కొలువులకు కేరాఫ్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్! | Care Of Arts and Humanities for jobs | Sakshi
Sakshi News home page

కొలువులకు కేరాఫ్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్!

Published Tue, Aug 12 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM

కొలువులకు కేరాఫ్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్!

కొలువులకు కేరాఫ్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్!

ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సుల పరిధి విస్తృతమవుతోంది. ఆర్ట్స్ అంటే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ తదితర సంప్రదాయ కోర్సులు మాత్రమే అనే హద్దులు చెదిరిపోతున్నాయి. లింగ్విస్టిక్స్, సోషియాలజీ, సైకాలజీ నుంచి ప్రొఫెషనల్ ‘లా’ కోర్సుల వరకు ఈ విభాగంలో ఎన్నో విభిన్న సమకాలీన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పోస్టు గ్రాడ్యుయేషన్‌తోపాటు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోనూ హ్యుమానిటీస్ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది!
 
 కామర్స్, సైన్స్... అకౌంటెన్సీ లేదా కెమిస్ట్రీ... ఏదో ఒక ప్రధాన సబ్జెక్టుకు మాత్రమే పరిమితమయ్యే కోర్సులు. కానీ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ అనేవి విస్తృత పరిధి ఉన్న కోర్సులు. వీటిని అభ్యసించిన విద్యార్థులు సమాజం, చుట్టూ ఉన్న మనుషులు, చరిత్ర, వారసత్వ సంపద, సామాజిక- మానవ సంబంధాలు, నాగరికత, సంస్కృతి, పాలన వ్యవహారాలు, రాజనీతి, విశ్వం, భూగోళశాస్త్రం, ఆర్థిక శాస్త్రాలు వంటి పలు అంశాలను అధ్యయనం చేస్తారు. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఇవి తోడ్పడతాయి. పుస్తకాల్లో ఉన్న అంశాలను బాహ్య ప్రపంచానికి అన్వయించుకుంటూ చదవడం ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ ప్రత్యేకత. ఈ కోర్సులనభ్యసించినవారు విస్తృతమైన ఆలోచనా నైపుణ్యాలను సొంతం చేసుకుంటారు. అంకితభావం, విలువలతో కూడిన మేధావులను రూపొందించ డానికి ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
 
 కోర్సులు-తీరుతెన్నులు:
 ఉస్మానియా యూనివర్సిటీతోపాటు దాదాపు అన్ని వర్సిటీల పరిధిలోని వివిధ కళాశాలలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్‌సైన్స్ కోర్సులను అందిస్తున్నాయి. హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(బి.ఎ.)లో భాగంగా హిస్టరీ, తెలుగు లిటరేచర్, పొలిటికల్‌సైన్స్, ఎక నమిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీతో పాటు ఉర్దూ, పర్షియన్, ఫిలాసపీల్లో వివిధ కాంబినేషన్లూ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు ఎకనమిక్స్, సైకాలజీ, సోషియాలజీ, మార్కెటింగ్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తదితర సబ్జెక్టులున్న కాంబినేషన్లను ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
 
 ఉన్నత విద్య:
 ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, సోషల్‌ై సెన్సెస్‌లో వివిధ కాంబినేషన్లలో బ్యాచిలర్ కోర్సు పూర్తి చేసిన తర్వాత మాస్టర్స్ స్థాయిలో ఆసక్తి ఉన్న ఏదో ఒక సబ్జెక్టును ఎంచుకోవాల్సి ఉంటుంది. హిస్టరీ, ఎకానమిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ వంటి సంప్రదాయ సబ్జెక్ట్‌లేకాకుండా లింగ్విస్టిక్స్, సోషియాలజీ, సైకాలజీ, డెవలప్‌మెంట్ స్టడీస్ తదితర సబ్జెక్టుల్లో పీజీ కోర్సులనభ్యసించొచ్చు.
 
 మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్:
 దేశంలో విభిన్న వర్గాల వారి మధ్య అసమానతలు, సామాజిక పరిస్థితులే చాలా మంది సోషల్ వర్క్‌ను తమ కెరీర్‌గా ఎంచుకోవడానికి దోహదపడుతున్నాయి. సామాజిక సమస్యలపై అవగాహనకు, వాటి నిర్మూలన తదితర అంశాలపై విద్యార్థులను చైతన్యవంతులుగా ఈ కోర్సులు తీర్చిదిద్దుతున్నాయి. దేశంలోని కొన్ని యూనివర్సిటీలు మాత్రమే ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్న మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ (ఎంఎస్‌డబ్ల్యూ) కోర్సును పూర్తి చేస్తే మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. వీటితోపాటు ఎంబీఏ ఇన్ రూరల్ డెవలప్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్‌మెంట్ వంటి కోర్సులూ ఉన్నాయి. ఈ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల్లో అవకాశాలు అధికంగా ఉంటాయి.
 
 ఎంఏ డెవలప్‌మెంట్ స్టడీస్:
 గ్లోబలైజేషన్ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో డెవలప్‌మెంట్ స్టడీస్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ కోర్సులో ప్రధానంగా ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన కాపిటల్ ఇన్‌ఫ్లో,  సోషియో-ఎకనమిక్ అంశాలతోపాటు పర్యావరణ విశేషాలను కూడా విద్యార్థులు అభ్యసిస్తారు. ఇది మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్. ఇందులో సామాజిక శాస్త్రం, ఎకనమిక్స్, ఆంత్రోపాలజీ, పాలిటిక్స్ తదితర అంశాలుంటాయి. అభివృద్ధికి సంబంధించిన సామాజిక, ఆర్థిక అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ప్రవేశపెట్టిందే.. డెవలప్‌మెంట్ స్టడీస్. పీజీ స్థాయిలో ఎంఏ (డెవలప్‌మెంట్ స్టడీస్)గా కోర్సును పలు యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి.
 
 ఎంఏ ఇన్ పాలిటిక్స్:
 రాజకీయ విలువలు, సంస్థలు, అవి పని చేసేతీరు, రాజ్యాంగం వంటి అంశాలపై ఈ కోర్సులో అధ్యయనం చేస్తారు. పీజీస్థాయిలో ఎంఏ ఇన్ పొలికల్ సైన్స్ కోర్సులను దాదాపు అన్ని యూనివ ర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సును పూర్తి చేసిన వారికి టీచింగ్, రీసెర్చ్, పబ్లిషింగ్, బిజినెస్, జర్నలిజం రంగాల కేంద్రీకృతంగా అవకాశాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగంలో ఈ కోర్సును అభ్యసిస్తే మరిన్ని అవకాశాలను అందుకోవచ్చు.
 
 విదేశాల్లోనూ విస్తృత డిమాండ్:
 విదేశాల్లోనూ హ్యుమానిటీస్ కోర్సులకు విస్తృత ఆదరణ లభిస్తోంది. విదేశాల్లో హ్యుమానిటీస్ కోర్సులనభ్యసించడం ద్వారా సాంఘిక పరిస్థితులు, సంస్థలు వాటి విధానాలను అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనం చేయడానికి అవకాశం ఏర్పడుతోంది. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులు క్లిష్టమైన, విశ్లేషణాత్మక నైపుణ్యాలను సొంతం చేసుకుంటున్నారు. అమెరికాలోని హార్వర్డ్, యేల్, ప్రిన్స్‌టన్, జార్జిటౌన్, టఫ్ట్స్ తదితర యూనివర్సిటీ/లిబరల్ ఆర్ట్స్ విద్యాసంస్థల్లో పాలిటిక్స్ అండ్ ఐఆర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బాత్, యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ మొదలైనవి ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి.  అమెరికా, యూకే, ఇటలీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో బిజినెస్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్, మీడియా అండ్ కమ్యూనికేషన్ సంబంధిత కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
 
 కెరీర్:
 ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్‌సెన్సైస్‌లో కోర్సునభ్యసించిన వారికి ప్రధానంగా కమ్యూనికేషన్స్ అండ్ మీడియా, జర్నలిజం, లా, జెండర్ స్టడీస్, మానవ హక్కులు తదితర విభాగాల్లో దేశవిదేశాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ‘సామాజిక సమస్యలు, మావన హక్కులు, వాటితో ముడిపడి ఉన్న అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే సోషల్ వర్క్. సేవా దృక్పథం ఉన్నవారు ఈ కోర్సును అభ్యసిస్తే ప్రయోజనం ఉంటుంది’ అని తెలిపాడు మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చదువుతున్న మనోహర్. ‘విదేశీ భాషలను నేర్చుకోవడం ద్వారా విస్తృత అవకాశాలను అందుకోవచ్చు. భావ వ్యక్తీకరణకు ప్రధాన సాధనం భాష. అటువంటి భాషలో నైపుణ్యం సాధించాలనే ఈ కోర్సును ఎంచుకున్నాను. అంతేకాకుండా ప్రొఫెషనల్ కోర్సులకు దీటుగా దేశ, విదేశాల్లో భాషా నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తుండడం కూడా కోర్సు ఎంపికకు కారణం’ అని పేర్కొంటున్నాడు ఎంఏ ఇంగ్లిష్ చదువుతున్న నారాయణ్.
 
 మంచి భవిష్యత్తు ఖాయం
 ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కోర్సులను అభ్యసిస్తే సామాజిక అవగాహన అలవడుతుంది. సమాజాన్ని, మానవ సంబంధాలను, చారిత్రక సంపదను, సాంస్కృతిక ఔన్నత్యాన్ని తెలుసుకుంటారు. ఎక్కువ మంది ఎకనమిక్స్, సైకాలజీ, సోషియాలజీ, మార్కెటింగ్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తదితర సబ్జెక్టులను ఎంపిక చేసుకుంటున్నారు. అకడమిక్ నైపుణ్యాలతోపాటు రైటింగ్ స్కిల్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, నిరంతర అధ్యయనం, సామాజిక అంశాలపై అవగాహన తదితర నైపుణ్యాలను సొంతం చేసుకుంటే మంచి భవిష్యత్తు సాధ్యమ వుతుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ప్రధానంగా లాంగ్వేజ్ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల విజేతల్లో ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సులను అభ్యసించిన వారు ముందుంటున్నారు.                     
  - టి.ఎల్.ఎన్. స్వామి
  ప్రిన్సిపాల్, నిజాం కళాశాల, హైదరాబాద్
 
 విస్తృత అవకాశాలు లభిస్తాయి
 ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్‌లో విద్యార్థులు సమాజానికి కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఈ కోర్సుల ద్వారా వారసత్వంగా లభించే నైపుణ్యాలను శిక్షణ ద్వారా మరింత మెరుగుపర్చుకునే అవకాశం లభిస్తుంది. సోషల్ సెన్సైస్ చదివిన వారిలో సామాజిక అంశాలపై ఎక్కువ అవగాహన ఉంటుంది. వీరికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యం సాధించిన వారు తోడైతే ఒక సమగ్రమైన సోషల్ నెట్‌వర్కింగ్ వ్యవస్థ సాధ్యమవుతుంది. హ్యుమానిటీస్‌లో ప్రధానంగా లాంగ్వేజె స్ కోర్సుల్లోనూ ఎక్కువ మంది చేరుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లుగా మారిన వారిలోనూ తెలుగు, ఇంగ్లిష్ తదితర లిటరేచర్ చదివినవారే ఎక్కువగా ఉంటున్నారు. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ దగ్గర్నుంచి సాధారణ ట్రాన్స్‌లేషన్ వరకు భాషా నిపుణులకు అవకాశాలు పెరిగాయి.    - ఎస్.మల్లేశ్, ప్రిన్సిపాల్,
 ఓయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సెన్సైస్
 
 జనరల్ నాలెడ్‌‌జ
  జాతీయోద్యమ కాలం నాటి పత్రికలు ఇవి..
 పత్రిక    సంవత్సరం,     వ్యవస్థాపకుడు/
     {పదేశం                           ప్రాముఖ్యత
 ట్రిబ్యూన్    1881, లాహోర్    దయాల్ సింగ్ మజీతియా
 కేసరి    1881, బొంబాయి    తిలక్
 మరాఠ    1881, బొంబాయి    తిలక్
 పరిదాసక్    1886    బిపిన్ చంద్రపాల్
 యుగంతర్    1906, బెంగాల్    బరీంద్ర కుమార్ ఘోష్,
         భూపేంద్రనాథ్ దత్తా
 సంధ్య    1906, బెంగాల్    {బహ్మబంధోపాధ్యాయ
 ఇండియన్ సోషియాలజిస్ట్    లండన్    శ్యామ్‌జీ కృష్ణ వర్మన్
 వందేమాతరం    పారిస్    మేడం కామా
 తల్వార్    బెర్లిన్    వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ
 ఫ్రీ హిందూస్థాన్    వాంకోవర్    తారక్‌నాథ్ దాస్
 
  ప్రముఖ చారిత్రక గ్రంథాలు - రచయితల
 పేర్లు తెలుసుకోండి
 రచయిత    {Vంథం   
 హ్యూయన్‌త్సాంగ్    సి.యూ-కీ
 దిన్నాగుడు    {పమాణ సముచ్ఛయం
 నన్నయ    మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు
 భాసుడు    బుద్ధ చరితం
 నాగసేనుడు    మిళింద పన్హా
 భద్రబాహుడు    జైనకల్ప సూత్రం
 అశ్వఘోషుడు    సౌందర్యనందన కావ్యం (సంస్కృతం)    
     పరిశిష్టపర్వం (జైనుల ప్రసిద్ధ గ్రంథం)
 కొండకుందాచారి    సమయసారం
 శర్వవర్మన్    కాంతార (సంస్కృత గ్రంథం)
 బుధస్వామి    బహృత్కశ్లోక సంగ్రహం  
 
 ప్రపంచంలో ప్రసిద్ధ కట్టడాలు ఎక్కడున్నాయో తెలుసా?
 కట్టడం పేరు    నగరం
 అల్‌అకుస మసీదు    జెరూసలేం
 బిగ్ బెన్    లండన్
 బ్రాడెన్‌బర్‌‌గ గేట్    బెర్లిన్
 బ్రౌన్  హౌస్    బెర్లిన్
 బ్రాడ్ వే    న్యూయార్‌‌క
 కలోసియం    రోమ్
 ఈఫిల్ టవర్    పారిస్
 హెడెపార్‌‌క    లండన్
 ఇండియన్ హౌస్    లండన్
 కాబా    మక్కా
 క్రెమ్లిన్    మాస్కో
 
 అడ్మిషన్‌‌స, జాబ్స్ అలర్‌‌ట్స
  ఓయూ దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ
 ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
  ఎంబీఏ
 విభాగాలు: జనరల్ మేనేజ్‌మెంట్, పర్సనల్, హెచ్‌ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్.
 అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి.
  ఎంసీఏ
 అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. ఇంటర్/డిగ్రీలో మ్యాథమెటిక్స్‌ను చదివి ఉండాలి.
 ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
 దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబరు 6
 వెబ్‌సైట్: http://ouadmissions.com/oucde/
 ఏఆర్‌సీఐ-హైదరాబాద్
 హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూమెటీరియల్స్
 (ఏఆర్‌సీఐ) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  అసిస్టెంట్ (5)
 అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. అడ్మినిస్ట్రేషన్/
 హెచ్‌ఆర్/ఫైనాన్స్ అండ్ అకౌంట్స్/స్టోర్స్ అండ్ పర్చేజ్ విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి., వయసు: 28 ఏళ్లకు మించకూడదు.
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
 దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 30
 వెబ్‌సైట్:http://www.arci.res.in/

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement