Theej festival
-
'తండాలను పంచాయితీలుగా మారుస్తాం'
నిజామాబాద్: గిరిజనుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. సుమారు 500 జనాభా ఉన్న ప్రతీ గిరిజనతండాను గ్రామపంచాయతీలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల నాటికి గ్రామపంచాయతీలు ఏర్పడతాయన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం కాజుభాగ్ తండాలో ఎంపీ కవిత సోమవారం పర్యటించారు. గ్రామంలో జరిగిన తీజ్ పండుగకు ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. Tribal hordes, MP kavitha, theej festival, నిజామాబాద్ ఎంపీ, కవిత, తీజ్ పండుగ, -
‘తీజ్’ను అధికారికంగా నిర్వహిస్తాం
నల్లబెల్లి : గిరిజనులు ప్రతి యేటా జరుపుకునే తీజ్ ఉత్సవాలను రాష్ట్రమంతా ఒకే రోజు అధికారికంగా జరుపుకునేలా కృషి చేస్తానని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ అన్నారు. అటవీ శాఖ మంత్రి జోగురామన్నతో కలిసి బుధవారం ఆయన నందిగామలో తీజ్ ఉత్సవాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్సవాల ప్రాముఖ్యతను వివరించారు. ఏటా శీతల్ భవాని ఉత్సవాల ముగింపు రోజున లంబాడీ యువతులు గోదుమలను నానబెట్టి అవి మొలకెత్తిన తర్వాత తొమ్మిది రోజులు పూజలు చేస్తారని, ఆ తర్వాత గురువారం ఉత్సవాల ముగింపు సందర్భంగా అందరూ కలిసి సంప్రదాయ నృత్యాలు చేస్తూ నారును నీటిలో నిమజ్జనం చేస్తారని చెప్పారు. నారు పచ్చగా ఉంటే పల్లె పచ్చగా ఉంటుందని, యువతులకు వివాహం జరుగుతుందని, సుఖసంతోషాలతో ఉంటారని గిరిజనుల నమ్మకమని అన్నారు. మంత్రుల వెంట టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, నర్సంపేట డీఎస్పీ దాసరి మురళీధర్, తహసీల్దార్ రవీంద్రమోహన్, ఎంపీడీఓ మూర్తిరెడ్డి, ఏపీఓ రాజిరెడ్డి, ఎంపీపీ బానోత్ సారంగపాణి, వైస్ ఎంపీపీ పాలెపు రాజేశ్వర్‌రావు, నాయకులు బానోత్ సంగులాల్, ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, సమ్మయ్యనాయక్, మామిండ్ల మోహన్‌రెడ్డి, దూడెల సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
తీజ్ జోష్
తీజ్.. అంటే యువతీయువకులకు భలే జోష్.. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆదివారం తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. లంబాడా గిరిజన యువత ఆడిపాడారు. ఆటపాటలతో అలరించారు. లంబాడాల సంప్రదాయ తీజ్ పండుగలో గిరిజన అధ్యాపకులు, విద్యార్థులు, విశ్రాంత అధికారులు ఉత్సాహంగా.. ఉల్లాసంగా పాల్గొన్నారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి యువత సంప్రదాయ నృత్యాలతో హుస్సేన్ సాగర్ వరకు వెళ్లారు. సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు గోధుమ మొక్కలను తరలించారు. తీజ్ పండుగను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని కోరారు. ఇదీ తీజ్ పండుగ గోధుమ గింజలను మట్టి నింపిన పాత్రలో పోసి రోజూ నీరు పెడితే అవి మొలకెత్తి నారుగా మారతాయి. నారును 9 రోజుల తర్వాత చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ తొమ్మిది రోజులూ యువత సంబరాల్లో మునిగి తేలుతారు. - ఉపేందర్