Political Science
-
NCERT: బాబ్రీ కాదు.. 3 గోపురాల నిర్మాణం
న్యూఢిల్లీ : హేతుబద్దీకరణ పేరుతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) పాఠ్య పుస్తకాల్లో పలు మార్పులు, చేర్పులు చేసిన సంగతి తెలిసిందే. అయితే 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలోనూ అనేక మార్పులు చేసింది. ‘బాబ్రీ మసీదు’ సహా అనేక కీలక అంశాలను, చాలా సమాచారాన్ని తొలగించింది. తొలగింపులు అంశాలవారీగా.. ⇒ ‘బాబ్రీ మసీదు’ పదం తొలగింపు: పాఠ్య పుస్తకంలోంచి బాబ్రీ మసీదు అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. దాని స్థానంలో ‘మూడు గోపురాల నిర్మాణం’ను చేర్చింది. ⇒ అయోధ్య అధ్యాయం తగ్గింపు: నాలుగు పేజీలున్న అయోధ్య అధ్యాయాన్ని రెండు పేజీలకు తగ్గించింది. రథయాత్ర, కరసేవకుల పాత్ర, బాబ్రీ మసీదు కూలి్చవేత, అనంతరం జరిగిన హింస, ఆ తరువాత బీజేపీ పాలిత ప్రాంతాల్లో విధించిన రాష్ట్రప తి పాలన అంశాలను తొలగించింది. ⇒ చారిత్రక వివరాల సవరణ: బాబ్రీ మసీదుకు సంబంధించిన వివరాల్లో కూడా అనేక మార్పులు చేసింది. బాబ్రీ మసీదును 16వ శతాబ్దంలో మీర్ బాకీ నిర్మించినట్లుగా గత పుస్తకంలో ఉండగా.. 1528లో రాముడి జన్మస్థలంలో నిర్మించబడిన మూడు గోపురాల నిర్మాణంగా ఇప్పుడు పేర్కొన్నది. అంతేకాదు ఈ నిర్మాణంలో అనేక హిందూ చిహ్నాలు ఉన్నాయని, లోపలి, వెలుపలి గోడలపై శిల్పాలు ఉన్నాయని కొత్త పుస్తకం పేర్కొంది. హిందూ చిత్రాలు, విగ్రహాలను కూడా కొత్తగా ప్రస్తావించింది. ⇒ చట్టపరమైన, మతపరమైన కథనాల్లోనూ మార్పులు: ఆలయంలో పూజలు చేసుకునేందుకు బాబ్రీ మసీదు నిర్మాణాన్ని తెరచి ఉంచాలని 1986 ఫిబ్రవరిలో ఫైజాబాద్ జిల్లా కోర్టు ఇచి్చన తీర్పును పాత పుస్తకం వివరించగా, వాటన్నింటిని తొలగించి మూడు గోపురాల నిర్మాణం, తరువాత వచి్చన మతపరమైన వైరుధ్యాలను కొత్త పుస్తకం క్లుప్తంగా ప్రస్తావించింది. వివాదాస్పద భూమి ఆలయానికే చెందుతుందంటూ 2019లో సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును మాత్రం కొత్త ఎడిషన్‌లో చేర్చింది. ⇒ వార్తాపత్రికల కటింగ్స్ తీసివేత: పాత పుస్తకంలో వార్తాపత్రిక కథనాలకు సంబంధించిన అనేక ఛాయాచిత్రాలు ఉన్నాయి. వీటిలో డిసెంబర్ 7, 1992న ’బాబ్రీ మసీదు కూలి్చవేత, కేంద్రం కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం కూడా ఉంది. వీటన్నింటినీ తొలగించారు. ⇒ గుజరాత్ అల్లర్ల అధ్యాయం తొలగింపు: ప్రజాస్వామ్య హక్కుల అధ్యాయం నుంచి గుజరాత్ అల్లర్ల ప్రస్తావనను పూర్తిగా తొలగించింది. అల్లర్ల గురించి బోధించాల్సిన అవసరం లేదుఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ద్వేషం, హింస బోధనాంశాలు కావని, పాఠశాల పాఠ్యపుస్తకాలు వాటిపై దృష్టి పెట్టకూడదని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) చీఫ్ దినేష్ ప్రసాద్ సక్లానీ అన్నారు. గుజరాత్ అల్లర్లు, బాబ్రీ మసీదు కూలి్చవేత గురించి బోధిస్తే పాఠశాల విద్యార్థులు హింసాత్మకంగా తయారవుతారని, అందుకే వాటిని పాఠ్యాంశాల్లోంచి తొలగించామని వెల్లడించారు. పాఠ్య పుస్తకాల్లో మార్పులు, బాబ్రీ మసీదు కూల్చివేత, తరువాత మతపరమైన హింసకు సంబంధించిన అంశాల తొలగింపులపై శనివారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. సమాజంలో విద్వేషాలను సృష్టించే విధంగా బోధనలు అవసరం లేదని, చిన్నపిల్లలకు అల్లర్ల గురించిన నేరి్పంచాల్సిన అవసరం లేదని, అది ఎందుకు జరిగిందో పెద్దయ్యాక వారే తెలుసుకుంటారని చెప్పారు. పాఠ్య పుస్తకాల్లోని అంశాలను కాషాయీకరణ చేశారనే ఆరోపణలను కొట్టి పారేశారు. రామజన్మభూమికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాన్ని పాఠ్యపుస్తకాల్లో ఎందుకు చేర్చకూడదని, పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మించడం విద్యార్థులకు ఎందుకు తెలియకూడదని ఆయన ప్రశ్నించారు. చరిత్రను యుద్ధభూమిగా మార్చడానికి కాకుండా విద్యార్థులకు వాస్తవాలు తెలిసేలా బోధిస్తామన్నారు. పాఠ్యపుస్తకాల పునరి్వమర్శ ప్రపంచవ్యాప్తంగా జరిగే అభ్యాసమని, ఏది మార్చాలన్నది సబ్జెక్ట్, బోధనా శాస్త్ర నిపుణులే నిర్ణయిస్తారని, తాను ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో 2014 నుంచి ఇప్పటివరకూ నాలుగు పర్యాయాలు మార్పులు చేశారు. -
'సారే జహాన్ సే అచ్ఛా' రాసిన కవి గూర్చి సిలబస్ నుంచి తొలగింపు
ప్రసిద్ధ గేయం 'సారే జహాన్ సే అచ్ఛా' రాసిన కవి గూర్చి సిలబస్ నుంచి తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ అకమిక్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మేరకు అకడమిక్ కౌన్సిల్ శుక్రవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించిందని చట్టసభ్యులు ధృవీకరించారు. భారత్ విభజనకు ముందు ఉన్న సియోల్కోట్లో 1877లో జన్మించిన పాక్ కవి అల్లామా ఇక్బాల్‌గా పిలిచే ముమహ్మద్ ఇక్బాల్ ఈ ప్రముఖ గేయం 'సార్ జహాన్ సే అచ్ఛా'ని రాశారు. ఆయన గురించి ఉన్న పాఠ్యాన్ని బీఏలోని పొలిటికల్ సిలబస్ నుంచి తొలగించారు. దీన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏపీవీపీ) స్వాగతించింది. పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో మార్పుకు సంబంధించి తీర్మానం తీసుకురావడమే గాక ఆ పార్యాంశాన్ని తొలగించినట్లు కౌన్సిల్ సభ్యుడు తెలిపారు. వాస్తవానకి 'మోడరన్ ఇండియన్ పొలిటికల్ థాట్' అనే సబ్జెక్టు బీఏలోని ఆరవ సెమిస్టర్ పేపర్లో బాగం. దీన్ని ఇప్పుడూ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. భారత రాజకీయా ఆలోచనలోని గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని విద్యార్థులకు అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ కోర్సును రూపొందించింది యూనివర్సిటీ. ఈ కోర్సులో భాగంగా సిలబస్‌లో రామ్మోహన్ రాయ్, పండిత రమాబాయి, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ మరియు భీమ్రావ్ అంబేద్కర్ తదితరులు గురించి ఉంది. అంతేగాదు ఆధునిక భారతీయ ఆలోచనలపై విమర్శనాత్మక అవగాహనతో విద్యార్థులను సన్నద్ధం చేసేందుకే ఈ కోర్సును ఏర్పాటు చేశారు. ఆయా ప్రముఖుల ఆలోచనల నేపథ్య అన్వేషణ తోపాటు చారిత్రక పథంలో ముఖ్యమైన విషయాలపై సమయోచిత చర్చలను గుర్తించడం సంబంధిత వారి రచనలలో ప్రదర్శించబడిన విభిన్న అవకాశాలను విద్యార్థులకు తెలుసుకోవాలనే లక్ష్యంతో పాఠ్యాంశాల్లో భాగం చేశారు. సిలబస్‌లో మొత్తం ఆయా ప్రముఖుల గూర్తి మొత్తం 12 యూనిట్లు ఉంటాయి. ఇదిలా ఉండగా, భారత రాజకీయ ఆలోచనలను గూర్చి తెలసుకోవాలన్న ఉద్దేశ్యంతో బీఏ ఆరవ సెమిస్టర్లో ఒక సబ్జెక్టు చేర్చిన దీనిలో ఆ మతోన్మాద పండితుడు మొహమ్మద్ ఇక్బాల్‌ని గూర్చి పాఠ్యాంశాన్ని సిలబస్ నుంచి తొలగించింది అకడమిక్ కౌన్సిల్. నిజానికి ఇక్బాల్‌ని పాకిస్తాన్ తాత్విక తండ్రిగా పిలుస్తారు. అతను ముస్లిం లీగ్‌లో జిన్నాను నాయకుడిగా స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడని, ఇక్బాల్ కూడా జిన్నా వలే భారతదేశ విభజనకు కారణమని యూనివర్సిటీ ఆరోపించింది. (చదవండి: ఆక్రమణ నిరోధక డ్రైవ్‌లో షాకింగ్ దృశ్యాలు..పోలీసులు మహిళ జుట్టు పట్టి లాగి, తన్ని..) -
మరోసారి వార్తల్లో నిలిచిన సివిల్స్ టాపర్ టీనా దాబీ.. మార్క్‌షీట్ వైరల్
యూపీఎస్సీ టాపర్, ఐఏఎస్ అధికారి టీనా దాబీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె సీబీఎస్ఈ 12వ తరగతి మార్క్‌షీట్ సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం టీనాకు హిస్టరీ, పాలిటికల్ సైన్స్‌లో 100కు 100 మార్కులు వచ్చినట్లు కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి. అయితే ఈ మార్క్‌షీట్ నిజంగా టీనాదేనా అనే విషయంపై క్లారిటీ లేదు. ఆమెకు రెండు సబ్జెక్టుల్లో 100 మార్కులు రావడాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. అసలు టీనా మార్క్‌షీట్ నెట్టింట్లో లేదని తెలుస్తోంది. అయితే టీనా 2011 సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో 93శాతం మార్కులు సాధించినట్లు సమాచారం. ఢిల్లీలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ స్కూల్లో చదివిన ఆమె.. టాపర్‌గా నిలిచింది. ఢిల్లీ యూనివర్సిటీ లేడీ శ్రీరాం కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో బీఏ పూర్తి చేసింది. తన ప్రతిభకు గానూ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' అవార్డు కూడా అందుకుంది. 2015 యూపీఎస్సీ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో జైసల్మేర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తోంది. తరచూ వార్తల్లో టీనా సివిల్స్‌లో టాపర్ అయినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తోంది. 22 ఏళ్లకే ఐఏఎస్ అయిన దళిత యువతిగా అరుదైన ఘనత సాధించింది. అయితే సివిల్స్ రెండో ర్యాంకర్ అయిన అథర్ అమీర్ ఖాన్‌తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించడం పెద్ద చర్చకు దారితీసింది. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా వెనక్కి తగ్గకుండా 2018లో వీళ్లిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ 2020లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత డాక్టర్ ప్రదీప్ గవాండేను(2013 ఐఏఎస్ బ్యాచ్)ను రెండో వివాహం చేసుకుంది టీనా. దాదాపు ఏడాదిపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట పెళ్లి 2022లో జరిగింది. ఇది కూడా ప్రేమ వివాహమే కావడం గమనార్హం. చదవండి: జర భద్రం..! ఆ దేశానికి వెళ్లే వారికి కేంద్రం హెచ్చరిక -
ఇదేం విడ్డూరం.. పరీక్షలో 100కు 151 మార్కులు సాధించిన విద్యార్థి
పరీక్షల్లో మంచి మార్కులు రావాలని విద్యార్థులు కష్టపడి చదువుతుంటారు. పాస్ అయితే చాలురా బాబు అని కొందరనుకుంటే.. ఇక టాపర్స్ బ్యాచ్ ఏమో వందకు 99 మార్కులు తెచ్చుకోవాలని రోజుకీ గంటల తరబడి పుస్తకాలతో కుస్తీపడుతుంటారు. అయితే ఎంత చదివినా, ఎంత రాసినా మహా అయితే 99, లేదా వంద మార్కులు సాధించవచ్చు. అంతకుమించి అయితే రావు కదా. కానీ బిహార్‌కు చెందిన ఓ డిగ్రీ విద్యార్థికి 100కు 151 మార్కులు వచ్చాయి. హా అదేంటి అని ఆశ్యర్చపోతున్నారా.. నిజమేనండి.. ముందుగా తన మార్కులను చూసుకున్న విద్యార్థి కూడా మీలాగే బిత్తరపోయాడు. చివరికి అసలు తెలిసి ఖంగుతిన్నాడు. అసలేం జరిగిందంటే.. దర్బంగా జిల్లాకు చెందిన లలిత్ నారాయణ మిథిలా యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం (బీఏ ఆనర్స్) చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో 100కు 151 మార్కులు వచ్చాయి. రిజల్ట్స్‌ను చూసి షాక్ అయినట్లు విద్యార్థి తెలిపారు. తను మాట్లాడుతూ.. మార్కులు చూసి ఆశ్చర్యపోయానని ఇది తాత్కాలిక మార్కు షీట్ అయినప్పటికీ, ఫలితాలు విడుదల చేయడానికి ముందు అధికారులు దానిని తనిఖీ చేయాలి కదా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. చదవండి: కర్ణాటక: తేనె రైతుకు ప్రధాని మోదీ ప్రశంసలు ఇదిలా ఉండగా బీకామ్ చదవుతున్న మరో విద్యార్థికి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ పేపర్లో సున్నా మార్కులు వచ్చాయి. అయినా అతన్ని తదుపరి క్లాస్‌కు ప్రమోట్ చేశారు. కాగా మార్కుల విషయంపై యూనివర్సిటీ స్పందించింది. టైపింగ్ మిస్టేక్ కారణంగా ఇద్దరికి మార్కులు తప్పుగా పడ్డాయని పొరపాటు జరిగినట్లు తెలిపింది. రెండు మార్క్ షీట్లలో పొరపాట్లు జరిగాయని, వాటిని సరిచేసి మళ్లీ కొత్త ప్రొవిజినల్ సర్టిఫికెట్లుజారీ చేసినట్లు చేసినట్లు వివరణ ఇచ్చింది. -
ఈసారి పొలిటికల్ సైన్స్ ప్రశ్నపత్రంలో తప్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సంస్కృతం, హిందీ పేపర్లలో తప్పులురాగా.. గురువారం పొలిటికల్ సైన్స్, ఉర్దూ మీడియం మ్యాథ్స్ ప్రశ్నపత్రాల్లో పొరపాట్లతో విద్యార్థులు తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్య వైఖరితో పరీక్షల విధానం ప్రహసనంగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నే మారిపోయింది రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరి గాయి. సాధారణంగా విద్యార్థులు ఏ మీడియంలో పరీక్ష రాస్తే ఆ భాషలో ముద్రించిన ప్రశ్నపత్రాలను ఇస్తారు. ఇందులో భాష మారుతుందే తప్ప ప్రశ్నల్లో మార్పు ఉండదు. గురువారం ఇంగ్లిష్ మీడి యం పొలిటికల్ సైన్స్ పేపర్లో ఒక ప్రశ్న ఉంటే.. తెలుగు మీడియం పేపర్లో వేరే ప్రశ్న ఇచ్చారు. ప్రశ్నపత్రం సెక్షన్ ‘బి’లో ఐదు మార్కులకు 8వ ప్రశ్నగా "Point out the main provisi ons of the Independence of India Act 1947' అని ప్రశ్న ఇచ్చారు. ‘భారత స్వాతంత్య్ర చట్టం–1947లోని ముఖ్యాంశాలు రాయండి’అని దానికి అర్థం. కానీ తెలుగులో ఇచ్చిన పొలిటికల్ సైన్స్ పేపర్లో ‘భారత స్వాతంత్య పోరాటంలో హోమ్‌రూల్ ఉద్యమాన్ని వర్ణించండి’అనే ప్రశ్న ఇచ్చారు. ఇలా వేర్వేరుగా రావడంతో.. ఏ ప్రశ్నను బోర్డు పరిగణనలోకి తీసుకుంటుంది, దేనికి మార్కులు వేస్తుందని విద్యార్థులు అయోమయంలో పడ్డారు. కొందరు ఈ ప్రశ్నకు సమాధానం రాయకుండా వదిలేశారు. మరికొందరు సమాధానం రాసినా మార్కులు రావేమోనని భయపడటం పరీక్ష కేంద్రాల వద్ద కన్పించింది. ఉర్దూలోనూ ఇదే తంతు గణితం పేపర్‌ను కొందరు విద్యార్థులు ఉర్దూ మీడియంలో రాశారు. అందులో ఇచ్చిన ఓ ప్రశ్న అర్థం లేకుండా ఉండటంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఒక లెక్కలో" FARJI'’అని ఇచ్చారు. అదేంటో ఎవరికీ అర్థం కాలేదు. విద్యార్థులు ఇదేమిటని ప్రశ్నించడంతో.. ఇన్విజిలేటర్లు, పరీక్ష కేంద్రం సిబ్బంది అప్పటికప్పుడు ఆ పదం అర్థమేంటో తెలుసుకునేందుకు హైరానా పడ్డారు. ఉర్దూ భాషా నిపుణులను సంప్రదించగా.. ఆ పదం " ZARBI' అని, లెక్కలో హెచ్చింపు అని అర్థమని చెప్పారు. ఇది పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు చేరేసరికి సమయం వృధా అయింది. వరుస తప్పిదాలు.. ఎందుకిలా? ఇంటర్‌బోర్డు నిపుణుల చేత అత్యంత గోప్యంగా పరీక్ష పత్రాలను తయారు చేయిస్తుంది. మొత్తం 12 సెట్లు రూపొందిస్తారు. అందులోంచి మూడింటిని ఎంపిక చేసి.. పరీక్ష కేంద్రాలకు పంపుతారు. పరీక్షకు సరిగ్గా అరగంట ముందు ఈ మూడు సెట్లలో ఒక సెట్‌ను ఖరారు చేస్తారు. అయితే ఈ సంవత్సరం ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలో కొందరు అనుకూలమైన వ్యక్తులకు బాధ్యత అప్పజెప్పారని, వారికి అనుభవం లేకపోవడమే తప్పిదాలకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు అధికారులు కుమ్మక్కైనట్టు విమర్శలొస్తున్నాయి. ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలోనే కార్పొరేట్ కాలేజీలతో మిలాఖత్ అయ్యారా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. హిందీ ట్రాన్స్‌లేటర్లు ఉన్నప్పటికీ వారికి అవకాశం ఇవ్వకపోవడం వెనుక కొందరు పైరవీకారుల పాత్ర ఉందనే విమర్శలున్నాయి. ఏదేమైనా పరీక్షల విభాగంపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్ కూడా విన్పిస్తోంది. వేర్వేరుగా మూల్యాంకనం పొలిటికల్ సైన్స్ పేపర్లో తెలుగు, ఆంగ్ల భాషల్లో వేర్వేరుగా ప్రశ్నలు ఇవ్వడాన్ని గుర్తిం చాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని వేర్వేరుగా మూల్యాంకనం చేపడతాం. రెండు భాషల్లోనూ రెండు ప్రశ్నలకు మార్కులు వేస్తాం. – సయ్యద్ ఒమర్ జలీల్, బోర్డు కార్యదర్శి ఇలాగైతే విద్యార్థుల్లో కంగారే.. లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నప్పుడు ఇలాంటి తప్పిదాలు రాకుండా చూడాలి. పరీక్ష హాల్లో విద్యార్థులు ఇలాంటి గందరగోళానికి లోనైతే.. సక్రమంగా పరీక్ష రాసే అవకాశం ఉండదు. ఆ రోజు పరీక్షపై ప్రభావం చూపుతుంది. – పరశురాములు, జూనియర్ లెక్చరర్ -
యువర్..‘ఆనర్స్’
బీఏ కోర్సులంటేనే బోర్ కొట్టించే పరిస్థితిని రూపుమాపేందుకు ఉన్నత విద్యా మండలి ప్రయత్నిస్తోంది. సరికొత్త రాజనీతి బోధనకు శ్రీకారం చుట్టింది. బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ కోర్సును తొలిసారిగా కోఠి ఉమెన్స్ కాలేజీలో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యామండలి సాధన చేసి సరికొత్త రాజనీతి బోధనకు శ్రీకారం చుట్టింది. విద్య, విలువల కలబోతగా కొత్త కోర్సును విద్యార్థుల ముందుకు తెచ్చింది. వినూత్న పాఠ్యప్రణాళిక ఈ కోర్సు విశేషం. బీఏ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్) కోర్సులంటేనే బోర్ కొట్టించే పరిస్థితిని రూపుమాపేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త కోర్సుకేకాదు, బావితరాల కోసం కొత్త రాజకీయ నాయకత్వానికి డిజైన్ చేసింది. బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ కోర్సును తొలిసారిగా కోఠి ఉమెన్స్ కాలేజీలో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టింది. 60 మంది విద్యార్థులతో ప్రయోగాత్మకంగా మొదలైన తొలిబ్యాచ్ ప్రారంభ కార్యక్రమం మంగళవారం ఇక్కడ జరిగింది. కార్యక్రమంలో హెచ్‌సీయూ ప్రొఫెసర్ అరుణ్ పట్నాయక్, కోఠి ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ విద్యుల్లత, రాజనీతిశాస్త్రం ప్రొఫెసర్ వి.శ్రీలత తదితరులు పాల్గొన్నారు. నాయకత్వలక్షణాలు, రాజకీయ మేధోమథనం, క్షేత్రస్థాయి రాజనీతిజ్ఞత మేళవించిన పాఠ్యప్రణాళికను ఈ కోర్సులో జోడించారు. ఈ కోర్సు ప్రాధాన్యతలపై నిపుణులు ‘ఇండస్ ప్రోగ్రామ్’లో ఏమన్నారంటే... దేశంలోనే భిన్నమైన ఆలోచన: ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి భిన్నమైన ఆలోచనలతో కోర్సుకు డిజైన్ చేశాం. సమకాలీన అంతర్జాతీయ, రాజకీయ విషయాలే బోధనాంశాలు. తరగతికే పరిమితమయ్యే పాతవిధానానికి భిన్నంగా రాజకీయప్రముఖుల అనుభవాలే పాఠ్యాంశాలుగా నేరుగా విద్యార్థులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. సంప్రదాయ ఫ్యాకల్టీ పాత్ర కన్నా, రాజకీయ ముఖ్యులు, విశ్లేషకులే ఇక్కడ బోధకులుగా వ్యవహరిస్తారు. నాలుగు గోడల మధ్య చదువును పక్కన బెట్టి, విశాల ప్రపంచంలో విస్తృత అవగాహన బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ ప్రత్యేకత. చారిత్రక అవసరం : ఓయూ వీసీ ప్రొ. డి. రవీందర్ ఉన్నత విద్యలో మహిళల పాత్ర 70 % మేర పెరిగింది. గొప్ప నాయకత్వ లక్షణాలను సంతరించుకునే దిశగా వాళ్లు అడుగులు వేస్తున్నారు. అందుకే బీఏ హానర్స్ పొలిటికల్ సైన్స్ కోర్సును కోఠి ఉమెన్స్ కాలేజీలో ప్రవేశపెట్టాం. దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో అధ్యయనం చేసిన తర్వాతే ఈ కోర్సు రూపొందించాం. భావితరాలకు మంచి నాయకులను అందిస్తామనే ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నాం. ఢిల్లీ కన్నా ... ఇక్కడే బెస్ట్ ఢిల్లీలోని విశ్వవిద్యాలయాల కన్నా మెరుగైన రీతిలో బీఏ ఆనర్స్‌ను తెలంగాణ అందించాలనుకుంటోం ది. దక్షిణ భారతదేశంలో ఈ కోర్సుకు అనువైన పరిస్థితులు తెలంగాణలోనే ఉన్నాయి. భవిష్యత్‌లో ఈ కోర్సు కోసం ఇతర రాష్ట్రాల వాళ్లూ పోటీపడతారు. తెలంగాణలోని నాయకత్వ లక్షణాలు, విద్యాహబ్‌గా హైదరాబాద్ ముందుండటం వల్ల ఈ కోర్సు కు మంచి భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నాం. ఈ కోర్సు అభ్యసించిన విద్యార్ఙినులు రోల్‌మోడల్‌గా నిలుస్తారని ఆశిస్తున్నాం. – ప్రొ.వెంకటేశు రాజకీయాల్లో విలువలు పెంచే కోర్సు విలువలతో కూడిన రాజకీయాలు నేటితరానికి అవసరం. ప్రజా సంక్షేమ పాలనకు ఇదే పునాది. ముఖ్యంగా మహిళారాజకీయ చైతన్యం వెల్లివిరుస్తున్న నేపథ్యంలో హానర్స్ పొలిటికల్ కోర్సులకు ఎంతో ప్రాధాన్యముంది. పార్లమెంటరీ విలువలు, నాయకత్వ లక్షణాలు కలబోసి రూపొందించిన ఈ పాఠ్యప్రణాళిక... వాస్తవాలే పాఠాలు మార్చి అందించే బోధనావిధానం తెలంగాణను దేశంలో గర్వంగా నిలుపుతుందని భావిస్తున్నాం. – ముసలయ్య (రాజనీతి శాస్త్రం ఆచార్యుడు) -
Kanksshi Agarwal: డర్టీప్లేస్ అంటారు కానీ..
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని..ప్రభుత్వాలు తీసుకొచ్చే పాలసీలు, చట్టాలు... సామాన్యులకు నష్టం కలిగించేవిగా ఉంటే వాటిని రద్దు చేయమని ప్రతిపక్ష పార్టీలు, సామాజిక కార్యకర్తలు ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటారు. మరోపక్క, తమ నెత్తిన బలవంతంగా మోపిన భారాన్ని సామాన్యులు మౌనంగా భరిస్తుంటారు. భోపాల్‌కు చెందిన కనక్షి అగర్వాల్ మాత్రం అలా మౌనంగా ఉండలేదు. ప్రభుత్వాలు ప్రజలకు ఇబ్బందులకు గురయ్యే విధానాలను అలా ఎలా తీసుకొస్తారు..? విధాన నిర్ణయాల్లో తమలాంటి వాళ్లు కూడా పాల్గొంటే విధానాలను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంటుందని, ఏకంగా పొలిటికల్ టీచర్‌గా మారింది. దేశ రాజకీయాల్లో మహిళల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో రాజకీయ పాఠాలను బోధిస్తోంది. నేత్రి ఫౌండేషన్.. అది 2017... జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది. నాలుగు స్లాబుల్లో వివిధ రకాల వస్తుసేవలపై పన్ను విధించారు. ఈ క్రమంలోనే మహిళలు ఎక్కువగా వినియోగించే శానిటరీ న్యాప్కిన్స్ మీద కూడా 18 శాతం పన్ను భారం పడింది. దాదాపు దేశంలో ఉన్న మహిళలంతా మౌనంగా 18 శాతం అదనపు ట్యాక్స్‌ను చెల్లిస్తూ ఎప్పటిలాగే శానిటరీ న్యాప్కిన్స్ను కొనుగోలు చేస్తున్నారు. కనక్షి మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేదు. జీఎస్టీ కౌన్సిల్లో మహిళలు లేకపోవడం వల్లే శానిటరీ ప్యాడ్స్‌పై ఇంత పన్ను విధించగలిగారు. అదే కౌన్సిల్లో ఎవరైనా మహిళలు ఉంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోరు కదా... అనుకుంది. 2019 ఎన్నికల్లో సైతం మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దేశరాజకీయాల్లో ఎలాగైనా మహిళల సంఖ్యను పెంచాలనుకుని ‘నేత్రి ఫౌండేషన్’ను స్థాపించింది. పొలిటికల్ టీచర్‌గా... టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ‘అర్బన్ పాలసీ అండ్ గవర్నెన్స్’ చదివిన కనక్షికి ‘లెజిస్లేటివ్ ఎయిడ్ టు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ (ఎల్‌ఎఎంపీ)’ ఫెలోషిప్ చేసే అవకాశం వచ్చింది. దీంతో చాలామంది ఎమ్పీ, ఎంఎల్ఏలతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఈ సమయంలో.. పాలన లో ఎక్కువగా పురుషులే ఉండడం, పురుషులతోపాటు స్త్రీలకు సమానత్వం లేకపోవడాన్ని గమనించింది. అంతేగాక మగవాళ్లు ఆడవాళ్లలా డ్రెసులు ధరించరు. నెలనెలా వచ్చే పిరియడ్స్‌పై వారికి అంత అవగాహన ఉండదు. అందువల్ల వాళ్లు ఇటువంటి పాలసీలు తీసుకు రాగలిగారు. అని కనక్షి ప్రత్యక్షంగా దగ్గర నుంచి చూసి, మహిళలు ఉంటే ఇలా జరగదని పొలిటికల్ టీచర్‌గా మారింది. నేత్రి ద్వారా గ్రామస్థాయి నుంచి మహిళలకు రాజకీయ పాఠాలు నేర్పిస్తుంది గ్రామపంచాయితీ స్థాయి నుంచి రాజకీయాల్లోకి ఎలా రావాలి? బూత్, నియోజక వర్గాల నిర్వహణ, ఆర్గనైజింగ్ స్కిల్స్, కెపాసిటీ బిల్డింగ్, సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలి, కమ్యూనిటీ ఎలా ఏర్పర్చుకోవాలి వంటి వాటి గురించి మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటిదాకా 400 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు.. ఇవేగాక న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక, శాసనసభలు ఎలా పనిచేస్తాయి? వాటినుంచి సాయం ఎలా తీసుకోవాలి వంటి అంశాలను కూడా నేరి్పస్తున్నారు. డర్టీప్లేస్ అంటారు కానీ.. ‘‘చాలామంది అభిప్రాయం ప్రకారం రాజకీయాలు అనేవి మహిళలకు నప్పవు, అది ఒక డర్టీప్లేస్. అందుకే సమాజంలోని చాలామంది తల్లిదండ్రులు తమ కూతుర్లను టీచర్, ఇంజినీర్, ఐఏఎస్ వంటి కెరియర్‌లవైపు మాత్రమే ప్రోత్సహిస్తుంటారు. ఎవ్వరూ కూడా రాజకీయాల్లోకి రమ్మని, వెళ్లమని అస్సలు చెప్పరు. వాటిని కేవలం మగవాళ్ల కెరియర్‌గా పరిగణిస్తారు. గత కొన్నేళ్లుగా ఉన్న ఈ మూస ఆలోచనకు స్వస్తి పలకాలని ‘నేత్రి’ ద్వారా మహిళలను ఎడ్యుకేట్ చేస్తున్నాను. పొలిటికల్ కెరియర్లో మహిళలకు పూలదారి ఏమీ ఉండదు. అనేక సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. అందుకే ముందుగా వివిధ జిల్లాల్లోని సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల మహిళలతో ప్రారంభించి, బరేలీ, రాయ్‌బరేలీ, అమేథి, హరుదా జిల్లాలకు విస్తరించాము. నేత్రి ద్వారా మహిళలు తమదైన నిర్ణయాలతో సమాజాన్ని సరికొత్తగా అభివృద్ధి పరచడమేగాక, దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తారు’’ అని కనక్షి చెప్పింది. చదవండి: Sirimiri Nutrition Food: ఓ ఇల్లాలి వినూత్న ఆలోచన.. కట్‌చేస్తే.. కోట్లలో లాభం! -
మాయా ఉంగరం
పురవీధుల్లో ప్రజలు జయజయ ధ్వానాలు చేస్తుండగా జంట పంచకళ్యాణి గుర్రాలను పూన్చిన స్వర్ణరథంపై విజయోల్లాసంతో ఊరేగుతూ యుద్ధరంగం నుంచి తన రాజ్యంలోకి ప్రవేశించాడు ఆనందవర్మ. ప్రజల జేజేలు అందుకుంటూ కోటలోకి చేరాడు. మహారాణి మంజులతాదేవి ఆయనకు హారతిపట్టి ఆహ్వానించింది. సుగంధ తైలాలు కలిపిన నీటితో జలకాలాడిన ఆయన యుద్ధ బడలికతో విశ్రమించాడు. మంత్రి కుశలపాలుడు ఆస్థానవైద్యుడిని పిలిపించగా ఆయన రాజుగారి గాయానికి మూలికలతో వైద్యం చేయటం ప్రారంభించాడు. సరిగ్గా అప్పుడు వేటకువెళ్ళిన యువరాజు ప్రద్యుమ్నుడు రాజమందిరంలోకి ప్రవేశించాడు.‘నాన్నగారూ..విజయాన్ని చేపట్టి వచ్చిన మీకు మా ప్రణామాలు. మన మహోజ్వల రాజ్యానికివే నా జేజేలు‘ అన్నాడు తండ్రి చెంతకు వచ్చి.‘నాయనా..ధన్యవాదాలు. తండ్రిగారిమీది గౌరవం, సామ్రాజ్యముపైన భక్తి హర్షదాయకం. కానీ, వేటనుంచి వచ్చిన నీ ముఖంలో ఉల్లాసానికి బదులు నిరుత్సాహం ప్రతిఫలిస్తోంది. ఏమైంది?’ అంటూ లాలనగా అడిగాడు ఆనందవర్మ.‘మరేమీ లేదు నాన్నగారూ! మీరు క్షేమంగా రావాలని ఆత్రుతగా ఎదురుచూడటం వల్ల మీకలా కనిపిస్తున్నానేమో. మీరు విశ్రమించండి. మనం తరువాత మాట్లాడుకుందాం‘ అని చెప్పి తన మందిరానికి వెళ్ళిపోయాడు ప్రద్యుమ్నుడు. అప్పుడు ప్రద్యుమ్నునితో కలిసి వేటకు వెళ్ళివచ్చిన అతడి మిత్రుడు(మంత్రి కుమారుడు) జయపాలుడు కూడా రాజుగారికీ తన తండ్రికీ అభివాదములు చేసి ఇలా అన్నాడు.‘క్షమించండి ప్రభూ..! మన ప్రద్యుమ్నుడు మహా బలశాలి. సింహాన్ని సైతం తన భుజబలంతో చంపివేసిన సింహబలుడు. తెలివిలో ఎన్నో ధర్మసూక్ష్మాలు, అర్థశాస్త్రము, రాజనీతి శాస్త్రము మున్నగు విద్యలలో ఆరితేరినవాడు. కానీ, పుట్టుకతోనే బొటనవేలు లేని కారణంగా యుద్ధవిద్యలు నేర్వలేని బలహీనుడయ్యాననే బాధ ఆయనలో అనుక్షణం తొలుచుచున్నది. అందుకే అలా నిర్లిప్తంగా వున్నట్టున్నారని నేను భావిస్తున్నాను‘ అంటూ అసలు విషయం తెలిపాడు. ఆ మాటలు విని మహారాణి మంజులతాదేవి చాలా బాధపడింది.‘చింతించకండి మహారాణి. యువరాజు బుద్ధి బలం మీద మాకు అపారమైన నమ్మకం వుంది. ఇక ఉపేక్షింపక వచ్చే విజయదశమి రోజున పట్టాభిషేకం జరిపించండి. అంతా మంచే జరుగుతుంది‘ అన్నాడు రాజగురువు అనంతాచార్యుడు. ‘నాన్నగారూ.. నేను పట్టాభిషిక్తుడ్ని కావడానికి ఆరునెలల ముందు దేశాటనకు వెళ్ళి రావాలని భావిస్తున్నాను. అందుకోసం రాత్రి నా స్వప్నంలో మాత అనుగ్రహం కూడా లభించింది. కాబట్టి నేను దక్షిణ దిశగా వెళ్ళిరావాలని భావిస్తున్నాను‘ అన్నాడు ప్రద్యుమ్నుడు ఒకరోజు.‘దేవి అనుగ్రహమైతే మరి తిరుగేముంది? వెళ్ళిరా నాయనా’ అంటూ ఆశీర్వదించారు తల్లిదండ్రులు.ప్రద్యుమ్నుని మిత్రుడు జయపాలుడు కూడా అతడి వెంటే బయలుదేరాడు. ఐదునెలల పాటు వారి పర్యటన నిర్విఘ్నంగా సాగింది. ఎంతో జ్ఞానం సముపార్జించి తిరుగుప్రయాణంలో ఓ కారడవిలోనే దారి తెలియక తిరిగి తిరిగి అడవి దాటలేక వారం రోజులపాటు చిక్కుకుపోయారు. ఆకలిదప్పులతో అరణ్యం నడుమ కనిపించిన ఓ శిథిలాలయంలో పడుకుని నిద్రించారు. ప్రద్యుమ్నునికి స్వప్నంలో జగన్మాత కనిపించింది.‘ప్రద్యుమ్నా.. ఈ గుడి కోనేటి జలంతో ఉదయాన్నే స్నానమాచరించి, ప్రక్కనున్న మర్రివృక్షం మొదలులో విషనాగుల సంరక్షణలో ఉన్న మాయా ఉంగరాన్ని వశం చేసుకో. నీకు శుభం కలుగుతుంది’ అనిచెప్పి మాయమైంది. చప్పున మేల్కొన్న ప్రద్యుమ్నుడు ఆనందించి మిత్రున్ని నిద్రలేపి స్వప్నవృత్తాంతం వివరించాడు. ఇద్దరూ ఉదయాత్పూర్వమే కాలకృత్యాలు తీర్చుకుని కొలనులో శుభ్రంగా స్నానం చేసి గుడిలోని జగన్మాతను పూజించి భక్తిగా నమస్కరించారు. పక్కనున్న మర్రివృక్షానికి ఆనుకున్న పుట్ట పైభాగంలో మాత చెప్పినట్లే ప్రకాశిస్తున్న ఓ ఉంగరం కనిపించింది. అయితే దానిచుట్టూ కొన్ని వందల నాగులు సంచరిస్తున్నాయి. దాంతో ప్రద్యుమ్నుడు కొద్దిగా ఎండుగడ్డిని సేకరించి పెద్ద చాపలా పేని, చెకుముకిరాళ్ళతో వెలిగించి ‘జై జగన్మాతా’ అని అరుస్తూ పుట్టపై విసిరాడు. నాగులన్నీ మంటల్లో కాలి బూడిదకావడంతో ఉంగరాన్ని అందుకున్నాడు. అంతలో నాగరాజు కోపోద్రిక్తుడై ప్రత్యక్షమై ‘ఓరీ..పాపి! అమాయకులైన నా నాగులను పొట్టనబెట్టుకుంటావా? ఈ ఉంగరం తీర్చిన ప్రతికోరికకూ నీవద్దనున్న దానినది సంగ్రహిస్తుంది గాకా’ అంటూ శపించి మాయమయ్యాడు. ఆ శాపానికి చింతిస్తున్న ప్రద్యుమ్నునికి అశరీరవాణి ఇలా వినిపించింది ‘ప్రద్యుమ్నా.. అంతా నీ మంచికే అనుకో. నీ తెలివితేటలతో శాపాన్నే వరంగా ఉపయోగించుకో’. తీవ్రంగా ఆలోచించిన ప్రద్యు ఓ నిర్ణయానికొచ్చి.. ‘ఓ మహిమాన్వితమైన అంగుళీకమా..! వెంటనే మా ఇద్దరినీ మా కోటలో మా తల్లిదండ్రుల ఎదుట నిలుపు’ అని ఆదేశించాడు. వెంటనే ఇద్దరూ కోటలో నిలిచారు. ఆ వెంటనే ప్రద్యుమ్నునికే వినిపించేలా ‘ప్రద్యుమ్నా! నీ కోరిక నెరవేర్చా. మరి నీ వద్ద వున్న దేనిని నాకర్పిస్తావు?’ అని అడిగింది అంగుళీకం.‘నా కోరిక నెరవేర్చిన నీకు సదా కృతజ్ఞుడను. నాలోని ఈర్షా్యద్వేషాలను నీకు అర్పిస్తున్నాను దయచేసి తీసుకో’ అన్నాడు. అంగుళీకం అతని నుంచి ఈర్షా్యసూయల్ని తీసివేసుకుంది. మహారాణి మంజులతాదేవి అప్పటికే పలురాజ్యాల రాజకుమార్తెల తైలవర్ణ పటాలను తెప్పించి ప్రద్యుమ్నుని ముందుంచింది. మయూర రాజ్య కన్యకామణి అయిన మందాకినిని ప్రద్యుమ్నుడు మెచ్చగానే, వారికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించి, విజయదశమి రోజున పట్టాభిషిక్తుడ్ని చేశాడు మహారాజు ఆనందవర్మ.ప్రద్యుమ్నుడు మాయా ఉంగరాన్ని రాత్రి సమయంలో పూజగదిలోని జగదాంబ పాదాల దగ్గర ఉంచి నిద్రకుపక్రమించేవాడు. అలాగే, ప్రతి ఉదయం పూజతరువాత కళ్ళకద్దుకుని ఉంగరాన్ని ధరించేవాడు.అలా కొంతకాలం గడిచేసరికి ఒకసారి శత్రుదేశమైన శృంఖల దేశరాజు విరూపుడు తన అసంఖ్యాక సేనలతో దండెత్తివచ్చి తన రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని సన్నాహాలు మొదలుపెట్టాడనే వార్త వేగులద్వారా అందింది. అప్పుడు ప్రద్యుమ్నుడు పూజ తరువాత ధరించే ముందు ‘ఓ మాయా ఉంగరమా..! నా కింతవరకు ఎటువంటి కోరికలు కలుగలేదు. కానీ, ఇప్పుడు రాజ్యసంక్షేమం కోరి నిన్ను కోరుతున్నాను. నాకు బొటనవ్రేలిని ప్రసాదించు. దయచేసి ఈ సహాయంచేసి మా ప్రజలను కాపాడగలిగే అవకాశం నాకు కలిగించు’ అని అన్నాడు. వెంటనే అతనికి బొటనవేలు వచ్చేసింది. చిన్ననాటినుంచీ బాధపడినా ఉంగరాన్ని తన ఆనందంకోసం కోరుకోని బొటనవ్రేలిని పదే పదే చూసుకుని మురిసిపోయాడు ప్రద్యుమ్నుడు. రాజు, రాణి, మందాకినితో పాటూ జయపాలుడు కూడా సంతోషించాడు.‘దీనికి ప్రతిగా నాలో వున్న బలహీనతలన్నిటినీ నీ సొంతం చేస్తున్నాను స్వీకరించు‘ అన్నాడు చిరునవ్వుతో.ఏకసంథాగ్రాహి అయిన ప్రద్యుమ్నుడు మంచి గురువుల శిక్షణలో యుద్ధవిద్యలను అనతికాలంలోనే అవలీలగా నేర్చి యుద్ధంలో విరూపుడి సైన్యాన్ని సమర్థ వంతంగా తిప్పికొట్టాడు. ప్రజలంతా జయజయధ్వానాలతో పండుగ జరుపుకున్నారు. తమ రాజుగారికి లోపం తొలిగి బొటనవేలు వచ్చేసిందని ఆనందించారు.ఆ తరువాత తన వంశ వారసులు కూడా ఉంగరపు మహిమను కేవలం రాజ్య ప్రయోజనం కోసం తప్ప మరే దురుద్దేశంతోనూ ఉపయోగించరాదని శిలాశాసనాన్ని చెక్కించి దేవీ విగ్రహం పక్కనే ప్రతిష్ఠింపజేశాడు. - డేగల అనితాసూరి -
మాకెందుకీ ‘పరీక్ష’!
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ప్రశ్నాపత్రం లీక్ ఘటనతో విద్యార్థిలోకం నైరాశ్యంలో కూరుకుపోయింది. ఏడాదంతా కష్టపడి చదివితే.. కొందరు స్వార్థపరులు దౌర్జన్యంగా తమ హక్కులను కాలరాస్తున్నారని మనోవేదన వ్యక్తం చేస్తోంది. పరీక్షలు పూర్తయి.. తదుపరి ప్రవేశ పరీక్షలకు కొందరు, సెలవులకు కొందరు ప్లాన్ చేసుకుంటున్న సమయంలో ఈ దారుణమైన వార్త తమ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని ఆవేదన చెందుతున్నారు. బాధితుల్లో సాధారణ కుటుంబాల వారి నుంచి బడా రాజకీయ నేతల పిల్లలూ ఉన్నారు. ‘చాలా నిరాశగా ఉంది. పరీక్షకు ముందు రోజే ప్రశ్నాపత్రం లీకేజీ విషయం తెలిసి ఉంటే.. సీబీఎస్ఈ చైర్‌పర్సన్‌కు విషయం తెలిస్తే అప్పుడే పరీక్ష రద్దుచేయాల్సింది. ఎందుకింత సమయం వృథా చేస్తున్నారో అర్థం కావటం లేదు’ అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ కుమారుడు ఔజస్వి ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్నెందుకు ఇబ్బందిపెడతారు? సీబీఎస్ఈ 12వ తరగతి ఎకనమిక్స్ పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు.. నిర్ణయించిన తేదీలకు సుమారు అటూ ఇటుగానే పలు జాతీయ, ప్రాంతీయ ఉన్నత విద్య కోర్సులకు ప్రవేశ పరీక్షలుండటంతో.. దేనికోసం సిద్ధం కావాలో తెలియక సతమతమవుతున్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో ఎకనమిక్స్ వంటి కఠినమైన సబ్జెక్టు పరీక్షకు సిద్ధమవటం కష్టమైన పనేనని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘పునఃపరీక్షకు నిర్ణయిస్తే.. మళ్లీ సిద్ధం కాక తప్పదు. కానీ ఇకపై పేపర్ లీక్ జరగదని అధికారులు భరోసా ఇవ్వాలి. మళ్లీ మళ్లీ పరీక్షలతో మమ్మల్నెందుకు ఇబ్బంది పెడతారు’ అని 12వ తరగతి విద్యార్థిని వంశిక బాధగా వెల్లడించారు. లీక్‌తో ఏమాత్రం సంబంధంలేని తమను.. ఇంత క్షోభపెట్టడం సరికాదంటున్నారు. అయితే పరీక్ష రాయటానికి ఇబ్బందేమీ లేదని.. కానీ.. మొదటిసారి రాసినంత ఉత్సాహంగా పరీక్ష రాయలేమంటున్నారు. ఈ లీక్ తర్వాత సీబీఎస్ఈపై నమ్మకం పోయిందంటున్నారు. ‘పరీక్షకు ముందురోజు రాత్రి.. లీకైన పరీక్షపేపర్ రూ.16వేలకు ఇస్తున్నారని.. అదే పరీక్షకు కొద్దిగంటల ముందైతే రూ.3వేలు తీసుకుంటున్నారని తెలిసింది. ఇదెంత దారుణమైన విషయం. మా జీవితాలతో ఆడుకోవటం ఎందుకు?’ అని గురుగావ్‌కు చెందిన స్నేహ అగర్వాల్ అనే విద్యార్థిని ఆవేదనగా తెలిపారు. ‘విద్యార్థులతో సీబీఎస్ఈ చైర్పర్సన్ సమావేశం ఏర్పాటుచేసి.. ఇకపై లీక్ జరగదని భరోసాగా చెప్పగలరా?’ అని ఆందోళన చేస్తున్న విద్యార్థులు ప్రశ్నించారు. సరైన సమాధానం వచ్చేంతవరకు నిరసనలు తగ్గవని స్పష్టం చేశారు. సీబీఎస్‌ఈదే బాధ్యత ‘బోర్డు ఎగ్జామ్ అంటేనే తెలియని ఆందోళన. ఈ పరిస్థితుల్లో ఏడాది చదివిందంతా ఇలా బూడిదలో పోసిన పన్నీరైంది. పరీక్షకు ముందురోజే పేపర్ లీక్ అయిందని తెలిసింది. అయినా మనకెందుకులే అని సిద్ధమై.. పరీక్ష హాల్‌కు వెళ్లే సరికి ప్రతి ఒక్కరికీ లీక్ గురించి తెలిసిందని అర్థమైంది. పరీక్ష బాగా రాశామని సంబరపడుతుండగానే.. ఈ వార్త ఉలిక్కిపడేలా చేసింది. మళ్లీ గణితం పరీక్ష రాయాలా? అని భయమేస్తోంది. అసలు ఈ ఘటనంతటికీ సీబీఎస్‌ఈదే పూర్తి బాధ్యత. ఇటీవలి కాలంలో బోర్డు తీసుకుంటున్న చాలా నిర్ణయాలు ఇలాగే ఉంటున్నాయి. దీంతో వ్యవస్థపై నాకు పూర్తిగా నమ్మకం పోయింది’ అని శ్రీజన్ సిన్హా అనే పదో తరగతి విద్యార్థిని పేర్కొంది. మరో లీక్ కలకలం ► అవి వదంతులేనన్న సీబీఎస్ఈ ► జార్ఖండ్‌లో ఇద్దరు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ల అరెస్టు న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12, పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతుండగానే.. మరో లీకేజీ జరిగిందన్న వదంతులు కలకలం సృష్టించాయి. సోషల్ మీడియాలో 12వ తరగతి హిందీ, పొలిటికల్ సైన్స్ ప్రశ్నాపత్రాలు లీకైనట్లు.. వార్తలు రావటంపై సీబీఎస్ఈ తీవ్రంగా స్పందించింది. లీక్ జరగలేదని.. వాట్సప్, యూట్యూబ్.. తదితర సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మొద్దని స్పష్టం చేసింది. ‘సోషల్ మీడియాలో విస్తృతమవుతున్న ఈ రెండు పేపర్లు గతంలోనివే. దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారం ప్రసారం చేయవద్దు. విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయొద్దు’ అని సీబీఎస్ఈ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, పరీక్షకు ముందురోజే.. పదవతరగతి ప్రశ్నాపత్రం సీబీఎస్ఈ చైర్పర్సన్ అనిత కార్వాల్కు ఈ–మెయిల్లో రావటంపై వివరాలివ్వాలంటూ పోలీసులు చేసిన విజ్ఞప్తిపై గూగుల్ సమాధానమిచ్చింది. ఓ పదోతరగతి విద్యార్థి వాట్సప్ ద్వారా తనకు వచ్చిన ప్రశ్నాపత్రాన్ని.. తండ్రి ఈ–మెయిల్ ద్వారా సీబీఎస్ఈ చైర్‌పర్సన్‌కు పంపారని ఢిల్లీ కమిషనర్ (క్రైం) ఆర్పీ ఉపాధ్యాయ వెల్లడించారు. ఆ విద్యార్థిని, ఆయన తండ్రిని విచారిస్తున్నామని తెలిపారు. మరోవైపు, ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 60 మందిని పోలీసులు విచారించారు. ఢిల్లీతోపాటు నగర శివార్లలో ఉన్న కోచింగ్ సెంటర్లు, పాఠశాలల యాజమాన్యాలను ప్రశ్నించారు. అయినా ఇంతవరకు ఎలాంటి సమాచారం దొరకలేదని తెలిసింది. 12వ తరగతి ఎకనమిక్స్ పునఃపరీక్షకు సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పరీక్ష నిర్ణయాన్ని రద్దుచేయాలని కోరుతూ ఢిల్లీలోని శకర్పూర్కు చెందిన రీపక్ కన్సాల్, కొచ్చికి చెందిన రోహన్ మ్యాథ్యూ వేర్వేరు పిటిషన్లు వేశారు. జార్ఖండ్‌లో ప్రకంపనలు సీబీఎస్ఈ ప్రశ్నాపత్రం లీక్ తాలూకూ ప్రకంపనలు జార్ఖండ్‌లోనూ కనబడుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఛాత్రా జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేటు కోచింగ్ సెంటర్ల డైరెక్టర్లు (ఇద్దరు), నలుగురు విద్యార్థులను (10, 11 తరగతి విద్యార్థులు) పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీలోని సీబీఎస్ఈ కార్యాలయం ముందు విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రీత్ విహార్‌లోని కార్యాలయం ముందున్న రోడ్డును బ్లాక్ చేసేందుకు విద్యార్థులు ప్రయత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు. -
భవిష్యత్ నేతలుగా ఎదగాలి
భవిష్యత్ నేతలుగా ఎదగాలి you will be next generation leaders au campus, political science, future leaders, sarveypalli radha krishna ఏయూ క్యాంపస్, రాజనీతి శాస్త్రం, భవిష్యత్ నేతలు, సర్వేపల్లి రాధాకష్ణన్ ఏయూక్యాంపస్: విద్యార్థులు భవిష్యత్ తరం నేతలుగా ఎదగాలని ఏయూ ఉపకులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. ఏయూ రాజనీతి శాస్త్ర విభాగంలో సోమవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కళాశాల వద్ద సర్వేపల్లి రాధాకష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా విద్యార్థుల నుద్దేశించి మాట్లాడుతూ సానుకూల దక్పధంతో దుకెళ్లాలన్నారు. ఈ విభాగం ఎందరో ప్రభుత్వ అధికారులను దేశానికి అందించిందన్నారు. వారి నుంచి స్ఫూర్తిని పొందుతూ ఈ దిశగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా విభాగ ప్రగతిని తెలియజేసే ఫొటోలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు, రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, విభాగాధిపతి పి.ప్రేమానందం తదితరులు పాల్గొన్నారు. -
మా పిల్లలకు రిజర్వేషన్లు వదులుకున్నా
ఐఏఎస్ ప్రవీణ్‌కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ: మా పిల్లలకు విద్య, ఉద్యోగం, ఇతర రంగాలలో ఎస్సీ రిజర్వేషన్‌ను వదులుకున్నానని టీఎస్డబ్ల్యూర్ఈఐఎస్ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల పొలిటికల్ సైన్స్ విభాగంలో కొనసాగుతున్న అడ్వాన్సుడ్ స్టడీస్ ఆధ్వర్యంలో అంబేడ్కర్: సామాజిక న్యా యం, ప్రజాస్వామ్యం, భాగస్వామ్యం అనే అంశంపై సదస్సు జరిగింది. కార్యక్రమానికి కోఆర్డినేటర్ ప్రొ.కృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా డాక్టర్ ప్రవీణ్‌కుమార్, సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ పేదరిక నిర్మూళనకు ఎంతోకాలంగా రిజర్వేషన్లు అమలవుతున్నా పేదరికం పోవడం లేదన్నారు. ప్రభుత్వంతో పాటు గతంలో రిజర్వేషన్లు పొంది నేడు ఉన్నత స్థితిలో ఉన్నవారు సైతం కృషి చేస్తే పేదరిక నిర్మూళన సాధ్యమన్నారు. మా ఇద్దరు పిల్లలను రిజర్వేషన్లు లేకుండా చదివిస్తున్నానని పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ అన్ని రంగాలలో అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. కార్యక్రమంలో ప్రొ.రవీందర్, పరిశోధన విద్యార్థి కోట రాజేష్, సుదర్శన్ పాల్గొన్నారు. -
శంకర్‌నాయక్‌ను కఠినంగా శిక్షించాలి
-
విద్యార్థి నాయకుడి వికృత చేష్టలు
-
విద్యార్థి నాయకుడి వికృత చేష్టలు
విద్యార్థినిపై అత్యాచారయత్నం 'సాక్షి' కథనాలకు స్పందించిన పోలీసులు అనంతపురం ఎస్కేయూలో ఎంఏ రాజనీతి శాస్త్రం చదువుతున్న ఓ విద్యార్థి నాయకుడు జూనియర్ విద్యార్థిని వేధింపులకు గురిచేసిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. విభాగంలోనే ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఇది తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు వేధింపులకు పాల్పడుతున్న శశాంక్ నాయక్ తో గొడవపడ్డారు. ఔశశాంక్ తమ కూతురికి కొంతకాలంగా అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నాడని ఆగ్రహించారు. ఆమె పలుమార్లు హెచ్చిరించినా అతనిలో మార్పులేదన్నారు. ఈ అంశంపై స్పందించిన విభాగాధిపతి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి మిన్నకుండిపోయారు. దీనిపై రాజనీతి శాస్త్రం విభాగపు విద్యార్థినులు విభాగాధిపతిని నిలదీశారు. తమపై వేధింపులకు పాల్పడుతున్నా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గురుతర బాధ్యతగల విద్యార్థి నాయకుడి దుష్ర్పవర్తనపై వర్సిటీలో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 'సాక్షి'కి స్పందన విద్యార్థిని పై అత్యాచార యత్నానికి విద్యార్థి నాయకుడు చేష్టలపై 'సాక్షి' మీడియాలో కథనాలు ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్ధి నాయకుడు శశాంక్ నాయక్ నాయక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రాజకీయ అవగాహన తప్పనిసరి
* గ్రూపు-1, 2లో పాలిటీకి పెద్దపీట * ప్రిపరేషన్ పద్ధతే చాలా ముఖ్యం * మూడంచెల విధానంలో సన్నద్ధమవ్వాలి * టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొ. కృష్ణారెడ్డి * ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ సాక్షి, హైదరాబాద్: ఏ పోటీ పరీక్షలకైనా దేశ, రాష్ట్ర రాజకీయాలపై అవగాహన కీలకం. గ్రూప్-1, 2 అధికారులకు ఇది మరీ ముఖ్యం. అన్ని స్థాయిల్లో రాజకీయ పరిస్థితులు తెలిసినప్పుడే వారు సమర్థంగా విధులు నిర్వహించగలరు. అందుకే గ్రూప్-1తో పాటు గ్రూప్-2లోనూ పొలిటికల్ సైన్స్‌కు స్థానం కల్పించారు. ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్‌లో 8వ అంశంగా భారత రాజ్యాంగం, రాజనీతి శాస్త్రం పొందుపరిచారు. గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ఎస్సేలో రెండో అంశంగా డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, భారత చారిత్రక, సాంస్కృతిక వారసత్వం అంశాలను చేర్చారు. పేపరు-3లోనూ పొలిటికల్ సైన్స్ అంశాలున్నాయి. గ్రూపు-2లోనూ పేపరు-2లో ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్‌ను ప్రత్యేకంగా చేర్చారు. ఈ నేపథ్యంలో పాలిటిక్స్‌కు (పొలిటికల్ సైన్స్) సంబంధించిన వివిధ అంశాలపై ప్రిపరేషన్లో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యూహాలపై ఓయూ ప్రొఫెసర్, టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు... గ్రూపు-1కు సిద్ధమయ్యే అభ్యర్థులు ప్రధానంగా పాలిటీ పరిధిలోకి వచ్చే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, అంతర్రాష్ట్ర వివాదాలపై దృష్టి పెట్టాలి. పాలనకు సంబంధించి పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి, ప్రధాని తదితర వ్యవస్థలపై అవగాహన పెంచుకోవాలి. పాలిటీలో అభ్యర్థులు దృష్టి పెట్టాల్సిన మరో ముఖ్యాంశం 73, 74 రాజ్యాంగ సవరణలు. స్థానిక సుపరిపాలనకు దోహద పడేలా పంచాయతీరాజ్, మున్సిపాలిటీల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వ పథకాలు, సమకాలీన అంశాలతోపాటు దేశ రాజకీయాలు, రిజర్వేషన్లు, సామాజిక ఉద్యమాలు, పార్టీల వ్యవస్థపై అవగాహన అవసరం. స్వాతంత్య్రానంతర కాలం నుంచి ఇప్పటిదాకా రాజకీయంగా జరిగిన ముఖ్య ఘటనలు, జాతీయ స్థాయిలో పలు పార్టీలు,రాజకీయ సమీకరణలపై అవగాహన ఉండాలి. ప్రభుత్వాలు ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి కారణమైన పరిస్థితులూ తెలిసుండాలి. ఉదాహరణకు అన్నా హజారే దీక్ష, లోక్‌పాల్ బిల్లు వంటివి. గ్రూపు-2 (భారత రాజ్యాంగం, రాజకీయాలు-అవలోకనం) పేపరు-2లో మొదటి విభాగంలో ఇండియా, తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, రెండో విభాగంలో భారత రాజ్యాంగం, పాలిటిక్స్ అవలోకనం ఉంటాయి. వీటిలో ప్రధానంగా రాజ్యాంగంపై సమగ్ర అవగాహన తెచ్చుకోవడంతోపాటు దేశ సాంఘిక పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు తెలుసుకోవాలి. ఎన్నికలు, అక్రమాలు, ఎన్నికల సంఘం, ఎన్నికల సంస్కరణలు, పార్టీల పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వాధికారికి సమాజ స్థితిగతులపై స్పష్టమైన అవగాహన ఉండాలన్న లక్ష్యంతో సిలబస్‌ను రూపొందించారు. ఒక పేపర్లోని అంశాలకు, మరో పేపర్లోని అంశాలకు సంబంధం ఉంటుంది. నోట్సు రాసుకునేప్పుడే వీటిని జాగ్రత్తగా విభాగాలుగా చేసి సిద్ధం చేసుకోవాలి. పరీక్షలకు సంసిద్ధతే ప్రధానం తెలంగాణ వచ్చాక ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహిస్తున ్న తొలి ఉద్యోగ పరీక్షలివి. సీమాంధ్ర ప్రాంతాల్లో విద్యా విధానానికి, తెలంగాణలో విద్యా విధానానికి తేడా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థుల ఆలోచన విధానం, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, ఇన్నాళ్లు ఇక్కడి అభ్యర్థులకే తెలియని తెలంగాణ చరిత్ర, సామాజిక పరిస్థితులు, అసమానతలు, రాజకీయ స్థితిగతులపై ప్రశ్నించేలా సిలబస్ రూపకల్పన జరిగింది. కొత్త రాష్ట్రంలో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులను అధికారులుగా, ఉద్యోగులుగా తీసుకునేలా తెలంగాణలో పోటీ పరీక్షలుంటాయి. సంసిద్ధతలో ఇవీ ప్రధాన వ్యూహాలు అభ్యర్థులు ప్రధానంగా మూడు రకాల వ్యూహాలు అనుసరించాలి. ఒకటి ఎక్స్టెన్సిన్ స్టడీ, రెండోది ఇంటెన్సివ్ స్టడీ. మూడోది పాయింట్లవారీగా నోట్స్ సిద్ధం చేసుకోవడం. ప్రతి సబ్జెక్టు, అంశానికి సంబంధించి పరీక్షలకు సిద్ధమయేప్పుడు వీటిని కచ్చితంగా అనుసరించాలి. తద్వారా సబ్జెక్టుపై అవగాహన తెచ్చుకోవడంతోపాటు పరీక్షల్లో బాగా రాయడం వీలవుతుంది. 1. పరీక్షకు 4 నెలలుందనగా ప్రిపేరయ్యే పోటీపరీక్షకు సంబంధించిన పుస్తకాలను సమగ్రంగా చదవాలి. ఇది ఎక్స్టెన్సివ్ స్టడీ. 2. ప్రధానాంశాలపై నోట్స్ సిద్ధం చేసుకోవాలి. పరీక్షకు 2 నెలలుండగా వీటిని మాత్ర మే చదువుకోవాలి. ఇది ఇంటెన్సివ్ స్టడీ. 3. ఇక మూడోది పాయింట్స్. పరీక్షకు 15-20 రోజులుందనగా ఈ మూడో వ్యూహాన్ని అనుసరించాలి. ఇంటెన్సివ్ స్టడీ చేసి నోట్స్ రూపొందించుకున్న అంశాలపై పాయింట్లవారీగా మళ్లీ నోట్స్ సిద్ధం చేసుకోవాలి. పరీక్ష వరకూ ఈ పాయింట్లను చదువుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో పుస్తకాలను పట్టుకుని కూర్చోవద్దు. సరైన పుస్తకాలనే ఎంచుకోవడం చాలా ముఖ్యం. పక్కవారు చదువుతున్నారని ఏ పుస్తకం పడితే అది చదవొద్దు. సొంత వ్యూహం ముఖ్యం. ఉదాహరణకు జేఎన్‌యూ, సెంట్రల్ వర్సిటీల విద్యార్థులు చదివే తీరుకు, రాష్ట్ర వర్సిటీల విద్యార్థులు చదివే విధానానికి చాలా తే డా ఉంది.రాష్ట్ర విద్యార్థులే ఎక్కువ సమ యం చదువుతారు. కానీ సెంట్రల్ వర్సిటీ, జేఎన్‌యూ విద్యార్థుల సక్సెస్ రేటే ఎక్కువ. కారణం... పుస్తకాల ఎంపికే. కాబట్టి ఈ విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి. ఏమేం చదవాలంటే.. సిలబస్ బయటికొచ్చి రెండు నెలలు కూడా కాలేదు. ఈ స్వల్ప కాలంలోనే తెలంగాణ చరిత్రంతా రాస్తామంటే కుదరు. ఇలాంటప్పుడు తెలంగాణ చరిత్రే కాదు, ఇతర సబ్జెక్టులకు సంబంధించి కూడా ఇప్పటికిప్పుడు వచ్చిన పుస్తకాలను గుడ్డిగా అనుసరిస్తే నష్టపోతారు. ఫేక్ పుస్తకాలు వందలకొద్దీ మార్కెట్లోకొచ్చాయి. అవన్నీ కొనేయొద్దు. బిట్స్ బ్యాంకులపైనా ఆధారపడొద్దు. పుస్తకాల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. వర్సిటీల్లో లేని విద్యార్థులు అధ్యాపకుల సలహా మేరకు పుస్తకాలను కొనుక్కోవాలి. సుంకిరెడ్డి నారాయణరెడ్డి వంటి వారు రాసినవి కొనవచ్చు. ఉద్యమంలో పాల్గొన్న వారు రాసిన పుస్తకాలూ చదవొచ్చు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు రూపొందించిన పుస్తకాలనూ చదవొచ్చు. ఇవన్నీ గణాంకాలతో కూడుకుని ఉన్నాయి. గ్రూప్-1 అభ్యర్థులు రొమిల్లా థాపర్, బిపిన్‌చంద్ర పుస్తకాలు చదవొచ్చు. ఓబీ గౌబా రాసిన ఇంట్రడక్షన్ టు పొలిటికల్ థియరీ, ఏఆర్ దేశాయ్ రాసిన పొలిటికల్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా బాగుంటాయి. ప్రణాళిక విభాగం విడుదల చేసిన సోషియో ఎకనామిక్ ఔట్లుక్ చదవాలి. తెలంగాణకు సంబంధించి గౌతమ్ పింగ్లే రాసిన ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ పుస్తకం బాగుంటుంది. -
కొలువులకు కేరాఫ్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్!
ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సుల పరిధి విస్తృతమవుతోంది. ఆర్ట్స్ అంటే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ తదితర సంప్రదాయ కోర్సులు మాత్రమే అనే హద్దులు చెదిరిపోతున్నాయి. లింగ్విస్టిక్స్, సోషియాలజీ, సైకాలజీ నుంచి ప్రొఫెషనల్ ‘లా’ కోర్సుల వరకు ఈ విభాగంలో ఎన్నో విభిన్న సమకాలీన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పోస్టు గ్రాడ్యుయేషన్‌తోపాటు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోనూ హ్యుమానిటీస్ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది! కామర్స్, సైన్స్... అకౌంటెన్సీ లేదా కెమిస్ట్రీ... ఏదో ఒక ప్రధాన సబ్జెక్టుకు మాత్రమే పరిమితమయ్యే కోర్సులు. కానీ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ అనేవి విస్తృత పరిధి ఉన్న కోర్సులు. వీటిని అభ్యసించిన విద్యార్థులు సమాజం, చుట్టూ ఉన్న మనుషులు, చరిత్ర, వారసత్వ సంపద, సామాజిక- మానవ సంబంధాలు, నాగరికత, సంస్కృతి, పాలన వ్యవహారాలు, రాజనీతి, విశ్వం, భూగోళశాస్త్రం, ఆర్థిక శాస్త్రాలు వంటి పలు అంశాలను అధ్యయనం చేస్తారు. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఇవి తోడ్పడతాయి. పుస్తకాల్లో ఉన్న అంశాలను బాహ్య ప్రపంచానికి అన్వయించుకుంటూ చదవడం ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ ప్రత్యేకత. ఈ కోర్సులనభ్యసించినవారు విస్తృతమైన ఆలోచనా నైపుణ్యాలను సొంతం చేసుకుంటారు. అంకితభావం, విలువలతో కూడిన మేధావులను రూపొందించ డానికి ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కోర్సులు-తీరుతెన్నులు: ఉస్మానియా యూనివర్సిటీతోపాటు దాదాపు అన్ని వర్సిటీల పరిధిలోని వివిధ కళాశాలలు ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్‌సైన్స్ కోర్సులను అందిస్తున్నాయి. హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(బి.ఎ.)లో భాగంగా హిస్టరీ, తెలుగు లిటరేచర్, పొలిటికల్‌సైన్స్, ఎక నమిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీతో పాటు ఉర్దూ, పర్షియన్, ఫిలాసపీల్లో వివిధ కాంబినేషన్లూ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు ఎకనమిక్స్, సైకాలజీ, సోషియాలజీ, మార్కెటింగ్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తదితర సబ్జెక్టులున్న కాంబినేషన్లను ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉన్నత విద్య: ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, సోషల్ై సెన్సెస్‌లో వివిధ కాంబినేషన్లలో బ్యాచిలర్ కోర్సు పూర్తి చేసిన తర్వాత మాస్టర్స్ స్థాయిలో ఆసక్తి ఉన్న ఏదో ఒక సబ్జెక్టును ఎంచుకోవాల్సి ఉంటుంది. హిస్టరీ, ఎకానమిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ వంటి సంప్రదాయ సబ్జెక్ట్లేకాకుండా లింగ్విస్టిక్స్, సోషియాలజీ, సైకాలజీ, డెవలప్మెంట్ స్టడీస్ తదితర సబ్జెక్టుల్లో పీజీ కోర్సులనభ్యసించొచ్చు. మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్: దేశంలో విభిన్న వర్గాల వారి మధ్య అసమానతలు, సామాజిక పరిస్థితులే చాలా మంది సోషల్ వర్క్‌ను తమ కెరీర్‌గా ఎంచుకోవడానికి దోహదపడుతున్నాయి. సామాజిక సమస్యలపై అవగాహనకు, వాటి నిర్మూలన తదితర అంశాలపై విద్యార్థులను చైతన్యవంతులుగా ఈ కోర్సులు తీర్చిదిద్దుతున్నాయి. దేశంలోని కొన్ని యూనివర్సిటీలు మాత్రమే ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్న మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ (ఎంఎస్‌డబ్ల్యూ) కోర్సును పూర్తి చేస్తే మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. వీటితోపాటు ఎంబీఏ ఇన్ రూరల్ డెవలప్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ వంటి కోర్సులూ ఉన్నాయి. ఈ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల్లో అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎంఏ డెవలప్మెంట్ స్టడీస్: గ్లోబలైజేషన్ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో డెవలప్మెంట్ స్టడీస్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ కోర్సులో ప్రధానంగా ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన కాపిటల్ ఇన్‌ఫ్లో, సోషియో-ఎకనమిక్ అంశాలతోపాటు పర్యావరణ విశేషాలను కూడా విద్యార్థులు అభ్యసిస్తారు. ఇది మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్. ఇందులో సామాజిక శాస్త్రం, ఎకనమిక్స్, ఆంత్రోపాలజీ, పాలిటిక్స్ తదితర అంశాలుంటాయి. అభివృద్ధికి సంబంధించిన సామాజిక, ఆర్థిక అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ప్రవేశపెట్టిందే.. డెవలప్మెంట్ స్టడీస్. పీజీ స్థాయిలో ఎంఏ (డెవలప్మెంట్ స్టడీస్)గా కోర్సును పలు యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. ఎంఏ ఇన్ పాలిటిక్స్: రాజకీయ విలువలు, సంస్థలు, అవి పని చేసేతీరు, రాజ్యాంగం వంటి అంశాలపై ఈ కోర్సులో అధ్యయనం చేస్తారు. పీజీస్థాయిలో ఎంఏ ఇన్ పొలికల్ సైన్స్ కోర్సులను దాదాపు అన్ని యూనివ ర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సును పూర్తి చేసిన వారికి టీచింగ్, రీసెర్చ్, పబ్లిషింగ్, బిజినెస్, జర్నలిజం రంగాల కేంద్రీకృతంగా అవకాశాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగంలో ఈ కోర్సును అభ్యసిస్తే మరిన్ని అవకాశాలను అందుకోవచ్చు. విదేశాల్లోనూ విస్తృత డిమాండ్: విదేశాల్లోనూ హ్యుమానిటీస్ కోర్సులకు విస్తృత ఆదరణ లభిస్తోంది. విదేశాల్లో హ్యుమానిటీస్ కోర్సులనభ్యసించడం ద్వారా సాంఘిక పరిస్థితులు, సంస్థలు వాటి విధానాలను అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనం చేయడానికి అవకాశం ఏర్పడుతోంది. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులు క్లిష్టమైన, విశ్లేషణాత్మక నైపుణ్యాలను సొంతం చేసుకుంటున్నారు. అమెరికాలోని హార్వర్డ్, యేల్, ప్రిన్స్టన్, జార్జిటౌన్, టఫ్ట్స్ తదితర యూనివర్సిటీ/లిబరల్ ఆర్ట్స్ విద్యాసంస్థల్లో పాలిటిక్స్ అండ్ ఐఆర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బాత్, యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ మొదలైనవి ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. అమెరికా, యూకే, ఇటలీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో బిజినెస్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్, మీడియా అండ్ కమ్యూనికేషన్ సంబంధిత కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. కెరీర్: ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్సెన్సైస్లో కోర్సునభ్యసించిన వారికి ప్రధానంగా కమ్యూనికేషన్స్ అండ్ మీడియా, జర్నలిజం, లా, జెండర్ స్టడీస్, మానవ హక్కులు తదితర విభాగాల్లో దేశవిదేశాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ‘సామాజిక సమస్యలు, మావన హక్కులు, వాటితో ముడిపడి ఉన్న అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే సోషల్ వర్క్. సేవా దృక్పథం ఉన్నవారు ఈ కోర్సును అభ్యసిస్తే ప్రయోజనం ఉంటుంది’ అని తెలిపాడు మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చదువుతున్న మనోహర్. ‘విదేశీ భాషలను నేర్చుకోవడం ద్వారా విస్తృత అవకాశాలను అందుకోవచ్చు. భావ వ్యక్తీకరణకు ప్రధాన సాధనం భాష. అటువంటి భాషలో నైపుణ్యం సాధించాలనే ఈ కోర్సును ఎంచుకున్నాను. అంతేకాకుండా ప్రొఫెషనల్ కోర్సులకు దీటుగా దేశ, విదేశాల్లో భాషా నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తుండడం కూడా కోర్సు ఎంపికకు కారణం’ అని పేర్కొంటున్నాడు ఎంఏ ఇంగ్లిష్ చదువుతున్న నారాయణ్. మంచి భవిష్యత్తు ఖాయం ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కోర్సులను అభ్యసిస్తే సామాజిక అవగాహన అలవడుతుంది. సమాజాన్ని, మానవ సంబంధాలను, చారిత్రక సంపదను, సాంస్కృతిక ఔన్నత్యాన్ని తెలుసుకుంటారు. ఎక్కువ మంది ఎకనమిక్స్, సైకాలజీ, సోషియాలజీ, మార్కెటింగ్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తదితర సబ్జెక్టులను ఎంపిక చేసుకుంటున్నారు. అకడమిక్ నైపుణ్యాలతోపాటు రైటింగ్ స్కిల్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, నిరంతర అధ్యయనం, సామాజిక అంశాలపై అవగాహన తదితర నైపుణ్యాలను సొంతం చేసుకుంటే మంచి భవిష్యత్తు సాధ్యమ వుతుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ప్రధానంగా లాంగ్వేజ్ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల విజేతల్లో ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సులను అభ్యసించిన వారు ముందుంటున్నారు. - టి.ఎల్.ఎన్. స్వామి ప్రిన్సిపాల్, నిజాం కళాశాల, హైదరాబాద్ విస్తృత అవకాశాలు లభిస్తాయి ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్‌లో విద్యార్థులు సమాజానికి కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఈ కోర్సుల ద్వారా వారసత్వంగా లభించే నైపుణ్యాలను శిక్షణ ద్వారా మరింత మెరుగుపర్చుకునే అవకాశం లభిస్తుంది. సోషల్ సెన్సైస్ చదివిన వారిలో సామాజిక అంశాలపై ఎక్కువ అవగాహన ఉంటుంది. వీరికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యం సాధించిన వారు తోడైతే ఒక సమగ్రమైన సోషల్ నెట్వర్కింగ్ వ్యవస్థ సాధ్యమవుతుంది. హ్యుమానిటీస్‌లో ప్రధానంగా లాంగ్వేజె స్ కోర్సుల్లోనూ ఎక్కువ మంది చేరుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లుగా మారిన వారిలోనూ తెలుగు, ఇంగ్లిష్ తదితర లిటరేచర్ చదివినవారే ఎక్కువగా ఉంటున్నారు. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ దగ్గర్నుంచి సాధారణ ట్రాన్స్లేషన్ వరకు భాషా నిపుణులకు అవకాశాలు పెరిగాయి. - ఎస్.మల్లేశ్, ప్రిన్సిపాల్, ఓయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సెన్సైస్ జనరల్ నాలెడ్‌జ జాతీయోద్యమ కాలం నాటి పత్రికలు ఇవి.. పత్రిక సంవత్సరం, వ్యవస్థాపకుడు/ {పదేశం ప్రాముఖ్యత ట్రిబ్యూన్ 1881, లాహోర్ దయాల్ సింగ్ మజీతియా కేసరి 1881, బొంబాయి తిలక్ మరాఠ 1881, బొంబాయి తిలక్ పరిదాసక్ 1886 బిపిన్ చంద్రపాల్ యుగంతర్ 1906, బెంగాల్ బరీంద్ర కుమార్ ఘోష్, భూపేంద్రనాథ్ దత్తా సంధ్య 1906, బెంగాల్ {బహ్మబంధోపాధ్యాయ ఇండియన్ సోషియాలజిస్ట్ లండన్ శ్యామ్‌జీ కృష్ణ వర్మన్ వందేమాతరం పారిస్ మేడం కామా తల్వార్ బెర్లిన్ వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ ఫ్రీ హిందూస్థాన్ వాంకోవర్ తారక్నాథ్ దాస్ ప్రముఖ చారిత్రక గ్రంథాలు - రచయితల పేర్లు తెలుసుకోండి రచయిత {Vంథం హ్యూయన్‌త్సాంగ్ సి.యూ-కీ దిన్నాగుడు {పమాణ సముచ్ఛయం నన్నయ మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు భాసుడు బుద్ధ చరితం నాగసేనుడు మిళింద పన్హా భద్రబాహుడు జైనకల్ప సూత్రం అశ్వఘోషుడు సౌందర్యనందన కావ్యం (సంస్కృతం) పరిశిష్టపర్వం (జైనుల ప్రసిద్ధ గ్రంథం) కొండకుందాచారి సమయసారం శర్వవర్మన్ కాంతార (సంస్కృత గ్రంథం) బుధస్వామి బహృత్కశ్లోక సంగ్రహం ప్రపంచంలో ప్రసిద్ధ కట్టడాలు ఎక్కడున్నాయో తెలుసా? కట్టడం పేరు నగరం అల్అకుస మసీదు జెరూసలేం బిగ్ బెన్ లండన్ బ్రాడెన్బర్గ గేట్ బెర్లిన్ బ్రౌన్ హౌస్ బెర్లిన్ బ్రాడ్ వే న్యూయార్క కలోసియం రోమ్ ఈఫిల్ టవర్ పారిస్ హెడెపార్క లండన్ ఇండియన్ హౌస్ లండన్ కాబా మక్కా క్రెమ్లిన్ మాస్కో అడ్మిషన్స, జాబ్స్ అలర్ట్స ఓయూ దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంబీఏ విభాగాలు: జనరల్ మేనేజ్మెంట్, పర్సనల్, హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్. అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. ఎంసీఏ అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. ఇంటర్/డిగ్రీలో మ్యాథమెటిక్స్ను చదివి ఉండాలి. ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబరు 6 వెబ్సైట్: http://ouadmissions.com/oucde/ ఏఆర్‌సీఐ-హైదరాబాద్ హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూమెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అసిస్టెంట్ (5) అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. అడ్మినిస్ట్రేషన్/ హెచ్ఆర్/ఫైనాన్స్ అండ్ అకౌంట్స్/స్టోర్స్ అండ్ పర్చేజ్ విభాగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి., వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 30 వెబ్సైట్:http://www.arci.res.in/ -
కెరీర్ విత్ పొలిటికల్ సైన్స్
తెగలు, సమూహాలు, నగరాలు, దేశాలుగా నివసిస్తున్న ప్రజల మధ్య..వారి జీవన గమనానికి అవసరమైన నియమాలు రూపొందించడం, వాటిని అమలు చేయడం ద్వారా ప్రజలు కలసి మెలసి జీవించడానికి ఒక రకమైన వారధిగా నిలిచేవే రాజకీయాలు.. రాచరికం నుంచి ప్రజల చేతుల్లోకి అధికారం విస్తరించిన నేపథ్యంలో రాజకీయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి..ప్రజలు తమకు కావల్సిన అవసరాల గొంతుకను రాజకీయమనే వ్యవస్థ ద్వారా వినిపిస్తుంటారు.. ఈ క్రమంలో రూపొందించే చట్టాలు, జరిగే నిర్ణయాలు, తీసుకునే చర్యలు వంటి అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్).. దేశాల పరిపాలనకు సంబంధించిన విధానాలు, ప్రభుత్వ నియమాలు, రాజ్యాంగం పాత్ర, చట్టాల తయారీ మార్గాలు, ఎన్నికలు... ఇలా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకు అవసరమైన అన్ని అంశాలను విశ్లేషణాత్మకంగా చర్చించేదే రాజనీతి శాస్త్రం. ఇందులో రాజకీయ విలువలు, సంస్థలు, అవి పని చేసేతీరు, రాజ్యాంగం వంటి అంశాలు ఉంటాయి. లీడర్‌గా ఎదగడానికి: శరవేగంగా మార్పు దిశగా ప్రపంచం దూసుకుపోతున్న ప్రస్తుత తరుణంలో సమాజాన్ని వివిధ మాధ్యమాల నుంచి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయాలు అనే కోణంలోనే కాకుండా.. ప్రస్తుత ఆధునిక యుగంలో ఒక వ్యక్తిలా కాకుండా నాయకుడిగా ఉండాల్సిన పరిస్థితి. కుటుంబం నుంచి పని చేసే సంస్థ వరకు నలుగురికీ ఆదర్శంగా నిలుస్తూ.. నడిపిస్తూ ముందుకు సాగాలి. అంటే విద్యార్హతలతోపాటు నాయకత్వ లక్షణాలు కూడా నియామక ప్రక్రియలో నిర్ణయాత్మకంగా నిలుస్తున్న తరుణంలో ఒక వ్యక్తిని పరిపూర్ణ మూర్తిమత్వం ఉన్న నాయకుడిగా తీర్చిదిద్దేందుకు కావల్సిన అవగాహనను పొలిటికల్ సైన్స్ అందిస్తుంది. అంతేకాకుండా భవిష్యత్‌లో రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకునే వారికి కావల్సిన పరిజ్ఞానాన్ని కూడా కల్పిస్తుంది (రాజకీయాల్లో రాణించాలంటే పొలిటికల్ సైన్స్ చదవాల్సిన అవసరం లేదు). కేవలం సంబంధిత రంగ పోకడలను, నేపథ్యాన్ని అవగాహన చేసుకోవడానికి ఈ శాస్త్రం వీలు కల్పిస్తుంది. అధ్యయనం ఇక్కడి నుంచే: పొలిటికల్ సైన్స్‌ను అధ్యయనం చేయడం పాఠశాల దశ నుంచే ప్రారంభమవుతుంది. అయితే ఆ స్థాయిలో కేవలం పౌర విధులు, ఎన్నికలు, నాయకులను ఎన్నుకునే విధానం, నాయకత్వ అర్హతలు వంటి అంశాల చుట్టే కేంద్రీకృతమవుతుంది. డిగ్రీ స్థాయికి వచ్చేసరికి పొలిటికల్ సైన్స్‌గా ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్‌గా విస్తృత పరిధిలో ఆవిష్కృతమవుతుంది. కేవలం జాతీయ స్థాయి అంశాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయంగా రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసే అవకాశం ఇక్కడ లభిస్తుంది. రాజనీతి శాస్త్రంలో డిగ్రీ తర్వాత పోస్ట్‌గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ వంటి కోర్సులు చేసే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉంటే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న లేదా మనుగడలో ఉన్న అంశాలను ఎంపిక చేసుకుని.. దాని ఆధారంగా పరిశోధనలు చేయవచ్చు. కాలక్రమేణా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని రాజనీతి శాస్త్రానికి సంబంధించి పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వంటి కొత్త సబ్జెక్ట్‌లను ప్రవేశపెట్టారు. పబ్లిక్ పాలసీ: సమగ్రాభివృద్ధిలో పబ్లిక్ పాలసీ అనేది ఒక విడదీయరాని భాగం. భవిష్యత్ విధాన నిర్ణేతలు, విశ్లేషకులకు, ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థలు ఒక పథకాన్ని రూపొందించేటప్పుడు చేయాల్సిన ఊహాత్మక కూర్పు, ఆచరణాత్మక నైపుణ్యాలు, సిద్ధాంతాలు వంటి అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి రూపొందించిన కోర్సు పబ్లిక్ పాలసీ. ఒక విధానాన్ని రూపొందించేటప్పుడు..దాని సాధ్యాసాధ్యాలకు సంబంధించి అన్ని కోణాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడానికి ఈ కోర్సు దోహదం చేస్తుంది. ఇందులో హెల్త్ పాలసీ, ఎన్విరాన్మెంటల్ పాలసీ, ఉమెన్ పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ పాలసీ వంటి ఎన్నో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి కార్పొరేట్ కంపెనీల్లోని సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాల్లో, ఎన్జీవోలు, మెకన్సీ, డెలాయిట్ వంటి కన్సల్టెంగ్ కంపెనీలు, కమ్యూనికేషన్ కంపెనీల్లో పీఆర్ విభాగాల్లో, మీడియా హౌస్‌లలో, పరిశోధన సంస్థల్లో, యునెటైడ్ నేషన్స్, యూనిసెఫ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో కన్సల్టెంట్స్గా, ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఆడిట్ ఫార్మ్స్ వంటి సంస్థలు కెరీర్ వేదికలుగా నిలుస్తున్నాయి. ఈ విభాగానికి సంబంధించి కేవలం మాస్టర్స్ స్థాయిలో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. అందిస్తున్న సంస్థలు: ఐఐఎం-బెంగళూరు (కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్మెంట్, వెబ్సైట్: www.iimb.ernet.in), టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్-ముంబై (వెబ్సైట్: www. tiss.edu), నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ-బెంగళూరు (కోర్సు: మాస్టర్ ఇన్ పబ్లిక్ పాలసీ, వెబ్సైట్: www.nls.ac.in), సెయింట్ జేవియర్స్ -ముంబై (వెబ్సైట్: http://xaviers.edu), టెరీ యూనివర్సిటీ (కోర్సు: ఎంఏ-పబ్లిక్ పాలసీ అండ్ సస్టెయినబిలిటీ డెవలప్మెంట్, వెబ్సైట్: www.teriuniversity.ac.in), జిందాల్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ పాలసీ-సోనిపట్ (కోర్సు: మాస్టర్ ఇన్ పబ్లిక్, వెబ్సైట్: www. jsgp.edu.in), ఢిల్లీ యూనివర్సిటీ (కోర్సు: ఎంబీఏ-పబ్లిక్ సిస్టమ్స్ మేనేజ్మెంట్, వెబ్సైట్: www.du.ac.in). ఇంటర్నేషనల్ రిలేషన్స్: అంతర్జాతీయ రాజకీయాలను విశ్లేషణాత్మక దృష్టితో అధ్యయనం చేసే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్సును ప్రారంభించారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి జాతీయ/అంతర్జాతీయ ఎన్జీవోలు, యునెటైడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ ఏజెన్సీలు, పరిశోధనా సంస్థలు, మీడియా హౌస్‌లలో అవకాశాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్సు పీజీ/పీహెచ్డీ స్థాయిలో మాత్రమే అందుబాటులో ఉంది. అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ-న్యూఢిల్లీ (వెబ్సైట్: www.jnu.ac.in), జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ (వెబ్సైట్: www.jsia.edu.in), పాండిచ్చేరి యూనివర్సిటీ (వెబ్సైట్: www.pondiuni.edu.in). కెరీర్ అవెన్యూస్: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ ప్లానింగ్, సోషల్ పాలసీ, అకడమిక్స్, పబ్లిక్ అఫైర్స్, అనాలిసిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఫారెన్ కరస్పాండెంట్, సిటీ ప్లానర్, డిప్లొమాట్, ఇంటెలిజెంట్ ఎక్స్పర్ట్,ఇంటర్నేషనల్ ఆర్గనైజర్, ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్, రాయబార కార్యాలయాల్లో ట్రాన్స్‌లేటర్, ప్రభుత్వ, పరిశోధనా సంస్థలు, ఎన్జీవోలు, యూనివర్సిటీలు, బిజినెస్ హౌస్, కార్పొరేట్ కంపెనీలు, మీడియా హౌస్‌లు తదితరాలు కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. పొలిటికల్ సైంటిస్ట్: ప్రస్తుత రాజకీయ వ్యవస్థను పొలిటికల్ సైంటిస్ట్‌లు అధ్యయనం చేస్తుంటారు. అంటే ఒక సమూహం పోకడను నిశితంగా గమనిస్తుంటారు. ఉదాహరణకు ఎవరైనా ఒక అం శంపై ప్రజా అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం సర్వేలు నిర్వహిస్తుంటారు. అలాంటప్పుడు వీరి సేవలు అవసరమవుతాయి. వివిధ రకాల సర్వేలు నిర్వహించడం, వాటి ఫలితాలను విశ్లేషించడం, సంబంధిత వ్యక్తులను ఇంటర్వ్యూ చేయడం, సంబంధిత డాక్యుమెంట్స్ స్క్రూటినీ, వివిధ సంస్థలకు సలహాదారులుగా వ్యవహరించడం, ప్రభుత్వ సంస్థల కోసం కన్సల్టింగ్ వర్క్ నిర్వహించడం, నిర్దేశిత అం శాలపై పత్రికలకు వ్యాసాలు రాయడం వంటివి వీరి విధులు. రీసెర్చ్: రాజనీతి శాస్త్రం వల్ల విశ్లేషణాత్మక సామర్థ్యం, డేటా అనాలిసిస్, కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే కాకుండా ఓరల్, రిటెన్ స్కిల్స్ కూడా మెరుగుపడతాయి. తద్వారా రీసెర్చ్ అసిస్టెంట్‌గా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే కెరీర్ ప్రారంభించవచ్చు. పొలిటికల్ సైన్స్ కోర్సులను అందిస్తున్న కాలేజీలు, యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లు, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లలో టీచింగ్‌తో సమాంతరంగా పరిశోధనా కార్యకలాపాలు కూడా తప్పనిసరి. ఎందుకంటే సంబంధిత అంశంపై సమకాలీనంగా చోటుచేసుకుంటున్న మార్పులపై అప్డేట్గా ఉండాలంటే పరిశోధనా విభాగం పాత్ర ఎంతో. కాబట్టి ఆయా ఇన్స్టిట్యూట్లలో రీసెర్చర్‌గా కూడా చేరొచ్చు. పాలసీ మేకింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్: పొలిటికల్ సైన్స్‌ను ప్రభావవంతంగా అన్వయించే లక్షణం ఉన్న వారికి అవకాశాలు కల్పిస్తున్న మరో విభాగం పాలసీ మేకింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే కొన్ని కీలక రంగాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు.. ఆ నిర్ణయాల పర్యవసానాలను సామాజికంగా అన్వయించాల్సి ఉంటుంది. ఆ సమయంలో పొలిటికల్ సైన్స్ అభ్యర్థులు కీలకంగా మారతారు. హౌసింగ్, ట్రాన్స్‌పోర్టేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనిటీ రిలేషన్స్, కార్పొరేట్ హైరింగ్ స్ట్రాటజీస్, హెల్త్, లా వంటి విభాగాల్లో ఈ తరహా రిక్రూట్మెంట్ ఎక్కువగా జరుగుతుంది. హెచ్ఆర్ విభాగాల్లో: పొలిటికల్ సైన్స్‌లో పీజీ లేదా అడ్వాన్స్డ్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ విభాగాల్లో కూడా అవకాశాలు ఉంటాయి. పరిశ్రమల్లో వీరిని ఇండస్ట్రియల్ పొలిటికల్ సైంటిస్ట్‌లుగా నియమించుకుంటారు. ఉత్పాదకత విషయంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి, ఉద్యోగుల మధ్య సంబంధాలను నెలకొల్పడం వంటి అంశాలను నిర్వహించడానికి వీరి సేవలను వినియోగించుకుంటారు. ప్రభుత్వ పథకాల విశ్లేషణ: పొలిటికల్ సైన్స్ అభ్యర్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల విశ్లేషణ/మాల్యాంకనం లేదా సంబంధిత పరిశోధనలో లేదా సమస్య పరిష్కార రంగాల్లో అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో ఆయా పథకాల అడ్మినిస్ట్రేటర్స్, మేనేజర్స్, డెవలపర్స్‌గా స్థిరపడొచ్చు. రాష్ట్ర స్థాయిలో అర్బన్ ప్లానింగ్, హెల్త్ ప్లానింగ్, క్రిమినల్ జస్టిస్ వంటి వీరి సేవలను ఎక్కువగా వినియోగించుకుంటారు. సహకారం: న్యూస్‌లైన్, కేయూ క్యాంపస్, వరంగల్ జిల్లా. కావల్సిన లక్షణాలు పొలిటికల్ సైన్స్ కోర్సును ఎంచుకున్న వారికి కావల్సిన లక్షణాలు. అవి.. రిటెన్, ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిపోర్ట్ రైటింగ్ స్కిల్స్ విశ్లేషణాత్మక-సృజనాత్మక ఆలోచన తార్కిక వివేచన-సమస్య పరిష్కార నైపుణ్యం సత్వరంగా నిర్ణయం తీసుకునే నేర్పు విమర్శను స్వీకరించే గుణం ఓపెన్ మైండ్ మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం అన్ని సామాజిక శాస్త్రాలలోఅంతర్భాగంగానే రాజనీతిశాస్త్రం కూడా ముఖ్యమనేది గుర్తించాలి. రాజనీతిశాస్త్ర అధ్యయనం చేసిన విద్యార్థుల్లో సంకుచిత స్వభావాలు తొలిగి విశాల దృక్పథం అలవడుతుంది. కులం మతం ప్రాంతాలకు అతీతంగా విశ్వమానవ కల్యాణానికి ప్రపంచాన్ని జాగృతం చేయటం అనేది రాజనీతిశాస్త్ర అధ్యయనం చేసిన విద్యార్థుల్లో ఉంటుంది. రాజనీతిశాస్త్ర అధ్యయనం వివిధ కాంపిటీటివ్ ఉద్యోగాల కోసం రాసే రాతపరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సివిల్స్, గ్రూప్ పోస్టులకు. రాజీకీయాల అవగాహనకు కూడా రాజనీతిశాస్త్రం అధ్యయనం కూడా అవసరమే. - డాక్టర్ ఎ.హరిప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, రాజనీతిశాస్త్ర విభాగం-కాకతీయ యూనివర్సిటీ. ఇతర అవకాశాలు పొలిటికల్ సైన్స్ కోర్సు పూర్తి చేసిన వారికి టీచింగ్, రీసెర్చ్, పబ్లిషింగ్, బిజినెస్, జర్నలిజం రంగాల కేంద్రీకృతంగా అవకాశాలు ఉంటాయి. మిగతా అభ్యర్థుల మాదిరిగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు నిర్వహించే అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరు కావచ్చు.టీచింగ్‌పై ఆసక్తి ఉంటే బీఈడీ, డీఈఈసెట్, పీఈసెట్, లాంగ్వేజ్ పండిట్స్ పరీక్షలకు హాజరుకావచ్చు. సంబంధిత కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు/ కాలేజీలు/ యూనివర్సిటీలలో ఫ్యాకల్టీగా కెరీర్ ప్రారంభించవచ్చు. మీడియా, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు పూర్తిచేయడం ద్వారా రోజురోజుకూ విస్తరిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.