివరించింది. సరదా కోసం అలా.. రాజశ్రీకి అమ్మ చెప్పిన మాటలతో నాట్యం వైపు అడుగులు వేస్తే.. సహజరంగా చిన్నప్పటి నుంచి ఆటలపై ప్రేమ పెంచుకుంది. స్కూల్లో ఫ్రెండ్స్ ఆడుతున్నప్పుడు చూసి ఎంజాయ్ చేసే ఆమె.. వారితో ఓసారి అడితే బాగుంటుందని అటువైపు అడుగులేసింది. ‘‘సరదాగా ఓసారి త్రోబాల్ ఆటలోకి దిగాను. ఫ్రెండ్స్, స్కూల్లో ఉన్న వారి మధ్య సరదా కోసం ఆడిన ఆటలో బాగా ఆడుతున్నానంటూ మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. 8వ తరగతి నుంచి గేమ్‌పై మరింత ఇంట్రస్ట్ పెరిగింది. అప్పుడే స్కూల్ లెవెల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నాను’ అని చెప్పింది. టీంతో పాటు బాగా ఆడి మంచి పేరు సంపాదించాక రాజశ్రీ జిల్లా, స్టేట్స్ లెవెల్లో కూడా ఆడుతూ ఈ క్రీడలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. చదువు.. ఉద్యోగం ఉండాలి ప్రస్తుతం డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఎమ్మెస్సీ చేస్తా. ఇదే క్రమంలో గేమ్‌పై కూడా మరింత శ్రద్ధ చూపిస్తాను. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలి. భరతనాట్యం చేస్తూ..నా తోటివారిని ఈ సాంప్రదయానికి పరిచయం చేయాలి. భరతనాట్యంలో చెన్నై ప్రజల్ని మెప్పించగలిగితే చాలు.. అదే పెద్ద అచీవ్మెంట్. – రాజశ్రీ శెట్టి