‘తీజ్’ను అధికారికంగా నిర్వహిస్తాం
‘తీజ్’ను అధికారికంగా నిర్వహిస్తాం
Published Wed, Jul 20 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
నల్లబెల్లి : గిరిజనులు ప్రతి యేటా జరుపుకునే తీజ్ ఉత్సవాలను రాష్ట్రమంతా ఒకే రోజు అధికారికంగా జరుపుకునేలా కృషి చేస్తానని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. అటవీ శాఖ మంత్రి జోగురామన్నతో కలిసి బుధవారం ఆయన నందిగామలో తీజ్ ఉత్సవాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్సవాల ప్రాముఖ్యతను వివరించారు.
ఏటా శీతల్ భవాని ఉత్సవాల ముగింపు రోజున లంబాడీ యువతులు గోదుమలను నానబెట్టి అవి మొలకెత్తిన తర్వాత తొమ్మిది రోజులు పూజలు చేస్తారని, ఆ తర్వాత గురువారం ఉత్సవాల ముగింపు సందర్భంగా అందరూ కలిసి సంప్రదాయ నృత్యాలు చేస్తూ నారును నీటిలో నిమజ్జనం చేస్తారని చెప్పారు. నారు పచ్చగా ఉంటే పల్లె పచ్చగా ఉంటుందని, యువతులకు వివాహం జరుగుతుందని, సుఖసంతోషాలతో ఉంటారని గిరిజనుల నమ్మకమని అన్నారు. మంత్రుల వెంట టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, నర్సంపేట డీఎస్పీ దాసరి మురళీధర్, తహసీల్దార్ రవీంద్రమోహన్, ఎంపీడీఓ మూర్తిరెడ్డి, ఏపీఓ రాజిరెడ్డి, ఎంపీపీ బానోత్ సారంగపాణి, వైస్ ఎంపీపీ పాలెపు రాజేశ్వర్‌రావు, నాయకులు బానోత్ సంగులాల్, ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, సమ్మయ్యనాయక్, మామిండ్ల మోహన్‌రెడ్డి, దూడెల సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement