తీజ్ జోష్
తీజ్.. అంటే యువతీయువకులకు భలే జోష్.. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆదివారం తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. లంబాడా గిరిజన యువత ఆడిపాడారు. ఆటపాటలతో అలరించారు. లంబాడాల సంప్రదాయ తీజ్ పండుగలో గిరిజన అధ్యాపకులు, విద్యార్థులు, విశ్రాంత అధికారులు ఉత్సాహంగా..
ఉల్లాసంగా పాల్గొన్నారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి యువత సంప్రదాయ నృత్యాలతో హుస్సేన్ సాగర్ వరకు వెళ్లారు. సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు గోధుమ మొక్కలను తరలించారు. తీజ్ పండుగను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని కోరారు.
ఇదీ తీజ్ పండుగ
గోధుమ గింజలను మట్టి నింపిన పాత్రలో పోసి రోజూ నీరు పెడితే అవి మొలకెత్తి నారుగా మారతాయి. నారును 9 రోజుల తర్వాత చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ తొమ్మిది రోజులూ యువత సంబరాల్లో మునిగి తేలుతారు.
- ఉపేందర్