ఎవరైనా ఒకటో రెండో శాస్త్రీయ నృత్య కళలను ప్రదర్శించడం చూస్తుంటాం. వారి కళకు అభివాదం తెలియజేస్తుంటాం. కేరళలోని ఇరింజలకుడకు చెందిన అనఘశ్రీ సజీవనాథ్ భారతీయ శాస్త్రీయ నృత్య కళారూపాలైన కథాకళి, కూచిపూడి, సత్రియా, మణిపురి, ఒడిస్సీ, మోహినియాట్టం, భరతనాట్యం, కథక్‌లను ఒక గంటా 30 నిమిషాల్లో ప్రదర్శించి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను నెలకొల్పారు.
అన్ని భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలను అత్యధిక కాలం పాటు ప్రదర్శించి, రికార్డు సాధించిన ఘనత అనఘశ్రీ సొంతం చేసుకుంది. 27 ఏళ్ల అనఘ చిన్ననాటి నుంచే శాస్త్రీయ నృత్య సాధనలో తనైదన మార్క్ చూపిస్తూ ఉండేది. తమ స్థానిక కళ మోహినియాట్టం నేర్చుకోవడంలో చూపే ఆసక్తి, ఆ తర్వాత తర్వాత ఇతర నృత్య సాధనలవైపు మల్లేలా చేసిందని చెబుతుంది అనఘ.
(చదవండి: బ్రెస్ట్ కేన్సర్ ఉంటే భవిష్యత్తులో ఫర్టిలిటీ చాన్సెస్ తగ్గొచ్చా..?)
Comments
Please login to add a commentAdd a comment